భక్తులు ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సమాచారం తెలుసుకునేలా హిమాయత్నగర్ (లిబర్టీ)లోని తితిదే దేవాలయం వద్ద ‘క్యూఆర్ కోడ్’లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్- బీజాపూర్ రహదారిపై చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో పలువురు ప్రముఖులు చేవెళ్ల ఆసుపత్రికి వచ్చి మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ అతివేగం.. పరిమితికి మించి కంకర రవాణా చేస్తుండటమే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
ప్రమాదాలను గుర్తించి అప్రమత్తం చేసే ‘అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్’ (ఏడీఏఎస్) ప్రవేశపెట్టిన ఆర్టీసీ.. ఆ సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు.
వీధి విక్రయదారులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి యోజన పథకాన్ని అమలు చేస్తోంది. అధిక వడ్డీల భారం నుంచి వీరిని గట్టెక్కించి స్వశక్తితో నిలదొక్కుకునేలా చేయడం దీని ఉద్దేశం.