Miss World competitions: మిస్ వరల్డ్ పోటీలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రారంభ వేడుకలు భారతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక మేలవింపుగా అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. వీవీఐపీ బ్లాకులు, మీడియా గ్యాలరీ, భద్రత, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన పోటీదారులు హైదరాబాద్కు చేరుకున్నారు.
KTR On Operation Sindoor: భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తీవ్రవాద శిబిరాలను పూర్తిగా తుడిచిపెట్టే శక్తి ఆర్మీకి ఉందని ఎక్స్ వేదికగా తెలిపారు.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతోపటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
HYDRAA: హైడ్రా తొమ్మిదిన్నర నెలల్లో ప్రజలకు మరింత చేరువైందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖకు సంబంధించిన అధికారాలు.. హైడ్రా పోలీస్ స్టేషన్ ద్వారా కల్పించారన్నారు. వివిధ సందర్భాల్లో ఈ అధికారాలు తమకు ఉపయోగపడతాయని తెలిపారు.
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సైబరాబాద్ జాయింట్ సీపీ గజారావ్ భూపాల్ తెలిపారు. వివిధ దేశాల నుంచి వచ్చే అతిథులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.