సూచిక 
ప్రముఖ మాధ్యమాల నుండి వార్తలు, పూర్తి వార్తల కోసం క్లిక్ చేయండి.కడప
  నియంత్రికల్లో నిలువు దోపిడీ!  (02:41)
ఎస్పీడీసీఎల్ కడప సర్కిల్లో అక్రమాలు రోజుకొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. వివిధ వర్గాలు సర్కిల్లో సాగుతున్న దందాలను బయటపెడుతున్నాయి.
  ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరుల దౌర్జన్యం!  (02:41)
తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డికి చెందిన సతీష్‌కుమార్. హరిహర కార్ రెంటల్ పేరిట సంస్థను నడుపుతూ కార్లను అద్దెకు ఇస్తుంటారు. ఇదే రాష్ట్రానికి చెందిన వికారాబాద్‌కు చెందిన మణిరాజ్ అనే వ్యక్తికి 2021, ఏప్రిల్‌లో 5 కార్లను అద్దెకు ఇచ్చారు.
  వైకాపా నిర్లక్ష్యం... రైతులకు శాపం!  (02:41)
గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని రైతులకు శాపంగా మారింది. ప్రాజెక్టు కుడి కాలువ గేట్లు బుధవారం ఎత్తి నీటిని వదలగా, గేట్లు పైకి లేచి కిందకు దిగలేదు.
  కంప్యూటరీకరణేదీ?  (02:41)
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది.
  కష్టజీవులకు కూటమి సర్కారు చేయూత  (02:21)
సంఘటిత, అసంఘటిత రంగాలలో పని చేసే కార్మికులకు ప్రభుత్వాలు అండగా నిలబడాల్సి ఉంటుంది. వారి సంక్షేమానికి చేయూత అవసరం.
కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కీలకమైన కార్డియాలజీ, అత్యవసర విభాగాల్లో శీతల యంత్రాలు (ఏసీలు) పనిచేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
  అటవీశాఖకు 7,732.71 ఎకరాల బదలాయింపు  (02:21)
రాష్ట్ర రాజధాని అమరావతిలో భూసేకరణ కింద అటవీశాఖ నష్టపోయిన భూమికి ప్రత్యామ్నాయంగా జిల్లాలో ఆ శాఖకు 7,732.71 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది.
  కలెక్టర్ ఆదేశం... ఆక్రమిత భూమి స్వాధీనం  (02:21)
రామసముద్రం మండలం ఎలకపల్లె గ్రామ పంచాయతీ ఎర్రనేలపల్లెలో వివాదాస్పద భూమిని బుధవారం తహసీల్దార్ నిర్మలాదేవి పోలీసు బందోబస్తు మధ్య పరిశీలించారు.
కడప-బెంగళూరు ప్రధాన రహదారిలోని బెస్తపల్లె క్రాస్ వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
  పోలీసుల అదుపులో తప్పిపోయిన బాలుడు  (02:21)
తప్పిపోయి వచ్చి పట్టణంలో తిరుగుతున్న బాలుడిని స్థానికులు బుధవారం రాత్రి ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు.
  నాకు ప్రాణభయం ఉంది!  (02:21)
నాకు ప్రాణభయం ఉందని వివేకా హత్య కేసులో ఏ-2 నిందితుడు సునీల్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు సైతం చేసినట్లు వివరించారు.
  ఇంకా జగన్ లోగోతోనే వన్‌బీలు  (02:21)
ఎన్డీయే అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్నా నేటికీ మాజీ సీఎం జగన్ లోగోతో ఉన్న పత్రాలను రైతులకు అందజేస్తున్నారు.
  ●మరుగుదొడ్ల నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి  (నిన్న,23:22)
అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్ల నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని బోర్డ్ మీటింగ్ హాల్లో అంగవ్వాడి కేంద్రాలలో మరుగుదొడ్ల నిర్మాణం, నీటి వసతి ల పై ఐసీడీఎస్, ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ శాఖల అధికారులతో సమావేశం జరిగింది. ఈ సంధర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్ల నిర్మా ణాలు డిసెంబర్ 31 లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. Wed, Nov 20 2024 1:44 AM
  డైట్ బిల్లులు అందకపోవడంతో ఇబ్బందులు  (నిన్న,23:22)
హెచ్‌డబ్ల్యూఓ (హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్)కు సక్రమంగా డైట్ బిల్లులు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం డైట్ బిల్లులను సక్రమంగా అందించాలి. ప్రస్తుతం సరుకుల ధరలు పెరిగినందున అందుకు అనుగుణంగా డైట్ చార్జీలు పెంచాలి. టెండర్ల ద్వారా సరుకులను సరఫరా చేస్తే బాగుంటుంది. – రామలింగారెడ్డి, అధ్యక్షుడు, జిల్లా బీసీ హెచ్‌డబ్ల్యూఓ అసోసియేషన్ హాస్టళ్లను గాలికొదిలేసిన ప్రభుత్వం ప్రభుత్వ ఎస్సీ, బీసీ, ఎస్టీ హాస్టళ్లలో సమస్యలు అధికంగా ఉన్నాయి. బీసీ, ఎస్సీ హాస్టళ్లు చాలా వరకు కాలపరిమితి దాటిన అద్దె భవనాల్లో సాగుతున్నాయి. డైట్ బిల్లులను పెంచాలి. హాస్టల్ విద్యార్థుల కంటే ఖైదీలకు ఇచ్చే డైట్ బిల్లులు మెరుగ్గా ఉన్నాయి. ప్రభుత్వ హస్టళ్ల పరిరక్షణను పాలకులు గాలికొదిలేశారు. – గుజ్జుల వలరాజు, జిల్లా కార్యదర్శి, ఏఐఎస్ఎఫ్. ఎస్సీ విద్యార్థుల అభ్యున్నతికి కృషి ఎస్సీ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం. విజయరామరాజు కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఎస్సీ హాస్టళ్లలో రూ.6 కోట్లతో మరమ్మతు పనులు చేపట్టాం. ఆయన హయాంలోనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. విద్యార్థుల విద్యాభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. – కె.సరస్వతి, డిప్యూటీ డైరెక్టర్, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ Wed, Nov 20 2024 1:44 AM
  ‘ఉపాధి’ కింద రహదారుల నిర్మాణం  (నిన్న,23:22)
● పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాసులురెడ్డి కడప సెవెన్‌రోడ్స్: ఉపాధి హామీ పథకం కింద గ్రామీ ణ ప్రాంతాల్లో సిమెంటురోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు జీవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో రాయచోటి, రాజంపేట, కోడూరు, కమలాపురం, మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాలకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఏఈలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏపీ ఆర్ఆర్పీ అబ్జర్వర్లు కె.ప్రభాకర్‌రెడ్డి, వై.నరసింహారావు నాణ్యతా ప్రమాణాలతో రహదారుల నిర్మాణం ఎలా చేపట్టాలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఈ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ మైదుకూరు నియోజకవర్గంలో 205 రోడ్డు పనులను రూ. 1235.28 లక్షలతో చేపడుతున్నామన్నారు. కమలాపురం నియోజకవర్గంలో 282 రోడ్డు పనులను రూ.1630 లక్షలతో చేపడుతున్నామని వెల్లడించారు. బద్వేలు నియోజకవర్గంలో 213 పనులను రూ. 1406 లక్షలతో, పులివెందుల నియోజకవర్గంలో 91 రోడ్లను రూ. 525.04 లక్షలతో, జమ్మలమడుగు నియోజకవర్గంలో 130 రోడ్లను రూ.1934.35 లక్షలతో, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 77 పనులను రూ. 850.04 లక్షలతో చేపడతామన్నారు. గ్రామసభల ద్వారా వెండార్స్‌ను ఎంపిక చేసి పనులను అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. Wed, Nov 20 2024 1:44 AM
  జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దాం  (నిన్న,23:22)
కలెక్టర్ శ్రీధర్ కడప సెవెన్‌రోడ్స్: ఆకాంక్ష జిల్లాల (ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్) ఆశయాలకు అనుగుణంగా అధికారులు జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ బోర్డు రూమ్ హాలు నుంచి కలెక్టర్ అధ్యక్షతన ‘ఆకాంక్ష జిల్లాల ఆశయసాధనలో భాగంగా జిల్లాలో కార్యాచరణ, ప్రగతి‘పై సంబందిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘నీతి ఆయోగ్‘ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొన్ని ఆకాంక్ష జిల్లాలను ఎంపిక చేసిందన్నారు. ఇందులో మన జిల్లా కూడా ఉందన్నారు. అందులో భాగంగా ఆయా జిల్లాల్లో సామాజిక స్థాయిని(అభివృద్ధి) ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకురావడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. అందుకోసం సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. సంతృప్త స్థాయిలో నిర్దేశిత లక్ష్యం మేరకు సాధించిన ప్రగతి ఆధారంగా ప్రోత్సాహకాలను కూడా భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఆ మేరకు ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అన్ని శాఖల పరిధిలో కొరత ఉన్న సౌకర్యాలు, సదుపాయాలు, అవసరాలను ఎప్పటికప్పుడు సంపూర్తి చేయాలన్నారు. ● ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నాగరాజు, డిఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్,ఐసిడిఎస్ అధికారిని శ్రీలక్ష్మి, సీపీఓ వెంకటరావు, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజరు జనార్ధన్, ఏపీఎంఐపి పీడీ వెంకటేశ్వర రెడ్డి,తదితర అనుబంధ శాఖల అధికారులు హాజరయ్యారు. Wed, Nov 20 2024 1:44 AM
  తిరుపతి–చైన్నె బస్సు సర్వీసు ప్రారంభం  (నిన్న,23:22)
జమ్మలమడుగు: జమ్మలమడుగు ఆర్టీసీ డిపో నుంచి తిరుపతి మీదుగా చైన్నెకు నూతన బస్సు సర్వీసు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం డిపో మేనేజర్ ప్రవీన్ ఆధ్వర్యంలో ఈ సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ప్రవీన్ మాట్లాడుతూ ప్రస్తు తం చైన్నెకు నెల్లూరు–సూళ్లురుపేట మీదుగా బస్సు సర్వీసు నడుస్తోందన్నారు. అదనంగా తిరుపతి మీదుగా చైన్నెకు ప్రతిరోజు బస్సు సర్వీసు ఉంటుందన్నారు. ఈ సర్వీసులు ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శబరిమలకు మరో ప్రత్యేక రైలు కడప కోటిరెడ్డిసర్కిల్: పవిత్ర పుణ్యక్షేత్రమైన శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం కడప మీదుగా మరో ప్రత్యేక రైలును నడపుతున్నట్లు కడప రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. 07147/48 నెంబరుగల రైలు మచిలీపట్నంలో మధ్యాహ్నం 12.00 గంటలకు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 9.20 గంటలకు కొల్లం చేరుతుందన్నారు. ఈ రైలు గుడివాడ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, దొనకొండ, మార్కాపురంరోడ్డు, కంభం, గిద్దలూరు,నంద్యాల, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట మీదు గా కొల్లాం వెళుతుందన్నారు. ఈ రైలు డిసెంబరు 23, 30 తేదీలలో మచిలీపట్నం నుంచి, డిసెంబరు 25, జనవరి 1 తేదీలలో కొల్లం నుంచి బయలుదేరుతుందని వివరించారు. సివిల్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ కడప కోటిరెడ్డిసర్కిల్: యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలకు అర్హతగల వైఎస్సార్ జిల్లా వాసులకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన అభ్యర్థులకు విజయవాడలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కడప బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు కృష్ణయ్య తెలిపారు. అర్హతగలవారు ఈనెల 24వ తేదీలోగా బీసీ స్టడీ సర్కిల్ వైఎస్సార్ కడప కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. అలాగే ఈనెల 27వ తేదిన స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారని, అందులో ఉత్తీర్ణులైన వారికి మెరిట్ ఆధారంగా విజయవాడలో శిక్షణ ఇస్తారన్నారు. దరఖాస్తుచేసే అభ్యర్థులు తమ బయోడేటాతోపాటు విద్యా, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, బ్యాంకు పాస్‌పుస్తకం, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు జతచేసి ఏపీ బీసీ స్టడీ సర్కిల్, పాత రిమ్స్, కడప అనే చిరునామాకు దరఖాస్తులు పంపాలన్నారు. ఇతర వివరాలకు నేరుగా కార్యాలయంలో లేదా 98499 19221,99664 18572 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. సాఫ్ట్వేర్ కోర్సుల్లో ..కడప ఎడ్యుకేషన్: సాఫ్ట్వేర్ కోర్సుల్లో యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్ఏక్యూ టెక్నాలజీస్ నిర్వాహకులు అమీర్‌బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో అజూర్, సోల్స్ఫోర్స్, పుల్ ట్రాక్, ఎస్ఏపీ తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మొన్నటి వరకు ఇలాంటి కోర్సుల కోసం హైదరాబాదు, బెంగుళూరు తదితర సిటీలకు వెళ్లేవారని.. ఇప్పుడు ఆ అవసరం లేకుండానే కడపలోనే తొలి ప్రయత్నంగా ప్రొఫెషనల్స్ చేత కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని వివరించారు. ఈనెల 25 నుంచి కొత్త బ్యాచ్‌లు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 7093081073,9110388060 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. Wed, Nov 20 2024 1:44 AM
  ●దుర్భర పరిస్ధితులు...  (నిన్న,23:22)
● జిల్లా కేంద్రమైన కడప ప్రకాశ్‌నగర్‌లోని బీసీ కళాశాల హాస్టల్లో ఇంటర్మీడియేట్, ఆపైన చదివే విద్యార్థులు దాదాపు 130 మందికి పైగా ఉన్నారు. ఇక్కడ సరిపడా మరుగుదొడ్లు లేవు. అదే సందర్భంలో ఉన్న వాటికి తలుపులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతు న్నారు. అలాగే ఆ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది. కాగా, పట్ట పగలే హస్టల్లోని గదు లు కారుచీకట్లు కమ్ముకున్న విధంగా ఉన్నాయి. కొన్నిమార్లు భోజనం సక్రమంగా ఉండదనే అభిప్రాయాన్ని పలువురు విద్యార్థులు వ్యక్తం చేశారు. టీటీడీ కల్యాణ మండపం వద్ద ఉన్న ఎస్సీ నెంబరు–3 బాలుర హాస్టల్లో సరిపడ స్నానపు గదులు లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయట స్నానం చేస్తున్నారు. ● జమ్మలమడుగు బీసీ బాలికల హాస్టల్లో కిటికీలు లేకపోవడంతో వాటికి కర్టెన్లుగా బట్టలు కప్పారు. చెదలు కారణంగా కిటికీలు దెబ్బతినడంతో వాటిని అధికారులు పట్టించుకోలేదు. కనీసం బాలికలు అన్న స్పృహ కూడా లేకపోవడం శోచనీయం. అలాగే బీసీ కళాశాల హాస్టల్ ప్రైవేటు భవనంలో నడుస్తోంది. ఎర్రగుంట్లలో హాస్టల్ లేకపోవడంతో పేద విద్యార్థులు వసతి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ● బద్వేలులో 40 ఏళ్ల కిందట నిర్మించిన బీసీ హాస్టల్ శిథిలావస్థకు చేరింది. ఇందులో చాలా గదులు మూతపడ్డాయి. ఇక్కడున్న 97 మంది బాలురు అసౌకర్యానికి గురవుతున్నారు. ఇక్కడే ఉన్న మరో ఎస్సీ బాలుర, బీసీ బాలికల కళాశాల హాస్టళ్లు అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాల మధ్య విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అట్లూరు బీసీ హాస్టల్లో రిజిస్టర్లో 58 మంది ఉంటే, అక్కడ 21 మంది ఉన్నారు. సోమవారం రాత్రి విద్యార్థులకు ఆహారంలో గుడ్డును ఇవ్వ లేదు. పోరుమామిళ్ల ఎస్సీ బాలుర హాస్టల్లో 100 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఈ భవనం శిథిలావస్థకు చేరింది. బి.కోడూరులోని బీసీ బాలుర హాస్టల్ అద్దె భవనంలో నడుస్తోంది. ఇక్కడ సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు బహిర్భూమికి ఆరుబయటకి వెళుతున్నారు. కాశినాయన మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్ ప్రైవేటు భవనంలో నడుస్తోంది. ఇందులో 100 మంది విద్యార్థులు ఉంటే ఒక మరుగుదొడ్డి, ఒక బాత్రూము మాత్రమే ఉంది. ప్రొద్దుటూరులోని పొట్టిపాడు రోడ్డులోగల ఎస్సీ బాయిస్ హాస్టల్లోనే కళాశాల హాస్టల్ కూడా నడుస్తోంది. ఇక్కడ నీటి కొరత సమస్యగా ఉంది. మోడెంపల్లె ఎస్సీ బాలుర హాస్టల్లో ప్రహారీ పడగొట్టడంతో రక్షణ లేకుండా పోయింది. ● పులివెందులలోని నల్లపురెడ్డిపల్లె బీసీ బాలుర హాస్టల్లో మరుగుదొడ్ల సమస్య ఉంది. మైదుకూరు పరిధికి సంబంధించి ఖాజీపేటలోని ఎస్సీ, బీసీ బాలుర హాస్టళ్లలో మరుగుదొడ్ల సమస్య అధికంగా ఉంది. అలాగే కమలాపురానికి సంబంధించి బీసీ బాలుర కళాశాల హాస్టల్ అద్దె భవనంలో నడుస్తోంది. ఇక్కడ కూడా కనీస సౌకర్యాలు లేవు. Wed, Nov 20 2024 1:44 AM
  కొనసాగుతున్న ఉరుసు  (నిన్న,23:22)
కడప కల్చరల్: ప్రముఖ సూఫీ ఆఽధ్యాత్మిక క్షేత్రమైన కడప పెద్దదర్గాలో ఉరుసు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం కూడా భక్తుల కోలాహలంతో దర్గా ప్రాంతం సందడిగా కనిపించింది. దర్గాలోని ప్రధాన గురువుల మజార్ల వద్ద భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రముఖుల ప్రార్థనలు ఉత్సవాల సందర్బంగా గురువులను దర్శించుకోవాలని పలువురు ప్రముఖులు విచ్చేశారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథరెడ్డి, మేయర్ సురేష్‌బాబుతోపాటు పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్పొరేటర్లు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా దర్గాకు చేరుకుని ప్రార్థనలు చేపట్టారు. దేశం నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు నిరాడంబరంగా దర్గాకు విచ్చేసి గురువుల దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి ఉత్సవాలకు భక్తులు వస్తూనే ఉన్నారు. కాగా దర్గా ఆవరణలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫకీర్లతో పాటు ఆస్తానా ఫకీర్లు చేసిన విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం పీఠాధిపతి, ఇతర భక్త ప్రముఖులు గండి వాటర్ వర్క్స్ వద్దగల దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, జెండాను ప్రతిష్ఠించి అన్నదానం చేస్తారు. అలాగే రాత్రి 10 గంటలకు స్థానిక మై అల్లా దర్గా నుంచి పీఠాధిపతి నగరోత్సవం ప్రారంభం కానుంది. దర్గాలో ప్రముఖుల ప్రార్థనలు Wed, Nov 20 2024 1:43 AM
  No Headline (నిన్న,23:22)
పేద విద్యార్థుల ‘వసతి’కి చెదలు పట్టింది. అధికారుల అవినీతి దాహానికి.. పాలకుల నిర్లక్ష్య వైఖరికి ప్రభుత్వ హాస్టళ్లు సమస్యల్లో చిక్కుకుపోయాయి. ఫలితంగా పేద పిల్లలు విద్యావంతులుగా ఎదగడానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ వసతి గృహాలకంటే కారాగారాలే నయం అనేలా పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలోని ఆయా హాస్టళ్లలో ‘సాక్షి’ పరిశీలనలో చేదు నిజాలు వెలుగుచూశాయి. ● ఇంకా బహిర్భూమికి ఆరు బయటకే ● కప్పుకొనే దుప్పటి..తినే కంచానికీ కరువే ● విద్యార్ధుల్లో ప్రతిభ పుష్కలం..కరువైన పాలకుల ప్రోత్సాహం ● సంక్షోభంలో సంక్షేమ హాస్టళ్లు కడప రూరల్: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో సమస్యలు తిష్ట వేశాయి. కప్పుకునే దుప్పటి మొదలు తినే కంచం దాకా కరువే అన్నట్లు పరిస్థితి తయారైంది. ఇక బహిర్భూమికి ఇప్పటికీ ఆరుబైటకే వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఫలితంగా జిల్లాలోని వేలాది మంది విద్యార్థులు ఆయా హాస్టళ్లలో సమస్యలతో సావాసం చేస్తూనే చదువుకుంటున్నారు. వారి విద్యాభివృద్ధి కి ‘వసతి సౌకర్యాలు’పెను సమస్యగా మారాయి. ప్రభుత్వం చిన్నచూపు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు దాటింది. ఇటీవల రెండు నెలలకు సంబంధించిన డైట్ బిల్లులు వచ్చాయి. ఇంకా మూడు నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు రావాల్సి ఉంది. దీని ప్రభావం విద్యార్థులకు అందించే పౌష్టికాహరంపై పడింది. ఫలితంగా చాలా హాస్టళ్లలో ‘మెను’దారి తప్పింది. ఈ క్రమంలో గుడ్డు తదితర ఆహారపదార్థాలు విద్యార్థులకు అందడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు దాటినా బీసీ, ఎస్సీ వసతి గృహాల్లోని ప్రీ మెట్రిక్ (3 నుంచి 10వ తరగతి) విద్యార్థులకు ఇప్పటివరకు దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు అందలేదు. వీటిని ఏడాదికి ఒకసారి విద్యా సంవత్సరం ప్రారంభమైన కొద్దిరోజులకే ఇవ్వాలి. వర్షాకాలం ముగిసింది, చలికాలం ప్రారంభమైంది. ఇంతవరకు విద్యార్థులకు దుప్పట్లు అందలేదు. ఇక ఉన్న ప్లేట్లు, గ్లాసులతోనే సర్దుబాటు చేసుకుంటున్నారు. Wed, Nov 20 2024 1:43 AM
  ‘సీమ’లోని సంస్థలను తరలిస్తే ఉద్యమిస్తాం (నిన్న,23:22)
కడప కోటిరెడ్డిసర్కిల్ : రాయలసీమలో ఏర్పాటైన వివిధ సంస్థలను అమరావతికి తరలించాలని చూస్తే సీమలోని అన్ని పార్టీల, ప్రజాసంఘాల ప్రతినిధులను ఐక్యం చేసి ప్రత్యక్షంగా ఉద్యమి స్తామని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. మంగళవారం స్థానిక వైఎస్సార్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. అరకొర పరిశ్రమలు, సంస్థలను రాయలసీమలో నెలకొల్పితే, కూటమి ప్రభుత్వం వాటిని అమరావతికి తరలించుకుపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కడప శివార్లలోని కొప్పర్తి పారిశ్రామికవాడలోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను అమరావతికి తరలించడానికి జీఓ తీసుకు వచ్చారని, కర్నూలు లో మానవ హక్కుల, లోకాయుక్త కార్యాలయం, సీబీఐ కోర్టు, బ్యాంకుల విలీనం పేరుతో కడపలోని ఆంధ్ర గ్రామీణ ప్రగతి బ్యాంక్ అమరావతికి తరలించాలని చూస్తున్నారని వారు మండిపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన కాలం నుంచి ఒక నంద్యాల రైలు మార్గం తప్ప మరొక రైలు మార్గం అంటే తెలియని స్థితిలో సీమ వాసులు ఉన్నారన్నారు. పాలకులకు సీమ నీటి ప్రాజెక్టుల మాటే పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీపీ నగర కార్యదర్శి మగ్బూల్‌బాష, లోక్‌సత్తా, జనతాదళ్ నాయకులు ప్రతాప్ రెడ్డి, కృష్ణయ్య, విద్యుత్ రిటైర్డ్ నాయకులు గుర్రప్ప, దళిత గిరిజన హక్కుల పోరాట సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకటేష్, మడగలం ప్రసాద్, రమేష్, ఓబులేసు పాల్గొన్నారు.సీపీఐ, ఆర్సీపీ నేతల హెచ్చరిక Wed, Nov 20 2024 1:43 AM
  పంటల బీమా చెల్లింపు ప్రక్రియ ప్రారంభం (నిన్న,23:22)
కడప అగ్రికల్చర్ : జిల్లాలో పంటల బీమా పథకం రబీ 2024–25 సంవత్సరానికి పంటల వారిగా ప్రీమియం చెల్లింపు నమోదు ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రీమియం చెల్లింపునకు పంట రుణ గ్రహీతలు నేరుగా బ్యాంకు ద్వారా మాత్రమే చెల్లింపు జరపాలన్నారు. రబీలో బ్యాంకు ద్వారా పంట రుణాలు పొందని రైతులు కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా నేరుగా ప్రీమియం చెల్లించాలన్నారు. నేరుగా ప్రీమియం చెల్లించు రైతులు ఆధార్, బ్యాంకు పాస్‌బుక్, పట్టదారు పాసుపుస్తకం, పంట ఽధ్రువీకరణ పత్రం, ఆధార్ అనుసంధానమైన మొబైల్ నంబర్ వివరాలను జతపరుస్తూ కామన్ సర్వీస్ సెంటర్లో నమోదు చేసుకోవాలన్నారు. లేదంటే రైతులే స్వయంగా ఎన్‌సిఐపి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రీమియం డిసెంబర్ 15వ తేదీలోపు చెల్లించాలని ఆయన సూచించారు. డిసెంబర్ 15వ తేదీ వరకు గడువు జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు Wed, Nov 20 2024 1:43 AM
  మహిళ అదృశ్యం  (నిన్న,23:22)
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని చిన్నదండ్లూరు గ్రామానికి చెందిన గాలి అశ్విని (24) అనే మహిళ అదృశ్యమైందని ఆమె భర్త గాలి సూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కలమల్ల ఎస్ఐ తిమోతి మంగళవారం తెలిపారు. ఈ నెల 5వ తేదీన భర్త గాలి సూరి కూలి పనుల నిమిత్తం వెళ్లగా సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా తన భార్య కనిపించలేదు. బంధువుల ఇళ్లలో, తెలిసిన వారి ఇళ్లలో విచారణ చేయగా ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం కలమల్ల పోలీ్స్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశాడు. ఇందిరకు నివాళులుకడప వైఎస్ఆర్ సర్కిల్ : దివంగత ఇందిరాగాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. తన పర్యటనలో భాగంగా ఆమె పెద్దదర్గాను సందర్శించారు. డీసీసీ అధ్యక్షురాలు ఎన్డీ విజయ జ్యోతి, నాయకులు అఫ్జల్ ఖాన్, దృవ కుమార్ రెడ్డి, ఇర్ఫాన్ భాష తదితరులు పాల్గొన్నారు. దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలిసాక్షి టాస్క్‌ఫోర్స్ : ఇటీవల కొన్ని రాజకీయ పార్టీల నేతలు మాదిగల మధ్యన చిచ్చుపెట్టే కుట్ర పన్నుతున్నారని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ విమర్శించారు. మంగళవారం ఆయన సింహాద్రిపురంలో విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని బలపనూరు ఎస్సీ కాలనీలో ఉన్న ఎం.భార్గవ, తండ్రి ఎం.వెంకటరమణపై అగ్రవర్ణాల వారు దాడి చేశారని, అప్పట్లో వారిపైన సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందన్నారు. దాడి చేసిన గజ్జల చంద్రశేఖర్ రెడ్డికి అనుచరుడుగా ఉన్న ఎల్లయ్యగారి చిన్న ఓబయ్య గత కొన్నేళ్లుగా పులివెందులలో నివాసముంటున్న రామయ్యగారి కృష్ణమూర్తిపై దాడి చేశారు. ఇటీవల మళ్లి పెళ్లి సందర్భంగా బలపనూరుకు వచ్చిన కృష్ణమూర్తిపై ఎల్లయ్య గారి చిన్న ఓబయ్య దాడి చేయడం వెనుక గజ్జల చంద్రశేఖర్ రెడ్డి హస్తం ఉందన్నారు. పోలీస్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డప్పు చర్మ కళాకారుల రాష్ట్ర కన్వీనర్ కె.నాగభూషణం మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు రామయ్య గారి కృష్ణమూర్తి, తుమ్మలపల్లి సూర్యనారాయణ మాదిగ తదితరులు పాల్గొన్నారు. Wed, Nov 20 2024 1:43 AM
  పనులొదిలేసి వెళ్లకపోతే ప్రాణాలుండవ్ (నిన్న,23:22)
సాక్షి ప్రతినిధి, కడప : అనకాపల్లి బీజేపీ ఎంపీ రమేష్‌నాయుడుకు చెందిన రిత్విక్ కాంట్రాక్టు సంస్థ పనులను అదే పార్టీకి చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. తక్షణమే పనులు వదిలేసి వెళ్లాలని, లేదంటే ప్రాణాలు దక్కవంటూ సైట్ ఇంజనీర్లపై దాడి చేశారు. యంత్ర సామగ్రిని ధ్వంసం చేశారు. వైఎస్సార్ జిల్లాలోని గండికోట ప్రాజెక్టు ఆధారంగా వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ఆదాని హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంకల్పించింది. కొండాపురం మండలం దొబ్బుడుపల్లె, రావికుంట, తిరువాలయపల్లె గ్రామాలతోపాటు మైలవరం మండలం బొగ్గులపల్లె పరిధిలో 250 ఎకరాలు ప్రభుత్వ భూమి, 150 ఎకరాల ఫారెస్టు భూమిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. తొలి విడతగా రూ.1,800 కోట్లతో నిర్మాణ సంస్థ పనులకు శ్రీకారం చుట్టింది. టెండర్లలో అనకాపల్లె ఎంపీ రమేష్‌నాయుడుకు చెందిన రిత్విక్ సంస్థకు పనులు దక్కాయి. క్షేత్ర స్థాయిలో పనులు మొదలు పెట్టింది. ఈ వ్యవహారం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులకు నచ్చలేదు. ఆ పనులు తామే చేయాలంటూ పట్టుబట్టారు. ఆ మేరకు ఎమ్మెల్యే ఆది.. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను ఇటీవల సందర్శించి, స్థానికుల సమస్యలు పరిష్కారించాలంటూనే.. నిర్మాణ పనులు తమ వర్గీయులకు అప్పగించాలని కోరినట్లు సమాచారం. ఈ మేరకు కొన్ని పనులు ఆది వర్గీయులకు అప్పగించినట్లు తెలుస్తోంది. కాగా, మొత్తం పనులన్నీ తమ వర్గీయులకే దక్కాలని, అప్పుడే ప్రాజెక్టు పనులు కొనసాగుతాయని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇవేవి పరిగణనలోకి తీసుకోకుండా రిత్విక్ సంస్థ నిర్మాణ పనులు కొనసాగిస్తుండగా మంగళవారం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున దొబ్బుడుపల్లె వెళ్లి విధ్వంసం సృష్టించారు. తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోండి.. కొండాపురం, మైలవరం మండలాలకు చెందిన ఎమ్మెల్యే ఆది వర్గీయులు దేవగుడి శివ నారాయణరెడ్డి, రాజేష్రెడ్డిల నేతృత్వంలో మంగళవారం వంద వాహనాలకుపైగా అనుచరులతో దొబ్బుడుపల్లె ప్రాంతానికి వెళ్లారు. రిత్విక్ కన్స్ట్రక్షన్స్కు చెందిన సైట్ ఇంజనీర్లపై దాడి చేశారు. యంత్రాలను ధ్వంసం చేశారు. ఇక్కడి నుంచి తక్షణమే ఖాళీ చేయాలని హెచ్చరించారు. కాదు, కూడదని పనులు చేస్తే ప్రాణాలతో ఉండరంటూ తీవ్ర స్థాయిలో బెదిరించారు. తాము కూడా జమ్మలమడుగు నియోజకవర్గ వాసులమే అని చెప్పుకొచ్చినా.. ‘ఎక్కడ పోట్లదుర్తి, ఎక్కడ కొండాపురం.. మేమంతా చచ్చాం అనుకుంటున్నారా? పనులంటూ చేస్తే మేమే చేయాలి? లేదంటే లేదు. మళ్లీ ఇక్కడ పనులు కొనసాగితే జాగ్రత్త’ అంటూ విరుచుకుపడ్డారు. కాగా, ఈ విషయం తెలిసినప్పటికీ ఎంపీ రమేష్‌నాయుడు సోదరుడు సురేష్‌నాయుడు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని సమాచారం. ఈ ఘటనపై ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఎంపీ రమేష్ కాంట్రాక్ట్ సంస్థకు ఎమ్మెల్యే ఆది వర్గీయుల బెదిరింపు రిత్విక్ కన్స్ట్రక్షన్స్కు చెందిన సైట్ ఇంజనీర్లపై దాడి దొబ్బుడుపల్లె వద్ద రూ.1,800 కోట్లతో ఆదానీ హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు చేస్తున్న ఎంపీ వర్గీయులు ఆ పనులు తామే చేపట్టాలంటూ ఎమ్మెల్యే ఆది వర్గీయుల హుకుం వంద వాహనాలల్లో వెళ్లి సిబ్బందిపై దాడి, వాహనాలు ధ్వంసం Wed, Nov 20 2024 1:43 AM
  రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది (నిన్న,23:22)
కడప అర్బన్ : రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోంది. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బి అంజాద్‌బాషా అన్నారు. మంగళవారం సాయంత్రం కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో వున్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డిని వైఎస్ఆర్సీపీ నాయకులు పరామర్శించారు. అనంతరం మీడియాతో రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతోందన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తే కేసులను పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా భయపెట్టేందుకు వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులను అన్యాయంగా పెడుతున్నారన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పోలీసులు నిజానిజాలు తెలుసుకోకుండా అరెస్ట్ చేయడం భావ్యం కాదన్నారు. టీడీపీ నేతలు చెప్పినట్లే పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి 2021లో సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టినట్లుగా ఐటిడిపి టీంకు సంబంధించిన వారు పోస్టులు పెట్టారనీ, అదే సాకుగా తీసుకుని అక్రమ కేసులను పెట్టారన్నారు. ఈక్రమంలోనే వర్రా రవీంద్రారెడ్డికి ఓ కేసులో 41ఏ నోటీసును ఇచ్చి, మరో ఎస్సీ, ఎస్టీ కేసును బనాయించి, ఇంకా సెక్షన్లను పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారన్నారు. వర్రా రవీంద్రారెడ్డితో పాటు ప్రతి సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లకు, సానుభూతిపరులకు వైఎస్ఆర్సీపీ అండగా వుంటుందన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులను పెట్టిన అధికారులు జాగ్రత్తగా వుండాలన్నారు. అలాంటి వారికి ఖచ్చితంగా అంతకు పదిరెట్లు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామన్నారు. మాజీ డిప్యూటీ సీఎం ఎస్బి అంజాద్‌బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో డైవర్షన్ పాలన జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన వారిపై, వైఎస్ఆర్సీపీ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై, సానుభూతిపరులపై కక్షసాధింపు చర్యలలో భాగంగా కేసులను బనాయించి అక్రమంగా అరెస్ట్‌లు చేస్తున్నారన్నారు. జమిలి ఎన్నికలు వస్తే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని, అపుడు కక్షసాధింపు చర్యలకు పాల్పడిన అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కడప నగర డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ చైర్మన్ పులి సునీల్‌కుమార్, వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ వినోద్‌కుమార్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన నాయకుడు షఫీ, వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ కువైట్ అధ్యక్షుడు సీహెచ్ ఇలియాస్, కార్పోరేటర్ ఎస్ఎండీ షఫీ, నాయకులు దాసరి శివ, రాయల్ బాబు, షఫీ, వైఎస్ఆర్సీపీ 3వ డివిజన్ ఇన్ఛార్జ్ సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ప్రభుత్వాలు శాశ్వతం కాదు.. ప్రజలు శాశ్వతం పోలీసులు నిజానిజాలు తెలుసుకోకుండా అరెస్ట్ చేయడం భావ్యం కాదు రిమాండ్‌లో వున్న వర్రా రవీంద్రారెడ్డిని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బి అంజాద్ బాషారిమాండ్ ఖైదీలకు పరామర్శకడప అర్బన్ : వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజక వర్గ పరిధిలో పెద్దశెట్టిపల్లెకు చెందిన వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లేట్లపల్లి శివరాం, లేట్లపల్లె రామాంజనేయులుపై పోలీసులు ఇటీవల అక్రమ కేసును బనాయించి కడప కేంద్రకారాగారానికి రిమాండ్‌కు తరలించారు. రిమాండ్‌లో వున్న వీరితో పాటు, మైదుకూరులోని సర్వరాయపల్లెకు చెందిన ఓ హత్య కేసులో జీవితఖైదు విధించబడిన 13 మందిని మంగళవారం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు, ఆర్టీసీ జోనల్ మాజీ చైర్మన్ రెడ్యెం వెంకటసుబ్బారెడ్డిలు పరామర్శించారు. ఇంకా వీరితో పాటు మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ శ్రీమన్నారాయణ, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి నాగిరెడ్డి, ఖాజీపేట మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు ఓబయ్యయాదవ్, శివాల్‌పల్లె మాజీ సర్పంచ్ శివయ్యయాదవ్ ఉన్నారు. Wed, Nov 20 2024 1:43 AM
  ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ  (నిన్న,23:22)
బద్వేలు అర్బన్ : పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో మంగళవారం తెల్లవారుజామున ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ రెండు భాగాలుగా విడిపోయింది. పట్టణంలోని సుమిత్రానగర్‌కు చెందిన నరసింహులు తెల్లవారుజామున తన ట్రాక్టర్లో వస్తుండగా నాలుగు రోడ్ల కూడలి వద్దకు వచ్చేసరికి నెల్లూరు నుండి బళ్ళారికి బొగ్గు లోడుతో వెళుతున్న లారీ వేగంగా ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ట్రాక్టర్ ఇంజన్ భాగం రెండు ముక్కలుగా విరిగిపోయింది. ప్రమాదం తెల్లవారుజామున జరిగిన నేపథ్యంలో జనసంచారం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. విషయం తెలుసుకున్న అర్బన్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన ట్రాక్టర్‌ను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. అలాగే ప్రమాదానికి కారణమైన లారీని స్టేషన్‌కు తరలించారు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉత్సాహంగా జిల్లాస్థాయి స్విమ్మింగ్ ఎంపికలు కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని డాక్టర్ వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి సబ్‌జూనియర్, జూనియర్ విభాగం స్విమ్మింగ్ ఎంపికలకు క్రీడాకారుల నుంచి చక్కటి స్పందన లభించింది. ఈ ఎంపికలను క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి కె. జగన్నాథరెడ్డి ప్రారంభించారు. జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్. రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు డిసెంబర్ 7, 8 తేదీల్లో విశాఖపట్నంలోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. అనంతరం ఎంపికలు నిర్వహించి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్విమ్మింగ్ కోచ్‌లు రాజేంద్ర, ధనుంజయరెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు.. బాలుర విభాగం : యశ్వంత్, కార్తికేయదేవ రాయల్, నాగవర్ధన్, జ్ఞాన అఖిలేష్, లక్ష్మినారాయణ, త్రిభువన్‌రెడ్డి, మాధవ, షణ్ముఖ్, శ్రీవెంకటసాయి, వెంకటశ్రీరామ్, ఆదిశేషారెడ్డి. బాలికల విభాగం : మోక్షప్రియ, ఎస్. ఆల్ అమీన్. కార్మికుల హక్కులను నిర్వీర్యం చేయడం తగదు కడప వైఎస్ఆర్ సర్కిల్: కార్మిక వర్గంపై దాడులు చేస్తూ, కార్మిక హక్కులు, చట్టాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.నాగ సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ పిలుపునిచ్చారు. మంగళవారం కడప నగరంలోని హోచిమన్ భవన్లో ఏఐటీయూసీ జిల్లా ఆఫీస్ బేరర్స్, అనుబంధ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున రెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కేసి. బాదుల్లా, ఉపాధ్యక్షులు మంజుల, చాంద్ బాషా కార్యదర్శులు మద్దిలేటి, శ్రీరాములు అనుబంధం సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై కేసు నమోదు ప్రొద్దుటూరు క్రైం : ప్రభుత్వ నిధులు దుర్వినియోగం వ్యవహారానికి సంబంధించి గోపవరం మాజీ సర్పంచ్ కే దేవీప్రసాద్రెడ్డిపై రూరల్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రూ.61.36 లక్షల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం వ్యవహారంలో రకవరి చేయడంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలని లోకాయుక్త ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీఎల్పీఓ తిమ్మక్క రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవీప్రసాద్‌రెడ్డి సర్పంచ్‌గా పని చేసిన కాలంలో 13,14 ఆర్థిక సంఘం నిధులను దుర్వినియోగం చేసినట్లు డీఎల్పీఓ ఫిర్యాదులో తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. పందిని ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం తొండూరు : మండల పరిధిలోని గంగనపల్లె గ్రామానికి చెందిన నల్లమేకల శివ కుమార్ అనే వ్యక్తి పులివెందులకు మంగళవారం ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో ప్రమాదవశాత్తు పంది అడ్డు రావడంతో ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో శివకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో హుటాహుటిన 108 వాహనంలో పులివెందులలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి అతడిని తరలించారు. తొండూరు ఎస్ఐ పెద్ద ఓబన్న కేసు నమోదు చేస్తామన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మండల పరిశీలకుడు బండి రామమునిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వ్యక్తిని పరామర్శించారు. Wed, Nov 20 2024 1:43 AM
  ఎర్రచందనం దుంగలు స్వాధీనం (నిన్న,23:22)
బద్వేలు అర్బన్ : బద్వేలు – కడప రహదారిలోని కొంగలవీడు క్రాస్ వద్ద 7 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్టు చేయడంతో పాటు ఒక టాటాగూడ్స్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు బద్వేలు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ నయీమ్ అలీ పేర్కొన్నారు. స్థానిక సిద్దవటం రోడ్డులోని ఫారెస్టు బంగ్లా ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. కొంగలవీడు క్రాస్ రోడ్డు వద్ద ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచారని రాబడిన సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించామన్నారు. కర్ణాటక రాష్ట్రం కటిగినహల్లికి చెందిన సయ్యద్ముబారక్ వాహనంలో దుంగలు తరలిస్తూ పట్టుబడ్డారన్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కె.వెంకటశేషయ్య పాల్గొన్నారు. Wed, Nov 20 2024 1:43 AM
  ఆదర్శమూర్తి భక్త కనకదాసు (నిన్న,23:22)
తత్వవేత్త, కవి, సంగీతకారుడు, స్వరకర్త అయిన భక్త కనుకదాసు సమాజాన్ని మెప్పించిన ఆదర్శమూర్తి అని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరనాయుడు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కనకదాసు జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీఆర్వో మాట్లాడుతూ కనకదాసు కర్ణాటక సంగీతంకోసం ఎనలేని సేవ చేశారన్నారు. కర్ణాటకలో జన్మించిన ఆయన మంచి విద్యావంతునిగా సమాజాన్ని అన్ని కోణాల్లో సూక్ష్మ పరిశీలన చేశారని తెలిపారు. చిన్న వయసులోనే నరసింహాస్తోత్రం, రామధాన్యమంత్రం, మోహన తరంగిణి రచించారని వివరించారు. కురవ కులానికి చెందిన కనకదాసు అప్పట్లో కుల వివక్షను ఎదుర్కొన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి కృష్ణయ్య, బీసీ కార్పొరేషన్ ఈడీ జయసింహ, ఉపాధి కల్పనాధికారి సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. Tue, Nov 19 2024 12:57 AM
  ప్రజా సమస్యలపై పోరాటం  (నిన్న,23:22)
పులివెందుల రూరల్ : రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాలు చేయడానికి, ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచిపోయారన్నారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చారన్నారు. అనంతరం కార్యకర్తలు, నాయకులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యకర్తలు ఎవరూ అధైర్య పడవద్దని అండగా ఉంటామని భరోసా కల్పించారు. జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తామన్నారు. సమస్యలు విన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పురస్కరించే విధంగా సంబంధిత అధికారులతో మాట్లాడతామన్నారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో బద్వేలు ఎమ్మెల్యే సుధా, వైఎస్ఆర్సీపీ నాయకులు భయపరెడ్డి, బలరాంరెడ్డి, రసూల్, బ్రహ్మానందరెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Tue, Nov 19 2024 12:57 AM
  అర్జీదారుల వినతులు పరిష్కరించాలి (నిన్న,23:22)
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారితోపాటు డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి, స్పెషల్ కలెక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఉపాధి కల్పన అధికారి సురేష్ హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా.. ప్రజల నుంచి అందిన విజ్ఞప్తులలో కొన్నింటి వివరాలిలా ఉన్నాయి. ● తన కుమారుడికి వికలాంగ పెన్షన్ మంజూరు చేయాలని జమ్మలమడుగు మండలం మొరగుడి గ్రామానికి చెందిన టి.ధనలక్ష్మి కోరారు. ● తన ఏడేళ్ల వయసు ఉన్న ఎదుగుదల లేదని బిడ్డను వైద్యులకు చూపగా ఆపరేషన్ చేయాలని, అందుకు రూ.2 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారని, ఆపరేషన్ నిమిత్తం ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించడంతోపాటు ఆరోగ్య శ్రీ కార్డు నమోదు చేయించాలని సిద్దవటంలోని మాదిగవాడకు చెందిన పొన్నూరు వెంకటమ్మ విన్నవించారు. ● సర్వే నంబర్ 74లో 25 సెంట్ల భూమికి సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని ఖాజీపేటకు చెందిన మహబూబ్ హుస్సేన్ కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. Tue, Nov 19 2024 12:56 AM
  కార్తికం.. దివ్య శోభితం (నిన్న,23:22)
కార్తిక మాసం మూడో సోమవారం సందర్భంగా జిల్లాలోని శివాలయాలు కార్తిక దీపాలతో మెరిశాయి. మరో వారంలో కార్తీక మాసం ముగియనుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వర్షాలు కురుస్తుండటం వల్ల వచ్చే సోమవారం పరిస్థితి ఎలా ఉంటుందోనన్న సందేహంతో భక్తులు కుటుంబాలతో సహా తరలివచ్చారు. పుష్పం, పత్రం సమర్పించి మొక్కుకున్నారు. జిల్లాలో ప్రముఖ శివాలయాలైన పుష్పగిరి, ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర, రామేశ్వర ఆలయాలు, పొలతల, అత్తిరాల, కన్యతీర్థం, నిత్యపూజస్వామి కోన, రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయం, బైరవకోనలో భక్తులు పెద్ద సంఖ్యలో శివయ్యను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పొలతల శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించారు. అలాగే జిల్లాలో మరికొన్ని శైవ క్షేత్రాల్లో శివ కల్యాణాలు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొని పూజలు చేశారు. – కడప కల్చరల్ Tue, Nov 19 2024 12:56 AM
  టైలరింగ్‌లో ఉచిత శిక్షణ  (నిన్న,23:22)
కడప కోటిరెడ్డిసర్కిల్ : కెనరా బ్యాంకు స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి టైలరింగ్, బ్యూటీ పార్లర్లో 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఆరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు కలిగి గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ మహిళలు అర్హులని ఆయన పేర్కొన్నారు. దూర ప్రాంతాల వారికి ఉచిత వసతి, భోజన సౌకర్యం స్థానికంగానే కల్పిస్తారన్నారు. మరిన్న వివరాలకు ఫోన్ నంబర్లు : 94409 05478, 99856 06866, 94409 33028 లలో సంప్రదించాలని వివరించారు. డ్వామా పీడీగా ఆదిశేషారెడ్డి కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌గా బి.ఆదిశేషారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా పని చేస్తున్న ఆదిశేషారెడ్డిని జిల్లా డ్వామా పీడీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో తాను బాధ్యతలు స్వీకరిస్తానని తెలియజేశారు. జిల్లాలో వర్షం కడప అగ్రికల్చర్ : జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం వర్షం కురిసింది. పెండ్లిమర్రిలో అత్యధికంగా 10.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే రాజుపాళెంలో 10.8, పెండ్లిమర్రి 19.2, చింతకొమ్మదిన్నె 9.6, ఒంటిమిట్ట 8.4, కడప 8, ప్రొద్దుటూరు 4.2, దువ్వూరు 2.8, చెన్నూరు 1.6, ముద్దనూరులో 1.2 మి.మీ వర్షం పడింది. రేపు డయల్ యువర్ ఆర్ఎం కడప కోటిరెడ్డిసర్కిల్ : ఆర్టీసీ ప్రయాణికుల సమస్యల పరిష్కార నిమిత్తం డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలు, సలహాలను 995922 5848 నంబరుకు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. 108 సిబ్బంది నిరాహార దీక్ష కడప సెవెన్‌రోడ్స్ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర పిలుపులో భాగంగా 108 సర్వీసు ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. వారికి సీఐటీయూ నాయకులు బి.మనోహర్, వెంకట సుబ్బయ్య, చంద్రారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు దఫాలుగా శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ యాజమాన్యం, ప్రభుత్వ అధికారులు.. పరిష్కరించకపోవడంతో రిలే దీక్షలు చేపట్టాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికైనా స్పందించకపోతే ఈనెల 25 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. యూనియన్ నాయకులు బయపురెడ్డి, శ్రీనివాసులురెడ్డి, ఓం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల అభ్యున్నతే ధ్యేయం జమ్మలమడుగు : దివ్యాంగులు స్వయం సంపత్తి సాధించి స్వతంత్రంగా వారి కాళ్లమీద నిలబడేలా చేయడమే తమ ధ్యేయమని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతశాఖ మంత్రి బీఎల్ వర్మ అన్నారు. జమ్మలమడుగులోని నానుబాల ఫంక్షన్ హాల్లో దివ్యాంగులకు వినికిడి యంత్రాలు, సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చెరకూరి శ్రీధర్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి శనివారం నిర్వహించారు. వర్చువల్ విధానంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల అభ్యున్నతే తమ ధ్యేయమని తెలిపారు. ఆర్డీఓ సాయిశ్రీ తదితరులు పాల్గొన్నారు. సీఎం సహాయ నిధికి రూ.లక్ష విరాళం విజయవాడ వరద బాధితులకు సాయంగా స్థానిక బాలాజీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు సీఎం సహాయనిధికి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. సోమవారం బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ బైరెడ్డి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో పిల్లలు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరికి విరాళం అందించారు. Tue, Nov 19 2024 12:56 AM
  భక్తిశ్రద్ధలతో తహలీల్ ఫాతెహా (నిన్న,23:22)
కడప కల్చరల్ : కడప పెద్ద దర్గాలోని సయ్యద్‌షా ఆరీఫుల్లా మొహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ చిష్ఠివుల్ ఖాద్రి ఉరుసు ఉత్సవాల్లో భాగంగా సోమవారం తహలీల్ ఫాతెహా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పీఠాధిపతి సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ తమ స్వగృహం నుంచి ఫకీర్ల మేళతాళాలు, విన్యాసాల మధ్య ఊరేగింపుగా మహా నైవేద్యంగల పవిత్రమైన పాత్రను దర్గా ప్రాంగణంలోకి తీసుకు వచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పాత్రలోని నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా పంచి పెట్టారు. ఉరుసు ఉత్సవాల్లో తహలీల్ ఫాతెహాగా అందించే ప్రసాదం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. ప్రార్థనల అనంతరం దర్గా నిర్వాహకులు భక్తులందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టారు. ప్రధాన గురువుల మజార్ల వద్ద పీఠాధిపతి ప్రార్థనలు చేశారు. మలంగ్‌షా దీక్ష విరమణ ఉరుసు ఉత్సవాల ప్రారంభం నాడు తపోదీక్ష వహించిన మలంగ్‌షా సోమవారం దీక్ష విరమించారు. పీఠాధిపతి సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ శిష్య గణంతో కలిసి ఊరేగింపుగా వెళ్లి మలంగ్‌షాను స్వయంగా దీక్ష విరమింపజేశారు. అనంతరం భక్తులు పెద్ద ఎత్తున అట్టహాసంగా మేళతాళాలు, సాహస విన్యాసాలతో మలంగ్‌షాను దర్గా చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేయించారు. దర్గా ముజావర్ అమీర్ పర్యవేక్షణలో కార్యక్రమాలు జరిగాయి. రామ్‌చరణ్ ప్రత్యేక ప్రార్థనలు నటుడు రామ్‌చరణ్‌తేజ్ పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్నారు. సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. కడపకు వచ్చిన ఆయన శ్రీ విజయదుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా పెద్దదర్గాకు చేరుకున్నారు. దర్గాలోని ప్రధాన గురువుల మజార్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ముషాయిరాలో పాల్గొన్నారు. సినీ నటుడు రామ్‌చరణ్ వెంట దర్శకుడు బుచ్చిబాబు, అభిమాన సంఘం నాయకులు వచ్చారు. మలంగ్షాచే దీక్ష విరమింపజేసిన పీఠాఽధిపతి భక్తులకు మహానైవేద్యం పంపిణీ ప్రత్యేక అతిథిగా సినీ నటుడు రామ్‌చరణ్‌తేజ్ Tue, Nov 19 2024 12:56 AM
  ఊపందుకున్న రబీ సాగు (నిన్న,23:22)
కడప అగ్రికల్చర్ : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో ఐదు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రబీ సాగు ఊపందుకుంది. రబీ సీజన్‌కు సంబంధించి రైతులకు అవసరమైన శనగ విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీతో అందించింది. అలాగే వేరుశనగకాయలు అందించేందుకు సిద్ధం చేస్తున్నారు. అన్ని రకాల ఎరువులను రైతు సేవా కేంద్రాల్లో ఉంచారు. చాలా మండలాల్లో వర్షం కురవడంతో ఆరుతడి పంటల సాగు ఊపందుకుంది. శనగతోపాటు పెసర, మినుము, అలసంద సాగు చేస్తున్నారు. అలాగే ముందుగా వేసిన పలు పంటలు కళకళలాడుతున్నాయి. పెరిగిన సాగు జిల్లాలో ఐదు రోజుల నుంచి సాగు ఊపందుకుంది. ఈ నెల 11 నాటికి 23,810 హెక్టార్లలో వివిధ పంటలు సాగై 16.65 శాతంగా నమోదైంది. ఈ నెల 16కు 55764 హెక్టార్లకు చేరుకుని 38.99 శాతం మేర నమోదైంది. అంటే వర్షం వచ్చిన నాలుగైదు రోజుల్లోనే సాగు బాగా పెరిగింది. దాదాపు 31954 హెక్టార్ల సాగు పెరిగింది. అలాగే ఈ నెల 11 నాటికి శనగ 16704 హెక్టార్లలో సాగు కాగా 16 నాటికి 44258 హెక్టార్లకు చేరుకుంది. ఐదు రోజుల్లోనే 27554 హెక్టార్లలో సాగైంది. ఈ వారంలో మరింత.. రబీ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం 1,42,988 హెక్టార్లు కాగా ఇప్పటికి 55,744 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో జొన్న 7917 హెక్టార్లకు గాను 1189 హెక్టార్లలో సాగైంది. మొక్క జొన్న 1440 హెక్టార్లు కాగా 650 హెక్టార్లలో, శనగ 82261 హెక్టార్లకు గాను 44258 హెక్టార్లు, పచ్చపెసలు 3182 హెక్టార్లకు గాను 584 హెక్టార్లు, మినుము 14731 హెక్టార్లకు గాను 7300 హెక్టార్లు, వేరుశనగ 6236 హెక్టార్లకు గాను 558 హెక్టార్లు, నువ్వు 5070 హెక్టార్లకు గాను 288 హెక్టార్లలో సాగయింది. ఈ వారంలో పంటల సాగు మరింత పెరగనుంది. రెండు నెలల్లో.. అక్టోబర్, నవంబర్‌లో బాగా కురిసిన వర్షాలు రబీ సీజన్‌కు అనుకూలించాయి. రబీలో అక్టోబర్‌లో సాధారణ వర్షపాతం 132.1 మిల్లీమీటర్లు కాగా 153.7 మి.మీ నమోదైంది. నవంబర్‌లో 61.6 కాగా ఇప్పటికి 44.1 మి.మీ వర్షం కురిసింది. ఐదు రోజులుగా వర్షాలు ముమ్మరంగా వ్యవసాయ పనులు కళకళలాడుతున్న పంటలు ఆనందంలో అన్నదాతలులక్ష్యం చేరుకుంటాంజిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలలో ఆరుతడి పంటల సాగు ఊపందుకుంది. కానీ అక్కడక్కడా ముందుగా వేసిన వరికి కొంత ఇబ్బంది కలిగినా మిగతా ఆరుతడి పంటలకు మేలు జరిగింది. కొన్ని దీర్ఘకాలిక ఉద్యాన పంటలకు జీవం వచ్చింది. మరో పది రోజుల్లో సాగు మరింత పెరగనుంది. ఏదిఏమైనా రబీలో వంద శాతం సాగు లక్ష్యం చేరుకుంటాం. – అయితా నాగేశ్వరావు, జిల్లా వ్యవసాయ అధికారి Tue, Nov 19 2024 12:56 AM
  ప్రతిభకు పరీక్ష (నిన్న,23:22)
కడప ఎడ్యుకేషన్ : జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి చదువే మూలం. అలాంటి విద్య విషయమై ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు ఏ మేరకు ఉన్నాయని పరిశీలించడంతోపాటు ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెర్మార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనలైసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హాలిస్టిక్ డెవలప్మెంట్ (పరఖ్ సర్వేక్షణ–2024) పేరుతో పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ –2024ను(గతంలో నాస్) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సర్వేను 2021లో చివరి సారిగా నిర్వహించారు. మరలా తిరిగి ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహణకు విద్యాశాఖ, సమగ్రశిక్ష, ఎస్సీఈఆర్టీలు చర్యలు చేపట్టాయి. ఇందుకు సంబంధించిన సామర్థ్య పరీక్షను డిసెంబర్ 4న జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో నిర్వహించనున్నారు. ఒక్కో పాఠశాల నుంచి.. వైఎస్ఆర్ జిల్లాలోని 139 పాఠశాలలను ఈ పరీక్ష కోసం ఎంపిక చేశారు. ఇందులో ఒక్కో పాఠశాల నుంచి తరగతికి 30 మంది చొప్పున 3 తరగతులకు సంబంధించిన విద్యార్థులను ఎంపిక చేస్తారు. పరాఖ్ నిబంధనలకు అనుగుణంగా ఎంపిక ఉంటుంది. జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లా స్థాయి కో ఆర్డినేటర్‌గా, డీసీఈబీ సెక్రటరీ సహాయ జిల్లా స్థాయి కో ఆర్డినేటర్‌గా వ్యవహరించనుండగా సమగ్రశిక్ష ఏఎంఓ, డైట్ ప్రిన్సిపాల్, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్లు ఈ పరీక్షల నిర్వహణకు సహకారం అందించనున్నారు. మండల స్థాయిలో పరీక్షల నిర్వాహకులుగా ఎంఈఓలతోపాటు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వ్యవహరిస్తారు. పరీక్షను పక్కాగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసే పనిలో విద్యాశాఖ నిమగ్నమైంది. పరీక్ష నిర్వహించేందుకు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లను ఎంపిక చేశారు. వీరందరికీ ఈ నెల 20న డిస్ట్రిక్ లెవల్ ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. పరీక్షలు ఇలా.. ఎస్సీఈఆర్టీ నిర్వహించే పరాఖ్ పరీక్షకు ముందుగా ప్రాక్టీస్ పేపర్ల ద్వారా తర్ఫీదు ఇస్తారు. ఇందులో 3, 6 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, గణితం, పరిసరాల విజ్ఞానం, 9వ తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, గణితం, సోషియల్, సైన్సు సబ్జెక్టులపై పరీక్షలు ఉంటాయి. 3వ తరగతి విద్యార్థులకు అదే తరగతి సిలబస్ ఉంటుంది. వీరికి 45 ప్రశ్నలతో 90 నిమిషాల పాటు పరీక్ష ఉంటుంది. అలాగే 6వ తరగతి విద్యార్థులకు 5వ తరగతి సిలబస్ ఉంటుంది. వీరికి 51 ప్రశ్నలతో 90 నిమిషాల పాటు పరీక్ష ఉంటుంది. 9వ తరగతి విద్యార్థులకు 8వ తరగతి సిలబస్ ఉంటుంది. వీరికి 60 ప్రశ్నలతో 120 నిమిషాల పాటు పరీక్ష ఉంటుంది. ఓఎంఆర్ షీటు విధానంలో పరీక్ష ఉంటుంది. అభ్యసనా సామర్థ్యాల మెరుగుకు చర్యలు 3,6,9 తరగతుల విద్యార్థుల ప్రావీణ్యం పరిశీలన పరఖ్ సర్వేక్షణకు 139 పాఠశాలలు ఎంపిక డిసెంబర్ 4న ఓఎంఆర్ విధానంలో నిర్వహణ20న శిక్షణ పరాఖ్ పరీక్ష కోసం ఎంపిక చేసిన 165 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు, అబ్జర్వర్లు, మండల విద్యాశాఖ అధికారులకు ఈ నెల 20న ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ శిక్షణ కడపలోని డీసీఈబీలో ఉంటుంది. పరీక్షల నిర్వహణపై పూర్థి సాయి అవగాహన కలిగిస్తాం. – విజయ భాస్కర్‌రెడ్డి, సెక్రటరీ, డీసీఈబీసమర్థవంతంగా.. జిల్లా వ్యాప్తంగా పరాఖ్ పరీక్ష సమర్థవంతంగా నిర్వహిస్తాం. అవసరమైన ఏర్పాట్లు, సిబ్బంది నియామకం కూడా పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో 3, 6,9 తరగతులకు సంబంధించి విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. – మీనాక్షి, జిల్లా విద్యాశాఖ అధికారి Tue, Nov 19 2024 12:56 AM
  ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని తరలించరాదు  (నిన్న,23:22)
మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషకు వినతి కడప కోటిరెడ్డిసర్కిల్ : ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను సత్వరమే ఉపసంహరించుకోవాలని బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.హరిప్రసన్నకుమార్, కె.జగదీశ్వర్‌రెడ్డి కోరారు. సోమవారం సాయంత్రం వారు మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్‌బాషాను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యాలయాలు అమరావతిలో కేంద్రీకరించాలని భావిస్తున్న నేపథ్యంలో నూతనంగా ఏర్పడబోతున్న గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కూడా అమరావతికి తరలిపోతుందన్న ఆందోళన నెలకొందన్నారు. అత్యంత కరువు ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పటికీ, ఎక్కవ లాభాలు, అత్యధిక నిల్వలు, వ్యాపారంతో ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు రుణాలు ఇవ్వడంలో కీలకపాత్ర పోషించినటువంటి గ్రామీణ బ్యాంక్ తరలించడం తగదన్నారు. ఈ అంశం ప్రాంత అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. మిగతా ప్రాంతాలతో పోల్చితే వెనుకబడిన రాయలసీమలో ఎటువంటి ముఖ్యమైన కార్యాలయాలు, సంస్థల కార్యాలయాలు లేకపోవడం బాధాకరమన్నారు. అంజద్‌బాషా మాట్లాడుతూ బ్యాంకు ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగేలా తమవంతుగా కృషి చేస్తానని హామీమి ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీజీబీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు హనుమంతరెడ్డి, మహమ్మద్, పీవీ రాహుల్తేజ్, కేఎన్ లోహిత్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు. Tue, Nov 19 2024 12:56 AM
  600 మంది బాధితుల పేర్లను చేర్చాలి  (నిన్న,23:22)
– ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు: గండికోట ప్రాజెక్టు మొదటి విడత గ్రామాలైన 14 గ్రామాలలో 600 మంది బాధితుల పేర్లు గెజిట్‌లో రాలేదని, అధికారులు విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. శాసనమండలిలో సోమవారం ఆయన గండికోట బాధితుల పరిహారం విషయమై ప్రభుత్వాని ప్రశ్నించారు. 14గ్రామాలలో అధికారులు నిర్వహించిన సోషియో ఎకనామిక్ సర్వేలో ముంపుబాధితులకు సంబంధించిన 600 మంది బాధితుల పేర్లు లేవని, నిజమైన లబ్ధిదారులైన వీరికి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలన్నారు. రెవెన్యూ అధికారులు సోషియో ఎకనామిక్ సర్వే జరిపి ప్రభుత్వానికి ఇప్పటికే నివేదికలను ఇచ్చారని, ప్రభుత్వం బాధితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజి వర్తింపజేయాలని కోరారు. పరిహారం జాబితాలో పేరు లేదని ఆందోళన కొండాపురం : గండికోట జలాశయంలో అంతర్భాగమైన గండికోట ఎత్తిపోతల పథకంలోని ఎస్.తిమ్మాపురం చెరువు పరిధిలో ముంపునకు గురైన చిన్నపల్లె గ్రామం సోషియల్ ఎకనామిక్ సర్వే జాబితాలో తన పేరు లేదని అశ్వర్థరెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. సోమవారం మండల తహసీల్దార్ గుర్రప్ప రెవెన్యూ సిబ్బందితో చిన్నపల్లె గ్రామంలో నిర్వాసితులతో అక్వడెన్స్లో సంతకాలు సేకరించేందుకు వెళ్లారు. పరిహారం జాబితాలో తన పేరు లేదని అధికారులను నిర్వాసితుడు అశ్వర్థరెడ్డి అడ్డుకున్నాడు. ఈ సందర్భంగా అతని భార్య పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కొండాపురం ఎస్ఐ విద్యాసాగర్ అక్కడికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. Tue, Nov 19 2024 12:56 AM
  యానిమేటర్ల తొలగింపును ఆపాలి (నిన్న,21:34)
ప్రజాశక్తి – రాయచోటి టౌన్ విఒఎ (యానిమేటర్ల) తొలగింపును వెంటనే ఆపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తొలగించిన…
  స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలి : ఆర్‌డిఒ (నిన్న,21:34)
ప్రజాశక్తి-రాయచోటి టౌన్ స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు నిబంధనలు తప్పక పాటించాలని ఆర్‌డిఒ శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై…
  బాధిత రైతులకు ప్రభుత్వ భూములిస్తాం : జెసి (నిన్న,21:34)
ప్రజాశక్తి-వాల్మీకిపురం మదనపల్లి-తిరుపతి రహదారికి సంబంధించి వాహనాల పార్కింగ్ కోసం భూములు కోల్పోతున్న బాధిత రైతులకు మరొక్క చోట ప్రభుత్వ భూములను అందించే విధంగా చర్యలు తీసుకుంటామని జాయింట్…
  నాణ్యతతో ప్రజా సమస్యలు పరిష్కరించాలి : కలెక్టర్ (నిన్న,21:34)
ప్రజాశక్తి-రామాపురం/లక్కిరెడ్డిపల్లె ప్రజా ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా విచారణ చేసి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి మండల అధికారులను ఆదేశించారు. బుధవారం రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల్లో…
  కడప ‘ఉక్కు’ కోసం నిరవధిక దీక్ష చేస్తాం (నిన్న,21:12)
ప్రజాశక్తి-కడప కడప ఉక్కు పరిశ్రమ అంటే కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు చేసేందుకే పరిమితమైందని పిసిసి అధ్యక్షులు వైఎస్.షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులు మారడం కొబ్బరికాయలు కొట్టడం…
  విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయురాలు (నిన్న,21:12)
ప్రజాశక్తి-కమలాపురం కమలాపురం పట్టణంలోని బాలయోగి గురుకుల పాఠశాలలో విద్యార్థినిని వ్యాయామ ఉపాధ్యాయురాలు చంద్రకళావతి చితకబాదింది. పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న అను అనే విద్యార్థిపై మంగళవారం వ్యాయామ…
  పరిశ్రమలకు పొలిటికల్ పంచ్ (నిన్న,21:12)
ప్రజాశక్తి – కడప ప్రతినిధి జిల్లా పారిశ్రామికాభివృద్ధికి రాజకీయ గ్రహణం పట్టింది. రాష్ట్రంలోని కాంగ్రెస్, టిడిపి, కూటమి సర్కార్ల హయాముల్లో పారిశ్రామికావృద్ధి తిరోగమనానికి రాజకీయ నాయకుల స్వార్థపూరిత…
  రైతులు, కార్మికుల కోర్కెలు పరిష్కరించాలి (నిన్న,21:12)
ప్రజాశక్తి-కడప అర్బన్ కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ 13 కేంద్ర కార్మిక సంఘాలు, 500 రైతు సంఘాలు సంయుక్తంగా జిల్లా కేంద్రాలలో ఈ నెల…
  భూ కబ్జారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి : సిపిఎం (నిన్న,21:12)
ప్రజాశక్తి – బద్వేలు పట్టణంలోని శివాలయం కుంటను భూ కబ్జాదారులు ఆక్రమించి రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని…
  విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయాలి: సిఐటియు (నిన్న,21:12)
ప్రజాశక్తి-కడప అర్బన్ : విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారు. బుధ వారం విద్యుత్ భవన్ వద్ద రాయబార కార్యక్రమం…
  Jammalamadugu: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. అదానీతో కాదు.. వారితో పెట్టుకున్నాం.. (నిన్న,18:58)
అదానీ సంస్థలను జమ్మలమడుగుకు స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. కానీ, అదానీ పేరు చెప్పుకుని వచ్చే దొంగ వైసీపీ కంపెనీలను అనుమతించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
  104 ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలి (నిన్న,17:54)
ప్రజాశక్తి- కలకడ (అన్నమయ్య) : 104 వాహనాల ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 104 వాహనాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల డిమాండ్లను…
  డిప్యూటీ స్పీకర్ ను కలిసిన టిడిపి నేతలు (నిన్న,17:32)
ప్రజాశక్తి-రైల్వేకోడూరు (అన్నమయ్య) : రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును స్థానిక టిడిపి నాయకులు సూరపరాజు సుబ్బరాజు, మాజీ ఎంపీపీ వెంకటేశ్వరరాజు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.…
జమ్మలమడుగులో అదానీ పేరు చెప్పి వైకాపా వాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదినారాయణరెడ్డి ధ్వజమెత్తారు.
  చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ చేయాలి అన్నట్లు తయారైంది.. కడప స్టీల్ ప్లాంట్‌పై షర్మిల సెటైర్లు (నిన్న,16:28)
  YS Sharmila: కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరి కాయలు కొట్టే ప్రాజెక్టా?: వైఎస్ షర్మిల (నిన్న,15:24)
కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్టుగా మారిపోయిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారం మారిన ప్రతిసారీ నూతన ముఖ్యమంత్రి టెంకాయ కొట్టడం ఆనవాయితీ అయిపోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై, వైఎస్ విజయలక్ష్మిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
  కడప కలెక్టరేట్ వద్ద టెంకాయలు కొట్టిన షర్మిల.. టీజింగ్‌లో ఇది నెక్ట్స్ లెవల్.. (నిన్న,15:03)
  ఎనిమిది కాళ్లతో ‘పిల్ల’ పుట్టింది… (నిన్న,13:54)
చూడడానికి చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు తండోపతండాలు ప్రజాశక్తి-చక్రాయపేట : కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలం కే రాజు పల్లె గ్రామంలో వినుకొండ రసూల్ గొర్రెలలో…
  మేదర రవికుమార్ ను సన్మానించిన టిడిపి నేతలు (నిన్న,11:44)
ప్రజాశక్తి – వేంపల్లె : రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎన్నికైన మేదర రవికుమార్ ను టిడిపి నేతలు సన్మానించారు. కూటమి ప్రభుత్వం ఆయా కార్పొరేషన్లులకు…