కనిగిరి పట్టణంలో సోమవారం ‘ఈనాడు’ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డితో నిర్వహించిన ఉదయపు నడక కార్యక్రమంలో ఒకే రోజు రూ.5 లక్షల విలువైన పనులు చేపట్టారు.
తెదేపా నేత, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక నిందితుడు ముప్పా సురేష్ భార్య అనితకు పోలీసులు నోటీసులు అందజేశారు.
ఒంగోలు బ్రాంచ్ కెనాల్ (ఓబీసీ) పరిధిలోని సాగర్ కాలువలకు మరమ్మతుల ఊసేలేదు. కాలువ నీరు ప్రవాహించే లోతట్టు ప్రాంతమంతా చిల్లచెట్లు, పిచ్చిమొక్కలతో నిండిపోయింది. పూడికతీత పనులు, కాలువ గట్లు బలంగా లేకపోవడంతో నీరు వృథా అవుతోంది. సమస్యను పలుమార్లు విన్నవించినా నిధుల్లేకపోవడంతో అధికారులు పట్టించుకోవడంలేదు.
వ్యవసాయ పంటలతో పోలిస్తే ఉద్యాన పంటలతో రైతులకు అధిక ఆదాయం సమకూరుతోంది. దీనిని గుర్తించిన ఎన్డీయే ప్రభుత్వం పండ్ల మొక్కల పంపిణీతోపాటు మూడేళ్ల పాటు నిర్వహణ, సాగునీటి సరఫరా, మందులు, ఎరువులకు అయ్యే మొత్తాన్ని సైతం అందజేస్తోంది.
ఓ యువ ఉద్యోగి విద్యుదాఘాతానికి ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు...పొదిలికి చెందిన వీరేపల్లి వెంకటేష్(29)కు ఎల్ఐసీ అభివృద్ధి అధికారిగా ఉద్యోగం రావడంతో కుప్పంలోని కార్యాలయంలో పనిచేస్తూ స్థానిక ప్రకాశం రోడ్డులో ఒక్కరే నివాసముంటున్నారు.