Fake video on social media ఓ ప్రైవేట్ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనను వైసీపీ సోషల్ మీడియా వేదికగా శవ రాజకీయం చేసేందుకు యత్నించింది. ఓ ఫేక్ వీడియోను పోస్టు చేసి పోలీసులు, ప్రభుత్వంపై తప్పు నెట్టేయాలని చూసింది. దీన్ని పోలీసులు ఖండిస్తూ ఫ్యాక్ట్చెక్తో అసలు వీడియోను పెట్టారు.
Yarrannayudu's 13th death anniversary దివంగత నేత, కేంద్ర మాజీమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఆశయసాధనకు కృషి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
Distribution of compensation checks కాశీబుగ్గలోని వేంకటేశ్వరాలయంలో తొక్కిసలాట ఘటనకు సంబంధించిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం మందస మండలం మందస, బెల్లుపటియాలో బర్రి బృందావతి, దువ్వు రాజేశ్వరి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి పరామర్శించారు.
The injured are receiving treatment కార్తీకమాస ఏకాదశి పర్వదినం వేళ.. కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట మృతుల కుటుంబాలు, క్షతగాత్రుల్లో ఆర్తనాదాలు మిన్నంటుతూనే ఉన్నాయి. శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నేపథ్యంలో రెయిలింగ్ ఊడిపోయి ప్రమాదం జరగ్గా.. తొమ్మిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే మరో 15 మంది గాయపడగా.. వారంతా పలాస, టెక్కలి, జెమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
kasibugga Temple issue ‘కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన యాదృచ్ఛికంగానే జరిగింది. ఎవరూ కావాలని చేసింది కాదు. భక్తులు కొంచెం సంయమనం పాటించినా.. నిర్వాహకులు బారికేడ్లు నిర్మించి జాగ్రత్తలు తీసుకున్నా ఈ ఘటన జరిగి ఉండేది కాదు.’ అని దేవదాయశాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
The boat capsized సముద్రంలో బోటు బోల్తాపడిన ఘటనలో రూ.15 లక్షల ఆస్తినష్టం సంభవించింది. అందులోని మత్స్యకారులు ఈదు కుంటూ సురక్షితంగా తీరానికి చేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి, శ్రీకూర్మంలోని కూర్మనాథ స్వామి వారి హంసనావికోత్సవం (తెప్పోత్సవం) ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు.
ఉపాధ్యాయులు బోధనకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ప్రావీణ్యం పొందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గురువులకు ఆటల పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది.
థర్మల్ ప్లాంట్పై జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సీపీఎం పార్టీ కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె.మోహనరావులు డిమాండ్ చేశారు.
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలతో తాజాగా ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ కూడా ఈ దుర్ఘటన మీద ఏర్పాటు చేశారు.