కనిమెరక రైల్వే గేటు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకొని.. 3.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు గజపతినగరం సీఐ జీఏవీ రమణ తెలిపారు.
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)కి గత పదేళ్ల నుంచి మొండి బకాయిలు వేధిస్తున్నాయని, వీటి వసూలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు బ్యాంకు చైర్మన్ కిమిడి నాగార్జున తెలిపారు.
జిల్లా కేంద్రంలోని మహిళా పోలీసు స్టేషన్లో 2024లో నమోదైన కేసులో నగరంలోని హుకుంపేటకు చెందిన పెంకి వివేక్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.4 వేలు జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయాధికారి కె.నాగమణి శుక్రవారం తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
జిల్లా కేంద్రంలోని మహిళా పోలీసు స్టేషన్లో 2024లో నమోదైన కేసులో నగరంలోని హుకుంపేటకు చెందిన పెంకి వివేక్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.4 వేలు జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయాధికారి కె.నాగమణి శుక్రవారం తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
Telugu Must Be Preserved తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు రామమూరి చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు.
Show Your Talent, Win ₹24,000 Scholarship విద్యార్థి విజ్ఞాన మంథన్ పరీక్షలో ప్రతిభ చూపితే ఏడాదికి రూ. 24 వేల స్కాలర్ షిప్ పొందొచ్చనని జిల్లా కో ఆర్డినేటర్ కోట అయ్యప్ప చెప్పారు. శుక్రవారం స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో ప్రతిభాన్వేషణకు గాను కేంద్ర సర్కారు ఈ పరీక్ష నిర్వహిస్తుందన్నారు.
Ready for Pension Distribution జిల్లావ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటో తేదీన పింఛన్లు పంపిణీకి సర్వం సిద్ధం చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీపై శుక్రవారం డీఆర్డీఏ, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Please Help జిల్లాలో పలువురు వితంతువులు నూతన పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. గత ఏడెనిమిది నెలల్లో భర్తను కోల్పోయిన వారు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్ కావడం లేదని వెల్ఫేర్ అసిస్టెంట్లు చెప్పడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం స్పౌజ్ కోటా కింద ఇస్తున్నట్లుగానే తమకూ పింఛన్లు మంజూరు చేయాలని వారు వేడుకుంటున్నారు.
Job Mela on 3rd పార్వతీపురంలో వచ్చే నెల 3న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణచైతన్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ ఏదైనా డిగ్రీ చదువుకున్న 18 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు.
Continue Both Stations ప్రయాణిలకు సౌకర్యార్థం, వారి మనోభావాలు, సరుకు రవాణా ప్రాధాన్యతను గుర్తించి పార్వతీపురంలో యథావిధిగా రెండు రైల్వే స్టేషన్లను కొనసాగించాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. ప్రజలకు ఇబ్బదులు లేని విధంగా విలీన ప్రక్రియ చేపట్టాలన్నారు. భువనేశ్వర్‌లో శుక్రవారం జరిగిన రైల్వేజోనల్ కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈస్ట్‌కోస్టు రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్, రైల్వే ఉన్నతాధికారులను కలిశారు.
ఒకప్పుడు విలువిద్య అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మన్యం ప్రాంతం. కొన్నాళ్లుగా ఆ ప్రోత్సాహం అందక చతికిలపడుతున్నారు. మిగిలిన క్రీడల విషయంలోనూ పరిస్థితి ఇలానే ఉంది.
పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రిలో గర్భిణి మృతి ఆందోళనకు దారి తీసింది. మండలంలోని తంపటాపల్లికి చెందిన బొమ్మాళి రవి భార్య పద్మ(36) పురిటి నొప్పులతో బుధవారం ఆసుపత్రిలో చేరారు.