దానగూడెం దళితులపై దాడి సంఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కైకలూరు జనసేన నాయకుడు కొల్లి వీరవెంకట సత్య వరప్రసాద్ అలియాస్ బాబ్జి మంగళవారం ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ ముందు లొంగిపోయాడు.
ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాల భవనాలు నిర్మాణం పూర్తయినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) సవాల్ విసిరారు.
స్థానిక సంస్థల నిర్వహణకు ప్రభుత్వ గ్రాంట్లు, నిధులు అత్యంత కీలకం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులకు సంబంధించి ఖర్చు చేసిన ప్రతీ పైసాకు లెక్క కచ్చితంగా చూపాలి.
జిల్లాలో ఆదాయవనరులపై మరింత దృష్టి పెడ తాం.. పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక చర్యలు చేపట్టామ ని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు.
మున్సిపాలిటీల్లోని రెవెన్యూ విభాగంలో అవినీతి చాపకింద నీరులా విస్తరిస్తోంది. గతంలో ఎవరైనా కొత్తగా ఇంటి నిర్మాణం చేసుకుంటే.. సిబ్బంది ఆ ఇంటి చుట్టూ తిరిగి పన్నులు వేసేవారు.
మనపై ఎంతో నమ్మకంతో జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి అర్జీలు ఇస్తున్నారని జేసీ రాహుల్కుమార్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో ఆయన ప్రజల నుంచి అర్జీలు అందుకున్నారు.
విర్డ్ ఆసుపత్రిలో అత్యాధునికి వైద్య సేవలు అందిస్తున్నామని, అవసరమైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విర్డ్ ఆసుపత్రి ఛైర్మన్ ఎస్వీ సుధాకరరావు అన్నారు.
సంయుక్త పాలనాధికారి పి.ధాత్రిరెడ్డి బదిలీ అయ్యారు. ఆమెను ప్రతిష్ఠాత్మక రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
ప్రత్యేక అవసరాలున్న పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. వారిలో మానసిక స్థైర్యాన్ని నింపేలా ఉపకరణాలు అందించేందుకు కార్యాచరణ రూపొందించింది.
జిల్లాలో చౌక దుకాణాల డీలర్లకు పంపిణీ కోసం కొత్తగా 1,123 స్మార్ట్ ఈ పోస్ యంత్రాలు వచ్చాయి. ఇటీవల పంపిణీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డులు వినియోగానికి వీలుగా ఈ యంత్రాలు పనిచేయనున్నాయి.
జిల్లాలో ఇటీవల సైబర్ మోసాలు గణనీయంగా పెరిగాయి. వీరి బారిన విద్యావంతులు పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. విశ్రాంత ఉద్యోగులు, అధికారులు, విద్యార్థులు సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి విలవిల్లాడుతున్నారు.