‘ఓజీ’తో సినీప్రియుల్ని అలరించనున్నారు కథానాయకుడు పవన్ కల్యాణ్. ఆయన టైటిల్ పాత్ర పోషించిన ఈ సినిమాని సుజీత్ తెరకెక్కించారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించింది. ఈ సినిమా ఈనెల 25న థియేటర్లలోకి రానుంది.
అతిథి పాత్రలు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. సినిమాలో కీలకమైన దశలో అనుకోని తార తెరపై ప్రత్యక్షమైతే సినీ ప్రేమికుల్లో కలిగే ఆశ్చర్యం, ఆనందం అంతా ఇంతా కాదు.
‘‘చిత్రపరిశ్రమలో నేను ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. కానీ దాని కోసం వరుసగా సినిమాల్ని ఎంచుకుంటూ తొందరపడాలనుకోవట్లేద’’ని అంటోంది అందాల తార కీర్తి సురేశ్. గ్లామర్ పాత్రలతో పాటు..
‘‘లవ్ సోనియా’ విజయం నా జీవితానికి ఊహించని బహుమతిని ఇచ్చింద’’ని అంటోంది కథానాయిక మృణాల్ ఠాకూర్. ఎంచుకున్న పాత్రలతోనే ప్రేక్షకుల్లో గుర్తుండిపోయే తారల్లో ముందు వరుసలో ఉంటుందీమె.
తనదైన విలక్షణ విలనిజంతో ‘లియో’, ‘లోక: చాప్టర్ 1’ చిత్రాల ద్వారా ప్రేక్షకుల్ని మెప్పించారు నృత్య దర్శకుడు శాండీ మాస్టర్. ఇప్పుడాయన ‘కిష్కింధపురి’ సినిమాతో నటుడిగా తెలుగులోకి అడుగు పెట్టారు.
తిరువీర్, టీనా శ్రావ్య జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’. మాస్టర్ రోహన్ ముఖ్య పాత్ర పోషించారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
‘‘బ్యూటీ’ సినిమా చూశాక ప్రతి అమ్మాయికి వాళ్ల తండ్రి గుర్తొచ్చి కళ్లలో నీళ్లు తిరుగుతాయి’’ అన్నారు నటుడు నరేశ్ వీకే. అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన ఈ చిత్రాన్ని జె.ఎస్.ఎస్.వర్ధన్ తెరకెక్కించారు.
ఇటీవల హిందీ చిత్రం ‘ఫుల్ ప్లేట్’ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ప్రదర్శితమైంది. తాజాగా ఈ చిత్రం అక్టోబరులో జరగనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సిడ్నీకి ఎంపికైంది.