‘‘స్టార్‌గా నాకు పుట్టినిల్లు తెలుగు చిత్ర పరిశ్రమే. నాకు ఎన్నో మంచి సినిమాల్ని నిర్మించే శక్తినిచ్చింది ఇక్కడి ప్రేక్షకులే’’ అన్నారు కథానాయకుడు కమల్‌హాసన్. ఇప్పుడాయన నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘థగ్ లైఫ్’.
రంగురంగుల దుస్తులు.. రెడ్‌కార్పెట్‌పై సినీతారల హొయలు.. అబ్బురపరిచే సినిమా ప్రదర్శనల మధ్య కేన్స్ చిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో ముగియనున్న ఈ ఫెస్టివల్లో తాజాగా బాలీవుడ్ కథానాయిక ఐశ్వర్య రాయ్ రెడ్‌కార్పెట్‌పై మరోసారి హొయలొలికించింది.
‘‘ఒకేసారి కాకుండా రెండు రోజులపాటు కథ వినాలనుకున్నా. కానీ దర్శకుడు పూరి జగన్నాథ్ కథ చెబుతుంటే అలా మూడున్నర గంటలు వింటూనే ఉన్నా. ఆయన కథ చెప్పిన తీరు అంతగా నచ్చింది. ఆయనతో కలిసి చేయనున్న సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి.
కథానాయకుడు పవన్ కల్యాణ్ సినిమాల విషయంలో వేగం పెంచారు. చేతిలో ఉన్న చిత్రాల్ని పూర్తి చేయడమే లక్ష్యంగా చిత్రీకరణల్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’ను పూర్తి చేసి ‘ఓజీ’ కోసం రంగంలో దిగిన ఆయన..
‘పెద్ది’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు రామ్‌చరణ్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు.
వినోదాన్ని పంచే చిత్రాలు మాత్రమే కాదు.. జీవితానికి దగ్గరగా ఉంటూ బంధాల విలువల్ని తెలిపే సినిమాలు కూడా ఉంటాయి. ఇప్పుడీ నేపథ్యంలోనే రాబోతున్న సిరీస్ ‘ఫర్గెట్ యు నాట్’. ఈ చైనీస్ డ్రామాకు రెనే లియు దర్శకత్వం వహించారు.
‘భూల్ చుక్ మాఫ్’తో థియేటర్లలో సందడి చేస్తూనే.. మరోవైపు తన రాబోయే ప్రాజెక్టుల కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు బాలీవుడ్ కథానాయకుడు రాజ్‌కుమార్ రావు. తాజాగా ఆయన ‘మద్రాస్ కేఫ్’, ‘పీకు’ లాంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సూజిత్ సర్కార్‌తో ఓ సినిమా కోసం చేతులు కలిపినట్లు సమాచారం.
సినీ ప్రియుల హృదయాలను దోచుకున్న బాలీవుడ్ కథానాయకుడు షారుక్ ఖాన్.. ఆయన కుమార్తె సుహానా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కింగ్’. యాక్షన్ కథా నేపథ్యంలో సిద్ధార్థ్ ఆనంద్ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ముంబయిలో ప్రారంభమైనట్లు సమాచారం.