పుష్పరాజ్‌గా అల్లు అర్జున్... శ్రీవల్లిగా రష్మిక కలిసి ‘పుష్ప’ సినిమాలతో చేసిన సందడి అంతా ఇంతా కాదు. మరొకరిని ఊహించుకోలేం అనేంతగా ఆ పాత్రల్లో ఒదిగిపోయారు.
విజయవంతమైన ‘దసరా’ తర్వాత కథానాయకుడు నాని - దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి జట్టు కట్టారు. ఈ కలయికలో రూపొందుతున్న చిత్రమే... ‘ది ప్యారడైజ్’. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
‘‘అనుకూలమైన సినిమాలు లేకపోవడం సమస్య కాదు.. పెరుగుతున్న టికెట్ ధరల వల్ల మధ్యతరగతి కుటుంబాలు థియేటర్లకు దూరమవుతున్నాయ’’ని అంటోంది బాలీవుడ్ కథానాయిక సోనాక్షి సిన్హా. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న ఈ భామ సందడి థియేటర్లలో కనిపించకా.. మూడేళ్లు కావొస్తుంది.