ఆత్మీయులతో కబుర్లు కలబోసుకుంటూ రకరకాల రుచులు ఆస్వాదించడం ఎంత బాగుంటుందో కదా! ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మనసైన వారి కోసం ఈ పసందైన స్వీట్లూ, హాట్లూ ప్రయత్నించండి.. అందరూ కలిసి ఆనందంగా ఆరగించండి.
పూజ, వ్రతం, పెళ్లి, పేరంటం.. ఇలా ఎన్నో సందర్భాల్లో పులిహోర తప్పనిసరిగా ఉంటుంది. దీన్ని ఇష్టపడనివాళ్లు దాదాపుగా ఉండరు. చింతపండు పులుసు ఉడికించటానికి ఎక్కువ టైం పడుతుంది.
తోటకూర, పాలకూరలంత తరచుగా కాకున్నా మెంతికూర కూడా మన మెనూలో ఉంటూనే ఉంటుంది. బంగాళదుంపలు, బఠాణీలతో చేర్చి వండితే బలే కమ్మగా ఉంటుంది కదూ! ఇంతకీ ఇందులో ఎన్ని సుగుణాలున్నాయో చూద్దామా..