Andhrapradesh: విశాఖలో జనసేన నేతల అరెస్ట్‌పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన నేతల అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.
వరుస రివ్యూలతో సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) బిజీబిజీగా ఉన్నారు. సోమవారం నాడు ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రివ్యూ చేశారు. పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీ అధికారులను సీఎం ఆదేశించారు.
ప్రస్తుతం సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా విరివిగా జరుగుతున్న అనధికార రుణ మాఫీ ప్రచారాలపై ప్రజలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. అలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచించింది.
Telangana: ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
అన్షుల్ మిశ్రా అనే ఈ కుర్రాడు నాలుగేళ్ల క్రితమే బీటెక్ పూర్తి చేసినా.. తన విద్యార్హతకు తగిన ఉద్యోగాలు మాత్రం దొరకలేదు. దీంతో తండ్రితో కలిసి వ్యవసాయం వైపు అడుగులు వేశాడు. అందరిలా కాకుండా వెరైటీగా ఆలోచించి ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు.
పరిమితికి మించి మద్యం సేవించినప్పుడు గానీ, ఆరోగ్య పరిస్థితులు సహకరించనప్పుడు కనీసం ఒక పెగ్గు వేసుకున్నా గానీ.. వాంతులు రావడం సహజం. కాబట్టి.. ఈ విషయాన్ని ఎవ్వరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోరు. ఒక రోజంతా విశ్రాంతి తీసుకుంటే..
ICC Award: నవంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డు రేసులో ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, టీమిండియా ఆటగాడు మహ్మద్ షమీ ఈ అవార్డు కోసం పోటీ పడ్డారు. అయితే ఐసీసీ మాత్రం ఎక్కువ ఓట్లు వచ్చిన ఆటగాడినే ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఓట్ల ఆధారంగా ట్రావిస్ హెడ్‌ను విజేతగా ప్రకటించింది.
ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కేంద్రం మళ్లీ మొండిచేయి ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరిని లోక్‌సభలో కొంతమంది టీడీపీ, వైసీపీ ఎంపీలు కలిసి ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపై ప్రశ్నించగా ఆయన దాటవేసినట్లు తెలుస్తోంది.
Telangana: అనేక బాధ్యతల ద్వారా ఎదిగానని.. ఎప్పటికీ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మనముందు ఉన్న కర్తవ్యం పెద్దది అని.. గత పాలకుల తీరు నచ్చక కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారన్నారు. ఆరు గ్యారంటీల్లో రెండు అమలు చేస్తున్నామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రుల కార్యాలయాల్లో ఫైళ్ల మాయంపై విచారణ వేగవంతం చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ ( DCP Srinivas ) తెలిపారు.
కోర్టులో ఫైళ్లను మాయం చేసి, కల్తీ మద్యం, అక్రమ ఇసుక రవాణా, సిలికాన్ దోపిడీలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ( Minister Kakani Govardhan Reddy ) మునిగి తేలుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( Gorantla Butchaiah Chowdary )విమర్శించారు.
క్యాంపు కార్యాలయాల ముసుగులో విశాఖపట్నానికి ( Visakhapatnam) రాజధాని తరలింపు పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు (AP High Court ) కీలక ఆదేశాలు జారీ చేసింది. రోస్టర్ ప్రకారం బెంచ్ ముందుకు పిటిషన్ వచ్చిందని, విచారించిన తర్వాతే ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు.
Andhrapradesh: టీడీపీ యువనేత లోకేష్ పాదయాత్ర ముగింపు సభలోనే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తామని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణతో పాటు ఐదు లక్షల మంది హాజరవుతారన్నారు.
AP Politics: ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేయడంతో వైసీపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరి సీటును వచ్చే ఎన్నికల్లో బీసీలకు కేటాయించాలని సీఎం జగన్ భావిస్తున్నారని.. అందుకే బీసీ అయిన గంజి చిరంజీవికి ఇవ్వనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గంజి చిరంజీవి సోమవారం సాయంత్రం సీఎం జగన్‌ను కలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Andhrapradesh: విశాఖలో ఆందోళన చేస్తున్న జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, పంచకర్ల రమేష్ బాబు, కోన తాతారావు సహా పలువురు జనసేన నేతలు నోవోటల్ హోటల్ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు.
ప్రస్తుత క్రికెటర్లు ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం, తగిన వర్కౌట్లతో శరీరం ఎప్పుడూ ఫిట్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. ప్రస్తుతం టీమిండియాలో చోటు దక్కాలంటే నైపుణ్యం ఒకటి ఉంటే సరిపోదు ఫిట్నెస్ కూడా ఉండాలి.
ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి చనిపోయారు. తమ కుటుంబ సభ్యుడు ఇక లేడు అన్న బాధను మర్చిపోయి మామూలు పరిస్థితికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో సరిగ్గా మూడు వారాల తర్వాత వారికి ఓ షాకింగ్ నిజం తెలిసింది.
Andhrapradesh: పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పూర్తి ఖర్చు భరించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ ఏపీ హైకోర్టులో కాంగ్రెస్ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పిటిషన్ దాఖలు చేశారు.
Andhrapradesh: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.
అమరావతి: విశాఖలో జనసేన నేతల అరెస్టులపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడిన జనసేన నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు మిగిలిన నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి నేడు మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి వెళ్లారు. కొత్త సర్కార్ కు సహకరించాలని రేవంత్ కోరారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. సర్కారులో ఇబ్బందులను, బాధలను తెలియజేయడం శుభపరిణామమన్నారు. సీఎం రేవంత్ తనను కలిశారని.. ప్రజాభిమానం చూరగొనేలా పనిచేయాలని చెప్పానన్నారు.
సౌదీలోనే ఉన్న తెలుగు ప్రవాసులను ఒక్కచోట చేర్చి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించాలన్న కొందరు ప్రవాసుల్లో కలిగింది. ఆ ఆలోచనకు సౌదీలోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా కార్యరూపం దాల్చింది. అందులో భాగంగా తబూక్లో ప్రవాసీ సమ్మేళనానికి శ్రీకారం చుట్టింది.
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు విచారకరంగా ఉందని, దురదృష్టకరమని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ ఛైర్మన్ గులాం నబీ ఆజాద్ అన్నారు. కోర్టు తీర్పుతో ప్రజలు సంతోషంగా లేరని పేర్కొన్నారు.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో ఈ సీనియర్ పేసర్ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆరంభంలోనే కొన్ని మ్యాచ్‌లకు తుది జట్టులో చోటు దక్కలేదు.
చిత్తూరు జిల్లా కుప్పానికి ఏనుగుల ప్రమాదం పొంచి ఉంది. తమిళనాడు రాష్ట్రం హోసూర్ నుంచి కుప్పం వైపు 70 ఏనుగుల గుంపు తరలివస్తోంది. రాత్రి తమిళనాడు హోసూరు సరిహద్దులో 70 ఏనుగుల గుంపు హల్చల్ చేసింది.
Telangana: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం యశోదా ఆస్పత్రిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మల్లారెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా రెండుమూడు రోజులు తరువాత డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు.
ఆర్టికల్ 370 రద్దుని సమర్థిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మకమైన తీర్పుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ ప్రజల ఐక్యత, పురోగమనం, దృఢవిశ్వాసం కోసం సుప్రీంకోర్టు సుస్పష్టమైన ప్రకటన చేసిందని వ్యాఖ్యానించారు.
అమెజాన్‌లో షాపింగ్ చేసిన ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురయింది. దాదాపుగా 20 వేల రూపాయలు పెట్టి ఓ ఎలక్ట్రానిక్ వస్తువును ఆర్డర్ ఇస్తే.. చివరకు కేవలం 10 రూపాయల విలువైన టూత్‌పేస్ట్ ను డెలివరీ చేశారు.
ఆర్టికల్ 370 రద్దుపై పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టిపారేయలేమని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ నేపథ్యంలో అసలు ఆర్టికల్ 370 అంటే ఏమిటి? దాని చుట్టూ ఉన్న వివాదాలు ఏమిటి? ఆర్టికల్ 370ని 2019లో కేంద్ర ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందనే అంశాలను ఒకసారి పరిశీలిద్దాం.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పరామర్శించేందుకు ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి పరామర్శించారు.
Andhrapradesh: ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉపాధ్యాయుడు మల్లేష్‌కు మాజీ మంత్రి పరిటాల సునీత ఆర్థిక సాయం అందజేశారు. సోమవారం ఉదయం మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లెరఘునాథ్ రెడ్డి ప్రభుత్వాస్పత్రికి వెళ్లి టీచర్ మల్లేష్‌ను పరామర్శించారు.
జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370(Article 370) రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు(Supreme Court Judgement) తీర్పు వెలువరించిన తరుణంలో అక్కడ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ధర్మాసనం ఈసీని ఆదేశించింది.
దేశంలో అత్యంత ఖరీదైన కారు ధరెంతో మీకు తెలుసా. అక్షరాలా రూ.14 కోట్లు. అది తీసుకున్నది సంపన్నులైన ముఖేష్ అంబానో, అనిల్ అంబానో, రతన్ టాటా, గౌతమ్ అదానో అని అనుకుంటున్నారా.
దేశంలో అత్యంత ఖరీదైన కారు ధరంతో మీకు తెలుసా. అక్షరాలా రూ.14 కోట్లు. అది తీసుకున్నది సంపన్నులైన ముఖేష్ అంబానో, అనిల్ అంబానో, రతన్ టాటా, గౌతమ్ అదానో అని అనుకుంటున్నారా.
Telangana: ‘‘మేం పాలకులం కాదు.. సేవకులం’’ అంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు చెప్పిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి అక్షరాల నిజం చేస్తున్నారు. అందుకు ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియోనే సాక్ష్యంగా నిలిచింది. ముఖ్యమంత్రి ప్రజల మనిషి అనే ఈ ఒక్క వీడియోతో చెప్పేయొచ్చు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ మహిళ పట్ల ముఖ్యమంత్రి ప్రవర్తించిన తీరుపై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. నేడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం శాసనసభా కార్యదర్శికి ఆళ్ల రాజీనామా లేఖ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని లేఖలో ఆళ్ల పేర్కొన్నారు.
Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చారిత్రాత్మక మైలు రాయిని అధిగమించింది. యువగళం పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది.
Asia Cup 2023: భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మ్యాచ్ ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా, ఆడేది సీనియర్ జట్లైనా, జూనియర్ జట్లైనా మంచి ఆదరణ లభిస్తుంటుంది.
ఆర్టికల్ 370 రద్దుపై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రాజ్యాంగ ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.
ఆర్టికల్ 370 రద్దుపై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రాజ్యాంగ ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370(Article 370) రద్దుపై సోమవారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో కశ్మీర్ అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(PDP) అధినేత్రి మెహబూబా ముఫ్తీ(Mehabooba Mufthi)ని సోమవారం గృహ నిర్బంధం(House Arrest) చేశారు.
రాంచీలో భూముల క్రయవిక్రయాలు, కొనుగోలు మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఫెడరల్ ఏజెన్సీ ముందు విచారణకు హాజరు కావాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరో సారి సమన్లు పంపింది.
అంతర్వేది సముద్రంలో యువజంట గల్లంతైంది. కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా సముద్ర స్నానానికి పశ్చిమగోదావరి జిల్లా జువ్వలపాలెం గ్రామానికి చెందిన నవ దంపతులు లేలంగి లక్ష్మీనారాయణ, గాయత్రి వచ్చారు.
రాజస్థాన్ రాష్ట్రం కోటా(Kota)లోని విద్యార్థుల వరుస సూసైడ్లు కలకలం రేపిన విషయం విదితమే. అయితే ఆత్మహత్యలను అరికట్టడానికి విద్యార్థుల కోసం అధికారులు హెల్ప్ డెస్క్ ను సెప్టెంబర్ లో ప్రారంభించారు.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దుపై సోమవారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. తీర్పు నేపథ్యంలో కాశ్మీర్ అంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే తీర్పును రాజకీయం చేయవద్దంటూ బీజేపీ వినతి చేసింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.
Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. నిన్నటితో లోకేష్ మూడువేల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో లోకేష్‌తో పాటు సతీమణి బ్రహ్మణి, తనయుడు దేవాన్ష్ అడుగులు వేయనున్నారు.
సీఎం జగన్ రెడ్డి సొంత ఇలాకాలో పోలీస్ అధికారులపై వరుస దాడులు జరుతున్నాయి. దీని వెనుక వైసీపీ నేతల హస్తముందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కడపలో ఇంటెలిజెన్స్ సీఐ అనిల్ కుమార్‌పై వైసీపీ శ్రేణుల ప్రోద్బలంతోనే బీహార్, ఒరిస్సా యువకులు దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దుపై సోమవారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. తీర్పు నేపథ్యంలో కాశ్మీర్ అంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే తీర్పును రాజకీయం చేయవద్దంటూ బీజేపీ వినతి చేసింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.
అనంతపురం: నిన్న (ఆదివారం) ఆత్మహత్యాయత్నం చేసిన ఉపాధ్యాయుడు మల్లేష్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. తన చావుకు సీఎం జగనే కారణమంటూ ఉరవకొండ మండలం, చిన్న ముష్టురు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు మల్లేష్ లేఖ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
తమిళనాడులోని చెంగల్పట్టు సమీపంలో విల్లుపురం నుంచి తొండైర్పేటకు వెళ్లే గూడ్స్ రైలు ప్రమాదవశాత్తూ పట్టాలు తప్పింది. రైలులోని కనీసం ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పడంతో రైల్వే సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ఆదాయపు పన్ను లెక్కల్లో చూపని నగదు విలువ ఆదివారం నాటికి రూ.351 కోట్లకు చేరుకుంది. మొత్తం 176 డబ్బుల సంచులకుగాను అధికారులు ఇప్పటివరకు 140 లెక్కించారు. మరో 36 సంచులు లెక్కించాల్సి ఉంది.
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ఆదాయపు పన్ను లెక్కల్లో చూపని నగదు విలువ ఆదివారం నాటికి రూ.351 కోట్లకు చేరుకుంది. మొత్తం 176 డబ్బుల సంచులకుగాను అధికారులు ఇప్పటివరకు 140 లెక్కించారు. మరో 36 సంచులు లెక్కించాల్సి ఉంది.
యాదాద్రి: పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో భక్తులరద్దీ పెరిగింది. స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ధర్మ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది.
తూర్పు గోదావరి జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర తుని, పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో 219వ రోజు సోమవారం ఉదయం 8 గంటలకు తేటగుంట పంజాబీ దాబా వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది.
నేడు (11-12-2023 - సోమవారం) మేష రాశి వారు ప్రియతముల కోసం విలువైన వస్తువుల సేకరిస్తారు. వేడుకలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. సింహరాశి వారు రియల్ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు, హార్డ్‌వేర్ వ్యాపారులు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి.
రోట వేటర్‌లో పడి వ్యవసాయ కూలీ దర్మరణం చెందిన సం ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం పోల్కంపల్లిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం..
సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి వర్గంలో ఉమ్మడి భూపాలపల్లి జిల్లాకు కీలక మంత్రిత్వ శాఖలు లభించాయి. ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మంత్రి వర్గంలోకి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ములుగు ఎమ్మెల్యే సీతక్కలను తీసుకున్నారు.
మైలార్దేవ్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టాటా నగర్‌లోని ఓ ప్లాస్టిక్ గోదామ్‌లో మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు
భారత్-దక్షిణాఫ్రికా క్రికెట్ జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షార్పణమైంది. ఆదివారం రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండగా.. అంతకంటే ముందు నుంచే భారీ వర్షం...
ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీ్‌సను ఆతిథ్య వెస్టిండీస్ 2-1తో సొంతం చేసుకొంది. శనివారం రాత్రి జరిగిన సిరీస్ నిర్ణాయక మూడో వన్డేలో విండీస్ 4 వికెట్లతో...
అదానీ గ్రూప్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా వచ్చే పదేళ్ల కాలం లో రూ.7 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ...
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం మిశ్రమంగా కదలాడే సూచనలు కనిపిస్తున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఇప్పటికే జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరాయి. దీంతో ఇన్వెస్టర్లు ఈ వారం లాభాల...
నిఫ్టీ గత వారం బుల్లి్‌షగా ప్రారంభమై 21000 వరకు వెళ్లి చివరికి అదే స్థాయిలో ముగిసింది. చివరి మూడు ట్రేడింగ్ సెషన్లలో కన్సాలిడేషన్, సైడ్‌వేస్ ధోరణిని ప్రదర్శించినా చివరికి సుమారు 700...
వడ్డీరేట్ల పెరుగుదల, ద్రవ్యోల్బణం, డిమాండ్‌లో వృద్ధి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలను దెబ్బతీస్తోంది. మధ్య, ఎగువ మధ్యతరగతి కొనుగోలుదారులు...
సాగు చట్టాల రద్దు కోసం పోరాడిన రైతులపై మోపిన కేసులను రద్దు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అలాగే ఈనెల 11, 12, 13 తేదీల్లో జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రాలు పంపాలని నిర్ణయించింది.
తనపై పద్య గానం చేసిన హరియాణా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ మనవరాలు జశోధర(5)ను ప్రధాని మోదీ అభినందించారు. ‘ఆమె మాటలు గొప్ప శక్తికి మూలం’ అని ఆయన ఎక్స్(ట్విటర్)లో పేర్కొన్నారు.
పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. కార్తీకమాసం ముగుస్తుండటం, సెలవు రోజుతో పాటు స్వాతి నక్షత్రం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి నృసింహుడిని దర్శించుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన కరెంటు బిల్లుల మొండి బకాయిలు రూ.28,140 కోట్లు. కేంద్ర ప్రభుత్వ విభాగాలు బకాయిపడిన రూ.721 కోట్ల కరెంటు బిల్లులను కూడా కలుపుకుంటే..
పవిత్ర శబరిమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుణ్యక్షేత్రంలో అత్యంత రద్దీ నెలకొంది. స్వామి దర్శనానికి క్యూలైన్లలో 18 గంటలు నిరీక్షించాల్సి వస్తోంది.
బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి మేనల్లుడు ఆకాశ్ ఆనంద్(28)ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. ఆదివారం లఖ్‌నవూలో జరిగిన బీఎస్పీ అఖిల భారత సమావేశంలో ఆమె ఈ మేరకు ప్రకటన చేసినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్రంలో సంపదను సృష్టించి, ప్రజలకు పంచుతామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
మాజీ సీఎం కేసీఆర్ రెవెన్యూ ఉద్యోగులను బద్నాం చేసి.. అన్ని రకాల భూములను మాయం చేశారని ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. సమాజం ముందు రెవెన్యూ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరించి భూములను కాజేశారని ఆరోపించారు.
ఎన్కౌంటర్లు లేని తెలంగాణను ప్రజలు కోరుకుంటున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలిపింది. ప్రజా ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని కోరింది.
: ఝార్ఖండ్‌లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహూ ఇంట్లో ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.290 కోట్ల నగదు ఎక్కడిదో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి పలు శాఖలకు చెందిన అధికారులు రాజీనామాలు చేస్తుండగా, మరికొందరు తమను రిలీవ్ చేయమంటూ ఉన్నతాధికారులకు లేఖలు రాస్తున్నారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్నిక సోమవారం జరుగనుంది. గత వారం అసెంబ్లీకి ఎన్నికైన 163 మంది ఎమ్మెల్యేలు ఽశాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు భోపాల్‌లో సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం కానున్నారు.
కేసుల నుంచి బయటపడేందుకు కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వంలోని ఒక పవర్ఫుల్ మంత్రి 50-60 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిపోయేందుకు కాషాయపార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారని జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్డీ కుమారస్వామి సంచలన ఆరోపణ చేశారు.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం(ఎంసీఆర్ హెచ్ఆర్డీసీ)లో ఏర్పాటు కానుందా ? అంటే ప్రస్తుతం అవుననే సమాధానమే వస్తుంది.
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేయటం రాజ్యాంగబద్ధమేనా అన్నదానిపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది.
విద్యుత్తు వినియోగదారులపై స్మార్ట్ మీటర్ల చార్జ్ వేసేందుకు డిస్కమ్‌లు సిద్ధమయ్యాయి. 2024-25 నుంచి 2028-29 బహుళ ఆర్థిక సంవత్సరాల వార్షిక వాస్తవ ఆదాయ నివేదిక (ఏఆర్ఆర్)లను
ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రులు అనుకున్నవే చట్టాలుగా మారిపోతున్నాయని కేంద్ర న్యాయశాఖ మాజీ కార్యదర్శి, హిమాచల్‌ప్రదేశ్ మాజీ చీఫ్ జస్టిస్ ఎంఎన్ రావు వ్యాఖ్యానించారు. సిటిజన్ ఫర్
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే కాక, తాము దాచుకున్న సొమ్మును సైతం దారిమళ్లించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని విధాలుగా తమకు ద్రోహం చేసిన జగన్ సర్కార్ మరోసారి ఎందుకని
తమకు అన్యాయం చేయొద్దని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వేడుకున్నారు. పాతికేళ్లుగా పనిచేస్తున్నా.. ఇంతవరకు రెగ్యులరైజేషన్‌కు నోచుకోలేదని వాపోయారు. దగా చేయకుండా తమను ఆప్కాస్ పరిధిలోకి తీసుకురావాలని, మినిమం టైమ్ స్కేల్స్
‘‘ఈ ప్రభుత్వంలో అక్షరాలా 23 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓవైపు ప్రభుత్వ బడులు బాగుచేయాలి. టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. మన పిల్లలకు బాగా చదువులు చెప్పాలి. కానీ, ఈ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోవట్లేదు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ
బీఆర్ఎస్ సర్కారు హయాంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారుల తరువాత.. వేటు కార్పొరేషన్ల చైౖర్మన్లపై పడింది. ఏకకాలంలో 54 మంది కార్పొరేషన్ల చైర్మన్ల పదవులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది.
: ‘‘ముఖ్యమంత్రి జగన్‌ది అద్భుత నటన. ఆయన నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాష్ట్రంలో మూడు నెలల్లో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని, జగన్‌ను ప్రజలు బంగాళాఖాతంలో
ప్రకృతికో భాష ఉంది. నదులు, కొండలు, కీకారణ్యాలు, జంతువులు, పక్షులు, సరీసృపాలు అన్నింటికీ ప్రకృతికి అనుసంధానమైన భాషలు ఉన్నాయి. మనుష్య జాతులకు భాషలున్నట్లే ప్రతీప్రాణికీ భాషలున్నాయి...
ఏదైనా కొత్త విధానం తీసుకొస్తే పాత విధానం కంటే మెరుగ్గా ఉండాలి. ప్రజలకు సేవలు సులభతరంగా, మరింత ప్రయోజనం కలిగించేలా ఉండాలి. అయితే జగన్ సర్కారు అంతా ‘రివర్స్’ కదా! గత నాలుగున్నరేళ్లలో ఎన్నో ‘రివర్స్’ విధానాలతో వ్యవస్థలను అస్తవ్యస్తం చేసింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలో వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. తమ అక్రమాలకు, ఎంజాయ్‌మెంటుకు అడ్డొస్తే సహించమంటూ వారి స్టైల్లో పోలీసులపైనే దాడులకు తెగబడుతున్నాయి. ఇప్పటిదాకా టీడీపీ, ఇతర ప్రతిపక్షాలే
అబ్బూరి వరదరాజేశ్వరరావు అనువాదంలో చేయి తిరిగిన గాఢతృష్ణ కల్గిన కవి అని అతని అను వాదాలు నిరూపిస్తాయి. ఏ కవైనా ఇంకో కవిని అనువాదంలోకి తీసుకొచ్చినప్పుడు ఆ కవికి...
సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ అమలు చేయకపోవడం, ప్రతినెలా జీతాలు ఆలస్యమవుతుండడంతో మనస్తాపం చెంది ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు యత్నించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నముష్టూరు గ్రామానికి చెందిన
ఆరోగ్యశ్రీ అధికారులు నెట్వర్క్ ఆస్పత్రులతో ఆడుకుంటున్నారు. ఇచ్చిన మాటలో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో నిలబెట్టుకోలేకపోతున్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్‌కు అనేక సార్లు మాట ఇవ్వడం, ఆ తర్వాత తప్పడం అలవాటుగా మారింది. బిల్లుల చెల్లింపు దగ్గర నుంచి
పవిత్ర కార్తీకమాసంలో నిర్వహించే కార్తీక వనభోజనం సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతీక అని పద్మభూషణ్ అవార్డు గ్రహీత, భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎల్లా కృష్ణ
సాధ్యం కాని టార్గెట్లు పెట్టి పంచాయతీరాజ్ ఇంజనీర్లను వేధించడం సరికాదని, ఉన్నతాధికారులు, కలెక్టర్లు ఇదే ధోరణి అవలంభిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఏపీ పంచాయతీరాజ్ ఇంజనీర్ల అసోసియేషన్ రాష్ట్ర
‘రాజకీయాల కోసం నా ఆస్తులను పోగొట్టుకున్నానే తప్ప ఎవ్వరినీ మోసం చేయలేదు. నేను చదువుకునే రోజుల్లో నా స్నేహితులు ఏదైనా అవసరం ఉందంటే నా వద్ద లేకపోయినా ఇంట్లో తీసుకొని వచ్చి ఇచ్చిన గుణం నాది. ల్యాండ్ సీలింగ్
మిచౌంగ్ తుఫాన్ పొగాకు రైతులనూ దెబ్బతీసింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో రెల్పుకు సిద్ధంగా ఉన్న తోటలు ఇటీవలి తుఫానుకు పూర్తిగా నీటిలో నాని వేళ్లు
ఏజీ అండ్ ఎస్జీఎస్ కళాశాలలో రెండు రోజులుగా కృష్ణా విశ్వవిద్యాలయ 12వ అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి. విశ్వ విద్యాలయ పరిధిలో పలు కళాశాలల నుంచి పలు వురు విద్యార్థులు పోటీల్లో పాల్గొని ప్రతిభ కనపరుస్తున్నారు.
సోమల మండలం 81 చిన్నఉప్పరపల్లె పంచాయతీ కమ్మపల్లెలో శనివారం రాత్రి జరిగిన గొడవలో పోలీసులు తెలుగుదేశంపార్టీ వర్గీయులపై హత్యాయత్నం కేసు, వైసీపీ వర్గీయులపై బెయిలబుల్ కేసులు ఆదివారం రాత్రి నమోదు చేశారు.
‘ఎట్టి పరిస్థితుల్లో గుడివాడ గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేద్దాం.. కొడాలి నానిని బొంద పెడదాం.. ఇదే మన నినాదం.. అదే మన విధానం..’ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
డ్రెయిన్లు, మురుగు కాల్వల నిర్వహణలో ప్రభుత్వ వైఫ్యల్యం రైతులను నిండాముంచిందని టీడీపీ మండల అధ్యక్షుడు యెనిగళ్ల కుటుంబరావు, నియోజకవర్గ తెలుగు రైతు నాయకుడు కాకాని శ్రీనివాసరావు ఆరోపించారు.
తుఫాన్ వెళ్లి ఐదురోజులైనా చేలలో నీళ్లు కదలకపోవటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పంటకోసే అవకాశంలేక పలువురు రైతులు దున్నేస్తున్నారు. 400 ఎకరాల్లో పంట నీటమునిగి రోజులు గడుస్తున్నా నీరుపోయేందుకు అధికారులు ఏవిధమైన చర్యలు చేపట్టకపోవటంతో ధాన్యం మెలకెత్తుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు మునిగిన పొలాల నుంచి ఇప్పటి వరకు నీరు తగ్గకపోవడంతో వరి పనలు, వరిపంట మురిగి పోతున్న పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతు న్నారు. వర్షాలు తగ్గి నాలుగు రోజులు దాటినా మండ ల పరిధి పలు గ్రామాల పొలాల్లో ఇంతవరకు నీరు బటయకు పోక కొన్నిచోట్ల ధాన్యం నుంచి మొలకలు, మరి కొన్ని ప్రాంతాల్లో కోత కోసేందుకు వీలులేకుండా పంట నీటిలో మునిగి ఉంది.
రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో కీలక భూమిక వహించే సాగునీటి ప్రాజెక్టులకు ఏ ప్రభుత్వమైనా అత్యంత ప్రాధాన్యం ఇస్తుంటుంది. కానీ నాలుగున్నరేళ్లుగా సీఎం జగన్ వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏటా బట్జెట్‌లో ఘనంగా కేటాయింపులు చేస్తున్నా.. నిధుల విడుదలకు చేతులు రావడం లేదు.
తప్పులు లేని ఓటరు జాబితాలను రూపొందించే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఓటరు జాబితాల సవరణ కార్యక్రమాన్ని చేపట్టారు. నమోదు, తొలగింపు, సవరణకు దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 9వ తేదీ శనివారంతో ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,01,146 దరఖాస్తులు అందాయి.
విజయనగరం జిల్లాలో వైసీపీకి చెందిన ఓ కీలక నేత ఊక వ్యాపారంలో రాటుతేలిపోయారు. ‘‘అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం.. ఊకను తక్కువ ధరకు ఇవ్వాల’’ంటూ మిల్లర్లకు హుకుం జారీచేసి లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. గతేడాది మిల్లర్లను భయపెట్టి వందల కొద్దీ ఊక
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర సోమవారం సాయంత్రం కాకినాడ జిల్లాలో ముగించుకుని పాయకరావుపేట వద్ద అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించనున్నది. ఈ సందర్భంగా లోకేశ్‌కు ఘనస్వాగతం పలికేందుకు ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
నౌకాదళ దినోత్సవం సందర్భంగా విశాఖ సాగ ర తీరంలో ఆదివారం నిర్వహించిన నేవీ విన్యాసాలు ఆద్యంతం అలరించాయి. ఏటా డిసెంబరు 4న విన్యాసాలు నిర్వహిస్తుంటారు. కానీ ఈ ఏడాది మిచౌంగ్ తుఫాన్ కారణంగా 10వ తేదీకి వాయిదా వేశారు. ఈ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీపీఎస్ ఉద్యోగులను నమ్మించి మోసం చేశారని ఏపీ సీపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు రొంగలి అప్పలరాజు ఆరోపించారు. ఆదివారం అనకాపల్లిలో నిర్వహించిన సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగుల ఓట్ల కోసం జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లయినా అమలు చేయలేదని అన్నారు.
మన్యంలోని పర్యాటక ప్రాంతాలకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. ప్రస్తుతం కార్తీక మాసం, పిక్నిక్ల సీజన్‌ను కావడంతో పాటు శని, ఆదివారాలు వరుస సెలవులు రావడంతో జనం మన్యం బాటపట్టారు. దీంతో ఆదివారం ఎక్కడ చూసినా పర్యాటకుల రద్దీ కనిపించింది.
ఏజెన్సీలోని అటవీ సంపద పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(ఏపీ పీసీసీఎఫ్- రీసెర్చ్, ఐటీ) అజయ్‌కుమార్ నాయక్ తెలిపారు. ఆదివారం స్థానిక డీఎఫ్‌వో చిట్టపుల్లి సూర్యనారాయణతో కలిసి ఆయన చింతపల్లి, జీకేవీధి మండలాల్లో పర్యటించారు. కృష్ణాపురం పైన్ తోటలు, చింతలూరు టింబర్ డిపో, ఆర్వీనగర్ ఏపీ ఎఫ్డీసీ కాఫీ తోటలను ఆయన పరిశీలించారు.
మండలంలో తాళ్లపాలెం నుంచి నర్సీపట్నం వెళ్లే రోడ్డులో తాళ్లపాలెం వారపు సంత సమీపంలో ఉన్న పోలవరం కాలువ వద్ద భారీ వాహనాలు కూరుకుపోతున్నాయి. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభిస్తున్నది. ఇక్కడ రోడ్డు పూర్తిగా ఛిద్రమై భారీ గొయ్యి ఏర్పడింది.
మన్యంలో చలి జనాన్ని వణికిస్తున్నది. మిచౌంగ్ తుఫాన్ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. ఆదివారం చింతపల్లిలో 11 డిగ్రీల సెంటీగ్రేడ్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఎం.సురేశ్‌కుమార్ తెలిపారు.
రహదారి సౌకర్యం లేకపోవడంతో ఓ నిండు గర్భిణిని డోలీలో నాలుగు కిలో మీటర్లు కొండలు, వాగులు దాటుకుంటూ తీసుకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంజరి పంచాయతీ మూలలోవ గ్రామానికి చెందిన అరడ పార్వతమ్మ నిండు గర్భిణి. ఆమెకు ఆదివారం పురిటి నొప్పులు అధికం కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేందుకు సెల్ సిగ్నల్ గల ప్రదేశానికి వెళ్లి 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. అయితే గ్రామానికి ఫీడర్ అంబులెన్స్ కూడా వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో చేసేది లేక ఆశ కార్యకర్త, గ్రామస్థుల సహాయంతో దుప్పటిని కర్రకు కట్టి డోలీ తయారు చేసి అందులో పార్వతమ్మను ఉంచి నాలుగు కిలోమీటర్లు మేర దట్టమైనా కొండలు, వాగులు దాటుకుంటూ అతి కష్టమ్మీద తల్లాబు గ్రామం వరకు చేర్చి అక్కడ నుంచి అంబులెన్స్‌లో ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు.
మునిసిపల్ కార్మికుల అపరిష్కృత సమస్యలపై డిసెంబరు 27 నుంచి సమ్మె నిర్వహిస్తున్నట్టు ఏపీ మునిసిపల్ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ ఆసుల రంగనాయకులు చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు,
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు బి.రాజేంద్రప్రసాద్ నాయకత్వంలో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో నియోజకవర్గం సర్పంచ్ల సమావేశం ఆదివారం సాయంత్రం జిల్లాసర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పాల లక్ష్మణరావు అధ్యక్షతన జరిగింది.
ప్రకృతిని పరిరక్షించడమే వనసమారాధనల ప్రధా న ధ్యేయమని ప్రకృతిని మనం ఎంత ప్రేమిస్తే అది మానవులకు అంత మేలు చేకూరుస్తుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
జిల్లా అంతటా ఈ ఆదివారం ప్రత్యేక సందడి కనిపించింది. కార్తీకమాసం చివరి వారం కావడంతో అన్నిచోట్లా పిక్నిక్ల కోలాహలం నెలకొంది. చిన్నలు.. పెద్దలు కలిసి ఉత్సాహంగా గడిపారు. ఆటలు.. పాటల పోటీలు పెట్టుకున్నారు.
మిచౌంగ్ తుఫాను భారీ నష్టాన్ని మిగిల్చిందని, రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఓ ప్రైవేటు హోటల్లో మాజీ ఎమ్మెల్యేలు పతివాడ నారాయణ స్వామి నాయుడు, డాక్టరు కేఏ నాయుడులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
మిచౌంగ్ తుఫాన్ తెచ్చిన కష్టం నుంచి రైతులు తేరుకుంటున్నారు. తడిచిన పనలను ఆరబెడుతున్నారు. ముంపులో ఉన్న ధాన్యం కుప్పల నుంచి కంకిలను వేరు చేస్తున్నారు. ఇంకొందరు కోతలను వేగవంతం చేశారు.
తుఫాన్ కారణంగా పంట నష్టాన్ని అంచనావేయడంలో జగన్‌రెడ్డి ప్రభుత ్వం పూర్తి విఫలమైందని, రైతుకుటుంబాలు పడుతున్న అవస్థలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం గౌడ్ అన్నారు.
వైసీపీ పాలనలో అన్నీ రివర్స్ నిర్ణయాలే. రివర్స్ టెండరింగ్‌తో అభివృద్ధి పనులు అటకెక్కాయన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. బడుల విషయంలోనూ రివర్స్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి... వెనక్కు లాగేస్తోంది ప్రభుత్వం.
న్యాయవిద్యా కోర్సుల్లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా అర్హులైన విద్యార్థులకు కన్వీనర్ కోటాకింద సీట్లను అలాట్ చేసింది. అయితే సంబంధిత విద్యార్థులను చేర్చుకోవాల్సిన కళాశాల యాజమాన్యం పలు కొర్రీలను పెడుతోంది.
బ్యాడిగ మిరప వైపు దృష్టి సారించిన మండలంలోని అన్నదాతలకు కొత్తగా నల్లి బెడద ఎదురైంది. లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగుచేస్తున్న మిరపకు మొదట వైరస్ దాపురించగా, ప్రస్తుతం నల్లి పురుగు ఆశించింది. ఎన్ని మందులు పిచికారి చేసినా అది నివారణకాక పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.
‘‘రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్ర హాలకు, దళితులకు రక్షణ కరువైంది. గుంటూరు జిల్లా పొన్నూరులో ఒక వ్యక్తి అంబేడ్కర్‌ను అవమానించేలా విగ్రహం వద్ద మూత్ర విసర్జన చేయడం దారుణం. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి’’ అని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎస్సీ సెల్ చైర్మన్ సూర్య ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో కురిసిన వర్షాల ప్రభావం నుంచి అన్నదాత ఇంకా తేరుకోలేదు.ఐదురోజులుగా పంటలు నీటిలోనే ఉన్నాయి. మిచౌంగ్ తుఫాన్‌తో రికార్డు స్థాయిలో 21 సెంటీమీటర్ల వర్షం పాతం నమోదుకావడతో మండలంలో వేలాది ఎకరాల్లో వరి పంట నీటమునిగింది.
స్థానిక పెద్ద చెరువులో టన్నుల కొద్ది చేపలు మృత్యువాత పడడానికి కారణమైన ఫార్మా కంపెనీలపై చర్యలు చేపట్టాలని ఆయకట్టు రైతులు ఆదివారం పరవాడ సీఐ పెదిరెడ్ల ఈశ్వరరావుకు ఫిర్యాదు చేశారు.
మండలంలోని కొట్టాలు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తమిళనాడు సరిహద్దులో అడుసుని ట్రాక్టర్‌తో దున్నుతుండగా ఆ ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తాపడటంతో ఆవ్యక్తి మృతిచెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.
వర్షాలు ఆగి నాలుగు రోజులైనా వరద తీవ్రత తగ్గడం లేదు. విజయపురం మండలంలోని గొల్లకండ్రిగ వద్ద తిరుత్తణి- నాగలాపురం రోడ్డులో నూతనంగా రోడ్డు నిర్మాణం జరిగినప్పుడు తూము పూడిపోయింది.
ఉపమాక జగనన్న కాలనీ బురదలో కొట్టుమిట్లాడుతున్నది. ఈ కాలనీలో అయ్యన్నపాలెం, ఉపమాక, నక్కపల్లి, బోదిగల్లం, జానకయ్యపేట గ్రామాల లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వీరిలో కొందరు ఇళ్లు నిర్మించుకున్నారు.
మాడుగుల జనసైనికుడు గుణసాయి ఆత్మహత్యాయత్నానికి కారణమైన మాడుగుల ఎంపీపీ వేమవరపు రామధర్మజ, అతని కుమారుడు సాయిచందన్పై 24 గంటల్లో కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు డిమాండ్ చేశారు.
వ్యవసాయశాఖ నాలుగున్నరేళ్ల కిందట వరకు రాయితీపై టార్పాలిన్లు (పరదాలు) రైతులకు అందించేది. మార్కెట్ ధరలో యాబై శాతం రైతుల నుంచి తీసుకుని మిగతా మొత్తం ప్రభుత్వం భరించేది. ఒక్కో రైతుకు రెండేసి టార్పాలిన్లు ఇవ్వడంతో వాటిని వినియోగించుకునేవారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అనకాపల్లి జిల్లాలో సోమవారం నుంచి చేపట్టనున్న యువగళం పాదయాత్రను అన్నివర్గాల ప్రజలు జయప్రదం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు పిలుపునిచ్చారు.
హుద్‌హుద్ ఇళ్లలో కనీస సౌకర్యాలు లేక లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టెక్కలి గోపినాథపురం సమీపంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో హుద్‌హుద్ ఇళ్లను నిర్మించారు
రెండేళ్ల నుంచీ ప్రకృతి ప్రకోపానికి రైతులు నష్టపోతున్నారు. గతేడాది వరికోతలు సమయంలో విస్తారంగా వర్షాలు కురవడంతో పంట నష్టం వాటిల్లింది. కల్లాల్లోనే ధాన్యం నానిపోయాయి.
భవన నిర్మాణ రంగ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసి కార్మికుల సంక్షేమానికి తూట్లు పొడిచిన జగన్ ప్రభుత్వానికి భవిష్యత్‌లో కార్మికులు తగిన గుణపాఠం చెబుతారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ ఉమ్మర్వలి హెచ్చరించారు.
ఊరుపొమ్మన లేదు నగరం రమ్మన లేదు సొంతిల్లు లేనే లేదు ఉజ్వల భవిష్యత్తును కాంక్షించి ఎన్నుకున్న దారి! చెల్లించే మొత్తానికి తగిన ఇల్లు ఎప్పుడూ అక్కున చేర్చుకుంటుంది!...
రాష్ట్రంలో వైసీపీ పతనమే లక్ష్యంగా పోరాడుదామని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. వైసీపీ విముక్తి ఆంధ్రా కోసం టీడీపీతో కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
భారతదేశాన్ని 2047కల్లా ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా నిలిపే విధంగా ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ని కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు చేపడుతుందని కేంద్ర పౌర విమానయాన, ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా పేర్కొన్నారు.
ఎన్నో పోరాటాలు చేసి స్వరాష్ట్రం సాధించిన మలిదశ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం తగిన గుర్తింపు నిచ్చిందని మలిదశ ఉద్యమకారుల సంఘం మండల అధ్యక్షుడు కాటం వెంకటేశం అ న్నారు.
కార్తీకమాసం చివరి ఆదివారం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటె త్తారు. అనివెట్టి మండపంలో నిర్వహించిన సూర్యనమస్కారాల కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రక్రియ శనివారంతో ముగిసింది. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు ఎన్నికల కమిషన్ జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించగా.. ఫారం- 6, ఫారం - 7, ఫారం - 8కు సంబంధించి 1,61,628 వినతులు వచ్చాయి.
వివాహితపై యాసిడ్ దాడి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధంలో ఏర్పడిన మనస్పర్థల కారణంగానే యాసిడ్ దాడి జరిగినట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలు శనివారం రాత్రి ఫిర్యాదు చేయగా, ఆదివారం కేసు నమోదు చేసినట్టు సీఐ మరిడాన శ్రీనివాసరావు తెలిపారు.
తుని రూరల్, డిసెంబరు 10: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం లోవ దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనార్ధం తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. వేకువ జామున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అర్చకస్వాము లు భక్తులకు దర్శన భాగ్యం క
పెద్దాపురం, డిసెంబరు 10: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కిరాణా దుకాణం దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని కాండ్రకోటలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఏడీ ఎఫ్‌వో ఎం.శ్రీహరి జగన్నాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పాబోలు సత్యకృష్ణకు చెందిన కిరాణా దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవిం
స్వర్ణముఖి నదీ హారతులకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 10వ తేదీన మంగళవారం కార్తీక మాసం అమావాస్య పరిష్కరించుకుని స్వర్ణముఖి నది హారతులు శాస్త్రోక్తంగా సమర్పించనున్నారు.
కురుపాం మండలం గిరిశిఖర గ్రామమైన టొంపలపాడులోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల ఆకలి కేకలు మిన్నంటుతు న్నాయి. 42 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా ప్రతిరోజూ కేవలం 10 మంది మాత్రమే స్కూలుకు హాజర వుతున్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తేనే ప్రజల భవిష్యత్‌కు గ్యారెంటీ ఉంటుందని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. ఆదివారం ఉమ్మడి జిల్లాలో బాబూ ష్యూరిటీ భవిష్యత్‌కు గారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. బాండ్లు పంపిణీచేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమలుచేసే పథకాలు వివరించారు. వైసీపీప్రభుత్వ వైఫలాలను తెలియజేస్తూ ప్రచారం నిర్వహించారు.
జిల్లాలోని పార్వతీపురం, కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు అనంతరం ఈ కార్య క్రమానికి కొన్ని రోజులు బ్రేక్ పడింది. అయితే, చంద్రబాబు బెయిల్‌పై విడుదలైన తర్వాత టీడీపీ నాయకులు మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు.
దేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రంగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల అన్వేషణలో కేంద్రం చుట్టూ తిరుగుతూ బిచ్చమెత్తుకునేలా సైకో సీఎం జగన్‌రెడ్డి మార్చేశారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గెలుపు తీరం వరకు తీసుకవెళ్లి నిరాశమిగిల్చినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తన స్థానాన్ని పదిలపరుచుకునేందుకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి
రాజకీయాల్లోకి వస్తానని, ఎమ్మెల్యేగా గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అలాంటిది పాలకుర్తి ప్రజల ఆశీస్సులతో అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టాను. చాలా సంతోషంగా ఉంది. అదే సమయంలో మా ప్రాంతాన్ని అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్లడమే నా ప్రధాన లక్ష్యం కూడా.
రైతులు పండించిన పంటలను ఏనుగులు నాశనం చేస్తున్నాయి. మండలంలో గుణానుపురం గ్రామ సమీపంలో ఏనుగులు సంచరిస్తు న్నాయి. పంట పొలాల్లోకి వెళ్లి వరి పనలను చిందరవం దర చేస్తున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 11 మంది ఉపాధ్యాయులు, ఐదువేల మంది అవుట్సోర్సింగ్,కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇప్పటికి జీతాలు చెల్లించక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు తెలిపారు. ఆదివారం సాలూరులో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులకు ఒకటో తేదీకి జీతాలివ్వకుండా వేధిస్తున్న ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. ఒకటో తేదీకి జీతాలు అనే విషయం ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యో గులు, పెన్షనర్లు మరచిపోయారన్నారు. గతంలో ఒకటో తేదీకి జీతాలు, పింఛన్లు ఇవ్వకపోతే ప్రభుత్వాలు నామోషిగా భావించేవన్నారు. వైసీపీ ప్రభుత్వం పదో తేదీ దాటిన జీతాలివ్వకపోయిన సిగ్గుపడడం లేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సైతం ఉద్యోగ,ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలివ్వకుండా వేధించడం తగదన్నారు. పీఆర్సీ కమిటీ వేసిన దానికి అతీగతీ లేకుండా చేశారన్నారు. సీపీఎస్ రద్దుపై మడమ తిప్పారన్నారు. కార్యక్రమంలో ఈశ్వరరరావు,స్వప్న, రవి పాల్గొన్నారు.
పలాస రైల్వే స్టేషన్‌కు కిలోమీటరు దూరంలో ఆదివారం సాయంత్రం భువనేశ్వర్ వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి 33 ఏళ్ల వయస్సు కలిగిన మహిళ ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే ఎస్ఐ తెలిపారు.
ఉత్తరాంధ్ర జిల్లాలకు నాలుగేళ్లుగా నీవు ఒరగబెట్టిందేమిటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ఆది వారం సాయంత్రం టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ విశాఖపట్నం రైల్వే జోన్ అని అయితే అది ఇప్పటికీ కార్యరూపం దాల్చ లేదన్నారు.
డాక్టర్ చిట్టెం పర్ణికా రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి... మొన్నటి వరకు ఒక వైద్య విద్యార్థిని మాత్రమే. ఇప్పుడు ఆమె నారాయణపేట ప్రజాప్రతినిధి కూడా. పాలకుర్తి ఎమ్మెల్యే
ప్రతి విద్యార్థి హక్కులతో పాటు బాధ్యతలను విస్మరించవద్దని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.శ్యాంబాబు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కళాశాలలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుప త్రి నర్సింగ్ సూపరింటెండెంట్ సోఫియా సౌదామని మాట్లాడుతూ విద్యార్థులు మంచి లక్షణాలను అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బి.జయమణి, అధ్యాపకులు ఎం.శాంతి, కె.శ్రీనివాసరావు, సీహెచ్ రాఘవేం ద్రనాయుడు, పి.రాజ్యలక్ష్మి, కుమారి, ప్రశాంతి, సోమిత్రాజ్, జమ్మయ్య, ఉపేంద్ర పాల్గొన్నారు.
వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలపై ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఈ నెల 15 నుంచి జనవరి 24 వరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ వంటి పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
జంపరకోట రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయాలని సీపీఎం మండల కమిటీ నాయకుడు దావాల రమణారావు డిమాండ్‌చేశారు. పాలకొండలో ఎన్నాళ్లీ వెనుకబాట, వలసబాట కార్యక్రమంపై ఈనెల 17న పార్వతీపురంలో జరిగే జిల్లా సమగ్ర అభివృద్ధి సదస్సు పోస్టరను ఆదివారం ఆవిష్కరించారు. కార్య క్రమంలో లక్ష్మణరావు, నారాయణరావు, రాము, దుర్గారావు పాల్గొన్నారు.
అగ్రిగోల్డ్ బాధితులను వెంటనే ఆదుకోవాలని డిపాజిటర్లు, ఏజెంట్ల అసోసి యేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయసింహ, రాష్ట్ర మమాళా కార్యదర్శి ఆరుద్రమ్మ డిమాండ్ చేశారు. కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద సీపీఐ జిల్లా నాయకుడు చాపర వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆదివారం బాధి తులు, ఏజెంట్లు నిరసన దీక్ష చేపట్టారు.
డా. వైఎస్సార్ ఉచిత పంటల బీమాను కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి పసల బీమా యోజనతో సంయు క్తంగా అమలు చేసే పథకానికి సంబంధించి 2023–24 ఖరీఫ్, రబీ సీజన్లో ఈ పథకాన్ని అమలు చేసే బీమా కంపెనీలు, బీమా వర్తించే పంటల వివరాలను తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
జిల్లాకు ఈనెల 18న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి.పురం దేశ్వరి రానున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివా రం పార్వతీపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో బీజేపీ పథకాలు, కార్యక్రమాల అమలు, పార్టీ అభివృద్ధి, పనితీరుపై పరిశీలిస్తారని చెప్పారు. అయో ధ్యలో రామ మందిర నిర్మాణానికి ఎన్నో వ్యయప్రయాసలు పడిన కరసేవకులకు ధన్యవాదాలు తెలిపారు. అటువంటి కరసేవకులు జిల్లాలో ఉంటే కార్యాలయా నికి వచ్చి తెలియజేయాలని కోరారు. ఈనెల 25న సుపరిపాలన దినాన్ని ప్రతి గ్రామంలో పండుగలా జరుపుకొనేలా నాయకులు, కార్యకర్తలు ప్రణాళిక లు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఎన్. జయరాజు, జిల్లా పార్టీ ఇన్చార్జి సూర్యప్రకాష్, జిల్లా నాయకులు తిరుపతిరావు, అప్పలనాయుడు, మురళి పాల్గొన్నారు.
పంచాయతీలకు నిధులు లేక, సర్పం చ్‌లకు అధికారాలు లేక ఈ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని ఉమ్మడి శ్రీకా కుళం జిల్లాల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్ అన్నారు. ఆదివారం రాంపురం, నారాయణ వలస గ్రామాల్లో ప్రజల నుంచి సమ స్యలను తెలుసుకున్నారు.
తనను భారీ మెజార్టీతో గెలిపించి, అసెంబ్లీకి పంపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని, నిత్యం అందుబాటులో ఉండి సేవకుడిలా పని చేస్తానని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ధర్మపురి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటి సారిగా ధర్మపురి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.
మెళియాపుట్టి మండలం గోకర్ణపురం వైసీపీ సర్పంచ్ సేనాపతి రవి కుమార్ ఆదివారం జన సేన పార్టీలో చేరారు. శ్రీకాకుళంలో ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆయనకు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.
చొప్పదండిని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దు తానని నియోజకవర్గ నూతన ఎమ్మెల్యేగా ఎన్నికైన మేడిపల్లి సత్యం అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం ఆదివారం తొలి సారిగా కొండగట్టుకు వచ్చిన సత్యం ఆంజనేయస్వామి ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.
శ్రీ కృష్ణదేవరాయ బలిజ సంఘం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం తాడిపత్రి రోడ్డులోని జేజే కాలనీ ఆవరణ లో కార్తీక మాస వనోభోజన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వ హించారు.
మండలంలోని సుంకిశాల గ్రా మంలోని శ్రీ వేంకటేశుడి కల్యాణ వేడుకలు ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో కల్యాణ వేడుకలు కొనసాగాయి. ఆలయం నుంచి ముత్యాల పల్లకిలో భక్తుల గోవింద నామస్మరణ నడుమ కల్యాణ మండపం వద్దకు గోవిందుడిని తోడ్కొని వచ్చారు.
సోనియమ్మ మాట మేరకు ప్రారంభించిన మహాలక్ష్మి పథకం వల్ల రాష్ట్రవ్యాప్తంగా మహిళలల్లో ఆనందం వెల్లివిరుస్తోందని వైద్య ఆరోగ్యశాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు.
పెద్దాపురం, డిసెంబరు 10: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆదివారం కట్టమూరులో పర్యటించా రు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బిక్కిన విశ్వేశ్వరరావు ఆహ్వానం మేరకు ఆయన స్వగృహానికి విచ్చేశారు. ఆమెకు విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. కాకినా డలో శ్రీపీఠానికి వెళు
రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా పేద ప్రజల పక్షాన పోరాడేది, ప్రజా సమస్యలపై పాలకులను నిలదీసేది కమ్యూనిస్టులేనని మాజీ ఎమ్మెల్సీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుప ల్లి సీతారాములు అన్నారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవన్లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లా కేంద్రం నల్లగొండ నుంచి ముశంపల్లి మీదుగా ధర్మాపురం వరకు రూ.100 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం చేపడతామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని సచివాలయంలోని ఐదో అంతస్థులో తన కార్యాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.
సామర్లకోట, డిసెంబరు 10: కార్తీకమా సపర్వదినాలు పురస్కరించుకుని ఆదివా రం సామర్లకోట కుమార రామ భీమే శ్వరాలయంలో విశేష పూజలు నిర్వహిం చారు. గోపూజలతో ప్రారంభించారు. ఛీఫ్ ఫెస్టివల్ అధికారి, దేవదాయ సహాయ కమిషనర్ అల్లు వెంకటదుర్గాభవాని, ఆలయ ఈవో తలాటం వెంకట సూర్యనా
పిఠాపురం, డిసెంబరు 10: వైసీపీ అరాచక పాలనతో ఇబ్బందులు, సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పా దయాత్ర ద్వారా భరోసా లభించిందని, వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అ
పలు కారణాలతో ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల వివరాలను ఏడాదిన్నర క్రితం అధికారులు నివేదించినా, ప్రభుత్వం ఉప ఎన్నికలు నిర్వహించలేదు. గ్రామ పాలనలో పంచాయతీ పాలకవర్గాలు కీలకం.
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల క్రీడాకారులు తమ ప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్ర క్రీడల అధికారి డాక్టర్ రాంలక్ష్మణ్ అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో 9వ రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలను ఆయన వీక్షించారు.
ఉమ్మడి జిల్లాలో వారం రోజుల క్రితం వరకు ఉక్కపోత ఉండగా, ఆ తరువాత వాతావరణంలో అనూహ్యంగా ఏర్పడిన మార్పులతో చలి పెరిగింది. శీతాకాలం ప్రారంభమైనా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతోపాటు ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు.
71 ఏళ్ల కాలంలో మొదటిసారి హుస్నాబాద్‌కు మంత్రి పదవి వరించడంతో ఈ ప్రాంతం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని, తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఈ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు.
ఆరోగ్య శ్రీ పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికీ ఉచిత వైద్యాన్ని అందిస్తున్నట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి అన్నారు.
మండలంలోని లచ్చానుపల్లి గ్రామానికి చెందిన షేక్ చిన్నజమాల్ వలి చెక్క భజనలో జా తీయ స్థాయిలో నంది అవార్డు అందుకున్నారు. విజయవాడలో తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో జాతీయ సాంస్కృతిక, సంగీత, సాహిత్య, నృత్య సమ్మేళనం-2023కు సంబంధించి జాతీయ పురస్కారాల మహోత్సవం విజయవాడలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా లచ్చానుపల్లి గ్రామానికి చెందిన షేక్ చిన్నజమాల్ వలి చెక్క భజనలో జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రతి నెలా ఒకటోతేదీ నాడు జీతం అందుకునేవారు. కాని ప్రస్తుతం వారు తమ ఖాతాల్లో ఎపుడు జీతాలు జమ అవుతాయోనని ఎదురు చూడాల్సి వస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఉండేదికాదు. అపుడు సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నా, ఠంచనగా ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేవారు. ఇపుడు అందుకు విరుద్దంగా జీతం ఎప్పుడు పడుతుందో తెలియని దుస్థితిని ఎదుర్కొంటున్నారు.
కనగానపల్లి మండలం కోనాపురం గ్రామంలో అధికార పార్టీ నాయకుడు ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన దోభీ ఘాట్ బోరుబావి నుంచి అక్రమంగా తన పొలానికి పైప్‌లైన వేసుకున్నాడు
ఇళ్లులేని నిరుపేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంలో 17 జగనన్న లేఔట్లు ఏర్పాటు చేశారు. వీటిని అనువుగాని చోట వేయడంతో సమస్య ఏర్పడింది. ఇటువంటిచోట్ల చాలామంది ఇళ్లు నిర్మించుకోవడానికి మొగ్గు చూపడంలేదు.
మండలంలోని బండమీదపల్లిలో ఆదివారం కనకదాస జయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ ఇనచార్జ్ బీకే పార్థసారధి, కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజహంస శ్రీనివాసులు కనకదాస విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.
చాగలమర్రి గ్రామంలోని పట్టాభిరామ ఆలయం, శివరామానంద ఆశ్రమంలో ఆదివారం అయోద్య శ్రీరామ ఆలయం నుంచి తెచ్చిన అక్షింతలకు వేద పండితుడు పెద్దశాస్త్రి ఆధ్వర్యంలో ముందుగా మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.
‘ రాప్తాడు నియోజకవర్గంలో నాలుగు ప్రాజెక్టులు ఏర్పాటు చేసి సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చావ్. వాటి నిర్మాణాలకు శంకుస్థాపన చేసి ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకూ కనీసం ఎకరం కూడా సేకరించలేదు. ఉత్త మాటలే తప్పా... చేసిందేమీ లేదు. నీవోక అసమర్థ ఎమ్మెల్యేవి..’ అని ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డిపై మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడని, పెద్దఎత్తున నిధులు తీసుకువచ్చి నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు.
ఉల్లిపాయకి బంగాళదుంపకు వ్యత్యాసాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలుసుకోలేకపోతున్నారని, ఇటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడం మన దౌర్భాగ్యం అని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ఎద్దేవా చేశారు.
వైసీపీ గల్లంతవడం ఖాయమని, ఎన్నికల్లో ఆ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతారని మాజీమంత్రి పల్లె రఘునాథ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని తంగేడుకుంట పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాలకు చె ందిన వారు పల్లె సమక్షంలో ఆదివారం వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.
అవినీతి కేసులు ఎదుర్కునే రాజకీయ నేతలకు బీజేపీలోకి చేరిన తర్వాత క్లీన్ చిట్ ఇవ్వడం జరుగుతుందని రాజకీయ వర్గాల్లో ఒక బలమైన వాదన ఉంది. అందుకే.. ప్రతిపక్షాలు ఎప్పుడూ బీజేపీని టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తుంటాయి.
సత్యసాయి బాబా సేవాస్ఫూర్తితో అందిస్తున్న వైద్యసేవలు అమోఘమంటూ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ అభినందించారు. శ్రీసత్యసాయి మొబైల్ ఆసుపత్రి 18వ వార్షికోత్సవాన్ని స్థానిక సాయిహీరా గ్లోబల్ కన్వెన్షన సెంటర్లో ఆదివారం నిర్వహించారు.
రాష్ట్రంలో ఏకైక జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రమైన కొలనుభారతి అమ్మవారిని లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ రెడ్డి దంపతులు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో - ట్రాలీ ఢీకొని ఇద్దరు మృతి చెందగా... 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన జగదేవ్‌పూర్ మండలం మునిగడప గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతిచెందిన మహిళలు జయమ్మ, శిరీషగా గుర్తించారు.
ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందని ఏక్సైజ్ శాఖ, టూరిజం డెవలప్మెంట్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) పేర్కొన్నారు. ఆదివారం నాడు తెలంగాణ సెక్రటేరియట్లో జూపల్లి కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు.
అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక.. లోకల్ ఫైట్ మొదలు కానుంది. వచ్చే సంవత్సరం జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఈనెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ శశాంక ఆదేశాలు జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పాలకవర్గ పదవీకాలం ఫిబ్రవరి 1వ తేదీతో ముగియనుంది.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ( andaru Dattatreya ) మనవరాలు జశోధర ( Jasodhara ) ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ( PM Modi ) పై పద్య గానం చేశారు. జశోధర ప్రధానమంత్రి మోదీని ప్రశంసిస్తూ పాడిన ఒక పద్యం వీడియోను బండారు దత్తాత్రేయ తన ఎక్స్ (X) ఖాతాలో పోస్ట్ చేశారు.
వైద్యారోగ్యశాఖలో 2020లో చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు బయటపడుతున్నారు. నకి‘లీలలు’ వెలుగు చూస్తున్నాయి. దీంతో అటు ఉద్యోగాలు పొందిన వారితోపాటు ఇటు నియామకాల సమయంలో పనిచేసిన ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. వైద్యారోగ్యశాఖలో నియామకాలపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో కలెక్టర్ దినే్‌షకుమార్ సమగ్ర విచారణకు ఆదేశించారు.
జిల్లాలో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతు న్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వి ద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన పరీక్ష ఫీజు రాయి తీ అక్కరకు రాకుండా పోయింది. సర్కారు విధించిన నిబంధనలతో ఒక్కరికి కూడా వర్తించకుండా పో యింది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ చార్జీల మోతలు.. కరెంట్ కోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విమర్శించారు. జగన్‌రెడ్డి అధికారం చేపట్టిన ఐదేళ్ల కాలంలో మూడుసార్లు కరెంట్ చార్జీలు పెంచారని ఆయన ధ్వజమెత్తారు. మండలంలోని మూలగుంటపాడులో ఆదివారం నిర్వహించిన బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో స్వామి మాట్లాడారు. గత టీడీపీ హయాంలో విద్యుత్‌రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి లోటు నుంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు.
ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల సమగ్ర సమాచారం ఇక నుంచి ఒకే చోట నిక్షిప్తం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. ఇందుకోసం యూడై్సప్లస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్)ను రూపొందించారు. ఇది విద్యావ్యవస్థ పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేసే ఓ వెబ్సైట్. దీన్ని 2024-25 విద్యా సంవత్సరం నుంచి పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మిచౌంగ్ తుఫాన్‌తో కురిసిన వర్షాలతో మూడు రోజుల క్రితం నిండుకుండలా ఉన్న గుండ్లకమ్మ జలాశయం ప్రస్తుతం ఖాళీ అయ్యింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొట్టుకుపోయిన రెండో గేటు వద్ద స్టాప్ లాక్‌లను ఆదివారం మధ్యాహ్నానికి అమర్చినా లీకేజీతో కొంత నీరు పోతోంది. ఇప్పటికే ప్రాజెక్టులో ఉన్న నీటిలో ఇంచుమించు రెండు టీఎంసీలు సముద్రం పాలైంది. ప్రస్తుతం కేవలం 0.80 టీఎంసీలు మాత్రమే ఉంది. డెడ్ స్టోరేజీ పోను నికరంగా అర టీఎంసీ మాత్రమే రిజర్వాయర్‌లో అందుబాటులో ఉండనుంది. దీంతో ఆయకట్టుకు నీరందే అవకాశం లేకుండాపోయింది. సుమారు 60వేల ఎకరాలలో గుండ్లకమ్మ ఆయకట్టులో పంటలు ఉన్నాయి. వాటికి మరో నెల తర్వాత కనీసం రెండు తడుల నీరు అవసరం. అయితే ప్రస్తుతం రిజర్వాయర్‌లో ఉన్న నీటి మట్టం చూస్తే చుక్కనీరు కూడా కాలువలకు ఎక్కే అవకాశం లేదు. దీంతో పంటల పరిస్థితిపై ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
6 గ్యారెంటీల్లోని మిగతా వాటిని సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) వెంటనే అమలు చేయాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Thalasani Srinivas Yadav ) వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఆరు గ్యారెంటీలను ఎలా అమలు పరుస్తుందో ఆ పార్టీ నాయకులు ప్రజలకు తెలియజేయాలని భారతీయ జనతాపార్టీ అభ్యర్థి ఏపీ మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో సంక్షేమ పాలన మొదలైందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ పాలనలో ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందని, ఆత్మగౌరవం దక్కుతుందన్నారు.
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని చందిప్పలో గల మరకత శివలింగ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన,లక్ష తులసి అర్చన నిర్వహించారు.
కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొంది బాధ్యతలు చేపట్టిన కసిరెడ్డి నారాయణరెడ్డి విజయోత్సవ ర్యాలీని నేడు(సోమవారం) కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కడ్తాల మండల కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధికార ప్రతినిధి, ఎంపీటీసీల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
భద్రాచలంలో రాముడు కొలువై ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం నాడు భద్రాద్రి రామాలయాన్ని భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రులకు ఆలయ మర్యాదలతో ఈవో రమాదేవి స్వాగతం పలికారు.
తమ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించాలని సుదీర్ఘకాలం నుంచి తాను చేస్తున్న డిమాండ్‌ని సీఎం నితీశ్ కుమార్ మరోసారి లేవనెత్తారు. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన తూర్పు జోనల్ కౌన్సిల్ 26వ సమావేశంలో...
పనికి ఆహార పథకం కింద డొంక దారిని కొంత మేర కంకర, మరికొంత మట్టి రోడ్డు వేసి వదిలేశారు. 25ఏళ్లుగా మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చకపోవడంతో రెండు మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
తాము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామని, ప్రజా నిర్ణయాన్ని శిరసా వహిస్తామని ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు.
ప్రభుత్వం నూతనంగా అమలు పరుస్తున్న మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ చేయూత పథకాలు పేదలకు ఎంతో మేలు చేకూరుస్తాయని, అర్హులైన ప్రతీ ఒక్కరు ఈ పథకాలను తప్పనిసరిగా సద్వినియోగపర్చుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు.
పొలం పని చేసుకుంటుండగా కొందరు వ్యక్తులు తమకు చెందిన భూమిని ఆక్రమించుకున్నారంటూ వ్యక్తిపై దాడికి దిగారు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్ పరిధిలోని రావిరాలలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.
రైతులు పండించిన పత్తిని అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. జిల్లాలో 12 జిన్నింగ్ మిల్లులుండగా అందులో 8 మిల్లుల్లో కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే మార్కెట్ కమిటీ అధికారులు పర్యవేక్షణ కొరవడడంతో రైతులు పత్తిని విక్రయించే క్రమంలో భారీగా మోసపోతున్నారు. పత్తి నాణ్యతగా లేదని కొనుగోలు కేంద్రాల్ల్లో కొర్రీలు పెడుతున్నారు. దీంతో దళారులకు అమ్ముకుని తీవ్రంగా నష్టపోతున్నారు. అసలే ప్రకృతి వైపరీత్యాలతో సాగు చేసిన పంట దెబ్బతిన్నదని, ఉన్న పంటను అమ్ముకున్నా పెట్టుబడులు కూడా రాలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.
వివాహేతర సంబంధాన్ని నెరుపుతోందనే అనుమానంతో ఓ భర్త భార్యను కత్తితో పొడిచి చంపిన ఘటన ఆదిభట్ల మన్సిపాలిటీ పరిధి తుర్కయంజాల్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నాయినోనిపల్లి శివారులో వెలసిన మైసమ్మ దేవతకు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటిసారి జూపల్లి అమ్మవారిని దర్శించుకున్నారు.
కొత్త ప్రభుత్వానికి ఉమ్మడి జిల్లాలో సాగునీరు మొదటి సవాల్‌గా మారనుంది. వానాకాలంలో సరిగా వర్షాలు కురవనందున ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో యాసంగి సీజన్‌కు నీటిని అందించడంపై సందిగ్ధం నెలకొంది.
బడిబయట పిల్లల సర్వేకు మేడ్చల్ జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. ఈనెల 10వ తేదీ నుంచి నెల రోజుల పాటు పిల్లలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు.
జహీరాబాద్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ముళ్లపోదల్లో పసికందును గుర్తు తెలియని వ్యక్తులు పారేశారు.ముళ్లపొదల్లోని శిశువును కుక్కలు, పందులు పీక్కుతిన్నాయి. నడుము కింది భాగాన్ని కుక్కలు, పందులు తినేశాయి.
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించడంతో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తున్నాయి. కొడంగల్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం మహిళలు బస్సుల్లో ఎక్కేందుకు పోటీ పడ్డారు.
సాధారణంగా స్టార్ నటీనటులు ప్రజలకు హాని తలపెట్టే ప్రోడక్టులను (గుట్కా, మద్యపానం, ఇతరత్రాలు) ఏమాత్రం ప్రమోట్ చేయరు. అటు తిరిగి, ఇటు తిరిగి అది తమ మెడకే చుట్టుకునే ప్రమాదం కూడా ఉంది కాబట్టి.. వాటి జోలికి వెళ్లరు. కానీ..
నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో పరిధిలో మహిళలకు టికెట్ జారీ చేసిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ విచారణకు ఆదేశించారు.
జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. తొలివిడుత కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రెండో విడుత మంత్రివర్గ కూర్పుపై జోరుగా చర్చ జరుగుతోంది.
వాంకిడి, డిసెంబరు 10: చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పడమే లక్ష్యంగా బడిబయట పిల్లల సర్వేకు జిల్లా విద్యాశాఖ సన్నద్దమవుతోంది. ఈనెల 11వ తేదీ నుంచి నెల రోజుల పాటు పిల్లలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సర్వేకు సమాయత్త మతున్నారు. ఇందుకోసం అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
కాగజ్‌నగర్, డిసెంబరు 10: రాష్ట్ర ప్రభుత్వం మహిళ కోసం ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. ఆదివారం కాగజ్‌నగర్ బస్టాండులో ఆయన ఈ పథకాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
రానున్న రోజుల్లో బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్ర మాన్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరి ష్కరిస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. ఆది వారం బెల్లంపల్లిలో విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు, ప్రజాప్ర తినిధుల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధా లుగా అభివృద్ధి చేస్తానన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం గొప్ప వరంలాందని, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. మంచిర్యాల ఎమ్మె ల్యేగా గెలుపొంది అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం అనంతరం ఆదివారం హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు డీసీసీ అధ్యక్షురాలు సురేఖతో కలిసి వచ్చారు.
భీమారం మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్ 14 హ్యాండ్‌బాల్ బాలికలు, బాలుర పోటీలు ఆదివారం ముగిశాయి.
రెబ్బెన, డిసెంబరు 10: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడం గొప్ప విషయమని, మానవతా దృక్పథంతో ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ
కౌటాల, డిసెంబరు 10: మండల కేంద్రంలోని కంకాలమ్మ గుట్టపై ఆదివారం నిర్వహించిన జాతరకు భక్తజనం పొటె త్తారు. ఎటుచూసినా భక్తులు అమ్మవారి దర్శనం కోసం గుట్ట వైపే చేరుకోవడం కనిపించింది. జాతరకు భక్తులు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహా రాష్ట్ర, చత్తీస్గడ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా తరలి వచ్చారు.
రెబ్బెన, డిసెంబరు 10: నిజాం కాలం నాటి నుంచి ప్రముఖులు, అతిఽథులకు విడిది సౌకర్యం కల్పించిన చోటది. మండల కేంద్రంలో ఆ పురాతన కట్టడం విషయంలో పాలకులు, అఽధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆర్అండ్బీ విశ్రాంతి భవనం శిథిలావస్థకు చేరింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహి ళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే మహాలక్ష్మి పథకం ప్రారంభ మైంది. సీఎం రేవంత్‌రెడ్డి శనివారం జీరో చార్జీ టికెట్టును ఆవిష్కరించారు. మహిళలు రాష్ట్రంలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణించవచ్చు. ఈ పథకం అమలుతో మహిళల్లో ఆనందం వ్యక్తమ వుతోంది. కాని జిల్లాలోని చాలా గ్రామాల మహిళలకు ఉచిత ప్రయాణ యోగం కలగడం లేదు. జిల్లాలో వందకు పైగా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు.
కనిగిరి ప్రాంతంలోని యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించడమే తన ధ్యేయమని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. మున్సిపాల్టీ పరిధిలోని 9వ వార్డు బోయపాలెంలో ఆదివారం బాబు ష్యూరిటీ..భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ఉగ్ర ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. పాలెంలోని ప్రతి ఇంటికీ వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు వివరించారు. టీడీపీ మేనిఫెస్టోలో మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యను ఉగ్ర వివరించారు.
కనిగిరి ప్రాంత ప్ర జలకు నిరంతరం కంటి వైద్య శిబిరాలతో పా టు వివిధ రకాల వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. అమరావతి గ్రౌండ్స్‌కు కంటి పరిక్షల కోసం వ చ్చిన వృద్ధులను డాక్టర్ పేరు, పేరునా ఆప్యాయంగా పలకరించారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన వృద్ధులు డాక్టర్ ఉగ్రకు చేతులెత్తి నమస్కరించారు. ఎంతో మంది పేదలకు కం టి చూపు దాతవయ్యావు, నీవు చల్లగా ఉండా లని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ రాజకీయంలో ఉన్నా, లేకు న్నా కనిగిరి ప్రాంత ప్రజలకు నిరంతం పలు కార్యక్రమాల ద్వారా సేవ చేస్తూనే ఉన్నానని అన్నారు.
ప్రభుత్వం చేనేతను చిన్నచూపు చూస్తోంది. చేనేత చట్టాలు కొన్ని కాగితాలకే పరిమితం అవుతున్నాయి. అందుకు చేనేత, జౌళి శాఖ అధికారుల ఉదాసీన వైఖరే కారణమని సగటు చేనేత కార్మికులు ఆరోపిస్తున్నారు. పవర్లూమ్ వస్త్రాలు, చేనేత వస్త్రాలుగా చెలామణి అవుతున్నాయి.
తుఫాన్ ప్రభావంతో పం టలు నష్టపోయిన రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం మిన్నకుం డటం సమంజసం కాదని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సంతమాగులూరు, బల్లికురవ, అద్దంకి మండలాలలోని పలు గ్రామాల లో వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను ఆదివారం ఎమ్మెల్యే రవికుమార్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. పంటనష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పోలీసుల చర్యలను టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఖండించారు. ముప్పాళ్ళ మండలం తురుకపాలెంలో టీడీపీ నేత చంద్రబాబు షూరిటి- భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమాన్ని కన్నా ఆధ్వర్యంలో చేపట్టారు. అనుమతి లేదని పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.
మహారాష్ట్రలోని కసారా రైల్వే స్టేషన్లో గూడ్సు రైలు పట్టాలు తప్పిన ఘటన చోటుచేసుకుంది. కసారా స్టేషన్-టీజీఆర్3 డౌన్ లైన్ సెక్షన్ మధ్య ఆదివారం సాయంత్రం 6.31 గంటలకు ఈ ఘటన జరిగింది. ఏడు బోగాలు పట్టాలు తప్పినట్టు సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.
నెట్టింట్లో చేసే స్టంట్ల వీడియోల్లో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే మరికొన్ని ఆగ్రహం తెప్పిస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో వైరల్ అవుతూ జనాలను అశ్చర్యపరుస్తోంది.
యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ( Yadagirigutta Lakshminarasimha Swami ) ఆలయానికి రికార్డ్ స్థాయిలో నిత్య ఆదాయం పెరిగింది. కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి ఏర్పాటు చేసిన 'ఇండియా' కూటమి తదుపరి సమావేశం తేదీ ఖరారైంది. డిసెంబర్ 19వ తేదీన సమావేశం జరుగనుంది. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఈ విషయాన్ని 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తెలియజేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి ఏర్పాటు చేసిన 'ఇండియా' కూటమి తదుపరి సమావేశం తేదీ ఖరారైంది. డిసెంబర్ 19వ తేదీన సమావేశం జరుగనుంది. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఈ విషయాన్ని 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తెలియజేశారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ కుమార్తె సీరత్ కౌర్ మాన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. తాను భగవంత్ మాన్ కుమార్తెనని, ఆయన ‘నాన్న’ అని పిలిచే హక్కును చాలాకాలం క్రితమే...
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ కార్పొరేషన్ చైర్మన్ల (various corporation chairmens) నియామకాలు, పదవీకాలం పొడిగింపు నిర్ణయాలను రద్దు చేస్తూ రేవంత్ ప్రభుత్వం ( Revanth Govt ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసి ముఖ్యమంత్రుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న సమయంలో కేంద్ర హోమంత్రి అమిత్‌షా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. తన మనుమరాలితో చెస్ ఆడుతున్న ఒక ఫోటోను ఆయన పోస్ట్ చేశారు.దీనిపై కేరళ కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వడం మరింత రసవత్తరంగా మారింది.
పాలన అంటే ప్రత్యర్థులను దెబ్బకొట్టడమేనా జగన్‌రెడ్డి ( JAGAN REDDY ) అని జన చైతన్య వేదిక నేత లక్ష్మణరెడ్డి ( Lakshmana Reddy ) అన్నారు. ఆదివారం నాడు సిటీజన్స్ ఫర్ డెమోక్రసీ ఫోరం సదస్సు నిర్వహించారు.
మహిళలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) నిలబెట్టుకుందని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి ( Yashaswini Reddy ) పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ గడ్డమీద అడుగుపెట్టిన సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీరెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభావమే ఎదురైంది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మినహాయిస్తే.. మిగతా చోట్ల ఓటమి పాలైంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ చేతిలో..
సీపీఎస్ రద్దు చేయలేదన్న బాధతో ఓ ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యాయత్నం చేశారు. విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించిన ఉపాధ్యాయుడు మల్లేశ్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో చికిత్స కోసం బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.
ఏపీ ప్రభుత్వం ( AP Govt )పై విశ్రాంత ఐఏఎస్ అధికారి, సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ (సీఎఫ్‌డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ( Nimmagadda Ramesh Kumar ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరంకుశత్వం, హింస, అసహనంతో ప్రజాస్వామ్యాన్ని బలహీన పరిచి ఆంధ్రప్రదేశ్‌కు చెడ్డపేరు తేవద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి సూచించారు.
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఆదివారం ఒక సంచలన ప్రకటన చేశారు. తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ తన రాజకీయ వారసుడు అని, ఇకపై అతను బీఎస్పీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని ఆమె వెల్లడించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రైతు ఆత్మహత్యల ప్రదేశ్‌గా మార్చిన ఘనత సీఎం జగన్ రెడ్డిదే అని, వైసీపీ నేతల బెదిరింపులకు భయపడి రాష్ట్రంలో పరిశ్రమలు రావడం మానేశాయని విమర్శించారు. కక్ష సాధింపులకు పాల్పడుతున్న సీఎం జగన్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పల్లె జోస్యం చెప్పారు
కాంగ్రెస్ పార్టీ ( Congress party ) కార్యకర్తలు నిప్పులా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Minister Thummala Nageswara Rao ) పేర్కొన్నారు. ఆదివారం నాడు జిల్లాలోని పాల్వంచ సుగుణ గార్డెన్లో కాంగ్రెస్, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు.
కొత్తగూడెం ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ( Mallu Bhatti Vikramarka ) వ్యాఖ్యానించారు.
ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయిని ఛత్తీస్‌గఢ్ బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీంతో గిరిజన నేతను సీఎం చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర ఇచ్చిన హామీ సాకారమైంది.
ఇటీవల ఆదాయపు పన్ను శాఖ జార్ఖండ్‌లో రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన ప్రాంగణాల్లో నిర్వహించిన దాడుల్లో నోట్ల గుట్టలు దొరికిన సంగతి తెలిసిందే. ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై ఒకటే విమర్శల మోత..
శ్రీశైలం ఘాట్ రోడ్డు ( Srisailam Ghat Road ) లో మరోసారి భారీ ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీశైలం నుంచి సుమారు ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయి రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు రోడ్లపై భక్తుల కార్లు బస్సులు నిలిచిపోయాయి.