రుణాలు, బాండ్ల రూపంలో అదానీ సంస్థల ప్రతినిధులు 300 కోట్ల డాలర్లు (దాదాపు 25 వేల కోట్ల రూపాయలు) సేకరించారని... లంచాలు, తప్పుడు ప్రకటనల ద్వారా ఈ నిధులు సేకరించారని వారు ఆరోపించారు. అమెరికా, ఇతర దేశాలకు చెందిన అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి ఈ నిధులు సేకరించారన్నది ఆరోపణ.
ఏటా శీతాకాలంలో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. జర్నలిస్టులు కథనాలు రాస్తున్నారు. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. న్యాయస్థానాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తర్వాతి ఏడాది శీతాకాలం వచ్చిన తర్వాత మళ్లీ ఇదంతా పునరావృతం అవుతుంది. ప్రజాస్వామ్య దేశాలలో ఆరోగ్య అత్యవసర పరిస్థితికి దారి తీసే ఇలాంటి పరిస్థితుల వల్ల ప్రజా ఉద్యమాలను ప్రేరేపిస్తున్నాయి.
‘‘రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్టరీ పెడుతుంటే చాలు.. రాజకీయ నేతలు డబ్బుల కోసం ఇలా ఇబ్బంది పెట్టే దృష్టాంతాలు గతంలో ఎన్నో చోటు చేసుకున్నాయి. గత ముప్పై ఏళ్లుగా ఇలాంటి సంస్కృతి సీమ జిల్లాల్లో వేళ్లూనుకుపోయింది’’
లగచర్ల సహా రోటిబండ తండా, పులిచెర్లకుంట తండా, హకీంపేట గ్రామాల్లో నవంబరు 19న బీబీసీ పర్యటించింది. అధికారులపై దాడి ఘటన జరిగి పది రోజులు కావొస్తున్నా, గ్రామంలో ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు.
ఇటీవల కొద్ది నెలలుగా యుక్రెయిన్ తూర్పు ప్రాంతంలో రష్యా బలగాలు స్థిరంగా ముందుకు కదులుతున్న నేపథ్యంలో ఈ ‘యాంటీ-పర్సనల్ ల్యాండ్ మైన్స్’ వాడకానికి సిద్ధపడుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.