[07:36]మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సమీపంలో కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు.
[05:43]కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్స్‌పల్ సందీప్ ఘోష్‌కు ఈ నెల 17 వరకూ సీబీఐ కస్టడీని విధిస్తూ స్థానిక కోర్టు ఆదివారం ఆదేశాలు జారీ చేసింది.
[05:42]దేశంలో వైద్య సేవలు అందించేందుకు అర్హత ఉన్న ఎంబీబీఎస్ వైద్యులకు ప్రత్యేక గుర్తింపు కార్డు ఉండాలన్న లక్ష్యంతో జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) ఇటీవల విడుదల చేసిన నేషనల్ మెడికల్ రిజిస్టర్(ఎన్ఎంఆర్) ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు ప్రక్రియ ప్రారంభమైంది.
[05:39]రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న అతివలను ప్రోత్సహించేందుకు మహిళ రిజర్వేషన్ చట్టం కాంగ్రెస్‌కు ఒక మంచి అవకాశమని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.
[05:38]కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ సిద్ధాంతాలకు అనుగుణంగా ‘అటల్ విచార్ మంచ్’ (ఏవీఎం) పేరుతో దీన్ని ప్రారంభించారు.
[05:55]దశాబ్దానికి ఒకసారి చేపట్టే జనగణనను త్వరలో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు ఆదివారం తెలిపాయి.
[05:14]ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బంగ్లాదేశీలు, రోహింగ్యాల చొరబాట్లను జార్ఖండ్‌లోని జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.
[05:14]‘ఒక దేశం.. ఒకే ఎన్నిక’ అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ప్రస్తుత ఎన్డీయే పాలనలోనే జమిలి ఎన్నికల నిర్వహణ మొదలవుతుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
[07:07]అంతరిక్షంలో ప్రైవేటు స్పేస్‌వాక్ నిర్వహించిన తొలివ్యక్తిగా చరిత్ర సృష్టించిన బిలియనీర్ జేర్డ్ ఐజక్‌మన్ ఆదివారం క్షేమంగా భూమికి తిరిగి వచ్చారు.
[05:47]వేల మంది త్యాగాల ఫలమైన, స్ఫూర్తిదాయకమైన విమోచన దినోత్సవానికి పేరు మార్చి చరిత్రలో ఏమీ జరగలేదన్నట్లుగా చూపడం, వాస్తవ చరిత్ర నుంచి ప్రజల దృష్టిని మరల్చడమేనని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.
[05:07]గణేశ్ నిమజ్జనం సందర్భంగా కేటీఆర్ సహా విపక్ష నాయకులు సంయమనం పాటించాలని.. ఈ నెల 18 తర్వాత రాజకీయపరమైన అంశాలు మాట్లాడుకుందామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
[05:06]భారాస ప్రభుత్వ హయాంలో తలపెట్టిన ఫార్మా సిటీ ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు.
[04:57]వైద్య కళాశాలల్లో సీట్లు తగ్గిస్తున్నారంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెదేపా మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ధ్వజమెత్తారు.
[04:57]ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 17 నుంచి అక్టోబరు రెండో తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి.
[04:56]రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల్ని ప్రైవేటుపరం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందా అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ప్రశ్నించారు.
[05:47]ఆధునిక ప్రపంచంలో పోటీతత్వం పెరిగిపోతోంది. విద్యార్థుల్లో ఇది మరీ ఎక్కువ! భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా వీరు చిన్ననాటి నుంచే అనేక నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం తప్పనిసరవుతోంది.
[03:41]‘‘మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు సెమీఫైనల్స్ మాత్రమే.. 2029లో ఫైనల్స్ ఉన్నాయి... వాటిలో విజయం సాధించి ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగరేయాలి.
[03:39]కాంగ్రెస్ పటిష్ఠానికి పనిచేసే ప్రతి నాయకుడిని, కార్యకర్తను పార్టీ తప్పనిసరిగా గుర్తించి గౌరవిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు.
[03:38]మద్యం కుంభకోణం కేసులో అరెస్టై కొన్ని నెలలపాటు జైలులో ఉండి ఇటీవలే విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
[03:29]ఓ వైపు గాయం బాధిస్తున్నా.. డైమండ్ లీగ్ ఫైనల్ బరిలో దిగిన భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా రెండో స్థానంతో ఈ సీజన్‌ను ఉత్తమంగానే ముగించాడు.
[03:28]అయిదు మ్యాచ్‌ల్లో అయిదు విజయాలు! అన్ని మ్యాచ్‌ల్లోనూ ఎదురులేని ఆట! ఇదీ ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత్ జోరు! లీగ్ దశలో దూకుడు ప్రదర్శించిన హర్మన్‌ప్రీత్ సేన నాకౌట్ సవాల్‌కు సిద్ధమైంది.
[03:25]బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీసా.. అది కూడా సొంతగడ్డపైనా.. అయితే క్లీన్‌స్వీప్ లాంఛనమే అనే అభిప్రాయంతో ఉంటారు భారత అభిమానులు. బంగ్లాను దాని దేశంలో కూడా టెస్టుల్లో ఎన్నోసార్లు తేలిగ్గా ఓడించేసింది టీమ్ఇండియా.
[03:22]ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు తిరుగేలేదు. వరుస విజయాలతో మన పురుషుల, మహిళల జట్లు దూసుకెళ్తున్నాయి. ఈ రెండు జట్లూ వరుసగా అయిదో విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
[03:20]లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వచ్చే ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడతాడా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.
[03:16]బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్ నుంచి స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశాలున్నాయి. పని భారాన్ని తగ్గించే విధానంలో భాగంగా అతడిని అక్టోబర్ 7న ఆరంభమయ్యే ఈ సిరీస్‌లో ఆడించకూడదని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం.
[01:46]స్టాక్ మార్కెట్లు ఈ వారం తాజా రికార్డు గరిష్ఠాలకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్ల నిర్ణయం బుధవారం వెలువడనుండడమే ఇందుకు కారణం.
[01:47]పునరుత్పాదక ఇంధన వనరులు, బొగ్గు ద్వారా ఉత్పత్తి చేసే 6,600 మెగావాట్ల విద్యుత్తును మహారాష్ట్రకు సరఫరా చేసే కాంట్రాక్టును అదానీ గ్రూప్ దక్కించుకుంది.
[06:57]దేశీయ సరకు ఎగుమతిదార్లకు కంటైనర్ల అద్దెలు బెంబేలెత్తిస్తున్నాయి. కొవిడ్ పరిణామాల కంటే ముందుతో పోలిస్తే, ఇవి 3 రెట్లకు మించి ఎక్కువగా ఉంటున్నాయి.
[01:33]అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ ఉన్న ప్రాంతానికి సమీపంలో కాల్పులు జరిగినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు.
[01:34] కథానాయిక మేఘా ఆకాశ్ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. తన ప్రియుడు సాయి విష్ణుతో ఏడడుగులు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరి పెళ్లి వేడుక ఆదివారం ఉదయం చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది.
[01:30]‘‘మత్తు వదలరా 2’ చిత్రాన్ని చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకోవడం చాలా ఆనందాన్నిస్తోంది’’ అన్నారు హీరో శ్రీసింహా. ఆయన.. సత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని రితేశ్ రానా తెరకెక్కించారు.
[01:29]కథానాయకుడు కార్తి 29వ చిత్రం ఖరారైంది. ‘తానక్కరన్’ అనే తమిళ సినిమాతో సత్తా చాటిన దర్శకుడు తమిళ్ దీన్ని తెరకెక్కించనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, ఐవీ ఎంటర్ టైన్మెంట్స్, బీ4యు మోషన్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.
[00:03]నెల్లూరు జిల్లా మనుబోలు బీసీకాలనీలో ఆదివారం రాత్రి నిర్వహించిన గణేష్ నిమజ్జన ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. వినాయకుని నిమజ్జనోత్సవంలో బాణసంచా పేలడంతో 30మందికి పైగా గాయపడ్డారు.
[22:11]ఏపీలోని 35 వైద్య కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపు జాబితాను విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఆదివారం విడుదల చేసింది.
[21:48]టైఫూన్ యాగి తుపానుతో వణికిపోతున్న వియత్నాం, మయన్మార్, లావోస్‌లకు సాయం చేసేందుకు భారత్ ‘సద్భవ్’ పేరిట ఆపరేషన్ చేపట్టింది. ఆ దేశాలకు సహాయక సామగ్రిని పంపింది.
[00:05]దిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తానని ప్రకటించడంతో కొత్త సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి.
[19:49]భారత్‌తో టెస్టు సిరీస్ గురించి బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (Najmul Hossain Shanto) మాట్లాడాడు. టీమ్ఇండియాను ఓడించడం అంత తేలికైన విషయం కాదని పేర్కొన్నాడు.
[19:22]ఖైరతాబాద్ భక్త జనసంద్రంగా మారింది. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి మహాగణపతి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఖైరతాబాద్ ప్రాంతం కిటకిటలాడుతోంది.
[18:03]శనివారం జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ సమయంలో విరిగిన చేయితోనే పోటీలో పాల్గొన్నానని సామాజికి మాధ్యమాల ద్వారా పేర్కొన్నాడు.
[17:52]చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో శనివారం అర్ధరాత్రి కొందరు యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. అనంతరం తెదేపా కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు.
[17:13]కోల్‌కతా హత్యాచార ఘటన వెలుగుచూసిన అనంతరం ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్, పోలీసు అధికారి ఒకరితో ఒకరు టచ్‌లో ఉన్నారని కోర్టులో సీబీఐ తెలిపింది.
[16:47]ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుంట పీఎస్ పరిధిలోని ఇట్కల్‌లో చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో గ్రామస్థులు ఐదుగురిని హత్య చేశారు.
[15:42]ప్రజల వద్దకు చేరుకోనివ్వకుండా తనను వర్షమే కాదు.. ఏదీ ఆపలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఆయన రాంచీ నుంచి రోడ్డు మార్గంలో జెంషెడ్‌పుర్ చేరుకున్నారు.
[15:08]సూర్యాపేట జిల్లాలోని నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ తెగిపోయిన ప్రాంతాన్ని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పరిశీలించారు.
[14:18]బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ అనంతరం కొందరికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. దేశవాళీలో రాణిస్తున్న ఇషాన్‌కు జాతీయ జట్టు నుంచి పిలుపు వస్తాదా? దీనికి బీసీసీఐ వర్గాలు మాత్రం అవునంటున్నాయి.
[13:23]బోరబండలోని నాట్కో ప్రభుత్వ పాఠశాలలో స్వర్ణ భారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్, ఏఐజీ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు.
[13:06]ఇటీవల సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ హిమా కోహ్లీ ఓ ఆంగ్ల వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మహిళా న్యాయమూర్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మాట్లాడారు.
[12:11]సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక దుబాయి వేదికగా అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌కు గాను నాని ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు.
[11:16]టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పించిన బాబర్ అజామ్‌పై పరిమిత ఓవర్ల సారథ్యం కత్తి వేలాడుతోంది. అయితే, వ్యక్తిగత ప్రదర్శనపై దృష్టి పెట్టాలని బాబర్‌కు మాజీ క్రికెటర్ సూచించాడు.
[10:06]ముందు భారీ వర్షం.. రోడ్డు సరిగ్గా కనిపించడం లేదు... వెనుక తనను నమ్ముకుని బస్సులో 45 మంది ప్రయాణికుల నిండు జీవితాలు.. ఇవేమీ ఆ ఆర్టీసీ డ్రైవర్‌కు కనిపించలేదు.