[03:30] తెలంగాణ ఒక వ్యక్తితోనో.. ఓ కుటుంబం కారణంగానో రాలేదని.. ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన 1,200 మంది అమరుల వల్లే ఆ కల సాకారమైందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.
[03:30] తెలంగాణ సమస్యలను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాత్రమే అర్థం చేసుకుని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశారని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ అన్నారు.
[02:54] రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు అప్పటి ప్రధాని ఇచ్చిన హామీల్ని, చట్టంలో పొందుపరిచిన అంశాల్ని నెరవేర్చాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన ముఖ్యమంత్రి జగన్... ఆయనపై ఉన్న కేసులు మాఫీ చేస్తే చాలు, సీబీఐ అరెస్టు చేసి జైలుకు పంపకుండా ఉంటే చాలనుకుంటూ, కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.
[02:54] ‘‘జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జూన్ 14 నుంచి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర ప్రారంభించబోతున్నారు. అన్నవరం సత్యదేవున్ని దర్శించుకున్న తర్వాత ఈ పర్యటన మొదలవుతుంది.
[02:54] నెలలో ఎనిమిది రోజులు నియోజకవర్గంలో కచ్చితంగా ఉండాలని...క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీని బలోపేతం చేయాలని తెదేపా నియోజకవర్గ పరిశీలకులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు.
[21:25] జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహిపై ఈనెల 14 నుంచి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. అన్నవరం సత్యదేవుని చెంత పూజలు నిర్వహించిన తర్వాత యాత్ర మొదలవుతుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు.
సునీల్ కనుగోలు (Sunil Kanugolu) .. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరు ఓ రేంజ్లో వినిపిస్తోంది.. ఏ ఇద్దరు కలిసినా ఈయన గురించే చర్చించుకుంటున్నారు.. నిన్న, మొన్నటి వరకూ ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే..
[16:48] పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కోడెల శివరామ్‌తో తెదేపా త్రిసభ్య బృందం చర్చలు ముగిశాయి. కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి ఇన్‌ఛార్జి ఇవ్వటంపై కోడెల శివరామ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
[10:28] వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ప్రభుత్వం ఓటమి ఖాయమని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల ఫలితాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయన్నారు.
[08:05] నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం కొనసాగించామని.. మనసా, వాచా, కర్మణా సకల జనులు పోరాడితేనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
[04:53] ‘దశాబ్దాలుగా పరిపాలించిన పార్టీలు చేయలేని ఎన్నో అభివృద్ధి పనులను మేం తొమ్మిదేళ్లలో చేసి చూపించాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేయాలి. ప్రజారవాణాను మెరుగుపరచాలి.
[04:49] తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ వంటి అసమర్థ సీఎం మరెవరూ ఉండరని తెదేపా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు.
[04:49] భూముల విలువలు పెంచినప్పుడల్లా.. పుర, నగరపాలక సంస్థల్లో ఆస్తి పన్ను పెరగదనే హామీని ప్రజలకు ప్రభుత్వం ఎందుకివ్వడం లేదని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు ప్రశ్నించారు.
[04:32] పశ్చిమగోదావరి జిల్లాలో ఫ్లెక్సీల వివాదం ఆందోళనలకు దారితీసింది. వైకాపా నాయకులు ఇటీవల పలు చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్ కూర్చున్న పల్లకీని జనసేన అధినేత పవన్ కల్యాణ్, మరికొందరు మోస్తున్నట్లు కార్టూన్ ఉండటం అభ్యంతరకరంగా ఉందని జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మే 26న కలెక్టర్ పి.ప్రశాంతికి వినతి పత్రం అందజేశారు.
[04:32] హిందూ దేశాన్ని తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగానే ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ‘సెంగోల్’ చేతపట్టుకుని పార్లమెంటులో మతపెద్దలతో కార్యక్రమాన్ని నిర్వహించారని, ఇది ‘నవ భారత్’కు చిహ్నమని సీపీఎం విమర్శించింది.
[04:32] దేశ వృద్ధి ప్రస్థానంపై అపనమ్మకం కలిగించేలా నిరాశావాదంతో, ద్వేషంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు చేస్తున్నారనీ, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 7.2% వార్షిక వృద్ధి గణాంకాలే ఆయనకు జవాబు అని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.
[04:32] వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలు వ్యవహారంపై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యుడు బుద్ధా వెంకన్న అన్నారు.
[04:32] దిల్లీ మద్యం కుంభకోణంలో కొందరు కీలక వ్యక్తుల పాత్ర గురించి చెప్పడానికే ఆ కేసులో నిందితుడిగా ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారినట్లు కనిపిస్తోందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.