పోలవరం పనుల పురోగతిలో గత మూడేళ్లలో ఎన్నో సున్నాలు కనిపించాయి. కుడి ప్రధాన కాలువ ఎర్త్‌వర్క్ పనులు 2021-24 మధ్య మూడేళ్ల కాలంలో ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయాయి.
రాష్ట్రంలోని పోలీసుస్టేషన్లు, కారాగారాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఎన్ని పనిచేస్తున్నాయి, పనిచేయని వాటిని సరిచేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డీజీపీ, జైళ్లశాఖ డీజీలను హైకోర్టు ఆదేశించింది.
సీఆర్డీఏ పరిధిలో ఆస్తుల కొనుగోలుకు ముందుకొచ్చే ప్రవాసాంధ్రులకు (ఎన్నారైలకు) రాష్ట్ర ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరుస్తోంది. ఆస్తుల కొనుగోలులో ఎలాంటి అసౌకర్యం లేకుండా న్యాయ సలహాల దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు ప్రభుత్వం వెన్నంటి ఉండి..
ప్రభుత్వ హైస్కూల్ ప్లస్‌లలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్‌ను ఇంటర్మీడియట్ విద్యాశాఖకు అప్పగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
కానిస్టేబుళ్ల ఎంపికలో తమను ప్రత్యేక క్యాటగిరీగా పరిగణించాలని కోరుతూ భారీ సంఖ్యలో హోంగార్డులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి.
వైకాపా ప్రభుత్వం భూముల రీ-సర్వేను ఇష్టానుసారం నిర్వహించింది. కొలతల సమయంలో రైతులను పిలవకుండానే వెబ్‌ల్యాండ్ ఆధారంగా జాయింట్ ల్యాండ్ మ్యాప్ పార్సిల్(ఎల్పీఎం)లను జనరేట్ చేసింది.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా గెలుపు కోసం స్వీడన్ నుంచి వచ్చి ఐదు నెలలపాటు క్షేత్రస్థాయిలో పనిచేసిన ఎన్నారై ఉన్నం నవీన్‌కుమార్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవించారు.
రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి కొత్త ఛైర్మన్ నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వందల సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను వడపోసి, రెండు పేర్లను పరిశీలనకు తీసుకుంది.
కార్తిక మాసం చివరి రోజు సోమవారం విజయవాడ కృష్ణా నది తీరంలోని దుర్గాఘాట్‌లో నిర్వహించిన పోలి స్వర్గం వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నదిలో వదిలారు.
రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.4 వేల కోట్ల రుణం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏటా రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంచనాల ఆధారంగా.. అందులో 3.5 శాతం బహిరంగ మార్కెట్ రుణాలు తీసుకునేందుకు అవకాశముంది.
సామాజిక మాధ్యమం వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో వివిధ ఠాణాల్లో నమోదైన కేసుల్లో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అరెస్ట్ విషయంలో ఈ నెల 9 వరకు తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
కాకినాడ పోర్టు నుంచి గత అయిదేళ్లలో లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు అక్రమంగా తరలించిన జే గ్యాంగ్.. రూ.వేల కోట్లు దోచుకుందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు.
విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి మొదటి దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. రెండు చోట్లా ప్రాజెక్టులను రెండు దశల్లో పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
ఏపీపీఎస్సీ ఇప్పటికే ఇచ్చిన నాలుగు వేర్వేరు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షల తేదీలను సోమవారం ఖరారు చేసింది. ఈ పరీక్షలన్నీ వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్నట్లు పేర్కొంది.
నూతన మద్యం విధానం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లుగా తమకు 20 శాతం ట్రేడ్ మార్జిన్ దక్కేలా చూడాలంటూ ఆంధ్రప్రదేశ్ వైన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాయల సుబ్బారావు ఇచ్చిన వినతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్ మీనా అధికారులను ఆదేశించారు.
వైద్య, ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్)ను ఉపయోగిస్తూ, మెరుగైన సేవలు అందించడానికి గల అవకాశాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు తీసుకురాబోతోంది. ఆస్తుల క్రయవిక్రయాల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే కక్షిదారుల సౌలభ్యం కోసం స్లాట్ బుకింగ్‌ను ప్రవేశపెట్టబోతోంది.
ఎస్సీలకు జీవనోపాధి కల్పనకుగాను స్వయం ఉపాధి రాయితీ రుణాల మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. 2024-25లో రూ.340 కోట్లతో రాయితీ రుణాలు అందించనున్నారు.
కాకినాడ పోర్టులో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన హడావుడి సినిమాలా ఉందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. పోర్టు ద్వారా పేదల బియ్యం అక్రమ రవాణా జరిగినట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
పోలవరం ప్రాజెక్టు కోసం భూసేకరణ, సహాయ, పునరావాసం కోసం రూ.33,168.24 కోట్లు, పనులు, పవర్ కాంపొనెంట్ కోసం రూ.22,380.64 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి రాజ్‌భూషణ్ చౌధరి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు సమగ్ర శిక్ష అభియాన్ కింద గత అయిదేళ్లలో ఇచ్చిన నిధుల్లో 64.60% మాత్రమే ఖర్చయినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి జయంత్చౌధరి తెలిపారు.
రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి వచ్చే నెల 8 వరకు ప్రభుత్వం రెవెన్యూ గ్రామ సదస్సులను నిర్వహించనుంది. దీనికి సంబంధించిన సన్నాహాల కోసం బుధవారం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, అధికారులు కలెక్టర్లతో సమావేశం కానున్నారు.
తెదేపా సభ్యత్వ నమోదు 60 లక్షలు దాటింది. అక్టోబరు 26న ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించిన సభ్యత్వ నమోదు రికార్డు స్థాయిలో దూసుకెళుతోంది.