ఏపీ ప్రాధాన్య రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను స్థాపించేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆర్థికాభివృద్ధి సంస్థలతో కలిసి పని చేయాలని ఆస్ట్రేలియాలో టాఫే ఎన్ఎస్డబ్ల్యూ ప్రతినిధులను మంత్రి లోకేశ్ కోరారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ ఆర్.జి.జయసూర్య తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వ్యవహారశైలిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మికి మంగళవారం ఆయన నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు.
సీపీఐ రాష్ట్ర సారథిగా వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన గుజ్జుల ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఇప్పటివరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, ఏపీ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
అనంతపురం అంచునే ఉండే పాపంపేట.. ఇప్పుడు నగరంలో భాగంగా ఉన్నా ఒకప్పుడు గ్రామమే. దశాబ్దాల నుంచి ఆ ఊళ్లో అనేక మంది ఇళ్ల స్థలాలు కొనుక్కుంటున్నారు. రిజిస్ట్రేషన్లూ చేయించుకుంటున్నారు. కొన్ని స్థలాలైతే పదుల సంఖ్యలో చేతులు మారాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చిగురు బాలల ఆశ్రమంలో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. సోమవారం రాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక పరిధిలోని ఆశ్రమానికి వచ్చి చిన్నారులకు బాణసంచా పంచిపెట్టారు.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడులో జరిగిన లక్ష్మీనాయుడి హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కోర్టులో వాదనలు వినిపించేందుకు ప్రత్యేక పీపీని నియమించాలని స్పష్టం చేశారు.
రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పెట్టుబడిదారుల అనుకూల విధానాల కారణంగా 16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
ఆహారశుద్ధి, ఫుడ్ బిజినెస్, ఆక్వా రంగాల్లో మహిళలు చేస్తున్న ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వంద ప్రొడక్ట్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
తితిదే ట్రస్టులకు భారీగా విరాళాలు అందుతున్నాయి. 2024 నవంబరు 1 నుంచి 2025 అక్టోబరు 16 వరకు మొత్తం రూ.918.6 కోట్ల విరాళాలు అందినట్లు ఛైర్మన్ బీఆర్ నాయుడు సోమవారం తెలిపారు.
శ్రీశైల మహాక్షేత్రంలో బుధవారం నుంచి కార్తిక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 21 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎం.శ్రీనివాసరావు తెలిపారు.
ఇక్కడ వరుసలో నిలబడిన వీరంతా గిరిజన కుటుంబాలకు చెందిన విద్యార్థులు. తల్లిదండ్రులు వీరిని ఇంటివద్ద వదిలి కూలిపనులకు వెళ్తుంటారు. ఈ పిల్లల ఆకలి తీర్చాలని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని స్వయంభూ ఆశ్రమ నిర్వాహకులు అంబలిస్వామి సంకల్పించారు.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత మంగళవారం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి తితిదే అధికారులు స్వాగతం పలికి,
నవంబరులో విశాఖలో నిర్వహించే భాగస్వామ్య సదస్సును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్లు ఇప్పటికే సింగపూర్లో పర్యటించారు. అక్కడ పలువురు ప్రముఖులతో నిర్వహించిన సమావేశాల్లో..
ఉల్లాసం కోసం ఉద్దేశించిన పార్క్ స్థలానికి ఖాళీస్థలం పన్ను (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్-వీఎల్టీ) వేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. వాణిజ్య అవసరాల కోసం భూమార్పిడి జరగనంత వరకు ఆ భూమికి వీఎల్టీ విధించడం సమర్థనీయం కాదంది.
శీతాకాలం ప్రారంభం కావడంతో వంజంగి మేఘాల కొండ క్షీరసముద్రంలా మారిపోయింది. పాలనురగ లాంటి మేఘాలను కప్పుకొన్న పచ్చటి కొండలు తమను చూసేందుకు పర్యాటకులు వచ్చారా.. లేదా అన్నట్లు తలలు పైకెత్తి చూస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పల్లెపండగ 2.0 కార్యక్రమంలో రూ.6,500 కోట్లతో వివిధ పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రహదారుల నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు.
ప్రాక్టికల్స్ ఉన్న సైన్స్ సబ్జెక్టుల రాత పరీక్షల్లో ఇంటర్మీడియట్ విద్యామండలి అర మార్కు సడలింపునిచ్చింది. రెండు సంవత్సరాల్లో కలిపి రాతపరీక్షలో అర మార్కు తక్కువ వచ్చినా ఉత్తీర్ణులుగానే పరిగణించనున్నట్లు ప్రకటించింది.