తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి శివశంకర్‌ను ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనను ఏపీకి పంపాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అనంతసాగర్‌లో డెంగీతో బోనగిరి యశ్వంత్(10) శుక్రవారం మృతిచెందాడు. యశ్వంత్‌కు రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో అతని తండ్రి కిష్టయ్య కుకునూర్పల్లెలో వైద్యం చేయించారు.