ఎల్లుండి దీపావళి... టెన్ థౌజండ్వాలాతో మోత మోగించాలని... బాణసంచాతో సందడి చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఓ నిమిషం... కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి చేయకుండా, గాలి నాణ్యత పడిపోకుండా జాగ్రత్తలు తీసుకుందామా?దానికున్న మంచి మార్గం... గ్రీన్ క్రాకర్స్ (హరిత టపాసులు).
మీ పిల్లలను కిడ్నాప్ చేశామంటూ పోలీసుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భారతీయులు... ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు గడ్డుకాలం తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా... ఇప్పటికీ అక్కడ మనకు అవకాశాలు, అదే సమయంలో సవాళ్లూ ఉన్నాయని ఐటీ నిపుణులు, టెక్సాస్‌లోని జేఎన్టీయూ పూర్వ విద్యార్థుల సంఘం డైరెక్టర్ డాక్టర్ కె.ఫణిరాజకుమార్ తెలిపారు.
దీపావళి వచ్చిందంటే గుస్సాడీ ఉత్సవాలతో ఆదివాసీ గిరిజన గ్రామాలు సందడిగా ఉంటాయి. ప్రతి ఇంటా పండగ శోభ వెల్లివిరుస్తుంది. ఈ వేడుక కోసం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం పెండల్‌ధరి గిరిజన గ్రామ వాసులు ఈసారి వినూత్న ఏర్పాట్లు చేశారు.
చేతి వేళ్లన్నింటికీ ఉంగరాలు.. మణికట్టుకు కడియం, బ్రేస్లెట్, మెడలో గొలుసులతో మెరిసిపోతున్న ఈ యువకుడి పేరు మిర్యాల కృష్ణ. అంబర్‌పేటకు చెందిన ఆయన డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు.
పెద్దపల్లి-జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మధ్య రవాణా సౌకర్యం కోసం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడెడ్ వద్ద మానేరు నదిపై ప్రారంభించిన వంతెన నిర్మాణం ఎనిమిదేళ్లు గడుస్తున్నా.. అసంపూర్తిగా మిగిలిపోయింది.
తెలంగాణలో పప్పు దినుసుల సాగును భారీఎత్తున పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 19,397 ఎకరాలకు సరిపడా 5,825 క్వింటాళ్ల శనగ విత్తనాలను 50 శాతం సబ్సిడీతో 14 జిల్లాలలో పంపిణీ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం కార్తిక మాసం వేడుకలకు ముస్తాబవుతోంది. బుధవారం నుంచి వేడుకల నిర్వహణకు దేవస్థానం సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలో సహకార, చేనేతశాఖల్లో దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ అయ్యాయి. గ్రూపు-2కి ఎంపికైనవారిలో 63 మందిని సహకారశాఖ సహాయ రిజిస్ట్రార్లుగా, 38 మందిని చేనేతశాఖ సహాయ అభివృద్ధి అధికారులుగా నియమిస్తూ ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం సాయంత్రం నాంపల్లి కోర్టు బార్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శులు 2025-2026కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
‘ఉక్కు మనిషి’ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాన్ని రాష్ట్రంలో విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు కోరారు.
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో సామగ్రి వాటా (మెటీరియల్ కంపోనెంట్) నిధులను ఇకపై ట్రెజరీ శాఖ పరిశీలన అనంతరమే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని పంచాయతీరాజ్‌శాఖ నిర్ణయించింది.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌తో పాటు ఇతర వృత్తి విద్యా కళాశాలలు నవంబరు 3 నుంచి బంద్ పాటిస్తామని ప్రైవేట్ కళాశాలల సమాఖ్య తెలిపింది.
విద్యుత్తు వాహనాలు (ఈవీలు), స్మార్ట్ఫోన్లు, ఇంధన నిల్వ వ్యవస్థల కోసం బ్యాటరీల తయారీలో ఉపయోగించే లిథియం నిల్వలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. తెల్ల బంగారంగా పిలిచే ఈ ఖనిజం కోసం భారత్ సైతం దేశీయంగా అన్వేషిస్తోంది.
మంత్రివర్గ సమావేశంలో ఏం జరిగిందనే అంశంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చర్చకు రావాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సవాల్ విసిరారు.
రాజకీయ రంగస్థలంలో ప్రజాస్వామ్యం గురించి వల్లె వేస్తూ కొందరు రాజకీయ నేతలు మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారని, వారు సాయుధ వర్గాలతో సంబంధాలను తెంచుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
రాష్ట్రంలోని గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికుల(మల్టీపర్పస్ వర్కర్ల)కు సంబంధించి సమగ్ర సమాచారం ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
నదులు, వాగుల్లో వరదనీరు వచ్చి చేరడంతో రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడింది. సాండ్ రీచ్‌లలో తవ్వకాలు ఆగిపోవడంతో బహిరంగ మార్కెట్లో ఇసుకకు భారీ డిమాండ్ ఉంది.
నేరుగా రూ.78 వేల రాయితీ ఇస్తామంటే ఎవరైనా వద్దంటారా..? అలాగే ఉంది మరి రాష్ట్రంలో పరిస్థితి. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనపై తెలంగాణ ప్రజలు ఆసక్తి చూపడం లేదు.
శ్రీవారికి అత్యంత విశ్వాస భక్తుడైన హథీరాంజీ బాబా చరిత్ర కనుమరుగు కాకుండా ట్రస్టును ఏర్పాటు చేయడంతోపాటు తితిదే బోర్డులో ఏపీ, తెలంగాణ బంజారాలకు స్థానం కల్పించాలని తెలంగాణ బంజారా సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
చెడుపై ధర్మం సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకొనే పండగ దీపావళి అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో సిరప్‌ల తయారీదారులపై ఔషధ నియంత్రణ విభాగం (డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్- డీసీఏ) నిఘా మరింత పెంచింది. మధ్యప్రదేశ్‌లో దగ్గు మందు తీసుకున్న చిన్నారులు మృత్యువాత పడ్డ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే.
అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన రవాణాశాఖ చెక్‌పోస్టుల్లో అవినీతి రవాణా అవుతోంది. కొందరు అధికారులు ప్రైవేటు సిబ్బందిని పెట్టుకుని యథేచ్ఛగా అక్రమ వసూళ్లు కొనసాగిస్తున్నారు.
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్‌ను జతచేయడం తప్పనిసరి చేస్తున్న ప్రభుత్వం... భూముల సర్వేకు ఫీజులను నిర్ణయించింది. లైసెన్స్డ్ సర్వేయర్లకు భూ యజమానులు చెల్లించే ఫీజులో ప్రభుత్వం 5% మినహాయించుకుని 95 శాతాన్ని చెల్లించనుంది.
మేడారం జాతర పనుల వివాదాలు మొదలు, బిల్లుల విడుదల వరకు ప్రతి సందర్భంలోనూ కమీషన్ల కోసమే మంత్రులు కొట్లాడుతున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు.
శాసనసభకు పోటీచేసే అభ్యర్థుల కనిష్ఠ వయోపరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించేందుకు రాజ్యాంగ సవరణ చేపట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఓ వైపు ఎన్కౌంటర్లు.. మరోవైపు లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఉనికి రోజురోజుకూ పరిమితమైపోతోంది. ఒకప్పుడు దండకారణ్యంలో జనతన సర్కార్ పేరిట సమాంతర పాలన సాగించిన మావోయిస్టులు.. ప్రస్తుతం ప్రాణాలతో ఉంటే చాలనుకునే పరిస్థితి నెలకొంది.
మావోయిస్టు పార్టీలో లేఖల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాడర్‌ను కాపాడుకునేందుకు ఆయుధాలు అప్పగించి లొంగిపోవడం మినహా మరోమార్గం లేదని కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ ఎలియాస్ సోనూ బహిరంగ లేఖ రాయడం, ఆ తర్వాత సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోవడం తెలిసిందే.
జేఈఈ మెయిన్-2026 తొలి విడత పరీక్షలు జనవరి 21, రెండో విడత ఏప్రిల్ 1 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) ఆదివారం తేదీలను ప్రకటించింది.
నమ్మలేని నిజాలకు....విశిష్టతలకు ఒక్కటే సమాధానం... రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల ప్రభుత్వ పాఠశాల. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో.. అదీ ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు బోధిస్తారు.
పిల్లల భవిష్యత్తు.. కుటుంబ పోషణ.. అప్పుల నుంచి విముక్తి.. ఇలా ఎన్నో ఆశలు మోసుకుంటూ ఎంతోమంది రాష్ట్రం నుంచి విదేశాలకు.. ప్రధానంగా ఎడారి దేశాలకు వలస వెళుతున్నారు. వీరి ఆశలను ఆసరాగా చేసుకుని నకిలీ ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారు.
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని... అందులో భాగంగానే లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థను తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.