సూచిక 
సాక్షి, పూర్తి వార్తల కోసం క్లిక్ చేయండి.
తెలంగాణ

ఆదిలాబాద్(బెల్లంపల్లి): కొంతకాలంగా అనారో గ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు చికిత్స చేయించుకున్నా మెరుగు పడకపోవడంతో మనస్తాపం చెందాడు. అనారోగ్యం బాధను భరించలేకపోయాడు. ఇక చావే శరణ్యమనుకున్నాడు. ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జెండా వెంకటాపూర్‌లో జరిగింది. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చెల్మాటికారి సత్తయ్య, అమృత దంపతుల కుమారుడు అనిల్ (24) పీజీ పూర్తిచేసి ఇంటివద్దే ఉంటున్నాడు. కొంతకాలంగా పచ్చకామెర్లు, దవడ బిల్లలు, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నాడు. చికిత్స చేయించినా నయం కాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం ఇంట్లోనే దూలానికి చీరతో ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. ఉరేసుకునే ముందు బెడ్రూమ్లో అతని మంచంపై సుసైడ్ నోట్ రాసిపెట్టాడు. ‘అమ్మా.. నన్ను క్షమించండి.. నాకు ఆరోగ్యం బాగుండడంలేదు. బాధ భరించలేక చనిపోతున్నా. నా చావుకు ఎవరూ కారణం కాదు. నా సొంత నిర్ణయంతో చనిపోతున్నా. అన్నయ్య సారీ రా... నీవు ఈ లెటర్ చదివే సమయానికి నేను నీతో ఉండను.. అమ్మా నాన్నను కష్టపెట్టకు.. నన్ను మీరంతా క్షమిస్తారని ఆశిస్తూ.. సెలవు తీసుకుంటున్నా.. అని నోట్ రాసి ఉంచాడు. మృతుని తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.నేత్రదానంఅనిల్ కళ్లు దానం చేయడానికి తల్లిదండ్రులు ముందుకు వచ్చి సోపతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు భీం పుత్ర శ్రీనివాస్, బ్లడ్ డోనర్ అసోసియేషన్ అధ్యక్షుడు రహీమ్‌కు సమాచారం అందించారు. దీంతో వారు హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ ఐ బ్యాంకు టెక్నీషియన్ ప్రదీప్‌కుమార్‌కు తెలియజేయడంతో గ్రామానికి వచ్చి నేత్రాలు సేకరించారు. Wed, Apr 16 2025 1:45 PM
వరంగల్: ఉన్నత విద్యనభ్యసించాడు. ఎంతకూ పెద్ద ఉద్యోగం రాలేదు. చివరికి ఓ కంపెనీలో చిన్న ఉద్యోగంలో చేరాడు. వచ్చే వేతనం ఖర్చులకూ సరిపోవడం లేదు. మంచి ఉద్యోగం లేదని వచ్చిన పెళ్లి సంబంధాలు రద్దువుతున్నాయి. దీంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఇంగోళి రాజేశ్వర్‌రావు, పద్మ దంపతుల కుమారుడు వేణు(30) బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు సాగించి చివరికి తక్కువ వేతనానికి హైదరాబాద్‌లో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అయితే వేతనం ఖర్చులకు సరిపోకపోవడంతో నాలుగు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. ఈ విషయం తండ్రికి చెప్పడంతో వ్యవసాయం చేసుకుందామని చెప్పి ఓదార్చాడు. వ్యవసాయ పనులు చేయలేక పోయాడు. ఏ పనిచేయలేక తల్లిదండ్రులకు భారంగా మారానని మదనపడుతున్నాడు. ఇదే తరుణంలో వేణుకు అనేక పెళ్లి సంబంధాలు చూశారు. వేణు ఉద్యోగ వివరాలు తెలుసుకున్నాక పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. ఇలా మూడు సంబంధాలు రద్దు అయ్యాయి. ఇక తనకు పెళ్లికాదని మనస్తాపంతో తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లిన అనంతరం ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన మృతుడి అమ్మమ్మ లచ్చమ్మ దారి వెంట వెళ్తున్న వారిని పిలిచి విషయం చెప్పి తలుపులు తీయించింది. అప్పటికే వేణు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కిందికి దించి చూడగా మృతిచెంది ఉన్నాడు. చేతికందొచ్చిన కుమారుడు బలవన్మరణానికి పాల్పడడంతో రాజేశ్వర్‌రావు, పద్మ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తెలిపారు. Tue, Apr 15 2025 1:47 PM

జిల్లా కోర్టుల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లా జడ్జీల్లో 60 శాతం వరకు మహిళలున్నారు. భవిష్యత్‌లో రాష్ట్రంలోని న్యాయవ్యవస్థలో పురుషుల కోసం 30% రిజర్వు చేయాల్సిన పరిస్థితి రావొచ్చు (నవ్వుతూ).జస్టిస్ సుజోయ్‌పాల్, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిలింగ భేదానికి తావులేకుండా తమను తాము నిరూపించుకున్నప్పుడే మహిళలు నిజంగా సంతోషంగా ఉంటారు. కోర్టులకొచ్చే ప్రజలు న్యాయమూర్తి పురుషుడా.. మహిళా.. అని చూడటం లేదు. న్యాయం అందుతోందా? లేదా? అనేదే చూస్తున్నారు. జస్టిస్ మౌషుమిభట్టాచార్య, హైకోర్టు న్యాయమూర్తిసాక్షి, హైదరాబాద్: కోర్టు అనగానే న్యాయదేవతే అందరికీ గుర్తొస్తుంది. కానీ, చాలా ఏళ్లు పురుషాధిక్యతే కొనసాగింది. ఇప్పుడు న్యాయవ్యవస్థ తమదే అంటూ సాగిపోతున్నారు మహిళలు. కేవలం చిహ్నానికే పరిమితం కాకుండా మహిళలు న్యాయదేవతలుగా అవతరిస్తున్నారు. న్యాయం అరి్థంచే స్థాయి నుంచి న్యాయం అందించే స్థాయికి ఎదుగుతున్నారు. ఈ విషయంలో దేశానికి తెలంగాణ (Telangana) స్ఫూర్తిగా నిలుస్తోంది. జిల్లా, కింది కోర్టుల జడ్జీల్లో 56 శాతం మహిళలే న్యాయం అందిస్తున్నారు. ఉన్నత న్యాయస్థానంలోనూ 33 శాతంతో ముఖ్యమైన కేసుల్లోనూ తీర్పులిస్తున్నారు. భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. మహిళలకు న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకునే హక్కులేదని చెప్పిన ఈ దేశంలోనే పురుషులను మించి సత్తా చాటుకుంటున్నారు. రోజూ వందల తీర్పులిస్తున్న న్యాయదేవతలపై ప్రత్యేక కథనం. మహిళా న్యాయవాదా? కుదరదు.. కోల్‌కతాకు చెందిన రెజీనా గుహ న్యాయవిద్య పూర్తి చేసుకుని, అలీపూర్ జిల్లా జడ్జి కోర్టులో ప్లీడర్ (లాయర్)గా చేరడానికి 1916లో దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో అదో పెద్ద వింత. మహిళలు నమోదు చేసుకోవడానికి అనుమతి లేదంటూ ఆమె దరఖాస్తును తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెజీనా కలకత్తా హైకోర్టులో పిటిషన్ వేశారు. లీగల్ ప్రాక్టీషనర్స్ యాక్ట్.. అర్హత కలిగిన ‘వ్యక్తులు’ న్యాయవాదులుగా నమోదు చేసుకోవడానికి అనుమతిస్తుందని పేర్కొన్నారు. వ్యక్తి అంటే మహిళ అని కూడా అర్థం అని నివేదించారు. అయితే విచిత్రంగా ఆమె పిటిషన్‌ను నాటి కోర్టు కొట్టివేసింది. హైకోర్టు జడ్జీగా పదవిని స్వీకరించమని చాలామంది మహిళాలను ఆహ్వానించాం. కానీ, వాళ్లంతా నిరాకరించారు. ఇంటి బాధ్యతలున్నాయి, పిల్లవాడు పన్నెండో తరగతి చదువుతున్నాడు.. లాంటి కారణాలు చెప్పి హైకోర్టు జడ్జిగా ఉండటానికి నిరాకరించారని ఒక హైకోర్టు న్యాయమూర్తి నాకు రిపోర్ట్ చేశారు. ఈ విషయాలన్నిటినీ బహిరంగంగా చర్చించలేం. –2021లో జస్టిస్ బోబ్డే దేశవ్యాప్తంగా 33 శాతం మహిళా న్యాయమూర్తులున్న అతి కొద్ది హైకోర్టుల్లో తెలంగాణ ఒకటి. జిల్లా కోర్టులతో పోలిస్తే హైకోర్టులు, సుప్రీంకోర్టు మహిళల శాతంలో వెనుకబడి ఉన్నాయి. మహిళలను న్యాయమూర్తులుగా మార్చేందుకు బార్ ప్రోత్సాహం మరింత అవసరం. –జస్టిస్ రాధారాణి సమాజంలో మహిళలు శక్తిమంతంగా మారితే అది శాంతికి, శ్రేయస్సుకు దారితీస్తుంది. తల్లిగా, భార్యగా, చెల్లిగా, కూతురిగానే కాదు.. న్యాయమూర్తిగా సేవలు అందించడంలోనూ మహిళలు ముందుంటున్నారు. –జస్టిస్ సూరేపల్లి నందా న్యాయ విద్యలో రాణిస్తున్నారు మహిళలు ఎన్నో రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారు. న్యాయ వ్యవస్థలోనూ న్యాయమూర్తులుగా ఎంతో మంది మహిళలు న్యాయం అందిస్తున్నారు. రాష్ట్రంలో 56 శాతం మహిళలు ఉండటం శుభపరిణామం. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోనూ ఈ స్థాయికి చేరాలని అభిలíÙస్తున్నా. న్యాయ విద్యతో మహిళలు తమ హక్కులు తెలుసుకోగలుగుతారు. న్యాయ విద్యతో ఎన్నో ఉపాధి అవకాశాలున్నాయి. మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖలోనూ ప్రత్యేక పోస్టులుంటాయ్. మహిళలు న్యాయవ్యవస్థలో మరింత రాణించాలి. –సాయి రమాదేవి, సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇప్పటికే ఆలస్యమైంది. మనకు దేశంలో స్త్రీ, పురుష నిష్పత్తి 50ః50 ఉంటే న్యాయవ్యవస్థలో కూడా ఈ నిష్పత్తి ప్రతిబింబించాలి. లింగ సమానత్వం ఉండాలి. ఈ సమస్యపై ఎప్పుడో పోరాటం జరగాల్సింది. అలా జరిగి ఉంటే ఈపాటికి మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెరిగి ఉండేది. –శోభా గుప్త, లాయర్ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య: 42 ప్రస్తుతం పనిచేస్తున్న వారు: 30 పురుషులు: 20 మహిళలు: 10 పనిచేస్తున్న న్యాయమూర్తుల్లో మహిళల శాతం: 33.3 హైకోర్టులో మహిళా న్యాయమూర్తులు.. జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ పీ శ్రీసుధ, జస్టిస్ జీ రాధారాణి, జస్టిస్ టి.మాధవీ దేవి, జస్టిస్ సూరేపల్లి నందా, జస్టిస్ జువ్వాడీ శ్రీదేవి, జస్టిస్ ఎంజీ ప్రియదర్శిని, జస్టిస్ సుజన కళాసికం, జస్టిస్ రేణుక యారా, జస్టిస్ తిరుమలాదేవి Mon, Apr 14 2025 5:48 AM

కోరుట్ల: ‘అప్పటికి నాది ఏమి తెలియని వయసు.. ఆ సమయంలోనే మావోయిస్టుల్లో కలిశాను. నా భర్త పసుల రాంరెడ్డితో కలిసి కొన్నాళ్లు పనిచేశాను. తరువాత కొంత కాలానికి ఒక్కదానినే బస్తర్ డివిజన్లో మావోయిస్టు అజ్ఞాతదళాలతో కలిసి పనిచేసిన. నాలుగైదు సార్లు కాల్పుల నుంచి తప్పించుకున్న. ఉత్తర బస్తర్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. ఈ ఏడాది జనవరిలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ పోలీసులకు లొంగిపోయాను. సుమారు 45ఏళ్ల తరువాత మా వాళ్లు నన్ను ఆదరిస్తారని అనుకోలేదు. నా కూతురు భవానీ, కోరుట్ల, కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన బంధువులు అంతా నన్ను అక్కున చేర్చుకున్నారు. భర్త రాంరెడ్డి చనిపోయి పాతికేళ్లు గడుస్తున్నా.. బంధువులంతా నా వెంట నిలిచారు’.. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు ఇటీవల లొంగిపోయి.. సుమారు 45 ఏళ్ల తరువాత ఇంటికి తిరిగొచ్చిన మావోయిస్టు వసంత అలియాస్ గంబాలు. రెండు రోజుల క్రితం ఇంటికి..రెండురోజుల క్రితం ఛత్తీస్‌గఢ్ పోలీసులు వసంతను తన కూతురు భవానీకి అప్పగించి ఇంటికి పంపించిన క్రమంలో సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వసంత బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆమెను ఆప్యాయతతో పలకరించి అక్కున చేర్చుకుని కంటతడి పెట్టారు. వసంత కూతురు భవానీ మాట్లాడుతూ తనకు తల్లి లేదని అనుకున్నానని, కానీ బతికే ఉందని తెలిసి ఎంతో సంతోషపడ్డానని చెప్పారు. ఎంత కష్టమైన సరే తన తల్లిని తన వద్దకు తెచ్చుకుని ఆప్యాయంగా చూసుకోవాలని నిర్ణయించుకుని తన పెద్ద నాన్న కుమారుడు పసుల కృష్ణప్రసాద్, అంబేడ్కర్ సంఘాల నాయకులు వుయ్యాల నర్సయ్య సాయంతో ఛత్తీస్‌గఢ్ వెళ్లానని అక్కడి పోలీసులు పూర్తిగా సహకరించారని పేర్కొన్నారు. పార్టీలోనే చనిపోయిందనుకున్నాం: బంధువులులొంగిపోయిన మావోయిస్టు పసుల వసంత సోదరి పెద్ద గంబాలు మాట్లాడుతూ.. తమ చెల్లి ఎప్పుడో పార్టీలోనే చనిపోయిందని అనుకున్నామని, ఇప్పటికి తిరిగి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మావోయిస్టు పార్టీలో నిర్వహించిన కార్యకలాపాల గురించి పసుల వసంత ఏమీ వెల్లడించలేదు. తనకు పెద్దగా ఏమీ గుర్తులేదని చెప్పడం గమనార్హం. పసుల వసంత అనారోగ్యంతో ఉండటంతోపాటు తెలుగు సరిగా రాకపోవడం.. ఛత్తీస్‌గఢ్ వాసులు గోండు భాష ఎక్కువగా మాట్లాడటంతో వివరాల వెల్లడి ఇబ్బందికరంగా మారింది. వసంతకు వచ్చే రివార్డు డబ్బులు త్వరలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కూతురు భవానీ విజ్ఞప్తి చేశారు. Tue, Apr 15 2025 8:10 AM

హైదరాబాద్: MMTS రైలులో అత్యాచారం ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. మార్చి 22వ తేదీన MMTS రైలులో తనపై అత్యాచారం జరిగిందంటూ ఓ యువతి చేసిన ఫిర్యాదు అంతా ఫేక్ అని తేలింది. అత్యాచారం జరిగిందంటూ యువతి చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులకు షాక్ తగిలింది. అసలు అత్యాచారమే జరగలేదని కేసును క్లోజ్ చేశారు. పోలీసులను సదరు యువతి తప్పుదోవ పట్టించిందని, దాంతో కేసును మూసివేశారు.ఇన్ స్టా రీల్స్ చేస్తూ కిందపడి..ఆ యువతి ఇన్ స్టా రీల్స్ చేస్తూ MMTS రైలు నుంచి కిందపడింది. దానిని కప్పిపుచ్చుకునేందుకు ఓ డ్రామాకు తెరలేపింది. పోలీసులకు అనుమానం రాకుండా వారిని తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది. తనపై అత్యాచారం జరగబోయిందని, అందుకే రైలు నుంచి దూకేసినట్లు ఫిర్యాదు చేసింది.250 సీసీ కెమెరాలతో జల్లెడపట్టిన పోలీసులుఅత్యాచారం జరిగిందంటూ యువతి చేసిన ఫిర్యాదును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఆమె ఆ క్షణంలో తప్పించుకుని బయటపడితే, పోలీసులు మాత్రం దర్యాప్తును లోతుగా చేపట్టారు. 250 సీసీ కెమెరాలతో జల్లెడు పట్టి మరీ అత్యాచారం ఎలా జరిగిందనే కోణాన్ని పరిశీలించారు. దీనిలో భాంగా 100 మంది అనుమానితులను ప్రశ్నించారు పోలీసులు. చివరకు ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఆ యువతిని మరొకసారి విచారించారు. చివరకు విచారణలో తనపై ఎటువంటి అత్యాచార యత్నం జరగలేదని తెలిపింది. కేవలం రీల్స్ చేస్తూ కిందపడిపోవడంతో ఆ రకంగా అబద్ధం చెప్పానని ఒప్పుకుంది సదరు యువతి. కాగా, గత నెల 22వ తేదీన ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై అత్యాచార యత్నం జరిగిందనే వార్త నగరంలో కలకలం రేపింది. ఆగంతకుడి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా వెళ్తున్న రైలు నుంచి బాధితురాలు కిందకు దూకినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి. రైలు నుంచి కిందపడి గాయాల పాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకుంది. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి (23) మేడ్చల్‌లోని ఒక ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. మార్చి 22న మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన మొబైల్ రిపేర్ చేయించుకునేందుకు సికింద్రాబాద్‌కు వచ్చింది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తెల్లాపూర్– మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది. ఈ క్రమంలోనే రీల్స్ చేస్తూ కింద పడింది. అయితే ఆ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అత్యాచారం డ్రామాకు తెరలేపింది. Fri, Apr 18 2025 3:49 PM
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ కొలువుల నియామకాల జాతర మొదలు పెడతామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి, ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసి రాష్ట్రం చరిత్ర సృష్టించిందన్నారు. వర్గీకరణ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైందని, వర్గీకరణకు లోబడి త్వరలో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి చర్యలు వేగవంతం చేస్తామని తెలిపారు. సోమవారం సచివాలయంలో ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులను.. ఎస్సీ వర్గీకరణపై మంత్రివర్గ ఉపసంఘం కోచైర్మన్, మంత్రి దామోదర రాజ నర్సింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్, దీనిపై ఏర్పాటైన వన్‌మ్యాన్ జ్యుడీíÙయల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్, ఇతరఅధికారులతో కలిసి ఉత్తమ్ విడుదల చేశారు. ఉత్తర్వుల తొలి ప్రతిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చారిత్రక అంశంమని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక, దేశంలోనే వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. వర్గీకరణకు సంబంధించిన గెజిట్ విడుదలతో పాటు నాలుగు జీఓలు జారీ చేశామని తెలిపారు. రాష్ట్రంలో వర్గీకరణ అమల్లోకి రావడంతో అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ సమీక్షలో శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలు ఖరారు చేస్తామని, ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తామని అన్నారు. మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడుతూ.. వర్గీకరణకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న ఎస్సీ కులాల్లోని అన్ని వర్గాల నుంచి దాదాపు 8 వేలకు పైబడి వినతులు స్వీకరించినట్లు చెప్పారు. వాటిని కూలంకషంగా పరిశీలన చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసిన వన్‌మెన్ కమిషన్.. అభిప్రాయాలు స్వీకరించి వాటిని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదించిందని చెప్పారు. మూడు దశాబ్దాలుగా ఉన్న ఎస్సీ ప్రజల కోరికను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించి అమల్లోకి తీసుకువచి్చందని అన్నారు. Tue, Apr 15 2025 5:53 AM

సోన్/నిర్మల్/ధర్మపురి/ఆర్మూర్ టౌన్: పొట్టకూటి కోసం దుబాయ్ వలస వెళ్లిన ఇద్దరు తెలంగాణ వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. వీరు దుబాయ్‌లోని అల్‌క్యూజ్ ప్రాంతంలో మోడర్న్ బేకరీలో పనిచేస్తున్నారు. వీరితోపాటు అక్కడే పనిచేస్తున్న పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి వీరిని కత్తితో విచక్షణారహితంగా నరికి చంపారు. మతవిద్వేషంతోనే వారిని చంపినట్లు అక్కడ ఉంటున్న తెలంగాణవాసులు చెప్పారు. బేకరీలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తానీ దాడిలో నిర్మల్ జిల్లాకు చెందిన ఆష్టపు ప్రేమ్‌సాగర్ (40), జగిత్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్ మరణించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన దేగాం సాగర్‌కు గాయాలయ్యాయి. సాగర్‌ను సహోద్యోగులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి ఘటనకు సంబంధించిన సమాచారాన్ని బయటకు చేరవేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని యాజమాన్యం హెచ్చరించినట్లు వారి బంధువులు చెప్పారు. చిన్న బిడ్డను చూడకుండానే..నిర్మల్ జిల్లా సోన్ మండలానికి చెందిన ప్రేమ్‌సాగర్ (40) ఇరవై ఏళ్లుగా గల్ఫ్‌లో పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం దుబాయ్‌లోని మోడర్న్ బేకరీలో యంత్రం ఆపరేట్ చేసే పనిలో చేరాడు. ప్రేమ్‌సాగర్‌కు తల్లి లక్ష్మి, భార్య ప్రమీల (35), కూతుళ్లు విజ్ఞశ్రీ (9), సహస్ర(2) ఉన్నారు. పదిరోజుల క్రితమే ప్రేమ్‌సాగర్ నాన్నమ్మ ముత్తమ్మ (90) చనిపోయారు. ఆమె పెద్దకర్మ చేసిన శుక్రవారం రోజే ప్రేమ్‌సాగర్ హత్యకు గురయ్యాడు. ప్రేమ్‌సాగర్ మృతి వార్తను ఆయన కుటుంబసభ్యులకు చెప్పలేదు. ప్రేమ్‌సాగర్ తన చిన్నకూతురు సహస్ర తల్లి కడుపులో ఉన్నప్పుడే దుబాయ్ వెళ్లాడు. తను పుట్టినప్పటి నుంచి గ్రామానికి రాలేదు. బిడ్డను చూడకుండానే ఆయన తనువు చాలించడం స్థానికులను కలచివేస్తోంది. కాగా, దుబాయ్‌లో మరణించిన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాస్ (42)కు భార్య మంజుల, ఇద్దరు కుమారులు, తల్లి ఉన్నారు. శ్రీనివాస్ మృతి విషయం ఆయన తల్లి రాజవ్వకు ఇంకా చెప్పలేదు. ప్రేమ్‌సాగర్ కుటుంబానికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అండగా నిలిచారు. మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకురా>,వడంతోపాటు నిందితులపై కఠినచర్యలు తీసుకునేలా చూడాలని విదేశాంగ శాఖను కోరారు.విదేశాంగ శాఖ మంత్రికి కిషన్‌రెడ్డి లేఖసాక్షి, న్యూఢిల్లీ: ఇద్దరు తెలంగాణ వ్యక్తులను ఓ పాకిస్తానీ హత్య చేసిన ఘటనపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. ఈ విషయంలో చొరవతీసుకుని వీలైనంత త్వరగా మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడంలో సహకరించాలని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన విదేశాంగ మంత్రి జైశంకర్ ఆదేశాలకు అనుగుణంగా దుబాయ్ లోని భారత కాన్సులేట్ అధికారులు.. బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు వివరాలను తెలుసుకున్నారు. ఉద్దేశపూర్వక హత్యకేసుగా నమోదు చేశామని పోలీసులు వారికి చెప్పారు. కాగా, ఇద్దరు తెలంగాణ కార్మికులు మరణించడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. భారత కాన్సులేట్ ద్వారా దుబాయ్ పోలీసులు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఆయన ప్రేమ్ సాగర్ సోదరుడు అష్టపు సందీప్‌తోనూ మాట్లాడారు. Wed, Apr 16 2025 12:47 AM
సాక్షి, మేడ్చల్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇద్దరు కొడుకులను వేట కొడవలితో నరికి చంపిన తల్లి.. ఆ తర్వాత తాను భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. గాజుల రామారంలో ఘటన జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.సికింద్రాబాద్‌లో అగ్ని ప్రమాదంసికింద్రాబాద్ మచ్చ బొల్లారంలో ఓ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. శుభకార్యాలకు సంబంధించిన అలంకరణ సామగ్రి ఉన్న గోదాంలో ఈ ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. దాదాపు రూ.6 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. Thu, Apr 17 2025 5:50 PM

సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సొరంగం కుప్పకూలి 50 రోజులు దాటుతోంది. మొత్తం 8 మంది కార్మికులు చిక్కుకుపోగా వందల మంది సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నా ఇప్పటికీ ఆరుగురు కార్మికుల జాడ బయటపడకపోవడం సొరంగాల నిర్మాణం ఎంత రిస్క్ తో కూడుకున్న వ్యవహారమో స్పష్టం చేస్తుంది. సాగునీటి ప్రాజెక్టులతో పాటు రైలు మార్గాలు, రహదారుల కోసం ప్రపంచ వ్యాప్తంగా వీటిని నిర్మిస్తుంటారు. కొన్ని కొండ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయం లేనప్పుడు సొరంగాల నిర్మాణం అనివార్యమవుతోంది.ఈ క్రమంలోనే గత దశాబ్ద కాలంగా దేశంలో సొరంగాల నిర్మాణం ఊపందుకుంది. గత ఏడాది డిసెంబర్ నాటికి దేశంలో 60 కి.మీ. నిడివి గల 42 సొరంగ మార్గాల నిర్మాణం పూర్తి చేశారు. మరో 75 సొరంగ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. 146 కి.మీ. నిడివి గల వీటి నిర్మాణానికి ప్రభుత్వాలు రూ.49 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు కాగల మరో 78 ప్రాజెక్టులు ప్రణాళికల స్థాయిలో ఉన్నాయి. వీటి మొత్తం నిడివి 286 కి.మీ. కావటం విశేషం. ‘ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీసెర్చ్’నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశంలో సొరంగ మార్గాల మొత్తం నిడివి 3,400 కి.మీ.కు చేరుకుంది. అయితే ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదం నేపథ్యంలో ఇప్పుడు సొరంగాల నిర్మాణం చర్చనీయాంశమవుతోంది. దేశంలోని ప్రధాన సొరంగాలు⇒ అస్సాంలో బ్రహ్మపుత్ర నదీ గర్భంలో నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 34 కి.మీ. భారీ సొరంగమార్గాన్ని రూ.6,000 కోట్ల వ్యయంతో నిర్మించబోతోంది. ఇందులో నాలుగు వరుసల రహదారితోపాటు ప్రత్యేకంగా రైల్వే లైన్ కూడా ఉండనుంది. దేశంలో ఇదే భారీ సొరంగ మార్గం కాబోతోంది. ఇది పూర్తయితే గోహ్పూర్–నుమాలిగర్ పట్టణాల మధ్య ప్రయాణానికి ప్రస్తుతం పడుతున్న 6.30 గంటల సమయం అరగంటకు తగ్గుతుంది. ⇒ రూ.4,965 కోట్లతో హుగ్లీ నదీ గర్భంలో నిర్మించిన కోల్‌కతా ఈస్ట్–వెస్ట్ మెట్రో కారిడార్ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ⇒ జమ్మూకశ్మీర్‌లో ప్రధాన ప్రాంతాలను అనుసంధానిస్తూ నిర్మిస్తున్న ఉదంపూర్–శ్రీనగర్–బారాముల్లా రైల్‌లింక్ ప్రాజెక్టు (యూఎస్బీఆర్ఎల్) ప్రపంచంలో సొరంగాలతో కూడిన కీలక మార్గాల్లో ఒకటిగా నిలుస్తోంది. 324 కి.మీ. నిడివి ఉండే ఈ మార్గంలో ఏకంగా 38 సొరంగాలు ఉండటం విశేషం. మొత్తం 324 కి.మీ. నిడివి గల ఈ మార్గంలో సొరంగాల నిడివి ఏకంగా 119 కి.మీ. కావటం గమనార్హం. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.28 వేల కోట్లు. 359 మీటర్లతో ప్రపంచంలోనే అతి ఎత్తయిన చీనాబ్ రైలు వంతెన ఇందులో భాగమే. ⇒ ఈ మార్గంలో ఖరి–సంబర్ మధ్య 12.77 కి.మీ. ఫిర్‌పంజాల్ పర్వత శ్రేణిలో బనిహాల్–ఖాజీగుండ్ మధ్య 11.2 కి.మీ. ఖాద్–అంజిఖాద్ మధ్య 5.09 కి.మీ. పొడవైన సొరంగాలు నిర్మించారు. ఈ సొరంగాల్లో ప్రతి 375 మీటర్లకు ఒక ఎస్కేప్ మార్గం ఏర్పాటుచేస్తున్నారు. ⇒ థానే – «ముంబ్రా/దివా (ముంబై శివారు) మధ్య 1915లో నిర్మించిన 1.3 కి.మీ. పొడవైన పార్సిక్ సొరంగం మనదేశంలో అతి పురాతనమైనది. దీన్ని గ్రేట్ ఇండియన్Œ పెనిన్సులా రైల్వే నిర్మించింది. ⇒ ఇంటర్నేషనల్ టన్నెలింగ్ అండ్ అండర్‌గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏటా డిసెంబర్ 4వ తేదీన ప్రపంచ సొరంగమార్గ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.మే 9 నుంచి 15 వరకు వరల్డ్ టన్నెల్ కాంగ్రెస్స్వీడన్లోని స్టాక్‌హోమ్‌లో మే 9–15 మధ్య వరల్డ్ టన్నెల్ కాంగ్రెస్ జరగనుంది. సొరంగ మార్గాల సుస్థిర అభివృద్ధి.. అందుకు దోహదం చేసే పద్ధతులు, కొత్త సాంకేతికత ఇతివృత్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రమాదం నుంచి కొత్త ఉపాయంఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో సహాయక చర్యల కోసం ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్హెచ్ఏఐ అధికారులకు కొత్త ఆలోచన తట్టింది. హైదరాబాద్–శ్రీశైలం హైవే విస్తరణలో భాగంగా అమ్రాబాద్ అభయారణ్యం మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని తొలుత భావించారు. అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి నుంచి ఇది ప్రారంభం కావాల్సి ఉంది.దాదాపు 42 కి.మీ. నిడివి ఉండే దీనికి రూ.8 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని తాత్కాలిక అంచనా. అయితే, ఎలివేటెడ్‌కు బదులు, సొరంగ మార్గం నిర్మిస్తే నిడివి కేవలం 22 కి.మీ.లకే పరిమితమై రూ.6 వేల కోట్ల ఖర్చుతో పూర్తవుతుందని అంచనా వేశారు. ఇదే కొత్త ఐడియా. ఎలివేటెడ్‌కు ప్రత్యామ్నాయ ప్రతిపాదనగా నివేదిక సిద్ధం చేశారు. కేంద్రం ఆమో దం తెలిపితే తెలంగాణలో తొలి సొరంగ మార్గం అవుతుంది. మనదేశంలో పలు సొరంగ ప్రమాదాలు 2025 ఫిబ్రవరి: ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం కుప్పకూలి ఎనిమిది మంది చిక్కుకుపోయారు. ఇప్పటివరకు ఇద్దరి శవాలు మాత్రమే వెలికితీయగలిగారు. 2025 జనవరి: అస్సాంలోని బొగ్గుగని సొరంగం కుప్పకూలి నలుగురు చనిపోయారు. 2024 డిసెంబర్: ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్ వే సొరంగం కూలి ఒకరు మృతిచెందగా, 10 మందికి గాయాలయ్యాయి. 2023 నవంబర్: ఉత్తరాఖండ్‌లోని సిల్‌్కయారా రోడ్డు ప్రాజెక్టు సొరంగం కూలిపోయి 41 మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. 17 రోజుల తర్వాత వీరిని కాపాడగలిగారు. 2019 సెప్టెంబర్: కోల్‌కతా మెట్రో రైల్ ప్రాజెక్టు టన్నెల్ నిర్మాణ సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టమేమీ జరగలేదు. 2004 ఆగస్టు: ఉత్తరాంచల్‌లో తెహ్రీ హైడ్రో ప్రాజెక్టు సొరంగం నిర్మాణ సమయంలో కుప్పకూలి 29 మంది దుర్మరణం చెందారు. Tue, Apr 15 2025 1:22 AM

నర్సంపేట రూరల్ : వ్యభిచార ముఠా గుట్టు రట్టు
మహబూబ్‌నగర్,సాక్షి: మహబూబ్ నగర్లో లేఖ కలకలం సృష్టించాయి. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తంకుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలను హెచ్చరిస్తూ రాసిన లేఖలు మహబూబ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నారాయణ్‌పేట్ జిల్లా మక్తల్‌లో వెలుగులోకి వచ్చాయి. ఆ లేఖలో ‘మేం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలం. సీఎం రేవంత్‌రెడ్డికి ఇదే మా హెచ్చరిక. ఖబడ్దార్. మీ పలుకుబడి ఉపయోగించి మా ఎమ్మెల్యేకి(మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి) మంత్రి పదవి రాకుండా చేశావో అప్పుడు నీ భరతం పట్టడం ఖాయం. రాష్ట్రంలో పార్టీ అడ్రస్ గల్లంతవుతుంది. మిమ్మల్ని సీఎం పదవి నుంచి దించడం’ అని హెచ్చరిస్తూ లేఖలో రాశారు.ముదిరాజు సామాజిక వర్గం పేరుతో ఆ లేఖలు వెలుగులోకి రావడంపై పోలీసులు రంగంలోకి దిగారు. ఆ లేఖలు ఎవరు రాశారా? అని ఆరా తీస్తున్నారు.ఆ లేఖలపై సమాచారం అందుకున్న ముదిరాజు సంఘం నేతలు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ లేఖలతో తమకు సంబంధం లేదని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. Fri, Apr 18 2025 11:20 AM

జ్యోతినగర్(రామగుండం): మండే వేసవిలో చల్లదనంతోపాటు సంపూర్ణారోగ్యాన్ని చేకూర్చే తాటిముంజల వ్యాపారంతో వేలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. తెలంగాణ లో తాటిముంజలు అంటే తెలియని వారుండరు.. అందుకే వీటికి ఏటా డిమాండ్ పెరుగుతూ వ స్తోంది.. దీన్ని దృష్టిలో పెట్టుకున్న చిరు వ్యా పారులు, రోజువారీ కూలీలు.. గీత కార్మికు ల నుంచి హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తూ పట్టణా లు, నగరాలకు తరలిస్తూ విక్రయిస్తున్నారు. మరికొందరు గీత కార్మికులే నేరుగా విక్రయిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏటా 46–48 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. వేడి నుంచి ఉపశమనం కోసం శ్రామికులు, కార్మికులే కాదు.. అధికారులూ తాటిముంజల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిని ఆధారం చేసుకుని పెద్దపల్లి జిల్లాలో సుమారు 100 మంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా పరిశీలిస్తే దాదాపు 500 మంది వరకు తాటిముంజలు విక్రయి స్తూ సీజనల్ ఉపాధి పొందుతు న్నారు.వైద్యులు ఏమంటున్నారంటే..» అరటిపండ్లలో మాదిరిగానే పొటాషియం ఉంటుంది» గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది» రక్తపోటును అదుపులో ఉంచుతుంది» విటమిన్ కే, సీ, బీ, జింక్, ఐరన్, కాల్షియం, పోషకాలు లభిస్తాయి » శరీరంలో ద్రవాలు పెరుగుతాయి» అధిక బరువును నియంత్రిస్తుంది» చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి, జీర్ణశక్తిని పెంచుతుందిసీజన్ వ్యాపారం బాగుందిప్రతీ సీజన్లో దొరికే మామిడి, దోసకాయలు అమ్ముత. ఈసారి కూడా పల్లెటూరులో గౌడ కులస్తుల వద్ద ముంజకాయలు కొనుగోలు చేసి ఎన్టీపీసీ తీసుకొచ్చిన. గిరాకీ బాగుంది. ఖర్చుపోనూ రోజూవారీ కూలి మంచిగనే గిట్టుబాటవుతోంది. వారం నుంచి ఈ వ్యాపారం చేస్తున్న. – బాకం మల్లేశ్, చిరు వ్యాపారి, ఎన్టీపీసీ రింగ్రోడ్డుచిన్నప్పుడు తినేవాళ్లం చిన్నప్పుడు మా ఊరిలో గౌడ్ నుంచి మా నాన్న ముంజకాయలు తీసుకొచ్చేవారు. ఇప్పుడు తిందామంటే ఊరికి వెళ్లడానికి కుదరడం లేదు. గోదావరిఖనికి వెళ్లి తాటిముంజలు కొనుగోలు చేసి తీసుకొస్తున్న. మా పిల్లలకు కూడా వీటి గురించి చెప్పి తినిపిస్తున్న. ఎండాకాలంలో మంచిది. – స్వరూప, నర్రాశాలపల్లె, ఎన్టీపీసీఅమ్మ తీసుకొచ్చింది నేను పాఠశాల నుంచి వస్తున్నప్పుడు రోడ్డు పక్కన తాటిముంజలు చూసిన. అవి కావాలని మా అమ్మకు చెప్పిన. వెంటనే వెళ్లికొని తీసుకొచ్చింది. చాలా రుచిగా ఉన్నయి. మా పాఠశాలలో కూడా వీటిగురించి చెప్పిన. ఫాస్ట్‌ఫుడ్ కన్నా ఇవి ఆరోగ్యానికి ఎంతోమంచివని మా ఉపాధ్యాయులు కూడా చెప్పారు. – నిత్యశ్రీ, విద్యార్థిని, ఎన్టీపీసీ, రామగుండంతెలంగాణలో కల్లు ఫేమస్ తెలంగాణలో తాటి, ఈతకల్లు ఫేమస్. వేరే ప్రాంతాల్లో కల్లు గీయడం, తాటి ముంజలు అమ్ముకోవడం చాలా తక్కువ. తెలంగాణలో చాలామంది గీత కార్మికులు ఉన్నారు. తెల్లకల్లు మూడు సీజన్లలో దొరుకుతుంది. వీటిని పొద్దాటి, పరుపుదాటి, పండుతాటి అని అంటారు. నీరా, అడగల్లు కూడా ఉంటుంది. – సింగం మల్లికార్జున్‌గౌడ్, మేడిపల్లిఆరోగ్యానికి మంచిది తాటిముంజలు తింటే గుండె, లివర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి వేసవిలో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. వాటిలోని పోషకాలు ఆరోగ్యానికి ఉపయోగకరం. శరీరంలో నీటి శాతం తగ్గకుండా దోహదపడుతాయి. ఎండలో బయటకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ రాజశేఖరరెడ్డి, ఫిజీషియన్, ప్రభుత్వ ఆస్పత్రి, గోదావరిఖని Wed, Apr 16 2025 1:13 AM

సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల సమగ్ర సమాచారం సేకరించేందుకు థర్డ్ పార్టీతో సర్వే చేయిస్తున్నారు. ఆయా జిల్లాల్లోని డైట్ కాలేజీ విద్యార్థులకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 15 నుంచి సమగ్ర సర్వే మొదలైంది. 21వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఈ ప్రక్రియనంతా రాష్ట్ర విద్యాశాఖ పర్యవేక్షిస్తోంది. అయితే విద్యాశాఖ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. పాఠశాల విద్యాశాఖ మాత్రం టీచర్ల అనుమానాల్లో అర్థం లేదని చెబుతోంది. ఉద్దేశం ఏమిటి..?రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ స్కూళ్లున్నాయి. వీటిల్లో మౌలిక వసతులపై కేంద్రం డేటా సేకరిస్తుంది. యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్) ద్వారా ఈ సమాచారం అందిస్తారు. ఇదంతా ఆన్లైన్లో జరుగుతుంది. స్కూల్ హెచ్ఎం ఈ డేటా క్రోడీకరిస్తారు. దీని ఆధారంగానే స్కూళ్లకు కేంద్రం నిధులు వస్తాయి. రాష్ట్ర స్కూళ్లల్లో సరైన మౌలిక వసతులు లేవని కేంద్రం కొన్నేళ్లుగా చెబుతోంది. టాయిలెట్స్, డిజిటల్ తరగతి గదులు, తాగునీటి సదుపాయం, విద్యుత్, వంటగది, ఫర్నిచర్ ఆశించిన మేర లేవనేది కేంద్రం వాదన. మౌలిక వసతులు కల్పించినా, వాటిని యూడైస్‌లో నమోదు చేయడం లేదనేది విద్యాశాఖ వాదన. దీనివల్ల నష్టం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకునే సమగ్ర సర్వే చేపట్టినట్టు పాఠశాల విద్యా డైరెక్టరేట్ చెబుతోంది. యూడైస్‌లో వివరాలు నమోదు చేయని హెచ్‌ఎంలపై చర్యలు తీసుకునే యోచనలో విద్యాశాఖ ఉంది. వివాదంగా మారిన సర్వే.ప్రతీ జిల్లాలోనూ దాదాపు 700కుపైగా స్కూళ్లల్లో సర్వే చేపడుతున్నారు. ప్రతీ స్కూల్‌కు పది మందితో ఒక గ్రూపును ఏర్పాటు చేశారు. వీరు స్కూల్‌కు వెళతారు. ఎంఈవో ఆఫీసులో యూడైస్ రికార్డులు పరిశీలిస్తారు. హెచ్ఎంలను ప్రశ్నించే అధికారం కూడా ఇచ్చారు. వీరికి పాఠశాల విద్య శాఖ ప్రశ్నావళి ఇచ్చింది. మౌలిక వసతులు, పాఠ్యపుస్తకాల పంపిణీ, యూనిఫాం వంటి వాటి వివరాలు ఇందులో ఉన్నాయి. స్కూళ్లల్లో ఉన్నవన్నీ యూడైస్‌లో నమోదు చేశారా? అనే అంశాన్ని పరిశీలిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తైతే... అంతర్గతంగా మరికొంత సమాచారం కోరినట్టు టీచర్లు చెబుతున్నారు. స్కూళ్లలో పనిచేసే వారి వ్యక్తిగత సమాచారం కూడా సేకరిస్తున్నారనే ఆందోళన టీచర్లలో ఉంది. దీంతో సమగ్ర సర్వే వివాదాస్పదమైంది.ఆందోళనలో అర్థం లేదు యూడైస్ సమాచారంలో వాస్తవా లు తెలుసుకోవడానికి మాత్రమే సమగ్ర సర్వే చేయిస్తున్నాం. థర్డ్ పార్టీ చేత సర్వే చేస్తే అన్ని కోణాల్లో సమాచారం వస్తుంది. దీనిని చూసి టీచర్లు ఆందోళన చెందడం అర్థరహితం. ఇది ఎంతమాత్రం వారిని అవమాన పర్చడం కానేకాదు. కేంద్రానికి వెళ్లే యూడైస్ సమాచారంలో అన్నీ నమోదు కావడం లేదు. అందుకే అప్డేట్ కోసమే ఈ సర్వే. – ఈవీ నర్సింహారెడ్డి, పాఠశాల విద్య డైరెక్టర్ఎడిట్ ఆప్షన్ ఇస్తే సరిపోతుంది ఏళ్ల క్రితం యూడైస్‌లో మౌలిక వసతుల సమాచారం నమోదు చేశాం. కాలానుగుణంగా వచ్చిన మార్పులు చేర్చడానికి యూడైస్‌లో ఎడిట్ ఆప్షన్ లేదు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేయాల్సిన పనులకే ఈ సర్వే ఉపయోగపడుతుంది. ఇందులో టీచర్ల భాగస్వామ్యం కూడా ఉంటే బాగుంటుంది.– రాజాభాను చంద్రప్రకాశ్, ప్రభుత్వ గెజిటెడ్ హెచ్ఎం సంఘం పూర్వ అధ్యక్షుడు ఇది సందేహించడమే డైట్ కాలేజీల విద్యా ర్థులతో సర్వే చేయించడం టీచర్లను అవమానించడమే. డేటా నమోదులో టీచర్లు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటారు. ఒకవేళ అలాంటిది ఉంటే.. వారి దృష్టికి తేవాలి. వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. – చావా రవి, టీఎస్‌యూటీఎఫ్, రాష్ట్ర అధ్యక్షుడు Thu, Apr 17 2025 12:26 AM

సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 నియామకాలను నిలిపివేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లో తాము తీర్పు వెలువరించే వరకు నియామక పత్రాలు జారీ చేయవద్దని తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం నడుస్తున్న సర్టీఫికెట్ల వెరిఫికేషన్‌ను కొనసాగించేందుకు వెసులుబాటు ఇచ్చింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల డేటా నమోదు చేసే లాగ్డ్ హిస్టరీ సమర్పణతో పాటు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కమిషన్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ 28కి వాయిదా వేసింది. అవకతవకలపై విచారణ జరిపించండి గ్రూప్–1 పోస్టులు భర్తీ చేసే క్రమంలో 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, అసమానతలు చోటు చేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్‌కు చెందిన కె.పర్శరాములుతో పాటు మరో 19 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ వేసిన వారిలో 19 మంది ప్రభుత్వ ఉద్యోగులేనని చెబుతుండటం గమనార్హం.కాగా తమ సమాధాన పత్రాలను సరిగా మూల్యాంకనం చేయలేదని, జనరల్ ర్యాంకింగ్ జాబితాను తప్పుగా ప్రచురించారని వారు పేర్కొన్నారు. అవకతవకల తీవ్రత దృష్ట్యా విచారణకు ఆదేశించి కోర్టు పర్యవేక్షించినా సరే లేదా స్వతంత్ర న్యాయ విచారణకు ఆదేశించాలని కోరారు. తమ జవాబు పత్రాలను తిరిగి ముల్యాంకనం చేసేలా లేదా తిరిగి మెయిన్స్ నిర్వహించేలా కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు గురువారం విచారణ చేపట్టారు. రీకౌంటింగ్తో 60 మార్కులు తగ్గాయి.. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘హైదరాబాద్‌లోని రెండు సెంటర్ల నుంచి 71 మంది ఎంపిక కావడం సందేహాస్పదం. మొత్తం 563 పోస్టుల్లో ఇది దాదాపు 12 శాతం. మెయిన్స్‌కు తొలుత 21,075 మంది హాజరయ్యారని ప్రకటించి, తర్వాత 21,085 మంది అని పేర్కొన్నారు. ఈ 10 మంది ఎలా పెరిగారో వెల్లడించలేదు. ఉర్దూలో 9 మంది రాస్తే.. 10 మంది అని చెప్పారు.జనరల్ ర్యాంకింగ్ ప్రకటన సమయంలో కంప్యూటర్లో మార్పులు చేశారు. లాగ్డ్ హిస్టరీ పరిశీలిస్తే నిజం తేలుతుంది. అయితే దీనిపై ప్రశ్నిస్తే ఆ వివరాలు మీకెందుకంటూ బెదిరిస్తున్నారు. 482 మార్కులు వచ్చిన ఓ అభ్యరి్థకి రీకౌంటింగ్‌లో 60 మార్కులు తగ్గడం మరీ విచిత్రం. పరీక్షా కేంద్రాల పెంపు, ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు హాల్‌టికెట్ల నంబర్ మార్పుపై స్పష్టత లేదు..’ అని చెప్పారు. అలాగైతే అందరూ ఎంపిక కావాలి కదా.. టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది పీఎస్ రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ.. ‘ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు వేర్వేరు హాల్ టికెట్ నంబర్లు ఇచ్చాం. అయితే ప్రిలిమ్స్ హాల్‌టికెట్ నంబర్‌ను కూడా మెయిన్ హాల్‌టికెట్‌లో పొందుపరిచాం. అక్టోబర్ 27న మెయిన్స్ చివరి పరీక్ష జరిగింది. పరీక్షా కేంద్రాల నుంచి అందిన సమాచారం మేరకు హాజరైన అభ్యర్థులు 21,075 మందిగా కమిషన్ ప్రకటించింది. ఈ సంఖ్యలో స్వల్ప మార్పు ఉండొచ్చని కూడా చెప్పింది.ఆ తర్వాత ఈ సంఖ్య 21,085 అని పేర్కొంది..’అని చెప్పారు. దీంతో రిపోర్టు చేసిన తర్వాతే అభ్యర్థులు హాల్లోకి ప్రవేశిస్తారు కదా.. అదే రోజు సరైన సంఖ్య వచ్చే అవకాశం లేదా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. లేదని న్యాయవాది బదులిచ్చారు. ‘రెండు సెంటర్ల నుంచి ఎక్కువ మంది ఎంపికయ్యారన్నది మరో ఆరోపణ.ఓ సెంటర్లో 792 మంది పరీక్షకు హాజరుకాగా 39 మంది (4.92%), మరో సెంటర్ నుంచి 864 మంది హాజరుకాగా 32 మంది (3.7%) ఎంపికయ్యారు. ఎంపికైన శాతం స్వల్పం. ఒకవేళ అవకతవకలు జరిగి ఉంటే ఆ సెంటర్లలోని అందరూ ఎంపికయ్యేవారు. అలా జరగలేదంటే ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా సాగిందని తెలుస్తోంది..’అని అన్నారు. పోర్జరీ చేసి మార్కులు మార్చారు ‘ఓ సెంటర్ పెంచడంపై పిటిషనర్ మరో ఆరోపణ చేశారు. మెయిన్స్‌కు 45 సెంటర్లు ప్రకటించినా తర్వాత ఓ సెంటర్ పెంచాం. ఒకచోట దివ్యాంగులు పరీక్ష రాసేందుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో మరో కేంద్రాన్ని పెంచాం. పిటిషనర్లు చెబుతున్నట్టుగా.. పదవీ విరమణ పొందిన వారిని మూల్యాంకనానికి తీసుకోవద్దని చట్టంలో లేదు. ఇక పిటిషనర్లంతా ప్రభుత్వ ఉద్యోగులు. ఎక్కడ పని చేస్తున్నారో దాచి పిటిషన్ వేశారు.రీ కౌంటింగ్‌లో ఒకరికి మార్కులు తక్కువ వచ్చాయన్నది కూడా నిజం కాదు. తొలుత, ఆ తర్వాత కూడా ఆ అభ్యర్థికి 422.5 మార్కులే వచ్చాయి. అయితే పోర్జరీ చేసి మార్కులు మార్చారు. దీనిపై షోకాజ్ నోటీసు జారీ చేశాం. విచారణ జరుపుతాం..’అని నివేదించారు. పిటిషనర్ల వివరాలు సమర్పించాలి: న్యాయమూర్తి వాదనలు విన్న న్యాయమూర్తి.. నియామకాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పిటిషనర్లు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారో పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. పిటిషనర్లు తప్పుడు వివరాలను దాఖలు చేసినట్లు నిరూపితమైనా, టీజీపీఎస్సీలో అవకతవకలు జరిగాయని తేలినా తీవ్ర చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇలావుండగా.. ఇంప్లీడ్ కాకుండా వాదనలు వినిపించడం సరికాదంటూ.. రీ కౌంటింగ్‌లో తక్కువ మార్కులు వచ్చాయని చెప్పిన ఓ అభ్యరి్థని హైకోర్టు తప్పుబట్టింది. పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. Fri, Apr 18 2025 3:36 AM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి తాత్కాలిక బ్రేక్ పడింది. గ్రూప్ 1 పరీక్షల్లో అనేక అవతవకలు జరిగాయని హైకోర్టులో 20 పిటిషన్ల వరకూ దాఖలు కావడంతో వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. నియామకాలకు తాత్కాలిక బ్రేక్ వేసింది. ఈ మేరకు గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు.. నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని స్సష్టం చేసింది. విచారణ పూర్తయ్యే వరకూ నియామక పత్రాలు ఇవ్వొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయితే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చని హైకోర్టు తెలిపింది. పోస్టింగ్ లు మాత్రం తుది తీర్పు వెలువడే వరకూ ఇవ్వొద్దని క్లియర్ గా స్పష్టం చేసింది. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పరీక్ష ప్రశ్నాపత్రం లీకవడంతో రద్దయింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించింది. అయితే పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా పరీక్ష నిర్వహించింది. దీనిపై సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఫలితాలు విడుదల చేయడానికి ఎటువంటి ఆటంకం ఏర్పడలేదు. అయితే గ్రూప్-1 సరీక్షల్లో అవతవకలు జరిగాయని పలు పిటిషన్లు దాఖలు కావడంతో నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. యథావిధిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చని, కాకపోతే తుది తీర్పు ఇచ్చే వరకూ పోస్టింగ్‌లు ఇవ్వొద్దని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొదది. దాంతో తమ నియామకాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో నిరాశ అలముకుంది. మళ్లీ గ్రూప్-1 పరిస్థితి ఇలా టర్న్ తీసుకుందేమిటని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. Thu, Apr 17 2025 6:31 PM

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి నుంచి మూడు డిగ్రీల మేర అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని పేర్కొంది.కోస్తా ఆంధ్ర తీరం, యానాం పరిసరాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. రాష్ట్రానికి తూర్పు ప్రాంతంలోని జిల్లాల్లో వడగాలులు వీచేఅవకాశం ఉందని తెలిపారు. Mon, Apr 14 2025 2:02 AM
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంబేదర్క్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక, ఎస్సీ వర్గీకరణలో భాగంగా ప్రభుత్వం.. 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించింది.మూడు గ్రూపుల విభజన, రిజర్వేషన్లు ఇలా..గ్రూప్-ఏలో ఉన్న వారికి ఒక్క శాతం రిజర్వేషన్‌గ్రూప్-బీలో ఉన్న వారికి 9 శాతం రిజర్వేషన్‌గ్రూప్-సీలో ఉన్న వారికి 5 శాతం రిజర్వేషన్ ఇవ్వనుంది. మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణతో మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బడుగులకు రిజర్వేషన్ల కల్పనకు చర్యలు తీసుకుంటాం. యంగ్ ఇండియా స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్య అందించే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. రైతులు, రైతు కూలీలకు ఎకరాకు రూ.12 వేల ఆర్థిక భరోసా ఇస్తున్నాం. పేదల ఆత్మగౌరవ ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాం. రైతు, పేద భూమికి హక్కుపై భరోసా ఇస్తూ భూభారతికి శ్రీకారం చూడుతున్నామని అన్నారు. Mon, Apr 14 2025 11:00 AM

సాక్షి, స్పెషల్ డెస్క్: నూటికి నూరు శాతం కేసులను పరిష్కరిస్తూ న్యాయవ్యవస్థ పనితీరులో తెలంగాణ ద్వితీయస్థానం సాధించింది. గతంలో 5 స్థానంలో ఉండగా ఆ స్థానాన్ని మెరుగుపర్చుకుంది. వరు సగా మూడేళ్లుగా 100% కేసు క్లియరెన్స్ రేట్‌ను సాధిస్తోంది. ఈ వివరాలను ఇండియన్ జస్టిస్ రిపోర్ట్– 2025 తాజా నివేదికలో వెల్లడించింది. 2025 జన వరి నాటికి దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య 5.1 కోట్లు దాటిందని.. జడ్జీల నియామకంలో జాప్యం, జనాభాకు సరిపడా న్యాయమూర్తులు లేకపోవడమే దీనికి ప్రధాన కారణాలని అభిప్రాయపడింది.ఆన్లైన్ విచారణతో.. కరోనాతో వచ్చిన వర్చువల్ విచార ణలు.. ఆ తర్వాత వచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల కారణంగా కేసుల విచారణ వేగం పుంజుకుంది. ఏటా నమోదవుతున్న కేసుల సంఖ్య ను మించి పిటిషన్లు పరిష్కరిస్తూ ముందుకెళ్తోంది. దీంతో హైకోర్టుతో పాటు సబార్డినేట్ కోర్టుల్లో కేసుల పరిష్కార రేటు మెరుగుపడింది.అధ్యయనం జరిగిందిలా...కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ, టీఎస్–ప్రయాస్, హౌ ఇండియా లీవ్స్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్ లాంటి సంస్థల సహకారంతో టాటా ట్రస్టు ఈ అధ్యయనం నిర్వహించింది. 2019 నుంచి ఈ అధ్యయనం చేస్తోంది. జడ్జీలపై పనిభారం..దేశవ్యాప్తంగా 2025లో హైకోర్టుల్లో మొత్తం మంజూరు చేసిన పోస్టుల్లో 33 శాతం జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నా యి. అత్యధికంగా అలహాబాద్, మధ్య ప్రదేశ్ హైకోర్టులో ఒక్కో న్యాయ మూర్తిపై 15 వేల కేసుల పని భారం ఉంది. తెలంగా ణలో 42 మంది (32 శాశ్వత, 10 అద నపు) జడ్జీలకుగాను 30 మందే ఉన్నారు. సుమారు 30 శాతం (12 పోస్టులు) ఖాళీలున్నాయి. రాష్ట్ర జనాభా సుమారు 3.7 కోట్లుకాగా మంజూరు చేసిన పోస్టుల ప్రకారం ప్రతి 8.8 లక్షల మందికి ఒక హైకోర్టు జడ్జి ఉండాలి. కానీ ప్రస్తుతం ప్రతి 12.3 లక్షల మందికి ఒక జడ్జీ ఉన్నారు. తెలంగాణలో ఒక్కో న్యాయ మూర్తిపై 4,000 కేసుల పనిభారం పడు తోంది. దేశవ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో 21 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కో న్యాయమూర్తిపై 2,200 కేసుల పనిభారం ఉంది. తెలంగాణలో 655 మంది జడ్జీలు ఉండాల్సి ఉండగా 440 మందే ఉన్నారు. సుమారు 215 పోస్టులు ఖాళీలున్నాయి.మనమే నంబర్ వన్.. దేశంలోని జిల్లా కోర్టుల్లో మహిళా జడ్జీల ప్రాతినిధ్యం పెరిగింది. 2017లో వారి సంఖ్య 30 శాతం ఉండగా 2025లో 38.3 శాతానికి పెరిగింది. 55.3 శాతంతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. హైకోర్టుల్లో మహిళా జడ్జీల ప్రాతి నిధ్యం దేశవ్యాప్తంగా 14 శాతం ఉండగా తెలంగాణలో అత్యధికంగా 33.3 శాతంగా ఉంది. దేశంలోని హైకోర్టులన్నింటిలోనూ ఒకే ఒక్క మహిళా ప్రధాన న్యాయమూర్తి మాత్రమే ఉన్నారు.జనవరి 2025 నాటికి..సుప్రీంకోర్టు జడ్జీలు సహా సిట్టింగ్ జడ్జీల సంఖ్య: 21,285 మొత్తంగా ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్య: 26,927 మంజూరు చేసిన సంఖ్యతో పోలిస్తే ఖాళీల శాతం: 152011 జనాభా లెక్కల ఆధారంగా ప్రతి 10 లక్షల మందికి రాజ్యసభ సూచించిన జడ్జీల సంఖ్య: 21 1987లో ఏర్పాటైన న్యాయ కమిషన్ ప్రతి 10 లక్షల జనాభాకు ఉండాలని సూచించిన జడ్జీల సంఖ్య: 50ప్రస్తుతం దేశంలో ప్రతి 10 లక్షల మందికి ఉన్న జడ్జీల సంఖ్య: 15 అమెరికాలో ప్రతి 10 లక్షల మందికి ఉన్న జడ్జీల సంఖ్య: 150యూరప్‌లో ఇదే సంఖ్య: 220 కోర్టు స్థాయిలో విచారణ ప్రక్రియలను క్రమ బద్ధీకరించాల్సిన అవసరాన్ని 1958లోనే 14వ లా కమిషన్ నివేదిక నొక్కిచెప్పింది. 1987లో న్యాయ మూర్తుల సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని సూచించింది. 2009లో అన్ని స్థాయిల్లో కోర్టు సెలవులను తగ్గించాలని, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాలను వినియోగించుకోవాలని సిఫార్సు చేసింది. 2016లో కేంద్ర, సుప్రీంకోర్టు పరిశోధ నలో 2040లో జిల్లా కోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్య 80,000 వరకు పెరుగుతుందని, అయి నా పెండింగ్ కేసుల భారం తప్పదని తేలింది. 2025 జనవరిలో హైకోర్టులు, జిల్లా కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య 5.1 కోట్లు దాటింది. పదేళ్లకుపైగా పెండింగ్ కేసులు 12%, 5–10 ఏళ్ల కేసులు 22% ఉన్నాయి. హైకోర్టుల్లో 61%, దిగువ కోర్టుల్లో 46% మూడేళ్ల కంటే ఎక్కువ ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులున్నాయి. సుప్రీంకోర్లులో పెండింగ్‌లో ఉన్న కేసులు: 82,000దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో కేసు క్లియరెన్స్ రేటు (సీసీఆర్): 94%100% సీసీఆర్ నమోదు చేసుకున్న రాష్ట్రాలు: 7(తెలంగాణ, జార్ఖండ్, త్రిపుర, మద్రాస్, పంజాబ్–హరియాణా, ఒడిశా, పశ్చిమ బెంగాల్. వరుసగా ఇది మూడోసారి) Thu, Apr 17 2025 1:10 AM
ఎల్రక్టానిక్ వ్యర్థాల నిర్వహణ అనేది సవాళ్లతో కూడుకున్నదిగా మారుతోంది. ఈ–వ్యర్థాల పట్ల అవగాహన, చైతన్యం తగినంతగా లేకపోవడం..దీనికి సంబంధించిన మౌలిక సదుపాయాలు తగినంతగా అందుబాటులోకి రాకపోవడం, వీటి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నియమ నిబంధనలు సరిగ్గా అమలు కాకపోవడం పెనుసమస్యగా అవతరించింది. ఇవన్నీ కలగలిసి ఈ–వ్యర్థాలను సరైన పద్ధతుల్లో తొలగించకపోవడం వంటి కారణాలతో పర్యావరణానికి నష్టం చేస్తున్నాయి. 2021–22లోనే తెలంగాణలో 50,335.6 టన్నుల ఈ–వ్యర్థాలు ఉత్పత్తి కాగా, వాటిలో 42,297 టన్నులు మాత్రమే సరైన పద్ధతుల్లో తొలగించారని పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ) గతంలోనే వెల్లడించింది. అయితే వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు, పరికరాల వినియోగదారులతోపాటు సాధారణ ప్రజల్లోనూ బాధ్యతాయుతంగా ‘ఎల్రక్టానిక్ వేస్ట్ డిస్పోజల్’విషయంలో సరైన అవగాహన, చైతన్యం లేదని పలు సందర్భాల్లో వెల్లడైంది. ఇళ్లలోనూ నిరుపయోగంగా మారుతున్న వివిధ ఎల్రక్టానిక్ వస్తువుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. చార్జర్లు, వైర్లతో కూడిన ఇయర్ఫోన్లు, స్పీకర్లు, ఎలక్ట్రిక్ కెటిళ్లు, కుక్కర్లు, ఇతర పరికరాలు, వస్తువులు పోగుపడుతున్నాయి. ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ఎల్ఈడీ టీవీలు, ఇతర వస్తువులు పాడైతే స్థానికంగా అమ్మేయడమో లేక పాతపేపర్లు, పాతసామాన్లు అమ్మే షాపుల వారికి ఇచ్చేయడమో అధికంగా జరుగుతున్నాయి. అయితే ఈ వస్తువులను చివరకు సురక్షితంగా ఏ విధమైన పద్ధతుల్లో డిస్పోజ్ చేస్తున్నారనే విషయంలో మాత్రం స్పష్టత ఉండడం లేదు. – సాక్షి,హైదరాబాద్ సమగ్ర అధ్యయనంపై దృష్టి రాష్ట్రంలో ఈ–వేస్ట్ ఏయే రూపాల్లో ఎంతెంత పరిమాణంలో పోగుపడుతున్నదనే విషయంపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ–వేస్ట్ ఇన్వెంటొరైజేషన్ను చేపట్టి ఈ వ్యర్థాలు ఎక్కువగా ఎక్కడ, ఏ స్థాయిలో ఉత్పత్తి అవుతున్నాయి ? వాటి పరిమాణం ఎంత ? ప్రస్తుతం వాటిని ఏయే రూపాల్లో సేకరించి, సురక్షితంగా తొలగించేందుకు తీసుకుంటున్న చర్యలు తదితరాలను పరిశీలించనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ–వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు, 2022లో ఏఏ అంశాలను పొందుపరిచారు, ఆయా విషయాలను ఏ మేరకు వ్యర్థాల నియంత్రణ, నిర్వహణలో అనుసరిస్తున్నారనే దానిపై అధ్యయనం చేయనున్నారు. ఈ–వ్యర్థాలకు సంబంధించి సేకరించే సమాచారం, వివరాల ఆధారంగా...ఎల్రక్టానిక్ వస్తువుల సేకరణ, మెటీరియల్ రికవరీ, వీటి ద్వారా ఈ–వేస్ట్ మేనేజ్మెంట్లో ఉపాధి అవకాశాల కల్పనతో ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలిచేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై దృష్టి సారించారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలనేది ఎక్కడెక్కడ ఉత్పత్తి అవుతున్నాయో ట్రాక్ చేయడంతోపాటు ఆయా వస్తువులు, పరికరాలకు సంబంధించి కచ్చితమైన సమాచారం తెలుసుకొని అక్రమ డంపింగ్‌ను నిరోధించడంతోపాటు కచ్చితమైన విధానాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా సంస్థల సేవలు వినియోగించుకునే దిశగా టీపీసీబీ జాతీయస్థాయిలో పేరొందిన కన్సల్టెన్సీ సంస్థలు, విద్యాసంస్థలు, పరిశోధక సంస్థల సేవలను టీపీసీబీ ఉపయోగించుకోనున్నట్టు సమాచారం. మొత్తం 150 రోజుల్లో ఈ అధ్యయ నాన్ని పూర్తిచేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రటిక్ ఎక్విప్మెంట్ (ఈఈ ఈ) కేట గిరీలో ఎంత స్థాయిలో వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయో అంచనా వేస్తారు. ఇందుకోసం ఎంపిక చేసిన సంస్థ, ఉత్పత్తిదారులు, డిస్ట్రిబ్యూటర్లు, రీసైకిల్ చేసేవారు, వేర్వేరు పద్ధతులు, మార్గాల్లో వ్యర్థాలను సేకరించే వారి వివరాలను తీసుకుంటారు.వీరి నుంచి ఈ–వేస్ట్ ఉత్పత్తి అవుతున్న తీరు, పరిమాణం, వాటిని తొలగిస్తున్న తీరు, వీటి నిర్వహణలో ఎదురవుతున్న అంతరాలు, సమస్యలు వంటి వాటికి సంబంధించిన సమాచారాన్ని ఈ సంస్థలు సేకరిస్తాయి. అనంతరం ఆయా సమస్యలు, అంతరాలను అధిగమించేందుకు పలు సూచనలు, సలహాలతో సిఫార్సులు చేస్తారు. ఈ అధ్యయనంలో భాగంగా సవివర ఇన్వెంటరీ ద్వారా ‘వేస్ట్ ఫ్రం ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ ఎక్విప్మెంట్ (డబ్ల్యూఈఈఈ) బిజినెస్ చెయిన్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన సలహాలు ఇవ్వనుంది. స్టేక్ హోల్డర్స్ గ్రూపులు ఇలా...ప్రొడ్యూసర్స్, సెల్లర్స్: దిగుమతిదారులు, తయారీదారులు, సరఫరాదారులు, వ్యాపారులు, రిటైల్, డీలర్లు వినియోగదారులు: కుటుంబాలు, వ్యాపార సంస్థలు, ఐటీ కంపెనీలు, బీపీవోలు, విద్యాసంస్థలు, రైల్వే, ఎయిర్‌లైన్స్, డిఫెన్స్, రవాణా కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగసంస్థలు కలెక్ట్ చేసేవారు: ఈ–వేస్ట్‌ను సేకరించే స్క్రాప్ డీలర్లు, మాల్స్, ఇతర ప్రైవేట్ సంస్థలు రీసైక్లర్స్: డిసెంబ్లర్స్, డిస్మాంట్లర్స్, మెటీరియల్ రికవరీ యూనిట్లు ఇతర వర్గాలవారు: రోడ్డు పక్క విక్రేతలు, అధికారిక, అనధికారిక వేలం పాటలు పాడేవారు, సెకండ్ హ్యాండ్ ఎల్రక్టానిక్ వస్తువులు అమ్మేవారు Mon, Apr 14 2025 1:58 AM

సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో రాష్ట్ర పోలీసులు సత్తా చాటారు. అత్యుత్తమ పోలీసింగ్‌కు సంబంధించి ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ –2025 ర్యాంకింగ్‌లో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. ఏపీ రెండో స్థానంలో ఉంది. అత్యుత్తమ పోలీసింగ్‌కు 10 మార్కుల ప్రాతిపదికన తెలంగాణ 6.48 మార్కులతో టాప్‌లో నిలవగా, 3.36 మార్కులతో పశ్చిమ బెంగాల్ అట్టడుగున నిలిచింది. పోలీస్, న్యాయవ్యవస్థ, జైళ్లశాఖ, లీగల్ ఎయిడ్ పనితీరుపై ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్) 2019 నుంచి ప్రతి ఏటా నివేదిక విడుదల చేస్తోంది. ఈ క్రమంలో తాజా రిపోర్టు మంగళవారం విడుదలైంది. అత్యుత్తమ పోలీసింగ్‌లో తొలి స్థానాన్ని దక్కించుకున్న తెలంగాణ..పోలీస్, న్యాయవ్యవస్థ, జైళ్లశాఖ, లీగల్ ఎయిడ్ తదితర అంశాలన్నీ కలిపి జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. అన్ని విభాగాల్లో కలిపి గత నివేదికలో 11 స్థానంలో నిలిచిన తెలంగాణ ఈ ఏడాది మూడో స్థానానికి ఎగబాకడం గమనార్హం. కాగా అన్ని అంశాల్లో కలిపి 2025లో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా, ఏపీ రెండో న్యాయవ్యవస్థస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో తెలంగాణ, కేరళ, తమిళనాడు నిలిచినట్టు నివేదిక వెల్లడించింది. 50 శాతం పెరిగిన ఖైదీల సంఖ్య జాతీయ స్థాయిలో పోలీస్–పౌరుల నిష్పత్తి పరిశీలిస్తే.. ప్రతి లక్ష మంది పౌరులకు 155 మంది పోలీసులు ఉన్నట్టు నివేదిక తెలిపింది. బిహార్‌లో అతి తక్కువగా ప్రతి లక్షమంది పౌరులకు 81 మంది మాత్రమే పోలీసులు ఉన్నట్టు పేర్కొంది. కాగా గత దశాబ్దకాలంగా దేశవ్యాప్తంగా జైళ్లలో ఖైదీల సంఖ్య 50 శాతం పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. ఇందులో అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య గతంతో పోలిస్తే 66 శాతం నుంచి 76 శాతానికి చేరినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల బడ్జెట్లలో క్రిమినల్ జస్టిస్ సిస్టంకు ఇస్తున్న కేటాయింపులలో అత్యధిక భాగం జీతభత్యాలకే ఖర్చవుతుండగా, అతికొద్ది మొత్తం మాత్రమే మౌలిక వసతుల కేటాయింపునకు ఖర్చు చేస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. అదేవిధంగా పోలీస్‌శాఖలో మహిళల సంఖ్య 8 శాతం మాత్రమే ఉన్నట్టు తెలిపింది. మహిళా అధికారుల సంఖ్య 10 శాతానికే పరిమితం అయినట్టు వివరించింది. తెలంగాణ పోలీస్‌శాఖలో మహిళా సిబ్బంది సంఖ్య 8.7 శాతం కాగా, మహిళా అధికారుల సంఖ్య 7.6 శాతంగా ఉందని ఐజేఆర్ తెలిపింది. Wed, Apr 16 2025 4:33 AM

పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట శివారులో గురువారం ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ఎదురుగా వస్తున్న చెరువుమట్టి టిప్పర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 27మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ప్రయాణికులు, పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, జిల్లాలోని అంతర్గాం మండలం ముర్మూరు నుంచి చెరువు మట్టిని రంగాపూర్ ఇటుకబట్టీకి తరలిస్తున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులున్నారు. 27మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్సులో పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స తరువాత కొందరిని ఇళ్లకు పంపించారు. కండక్టర్ కూకట్ల శ్రీనివాస్‌కు తీవ్రగాయాలు కావడంతో కరీంనగర్‌కు తరలించారు.సెల్‌ఫోన్ డ్రైవింగ్‌తోనే ప్రమాదంపెద్దపల్లిలోని శాంతినగర్ నుంచి అప్పన్నపేట వరకు రాజీవ్ రహదారి మరమ్మతు పనులు చేపట్టారు. వాహనాలను వన్ వే లో నడిపిస్తున్నారు. బస్సు డ్రైవర్ నాగేందర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండడంతో ప్రమాదం జరిగిందని కమాన్‌పూర్ ప్రాంత ప్రయాణికుడు సదయ్య తెలిపాడు. ప్రమాదంలో 27మంది గాయపడగా 22 మంది మహిళలే ఉన్నారు. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే విజయరమణారావు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెండ్ శ్రీధర్‌ను ఆదేశించారు. ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై మల్లేశం పర్యవేక్షించారు.క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలుపెద్దపల్లి మండలం అప్పన్నపేట శివారులో జరిగిన రోడ్డుప్రమాదంలో గాయాలపాలైన ప్రయాణీకులకు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలందించారని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. క్షతగాత్రులు వారి బంధువులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఆసుపత్రి సూపరింటెండ్ శ్రీధర్ మరో 10 మంది వైద్యబృందం అందుబాటులో ఉంటూ బాధితులకు మెరుగైన సేవలందిస్తారని పేర్కొన్నారు. Fri, Apr 18 2025 11:46 AM

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేయనున్న మొట్టమొదటి నెక్ట్స్ జెన్ ఇండ్రస్టియల్ పార్కులో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 30 వేలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణలో వ్యాపారానికి అనువైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే వారికి తమ ప్రభుత్వం తరఫున మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.జపాన్ పర్యటనలో ఉన్న సీఎం నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో అక్కడి వ్యాపార దిగ్గజ సంస్థ ‘మరుబెని’ప్రతినిధులు గురువారం టోక్యోలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అధునాతన వసతులతో కూడిన (నెక్ట్స్ జెన్) పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసేందుకు ‘మరుబెని’సంసిద్ధత వ్యక్తం చేసింది. 600 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును దశల వారీగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కీలక పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకుంది. పార్కు ఏర్పాటుకు సంబంధించిన ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’పై సీఎం రేవంత్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ‘మరుబెని’ప్రతినిధులు సంతకాలు చేశారు. రూ.1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో సంస్థ ఈ ప్రాజెక్టును చేపడుతుంది. తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులకు చాన్స్ జపాన్‌కు చెందిన కంపెనీలతో పాటు ఇతర బహు ళ జాతి కంపెనీలు హైదరాబాద్‌లో తమ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు వీలుగా అభివృద్ధి చేసే ఈ పార్కు రూ.5 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై ఈ పార్కు దృష్టి పెడుతుంది. అధునాతన తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నైపుణ్యంతో కూడిన ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. తెలంగాణ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి దూరదృష్టితో వ్యవహరిస్తున్నారని ‘మరుబెని’బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అధికారి దై సకాకురా అభినందించారు. 65 దేశాల్లో ‘మరుబెని’కార్యకలాపాలు మరుబెని కంపెనీ 65 దేశాల్లో 410 కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్తు, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్ లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ రంగాలలో ఈ కంపెనీ అగ్రగామిగా ఉంది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 50 వేలకు పైగా ఉద్యోగులున్నారు. సోనీ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ ‘సోనీ’ప్ర«దాన కార్యాలయాన్ని సందర్శించింది. సోనీ కార్పొరేషన్ తయారు చేస్తున్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న కొత్త కార్యక్రమాల గురించి వీరికి కంపెనీ ప్రతినిధులు వివరించారు. సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ ‘క్రంచైరోల్’పై ప్రతినిధులతో జరిగిన చర్చల్లో.. యానిమేషన్, వీఎఫ్ఐ, గేమింగ్ రంగాలకు హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను తెలంగాణ ప్రతినిధి బృందం వివరించింది. ఎండ్ టు ఎండ్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉండే అత్యాధునిక ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయాలనే తన ఆలోచనలను ‘క్రంచైరోల్’ప్రతినిధులతో ముఖ్యమంత్రి పంచుకున్నారు. మెట్రో సహా అభివృద్ధి పనులకు నిధులపై ‘జైకా’తో చర్చలు జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ఉన్నత స్థాయి యాజమాన్య బృందంతో కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధుల సమీకరణపై చర్చించారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.24,269 కోట్ల అంచనాలతో చేపట్టనున్న మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రం తుది పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమమ్యే వ్యయంలో 48 శాతం అనగా రూ.11,693 కోట్లు రుణంగా ఇవ్వాలని కోరారు.ప్రపంచ పెట్టుబడుల గమ్య స్థానంగా, అత్యంత ఆకర్షణీయమైన నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయార్క్, టోక్యోతో సమానంగా నగరాన్ని అభివృద్ది చేసే యోచనలో తమ ప్రభుత్వం ఉందని చెప్పారు. మెట్రో రైలు రెండో దశతో పాటు మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి అవుటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించే రేడియల్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సాయం అందించాలని కోరారు.కాగా జైకా, తెలంగాణ నడుమ అనేక ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయని జైకా సీనియర్ ప్రెసిడెంట్ షోహెయ్ హరా వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులకు జైకా నుంచి ఆర్థిక సాయం పొందేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Fri, Apr 18 2025 3:28 AM

సాక్షి, హైదరాబాద్/ఏజీవర్సిటీ: దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో ఈ ఏడాది తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో సుమారు 280 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని, ఇది ఒక రికార్డు అని చెప్పారు. తెలంగాణ నుంచి తొలిసారి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి అవుతున్న నేపథ్యంలో మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘బియ్యం ఎగుమతి విధానం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఉత్తమ్‌కుమార్ మాట్లాడారు. రాష్ట్ర అవసరాలు, ఎఫ్‌సీఐ సెంట్రల్ పూల్, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం పంపిణీ తదితరాలకు పోగా ఏటా 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిగులు ఉంటుందన్నారు. మిగులు ధాన్యం మార్కెట్ చేయడానికి ఫిలిప్పీన్స్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఒప్పందంలో భాగంగా ఏడాదికి 10 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని ఎగుమతి చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇటీవల వరి సాగు విధానంలో కూడా మార్పు వచ్చిందని, దాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వరి నేరుగా విత్తే పద్ధతి (డీఎస్ఆర్), రోజు విడిచి రోజు నీరు పెట్టే విధానం (ఏడబ్ల్యూడీ), తక్కువ రసాయనాలు కలిగిన వరి రకాలను ఉత్పత్తి చేయడంపై రైతులను ప్రోత్సహించాలని శాస్త్రవేత్తలకు మంత్రి సూచించారు. ఎగుమతికి అనుకూలమైన రకాలను ఉత్పత్తి చేసే రైతులకు, ఎగుమతిదారులకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య మాట్లాడుతూ ఫిలిప్పీన్స్ దేశం ఎప్పటికీ దిగుమతి చేసుకునే దేశమేనని, ఆ దేశాన్ని తెలంగాణ బియ్యానికి అనుకూలమైన మార్కెట్‌గా గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. తద్వారా తెలంగాణలో పండుతున్న బియ్యం నిల్వలకు శాశ్వత పరిష్కారం దొరికినట్లవుతుందని చెప్పారు. కార్యక్రమంలో అఖిలభారత రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బి.కృష్ణారావు, విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు డాక్టర్ బలరాం, వరి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దామోదర్ రాజు పాల్గొన్నారు. Wed, Apr 16 2025 12:18 AM
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు విడుదల చేయనుంది. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచి్చన హామీకి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రూపొందించిన మార్గదర్శకాలకు తాజాగా ఎస్సీ వర్గీకరణ మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఉత్తర్వుల తొలి ప్రతిని సీఎం రేవంత్‌రెడ్డికి అందించనున్నట్లు ఎస్సీ వర్గీకరణ మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ వైస్ చైర్మన్, మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏకసభ్య కమిషన్‌కు నేతృత్వం వహించిన జస్టిస్ షమీమ్ అక్తర్, ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీధర్, న్యాయ కార్యదర్శి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతుతో వర్గీకరణ ప్రక్రియ వేగంగా పూర్తయిందన్నారు. ఎస్సీ వర్గీకరణలో క్రీమీలేయర్ ప్రవేశపెట్టాలన్న కమిషన్ సిఫార్సును ఉపసంఘం తిరస్కరించిందన్నారు. ఆర్థిక ప్రమాణాల ఆధారంగా ఏ ఉప సమూహాన్ని మినహాయించకుండా సమాన ప్రయోజనాలను నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఏ ప్రయోజనాలను నీరుగార్చబోమని.. ఎస్సీ వర్గాల హక్కులను కాపాడుతూ న్యాయాన్ని పెంపొందించడానికే వర్గీకరణ రూపొందించామని వివరించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు ప్రస్తుతం 15% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని.. రాష్ట్రంలో ఎస్సీ జనాభా దాదాపు 17.5 శాతానికి పెరిగిందన్నారు. 2026లో జనగణన గణాంకాలు అందుబాటులోకి వచ్చాక ఎస్సీ రిజర్వేషన్లను పెంచుతామన్నారు. Mon, Apr 14 2025 5:40 AM

సాక్షి, హైదరాబాద్: జపాన్ పర్యటనలో తెలంగాణ బృందం శుక్రవారం రూ. 11,062 కోట్ల భారీ పెట్టుబడులు సాధించింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఐటీ సర్వీసుల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఎన్టీటీ డేటాతోపాటు ఏఐ–ఫస్ట్ క్లౌడ్ ప్లాట్‌ఫాం సంస్థ నెయిసా నెట్వర్క్స్ సంయుక్తంగా హైదరాబాద్‌లో రూ. 10,500 కోట్లతో 400 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి.శుక్రవారం టోక్యోలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆయా సంస్థల ప్రతినిధుల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఎన్టీటీ డేటా, నెయిసా నెట్వర్క్స్ నుంచి బోర్డు సభ్యుడు కెన్ కట్సుయామా, డైరెక్టర్ తడావోకి నిషిమురా, ఎనీ్టటీ గ్లోబల్ డేటా సెంటర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ బాజ్‌పాయ్, నెయిసా సీఈవో, ఎన్టీటీ గ్లోబల్ డేటా చైర్మన్ శరద్ సంఘీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టోక్యో హెడ్ క్వార్టర్స్‌గా కార్యకలాపాలు సాగిస్తున్న ఎన్టీటీ డేటా.. 50కిపైగా దేశాల్లో 1,93,000 మంది ఉద్యోగులతో ప్రపంచంలోని టాప్–3 డేటా సెంటర్ ప్రొవైడర్లలో ఒకటిగా ఉంది. దేశంలోనే అతిపెద్ద ఏఐ కంప్యూట్ మౌలిక సదుపాయం హైదరాబాద్‌లో నిర్మించబోయే 400 మెగావాట్ల డేటా సెంటర్ క్లస్టర్ 25,000 జీపీయూలతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను సమకూర్చనుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో తెలంగాణను ఏఐ రాజధానిగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుందని పేర్కొంది. ఈ ప్రాజెక్టును అత్యున్నత ఎన్వరాన్‌మెంటల్, సోషల్, గవర్నెన్స్ (ఈఎస్జీ) ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. ఈ క్యాంపస్ తెలంగాణలోని విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఏఐ ప్రతిభను పెంపొందించనుందని.. రాష్ట్ర డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌కు దోహదపడుతుందని వివరించాయి. మూడో పరిశ్రమకు తోషిబా అనుబంధ సంస్థ ఓకే.. హైదరాబాద్ శివార్లలోని రుద్రారంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల పరిశ్రమను విస్తరించేందుకు తోషిబా అనుబంధ సంస్థ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (టీటీడీఐ) ముందుకొచి్చంది. రూ. 562 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందం చేసుకుంది. రుద్రారంలో సర్జ్ అరెస్టర్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్‌గేర్ (జీఐఎస్) తయారీ సామర్థ్యాన్ని విస్తరించనున్నట్లు టీటీడీఐ సీఎండీ హిరోషి ఫురుటా సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు.ఇప్పటికే రెండు పరిశ్రమలకు తోడుగా అదనంగా ఇది మూడో పరిశ్రమ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోషిబా కార్పొరేషన్ ఎనర్జీ బిజినెస్ డైరెక్టర్ హిరోషి కనెటా, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, టీటీడీఐ సీఎండీ హిరోషి ఫురుటా పాల్గొన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానాలతోనే భారీ పెట్టుబడులు: సీఎం రేవంత్ తెలంగాణ భారీ పెట్టుబడులను సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయన్నారు. నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా, సింగిల్ విండో అనుమతులను ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన నిపుణులు అందుబాటులో ఉండటంతో ఏఐ సంబంధిత డిజిటల్ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. ఏడబ్ల్యూఎస్, ఎస్టీటీ, టిల్మన్ హోల్డింగ్స్, సీటీఆర్ఎల్ఎస్ వంటి పెద్ద కంపెనీల డేటా సెంటర్ ప్రాజెక్టుల వరుసలో ఎన్టీటీ భారీ పెట్టుబడుల ఒప్పందంతో దేశంలో ప్రముఖ డేటా సెంటర్ హబ్‌గా హైదరాబాద్ స్థానం మరింత బలపడిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి.. జపాన్ పారిశ్రామికవేత్తలతో సీఎం తెలంగాణ కొత్త రాష్ట్రమైనా వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రమని.. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మరింత ఎదగాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన టోక్యోలో జరిగిన ‘ఇండియా–జపాన్ ఎకనామిక్ పార్టనర్íÙప్ రోడ్ షో’లో 150 మంది పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. ‘టోక్యో గొప్ప నగరం. ఇక్కడి మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు అద్భుతం. జపాన్ ప్రజలు సౌమ్యులు, మర్యాదస్తులు, క్రమశిక్షణగల వారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నా’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులైన నిపుణులు, స్థిరమైన విధానాలను తమ ప్రజాప్రభుత్వం అందిస్తుందని జపాన్ వ్యాపారవేత్తలకు మాటిచ్చారు. లైఫ్ సైన్సెస్, గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు, ఎల్రక్టానిక్స్, విద్యుత్ వాహనాలు, టెక్స్టైల్స్, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న సానుకూలతలను వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పారిశ్రామికవేత్తలకు వివరించారు.సమావేశంలో భారత రాయబారి సిబి జార్జ్, జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో) బెంగళూరు డైరెక్టర్ జనరల్ తోషిహిరో మిజుటానీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ప్రచార వీడియోలను రాష్ట్ర ప్రభుత్వం ఈ వేదికపై ప్రదర్శించింది. ఆ తర్వాత తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్‌లోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమైంది. రాష్ట్ర పారిశ్రామిక విధానాలతోనే భారీ పెట్టుబడులుతెలంగాణ భారీ పెట్టుబడులను సాధించడంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయన్నారు. నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా, సింగిల్ విండో అనుమతులను ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన నిపుణులు అందుబాటులో ఉండటంతో ఏఐ సంబంధిత డిజిటల్ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. ఏడబ్ల్యూఎస్, ఎస్టీటీ, టిల్మన్ హోల్డింగ్స్, సీటీఆర్ఎల్ఎస్ వంటి పెద్ద కంపెనీల డేటా సెంటర్ ప్రాజెక్టుల వరుసలో ఎన్టీటీ భారీ పెట్టుబడుల ఒప్పందంతో దేశంలో ప్రముఖ డేటా సెంటర్ హబ్‌గా హైదరాబాద్ స్థానం మరింత బలపడిందని వ్యాఖ్యానించారు. Sat, Apr 19 2025 1:02 AM
సాక్షి, ఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అక్కడ చెట్ల నరికివేతపై జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్ల నరికివేతపై సమర్థించుకోవద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే, వంద ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి అని ప్రశ్నించింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. కంచె గచ్చిబౌలి భూముల అంశంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ధర్మాసనం.. చెట్ల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దీన్ని సమర్ధించుకోవద్దంటూ చురకలు అంటించింది. వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి.. లేదంటే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా?.. సూటిగా జవాబు చెప్పండి. వంద ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారు?. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీలేదు. వీడియోలు చూసి మేము ఆందోళనకు లోనయ్యాం. అభివృద్ధి, పర్యావరణానికి మధ్య సమతుల్యం అవసరం. ఇష్టం వచ్చినట్టు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తామంటే ఊరుకోం. వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి.. లేదంటే చెరువు దగ్గరే తాత్కాలిక జైలుపెట్టి అధికారులను అక్కడే ఉంచుతాం. షెల్టర్ కోసం జంతువులు పరుగులు తీస్తే.. వాటిని వీధి కుక్కలు తరిమాయి. 1996లో మేము ఇచ్చిన తీర్పుకు భిన్నంగా అధికారులు సొంత మినహాయింపులు ఇస్తే వారే బాధ్యులు అవుతారు. ప్రైవేట్ ఫారెస్టులో సైతం చెట్లు నరికితే సీరియస్‌గా పరిగణిస్తాం. భూముల తాకట్టు అంశాలతో మాకు సంబంధం లేదు. కేవలం నరికిన చెట్లను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలి. డజన్ల కొద్ది బుల్డోజర్లతో అడవిలో వంద ఎకరాలు తొలగించారు. మీరు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే తగిన అనుమతులు తీసుకోవాలి. సిటీలో గ్రీన్ లంగ్ స్పేస్ ఉండాలి. వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని ప్రశ్నించింది. చివరగా.. పర్యావరణ, వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని తెలిపింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. అనంతరం.. రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ.. అన్ని పనులు ఆపి వేశాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేశారు. మినహాయింపులకు లోబడే మేము కొన్ని చెట్లు తొలగించాం అని చెప్పుకొచ్చారు.అమికస్ క్యూరీ వాదనలు వినిపిస్తూ.. సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకుని.. అన్నింటికీ మినహాయింపులు ఇచ్చుకున్నారు. ఇది సుప్రీం తీర్పునకు విరుద్ధం. ఈ భూములు తాకట్టుపెట్టి ప్రభుత్వం అప్పులు తెచ్చుకుంది అని అన్నారు. అంతకుముందే, ఈ కేసులో ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం. కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కావు. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల పొదలు పెరిగాయి. అటవీ రెవెన్యూ రికార్డులలో వీటిని అడవులుగా పేర్కొనలేదు. ఆ భూములకు ఎలాంటి కంచె లేదు. కంచె ఏర్పాటు చేసేందుకు మేము ప్రయత్నం చేశాం. ఈ భూముల్లో ఎలాంటి జంతువులు లేవు. కంచె లేని కారణంగా హెచ్‌సీయూ భూములలోని పక్షులు ఇక్కడికి వచ్చాయని పేర్కొంది. Wed, Apr 16 2025 11:46 AM

సాక్షి, న్యూఢిల్లీ: ‘అభివృద్ధి పేరుతో మూడు రోజుల్లోనే వందల బుల్డోజర్లను ఉపయోగించి 100 ఎకరాల్లో చెట్లను తొలగించారు. చెట్ల నరికివేతను ఏ రకంగానూ సమర్ధించుకోవాలని చూడొద్దు. చెట్ల నరికివేతకు అసలు అనుమతులు తీసుకున్నారా లేదా? ఈ ప్రశ్నకు మాకు సూటిగా సమాధానం చెప్పండి. ఒకవేళ అనుమతులు తీసుకోకపోయి ఉంటే మాత్రం అందుకు బాధ్యులైన అధికారులందరినీ జైలుకు పంపుతాం. వారి కోసం అదే ప్రాంతంలో తాత్కాలిక జైలు నిర్మించి మరీ ఊచలు లెక్కబెట్టిస్తాం’అంటూ కంచ గచ్చిబౌలి భూముల కేసులో రాష్ట్ర ప్రభుత్వంపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జార్జ్ అగస్టీన్ మసీలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో 1996లో తామిచ్చిన తీర్పునకు విరుద్ధంగా ప్రవర్తించిన అధికారులే బాధ్యులవుతారనే విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించింది. వంద ఎకరాల్లో అటవీ సంరక్షణ కోసం చట్టప్రకారం తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని ఆదేశించింది. తాము చేపట్టబోయే తీవ్ర చర్యల నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఇతర కార్యదర్శులను కాపాడాలనుకుంటే 100 ఎకరాల్లో పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని తేల్చిచెప్పింది. పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళికతోనే మా ముందుకు రావాలని స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. సుమారు అరగంటపాటు సాగిన వాదనల అనంతరం కేసు విచారణను మే 15కు వాయిదా వేసింది. అప్పటివరకు స్టేటస్ కో కొనసాగుతుందని తెలిపింది. చెట్ల తొలగింపుపై తమ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) సమర్పించిన నివేదికపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు 4 వారాల గడువు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, మేనక గురుస్వామి, ‘బీ ద ఛేంజ్ వెల్ఫేర్ సొసైటీ’పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు, మరో పిటిషన్ తరఫున ఎస్.నిరంజన్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అభివృద్ధి చేసేందుకే.. అంతకుముందు అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు ప్రారంభిస్తూ అన్ని అనుమతులతోనే ఆ భూముల్లో చెట్లను (పొదలు) తొలగించామన్నారు. చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా అని ఈ సందర్భంగా ధర్మాసనం ఎదురు ప్రశ్నించింది. తెలంగాణలో వాటర్ అండ్ ట్రీ (వాల్టా) యాక్ట్ ఉందంటూ అమికస్ క్యూరీ పరమేశ్వర్ జోక్యం చేసుకొని ధర్మాసనానికి వివరించగా ఈ చట్టం కింద అనుమతులు తీసుకోకుంటే అందరిపై చర్యలు తీసుకుంటామని ధర్మాసనం బదులిచ్చింది. ఆ భూములను రూ. 10 వేల కోట్లకు తనఖాపెట్టి ప్రభుత్వం అప్పు తెచ్చుకుందని అమికస్ క్యూరీ పేర్కొనగా ఆయన వ్యాఖ్యలను ధర్మాసనం తోసిపుచ్చింది. ‘ఆ భూములను మార్టిగేజ్ చేశారా లేదా అమ్ముకున్నారా అనేది మాకు అనవసరం. అక్కడ చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా? లేదా అనేది మాత్రమే మాకు సూటిగా జవాబు చెప్పండి’అంటూ సింఘ్వీని ప్రశ్నించింది. ఆ ప్రాంతంలో కొన్ని షెడ్యూల్డ్ జంతువులు ఉన్నాయని.. అక్కడ పనులు జరిగేటప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదని ‘బీ ద ఛేంజ్ వెల్ఫేర్ సొసైటీ ’తరుఫు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, మోహిత్‌రావులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో జేసీబీలు ఉన్నాయని చెప్పారు. హెచ్సీయూకు 25 వేల ఎకరాల భూమి ఉందని.. అందులో 400 ఎకరాల భూవివాదం 2004 నుంచి కొనసాగుతోందని సింఘ్వీ ధర్మాసనానికి వివరించారు. దీనికి సంబంధించి కోర్టు తీర్పులు, 20 ఏళ్లలో ఆ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి ఎంతో జరిగిందన్నారు. ఈ స్థలంలో ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో మందికి జీవనోపాధి, ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు చెప్పారు. సీఎస్ ఒక మహిళ అని, ఆమె నెల రోజుల్లో రిటైరవనున్నారని సింఘ్వీ ధర్మాసనానికి వివరించారు. జేసీబీలు వచ్చిన విషయం సీఎస్‌కు తెలియదా? ఈ సందర్భంగా ధర్మాసనం మళ్లీ స్పందిస్తూ ‘మేం పదేపదే చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా లేదా అని అడుగుతున్నాం. ఈ ప్రశ్నకు మాకు సూటిగా మీ సమాధానం కావాలి’అంటూ వ్యాఖ్యానించింది. ‘సీఎస్ నెల రోజుల్లో రిటైరవుతున్నారంటే ఎలా సింఘ్వీజీ? ఆ ప్రాంతంలో జేసీబీలు వచ్చిన విషయం సీఎస్‌కు తెలియదా? రాష్ట్రంలో జరుగుతున్న విషయాలకు సీఎస్ బాధ్యత వహించాలి కదా?’అంటూ జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. ‘అడవి అనే పదానికి నిర్వచనం ఇస్తూ 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా చెట్ల నరికివేత జరిగి ఉంటే మాత్రం మేం ఊపేక్షించం. చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకోవాలనే విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా? అంటూ ధర్మాసనం నిలదీసింది. మహానగరాల్లో అటవీభూముల్లో కాపాడుకోకపోతే ఎలా? ‘చార్ధామ్ యాత్ర కోసం రోడ్డు నిర్మాణానికి చెట్లు తొలగిస్తామంటేనే మేం అనుమతించలేదు. మహారాష్ట్రలో సచివాలయ నిర్మాణం కోసం పర్యావరణానికి నష్టం కలిగించిన కేసు రెండు దశబ్దాలుగా సుప్రీంకోర్టులోనే పెండింగ్‌లో ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి మహానగరాల్లోని అటవీ భూముల్ని కూడా కాపాడుకోలేకపోతే ఎలా? అంటూ ప్రశ్నలు సంధించింది. మంత్రులు ఏది చెబితే అధికారులు అది చేసేస్తున్నారంటూ అమికస్ క్యూరీ పరమేశ్వర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా ‘పర్యావరణానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను జైళ్లకు పంపించాల్సి వస్తుంది జాగ్రత్త. చెట్లను కొట్టేసిన దగ్గరే తాత్కాలిక జైలు నిర్మిస్తాం. సంబంధిత అధికారులను అదే జైలులో 6 నెలలపాటు ఊచలు లెక్కబెట్టిస్తాం’అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వంద ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారు? చెట్లు కొట్టేసిన ప్రాంతంలో పర్యావరణ పునరుద్ధరణ కోసం తీసుకున్న చర్యలేంటి? ఆ భూముల్లో వన్యప్రాణుల్ని ఎలా రక్షిస్తారు? అక్కడి నష్టాన్ని ఎలా పూడుస్తారు?’అంటూ సింఘ్వీపై ధర్మాసనం ప్రశ్నలవర్షం కురిపించింది. విధ్వంసం చేస్తే ప్రేక్షక పాత్ర పోషించాలా? ఆ ప్రాంతంలో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు సిద్ధపడిందని.. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నందునే ఆ ప్రాంతమంతా దట్టమైన పొదలతో అడవిలా తయారైందని సింఘ్వీ వాదించారు. ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసి ఎందరో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనుందని ధర్మాసనానికి చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘అభివృద్ధి, ఉద్యోగాల కల్పన పేరుతో మీరు పర్యావరణాన్ని విధ్వంసం చేస్తుంటే మేం ప్రేక్షకపాత్ర పోషించాలా?. మీకు మీరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏమిటి? మూడు రోజుల్లో 100 ఎకరాలు ధ్వంసం చేశారంటే ఎన్ని బుల్డోజర్లు అక్కడ ఉన్నట్లు? మీరు సృష్టించిన రణరంగానికి అక్కడి జంతువులు ప్రాణభయంతో పరుగులు తీయగా వాటిని కుక్కలు కరిచాయి. ఆ వీడియోలను చూసి చలించిపోయాం’అని పేర్కొంది. అయితే ఆ భూముల్లో జంతువులు లేవని.. కావాలనే కొందరు నకిలీ వీడియోలు సర్క్యులేట్ చేశారని సింఘ్వీ బుదులివ్వగా ధర్మాసనం ఆక్షేపించింది. అక్కడ జంతువులు పరుగులు తీసిన వీడియోలను తాము చూసి చలించిపోయమని తెలిపింది. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని సింఘ్వీ ధర్మాసనానికి బదులిచ్చారు. దీనిపై తదుపరి విచారణను ధర్మాసనం మే 15కు వాయిదా వేసింది. Thu, Apr 17 2025 1:05 AM
హైదరాబాద్: ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి లోనైన ఓ యువతి ప్రియుడి ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారానగర్‌లో చోటు చేసుకుంది. ఎస్ఐ రాములు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాం రాష్ట్రం, బస్కంది గ్రామానికి చెందిన సుల్తానా బేగం(26) సిద్ధిఖీనగర్‌లో ఉంటూ గచ్చిబౌలిలోని అంతేరా హోటల్లో సర్వర్‌గా పని చేస్తోంది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన సైదుల్లా షేక్ గచ్చిబౌలిలోని నావాబ్ హోటల్లో మేనేజర్‌గా పని చేస్తూనే పెస్ట్ కంట్రోల్ పని చేసేవాడు. సుల్తానా, సైదుల్లా షేక్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుల్తానా తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తుండటంతో తనను పెళ్లి చేసుకోవాలని సుల్తానా సైదుల్లాపై ఒత్తిడి పెంచింది. బుధవారం సాయత్రం పెళ్లి విషయమై గొడవ జరిగింది. దీంతో పెళ్లికి నిరాకరించిన అతను ఆమె ఫోన్‌ను బ్లాక్‌లో పెట్టాడు. దీంతో సుల్తానా మరో యువతికి ఫోన్ చేసి షైదుల్లా ఉంటున్న ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. దీంతో ఆమె ఈ విషయాన్ని సైదుల్లాకు చెప్పినా అతను పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి లోనైన సుల్తానా గురువారం ఉదయం సైదుల్లా నివాసం ఉండే భవనంపైకి ఎక్కి 6వ అంతస్తు నుంచి దూకడంతో కింద పార్క్ చేసి ఉన్న కారుపై పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించగా ఉదయం మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Fri, Apr 18 2025 8:20 AM
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఈ దిశలో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. నగరంలో మహిళల భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌తో (హెచ్సీఎస్సీ) కలిసి నగర పోలీసులు మంగళవారం నిర్వహించిన ‘స్త్రీ’(షీ ట్రంప్స్ థ్రూ రెస్పెక్ట్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్) సమ్మిట్ 2.0కు భట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బంజారాహిల్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, నీతి ఆయోగ్ సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్ భానుశ్రీ వెల్పాండియన్, ప్రముఖ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘స్త్రీలకు సమాన హక్కులు కల్పించిన, రాజ్యాంగానికి రూపమిచ్చిన బీఆర్ అంబేడ్కర్ జయంతి మరుసటి రోజే ఈ సదస్సు నిర్వహించుకుంటున్నాం. తెలంగాణలో ఉన్న ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు అన్ని రకాలైన సాధికారత కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మహిళా సంఘాలకు ప్రభుత్వం ఏటా రూ.20 వేల కోట్ల మేర వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా.. లక్ష్యాన్ని మించి రూ.21 వేల కోట్లు అందించాం. గ్రీన్ ఎనర్జీలో మహిళల్ని భాగస్వాముల్ని చేస్తున్నాం. సోలార్ రంగంలో 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి మహిళా సంఘాలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం.మహిళల కోసం ప్రత్యేక చట్టాలు చేయడంతో పాటు వాటిని అమలు చేస్తేనే మహిళ సాధికారికత సాధ్యం. తెలంగాణ ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉంది’అని అన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ‘మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ఇప్పటికీ నేరాలు జరుగుతున్నాయి. గత ఏడాది నగరంలో 250 అత్యాచారం కేసులు, 713 పోక్సో కేసులు నమోదయ్యాయి. మహిళలకు న్యాయం చేయడానికి షీ–టీమ్స్‌తో పాటు భరోసా కేంద్రం పనిచేస్తోంది.హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో 19 డీసీపీ పోస్టులు ఉండగా... వీటిలో ఎనిమిది మంది మహిళా అధికారులు ఉన్నారు’అని పేర్కొన్నారు. మహిళ సాధికారికత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని నీతి ఆయోగ్ సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్ భానుశ్రీ వెల్పాండియన్ అన్నారు. ఈ కోణంలో దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఉత్తమ విధానాలు అమలవుతున్నాయని కితాబిచ్చారు. Wed, Apr 16 2025 6:08 AM

హైదరాబాద్,సాక్షి: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మార్ఫింగ్ ఫొటోను రీ ట్వీట్ చేసిన ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు (Smita Sabharwal) తెలంగాణ పోలీసులు (telangana police) నోటీసులు ఇచ్చారు. అయితే, పోలీసులు నోటీసులు ఇచ్చిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్లను రీట్వీట్లు చేస్తున్నారు.కంచ గచ్చిబౌలి భూముల (Kancha Gachibowli row) ఇష్యూకు సంబంధించి పలువురు నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్టుల్ని డిలీట్ చేస్తున్నారు. కానీ ఐఏఎస్ స్మిత సబర్వాల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వరుస ట్వీట్లు పెడుతున్నారు. తాజాగా, ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్లపై వరుసగా రెండోరోజు రీపోస్ట్ చేశారు. వాటిల్లో 100 ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలు ఉన్న ఫొటో ఉంది. మరో పోస్టులో తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్ అధికారికే నోటీసులిస్తరా? ఇది దేనికి సంకేతం?’ అంటూ ఓ ఇద్దరు మహిళలు పెట్టిన పోస్టును రీపోస్ట్ చేశారు. ఏఐతో క్రియేట్ చేసిన బుల్డోజర్లు, నెమళ్లు, జింకలు ఉన్న రెండు పోస్టులను స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేయడం. ఆ పోస్టులకు వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయడం..అయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్లను రీట్వీట్ చేయడంపై స్మితా సబర్వాల్ తీరుపై ఐఏఎస్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. Fri, Apr 18 2025 9:07 AM
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆరు ప్లాట్ ఫామ్‌లను మూసివేయనున్నారు. చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లికి పలు రైళ్లు మళ్లించనున్నారు. 100 రోజుల పాటు ఆరు ప్లాట్ ఫామ్‌లు మూసి వేయనునట్లు అధికారులు ప్రకటించారు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా భారీ స్కై కాంకోర్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ఓవర్ వంతెన పనులు ప్రారంభిస్తుండటంతో 115 రోజుల పాటు సగం ప్లాట్‌ఫామ్స్‌ను మూసి వేయనున్నారు. ఇవాళ నుంచి దశలవారీగా 120 జతల రైళ్లను దారిమళ్లించి వేరే స్టేషన్ల నుంచి తిప్పనున్నారు. వీటిల్లో సింహభాగం రైళ్లు చర్లపల్లి టెర్మినల్ నుంచి రాకపోకలు సాగించనుండగా, కొన్ని నాంపల్లి, కొన్ని కాచిగూడ స్టేషన్ల నుంచి నడుస్తాయి. సికింద్రాబాద్ స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పునర్నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండంతస్తుల్లో భారీ స్కై కాంకోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రైల్వేస్టేషన్లో ఇదే కీలక భాగం. ఇది ఏకంగా 110 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవు ఉంటుంది. ప్రయాణికులకు అన్ని వసతులు ఇక్కడే ఉంటాయి.వేచి ఉండే ప్రాంతంతో పాటు రిటైల్ ఔట్లెట్స్, రెస్టారెంట్లు, కియోస్క్‌లు లాంటివన్నీ ఇందులోనే ఏర్పాటు చేస్తున్నారు. ఇది లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ఓవర్ వంతెనతో అనుసంధానమై ఉంటుంది. ఈ భారీ నిర్మాణానికి సంబంధించిన పునాదులు, కాలమ్స్ పనులు మొదలుపెడుతున్నారు.ఇందుకోసం 2–3, 4–5 ప్లాట్స్ ఫామ్స్‌ను 50 రోజులు చొప్పున మొత్తం వంద రోజులపాటు మూసేస్తారు. వీటిల్లో లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటుచేసే పనులు కూడా చేపడుతారు. ప్లాట్‌ఫామ్స్‌తోపాటు రైల్వే ట్రాక్ మొత్తానికి పైకప్పు ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించిన పనులను కూడా ఈ నాలుగు ప్లాట్‌ఫామ్స్‌తో ప్రారంభిస్తున్నారు. తర్వాత ప్లాట్‌ఫామ్ నంబర్ 10 వైపు పనులు చేపడుతారు.ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి పదో ప్లాట్‌ఫామ్ వరకు భారీ ఫుట్ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీని పనుల కోసం మధ్యలో ఉండే ప్లాట్పామ్ 5–6 లో 500 టన్నుల సామర్థ్యంగల భారీ క్రేన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు ట్రాక్‌లపై ఇసుక బస్తాలు నింపి, దాని మీద క్రేన్ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం 15 రోజుల పాటు ఆ రెండు ప్లాట్‌ఫామ్స్‌ను మూసేస్తున్నారు.నిత్యం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మీదుగా 250 జతల రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిల్లో ఇప్పటికే 6 జతల రైళ్లను చర్లపల్లి టెర్మినల్ స్టేషన్‌కు శాశ్వతంగా మళ్లించారు. మరో 26 జతల రైళ్లను తాత్కాలిక పద్ధతిలో ఇతర స్టేషన్ల మీదుగా నడుపుతున్నారు. ఇప్పుడు 100 రోజుల పాటు సింహభాగం ప్లాట్‌ఫామ్స్‌ను మూసేస్తుండటంతో 120 జతల రైళ్లను కూడా మళ్లిస్తున్నారు. దీంతో సికింద్రాబాద్‌లో రైలు సేవలు పరిమితంగానే ఉండనున్నాయి. ఆరు నెలల పాటు సికింద్రాబాద్ స్టేషన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కొనసాగనుంది. Tue, Apr 15 2025 12:49 PM

వేములవాడ: వేములవాడ పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఆదివారం సాయంత్రం ఓ ఫంక్షన్ హాల్ మర్డర్‌తో దద్దరిల్లింది. ఆగ్రహావేశాలతో రెండు గొడ్డళ్లు, కత్తితో హత్య చేసిన దశ్యాలు కలచివేశాయి. ఈ దారుణ ఘటన అనంతరం నేనే బైరెడ్డి.. రక్తపు మరకలే సాక్ష్యం.. ఎవడినీ వదలను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపింది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఇది డ్రగ్స్ ముఠా, గంజాయి గుంపుల మధ్య అంతర్గత వివాదంగా గుర్తించినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. పట్టణంలోని బైపాస్ రోడ్డులోని మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్ ఆదివారం సాయంత్రం భయంకరమైన హత్య జరిగింది. రెండు గొడ్డళ్లు, ఒక కత్తితో దుండగులు వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లికి చెందిన చెట్టిపల్లి పర్శరాం(36)ను నిర్దాక్షిణ్యంగా మెడ, తలపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశారు. మృతుడికి భార్య కల్యాణి, కూతురు అమ్ములు, కుమారుడు బబ్లీ ఉన్నారు. ఫంక్షన్ హాల్లో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు చేరుకొని శవాన్ని ఫంక్షన్ హాల్ బంగ్లాపై నుంచి కిందికి దించి ట్రాక్టర్లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయతి్నంచగా.. పోలీసులు స్పందించలేదు. ట్రాక్టర్ వద్ద రోదనలు.. మృతుడి తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఘటనా స్థలానికి రాగా.. భార్య స్పృహ తప్పి పడిపోయింది. చిన్న పిల్లలు డాడి ఎక్కడ అంటూ అడగడంతో.. స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. అతడి మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ ట్రాక్టర్ పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. తమతో పెట్టుకుంటే రక్తపు మరకలే.. తమతో పెట్టుకుంటే రక్తపు మరకలే అంటూ సదరు అనుమానితుల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కత్తులు, గొడ్డలితో అత్యంత భయంకరంగా వ్యవహరిస్తూ తమతో పెట్టుకుంటే రక్తపు మరకలు అని బెదిరింపులకు పాల్పడినట్లుగా వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. అనుమానితులు 25 ఏళ్ల వయసు లోపున్న వారే కావడం, యువత దారి తప్పిన విధానం వేములవాడలో కలకలం రేపుతోంది. అనుమానితులు ఇప్పటికే ఒక హత్య కేసులో నిందితులుగా ఉన్నట్లు సమాచారం. వేములవాడలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. Mon, Apr 14 2025 1:36 PM

సాక్షి, హైదరాబాద్: వెకిలిచేష్టలతో అమ్మాయిలను వేధించే ఆకతాయిల భరతం పడుతున్నాయి షీ టీమ్స్. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 331 షీ టీమ్స్ బృందాలు పనిచేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొదటి త్రైమాసికంలో మొత్తం 2,586 మంది ఆకతాయిలను షీ టీమ్స్ బృందాలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు మహిళా భద్రతా విభాగం అధికారులు ‘ఎక్స్’లో తెలిపారు. అదేవిధంగా 703 మంది మైనర్లకు కౌన్సెలింగ్ చేసినట్టు పేర్కొన్నారు.మహిళలు, యువతులను వేధిస్తున్న పోకిరీలు ఎక్కువగా ఉంటున్న హాట్ స్పాట్స్‌పై ప్రత్యేకంగా నిఘా పెడుతున్నట్టు అధికారులు వెల్లడించారు. గత మూడు నెలల్లో ఇలాంటి 15,249 హాట్స్పాట్లను గుర్తించి షీ టీమ్స్ బృందాలతో నిఘా పెట్టినట్టు వివరించారు. అదేవిధంగా షీ టీమ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచేలా మొత్తం 3,080 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు.ఆకతాయిల వేధింపులపై మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని షీ టీమ్స్ అధికారులు సూచించారు. బాధితులు వాట్సాప్ నంబర్ 8712656856లో ఫిర్యాదు చేయవచ్చని లేదా డయల్ 100కు కూడా సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని, ఆకతాయిలపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. Mon, Apr 14 2025 2:10 AM
హైదరాబాద్: కేంద్రం సవరణ చేసిన వక్ఫ్ బోర్డు బిల్లుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ప్రభుత్వ సలహా దారు షబ్బీర్ అలీ సంతోషం వ్యక్తం చేశారు. రాజ్యాంగం మీద ముస్లింలకు నమ్మకం ఉందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ‘వక్ఫ్ బోర్డ్ పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. కేంద్రం సవరణ చేసిన వక్ఫ్ బోర్డ్ బిల్లును మేము సుప్రీంకోర్టులో చాలెంజ్ చేశాం. మా తరఫున కపిల్ సిబాల్ వాదించారు. కేవలం ఒక మతానికి మాత్రమే చట్టం ఎలా చేస్తారు?. వక్ఫ్ భూములు గవర్నమెంట్ ఇచ్చిన భూములు కావు...దాతలు ఇచ్చిన భూములు పేద ముస్లింలకు చెందాలని ఇచ్చారు. వక్ఫ్ బోర్డు లో మహిళలు ఉన్నారుతెలంగాణలో,ఏపీలో మహిళలు కూడా ఉన్నారు. అన్ని మతాల దేవాలయాల భూములు కబ్జా చేస్తున్నారు. అన్నిటికీ చట్టం తీసుకొని రావాలి.... అప్పుడు స్వాగతిస్తం. వేరే వేరే మతాల వారిని బోర్డులో నియమించడం వల్ల గొడవలు జరుగుతాయి’ అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.కాగా, వక్ఫ్ సవరణ చట్టం 2025పై దేశసర్వోన్నత న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది.వక్ఫ్ (సవరణ) చట్టం 2025ను సవాల్ చేస్తూ 73 పిటిషన్లు నమోదు కాగా.. గురువారం వరుసగా రెండో రోజూ సుప్రీం కోర్టు వాదనలు వింది. కొన్ని అంశాలతో ప్రాథమిక సమాధానం ఇవ్వడానికి కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వారం గడువు కోరారు. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపారు. Thu, Apr 17 2025 9:25 PM

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఈ నెల 16న జపాన్ పర్యటనకు బయ ల్దేరి వెళ్లనున్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు రాష్ట్ర అధికారుల ప్రతినిధి బృందం సీఎం వెంట ఉంటారు. ఏప్రిల్ 16 నుండి 22 వరకు పర్యటన కొన సాగనుంది. టోక్యో, మౌంట్ ఫుజి, ఓసాకా, హీరోషిమాలో ముఖ్యమంత్రి బృందం పర్య టించనుంది.ఓసాకా వరల్డ్ ఎక్స్పో–2025లో తెలంగాణ పెవిలియన్‌ను సీఎం ప్రారంభించనున్నారు. ఆ దేశానికి చెందిన ప్రముఖ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రతిని ధులతో ముఖ్యమంత్రి బృందం సమావేశం కానుంది. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రా మిక, సాంకేతిక సహకారంపై ప్రధానంగా చర్చలు జరపనుంది. Mon, Apr 14 2025 2:16 AM

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ పెట్టుబడులకు ఒప్పందం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రూ.29,000 కోట్ల భారీ పెట్టుబడులతో 5,579 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులతోపాటు 15 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టుల స్థాపనకు ముందుకొచ్చిన రెండు ప్రైవేటు వ్యాపార సంస్థలతో రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో) పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకుంది. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో బుధవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో రెడ్కో ఈ మేరకు మొత్తం నాలుగు ఎంఓయూలు కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టుల స్థాపనతో రాష్ట్రంలో 19,200 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఎకోరెన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.27,000 కోట్ల పెట్టుబడులతో మొత్తం 5,579 మెగావాట్ల సామర్థ్యంతో మూడు పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు మూడు ఎంఓయూలు కుదుర్చుకుంది.» సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 3,279 మెగావాట్ల పవన–సౌర హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టులను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. » జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 7 ప్రాంతాల్లో మొత్తం 1,650 మెగావాట్ల సామర్థ్యంతో ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును స్థాపించనుంది. » జోగుళాంబ గద్వాల జిల్లాలో 650 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈ మూడు ప్రాజెక్టుల ఏర్పాటుతో 16,200 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలతో పాటు రాష్ట్రానికి జీఎస్టీ రూపంలో రూ.1600 కోట్ల ఆదాయం రానుంది. » జీఎస్పీఆర్ ఆర్య సంస్థ రూ.2000 కోట్ల పెట్టుబడులతో 15 జిల్లాల్లో 15 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి ఎంఓయూ చేసుకోగా, 3,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. » వరి గడ్డి నుంచి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయనుండగా, ఒక్కో ప్రాజెక్టు 15 టన్స్ పర్డే(టీపీడీ)ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉండనున్నాయి. ఎనర్జీ పాలసీతోనే : భట్టి తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీకి ఆకర్షితులై జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, రెడ్కో వీసీ, ఎండీ వి.అనీల, ఎకోరెన్ కంపెనీ ఎండీ ప్రసాద్, జీపీఎస్ఆర్ ఆర్య కంపెనీ ఎండీ దీపక్ అగర్వాల్ పాల్గొన్నారు. Thu, Apr 17 2025 12:53 AM
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొన్ని గంటల పాటు మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే నగరంలోని పలు చోట్ల వర్షం పడుతోంది. ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, ఖైరతాబాద్, లక్డీకపూల్, సోమాజిగూడ, ఎర్రమంజిల్, తార్నాక, నల్లకుంట, విద్యానగర్, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది.ఒక్కసారిగా వాతావరణం మారి.. వర్షం కురుస్తుండటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్ల మీదకు రావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షం కురుస్తోన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాగం అప్రమత్తమైంది.తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ని జారీ చేసింది. దక్షిణ మధ్యప్రదేశ్ మధ్య నుంచి ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశాల మీదుగా దక్షిణ గ్యాంజెటెక్ పశ్చిమ బెంగాల్ వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. సగటున సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. Tue, Apr 15 2025 4:07 PM
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఐదు కుక్క పిల్లలను గోడకేసి కొట్టి చంపేసిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, సైకోగా మారిన ఆ వ్యక్తిని నెటిజన్లు తిట్టి పోస్తున్నారు.అసలు ఏం జరిగిందంటే.. ఫతేనగర్‌లో ఇండిస్ అపార్టుమెంట్ దగ్గర ఓ వీధి కుక్క ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. అక్కడే ఉన్న అపార్ట్మెంట్ సెల్లార్లో ఆ కుక్క పిల్లలు ఉంటున్నాయి. అదే అపార్ట్మెంట్లో నివశించే అశీష్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్కతో రోజూ బయటకు వెళ్లే క్రమంలో ఆ కుక్కపిల్లలు దగ్గరకు వచ్చేవి. దీంతో ఓ కుక్క పిల్లను గోడకేసి బలంగా కొట్టగా.. అది రక్తం కక్కుకుని కింద పడిపోయింది. బతికిందో లేదో తెలుసుకోవడానికి మరోసారి గట్టిగా కొట్టాడు.. ఇలా మొత్తం ఐదు కుక్క పిల్లలను దారుణంగా చంపేశాడు.కుక్క పిల్లలు చనిపోయి ఉండడంతో అనుమానం వచ్చిన అపార్ట్మెంట్ వాసులు.. ఈ క్రమంలో అక్కడున్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, అదే అపార్ట్మెంట్లో ఉన్న వ్యాపారి ఆశిష్ ఈ దారుణానికి పాల్పడినట్లు తేలింది. ఖాన్ అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జంతువులపై ఇంత కిరాతకంగా వ్యహరించిన వ్యక్తిని జైలుకు పంపించాలని కోరాడు.ఆశిష్‌ను అపార్ట్మెంట్ వాసులు ప్రశ్నించగా.. ఆ కుక్క పిల్లలు తన పెంపుడు కుక్క దగ్గరకు వచ్చాయని.. అందుకే చంపేశానంటూ సమాధానమిచ్చాడు. ఈ ఘటనపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నగరంలో సైకోలు పెరిగిపోతున్నారని.. జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని అరికట్టడానికి కఠినమైన శిక్షలు విధించాలని కోరుతున్నారు.*VB City Community – Urgent Alert!* The safety of our community, especially our children, is at serious risk.A disturbing incident has come to light—an individual was caught on video brutally attacking puppies just 5 to 6 days old. This act of cruelty is not only heartbreaking pic.twitter.com/hedp136Mrt— Khan (@khanbr1983) April 17, 2025 Thu, Apr 17 2025 5:00 PM

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిశాయి. అనుబంధ గుర్తింపు ఇచ్చేంత వరకూ కొత్తగా అడ్మిషన్లు చేపట్టవద్దని ఇంటర్మీడియెట్ బోర్డు స్పష్టం చేసింది. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇలాంటి కార్యకలాపాలపై నిఘా పెట్టాలని జిల్లా అధికారులను ఆదేశించింది. అవసరమైతే పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టాలని సూచించింది. కానీ రాష్ట్రంలోని దాదాపుగా అన్ని జూనియర్ కాలేజీలూ బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయి. ఎప్పుడో జూన్‌లో మొదలయ్యే తరగతుల కోసం అన్ని జిల్లాల్లోనూ పోటాపోటీగా విద్యార్థులను చేర్చుకుంటున్నాయి.విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకర్షించేందుకు యాజమాన్యాలు ప్రత్యేకంగా ఏజెంట్లను, పూర్వ విద్యార్థులు, కాలేజీ సిబ్బందిని రంగంలోకి దింపాయి. వారికి టార్గెట్లు పెడుతున్నాయి. తాయిలాల ఎర వేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా జిల్లాల్లో అధికారులు ప్రవేశాలను అడ్డుకోవడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కళ్ళెదుటే కాలేజీలు బోర్డులు పెట్టి మరీ విద్యార్థులను చేర్చుకుంటున్నా, పట్టించుకోవడం లేదని అంటున్నారు. అయితే ఇలాంటివి ఇంతవరకు తమ దృష్టికి రాలేదని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు.అనుమతికి అవకాశం లేకున్నా అడ్మిషన్లు!వాస్తవానికి జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు జారీ చేసేందుకు బోర్డు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 5 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుంటామని తెలిపింది. అయితే ఇంతవరకూ ఏ కాలేజీ దరఖాస్తు చేయలేదు. మే 5 వరకూ గడువు ఉండటమే ఇందుకు కారణమని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో 1,200కు పైగా ప్రైవేటు జూని యర్ కాలేజీలున్నాయి. వీటిల్లో 350 కాలేజీలు గృహ, వాణిజ్య సముదాయాల్లో నడుస్తున్నాయి. ఈ కాలేజీలపై రెండేళ్ళ క్రితమే అగి్నమాపక శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. వీటికి అనుమతి ఇవ్వలేమని పేర్కొంది.ఈ కాలేజీల్లో దాదాపు 80 వేల మంది చదువుతున్నారు. వీటిల్లో ఏ ఒక్కటీ ఇప్పటివరకు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోలేదు. కానీ విద్యార్థుల నుంచి యథావిధిగా అడ్మిషన్లు మొదలు పెట్టాయి. నిబంధనలన్నీ కాగితాల్లోనే ఉంటాయని, తమకు అనుమతి వచ్చి తీరుతుందని ఆ కాలేజీలు నమ్మబలుకుతున్నాయి. వాస్తవానికి ఎప్పటికప్పుడు కాలేజీల్లో చేరిన విద్యార్థుల భవిష్యత్ దెబ్బతింటుందని చెబుతూ బోర్డును వేడుకుంటున్నాయి. మరోవైపు రాజకీయంగానూ ఒత్తిడి తెస్తున్నాయి. ఇప్పుడు కూడా అదే బాటను నమ్ముకుని అడ్మిషన్లు చేపడుతున్నాయనే విమర్శలు విన్పిస్తున్నాయి.భారీగా పెరిగిన ఫీజులుమరోవైపు ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఈసారి భారీ యెత్తున ఫీజులు డిమాండ్ చేస్తున్నాయి. జేఈఈ, రాష్ట్ర ఇంజనీరింగ్ సెట్‌కు కలిపి కోచింగ్ ఇస్తామంటున్నాయి. వేసవి ముగిసే నాటికే సిలబస్ పూర్తి చేస్తామని, మిగిలిన రోజులంతా కోచింగ్‌పై దృష్టి పెడతామని చెబుతున్నాయి. ఇందుకోసం గత ఏడాది రూ.70 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఫీజు వసూలు చేశాయి. ఈసారి ఇది రూ.లక్ష నుంచి రూ.4.20 లక్షలకు పెంచేశాయి. ఈ క్రమంలో కార్పొరేట్ కాలేజీలు రకరకాల ఆశలు కల్పిస్తున్నాయి. కొన్నేళ్ళుగా జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో సాధించిన విజయాలతో ప్రచారం చేసుకుంటున్నాయి.ఏజెంట్లు, సిబ్బంది కూడా దీన్నే ఆయుధంగా వాడుకుంటున్నారు. ముందే అడ్మిషన్ తీసుకుంటే 15 శాతం వరకు రాయితీ ఉంటుందని చెబుతున్నారు. ఒకసారి టెన్త్ పరీక్ష ఫలితాలు వెల్లడైతే ఎలాంటి రాయితీ ఉండదంటూ ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పిల్లల్ని చేర్చే క్రమంలో వాకబు చేయడానికి వచ్చే తల్లిదండ్రులను గంటల కొద్దీ కౌన్సెలింగ్ చేసి సీట్లు అంటగడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై ఇంటర్ బోర్డు అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. Sat, Apr 19 2025 1:49 AM

సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని, భారత్‌కు రావడానికి సిద్ధంగా ఉన్నానని నిందితుడు ప్రభాకర్‌రావు (ఏ–1) హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాన పిటిషన్లో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం ముందు మంగళ వారం వాదోపవాదాలు జరిగాయి. తనను అన్యా యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించారని, అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ ఉత్తర్వులు జారీ చేయాలంటూ ప్రభాకర్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 65 ఏళ్ల సీనియర్ సిటి జన్నని, తన వైద్య, ఆరోగ్య పరిస్థితులు, వైద్యం చేయించుకునే అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. పిటిషన్‌పై జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రభాకర్‌రావు వారంలో భారత్ రావడానికి సిద్ధంగా ఉన్నారని, పోలీసులు వెంటనే అదుపు లోకి తీసుకునే అవకాశం ఉన్నందున అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టు ఏ–6 శ్రవణ్‌కుమార్‌ను అరెస్టు చేయకుండా తాత్కాలిక ఆదేశాలు ఇచ్చిందని, అదే ఉత్తర్వులను ప్రభాకర్‌రావుకూ వర్తింపజేయాలన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఉత్తర్వు ప్రతిని అందజేశారు. నిరంజన్‌రెడ్డి వాదనలను.. ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా తోసిపుచ్చారు. ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దయిందని, రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారని గుర్తు చేశారు. ఆయన తనంతట తానుగా వారంలో భారత్‌కు వస్తున్నారని చెప్పడం అసత్యమని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. ప్రభుత్వం తరపున లూద్రాతో పాటు పీపీ పల్లె నాగేశ్వర్రావు విచారణకు హాజరయ్యారు. Wed, Apr 16 2025 12:43 AM

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న ఆలోచన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌దేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి నోటి వెంట వచ్చినవి కేసీఆర్ మనసులోని మాటలేనని ఆరోపించారు. రూ.5–6 వేల కోట్లు ఖర్చు చేసైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన సందర్భంగా ఆ చట్టం తీరుతెన్నులు, రెవెన్యూ శాఖలో చేపడుతున్న సంస్కరణలు, రాష్ట్ర రాజకీయాలపై బుధవారం ‘సాక్షి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘భూభారతి చట్టంపై బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అసలు వారికి ఉరితాడు అయింది ధరణినే. అది గ్రహించకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. వారికి గత ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు కూడా ఈసారి రావు. 15 నెలలకే ప్రభుత్వాన్ని కూలుస్తామని కొందరి ఆత్మలు మాట్లాడుతున్నాయి. కేసీఆర్ మనసులోని మాటలనే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. రూ.5–6 వేల కోట్లు ఖర్చుపెట్టి అయినా ఎమ్మెల్యేలను కొనాలని అనుకుంటున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు తనకు కావాల్సిన బిల్డర్లకు వేలాది ఎకరాలు కట్టబెట్టారు. ఇప్పుడు వారంతా భయభ్రాంతులకు గురై, ఫామ్‌హౌస్‌కు వెళ్లి మాజీ సీఎంకు మొరపెట్టుకున్న మాటలను ప్రభాకర్‌రెడ్డితో చెప్పించారు. ప్రభుత్వ భూములను చెరపట్టిన వారు ఏడేడు లోకాల ఆవల ఉన్నా వదిలిపెట్టం. ప్రతి ఇంచు భూమిని బరాబర్ తీసుకుని పేదలకిస్తాం. మాజీ సీఎం, ఆయన కొడుకు, అల్లుడు, కూతురు వేసే స్కెచ్‌లు, కుట్రలకు ఎలా చెక్‌పెట్టాలో కాంగ్రెస్ పార్టీ పులులకు తెలుసు. సమయం వచ్చినప్పుడు ఆ పులులు స్పందిస్తాయి’ అని స్పష్టంచేశారు.కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందని, కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని తెలిపారు. ‘పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు వేస్తారు. మేం మంచిగా పనిచేస్తున్నందుకే కంచ గచ్చిబౌలిపై మోదీ కూడా మమ్మల్ని విమర్శిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. నేటి నుంచే భూ సమస్యల పరిష్కారంరాష్ట్ర ప్రజల కోరిక మేరకే ధరణిని బంగాళాఖాతంలో కలిపేశా మని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. జూన్ 2వ తేదీ నాటికి వ్యవసాయ భూముల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో వీలైనన్ని పరిష్కరిస్తా మని వెల్లడించారు. భూభారతి చట్టం ద్వారా వ్యవసాయ భూముల సమస్యలను పరిష్కరించే పనిని గురువారం నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ‘పైలెట్ ప్రాజెక్టుగా లింగంపేట, నేలకొండపల్లి, మద్దూరు, వెంకటాపూర్ మండలాలను ఎంచుకున్నాం. ఈ మండలాల్లోని అన్ని గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తాం. ఈ సదస్సుల్లో రైతుల నుంచి భూసమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తాం. ఈ దరఖాస్తు ఫార్మాట్‌ను ఇప్పటికే క్షేత్రస్థాయికి పంపాం. ప్రతి గ్రామంలో తహసీల్దార్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం పర్యటించి, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సదస్సులు నిర్వహిస్తుంది. స్వీకరించిన దరఖాస్తులను వెంటనే కంప్యూటరైజ్ చేస్తాం. ఈ నెలాఖరుకల్లా ఆ 4 మండలాల్లోని అన్ని గ్రామాల్లో సదస్సులు పూర్తవుతాయి. ఆ 4 మండలాలతోపాటు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు రైతులతో సదస్సులు నిర్వహిస్తారు. అక్కడ కూడా దరఖాస్తులు తీసుకుంటాం. మే మొదటివారంలో 28 జిల్లాల్లో ఒక్కో మండలాన్ని మోడల్‌గా తీసుకుని, ఆయా మండలాల్లోని అన్ని గ్రామాల్లో సదస్సులు నిర్వహించి, రైతుల సమస్యలను పరిష్కరిస్తాం. జూన్ 2వ తేదీకల్లా అన్ని జిల్లాల్లో వీలైనన్ని ఎక్కువ సమస్యల పరిష్కారమే మా లక్ష్యం. ఈ సదస్సుల ద్వారా పెండింగ్‌లో ఉన్న 9.6 లక్షల సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం కూడా జరుగుతుంది. ప్రభుత్వ భూములను ఆక్రమించిన పేదలను గుర్తించి వారికి పట్టాలిస్తాం. జూన్ 2న సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఈ పట్టాల పంపిణీ జరుగుతుంది. జూన్ 2 తర్వాత రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది’ అని మంత్రి పొంగులేటి వెల్లడించారు.జీపీఓలు వచ్చాకే సర్వేమ్యాప్లురాష్ట్రంలో గ్రామ పాలనాధికారులను నియమించిన తర్వాతే సర్వే మ్యాప్‌లను అమల్లోకి తెస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ‘రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆ భూమి హద్దులతో కూడిన సర్వేమ్యాప్ కూడా అందించాలన్న నిబంధనను ఇప్పటికిప్పుడు అమల్లోకి తెచ్చే ఉద్దేశం లేదు. రాష్ట్రంలోని 10,956 రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలనాధికారులు (జీపీఓ) వస్తారు. 6 వేల మంది లైసెన్సుడ్ సర్వేయర్లు కూడా వస్తారు. ఆ తర్వాత సర్వే మ్యాప్ నిబంధన ప్రారంభమవుతుంది. ఈలోపు రైతులు ఎవరైనా స్వచ్ఛందంగా కోరుకుంటే వారి పాస్‌పుస్తకంలో సర్వే మ్యాప్ ముద్రిస్తాం. కర్ణాటకలో 9 ఏళ్లుగా ఈ సర్వే మ్యాప్ నిబంధన అమలవుతోంది. ఇప్పటివరకు 75 శాతం భూములకు మ్యాప్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణలో అంతకంటే తక్కువ సమయంలో ఎక్కువ భూములకు సర్వే మ్యాప్‌లు వస్తాయి. జీపీఓల నియామకం విషయంలో ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు. ఏం చేసినా ప్రజల సౌలభ్యం కోసమే. వ్యవస్థ కోసం అందరూ సహకరించాలి. పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలు గూగుల్ ఫామ్ ద్వారా ఆప్షన్లు ఇచ్చే గడువును పొడిగిస్తున్నాం’ అని ప్రకటించారు.కొత్త పోర్టల్ తెస్తాంఇప్పుడు తెచ్చిన భూభారతి పోర్టల్ తాత్కాలికమేనని మంత్రి పొంగులేటి తెలిపారు. ‘భూ సమస్యల శాశ్వత పరిష్కారం ఈ పోర్టల్‌తో కాదు. అందుకే శాశ్వత పోర్టల్‌ను తీసుకురాబోతున్నాం. మరో వందేళ్ల పాటు భూభారతి పోర్టల్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. త్వరలోనే టెండర్లు పిలుస్తాం. కొత్త పోర్టల్ తయారీకి 7–9 నెలలు పడుతుంది. ఈ ఏడాది చివరికి లేదంటే వచ్చే ఏడాది ప్రారంభం నాటికి పోర్టల్ అందుబాటులోకి వస్తుంది’ అని తెలిపారు. Thu, Apr 17 2025 12:40 AM

సాక్షి, హైదరాబాద్: వచ్చే 2029 శాసనసభ ఎన్నికలకు భూభారతి చట్టం, పోర్టల్‌ను రెఫరెండంగా స్వీకరిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పునరుద్ఘాటించారు. భూములున్న ప్రతి ఒక్కరికి భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యంగా ‘భూ భారతి’చట్టాన్ని, పోర్టల్‌ను తెస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం భూభారతి చట్టాన్ని, పోర్టల్‌ను ప్రారంభిస్తారని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సోమవారం నుంచే భూభారతి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇకపై ధరణి పోర్టల్ ఉండదని తెలిపారు. భూ భారతి అమలులోకి వచ్చిన తర్వాత ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమా లపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పారు. పోర్టల్ ప్రారంభం కాగానే ప్రజలంతా ఒకేసారి దానిని సందర్శించవద్దని, అలా చేస్తే పోర్టల్ ఆగిపోయే ప్రమాదం ఉందని మంత్రి చెప్పారు. కొంతమంది ఉద్దేశ పూర్వకంగా పోర్టల్‌ను నిలుపుదల చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తొలుత 3 మండలాల్లో భూభారతిభూభారతి చట్టాన్ని, పోర్టల్‌ను తొలుత మూడు జిల్లాల్లోని మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతు న్నట్లు పొంగులేటి తెలిపారు. ధరణిలో తలెత్తిన సమస్యలు భూభారతిలో రాకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అచ్చుతప్పులు, భూ విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు, తండ్రి పేరు మార్పు, భూ లావా దేవీల్లో అవకతవకలను సరిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ మూడు మండలాల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్రమంతా ఈ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. ధరణిని తెచ్చిన సమయంలో దాదాపు 4 నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని తెలిపారు. పార్ట్ బీలోని భూముల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ధరణిలో 33 మాడ్యూల్స్ ఉండగా, భూభారతిలో 6 మాత్రమే ఉంటాయని వెల్లడించారు. భూభారతి అమలు కోసం ఎంపికచేసిన గ్రామాల్లో అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. భూభారతిలో ఎమ్మార్వో స్థాయి నుంచి సీసీఎల్ఏ వరకు ఐదు స్థాయిల్లో భూ సమస్యల పరిష్కారానికి వీలుగా అధికారాల వికేంద్రీకరణ చేసినట్లు వివరించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మే మొదటివారంలో గ్రామ పాలనాధికారులువచ్చేనెల మొదటివారంలో గ్రామాల్లో రెవెన్యూ పాలనా యంత్రాంగాన్ని పునరుద్ధరిస్తామని పొంగులేటి తెలిపారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వేయి మంది లైసెన్సుడ్ సర్వేయర్లను నియమిస్తామని మంత్రి ప్రకటించారు. Mon, Apr 14 2025 12:46 AM
మహబూబాబాద్: ఇంటి అవసరాల కోసం అప్పు ఇప్పించా డు. ఇది ఆసరా చేసుకుని అప్పు తీసుకున్న వ్యక్తి భార్యను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం తెలిసిన భర్త పరువు పోయిందని భావించి భార్యను నిలదీశాడు. దీంతో తాము కలిసి ఉండాని నిర్ణయించుకుని లొంగదీసుకున్న వ్యక్తిని పథకం ప్రకారం భార్యాభర్తలు హత్యచేశారు. నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో ఈ నెల 12వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం నర్సంపేటలోని దుగ్గొండి సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ సాయిరమణ.. ఎస్సై గోవర్ధన్‌తో కలిసి హత్య వివరా లు వెల్లడించారు. ఐదేళ్ల క్రితం మూడుచెక్కలపల్లి గ్రామానికి చెందిన బానోత్ జంపయ్య 23 గుంటల వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. ఇంటి ని ర్మాణ పనులు చేపట్టారు. ఈక్రమంలో బానోత్ కొమ్మాలు(40) మధ్యవర్తిగా ఉండి రెండుసార్లు రూ.1.50 లక్షలు జంపయ్యకు అప్పుగా ఇప్పించా డు. ఇది ఆసరా చేసుకుని జంపయ్య భార్య విజ యను కొమ్మాలు శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జంపయ్య పెద్ద మనుషులను ఆశ్రయించగా కొమ్మాలుకు రూ.70 వేలు జరి మానా విధించారు. ఈ క్రమంలో కొమ్మాలు వ్యవహరశైలితో తన పరువు పోయిందని భావించిన జంపయ్య.. కొమ్మాలును చంపాలని అనుకున్నాడు. కాగా, జంపయ్య తన భర్య విజయతో గొడవపడ్డాడు. కొమ్మాలును అయినా, నిన్ను అయినా చంపుతానని చెప్పాడు. దీంతో భయపడిన విజయ మనం కలిసే ఉందామని భర్తకు తెలిపింది. అనంతరం కొమ్మాలును హత్య చేయాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కొమ్మాలు ఫోన్ చేసిన ప్రతీసారి అతడితో మాట్లాడడానికి వెళ్లమని జంపయ్య తన భార్య విజయకు చెప్పాడు. దీంతో విజయ పూర్తిగా కొమ్మాలును నమ్మించింది. ఈ క్రమలో పథకం ప్రకారం ఈ నెల 12న విజయ.. కొమ్మాలుకు ఫోన్ చేసి మాట్లాడాలి మొక్కజొన్న చేనువద్దకు రావాలని కోరింది. అనంతరం దంపతులు పథకం ప్రకారం కత్తులు తీసుకుని మొక్కజొన్న చేనులోకి వెళ్లారు. జంపయ్య ఎవరికీ కనిపించకుండా మొక్కజొన్న చేనులో కొంతదూరంగా ఉన్నాడు. ఈ విషయం గమనించకుండా కొమ్మాలు మొక్కజొన్న చేనువద్దకు చేరుకున్నాడు. ఇదే అదునుగా భావించి జంపయ్య వెనుకవైపు నుంచి కొ మ్మాలును కత్తితో పలుమార్లు పొడిచాడు. అనంతరం దంపతులిద్దరు పరారయ్యారు. ఈ క్రమంలో రుద్రగూడెంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కాగా, హత్య కేసు ఛేదనలో ప్రతిభకనబర్చిన ఎస్సై గోవర్ధన్, సిబ్బందిని సీఐ అభినందించారు. Fri, Apr 18 2025 10:20 AM

హైదరాబాద్: వ్యాపారాన్ని పెంచుకునేందుకు కస్టమర్లకు యువతులను ఎరవేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ పబ్‌పై చైతన్యపురి పోలీసులు దాడి చేశారు. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.కొత్తపేట కిలా మైసమ్మ దేవాలయ సమీపంలోని వైల్డ్ హార్ట్ పబ్‌లో యువతులతో అసభ్య నృత్యాలు చేయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సోమవారం రాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా డీజే సౌండ్‌లో యువతులతో అర్దనగ్న నృత్యాలు చేయిస్తుండటమేగాక, నిబంధనలకు విరుద్ధంగా అధిక సమయం పబ్ తెరిచి ఉంచుతున్నట్లు గుర్తించారు. 16 మంది యువతులను డీజే ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంటరి యువకులే టార్గెట్.. పబ్‌కు వెళ్లాంటే కస్టమర్ల నుంచి ఎంట్రీ ఫీజు వసూలు చేస్తారు. జంటలుగా వచ్చిన వారిని కాకుండా మద్యం సేవించేందుకు ఒంటరిగా వచి్చన యువకుల వద్దకు యువతులు వచ్చి వారికి కంపెనీ ఇస్తారు. అసభ్యంగా డాన్సులు చేస్తూ తాము సేవించే మద్యం, ఆహారం కూడా సదరు యువకుల బిల్‌లోనే వేస్తారు. వ్యాపారం పెంచుకునేందుకు మోసపూరితంగా పబ్ నిర్వాహకులే యువతులకు ఫ్రీ పాస్ ఇచ్చి లోపలికి పంపిస్తారు. తద్వారా బిల్లు ఎక్కువ అయ్యేలా చేసి వ్యాపారాన్ని పెంచుకుంటారు. ఇందుకు గాను ముంబై నుంచే కాక నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి యవతులను పబ్ నిర్వాహకలు ఎంగేజ్ చేసుకుంటున్నట్లు తెలిపారు. బ్యూటీషియన్స్, జూనియర్ ఆర్టిస్టులను ఎంచుకుని ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. పట్టుపడిన యువతులను వనస్థలిపురం, సికింద్రాబాద్, ఉప్పల్ తదితర ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించామన్నారు. 16 మంది యువతులతో పాటు డీజే ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, పబ్ యజమాని రాము, మేనేజర్ సంతోష్ పరారీలో ఉన్నట్లు ఆయన వివరించారు. Wed, Apr 16 2025 9:08 AM

హాలియా: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం అకాల వర్షానికి తడిసిపోవడాన్ని గమనించిన స్పెషల్ పోలీస్ బృందం వాటిపై పట్టాలు కప్పి పంటను కాపాడింది. హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అలీనగర్ వద్ద జరిగిన ఈ సంఘటన వివరాలివి. అలీనగర్ ప్రాంతంలో జాతీయ రహదారి ఫ్లై ఓవర్‌పై కొందరు రైతులు ధాన్యం ఆరబోశారు. మంగళవారం సాయంత్రం గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో నల్లగొండ స్పెషల్ పోలీసులు నిడమనూరు మండలం బొక్కముంతలపాడు వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా.. తడుస్తున్న ధాన్యాన్ని చూసి చలించారు. తమ వాహనాన్ని ఆపి ధాన్యం తడవకుండా పట్టాలు కప్పి పంటను కాపాడారు. పంటను కాపాడిన స్పెషల్ పోలీసులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. Wed, Apr 16 2025 1:21 AM
హైదరాబాద్,సాక్షి : తెలంగాణ హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరిగింది. విచారణలో భాగంగా తనకు ముందుస్తు బెయిల్ ఇవ్వాలని మాజీ పోలీస్ ఆఫీసర్ ప్రభాకర్‌రావు కోరారు.ముందస్తు బెయిల్ ఇస్తే వారంలోపు విచారణకొస్తామని చెప్పారు. ప్రభాకర్ రావు తరుఫున ఆయన లాయర్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. అయితే, ప్రభాకర్‌రావు పాస్‌పోర్ట్ రద్దైతే ఇండియాకు ఎలా తిరిగొస్తారని ప్రభుత్వ లాయర్ సిథార్థ లూథ్రా ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలు విన్నకోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఈనెల 25కు వాయిదా వేసింది Tue, Apr 15 2025 8:46 PM
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జమీలాపేట్ నుంచి ఎకో థెర్మ్ ఫినోలిక్ ఫోం ప్యాడ్లు ఇస్రోకు ఎగుమతి అయ్యాయి. జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం సమయంలో క్రయోజెనిక్ సిస్టమ్స్‌లో ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు ఈ ప్యాడ్లు వాడుతున్నారు. ఇస్రో ఈనెలలో ప్రయోగించే జీఎస్ఎల్వీ రాకెట్లో అమర్చే అగ్ని నిరోధక పదార్థం దేశంలో ఇక్కడే తయారవుతుంది. ఈ ఫోం ప్యాడ్లు బీబీనగర్ మండలం జమీలాపేట్‌లో వీఎన్డీ సెల్‌ప్లాస్ట్ అనే కంపెనీ తయారు చేసి ఎగుమతి చేస్తోంది. సంస్థ తయారు చేసిన 365 ఫోం ప్యాడ్లను.. త్రివేండ్రంలోని విక్రమ్‌సారాభాయి స్పేస్ సెంటర్‌కు సంస్థ యాజమాన్యం ఎగుమతి చేసింది. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్లో వీటిని పరిశీలించి నెల్లూరులో ఇస్రో సెంటర్‌కు అందజేస్తారు. ఉష్ణాన్ని నియంత్రించే ఫోం ప్యాడ్స్ ఫినోలిక్ ఫోం ప్యాడ్లు జీఎస్ఎల్వీ రాకెట్‌ను భూమి నుంచి నింగిలోకి ప్రయోగించే సమయంలో వాడతారు. ఉష్ణోగ్రత మారితే సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ఈ ఫినోలిక్ ఫోం ప్యాడ్లు లేకుండా.. జీఎస్ఎల్వీ రాకెట్‌ను ప్రయోగించలేరు. రాకెట్లో వేడిని నియంత్రించడానికి థీమ్ ప్యాడ్స్ అమరుస్తారు. బయటినుంచి వచ్చే వేడిని లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. లోపలినుంచి బయటికి వెళ్లి చల్లదనాన్ని అడ్డుకుంటుంది. ఉష్ణోగ్రతలు మారకుండా ఫోం ప్యాడ్లు అడ్డుకుంటాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు సరఫరా.. దేశంలో ప్రస్తుతం ఫినోలిక్ మిశ్రమాలను ఒక్క బీబీనగర్‌లోనే తయారు చేస్తున్నారు. మైనింగ్, రక్షణ సంçస్థలకు సరఫరా చేస్తున్నారు. ఇస్రోతో పాటు రైల్వేలు, డీఆర్డీవో, డీఆర్ఎల్, ఎయిర్‌ఫోర్స్, ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు వీటిని సరఫరా చేస్తున్నారు. ఎద్దుమైలారం సాయుధ ట్యాంకులలో ఆయిల్ ఉష్ణోగ్రత సమతుల్యత కోసం ఇన్సులేషన్‌కు ఫినోలిక్ ఫోం ప్యాడ్లను వినియోగిస్తున్నారు. ఇస్రో నుంచి ఆర్డర్‌తో.. ఇస్రో నుంచి ఆర్డర్‌తో మాకు ఎంతో మేలు చేకూరుతుంది. జీఎస్ఎల్వీ రాకెట్‌కు తొలిసారిగా సరఫరా చేస్తున్నాం. పది సంవత్సరాలుగా పలు ప్రాజెక్టులకు సరఫరా చేస్తున్నాం. 2003లో ఎన్.సుఖజీవన్రెడ్డితో కలిసి కంపెనీని ప్రారంభించాం. మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా మా కంపెనీ ఉత్పత్తులపై సెర్చింగ్ పెరిగింది. థర్మల్ ఇన్సులిన్‌కు సంబంధించిన పదా«ర్థాలను తయారు చేస్తున్నాం. ఇస్రో డైరెక్టర్ ఉన్నికృష్ణన్ అయ్యర్ మా ఉత్పత్తుల రవాణాను వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.20 లక్షల విలువైన మెటీరియల్ పంపించాం. ఒక జీఎస్ఎల్వీ రాకెట్‌కు 365 ఫినోలిక్ ఫోం ప్యాడ్స్ వాడతారు. ఇప్పటికే ఒక రాకెట్‌కు సరిపడా ఫోమ్స్ పంపించాం. – డి.చంద్రశేఖర్‌రెడ్డి, డైరెక్టర్, వీఎన్డీ సెల్‌ప్లాస్ట్ సంస్థ Mon, Apr 14 2025 1:51 AM

గచ్చిబౌలి: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో చేసిన రీట్వీట్‌కు సమాధానం ఇవ్వాలని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీచేశారు. కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25లో టీజీఐఐసీ చేపట్టిన చదును పనులపై అనేక మంది సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు ప్రచారం చేశారని ఇప్పటికే పలువురిపై గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో వరుసగా ఉన్న జేసీబీల ఎదురుగా నిలబడి ఉన్న జింకలు, నెమళ్లు ఉన్న ఫొటోను ఆమె రీట్వీట్ చేశారు. మార్చి 31న చేసిన ఈ రీట్వీట్‌పై స్మితా సబర్వాల్‌కు ఏప్రిల్ 12న గచ్చిబౌలి పోలీసులు బీఎన్ఎస్ఎస్ 179 సెక్షన్ కింద నోటీసులు జారీచేశారు. నోటీసుకు సమాధానం ఇవ్వాలని మాత్రమే నోటీసులిచ్చామని పోలీసులు తెలిపారు. Thu, Apr 17 2025 12:44 AM

కారేపల్లి/ గార్ల: అతిచిన్న వయసులోనే వ్యవసాయ పరిశోధనలో అద్భుత ప్రతిభ కనబరిచి, అకాల మరణం చెందిన తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్త అశ్వినికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్ఐ) కొత్తగా ఆవిష్కరించిన ‘పూస శనగ–4037’అనే వంగడానికి ‘అశ్విని’పేరు పెట్టింది. ఈ నెల 14న ఢిల్లీలో ఐఏఆర్ఐ ఈ కొత్త రకాన్ని విడుదల చేసింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సరిహద్దు గ్రామమైన గంగారం తండాకు చెందిన నూనావత్ అశ్విని, హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో పీజీ, పీహెచ్డీ పూర్తిచేసి గోల్డ్ మెడల్స్ సాధించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు. గతేడాది సెప్టెంబర్ 1వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లో ఓ సెమినార్లో పాల్గొనేందుకు తండ్రి మోతీలాల్‌తో కలిసి స్వగ్రామం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ సమీపంలో ఆకేరు వాగు వరద ప్రవాహంలో వారు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో మోతీలాల్తోపాటు అశ్విని కూడా దుర్మరణం చెందారు. ఆ సెమినార్‌లోనే అశ్విని అవార్డు అందుకోవాల్సి ఉంది. అవార్డు అందుకోకుండానే అకాల మరణం చెందిన ఆమెకు గుర్తింపుగా కొత్త శనగ వంగడానికి అశ్విని పేరు పెట్టారు. అశ్వినికి గొప్ప గౌరవం లభించటంపై ఆమె కుటుంబ సభ్యులు, తండావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అశ్విని తల్లి నేజా ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కొత్త వంగడానికి తన బిడ్డ పేరు పెట్టడంతో ఆమె పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పింది.‘తక్కువ పెట్టుబడితో అత్యధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలను కనుక్కుంటానమ్మా.. నా ఉద్యోగం అదే.. నన్ను వ్యవసాయ శాస్త్రవేత్త అంటారమ్మా అని నా బిడ్డ చెప్పింది’ అని నేజా భావోద్వేగానికి గురైంది. చదువుల తల్లిఅశ్విని చిన్నప్పటి నుంచే చదువులో చురుగ్గా ఉండేది. ఆమె 10వ తరగతి వరకు కారేపల్లిలో, ఇంటర్ విజయవాడలో పూర్తిచేసింది. అగ్రికల్చర్ బీఎస్సీ అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో చదివి బంగారు పతకం సాధించింది. ఆ తర్వాత ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్డీ పూర్తిచేసింది. రాయ్‌పూర్‌లో శాస్త్రవేత్తగా పనిచేసిన ఆమె.. గత ఏడాది సోదరుడి వివాహ నిశ్చితార్థం ఉండడంతో స్వగ్రామానికి వచ్చింది. అనంతరం తిరుగు ప్రయాణంలో ఆకేరు ప్రవాహంలో చిక్కుకుని తండ్రీకుమార్తె మృతి చెందారు. Thu, Apr 17 2025 1:04 AM

సాక్షి, హైదరాబాద్: నైనీ బొగ్గు బ్లాక్‌ను 2016 మేలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణికి కేటాయించింది. అన్ని రకాల అనుమతులు సాధించి, గనిలో తవ్వకం ప్రారంభించడానికి తొమ్మిదేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క అప్పటి కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ప్రస్తుత బొగ్గు శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తులు చేశారు. ఒడిశా సీఎంతో సంప్రదింపులు జరిపి గని ప్రారంభానికి భట్టి మార్గం సుగమం చేశారు. దీంతో చివరికి సింగరేణీయుల చిరకాల స్వప్నం సాకారమైంది నైనీ బొగ్గు బ్లాక్ విశేషాలు» ఈ గనిలో 340.78 మిలియన్ టన్ను ల బొగ్గు నిల్వలు తవ్వితీయటానికి అవకాశం ఉంది. ఈ గనిలో ఉత్పత్తి పూర్తి స్థాయికి చేరుకుంటే ఏడాదికి 10 మిలియన్ టన్నులు.. అనగా కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. » సింగరేణిలో ప్రస్తుతం ఉన్న 17 ఓపెన్ కాస్ట్ గనులకన్నా ఇదే అతి పెద్ద గని కానుంది. » ఏడాదికి కోటి టన్నుల చొప్పున 38 సంవత్సరాల పాటు ఈ గని నుంచి బొగ్గు తవ్వి తీయనున్నారు. » తెలంగాణలో ప్రస్తుతం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో ఒక టన్ను బొగ్గు తవ్వి తీయడానికి సగటున 12 టన్నుల ఓవర్ బర్డెన్ (పై మన్ను) తొలగిస్తుండగా ఈ గనిలో మాత్రం ఒక టన్ను బొగ్గుకు కేవలం రెండున్నర క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తీస్తే సరిపోతుంది. దీంతో లాభదాయకం కానుంది. » ఈ గనిలో మేలైన జీ–10 రకం నాణ్యమైన బొగ్గు లభిస్తోంది. » ఓవర్ బర్డెన్ తొలగించడానికి, బొగ్గు తవ్వకానికి, బొగ్గు రవాణాకు సంబంధించి ఇప్పటికే కాంట్రాక్ట్‌లను అప్పగించారు.» ఇక్కడ ఉత్పత్తి చేసే బొగ్గును ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా సమీపంలోని జరపడ రైల్వేసైడింగ్కు రవాణా చేసి, అక్కడి నుంచి వినియోగదారులకు సరఫరా చేయనున్నారు. » అయితే ఈ ప్రాంతంలోగల ఇతర బొగ్గు కంపెనీలతో కలిసి ఒక ప్రత్యేక 60 కిలోమీటర్ల రైలు మార్గాన్ని నిర్మించడం కోసం కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. మరో మూడేళ్లలో ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. » నైనీ బొగ్గు బ్లాకు కోసం మొత్తం 2,255 ఎకరాల భూమి సేకరించారు. దీనిలో 1,935 ఎకరాల అటవీ భూమి, 320 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూమి ఉంది. Wed, Apr 16 2025 1:07 AM

పొగ తాగడం కేవలం ఆరోగ్యానికే కాదు.. ఆస్తికీ హానికరమన్న విషయాన్ని రాష్ట్ర అగ్నిమాపక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏటా రాష్ట్రంలో జరుగుతున్న అగ్నిప్రమాదాల్లో అత్యధికం కేర్లెస్ స్మోకింగ్గా పిలిచే ఆర్పకుండా కాల్చి పారేసిన చుట్ట, బీడీ, సిగరెట్ల వల్లే జరిగాయి. 2023 జనవరి నుంచి ఈ ఏడాది జనవరి 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,404 అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వీటిలో అత్యధికంగా 6,653 (43.19 శాతం) దుర్ఘటనలు ఈ కేర్లెస్ స్మోకింగ్‌తో జరిగాయి. వేసవి కాలంతోపాటు ఎండలూ జోరందుకోవడంతో తమ విభాగాన్ని అగ్నిమాపకశాఖ డీజీ వై.నాగిరెడ్డి అప్రమత్తం చేశారు. జూన్ మొదటివారం వరకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఆయన సిద్ధం చేశారు. - సాక్షి, హైదరాబాద్అర్బన్ ఏరియాల్లో విద్యుత్ వల్లే...కేర్లెస్ స్మోకింగ్ వల్ల ఎక్కువగా అగ్ని ప్రమాదాలు రూరల్, సెమీ అర్బన్ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. పట్టణాలు, నగరాల్లో జరిగే ఫైర్ యాక్సిడెంట్స్కు విద్యుత్ సంబంధిత అంశాలే కారణమవుతున్నాయి. » ఇళ్లలో జరిగే అగ్ని ప్రమాదాలకు విద్యుత్ సంబంధిత అంశాలతోపాటు చిన్నపాటి నిర్లక్ష్యాలు కారణమవుతున్నాయి. అత్యధిక ఉదంతాల్లో వంటగది, అందులో ఉండే గ్యాస్ అగ్ని ప్రమాదాలకు కారణం కాగా.. చాలా తక్కువ సందర్భాల్లో పూజ గది సైతం అగ్నికి ఆజ్యం పోస్తోందని అధికారులు తమ అధ్యయనంలో గుర్తించారు. » వాటర్ హీటర్లు, గీజర్లు వంటి ఉపకరణాల నిర్వహణలో ఉన్న నిర్లక్ష్యంతో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. » రాష్ట్రంలో జరుగుతున్న అగ్నిప్రమాదాల్లో ఎక్కువ బహిరంగ ప్రదేశాల్లో నిల్వ చేసిన వస్తువులు, చెత్త వల్లే చోటు చేసుకుంటున్నాయని అగ్నిమాపక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వేసవి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం అగ్నిప్రమాదాలు చోటు చేసుకోకుండా అవగాహన కల్పించడానికి పెద్దపీట వేస్తూనే..ఏదైనా ఉదంతం జరిగినప్పుడు వీలైనంత త్వరగా ఘటనాస్థలికి చేరుకొని, ఆస్తి నష్టాన్ని తగ్గించడం, ప్రాణనష్టం లేకుండా చేయడం లక్ష్యంగా అధికారులు నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా జూన్ మొదటి వారం వరకు అత్యవసరమైతే తప్ప అధికారులు, సిబ్బందికి సెలవులు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అగ్నిమాపక శకటాలతోపాటు ఉపకరణాలు, యంత్రాలకు మరమ్మతులు లేకుండా చూస్తున్నారు. ప్రైవేట్ కార్యక్రమాల కోసం ఫైర్ వాహనాల తరలింపును నియంత్రిస్తున్నారు. మార్గదర్శకాలకు అనుగుణంగా ఆస్పత్రులు, హైరైజ్ బిల్డింగ్స్ తదితరాల్లో ఫైర్ ఆడిట్ నిర్వహిస్తున్నారు. అగ్నిమాపక శకటాలకు జీపీఎస్ ఏర్పాటు ఇప్పటికే అగ్నిమాపక శకటాలకు జీపీఎస్ పరిజ్ఞానం ఏర్పాటు చేశారు. దీనివల్ల అవి ఏ ప్రాంతంలో ఉన్నాయో ఎప్పటికప్పుడు ఫైర్ కంట్రోల్ రూమ్‌లోని సిబ్బందికి తెలుస్తుంది. ఓ చోట అగ్నిప్రమాదం జరిగినట్టు సమాచారం అందిన వెంటనే.. అది ఏ ఫైర్‌స్టేషన్ పరిధిలో ఉందో అక్కడి ఫైరింజన్లను తొలుత అప్రమత్తం చేస్తున్నారు. దీంతోపాటు జీపీఎస్ పరిజ్ఞానం ఆధారంగా ప్రమాదం జరిగిన చోటుకు సమీపంలో ఉన్న ఫైరిజన్లను అక్కడకు మళ్లించనున్నారు. మరోపక్క ఫైరింజన్ల రాకపోకల్లో గ్రీన్‌చానల్ ఇచ్చేలా ట్రాఫిక్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు.రాష్ట్రంలో అత్యధిక అగ్నిప్రమాదాలకు కారణం ఇవే2023–2025 జనవరి 11 మధ్య 15,404 ఉదంతాలువీటిలో కేర్లెస్ స్మోకింగ్ కారణంగా జరిగినవి 6,653 ఘటనలుఈ విషయం స్పష్టం చేస్తున్న అగ్నిమాపకశాఖ గణాంకాలువేసవి నేపథ్యంలో ప్రత్యేకచర్యలు తీసుకుంటున్న అధికారులుఈ అంశాలను గమనించుకోండి వేసవి నేపథ్యంలో అగ్నిప్రమాదాల బారినపడకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ కొన్ని అంశాలను గమనించాలి. గ్యాస్, విద్యుత్ ఉపకరణాలతోపాటు విద్యుత్ సరఫరా వ్యవస్థను పరిశీలించాలి. తమ వద్ద ఉన్న ఫైర్ సేఫ్టీ పరికరాలు పనిచేస్తున్నాయా? లేదా? చూడాలి. ఫైర్ ఎస్టింగ్విషర్లో ఉండే ఉపకరణాలను సరిచూసుకోవాలి. అవసరమైన వాటికి మరమ్మతులు చేయించాలి. ఇవేవీ లేని ప్రాంతాల్లో కనీసం నీళ్ల డ్రమ్ములైనా అందుబాటులో ఉంచుకోవాలి. పిల్లలు అగ్నికారకమైన వాటిలో ఆడుకోకుండా చూసుకోవాలి. – వై.నాగిరెడ్డి, డైరెక్టర్ జనరల్, అగ్నిమాపక శాఖ Mon, Apr 14 2025 12:39 AM
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ అమలు చరిత్రాత్మకమైనదని చెప్పుకొచ్చారు. ఈరోజు నుంచే ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు అమలవుతాయని స్పష్టం చేశారు. త్వరలోనే అన్ని నోటిఫికేషన్లు ఎస్సీ రిజర్వేషన్ల అమలుతో విడుదల అవుతాయని తెలిపారు. ఇదే సమయంలో గత ఏడాది ఫస్ట్ ఆగస్టు కు ముందు ఇచ్చిన నోటిఫికేషన్లకు ఈ రిజర్వేషన్లు వర్తించవు అని కార్లిటీ ఇచ్చారు.రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ (SC classification) అమలు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవో తొలి కాపీనీ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) సచివాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో మంత్రులతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ఎస్సీ రిజర్వేషన్లపై ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అమలు అవుతాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు లోబడి ఎస్సీ రిజర్వేషన్లు అమలు అవుతాయి. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల పై అందరికీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాం.ఎస్సీ వర్గీకరణ పూర్తి అయ్యే వరకు నోటిఫికేషన్ ఇవ్వవద్దు అని అనాడు చెప్పాము. రేపు సబ్ కమిటీ ఉన్నతాధికారులతో నోటిఫికేషన్ ప్రక్రియపై భేటీ అవుతాయి. త్వరలోనే అన్ని నోటిఫికేషన్లు ఎస్సీ రిజర్వేషన్ల అమలుతో విడుదల అవుతాయి. 59 ఉప కులాలకు ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయడానికి వన్ మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ పని చేసింది. 50వేల వినతులను అక్తర్ కమిషన్ పరిశీలన చేసి ఎస్సీ రిజర్వేషన్లు మూడు కేటగిరీలుగా విభజన చేశారు.గ్రూప్ఏ-1, గ్రూప్బీ-9, గ్రూప్‌సీ-5 శాతంతో అసెంబ్లీలో చట్టం చేశాం. గవర్నర్ ఆమోదం తెలిపారు. మొత్తం ఇండియాలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ రిజర్వేషన్లను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ. ఇందుకు సంబంధించి జీవీ-33 విడుదల చేశాము. యాక్ట్ 15తో మూడు భాషల్లో విడుదల చేశాం. జీవీ-9ను విడుదల చేశాం. రాబోయే రోజుల్లో ఎస్సీ రిజర్వేషన్లు ఎంత పెరిగితే ఆ స్థాయిలో రిజర్వేషన్లు అమలు చేస్తామని వ్యాఖ్యలు చేశారు. Mon, Apr 14 2025 1:30 PM
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫలక్నామా రౌడీ షీటర్ మాస్ యుద్దీన్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు.. అతడిపై దాడి చేసి హత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. ఫలక్నామా రౌడీషీటర్ మాస్ యుద్ధీన్ ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. రెయిన్‌బజార్‌లో కొందరు వ్యక్తులు మాస్‌యుద్దీన్‌పై కత్తితో దాడి చేసి అతడిని హతమార్చారు. అయితే, అతడి ప్రత్యర్థులే యుద్ధీన్ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇదిలా ఉండగా.. మాస్ యుద్దీన్‌కు మూడు రోజుల క్రితమే వివాహం జరిగినట్టు తెలుస్తోంది. Mon, Apr 14 2025 7:29 AM
కరీంనగర్: అదనపు కట్నం వేధింపులు ఓ వివాహితను బలి తీసుకున్నాయి. పెళ్లయి ఎనిమిదేళ్లయినా అత్తింటివారి వేధింపులు ఆగలేదు. నాలుగేళ్లపాటు భర్త, అత్తామామ, బావ, మరిది వేధింపులు తట్టుకుంది. ఆర్నెళ్ల క్రితం ఆడపిల్ల పుట్టడంతో మరింత ఎక్కువయ్యాయి. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ అయినా తీరు మారలేదు. చివరకు ఆ వివాహిత చావే శరణ్యనుకుంది. ఉరేసుకుని తనువు చాలించింది. ఫలితంగా ఆమె కుమారుడు (6), కూతురు (ఆర్నెళ్లు) తల్లిలేనివారయ్యారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై తహాసీనొదీ్దన్ కథనం ప్రకారం.. దండేపల్లికి చెందిన గంగధరి మల్లేశ్‌కు, బుగ్గారం మండలం యశ్వంత్‌రావుపేటకు చెందిన వరలక్ష్మి అలియాస్ మేఘనతో 2017లో వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.4 లక్షల కట్నం, 4 తులాల బంగారం, ఇతర సామగ్రి ఇచ్చారు. నాలుగేళ్లపాటు వీరి కాపురం బాగానే సాగింది. కూలీ పనులకు వెళ్లే మల్లేశ్‌కు అదనపు కట్నంపై ఆశపుట్టింది. అప్పటి నుంచి భార్యను వేధిస్తున్నాడు. దీనికి మల్లేశ్ తల్లిదండ్రులు లక్ష్మి, నర్సయ్య, సోదరులు తోడయ్యారు. కుటుంబమంతా వేధించడంతో మేఘన భరించలేకపోయింది. విషయాన్ని పుట్టింటివారికి చెప్పడంతో ఏడాది క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. నచ్చజెప్పి మళ్లీ కాపురానికి పంపించారు.ఆరు నెలల క్రితం పాప జననం..ఆర్నెళ్ల క్రితం మేఘన పాపకు జన్మనిచ్చింది. అప్పటినుంచి కట్నం వేధింపులు మొదలయ్యాయి. భీవండిలో ఉండే తన తండ్రి రాజమల్లుకు 10 రోజుల క్రితం ఫోన్ చేసి చెప్పింది. త్వరలోనే యశ్వంత్‌రావ్‌పేటకు వస్తానని, వచ్చాక పుట్టింటికి తీసుకొస్తానని నచ్చజెప్పాడు. శనివారం స్వగ్రామానికి వచ్చిన రాజమల్లు ఆదివారం భార్య అమ్మాయితో కలిసి దండేపల్లిలోని కూతురు ఇంటికి వెళ్లాడు. అక్కడ కూతురు కనిపించకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా చీరతో ఉరేసుకుని కనిపించింది. కన్నబిడ్డను విగతజీవిగా చూసిన తల్లిదండ్రులో బోరున విలపించారు. పుట్టింటికి తీసుకుపోతానంటిని కదా బిడ్డా.. అంతలోనే ఇలా అయ్యిందా అంటూ తండ్రి విలపించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన కూతురు మృతికి అల్లుడు, అతని తల్లిదండ్రులు, అన్న, తమ్ముడే కారణమని రాజమల్లు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.తల్లి ప్రేమకు దూరమైన చిన్నారులు..వరలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుమారుడు శ్రీనాథ్, కూతురు శరణ్య తల్లిప్రేమకు దూరమయ్యారు. తల్లి ఏమైందో కూడా ఆ చిన్నారులకు తెలియడం లేదు. కనీసం ఆ తల్లికి ఆత్మహత్య చేసుకునే ముందు తన పిల్లలైన గుర్తుకు రాలేదా అని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. Mon, Apr 14 2025 10:54 AM

శంషాబాద్: బైక్‌పై వెళ్తున్న దంపతులకు రహదారి పక్కనే ఉన్న ఓ తోటలో కనిపించిన మామిడి కాయలు ఆకర్షించాయి. వాటిని తెంపి తీసుకొస్తున్న క్రమంలో భర్త విద్యుదాఘాతంతో అక్కడికక్కడే అసువులు బాసిన విషాదకర ఘటన శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలో నివాసముంటున్న తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలానికి చెందిన కె.చేతన్‌రెడ్డి (26) నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. ఆయన భార్య బిందు. మొయినాబాద్‌లోని భాస్కర లా కళాశాలలో గురువారం ఆమెతో పరీక్షలు రాయించి తిరిగి ఇబ్రహీంపటా్ననికి బైక్‌పై బయలుదేరారు. పెద్దషాపూర్ రైల్వేట్రాక్‌కు సమీపంలో రహదారి పక్కనే ఉన్న ఓ తోటలో విరగగాసిన మామిడి కాయలను చూసిన చేతన్‌రెడ్డి వాహనాన్ని నిలిపివేశాడు. తోటలోని మామిడికాయలు కోసుకు వస్తుండగా.. చెట్టు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్ఫార్మర్ తీగలు తగలడంతో చేతన్‌రెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. భర్త అచేతనగా పడి ఉండటాన్ని చూసిన బిందు అరవడంతో స్థానికులు వచ్చి అతడిని పక్కకు జరిపారు. సీపీఆర్ చేసినా ఫలితం లేకుండాపోయింది. అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. అక్కడికి వచి్చన శంషాబాద్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. Fri, Apr 18 2025 7:58 AM

సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థ.. ఇకపై ఇతర రాష్ట్రాలు, దేశాల్లో విస్తరిస్తుందని, త్వరలో గ్లోబల్ కంపెనీగా రూపుదిద్దుకోనుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్ నుంచి బుధవారం ఆయన ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌లో ఉత్పత్తిని వర్చువల్‌గా ప్రారంభించి మాట్లాడారు. ఈ గని ప్రారంభంతో సింగరేణి సంస్థ తన విశ్వవ్యాప్త విస్తరణకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో సంస్థ తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గని ప్రారంభించుకోవడం ఒక సువర్ణ అధ్యాయమన్నారు. ఇది యావత్తు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆనందకరమని తెలిపారు. సమస్యలతో తొమ్మిదేళ్లుగా నైనీ గని ప్రారంభానికి నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి, తాను.. కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని పలుమార్లు కలిసి పూర్తి అనుమతులు సాధించామన్నారు. ప్రభుత్వం చూపిన ప్రత్యేక చొరవ వల్లే ఏడాదిలోనే దీనిని ప్రారంభించుకోవడం ప్రజా ప్రభుత్వానికి సింగరేణి అభివృద్ధిపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని చెప్పారు. దీనికి సహకరించిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, ధర్మేంద్ర ప్రదాన్, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీకి, అక్కడి స్థానిక ఎమ్మెల్యే అగస్థీ బెహరాకి ధన్యవాదాలు తెలిపారు.నైనీ వద్ద 1,600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఒడిశాలోని అంగూల్ ప్రాంత అభివృద్ధికి ఇచ్చిన హామీని త్వ రలోనే సింగరేణి అమలు చేస్తుందని భట్టి విక్రమార్క అన్నా రు. సింగరేణి ప్రభుత్వ సంస్థ అని, కేవలం వాణిజ్యం కోసం పనిచేసే కంపెనీ కాదని, సామాజిక స్పృహతో అక్కడ కార్య క్రమాలు చేపడతామని భరోసా ఇచ్చారు. అంగూల్ ప్రాంత ప్రజల ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపరచడానికి 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కూడా నైనీకి సమీపంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, భూ కేటా యింపుల విషయంలో ఒడిశా ప్రభుత్వం సహకరించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఇంధనశాఖ ముఖ్య కార్య దర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు. Thu, Apr 17 2025 12:21 AM

సంగారెడ్డి జిల్లా: సమృద్ధి జీవన్ సంస్థలో ఏజెంట్‌గా చేసి, డిపాజిట్లు చేసిన వారికి తిరిగి చెల్లించేందుకు అప్పులు చేసి, వాటిని తీర్చలేక ఓ ఎల్ఐసీ ఏజెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్.ఐ కాశీనాథ్, మృతుడి భార్య తుల్జమ్మ వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని అల్గోల్ గ్రామానికి చెందిన వెంకన్న (48) గురువారం సాయంత్రం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకన్న గతంలో సమృద్ధి యోజన సంస్థలో ఏజెంట్‌గా చేశాడు. ఈ క్రమంలో ప్రజల నుంచి పెద్దమొత్తంలో బాండ్లు (డిపాజిట్లు) కట్టించాడు. సంస్థను అర్ధాంతరంగా ఎత్తివేయడంతో ప్రజల వద్ద నుంచి సేకరించిన డిపాజిట్ డబ్బులు చెల్లించేందుకు బయట అప్పులు చేశాడు. ఇందుకోసం భూమిని సైతం తాకట్టు పెట్టాడు. చేసిన అప్పుల బాధలు పెరిగిపోవడం, రుణంతీర్చే దారిలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకన్న రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, వెంకన్న పెద్ద కుమార్తె పరమేశ్వరికి వివాహం కాగా, రెండో కుమార్తె ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కుమారుడు ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. రూ.100 బాండ్ పేపర్‌పై సూసైడ్ నోట్ఆత్మహత్యకు పాల్పడే ముందు వెంకన్న బాండ్ పేపర్‌పై సూసైడ్ నోట్ రాశాడు. ‘టి.వెంకన్న తండ్రి అంజన్న గ్రా: అల్గోల్ అను నేను. అప్పుల బాధ భరించలేకపోతున్నాను. సమృద్ధి జీవన్ ఫౌండేషన్‌లో ఏజెంట్‌గా చేశాను. కస్టమర్లకు మొత్తం డబ్బు నేనే చెల్లించాను. దానివల్ల అప్పులు ఎక్కువై.. ఇప్పుడు ఇతరులకు అప్పుకట్టలేక పోతున్నాను. అప్పుల బాధ భరించలేక నేను సూసైడ్ చేసుకుంటున్నాను. నన్ను క్షమించండి. అప్పు ఇచ్చినవారిని క్షమాపణలు కోరకుంటున్నాను. శివుని దయతో మీకందరికి లాభం జరుగుతుంది. ఓం నమఃశివాయ’ అని రాసిపెట్టిన సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. Fri, Apr 18 2025 8:28 AM
సాక్షి, వరంగల్: కోతుల సైర్వ విహారంతో విసుగు వేసారిన ఆసుపత్రి నిర్వాహకులకు ఓ చక్కటి ఐడియా వచ్చింది. తక్షణమే కోతుల బెడద నుంచి ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు రక్షణ కల్పించేందుకు కొండముచ్చును కొని తెచ్చారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ఆసుపత్రికి కొండముచ్చు పహారా కాస్తోంది.ఆసుపత్రికి వచ్చే వారిపై పలుమార్లు దాడులకు దిగి రోగులకు తెచ్చే తినుబండారాలను ఎత్తుకెళ్లిపోవడం గమనించిన ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ రాజనరేందర్ రెడ్డి.. రూ.30 వేలు వెచ్చించి ఏపీ నుంచి ఓ కొండముచ్చును ఆసుపత్రి కాపలా కోసం తెచ్చారు. దీంతో ఆసుపత్రి చుట్టుపక్కల కోతుల సంచారం లేకుండా పోయింది. కొండముచ్చు రాకతో ఆ ప్రాంతం కోతుల బెడద నుంచి ఉపశమనం పొందింది. ఆసుపత్రి నిర్వాహకులు చేసిన వినూత్న ఆలోచన పట్ల రోగులు వారి బంధువులు ప్రశంసలు కురిపిస్తున్నారు. Thu, Apr 17 2025 3:16 PM

సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము పడగొట్టడం ఎందుకు.. ఐదేళ్ల తర్వాత ప్రజలే తన్ని తరిమేస్తారు. మా పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. ఈ ప్రభుత్వ పనితీరు బాగా లేదంటూ ప్రజలు ఆక్రోశిస్తున్నారు. ఈ సర్కారును ఎత్తి పడేయమని మమ్మల్ని అడుగుతున్నారు. కొందరు చందాలు వేసుకొనిసర్కారును కూలగొట్టమని అడుగుతున్నారని మాత్రమే మా ఎమ్మెల్యే చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే డేంజర్ అనే విషయం ప్రజలకు తెలియాలి. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగాలి. అలా అయితేనే మరో 20 ఏళ్ల వరకు ఎవరూ కాంగ్రెస్‌కు ఓటు వేయరు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.తెలంగాణభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘రేవంత్‌రెడ్డి చేస్తున్న లుచ్చా పనులకు ప్రజలే బుద్ధి చెబుతారు. అవసరమైతే ప్రజలే రోడ్డు మీదకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారు. మా పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పదిమంది ఎమ్మెల్యేలు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. వాళ్ల బతుకు అధ్వానంగా ఉంది’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆత్మాభిమానం ఉంటే రాజీనామా చేయాలి‘కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఆత్మాభిమానం లేని సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని విమర్శలు వచ్చినా రాజీనామా చేయకుండా దులుపుకొని బతుకుతున్నాడు. ఏడాది క్రితం రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించిన ప్రధాని మోదీ ఇప్పుడు మేల్కొని హెచ్‌సీయూ భూముల్లో కాంగ్రెస్ పర్యావరణ విధ్వంసం చేసిందని ఆరోపించారు.సెంట్రల్ ఎంపవర్ కమిటీ (సీఈసీ) నివేదిక ఇచ్చినా మోదీ ప్రభుత్వం స్పందించి ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు. బీజేపీకి తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో పర్యావరణ విధ్వంసంపై విచారణకు ఆదేశించాలి. లేదా ఆర్బీఐ, సీవీసీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలకు అయినా దర్యాప్తు బాధ్యతలు ఇవ్వాలి’అని కేటీఆర్ మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం అరాచకం‘సీబీఐని గతంలో కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తే.. ప్రస్తుతం బీజేపీ ఈడీని విచ్చలవిడిగా వాడుతోంది. కంచ గచ్చిబౌలి భూములపై రాష్ట్ర ప్రభుత్వం, టీజీఐఐసీ ఉద్దేశాల మీద తమకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయని సెంట్రల్ ఎంపవర్ కమిటీ నివేదిక స్పష్టం చేసింది. చెరువులను కూడా తాకట్టుపెట్టిన వైనం బయట పెట్టింది. అయినా రేవంత్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు మోదీ ఆరాటపడుతున్నాడు.కేంద్రం స్పందించకుంటే ఈ నెల 27 తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలను కలిసి ఆధారాలు అందజేయడంతోపాటు బీజేపీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ఆర్థిక దోపిడీ, పర్యావరణ విధ్వంసంపై మోదీ స్పందించకుంటే ఆయనకు వాటా ఉందని అనుకోవాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో కంటే క్షేత్ర స్థాయిలోనే రేవంత్ ప్రభుత్వంపై ఎక్కువ వ్యతిరేకత ఉంది’అని కేటీఆర్ చెప్పారు. Fri, Apr 18 2025 4:15 AM
ఢిల్లీ, సాక్షి: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వితండవాదాన్ని మానుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూములపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ తరుణంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం 100 ఎకరాల్లో చెట్లను పునరుద్ధరించాలి. చీఫ్ సెక్రటరీకి తెలియకుండా సీఎం రేవంత్ రెడ్డి చెట్ల నరికివేతకు ఆదేశాలు ఇచ్చారు. కొంపలు మునిగిపోతున్నట్లుగా ఫ్లడ్‌లైట్లు పెట్టి మరి చెట్లు నరికారు. పర్యావరణ విషయంలో నాపై పోలీసులు కేసులు పెడతానంటే..రెడీ. హైదరాబాదులో ఒక్క చెట్టు కొట్టాలన్న వాల్టా చట్టం కింద అనుమతి తప్పనిసరి. ప్రభుత్వాలు నడిపేందుకు భూములు అమ్మితే భవిష్యత్తు తరాలు క్షమించవు’ అని వ్యాఖ్యానించారు. Wed, Apr 16 2025 7:49 PM

నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలోని నాగనూలు కస్తూర్బా గాంధీ పాఠశాలలో మంగళవారం విద్యార్ధులు దాదాపు నాలుగు గంటల పాటు ధర్నా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. వారం రోజుల క్రితం నాగనూలు కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఓ విద్యార్థి స్టడీ అవర్స్‌కు ఆలస్యంగా వచ్చిందని ఇంగ్లిష్ టీచర్ మూడు గంటల పాటు నిలబెట్టిన విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించి విచారణ చేపట్టి టీచర్‌పై చర్యలు తీసుకుంటామని డీఈఓ రమేష్‌కుమార్ విద్యార్థులకు హామీ ఇచ్చారు. అయి తే వారం రోజులు గడుస్తున్నా ఆ ఉపాధ్యాయురాలిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంగళవారం విద్యార్థులు పాఠశాల ప్రధాన గేటు వద్ద ఎండలో దాదాపు నాలుగు గంటల పాటు భోజనం చేయకుండా ధర్నా చేశారు. సంబంధిత టీచర్‌ను సస్పెండ్ చేసే వరకు మేము భోజనం చేయమని నినదించారు. ఆమె మళ్లీ పాఠశాలకు వస్తే ఎవ్వరం పాఠశాలలో ఉండమని విద్యార్థినులు బీష్మించారు. తను విద్యార్థినులను అసభ్య పదజాలంతో దూషించి, మానసికంగా వేధిస్తోందని, వాష్‌రూంకు వెళితే ఆ ఫొటోలు, వీడియోలు తీసి వాటిని బయట లీక్ చేస్తా నని భయపెడుతుందని విద్యార్థులు వాపోయారు. ఉన్నతాధికారులు తమకు న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి కదిలేదిలేదని కూర్చున్నారు. సమాచారం తెలుసుకున్న డీఈఓ రమేష్‌కుమార్ పాఠశా లకు చేరుకొని విద్యార్థులకు నచ్చచెప్పి ఆ టీచర్‌ను ఎట్టి పరిస్థితులలో ఇక్కడ ఉంచబోమని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు.బిడ్డల్లాగా చూసుకుంటారనుకుంటే... పాఠశాలలో చదువు చెప్పే ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత బిడ్డల్లాగా చూసుకుంటారని అనుకుంటే.. వీళ్లే ఈ విధంగా ప్రవర్తించడం బాగా లేదు సార్. మా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ టీచర్‌ను సస్పెండ్ చేయాలి. తమ పిల్లలకు మంచి చదువు చెప్పించండి సార్. – సత్యనారాయణ, విద్యార్థిని తండ్రి, మొలచింతపల్లి Wed, Apr 16 2025 1:59 PM
హైదరాబాద్, సాక్షి: ప్రధాని నరేంద్రమోదీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కీలక విజ్ఞప్తి చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానిగా పర్యావరణంపై చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయమిదన్నారు. ‘‘కంచ గచ్చిబౌలి భూముల(Kancha Gachibowli Land Issue) ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టాలి. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలి. దీనిపై ప్రధాని వ్యాఖ్యలకే పరిమితం కాకుండా చర్యలు తీసుకోవాలి. కంచ గచ్చిబౌలి అంశం వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రూ.10వేల కోట్ల ఆర్థిక మోసం.దీనిపై ఇప్పటికే దర్యాప్తు సంస్థలకు ఆధారాలతో సహా తెలిపాం. ఆర్థిక అవకతవకల అంశాన్ని కేంద్ర సాధికార కమిటీ నిర్ధరించింది. స్వతంత్ర విచారణ చేయాలని సూచించింది. దీనిపై వెంటనే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి’’ అని కేటీఆర్(KTR) కోరారు.ఇటీవల హర్యానాలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మాట్లాడుతూ.. కంచ గచ్చిబౌలి భూములపై కీలక వ్యాఖ్యలు చేశారు. అడవులపై బుల్డోజర్లు పంపడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బిజీగా ఉందని విమర్శించారు. ప్రకృతి నాశనం, వన్యప్రాణులకు హాని.. ఇదే కాంగ్రెస్ పాలనని వ్యాఖ్యానించారు. అటవీ సంపదను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను సైతం కాంగ్రెస్ మర్చిపోయిందని మోదీ ఎద్దేవా చేశారు. Fri, Apr 18 2025 10:03 AM

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని పుప్పాలగూడలో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. మొదటి దశ కింద 450 ఎకరాల్లో ఏర్పాటుకు వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గతంలో ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్, రెవెన్యూ అధికారులకు, స్పెషల్ పోలీసు మ్యూచువల్ కో ఆపరేటివ్ సొసైటీకి కేటాయించిన 200 ఎకరాలతో పాటు, పారిశ్రామికాభివృద్ధి సంస్థకు చెందిన మరో 250 ఎకరాల స్థలంలో ఐటీ నాలెడ్జ్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.గురువారం సాయంత్రం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమలు, రెవెన్యూ శాఖల కీలక అధికారులతో మంత్రులు సమావేశమయ్యారు. పుప్పాలగూడలో భూముల లభ్యతపై అధికారులు వివరించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులకు కేటాయించిన భూములను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సొసైటీలకు కేటాయించిన భూముల పక్కనే ఇండ్రస్టియల్ కార్పొరేషన్‌కు సంబంధించిన సుమారు 250 ఎకరాల భూమి ఉందని తెలిపారు. మొత్తంగా 450 ఎకరాలు అందుబాటులో ఉందని వివరించారు. చెప్పారు. మొదటి దశలో ఏర్పాటు చేయబోతున్న ఐటీ హబ్ ద్వారా 5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. ప్రత్యామ్నాయంగానేనా..? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ)ను అనుకుని ఉన్న 400 ఎకరాల భూమిని అభివృద్ధి చేసి 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించగా, దానిపై వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. కంచ గచ్చిబౌలి భూముల్లో 100 ఎకరాల్లో తొలగించిన చెట్ల స్థానంలో మళ్లీ వృక్షాల పెంపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో దీనికి ప్రత్యామ్నాయంగా అత్యవసరంగా ప్రభుత్వం పుప్పాలగూడలో నాలెడ్జ్ హబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. Fri, Apr 18 2025 3:42 AM

సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత నీటి సంవత్సరం (2024–25)లో ఏపీ, తెలంగాణ మొత్తం 990.38 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకోగా, అందులో ఏకంగా 72.2 శాతం (715.03 టీఎంసీలు) ఏపీ వాడుకుంది. తెలంగాణ 275.35 టీఎంసీల (27.8 శాతం)ను మాత్రమే వినియోగించుకోగలిగింది. రెండు రాష్ట్రాల వాడకంపోగా, ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో కనీస నిల్వ మట్టానికి(ఎండీడీఎల్) ఎగువన 9.17 టీఎంసీలతోపాటు ఇతర జలాశయాల్లో మరో 43.94 టీఎంసీలు కలిపి మొత్తం 53.12 టీఎంసీలే మిగిలి ఉన్నాయి. ఈ లెక్కన ప్రస్తుత నీటి సంవత్సరంలో మొత్తం 1043.5 టీఎంసీల జలాల లభ్యత ఉందని కృష్ణా బోర్డు తేల్చింది. గత సోమవారం నాటికి రెండు రాష్ట్రాలు వాడిన కృష్ణా జలాలకు సంబంధించి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) రూపొందించిన గణాంకాలతో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈమేరకు ఓ నివేదిక తయారుచేసింది. 50:50 నిష్పత్తిలో అయితే.. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశం కృష్ణా ట్రిబ్యునల్–2లో పెండింగ్‌లో ఉంది. ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు తాత్కాలిక సర్దుబాటు ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో నీటి పంపకాలు జరుగుతుండగా, 50:50 నిష్పత్తిలో పంపకాలు జరపాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. అలా అయితే, 1043.5 టీఎంసీల్లో ఏపీ, తెలంగాణకు చెరో 521.75 టీఎంసీల హక్కులుంటాయి. దీంతో కృష్ణా జలాల్లో తెలంగాణకు ఇంకా 246.4 టీఎంసీల వాటా మిగిలి ఉంటుంది. ఏపీ వాటికి మించి 235.01 టీఎంసీలను వాడుకోవడంతో ఆ మేరకు నీటి వాటాను తెలంగాణ నష్టపోయింది. 66:34 నిష్పత్తిలో తెలంగాణకి 68 టీఎంసీల నష్టంతాత్కాలిక సర్దుబాటు ప్రకారం 66:34 నిష్పత్తిలో పంపకాలు జరిపినా 1043.5 టీఎంసీల్లో ఏపీకి 688.714 టీఎంసీలు, తెలంగాణకి 354.79 టీఎంసీల వాటా లభించాలి. ఈ లెక్కన తెలంగాణ ఈ ఏడాది వాడుకున్న జలాలు పోగా ఇంకా 77.22 టీఎంసీలను వాడుకోవడానికి హక్కు కలిగి ఉండనుంది. ఏపీ వాటాకి మించి 68.05 టీఎంసీలను వాడుకోవడంతో తెలంగాణ ఆ మేరకు నీటి వాటాను కోల్పోయింది. ఉమ్మడి జలాశయాల్లో మిగిలి ఉన్న మొత్తం 9.17 టీఎంసీలను తెలంగాణకే కేటాయించినా హక్కుగా లభించాల్సిన వాటాల్లో మరో 68.05 టీఎంసీల లోటును రాష్ట్రం ఎదుర్కోనుంది. పోతిరెడ్డిపాడు నుంచి 208 టీఎంసీల మళ్లింపుశ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 208.64 టీఎంసీలు, మల్యాల లిఫ్టు ద్వారా 28.36 టీఎంసీలు, మల్యాల నుంచి కేసీ కాల్వకి 1.19 టీఎంసీలు, ముచ్చుమర్రి లిఫ్టు ద్వారా 3.49 టీఎంసీలు, చెన్నైకి నీటి సరఫరాకి 1.88 టీఎంసీలు కలిపి ఏపీ మొత్తం 243.58 టీఎంసీలను వాడుకుంది. ఇక నాగార్జునసాగర్ నుంచి ఎడమ కాల్వ ద్వారా 29.45 టీఎంసీలు, కుడి కాల్వ ద్వారా 188.16 టీఎంసీలు కలిపి మరో 217.62 టీఎంసీలను ఏపీ వాడుకుంది. ఇలా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఏపీ మొత్తం 715.03 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకున్నట్టు బోర్డు లెక్క గట్టింది.అరకొరగానే తెలంగాణ వాడకంశ్రీశైలం నుంచి కల్వకుర్తి లిఫ్టు ద్వారా 46.75 టీఎంసీలు, చెన్నైకి నీటి సరఫరాకి 0.94 టీఎంసీలు కలిపి మొత్తం 47.69 టీఎంసీలను మాత్రమే తెలంగాణ వాడుకుంది. సాగర్ నుంచి ఏఎమ్మార్పీ ప్రాజెక్టు అవసరాలకు 41.42 టీఎంసీలు, ఎడమ కాల్వ ద్వారా 115.48 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 14.37 టీఎంసీలు కలిపి మొత్తం 171.28 టీఎంసీలను రాష్ట్రం వాడుకుంది. జూరాల ప్రాజెక్టు నుంచి మరో 42.25 టీఎంసీలు, ఇతర ప్రాజెక్టుల నుంచి మరో 8.42 టీఎంసీలు కలిపి ఈ ఏడాది తెలంగాణ మొత్తం 275.35 టీఎంసీలను మాత్రమే వాడుకోగలిగింది. Wed, Apr 16 2025 12:37 AM

హైదరాబాద్: వైద్యులు నిర్లక్ష్యం కారణంగా ఇంజక్షన్ వికటింక్షో వ్యక్తి మృతి చెందిన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి కార్వాన్ బాంజవాడికి చెందిన ఐలయ్య(53) మంగళవారం మధ్యాహ్నం ఆయాసంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు అతడిని రింగ్ రోడ్డు సమీపంలోని హై కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అతడిని పరీక్షించిన వైద్యులు ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడి ఆరోగ్యం క్షీణించిందని తమ ఆస్పత్రిలో గుండె సంబంధిత వైద్యులు లేరని, వెంటనే మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే ఐలయ్య మృతి చెంది ఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడికి ఇచ్చింది ఇంజక్షన్లను పరిశీలించగా అవి మార్చి నెలలోనే ఎక్పైరీ అయినట్లుగా గుర్తించారు. గడువు ముగిని ఇంజక్షన్ ఇచి్చనందునే అతను మృతి చెందాడని ఆరోపిస్తూ మృత దేహంతో ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Wed, Apr 16 2025 8:12 AM

సాక్షి, హైదరాబాద్: దేశంలో మెరుగైన వైద్య సేవల కోసం ఉద్దేశించిన నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కింద రాష్ట్రానికి వచ్చే కేంద్ర నిధులు ఈసారి గణనీయంగా పెరిగాయి. జనాభాకు అనుగుణంగా రాష్ట్రానికి రావలసిన వాటా విషయంలో పదేళ్లుగా సవతి తల్లి ప్రేమ చూపిన కేంద్రం 2024–25 కింద ఇవ్వాల్సిన దానికన్నా అదనంగా రూ. 176 కోట్లు విడుదల చేయడం విశేషం. ఎన్హెచ్ఎం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 వాటాతో నిధులను వెచి్చంచాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆసుపత్రుల నిర్మాణం, ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేయడం, మాతా శిశు ఆరోగ్య సేవలు, వ్యాధి నియంత్రణ కార్యక్రమాలు, ఇమ్యునైజేషన్ డ్రైవ్‌ల కోసం ఈ నిధులు వినియోగిస్తారు. రాష్ట్రం ఇవ్వాల్సింది ఇంకా రూ.56.35 కోట్లు ఎన్హెచ్ఎం కింద కేంద్ర నిధుల పంపిణీ రాష్ట్రాల జనాభా, ఆరోగ్య సూచికలు, పనితీరు ఆధారంగా ఉంటుంది. తెలంగాణ జనాభా సుమారు 3.93 కోట్లుగా అంచనా వేస్తే భారత దేశ జనాభా సుమారు 143 కోట్లు. అంటే దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.75 శాతం. 2024–25 కేంద్ర నేషనల్ హెల్త్ మిషన్ బడ్జెట్ రూ. 36,000 కోట్లు. ఇందులో 2024–25లో కేంద్రం నుంచి రూ. 938.42 కోట్లు రావలసి ఉండగా, రూ.176.49 అదనంగా కలిపి రూ.1,114.91 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు రూ. 743.27 కోట్లు జమచేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 682.92 కోట్లు విడుదల చేసింది. మరో రూ.56.35 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కేంద్రం అదనంగా నిధులు ఇవ్వడంతో రాష్ట్రంలో మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందించే అవకాశం ఉంది. 2014–15 నుంచి కోతలే.. రాష్ట్రానికి ఎన్హెచ్ఎం కింద కేంద్రం ఇచ్చే వాటాలో 2014–15 నుంచి 2023–24 వరకు కోతలే ఉన్నాయి. ఏటా 10 నుంచి 40 శాతం వరకు బకాయిపెట్టింది. పదేళ్లలో రూ.7012.35 కోట్లు రావాల్సి ఉండగా, రూ.5,961.81 కోట్లు వచ్చాయి. రూ.1,050.54 కోట్లకు కేంద్రం కోతలు పెట్టింది. గత 11 ఏళ్లలో 2024–25 సంవత్సరంలోనే వాటా కంటే అదనంగా రూ.176.49 కోట్లు కేటాయించడం విశేషం. Mon, Apr 14 2025 1:53 AM

సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్రాల పరిధిలోనిదేనని స్పష్టం చేస్తూ... ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1న తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు వచ్చిన వెంటనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ వర్గీకరణను మొదటగా తెలంగాణలోనే అమలు చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఉపసంఘం సంబంధిత అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి న్యాయపరమైన చిక్కులు లేకుండా వర్గీకరణ చేపట్టాలంటే ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. గతేడాది నవంబర్ 11న బాధ్యతలు స్వీకరించిన కమిషన్ ప్రత్యేకంగా అన్ని వర్గాల నుంచి వినతులు స్వీకరించడంతోపాటు ఉమ్మడి జిల్లా కేంద్రంగా పలు ప్రాంతాల్లో పర్యటించింది.82 రోజులపాటు అధ్యయనం చేపట్టి మంత్రివర్గ ఉపసంఘానికి ఈ ఏడాది ఫిబ్రవరి 3న నివేదిక అందించింది. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 4న అసెంబ్లీ ముందుంచింది. ఆ తర్వాత మళ్లీ కమిషన్ క్షేత్రస్థాయి నుంచి అభ్యంతరాలు, వినతులు స్వీకరించేందుకు మరికొంత సమయం ఇచ్చింది. అనంతరం తుది నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. నివేదిక, అందులోని సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును రూపొందించి మార్చి 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం ఉభయసభలు ఆమోదం తెలిపాయి. ఈ బిల్లును ఈ నెల 9న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు.నేడు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు జారీ చేయనుంది.⇒ ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఇందులో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన, పట్టించుకోని షెడ్యూల్డ్ కులాలను గ్రూప్–1 కేటగిరీలోకి చేర్చారు. వారి జనాభా ఎస్సీల్లో 3.288 శాతం ఉండటంతో ఒక శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బిల్లులో పేర్కొన్నారు. అదేవిధంగా ఎస్సీల్లో మధ్యస్తంగా లబ్ధి పొందిన షెడ్యూల్డ్ కులాలను గ్రూప్–2 కేటగిరీలో చేర్చారు. వారి జనాభా ఎస్సీల్లో 62.748 శాతం ఉండగా 9% రిజర్వేషన్లు కేటాయించారు.మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్డ్ కులాలను గ్రూప్–3లోకి చేర్చారు. ఎస్సీ జనాభాలో 33.963 శాతం ఉన్న వారికి 5 శాతం రిజర్వేషన్లు కేటాయించారు.⇒ ఉద్యోగ నియామకాల్లో క్రమపద్ధతిలో అనుసరించేందుకు గ్రూపులవారీగా రోస్టర్ పాయింట్లు నిర్దేశించారు.⇒ గ్రూప్–1లో నోటిఫై చేసిన, భర్తీ చేయని ఖాళీలను తదుపరి ప్రాధాన్యత గ్రూప్‌లో అంటే గ్రూప్–2లో భర్తీ చేస్తారు. ఇందులో భర్తీ చేయని ఖాళీలను గ్రూప్–3లో భర్తీ చేస్తారు. అన్ని గ్రూపుల్లో తగిన అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఆ పోస్టులను క్యారీఫార్వర్డ్ చేస్తారు. Mon, Apr 14 2025 1:18 AM
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో నగరంలో కొందరు పబ్ యజమానులు అసాంఘిక కార్యక్రమాలను నడుపుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని చైతన్యపురిలో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. చైతన్యపురిలోని వైల్డ్ హార్ట్ పబ్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు. సమయానికి మించి పబ్‌ను నడుపుతున్నట్టు పోలీసుల దృష్టికి సమాచారం అందడంతో సోమవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేయినట్టు పోలీసులు గుర్తించారు. పబ్‌కు వచ్చే కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో డ్యాన్స్ చేయిస్తున్నారు. ముంబై నుంచి యువతులను ఇక్కడికి తీసుకువచ్చి.. కస్టమర్లకు ఎర వేస్తున్నారు పబ్ యాజమాన్యం. ఈ క్రమంలో సోదాల్లో భాగంగా 17 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్ నిర్వాహకుడు, కస్టమర్స్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. Tue, Apr 15 2025 7:31 AM

సాక్షి,హైదరాబాద్: త్వరలో జరగనున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా చర్చలు జరుగుతున్నాయి. అందుకు కారణం గెలిచేందుకు అవసరమైన ఓటర్ల సంఖ్యాబలం లేకపోయినప్పటికీ బీజేపీ బరిలో దిగడమే. ఎమ్మెల్సీని ఎన్నుకునేందుకు హైదరాబాద్ ‘స్థానిక’ కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఓటర్లుగా ఉన్నారు. ఆ లెక్కన మొత్తం ఓటర్లలో అత్యధికంగా 49 ఓట్లు ఎంఐఎంకు ఉన్నాయి. దాంతోపాటు కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధంతో ఆ పార్టీకి, దానికి మిత్రపక్షంగా ఉన్న టీజేఎస్‌కు చెందిన 14 ఓట్లు ఎంఐఎంకు లభించే అవకాశాలున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకొని పోటీ లేకుండా ఎన్నిక ఏకగ్రీవంగా జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు భావించినప్పటికీ, కమలం పార్టీ తమ అభ్యర్థిని బరిలో దింపింది. దీంతో బీజేపీ ఏ ధీమాతో, ఏ నమ్మకంతో పోటీలో నిలిచిందనేది ఇప్పుడు అందరి మదిలో ప్రశ్న తలెత్తుతోంది.ఎవరికి ఎవరో.. మరో వైపు కాంగ్రెస్.. బీఆర్ఎస్.. బీజేపీ ఈ మూడూ దేనికవిగా మిగతా రెండూ కలిసి పని చేస్తున్నాయని ఎంతో కాలంగా ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నాయి. మిగతా రెండూ ఒకటేనని, తమ పార్టీ మాత్రమే వాటికి వ్యతిరేకంగా ప్రజల కోసం పని చేస్తోందని మూడు పారీ్టల నేతలూ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలో ఎవరికి ఎవరు మద్దతుగా నిలుస్తారో, ఎవరిని వ్యతిరేకిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. అంత నమ్మకం లేనిదే బీజేపీ ఎందుకు పోటీలో ఉంటుందని, మిగతా పార్టీల నుంచి తగిన హామీ లభించి ఉండవచ్చని భావిస్తున్న వారూ ఉన్నారు. ఈ ఎన్నికను సైతం ఆయా పార్టీలు, ప్రజలు పారీ్టలపరంగా చూస్తున్పటికీ, పోటీలో ఉన్న అభ్యర్థులను కానీ.. ఓటర్ల జాబితాలో కానీ వారి పేర్లు, చిరునామాలు తప్ప ఏ పారీ్టయో వెల్లడించరు. కనీసం ఏ డివిజన్ కార్పొరేటరో కూడా జాబితాలో ఉండదు. విప్ వంటివి వర్తించవు.ఆత్మ ప్రబోధానుసారంగా? ⇒ జీహెచ్ఎంసీ పాలకమండలిలో సైతం పార్టీ మారిన వారు ఒకే చోట కూర్చుంటారు తప్ప అధికారికంగా ఎలాంటి ఏర్పాట్లు చేయరు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే పారీ్టల వారీగా అభ్యర్థులను పేర్కొంటారు తప్ప.. తర్వాత పార్టీ మారినా అధికారికంగా దాన్ని ప్రకటించరు. పట్టించుకోరు. ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యరి్థకి కానీ, తమ పార్టీ అధిష్ఠానం సూచించిన వారికి కానీ కచి్చతంగా ఓటేయాల్సిన పరిస్థితి ఓటర్లకు లేదు. అందువల్లే బీజేపీ ధీమాగా ఉందని చెబుతున్నారు. ⇒ అంతేకాదు.. ఇటీవల బీజేపీకి చెందిన కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎంను ఓడించాల్సిందిగా పిలుపునిచ్చారు. దీంతో అసలీ ఎన్నికలో ఏం జరగనుందో అంతుచిక్కడం లేదని కొందరు కార్పొరేటర్లు అంటున్నారు. క్రాస్ ఓటింగ్ జరిగినా గుర్తించలేరు. పారీ్టలు సైతం ఫలానా వారికే ఓటేయాలని ఇంతవరకు చెప్పలేదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వైఖరి ఏమిటో అంతుపట్టడం లేదు. ⇒ బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదేపదే అంటున్నారు. కాంగ్రెస్ మద్దతు ఎంఐఎంకు ఉంది. జీహెచ్ంఎసీ స్టాండింగ్కమిటీ ఎన్నికలోనూ అది వెల్లడైంది. కాబట్టి కాంగ్రెస్ మద్దతిచ్చే ఎంఐఎంకు బీఆర్ఎస్ సైతం మద్దతిస్తుందా, లేక పోలింగ్‌కు దూరంగా ఉంటుందా అన్నది తెలియడానికి ఇంకా సమయం పట్టనుంది. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాల పర్వం కూడా ప్రారంభం కావచ్చని ఆశిస్తున్నవారూ ఉన్నారు. ప్రలోభాలను సైతం ఆత్మప్రబోధంగా చెబుతారని కార్పొరేటరొకరు వ్యాఖ్యానించారు. పారీ్టల పరంగా చూస్తే బీఆర్ఎస్కు 24 ఓట్లు, బీజేపీకి 25 ఓట్ల బలం ఉంది. Tue, Apr 15 2025 7:28 AM
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న నిర్వహించే ప్రపంచ వారసత్వ దినోత్సవం (International Day for Monuments and Sites) సందర్భంగా, ఈరోజు ఉదయం 7:30 గంటలకు డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలో, పురావస్తు శాఖ (ASI) – హైదరాబాద్ సర్కిల్, తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (TSTDC), JBRAC, ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్, ఇతర పౌర సంఘాల భాగస్వామ్యంతో ఘనంగా హెరిటేజ్ వాక్ నిర్వహించబడింది.Er. వేదకుమార్ మనికొండ, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ఛైర్మన్ ఈ కార్యక్రమాన్ని చార్మినార్ వద్ద ప్రారంభించి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.ప్రొఫెసర్ Ar. జి.ఎస్.వి. సూర్యనారాయణ మూర్తి(South Zone Representative, ICOMOS, India), డా. జి. జయశ్రీ, ప్రాచీన భారత చరిత్ర మరియు పురావస్తు శాఖ, ఉస్మానియా యూనివర్సిటీ, కోటయ్య వింజమూరి, డిప్యూటీ సూపరింటెండెంట్ కెమిస్ట్, ASI, డా. ఈ. సాయికృష్ణ, అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్, ASI, శ్రీమతి జె. రాజేశ్వరి (Conservationist, ASI), సాయి రామ్, సుధాకర్, కార్యనిర్వాహకులు(తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్) , ఎస్. ప్రభాకర్(DTO, పర్యాటక శాఖ), డి. శ్రీనివాస్ (హెరిటేజ్ వాక్ ఇన్చార్జ్), డి. శ్యాం సుందర్ రావు, స్థపతి, డా. ద్యావనపల్లి సత్యనారాయణ(క్యురేటర్, తెలంగాణ గిరిజన మ్యూజియం), పి. వీరమల్లు, అధ్యక్షుడు, బౌద్ధ తత్వ ఫౌండేషన్ మరియు సిటీ కాలేజ్, JBRAC, ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్, SRDP, వాసవి స్కూల్, వైష్ణవి ఆర్కిటెక్చర్ కాలేజ్ విద్యార్థులు, పౌర సంఘాల సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.Er.వేదకుమార్ మనికొండ గారు చార్మినార్ నుండి చౌమహల్లా ప్యాలెస్ వరకు ఉన్న ముఖ్యమైన వారసత్వ కట్టడాల చారిత్రక ప్రాముఖ్యతను వివరిస్తూ, వారసత్వ సంరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, అది మన సమాజపు కలసికట్టు బాధ్యతగా భావించాలని సూచించారు. హైదరాబాద్ యొక్క చారిత్రక ఘనతను ప్రజలకు తెలియపరుస్తూ, వారసత్వ పరిరక్షణ మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో ప్రజల భాగస్వామ్యం అవసరాన్ని వివరించారు.ఇంకా, తెలంగాణ వారసత్వ శాఖ మరియు డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ సంయుక్తంగా ముదుమల్ మెగలిథిక్ మెన్హిర్స్ సైట్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాథమిక జాబితాలో చేర్చించడంలో చేసిన ప్రయత్నాలను వివరించారు. త్వరలో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ సూర్యనారాయణ మూర్తి గారు మాట్లాడుతూ, ఇటువంటి వాక్‌ల ప్రాముఖ్యతను వివరించారు. చార్మినార్ యొక్క చారిత్రక, శిల్పకళా విశేషాలను విద్యార్థులకు వివరించారు.చార్మినార్ మీదుగా లాడ్ బజార్, మోతిగల్లి,మెహబూబ్ చౌక్ (ముర్గీ చౌక్), ఇక్బాల్ ఉద్ దౌలా దేవ్డీ, మక్కా మసీదు ద్వితీయ ద్వారం, జిలుఖానా,ఖుర్షీద్ జా బహదూర్ ప్యాలెస్,ఇక్బాల్ ఉద్ దౌలా ప్యాలెస్, ఖిలావత్, చౌమహల్లా ప్యాలెస్ వద్ద ఈ వాక్ ముగిసింది.ఈ వాక్ ద్వారా పాల్గొన్నవారికి హైదరాబాద్ నగరపు ప్రాచీన వైభవాన్ని ప్రత్యక్షంగా అనుభవించగలిగారు. రాజప్రాసాదాలు, శతాబ్దాల నాటి మసీదులు, స్థానిక శిల్పకళ ఆధారిత నిర్మాణాలు వారి చూపుల ముందే ఆవిష్కృతమయ్యాయి. నగరపు బహుముఖ సంస్కృతి మరియు వారసత్వంపై గర్వభావం వారిలో మళ్ళీ వెల్లివిరిసింది. Fri, Apr 18 2025 4:16 PM

సాక్షి, హైదరాబాద్: నగరంలో భారీ వర్షం కురిసింది బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, ఫిలింనగర్, గచ్చిబౌలి, అత్తాపూర్, నార్సింగి, కోకాపేట్, కోఠి, నాంపల్లి, అబిడ్స్ దిల్సుఖ్నగర్, రాజేంద్రనగర్, అంబర్పేట్, ఉప్పల్, సికింద్రాబాద్, కాచిగూడ, నారాయణగూడ, చిక్కడపల్లి, హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల్లో దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద రోడ్డుపై చెట్టు కూలిపోయింది. లంగర్‌హౌస్‌లో విద్యుత్ తీగలపై భారీ వృక్షం పడింది. నాంపల్లి రెడ్‌హిల్స్‌లోని ట్రాన్స్ఫార్మర్పై భారీ వృక్షం పడిపోయింది. కంచన్‌బాగ్ 8, బహదూర్‌పురాలో 7.8 సెం.మీ, యాకూత్పురాలో 7.6, బేగంబజార్‌లో 6.9 సెం.మీ, సంతోష్‌నగర్ 6.9, దబీర్పురాలో 6.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం ఎండలు, సాయంత్రానికి వర్షాలు.. ఈదురుగాలులు, వడగడ్ల వానలతో జనం పరేషాన్ అవుతున్నారు. ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి మరత్వాడ, అంతర్గత కర్ణాటక, రాయలసీయ, తమిళనాడు మీదుగా గల్ఫ్ మన్నార్ వరకు సముద్ర మట్టం మీదగా ద్రోణి కొనసాగుతోంది. రాష్ట్రంలో దక్షిణ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీతో వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుందని పేర్కొంది. రాష్ట్రంలో కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసి అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వచ్చే మూడు, నాలుగు రోజులు అధిక ఎండలు నమోదయ్యే అవకాశం ఉందని పలు ఉత్తర, ఈశాన్య జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. Fri, Apr 18 2025 6:09 PM
న్యూఢిల్లీ, సాక్షి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో ఇవాళ విచారణ జరగనుంది. ఈ భూముల్లో జరుగుతున్న అన్ని కార్యాకలాపాలపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్‌తో కూడిన ధర్మాసనం ఇంతకుముందు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 16లోపు(ఇవాళ) అఫిడవిట్ సమర్పించాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు ఎంపవర్డ్ కమిటీని ఆదేశించింది. ఆ ఆదేశాలకు అనుగుణంగానే.. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) సుప్రీం కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ‘‘కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కావు. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల పొదలు పెరిగాయి. అటవీ రెవెన్యూ రికార్డులలో వీటిని అడవులుగా పేర్కొనలేదు. ఆ భూములకు ఎలాంటి కంచె లేదు. కంచె ఏర్పాటు చేసేందుకు మేము ప్రయత్నం చేశాం. ఈ భూముల్లో ఎలాంటి జంతువులు లేవు. కంచె లేని కారణంగానే హెచ్‌సీయూ భూముల్లోని పక్షులు ఇక్కడికి వచ్చాయి’’ అని కౌంటర్లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు.. సుప్రీం కోర్టు ఆదేశాలనుసారం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించిన కేంద్ర సాధికార కమిటీ(సీఈసీ) నివేదికను ఇవాళ కోర్టుకు సమర్పించనుంది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై విచారణ నేపథ్యంలో రాష్ట్ర సీఎస్ శాంతికుమారి( CS Shanti Kumari), తెలంగాణ పీసీసీఎఫ్ డోబ్రియాల్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన అఫిడవిట్, సీఈసీ దాఖలుచేసిన నివేదికను పరిశీలించిన తర్వాత ధర్మాసనం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.‘‘అంత అత్యవసరంగా చెట్లను నరకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?. సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నారు?. పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇలా ఎలా చేస్తారు?. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా?. ఇది చాలా తీవ్రమైన విషయం. అవసరమైతే సీఎస్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటాం’’ అంటూ తదుపరి ఆదేశాలిచ్చేదాకా అన్ని పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఒకవేళ ఉల్లంఘనలు గనుక జరిగితే సీఎస్‌దే బాధ్యత’’గత వాదనల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అయిన జస్టిస్ గవాయ్ Wed, Apr 16 2025 10:22 AM
హనుమకొండ జిల్లా: అత్యాశ కొంపకు చేటు అన్నట్లు.. ఓ రామచిలుక జ్యోతిష్యుడు చేసిన పని అతడి ఉపాధికి ఎసరు తెచ్చింది. చినికి చినికి చిలుక పంచాయితీ పోలీసు స్టేషన్‌కు చేరింది. వారం రోజులుగా జరుగుతున్న ఈ చిలుక పంచాయితీ వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని అంబేడ్కర్ క్రాస్ సమీపంలో దాస్ అనే ఓ బైక్ మెకానిక్ దుకాణం వద్దకు వారం క్రితం రామస్వామి అనే జ్యోతిష్యుడు చిలుక జోస్యం చెబుతానని వచ్చాడు. దాస్ జోస్యం చెప్పించుకునేందుకు ఒప్పుకోవటంతో, చిలుక తీసిన బొమ్మను చూసి జ్యోతిష్యుడు రూ.1,650 ఇస్తే తాయత్తు కడతానని చెప్పాడు. అయితే పొద్దున్నే గిరాకీ కాలేదని, తర్వాత రమ్మని దాస్ చెప్పి జ్యోతిష్యుడిని పంపించేశాడు. ఆ జ్యోతి ష్యుడు ఊరంతా తిరిగి సాయంత్రానికి మళ్లీ దాస్ వద్దకు వచ్చాడు. చిలుక మళ్లీ అదే బొమ్మను తీస్తే తాయత్తు కట్టించుకుంటానని దాస్ చెప్పాడు. దీంతో ఆ జ్యోతిష్యుడు మరోసారి పంజరంలో ఉన్న చిలుకను బయటకు పిలుస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. చిలుక బయటకు వచ్చిన సమయంలో పక్కనే ఓ బైక్ టైరు పేలటంతో, ఆ శబ్ధానికి భయపడి అది తుర్రుమని ఎగిరి సెల్‌టవర్‌పై వాలింది. చిలుక పారిపోయిందని జ్యోతి ష్యుడిని దాస్ నిద్ర లేపడంతో, అతడు ఒక్కసారిగా లేచి సెల్ టవర్ వద్దకు పరుగెత్తాడు. కానీ, మూడు గంటలు వేచి చూసినా అది తిరిగి రాలేదు. జ్యోతి ష్యుడి బాధ చూడలేక దాస్ అతడిని ఓ వైన్స్ వద్దకు తీసుకెళ్లి రూ.500తో మద్యం కొనిచ్చాడు. అయితే, తన చిలుకను దాస్ మాయం చేశాడని అతడి ఇంటికి వెళ్లి జ్యోతిష్యుడు గొడవ చేశాడు. మూడు రోజుల క్రితం దాస్‌పై పరకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దాస్‌ను పిలిచి జ్యోతిష్యుడి రామచిలుక ఏమైందని ప్రశ్నించారు. దాదాపు 3 గంటల పాటు చిలుక పంచాయితీ జరిగినా, ఎటూ తెగకపో వడంతో ‘నీ చిలుక నీ దగ్గరకు రావాలని కోరుకుంటున్నాం’అని జ్యోతిష్యుడికి నచ్చజెప్పి పంపించేశారు. Fri, Apr 18 2025 8:40 AM

నల్లగొండ/జనగామ రూరల్/వేములపల్లి: రాష్ట్రంలోని పలు జిల్లాలో ఆదివారం ఈదురు గాలులు, వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. దీంతో మామిడి, వరి వంటి పంటలు దెబ్బతిన్నాయి. నల్లగొండ జిల్లాలో పిడుగుపాటుతో ఓ రైతు మరణించాడు. జనగామ, ములుగు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానతో భారీ పంట నష్టం జరిగింది. మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. జనగామ మండలంలోని పెంబర్తి, సిద్దెంకి, ఎల్లంల, గానుగుపహాడ్.. చిల్పూర్ మండలం ఫత్తేపూర్.. జఫర్‌గఢ్ మండలం ఓబులాపూర్.. పాలకుర్తి మండలం వావిలాల, నారబోయినగూడెంలో వరి పంట దెబ్బతింది. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డులోని ఐకేపీ సెంటర్లో సుమారు 20 వేల బస్తాల ధాన్యం తడిసిపోయింది. ములుగు జిల్లా ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో 150 ఎకరాల్లో వరిపంట దెబ్బతింది. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులకు వందల ఏళ్ల నాటి మామిడి వృక్షాలు నేలకూలాయి. శాలిగౌరారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో ధాన్యం కొట్టుకుపోయింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని అనంతారం, తొండ.. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి, కోడూరు తదితర గ్రామాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. జాజిరెడ్డిగూడెంలో నోముల నరేష్ ఇంట్లో చెట్టుకొమ్మ విరిగి గేదెపై పడటంతో అది మృత్యువాత పడింది. యాదాద్రి భువనగిరి జిల్లాని పలు మండలాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని సల్కునూరు గ్రామంలో గోపు సుధాకర్‌రెడ్డి (63) అనే రైతు తన పొలం వద్ద పనిచేస్తుండగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. Mon, Apr 14 2025 12:57 AM
తెలుగు రాష్ట్రాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్లు నోరెళ్ల బెడుతున్నాయి. పంటలు, తోటలు కళ్లు తేలేస్తున్నాయి. మరో మూడు నెలలు ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ చెబుతూనే ఉంది. ఈ కష్టకాలంలో అడపాదడపా పలకరించే అకాల వర్షాలు రైతులకు కొంత మేరకు ఉపశమనం కలిగిస్తున్నాయి. రెండు రోజులు గడిస్తే నీటికష్టాలు షరా మామూలే. అయితే, ఈ అకాల వర్షపు నీటిని పొలాల్లో ఎక్కడికక్కడే ఒడిసిపట్టి భూమిలోకి ఇంకింపజేసుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎండిపోయిన /ఎండిపోతున్న బోర్ల చుట్టూ ఇంకుడు గుంతలు కట్టుకుంటే ఆ బోర్లు ఎండిపోకుండా ఉంటాయి. అవి తిరిగి జలకళను సంతరించుకుంటాయి. వర్షం కురిసిన రోజే ఆ బోర్లలో అప్పటికప్పుడే నీటిలభ్యత పెరుగుతుందని సీనియర్ హైడ్రాలజిస్ట్, సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాటర్ అండ్ లైవ్లీహుడ్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్వి.రాంమోహన్అనుభవపూర్వకంగా చెబుతున్నారు. పన్నెండేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో వేలాది బోర్లను రీచార్జ్ చేసిన అనుభవంతో ఆయన ‘సాక్షి సాగుబడి’కి అనేక విషయాలు చెప్పారు. – సాక్షి, స్పెషల్ డెస్క్ఏమిటి?గ్రామీణ ప్రాంతాల్లో వేలాది వ్యవసాయబోర్లు ఎండిపోయి ఉన్నాయి. కొన్నిచోట్ల తక్కువ నీటిని పో స్తూ ఉన్నాయి. కొత్త బోర్లు తవ్వకుండా ఇప్పటికే ఉన్న ఎండిపోయిన లేదా ఎండిపోతున్న బోరుబా వుల చుట్టూ వాననీటి రీచార్జ్ కట్టడాలు నిర్మించాలి. తద్వారా చిన్న, సన్నకారు రైతులకు అందుబా టు ఖర్చుతోనే నీటి భద్రత కల్పించొచ్చు. ఎప్పుడు? బోరు లోపలికి ట్యాంకర్‌తో తెచి్చన నీటిని పోసి.. దానికి వాననీటిని ఇంకింపజేసుకునే సామర్థ్యం ఉందో లేదో టెస్ట్ చేయాలి. దీన్నే ట్యాంకర్ టెస్ట్ అంటారు. కేవలం కొన్ని వందల రూపాయల ఖర్చుతో రైతులు సొంతంగా తమ బోరుబావులను పరీక్షించుకోవచ్చు. వానాకాలం ప్రారంభం కాక ముందు ఫిబ్రవరి–మే నెలల మధ్య రోజులు ఇందుకు అనువైన కాలం. ఎక్కడ?కొన్ని పొలాల్లో ఒకటి కన్నా ఎక్కువ బోర్లు ఉండొచ్చు. అలాంటప్పుడు అన్ని బోర్లకు ‘ట్యాంకరు టెస్ట్’చేయాలి. వాటి వాస్తవిక రీచార్జ్ సామర్థ్యం ఎంత అనేది కచ్చితంగా తెలుస్తుంది. లోతు తక్కువ ఉన్న బోరుబావిని రీచార్జ్ కోసం ఎంపిక చేసుకుంటే రీచార్జ్ కట్టడం ద్వారా ఆ పక్కనున్న ఇతర బోరుబావుల్లో కూడా నీరు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు? వర్షాధార వ్యవసాయ ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయిన ప్రతిసారీ కొత్త బోర్లు వేయటం ఆర్థికంగా కష్టంతో కూడుకున్న పని. అందుకని బోరుబావులకే వాననీటిని తాపే పనిచేయడం ఉత్తమం. ఇందుకోసం బోరుబావుల చుట్టూ వాన నీటి రీచార్జ్ కట్టడాలు నిర్మించుకోవాలి. ఇవి దీర్ఘకాలం (కనీసం 8–10 ఏళ్లు) పాటు రైతులకు ప్రయోజనాలు అందించగలుగుతాయి. బోరు రీచార్జ్ సాంకేతికతను ఉపయోగించి, రెండు వానాకాలపు సీజన్లలోనే ఎండిపోయిన బోరు బావులను పునరుద్ధరించుకోవచ్చు. ఎలా? బోరు రీచార్జ్ నిర్మాణానికి స్థానికంగా దొరికే రాళ్లు, ఇసుక, సిమెంట్ వంటి సామగ్రిని వాడుకొని 7–10 రోజుల్లోనే నిర్మాణాన్ని పూర్తి చేయొచ్చు. కొత్తగా బోరుబావి తవ్వడానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే.. తక్కువ ఖర్చులోనే ఎండిన బోరుబావులను పునరుద్ధరించొచ్చు. కొత్తగా తవ్వే బోరు పడకపోతే ఆ ఖర్చు అంతా వ్యర్థమే. ఎగువన ఉండే నీటి పరీవాహక ప్రాంతాల నుంచి సంగ్రహించే వాననీటిలో గరిష్టంగా 50% నీరు రీచార్జ్ అవుతుంది (చెక్‌డ్యాం, నీటికుంటల ద్వారా 10–15% నీరు మాత్రమే భూమిలోకి ఇంకుతుంది). ఈ పద్ధతిలో వాననీటిని రీచార్జ్ చేస్తూనే ఆ బోరుబావి నుంచి నీటిని పంటలకు వాడుకునే వెసులుబాటు ఉంది. ఎవరు?బోరుబావి ద్వారా వాననీటిని నేలలోకి ఇంకించి భూగర్భ నీటిని మరింతగా రీచార్జ్ చేసే సాంకేతిక ప్రక్రియలో ఆర్వి.రాంమోహన్ది అందెవేసిన చేయి. 2012 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో నీటి కష్టాలకు పరిష్కారంగా బోరుబావుల చుట్టూ రాళ్లు రప్పలు, గులక రాళ్లు, ఇసుకతో ఇంకుడు గుంతలు నిర్మించుకోవటంలో రైతులకు, పట్టణవాసులకు చేదోడుగా ఉంటున్నారు. ఇప్పటికి వెయ్యి బోర్ల రీచార్జ్‌కు ఇంకుడుగుంతలను నిర్మించటంలో ప్రత్యక్షంగా తోడ్పాటునందించారు. మరో మూడు, నాలుగు వేల బోరు రీచార్జ్ పిట్ల నిర్మాణానికి పరోక్షంగా సాంకేతికతంగా సాయపడ్డారు. ఈ క్రమంలో రైతుల అభిప్రాయాలు, సలహాలు సూచనల మేరకు ఈ సాంకేతికతలో ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేశారు. ఈ అనుభవ జ్ఞానంతో ‘గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బోరుబావుల పునరుద్ధరణ (అక్విఫెర్ రీచార్జ్)’పేరిట శిక్షణ కరదీపికను ప్రచురించారు. Mon, Apr 14 2025 1:01 AM

సాక్షి, హైదరాబాద్: నెల జీతం నాలుగు రోజుఉపాధి హామీ సిబ్బంది,ఉద్యోగుల ఆవేదన స్పర్శ్‌లో సాఫ్ట్వేర్లు అనుసంధానం అవ్వక అందని వేతనాలు సాంకేతిక సమస్యలు అధిగమించడానికి అధికారుల తంటాలు ఆలస్యమైనా బతుకు బండి గాడితప్పే ఈ రోజుల్లో.. ప్రభుత్వ సేవలో ఉన్న 14 వేలమంది మూడు నెలలుగా వేతనాలు లేక విలవిలలాడుతున్నారు. వేతనాలకు సంబంధించిన నిధులు అందుబాటులో ఉన్నా.. సాంకేతిక సమస్య కారణంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి తలెత్తింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది, ఉద్యోగులకు గత మూడు నెలలుగా జీతాలు రావటం లేదు. వీరిలో 3,800 మంది ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగులు (టీఏలు, ఏపీవోలు, ఈసీలు, సీవోలు), 2,000 మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, 7,600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లతోపాటు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో (డీఆర్డీవోలు, అదనపు పీడీలు, ఏపీడీలు, హెడ్ ఆఫీస్‌లో పనిచేసే సీఎఫ్‌వోలు,ఇతర ఉద్యోగులు, సిబ్బంది) పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇదీ సమస్య.. వివిధ పథకాల కింద కేంద్రం ఇచ్చే నిధులను ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు కేంద్రం స్పర్శ్ అనే ఏజెన్సీని తీసుకొచి్చంది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఓ ప్రాసెసింగ్ ఏజెన్సీ. నిజానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఆన్లైన్ విధానం కోసం ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐఎఫ్ఎంఐఎస్), కేంద్ర ప్రభుత్వం వద్ద పబ్లిక్ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (పీఎఫ్ఎంఎస్) ఉంటాయి. ఉపాధి హామీకి సంబంధించి ఎన్ఐసీ సాఫ్ట్ విధానం, ఆర్బీఐకి ఈ–కుబేర్ సిస్టమ్ ఉన్నాయి. స్పర్శ్‌లో భాగంగా ఈ నాలుగు సాఫ్ట్వేర్లను అనుసంధానించాలని కేంద్రం ఆదేశించింది. ఇక్కడే సమస్య వచి్చంది. ఈ నాలుగు సాఫ్ట్వేర్ల అనుసంధానంలో సమస్యలు తలెత్తాయి. దీంతో ఉపాధి హామీ ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో పడినట్టు అధికారులు తెలిపారు. ఈ ఉద్యోగుల వేతనాల కోసం నెలకు రూ. 22 కోట్ల దాకా బడ్జెట్ అవసరం. నిధులు అందుబాటులో ఉన్నా సాంకేతిక సమస్యల వల్ల సకాలంలో జీతాలు చెల్లించలేక పోతున్నామని అధికారులు చెబుతున్నారు. సమస్యను అధిగమించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జనవరి నుంచి జీతాలు లేవు మా జిల్లాలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు జనవరి నుంచి వేతనాలు రావడం లేదు. బడ్జెట్ కేటాయింపులు లేవనే సాకుతో ప్రభుత్వం వేతనాలు పెండింగ్‌లో పెట్టింది. మూడు నెలలుగా వేతనాలు లేకపోవటంతో కుటుంబం గడవక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం తక్షణం పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి. – బాల్‌రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షుడు, జనగామ జిల్లా. పెండింగ్ వేతనాలివ్వాలి వెంటనే మూడునెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి. మా వేతనంపెంచుతామని, ఉద్యోగభద్రత కల్పిస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీని ప్రభుత్వం నెరవేర్చాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రతి గ్రామపంచాయతీలో పది మందికి తగ్గకుండా కూలీలను తీసుకురావాలంటూ రాష్ట్రస్థాయి అధికారులు టార్గెట్ పెడుతున్నారు. ఈ పని చేయకపోతే విధుల్లోంచి తొలగించాలని కలెక్టర్లకు ఆర్డర్లు వేస్తున్నారు. మాకు హక్కులు లేకుండా పోయాయి.నారాయణ గౌడ్ఫీల్డ్ అసిస్టెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి Wed, Apr 16 2025 6:15 AM

సాక్షి, హైదరాబాద్: పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలను అందించేందుకు 2018లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘తెలంగాణ డయాగ్నొస్టిక్స్’ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. రూ. కోట్లు వెచ్చించి అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా వైద్య సిబ్బంది లేకపోవడంతో చాలా కేంద్రాల్లో పరికరాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. మరికొన్ని చోట్ల వైద్య పరీక్షలకు అవసరమైన రసాయనాల కొరత కూడా నెలకొంది. దీంతో చాలా జిల్లాల్లో పేదలు అనివార్యంగా రూ. వేలు ఖర్చుపెట్టి మళ్లీ ప్రైవేటు డయాగ్నస్టిక్ కేంద్రాలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. 32 జిల్లాల్లో హబ్స్.. 1,546 చోట్ల స్పోక్స్ జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద హబ్ అండ్ స్పోక్ విధానంలో హైదరాబాద్ నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) ప్రధాన హబ్‌గా తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ఏర్పాటైంది. ఆపై రాష్ట్రవ్యాప్తంగా హబ్‌లను విస్తరించారు. ప్రస్తుతం నారాయణపేట, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో 32 బయో కెమిస్ట్రీ, మైక్రోబయోలజీ, పాథలాజీ ల్యాబ్స్‌తో కూడిన హబ్స్ ఏర్పాటయ్యాయి. ఆదిలాబాద్‌లోని ఏజెన్సీ ప్రాంతంలోనూ ప్రత్యేక హబ్‌ను ఏర్పాటు చేశారు. పీహెచ్‌సీలు, బస్తీ, పల్లె దవాఖానాలు, కమ్యూనిటీ సెంటర్లు మొదలైన 1,546 చోట్ల స్పోక్స్ (చిన్న కేంద్రాలు)ను ఏర్పాటు చేశారు. తక్షణమే వచ్చే పరీక్షల ఫలితాలను స్పోక్స్‌లలో, ఇతర వైద్య పరీక్షలను హబ్‌లలో నిర్వహిస్తున్నారు.పాథాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయోలజీ పరీక్షలకు సంబంధించి పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన యంత్ర పరికరాలు 32 హబ్‌లలో ఉన్నాయి. సాధారణ మధుమేహ వ్యాధిని నిర్ధారించే పరీక్షలు మొదలుకొని మూత్రపిండాల వ్యాధి నిర్ధారణకు క్రియాటిన్ పరీక్షల వరకు, కేన్సర్ పరీక్షకు వినియోగించే సీరం–ఎలక్ట్రోఫొరెసిస్ యంత్రాల వరకు హబ్‌లలో అందుబాటులో ఉన్నాయి. పాథాలజీ, రేడియాలజీ సేవలు, అ్రల్టాసౌండ్, టెలి ఈసీజీ, ఎక్స్‌రే, మామోగ్రామ్, 2డీ ఎకో పరీక్షలన్నీ ఈ కేంద్రాల్లో జరుగుతాయి. ఏదైనా తగ్గని జబ్బుతో రోగి బాధ పడుతుంటే ఆ జబ్బు మూలాలను కనుక్కొని, తగిన మందులు సిఫారసు చేసేందుకు వీలుగా ‘కల్చర్ అండ్ సెన్సిటివిటీ’టెస్టులు కూడా ఈ హబ్‌లలో జరిపేందుకు వీలుంది. ల్యాబ్ టెక్నీషియన్లు, మైక్రోబయోలజిస్టుల కొరతతో.. రాష్ట్రవ్యాప్తంగా 32 హబ్‌లలోని మైక్రోబయోలజీ ల్యాబ్‌లలో ‘కల్చర్ అండ్ సెన్సిటివిటీ’పరీక్షల కోసం సుమారు రూ. 50 లక్షల విలువైన వైద్య పరికరాలను తెచ్చిపెట్టారు. అందుకు సంబంధించిన వైద్య పరీక్షలను ల్యాబ్ టెక్నీషియన్లు నిర్వహిస్తే వాటిని మైక్రోబయోలజిస్టులు నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే హైదరాబాద్‌తోపాటు కొన్ని పాత జిల్లా కేంద్రాలల్లోని హబ్‌లలో తప్ప ఎక్కడా మైక్రోబయోలజిస్టులు లేక ఈ యంత్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. అలాగే కేన్సర్‌ను నిర్ధారించేందుకు రూ. 50 లక్షల చొప్పున హబ్‌లలో ఏర్పాటు చేసిన సీరం–ఎలక్రో్టఫొరెసిస్ యంత్రాలకు అవసరమైన రీఏజెంట్లు (రసాయనాలు) అందుబాటులో లేక చాలా వరకు పరికరాలు వృథాగా పడి ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు. కొన్ని టెస్టులతోనే సరి.. ప్రతి హబ్‌లో బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీకి సంబంధించి 134 రకాల వైద్య పరీక్షలు జరగాల్సి ఉండగా చాలా హబ్‌లలో 30–40 టెస్టులు మాత్రమే జరుగుతున్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ల కొరతతోపాటు రేడియాలజిస్టులు, మైక్రోబయోలజిస్టులు, ఇతర డాక్టర్లు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. హబ్‌లపై సన్నగిల్లుతున్న నమ్మకం వివిధ హబ్‌లలో తరచూ పరీక్షల ఫలితాలు ఒకరివి మరొకరికి మారిపోతుండటంతో ప్రజల్లో తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌పై విశ్వాసం సన్నగిల్లుతోంది. స్పోక్స్ (చిన్న కేంద్రాలు)లో బీపీ, షుగర్ మినహా అన్ని పరీక్షలను హబ్‌లకే పంపుతుండగా అక్కడ పరీక్షలు జరిగి ఫలితాలు వచ్చేందుకు రెండు రోజుల సమయం పడుతోంది. ఆ రిపోర్టులను తీసుకొస్తేనే పీహెచ్‌సీల్లో చూపించుకొనే పరిస్థితి ఉండటంతో గ్రామాల్లో చాలా మంది ఆర్ఎంపీల ద్వారా జిల్లా కేంద్రాల్లోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. పీహెచ్‌సీల్లో సమయానికి డాక్టర్లు ఉండకపోవడం కూడా రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించడానికి కారణమవుతోంది. కాగా, ల్యాబ్ టెక్నీషియన్ల కొరత నేపథ్యంలో తాజాగా 700 మంది ల్యాబ్ టెక్నీషియన్లను నియమించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. వివిధ జిల్లాల్లో పరిస్థితి ఇలా.. ⇒ ఖమ్మంలోని తెలంగాణ డయాగ్నొస్టిక్స్ హబ్‌లో రీ ఏజెంట్ల కొరతతో కేన్సర్‌కు సంబంధించి మూడొంతుల టెస్ట్‌లు జరగడం లేదు. ⇒ అక్కడ 134 రకాల పరీక్షలకుగాను 38 పరీక్షలే అందుబాటులో ఉన్నాయి. కొన్ని వైద్య పరికరాలు లేకపోవడమే అందుకు కారణం. ⇒జిల్లాలోని స్పోక్స్‌లలో రీ ఏజెంట్ల కొరతతో ఎక్కడా డయాగ్నస్టిక్ టెస్ట్‌లు నిర్వహించడం లేదు. శాంపిల్స్ సేకరించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని హబ్‌కు పంపుతున్నారు. ⇒ జనగామ జిల్లాలోని హబ్‌లో వైద్య పరికరాలు ఉన్నా టెక్నీషియన్లు, మైక్రోబయోలజిస్టులు అందుబాటులో లేక మైక్రోబయోలజీ సంబంధిత పరీక్షలు జరగడం లేదు. ⇒ పీహెచ్‌సీల నుంచి తీసుకున్న తాత్కాలిక సిబ్బందితోనే బయోకెమిస్ట్రీ ల్యాబ్‌లలో సీరం–ఎలక్ట్రోఫొరెసిస్ యంత్రాల ద్వారా పరీక్షలు చేస్తున్నారు. కేన్సర్‌కు సంబంధించి సీఏ 125, సీఈఏ, పీఎస్ఏ మూడు టెస్టులు ఇప్పటి వరకు 30 వరకు చేశారు. ⇒ ఈ హబ్‌లో 17 రకాల మిషన్లతో రోజుకు 1,659 పరీక్షలను చేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. ⇒ మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాగ్నస్టిక్ హబ్‌లో కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్టుల కోసం పరికరాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని ఉంచేందుకు సరైన బిల్డింగ్ లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. ⇒ నిర్మల్ జిల్లాలో మైక్రోబయాలజిస్టులు, పాథాలజిçస్టులు లేరు. కేన్సర్ టెస్టులు చేయడం లేదు. బయోకెమిస్ట్రీ, థైరాయిడ్, సీబీపీ, డెంగీ, థైరాయిడ్ టెస్టులను మాత్రం చేస్తున్నారు. ⇒ మంచిర్యాల టీ హబ్‌లోని మైక్రోబయోలజీ ల్యాబ్‌లో కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్టుల పరికరాలు ఉన్నా సిబ్బంది లేక దాన్ని వాడట్లేదు. అక్కడ మైక్రోబయోలజిస్ట్ మాత్రం ఉన్నారు. బయో కెమిస్ట్రీ ల్యాబ్‌లలో సీరం–ఎలక్ట్రోఫొరెసిస్ యంత్రాలు ఉన్నా సిబ్బంది లేరు. కేన్సర్ టెస్ట్‌కు ఉపయోగించే రీ ఏజంట్లు ఉన్నా.. టెస్టులు చేసే వారు లేరు. 134 రకాల పరీక్షలకుగాను 76 పరీక్షలు చేస్తున్నారు. అన్ని రకాల పరీక్షలు జరుగుతున్నాయి రాష్ట్రంలోని 32 హబ్స్, 1,546 స్పోక్స్‌లలో రోగులకు అన్ని వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. మైక్రోబయోలజీస్టులు లేనిచోట జిల్లా వైద్య కళాశాల అనుబంధ డీఎంఈ ఆసుపత్రుల సేవలను వినియోగించుకుంటున్నాం. సీరం–ఎలక్ట్రోఫోరెసిస్ పరీక్ష 5 జిల్లాల హబ్స్‌లో జరుపుతున్నాం. ప్రిస్క్రిప్షన్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయి. ప్రతి డయాగ్నస్టిక్ హబ్‌లో 10 నుంచి 20 మంది సిబ్బంది నమూనాలు తీసుకునేందుకు పనిచేస్తున్నారు. ఈ ఏడాది డీఎంఈ, టీవీవీపీ ఆసుపత్రుల నుంచి సిబ్బందిని తీసుకోవాలనుకుంటున్నాం. – ఆర్.వి. కర్ణన్, ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనర్ Sat, Apr 19 2025 1:23 AM
రాజేంద్రనగర్: టోల్ గేట్ డబ్బులు చెల్లించమని అడిగినందుకు ఓ ప్రభుత్వ ఉద్యోగి తనకు మినహాయింపు ఇవ్వరా అంటూ టోల్ గేట్ సిబ్బందిపై దాడికి పాల్పడిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాతబస్తీ తాడ్బన్ ప్రాంతానికి చెందిన హుస్సేన్ సిద్దిఖీ (49) రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సర్వే అండ్ రికార్డు సెక్షన్లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17 నుంచి రాజేంద్రనగర్ వైపు వచ్చాడు. టోల్ గేట్ వద్ద సిబ్బంది వాహనాన్ని ఆపి డబ్బులు చెల్లించాలని కోరారు. తాను ప్రభుత్వ ఉద్యోగినని... కలెక్టర్ కార్యాలయంలో పని చేస్తున్నానంటూ ఐడీ కార్డు చూపించాడు. సిబ్బంది మాత్రం కార్డు చెల్లదని డబ్బులు చెల్లించాలని సూచించారు. అయినా అతను వాహనాన్ని ముందుకు తీసుకెళ్లడంతో మేనేజర్ డేవిడ్ రాజు కారును అడ్డుకుని డబ్బులు చెల్లించాలని కోరాడు. దీంతో ఆగ్రహానికి లోనైన సిద్దిఖీతో పాటు కుటుంబ సభ్యులు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో డేవిడ్ రాజుతో పాటు మరో ఉద్యోగికి గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Wed, Apr 16 2025 8:40 AM

గచ్చిబౌలి: శేరిలింగంపల్లి వెస్ట్‌జోనల్ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ విప్పెర్ల శ్రీనివాస్ రూ.70 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ సిటీ రేంజ్ యూనిట్–2 డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో మంళగవారం మధ్యాహ్నం 1.30 గంటలకు 20 మంది సిబ్బందితో రైడ్ చేశారు. శేరిలింపల్లి జోన్ యూబీడీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ చారి్మనార్ జోన్ ఇన్చార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. చార్మినార్ జోనల్ పరిధిలో మొక్కలు నాటిన ఓ కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.70 వేలు తీసుకొని టేబుల్ డ్రాలో పెట్టగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మొక్కలు నాటిన పనులకు గాను ఓ కాంట్రాక్టర్‌కు రూ.44 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఈ బిల్స్ క్లియర్ చేసేందుకు శ్రీనివాస్ కాంట్రాక్టర్ నుంచి రూ.2.20 లక్షలు డిమాండ్ చేశారన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా రూ.1.50 లక్షలు ఇచ్చినట్లు విచారణలో తేలిందన్నారు. వేరే కాంట్రాక్టర్ యూపీఐ ద్వారా రూ.50 వేలు వేయించుకున్నాడని, మరో సారి రూ.50 వేలు నగదుగా తీసుకున్నారని ఆయన వివరించారు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలోని లిఫ్ట్‌లో కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం కాంట్రాక్టర్ ఇచి్చన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని పేర్కొన్నారు. అర్బన్ బయో డైవర్సిటీ డైరెక్టర్ సునంద నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి యూబీడీ విభాగంలో తనిఖీలు చేస్తున్నామని, సిబ్బందిని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. అధికారులకు లంచం ఇవ్వవద్దని, ఎవరైనా లంచం అడిగితే 1064లో ఫిర్యాదు చేయాలని సూచించారు. పత్తాలేని అధికారులు శేరిలింగంపల్లి వెస్ట్ జోనల్లో అర్బన్ బయోడైవర్సిటీ విభాగంలో ఏసీబీ అధికారులు సోదాలు చేయడంతో మిగతా విభాగాల అధికారులు పత్తా లేకుండా పోయారు. ఆయా విభాగాల అధికారుల కోసం వచి్చన ప్రజలకు ఫీల్డ్ విజిట్ హెడ్ ఆఫీస్‌లో మీటింగ్‌కు వెళ్లారంటూ సిబ్బంది నుంచి సమాదానం వచి్చంది. మంళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు దాడులు చేసిన ఏసీబీ అధికారులు యూబీడీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్‌ను అంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఆ విషయం తెలిసి సంబంధిత శాఖల అధికారులు పత్తా లేకుండా పోయారు. Wed, Apr 16 2025 8:34 AM

చేపా.. చేపా ఎందుకు ఎండలేదు అన్న కథ గుర్తుంది కదా.. ఇప్పుడు చేపా.. చేపా ఎందుకు ఎదగలేదు అంటే అదే మాదిరి కథలా ఉంది పరిస్థితి. చేప పిల్లల టెండర్లు వాయిదా పడుతూ రావడం ఒక కారణమైతే.. చెరువుల్లో వాటిని ఆలస్యంగా వదలడం మరో కారణం. ఇంకో కారణం ఏమిటంటే.. నాసిరకమైన చేప పిల్లలను వదలడమే అంటున్నారు మత్స్యకారులు.సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం ఆశించిన మేర ఫలితాలివ్వలేదు. దీంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలు కురిసి..నీరు చేరిన వెంటనే చేపపిల్లలను చెరువుల్లో వదలాలి. జూలై నుంచి ఆగస్టులోపు పిల్లలను చెరువుల్లో వదిలితే.. ఏప్రిల్ చివరివారం వరకు చేపలు పెరిగి దిగుబడి బాగా వస్తుంది. చేపపిల్లల సరఫరా కాంట్రాక్టర్ల ఎంపిక కోసం రాష్ట్ర స్థాయిలో చేపట్టిన టెండర్ ప్రక్రియలో జరిగిన అక్రమాల కారణంగా ఈ పంపిణీలో తీవ్ర జాప్యం జరిగింది. అక్టోబర్‌లో ప్రారంభమై డిసెంబర్ వరకు చేప పిల్లల పంపిణీ కొనసాగింది. దీంతో ఈ పిల్లలు పెరగలేదు. ఈ కారణంగా ఆశించిన మేరకు దిగుబడి రాలేదు. దీంతో తాము తీవ్రంగా నష్టపోయామని, తమ ఉపాధిపై దెబ్బపడిందని మత్స్యకారులు వాపోతున్నారు. నాసిరకం చేపపిల్లలను పంపిణీ చేయడం కూడా మరో కారణమని వారు ఆరోపిస్తున్నారు. పంపిణీలోనూ కాకిలెక్కలే.. చేపపిల్లల సరఫరా ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా చెరువుల్లో వదిలినట్టు రికార్డుల్లో చూపుతున్న చేపపిల్లల సంఖ్య, వాస్తవంగా వదిలిన చేపపిల్లల సంఖ్యను పొంతన లేదు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే ఈసారి 76 చెరువుల్లో 68 లక్షల చేపపిల్లలను వదిలినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. కానీ జిల్లా మొత్తం మీద 40 లక్షల చేపపిల్లలు కూడా వదలలేదని మత్స్యకారులు వాపోతున్నారు.మత్స్యశాఖ అధికారులు మాత్రం 80 నుంచి 100 ఎంఎం సైజు ఒక్కో చేప పిల్లకు రూ.1.73 చొప్పున, మొత్తం రూ.1.17 కోట్లు డ్రా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నిబంధనల ప్రకారం చెరువుల్లో చేప పిల్లలు వదిలినప్పుడు వాటిని లెక్కిస్తున్న తీరును వీడియో తీయాలి. ఆ చెరువు మత్స్యకారుల సమక్షంలో చేప పిల్లలను వదలాలి. అయితే మెజారిటీ జిల్లాల్లో ఇవేవీ పాటించకుండా పూర్తిస్థాయిలో బిల్లులు డ్రా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ శాఖ అధికారులు కూడా కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. » సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మహబూబ్‌సాగర్ చెరువులో ఏటా 1.60 లక్షల చేపపిల్లలను వదిలేవారు. ఈసారి 80 వేల చేపపిల్లలను వదులుతున్నామని సరఫరా కాంట్రాక్టర్ ఆ చెరువుకు సంబంధించిన మత్స్యకారులకు చెప్పారు. తీరా లెక్కిస్తే అవి 35 వేలకు మించి లేవు. అవికూడా నాణ్యత లేని పిల్లలు వేశారని మత్స్యపారిశ్రామిక సంఘం సభ్యుడు నగేష్ వాపోయారు. తమ సంఘం సుమారు 4 లక్షల చేప పిల్లలను కొన్నామని, ఇందుకు రూ.6 లక్షలకు మించి ఖర్చు అయ్యిందని చెప్పారు.చిన్న చేపలను రూ.20కే విక్రయిస్తున్నాంపెద్దదేవులపల్లి చెరువులో చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాం. చేప పిల్లల పంపిణీలో నాణ్యత లేకపోవడంతో పావుకిలో, అరకిలో మాత్రమే ఎదుగుదల ఉంది. దీంతో ఈ చిన్న చేపలను వ్యాపారులకు రూ.20కే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. 3 కిలోల నుంచి 5కిలోల వరకు పెరిగితేనే మాకు ఉపాధి దొరుకుతుంది. – ముత్తయ్య, మత్స్యకారుడు, నల్లగొండ జిల్లాఅరకిలో సైజు కూడా పెరగలేదు.. » మా ఊరి చెరువులో దసరా టైంలో 20 వేల చేప పిల్లలను వదిలారు. ఆలస్యంగా వదలడంతో ఇప్పుడు అవి 100 గ్రాముల నుంచి అరకిలో వరకు మాత్రమే పెరిగాయి. ఇప్పుడున్న ఎండలకు చెరువులో నీరు ఇంకిపోతోంది. దీంతో చేప సైజు చిన్నగా ఉన్నా, పట్టుకొని అమ్ముకుంటున్నాం. మా సంఘం తరపున జూన్‌లో చేప పిల్లలను కొనుక్కొని వచ్చి పోసినం. వాటి సైజు కిలో వరకు ఉన్నయి. – కంచం సంపత్, మత్స్యకార సంఘం అధ్యక్షుడు ఆన్సాన్పల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ప్రైవేట్ చేప విత్తనమే బాగుంది» ప్రభుత్వం ఉచితంగా చెరువుల్లో వదిలిన చేపపిల్లలు పెరగలేదు. ఇప్పటివరకు అరకిలో లోపే ఉన్నాయి. మేమే ప్రైవేట్‌గా చేపపిల్లలను కొన్నాం. ఇవి కిలో వరకు పెరిగాయి. ప్రభుత్వం మత్స్యకార సంఘాలకు నేరుగా డబ్బులు ఇస్తే మేమే నాణ్యమైన చేపలను కొంటాము. ప్రభుత్వం వేసిన చేపపిల్లలతో పెద్దగా ఉపాధి లేకుండా పోయింది. – పుట్టి శంకర్, నర్సాపూర్(డబ్ల్యూ), లక్ష్మణ్ చందా, నిర్మల్ జిల్లాసరఫరా చేసిన చేపపిల్లల రకాలు..రవ్వ, బొచ్చ, మ్రిగాల, బంగారు తీగ చేపపిల్లల సైజులు..80 ఎంఎం –100 ఎంఎం, 35ఎంఎం–40 ఎంఎం నాణ్యమైన చేపలు పెరగాల్సిన సైజులుకిలో నుంచి 1.5 కిలోలు..ప్రస్తుతం పెరిగిన సైజు 250 గ్రాముల నుంచి 750 గ్రాముల లోపు.. Wed, Apr 16 2025 12:57 AM
సంగారెడ్డి(తూప్రాన్): యువతి అదృశ్యమైన ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. సోమవారం ఎస్ఐ సుభాష్‌గౌడ్ కథనం మేరకు.. మండలంలోని కాళ్లకల్ గ్రామంలో నివాసముంటున్న చామంతుల గణేశ్, మంజులకు కూతురు నాగలక్ష్మీ(19), కుమారుడు ఉన్నారు. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. నాగలక్ష్మీ 10 రోజుల నుంచి మేడ్చల్ మండలంలోని అత్వెల్లి గ్రామ పరిధిలోని నేషనల్ మార్ట్‌లో పనికి వెళ్తుంది. 12న ఉదయం పనికి వెళ్లిన యువతి సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. యువతి తల్లి మంజుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సికింద్లాపూర్‌లో గృహిణి శివ్వంపేట(నర్సాపూర్): గృహిణి అదృశ్యమైన ఘటన మండల పరిధి సికింద్లాపూర్ పంచాయతీ పిట్టల వాడలో చోటు చేసుకుంది. ఎస్ఐ మధుకర్‌రెడ్డి కథనం మేరకు.. పిట్టలవాడకు చెందిన సునీత 6న ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు గ్రామ పరిసరాలు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం సునీత భర్త సురేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.– సంగారెడ్డిలో యువకుడు, గృహిణి సంగారెడ్డి క్రైమ్: ఇంటి నుంచి వెళ్లి వ్యక్తి అదృశ్యమైన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేశ్ కథనం మేరకు.. మెదక్ జిల్లా రంగంపేట మండలానికి చెందిన ఎరుపుల వెంకట్ (37) బతుకుదెరువు కోసం కుటుంబంతో కలిసి ఏడాది కిందట పట్టణంలోని శాంతినగర్‌కి వచ్చి మేస్త్రీగా పని చేస్తూ జీవిస్తున్నారు. గత నెల 28న దంపతులు గొడవ పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన వ్యక్తి అదే రోజు ఇంట్లోంచి వెళ్లిపోయాడు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం సాయంత్రం భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గృహిణి అదృశ్యమైన ఘటన సంగారెడ్డి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన బేగరి ప్రసన్న కుమార్, సరళ భార్యాభర్తలు. సరళ (30) భర్తతో గొడవపడి 11న నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. Tue, Apr 15 2025 11:56 AM
అచ్చంపేట రూరల్: కుమారుడి వివాహేతర సంబంధానికి ఓ తండ్రి బలయ్యాడు. ప్రత్యర్థులు వెంటాడి వేటాడి దారుణంగా హతమార్చారు. ప్రశాంతంగా ఉండే నల్లమల ప్రాంతం ఈ హత్యతో ఒక్కసారిగా ఉలికిపడింది. గ్రామస్తుల వివరాల మేరకు.. అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన బూరం వీరయ్య (54) చిన్న కుమారుడు పరమేశ్ అదే గ్రామానికి చెందిన భర్త, ఇద్దరు సంతానం ఉన్న ఓ వివాహితతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో నెలరోజుల క్రితం ఆ మహిళను ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి సహజీవనం చేశారు. సదరు మహిళ భర్త, బంధువులు వారున్న ప్రాంతానికి వెళ్లి యువకుడిని చితకబాది.. మహిళను స్వగ్రామానికి తీసుకువచ్చారు. అయితే సదరు యువకుడు, అతడి కుటుంబసభ్యులపై మహిళ కుటుంబ సభ్యులు పగ పెంచుకున్నారు. ప్రతీకారం కోసం ఎదురుచూశారు. మంగళవారం వీరయ్య తన పెద్ద కుమారుడు వెంకటేశ్‌తో కలిసి అచ్చంపేట నుంచి నడింపల్లికి బైక్‌పై వస్తున్న విషయాన్ని గుర్తించారు.హైదరాబాద్–అచ్చంపేట ప్రధాన రహదారిపై నడింపల్లి సమీపంలో బైక్‌పై కొందరు వెంబడించగా.. మరికొందరు కారుతో వీరయ్య బైక్‌ను ఢీకొట్టారు. అనంతరం వారి కళ్లల్లో కారం చల్లి సుత్తి, గొడ్డలితో వీరయ్యపై విరుచుకుపడ్డారు. మెడ భాగంపై గొడ్డలితో వేటు వేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్‌పై దాడికి యత్నంచగా.. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రధాన రహదారిపై ఆందోళన.. వీరయ్య హత్య విషయం తెలుసుకున్న అతడి బంధువులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్– అచ్చంపేట ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. గతంలో వీరయ్య కుటుంబంపై దాడి జరిగిన విషయంపై అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని వీరయ్య కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నిందితులకు పోలీసుల సపోర్టు ఉందని ఆరోపిస్తూ.. ఘటనా స్థలానికి వచ్చిన ఓ కానిస్టేబుల్‌పై దాడికి యత్నంచారు . గమనించిన తోటి పోలీసులు ఆర్టీసీ బస్సులో అతడిని అచ్చంపేటకు పంపించారు. ఘటనా స్థలానికి డీఎస్పీ శ్రీనివాసులు చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవీందర్ తెలిపారు. Wed, Apr 16 2025 11:14 AM

రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఐకేపీ కేంద్రాలకు చేరుతోంది. ఈ సమయంలో అకాల వర్షాలు తిప్పలు పెడుతున్నాయని తల్లడిల్లుతున్నారు. నిర్దేశిత తేమశాతం వచ్చేందుకు ఎండలో ఆరబోస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ప్రస్తుతం వరి కోతలు ముమ్మరం కావడంతో.. ధాన్యం పెద్దఎత్తున కొనుగోలు కేంద్రాలకు చేరుతోంది. కొనుగోళ్లు త్వరగా ప్రారంభించాలని రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక శివారులో రహదారిపైనే రైతులు ఇలా ధాన్యం ఆరబోస్తుండడంతో.. రాత్రివేళ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనచోదకులు వాపోతున్నారు – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లిపాల్వంచ రూరల్: యాసంగి సీజన్లో వరి సాగు చేసిన కొందరు రైతుల పరిస్థితి మరీ దైన్యంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సోములగూడెం, దంతలబోరు, సంగం, కారెగట్టు తదితర గ్రామాల రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు.. ఏటా ప్రభుత్వం సోములగూడెం శ్మశానవాటిక సమీపంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేది. ఈ ఏడాది కూడా అక్కడే ఏర్పాటు చేస్తారనే ఉద్దేశంతో రైతులు తమ ధాన్యాన్ని శ్మశానవాటికలోనే ఆరబోశారు. పదిహేను రోజులు దాటినా ఇప్పటికీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు కాకపోగా.. ఇటీవల నిత్యం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు రాత్రిపూట ధాన్యం కుప్పచేసి, ఉదయం మళ్లీ ఆరబెడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే క్వింటాకు రూ.2,320 మద్దతు ధరతో పాటు బోనస్ రూ.500 లభిస్తాయనే ఆశతో ప్రైవేటు వ్యాపారులకు విక్రయించడం లేదు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతుందనే భయంతో 15 రోజులుగా రైతులు శ్మశానవాటికలో ధాన్యం రాశులపైనే నిద్రిస్తున్నారు. అయితే రాత్రి పూట అక్కడ పడుకోవాలంటే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని కోరుతున్నారు. Thu, Apr 17 2025 12:32 AM

సాక్షి, హైదరాబాద్: అంగన్వాడి కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా కోసం కాంట్రాక్టర్ల ఎంపిక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో నెలపాటు పొడిగించింది. టెండరు విధానంలో నిర్దేశించిన నిబంధనలు కొంతమందికే అనుకూలంగా ఉన్నాయనే అంశంపై ‘సాక్షి’ దినపత్రికలో ప్రత్యేక కథనం రావడంతో స్పందించిన ప్రభుత్వం మొదట ఒకసారి గడువును పొడిగించింది. అలాగే, పౌల్ట్రీ రైతులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి అధికారుల వైఖరిపై ఫిర్యాదులు చేయడంతో తాజాగా మరోసారి గడువును పొడిగించారు. 37,500 అంగన్వాడి కేంద్రాలకు ఏడాదిలో 36.96 కోట్ల గుడ్లు సరఫరా చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించిన రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ.. ఆ మేరకు రాష్ట్రంలోని ఏడు జోన్ల పరిధిలో ఏడుగురు కాంట్రాక్టర్ల ఎంపికకు టెండర్లను పిలిచి, ఈ నెల 11న టెండర్లు తెరవాలని నిర్ణయించుకుంది. అయితే టెండరు నిబంధనలు పాత కాంట్రాక్టర్లకు అనుకూలంగా, కొత్తవారికి ప్రతిబంధకంగా ఉన్నాయనే అంశాలను ప్రస్తావిస్తూ ఈ నెల 6న ‘సాక్షి’ ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ.. టెండరు నిబంధనల్లో సవరణలు చేస్తూ గడువు తేదీని ఐదు రోజులు పొడిగించింది. అయినప్పటికీ ప్రధాన నిబంధనల్లో సవరణలు చేయలేదంటూ పౌల్ట్రీ రైతులు ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించారు. దీంతో ఆయన టెండర్ల గడువును పొడిగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో శిశుసంక్షేమ శాఖ.. మే 15 వరకు దరఖాస్తుల స్వీకరిస్తామని, 16న కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తామని ప్రకటిస్తూ సవరణ నోటిఫికేషన్ జారీచేసింది. కాగా, టెండర్ నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పలువురు పౌల్ట్రీ రైతులు హైకోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యం వేసినట్లు తెలిసింది. Thu, Apr 17 2025 12:29 AM

సాక్షి, హైదరాబాద్: ధరణి స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భూభారతి పోర్టల్‌లో వచ్చే ప్రతి దరఖాస్తు పరిష్కారానికి ప్రభుత్వం నిర్ణీత గడువు విధించింది. ఈ పోర్టల్‌లో భూమి రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే ఆ భూమికి సంబంధించిన పాసుబుక్కు జారీ, భూమి క్రయ విక్రయ వివరాలను వెంటనే ఆన్లైన్లో మార్చటం వంటి అనేక వివరాలతో భూ భారతి చట్టం మార్గదర్శకాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. మార్గదర్శకాలతో పాటు చట్టం అమలును గెజిట్ చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిత్తల్ జీవో నం: 36, 39లను విడివిడిగా జారీ చేశారు. జీవో 36 ప్రకారం భూభారతి చట్టం ఏప్రిల్ 14, 2025 నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. జీవో 39 ప్రకారం చట్టం మార్గదర్శకాలను విడుదల చేశారు. వీటిని తెలంగాణ భూభారతి నిబంధనలు (రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్)– 2025గా పిలుస్తారు. చట్టం అమల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఈ నిబంధనలు వర్తిస్తాయి. రికార్డుల తయారీ ఈ చట్టం కింద ప్రతి గ్రామంలో ఉన్న అన్ని రకాల భూములకు సంబంధించిన రికార్డుల తయారీ, మార్పు చేర్పులు, నిర్వహణ జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఈ రికార్డులను భూభారతి పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతారు. ఆబాదీతో పాటు వ్యవసాయేతర భూములను సర్వే చేయడం ద్వారా ఆయా భూముల హద్దులను అక్షాంశాలు, రేఖాంశాలు ఆధారంగా నిర్ధారించి మ్యాపులు రూపొందించాల్సి ఉంటుంది. వ్యవసాయ, ఆబాదీ, వ్యవసాయేతర భూముల రికార్డుల తయారీ, నిర్వహణ కోసం ప్రభుత్వం ఎప్పుడైనా నోటిఫికేషన్ జారీచేసి మార్పులు, చేర్పులు చేయవచ్చు. దరఖాస్తు చేసిన 60 రోజుల్లో పరిష్కారం తమ భూ రికార్డుల్లో తప్పులు నమోదైనా, హక్కుల రికార్డులో వివరాలు లేకపోయినా సంబంధిత వ్యక్తి ఈ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరంలోపు నిర్దేశిత ఫీజు చెల్లించి భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని సవరణలు కోరవచ్చు. ఆ భూమికి సంబంధించి ప్రభుత్వం గతంలో జారీచేసిన పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్స్, పహాణీలు లేదా రిజిస్టర్ డాక్యుమెంట్లు, ఇతర డాక్యుమెంట్లతో పాటు తాను చేసుకున్న దరఖాస్తు సరైనదేనని అఫిడవిట్ జత చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను ఆర్డీవోలు, జిల్లా కలెక్టర్లు పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారు. ఆర్డీవోలు తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలుంటే జిల్లా కలెక్టర్లకు, కలెక్టర్ల నిర్ణయాలపై అభ్యంతరాలుంటే ట్రిబ్యునల్స్‌కు రీఅప్పీల్ (మళ్లీ దరఖాస్తు) చేసుకోవచ్చు. ఈ దరఖాస్తుల పరిష్కారానికి రెవెన్యూ వర్గాల నుంచి సంబంధిత వ్యక్తులకు నోటీసు వస్తుంది. ఈ నోటీసులపై సెకండ్ పార్టీ (దరఖాస్తుదారులు కాకుండా) వారం రోజుల్లోగా లిఖితపూర్వక అభ్యంతరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వని పక్షంలో సంబంధిత అధికారి నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. లిఖిత పూర్వక అభ్యంతరాలు సమర్పించిన పక్షంలో నోటీసులు అందిన వారం రోజుల తర్వాత సదరు అధికారి ఆ దరఖాస్తుపై విచారణ జరుపుతారు. విచారణ రిపోర్టుతోపాటు ఇరు పక్షాల నుంచి వచ్చిన సాక్ష్యాలను పరిశీలిస్తారు. నేరుగా వారు వాదనలు వినిపించే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత సదరు అధికారి తగు ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ ఉత్తర్వులను భూభారతి పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతారు. ఇదంతా నోటీసు జారీ చేసిన 60 రోజుల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్లు ఇలా.. ఏదైనా భూమిని రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యుటేషన్ చేసుకునేందుకు భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. భూమి రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్‌ను సమయం (స్లాట్) అడిగితే, ఆ మేరకు తహసీల్దార్ స్లాట్ కేటాయిస్తారు. స్లాట్ ఇచ్చిన సమయంలో ఇరు పక్షాలు సంతకాలు చేసిన డాక్యుమెంట్లు, పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్ డీడ్స్ సమర్పించాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా దరఖాస్తుదారుడు పేర్కొన్న వివరాలు హక్కుల రికార్డుతో సరిపోలాయా.. లేదా? ఆ భూమి నిషేధిత భూముల జాబితాలో ఉందా? అసైన్డ్ భూమినా? షెడ్యూల్డు ఏరియాలో ఉందా? అనే వివరాలను పరిశీలించి సదరు అధికారి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే తహసీల్దార్ సంబంధిత రికార్డును కూడా భూభారతిలోమ మార్చాలి. ఈ వివరాలతో కూడిన డాక్యుమెంట్‌ను క్రయవిక్రయదారులిద్దరికీ ఇవ్వాలి. ఇందుకు సంబంధించిన పాసు పుస్తకం కూడా వెంటనే జారీ చేయాల్సి ఉంటుంది. సాదా బైనామాల క్రమబద్ధీకరణ ఈ చట్టం ద్వారా పెండింగ్‌లో ఉన్న 9 లక్షలకు పైగా సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కలగనుంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకుండా తెల్ల కాగితాలపై భూ యాజమాన్య హక్కులను జూన్ 2, 2014 నాటికి మార్చుకున్నవారు.. తమ పేరిట ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని 2020, అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు చేసుకున్న దరఖాస్తులను ఈ చట్టం ప్రకారం పరిష్కరించవచ్చు. ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం విచారణకు రావాలని ఆర్డీవో నోటీసులు జారీ చేస్తారు. అప్పుడు దరఖాస్తుదారుడు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఆర్డీవో క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరిపి సాదాబైనామా నిజమా కాదా అనేది నిర్ధారించి తగు నిర్ణయం తీసుకుంటారు. అయితే, ఆ భూమి సీలింగ్, షెడ్యూల్డు ఏరియా, పీఓటీ (అసైన్డ్) చట్టాల పరిధిలోనికి రానిదై ఉండాలి. ఒకవేళ సాదాబైనామా కింద దరఖాస్తుదారునికి హక్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే సర్టిఫికెట్ జారీ చేస్తారు. దానిని వారం రోజుల్లోగా ఇరుపక్షాలకు పంపుతారు. ఆ తర్వాత ఆర్డీవోనే సదరు భూమిని భూభారతి చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ ప్రక్రియ అంతా నోటీసులిచ్చిన 90 రోజుల్లోపు పూర్తి కావాల్సి ఉంటుంది. వారసత్వ భూములపై హక్కులు వీలునామాల ఆధారంగా లేదా వారసత్వంగా వచ్చే భూములపై హక్కుల కోసం భూభారతి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వారసత్వ హక్కుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే వారసులందరూ అఫిడవిట్లు జత చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం వారసులందరికీ తహసీల్దార్ నోటీసులు జారీ చేస్తారు. ఈ నోటీసును గ్రామపంచాయతీలు, తహసీల్దార్ ఆఫీసుల్లోని నోటీసు బోర్డుల్లో కూడా ప్రదర్శిస్తారు. ఈ నోటీసులు అందుకున్న ఏడు రోజుల్లోగా దరఖాస్తుదారుడు అన్ని డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. తహసీల్దార్ వాటిని పరిశీలించి అవసరమైతే వారసులను విచారించి నిర్ణయం తీసుకుంటారు. ఇదంతా నోటీసులు జారీచేసిన 30 రోజుల్లోగా పూర్తి చేయాలి. అలా చేయని పక్షంలో ఆ దరఖాస్తు ఆమోదింపబడుతుంది. మ్యుటేషన్‌కు 30 రోజులు గడువు..! కోర్టు ఆదేశాలు, లోక్‌అదాలత్ తీర్పులు, రెవెన్యూ కోర్టుల ఉత్తర్వులు, ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్, సీలింగ్, భూదాన్, 1977 అసైన్డ్ చట్టం కింద ఇచ్చిన భూములు, ఇనామ్‌ల రద్దు చట్టం కింద ఓఆర్సీ, రక్షిత కౌలుదారు చట్టం కింద యాజమాన్య సర్టిఫికెట్లు, ఇండ్ల స్థలాల రూపంలో ఇచ్చిన భూములకు మ్యుటేషన్ కోసం భూభారతి ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆర్డీవో నోటీసు ఇస్తారు. ఈ నోటీసు ప్రకారం ప్రత్యక్ష విచారణ లేదంటే రిపోర్టు తెప్పించుకోవడం ద్వారా డాక్యుమెంట్లను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రక్రియ 30 రోజుల్లో పూర్తి కావాల్సి ఉంటుంది. ప్రతి భూ యజమానికి భూదార్ కార్డు భూభారతి పోర్టల్‌లో ఉన్న హక్కుల రికార్డు ఆధారంగా తహసీల్దార్లు తాత్కాలిక భూదార్ కార్డులు జారీ చేస్తారు. పోర్టల్‌లో పేరున్న ప్రతి ఒక్కరికీ ఈ కార్డులు జారీ అవుతాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు భవిష్యత్తులో ప్రతి భూమికి యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఐఎన్) ఇస్తారు. రాష్ట్రంలోని భూములన్నింటినీ సర్వే చేసి, ప్రతి భూమికి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా హద్దులు నిర్ణయించి ఈ కార్డులను జారీ చేయాల్సి ఉంటుంది. కొత్త పాసు పుస్తకాల జారీ కొత్త పాసుపుస్తకాల కోసం కూడా ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులను తహసీల్దార్ పరిశీలించి హక్కుల రికార్డులోని వివరాల ఆధారంగా పాసుపుస్తకం కమ్ టైటిల్ డీడ్ జారీ చేస్తారు. భూభారతి పోర్టల్‌లో నమోదై భూ యజమానులందరికీ తహసీల్దార్లు సుమోటోగా పాసు పుస్తకాలు ఇవ్వొచ్చు. దేనికైనా నిర్దేశిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. హక్కుల రికార్డులో నమోదైన భూములను ఎప్పుడైనా లైసెన్సుడ్ సర్వేయర్ ద్వారా సర్వే చేయించుకోవచ్చు. ఈ సర్వే ద్వారా నిర్ధారించిన మ్యాప్‌ను పాసుపుస్తకాల్లో కూడా ముద్రించాల్సి ఉంటుంది. పాసు పుస్తకాల్లో తప్పులుంటే వాటిని సరిచేసుకునేందుకు కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు భూభారతి పోర్టల్‌లో కల్పించారు. గ్రామ అకౌంట్ల నిర్వహణ గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డులను నిర్వహించాల్సి ఉంటుంది. మ్యుటేషన్, రికార్డుల అప్డేషన్ జరిగినప్పుడు ఆ వివరాల ఆధారంగా అవసరాన్ని బట్టి గ్రామ పహాణీ, ప్రభుత్వ భూమి రిజిస్టర్, బదిలీ రిజిస్టర్, సాగునీటి సౌకర్యం రిజస్టర్లను మార్చాల్సి ఉంటుంది. ఏటా డిసెంబర్ 31 ఆర్ధరాత్రిలోపు గ్రామ అకౌంట్ వివరాలను సంబంధిత అధికారికి సమర్పించాలి. టైటిల్, కబ్జా, లేదంటే ఇతర సివిల్ అంశాల్లో ఎవరికి ఏ భూమిపై ఎలాంటి అభ్యంతరం ఉన్నా సంబంధిత సివిల్ కోర్టులకు వెళ్లి పరిష్కరించుకునే అవకాశాన్ని ఈ చట్టం కల్పిస్తుంది. అప్పీళ్లతో పాటు రివిజన్ కూడా.. భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తుల పరిష్కారం కోసం రెవెన్యూ వర్గాలు తీసుకునే నిర్ణయాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. తహసీల్దార్ల నిర్ణయాలపై ఆర్డీవోలకు, ఆర్డీవోల నిర్ణయాలపై కలెక్టర్లకు, కలెక్టర్ల నిర్ణయాలపై ట్రిబ్యునల్‌కు అప్పీల్ చేసుకోవచ్చు. దరఖాస్తును బట్టి 30 నుంచి 60 రోజుల్లోపు ఈ అప్పీళ్లను పరిష్కరించాలి. ఎవరైనా, ఏ భూమిపై అయినా మోసపూరితంగా హక్కులు పొందారని భావిస్తే, ఆ భూమి గురించి భూభారతి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) సుమోటోగా కూడా అనుమానాస్పద భూములపై విచారణ చేపట్టవచ్చు. రికార్డులు, డాక్యుమెంట్లు, సాక్ష్యాలను పరిశీలించి అవసరమైతే సదరు భూమిని వెనక్కు తీసుకునే వెసులుబాటును ఈ చట్టం కల్పిస్తోంది. ఉచిత న్యాయ సాయం.. పేద రైతులకు ఈ చట్టం ద్వారా ఉచిత న్యాయ సాయం కూడా అందుతుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగ రైతులకు మండల, జిల్లా లీగల్ అథారిటీల సహకారంతో ఈ సాయాన్ని అందజేస్తారు. భూభారతి పోర్టల్ నిర్వహణ సీసీఎల్ఏ ఆదీనంలో ఉంటుంది. రికార్డుల తయారీ, నిర్వహణ, అప్డేషన్, సమయానుగుణంగా మార్పు చేర్పులు, ప్రభుత్వ అనుమతి మేరకు షెడ్యూళ్ల మార్పు, అవసరాలకు అనుగుణంగా ఆదేశాల జారీ, మార్గదర్శకాల రూపకల్పన అధికారాలన్నీ సీసీఎల్ఏ పరిధిలోనే జరుగుతాయి. Wed, Apr 16 2025 6:07 AM

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ ఏడాది ఫీజులు భారీగా పెంచాలంటూ కాలేజీలు ఒత్తిడి చేస్తున్నాయి. అయితే ఇందుకు ఆమోదం తెలిపితే సర్కారు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని సీఎం సలహాదారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు నివేదించడంతో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రభుత్వ పెద్దలు తర్జనభర్జనలు పడుతున్నట్లు సమాచారం. ప్రైవేటు కాలేజీలు ప్రతిపాదించిన కన్వీనర్ కోటా ఫీజుల వివరాలను ఇటీవల రాష్ట్ర ఫీజులు, నియంత్రణ మండలి (ఎఫ్ఆర్సీ) ప్రభుత్వానికి పంపింది. రెండురోజుల క్రితం ఉన్నతాధికారులు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. సర్కార్ ఆమోదం తెలిపితే ఎఫ్ఆర్సీ ఫీజులను ఖరారు చేసే వీలుందని తెలిపారు. అయితే కాలేజీలు ప్రతిపాదించిన ఫీజులపై ప్రభుత్వం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైనట్టు తెలిసింది. ఫీజులు భారీగా ఉండటం గమనించిన ప్రభుత్వం..కాలేజీలు కోరుతున్నట్టుగా ఫీజులు పెంచితే ప్రభుత్వం పెద్దయెత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఫీజుల విషయంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచి్చనట్లు తెలిపాయి. ఎక్కువ వ్యయంతో ఆడిట్ రిపోర్టులు ఇంజనీరింగ్ ఫీజులను ఎఫ్ఆర్సీ ప్రతి మూడేళ్ళకోసారి సమీక్షిస్తుంది. చివరిసారిగా 2022లో కొత్త ఫీజులను ఖరారు చేశారు. ఇవి 2022–23, 2023–24, 2024–25 విద్యా సంవత్సరానికి వర్తించాయి. 2025–26, 2026–27, 2027–28 విద్యా సంవత్సరం కోసం కొత్త ఫీజులను ఖరారు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 157 ఇంజనీరింగ్ కాలేజీలు కొత్త ఫీజులపై ప్రతిపాదనలు పంపాయి. గత మూడేళ్ళుగా కాలేజీల్లో ప్రవేశపెట్టిన కొత్త కోర్సులు, మౌలిక వసతుల కల్పన, ఇతర ఖర్చులతో కూడిన ఆడిట్ రిపోర్టులు సమరి్పంచాయి. వీటిని ఎఫ్ఆర్సీ సూచించిన ఆడిట్ బృందాలు కొన్ని నెలలుగా సమగ్రంగా అధ్యయనం చేశాయి. ఆ తర్వాత కాలేజీలతో విడివిడిగా ఎఫ్ఆర్సీ అధికారులు మాట్లాడారు. ఇందులో వెల్లడైన అంశాల ఆధారంగా ఫీజుల పెంపుపై ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. 2022 వరకూ అంతకు ముందు ఫీజులపై గరిష్టంగా పది శాతం పెంచుకునే అవకాశం కల్పించే వాళ్ళు. కానీ ఇప్పుడు కాలేజీల ప్రతిపాదనలు ఊహించని స్థాయిలో ఉన్నాయి. కరోనా తర్వాత పెద్దగా ఫీజులు పెంచలేదని, 2022 తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ సహా పలు కోర్సులు తీసుకొచ్చామని, దీనికి ఫ్యాకల్టీతో పాటు, మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున ఖర్చు చేశామని, ఈ మేరకు ఫీజులు పెంచాలని కాలేజీలు అంటున్నాయి. ఫీజులు పెంచాల్సిందే.. దాదాపు అన్ని కాలేజీలు పెద్ద ఎత్తున ఫీజుల పెంపు ప్రతిపాదనలు చేశాయి. 52 శాతం నుంచి 84 శాతం ఫీజుల పెంపును కోరుతున్నాయి. కనీ్వనర్ కోటా ఫీజు పెరిగితే బీ కేటగిరీ ఫీజులు మరింత పెంచుకోవచ్చని కాలేజీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో రూ.1.50 లక్షల వార్షిక ఫీజు ఉన్న 73 కాలేజీలు ఏకంగా రూ. 2.25 లక్షల వరకూ ఫీజు పెంపును ప్రతిపాదించాయి. 33 కాలేజీల్లో ప్రస్తుతం రూ.లక్ష లోపు ఫీజు ఉంది. దీన్ని రెట్టింపు చేయాలని ఎఫ్ఆర్సీ ముందు ప్రతిపాదించాయి. టాప్ టెన్ కాలేజీలు తమ ఫీజులను రూ.2.50 లక్షలకు పెంచాలని కోరుతున్నాయి. సీఎస్ నేతృత్వంలో కమిటీ! కాలేజీల ఒత్తిడి నేపథ్యంలో ఫీజులపై వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేయడానికి కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యతను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అప్పగించిననట్టు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అన్ని విశ్వవిద్యాలయాల వీసీల నుంచి ప్రైవేటు కాలేజీల్లో కోర్సులు, మౌలిక వసతులు, ఫీజులపై వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ అయినట్టు తెలిసింది. ఈ నివేదికలు వచి్చన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే వీలుందని చెబుతున్నారు. Tue, Apr 15 2025 5:48 AM

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఈడీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం సృష్టించాయి. సురానా ఇండస్ట్రీస్‌తో పాటు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. సురానాకి అనుబంధంగా సాయి సూర్య డెవలపర్స్ పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో ఈడీ.. అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్, బోయిన్పల్లి, జూబ్లీహిల్స్‌లో తనిఖీలు కొనసాగుతున్నాయి.వివరాల ప్రకారం.. సురానా గ్రూప్ చైర్మన్, ఎండీ నివాసాలు, సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ చైర్మన్, ఎండీల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని నాలుగు ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. చెన్నై చెందిన ఈడీ బృందాలు సోదాల్లో పాల్గొంది. సూరానా గ్రూప్స్.. చెన్నైలోని ప్రముఖ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టిన నేపథ్యంలో ఇప్పటికే సురానా గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదైంది. ఇక, తాజాగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయంలో ఈడీ సోదాలు జరుపుతున్నట్టు సమాచారం. ఈడీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Wed, Apr 16 2025 7:15 AM

సాక్షి, హైదరాబాద్: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, విస్తరించే పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మూడు దశల్లో ఆలయం, పరిసరాలను అభివృద్ధి చేయబోతోంది. ఇందులో తొలి దశ పనులను జూన్‌లో ప్రారంభించాలని నిర్ణయించింది. జూన్ 15 నుంచి ప్రధాన దేవాలయంలోకి భక్తులను అనుమతించరు. కేవలం నిత్య పూజలను మాత్రం అర్చకులు ప్రధాన దేవాలయ గర్భాలయంలో నిర్వహిస్తారు. భక్తులకు స్థానిక భీమేశ్వరాలయంలో స్వామి దర్శనం కొనసాగుతుంది. ఏడాదిన్నర నుంచి రెండేళ్లలో మొదటి దశ పనులు పూర్తి చేయనున్నారు. అప్పటి వరకు రాజరాజేశ్వర స్వామి దేవాలయంలోని ఉత్సవ మూర్తులను భీమేశ్వరాలయంలో ఉంచి భక్తులకు దర్శనాలు, కైంకర్యాలు కొనసాగిస్తారు. ఈ పనులకు సంబంధించి గురువారం వేములవాడలో ఉన్నతస్థాయి సమీక్షి నిర్వహించనున్నారు. ఇందులో చర్చించి తుది నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడిస్తారు. మొత్తం పనులకు రూ.550 కోట్లు అవసరం బీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్ట దేవాలయాన్ని పునర్నిర్మించిన విషయం తెలిసిందే. గర్భాలయంలోని మూల విరాట్టు ప్రాంగణాన్ని అలాగే ఉంచి మిగతా మొత్తం ఆలయం స్థానంలో పూర్తి కొత్త ఆలయాన్ని నిర్మించారు. శతాబ్దాల చరిత్ర ఉన్న పురాతన ఆలయాన్ని తొలగించటం పట్ల భక్తుల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో వేములవాడ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. శృంగేరీ శంకరమఠం పీఠాధిపతి సూచించిన మార్పులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని కొత్త నిర్మాణాన్ని చేపడుతోంది. ప్రధాన గర్భాలయం, మండప భాగాన్ని పటిష్ట పరిచి దాన్ని అలాగే ఉంచి చుట్టూ కొత్త మండపాన్ని నిర్మిస్తారు. పాత నిర్మాణాన్ని అనుసరిస్తూ కొత్త నిర్మాణంతో ఆలయాన్ని విస్తరిస్తారు. పురాణ నేపథ్యంలో ఉన్న ధర్మగుండం, గుడి చెరువు ప్రాశస్త్యం తగ్గకుండా 40 ఎకరాల పరిధిలో నిర్మాణాలు చేపట్టనున్నారు. అన్నదాన సత్రం, క్యూ కాంప్లెక్సు, వసతి గృహాలు, రెండు ప్రాకారాలు, కార్యాలయం, కోనేరు, కల్యాణ కట్ట, కోడె మొక్కుల ప్రాంతం.. ఇలా అన్నీ కొత్తగా నిర్మిస్తారు. భీమేశ్వరాలయం సహా అనుబంధ దేవాలయాలను అభివృద్ధి చేస్తారు. ఈ మొత్తం పనులకు రూ.550 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రభుత్వం ఇప్పటికే ప్రధాన దేవాలయానికి సంబంధించి రూ.76 కోట్లకు, కల్యాణ మండపానికి సంబంధించి రూ.33 కోట్లకు నిధులు మంజూరు చేసింది. ఇటీవలి బడ్జెట్లో మరో రూ.100 కోట్లు ప్రతిపాదించింది. వీటితో పనులు కొనసాగిస్తూ, తదుపరి విడతలకు మరిన్ని నిధులు మంజూరవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్రప్రభుత్వ ‘ప్రసాద్’పథకంలో భాగంగా 96 గదులతో కూడిన వసతి గృహ నిర్మాణానికి రూ.44 కోట్లు మంజూరయ్యాయి. దీనికి మరిన్ని నిధుల కోసం కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. » ఆలయం 15 డిగ్రీల కోణంలో ఆగ్నేయం దిశ వైపు మళ్లి ఉంటుంది. ఇప్పుడు గర్భాలయం, సభా మండపాన్ని అదే దిశలో నిర్మించి మిగతా భాగాన్ని నేరుగా ఉండేలా సరిద్దిది విస్తరిస్తారు.» చారిత్రక, పౌరాణిక నేపథ్యం ఉన్న అన్ని భాగాలను, పురాణాలు, పురాతన గ్రంథాలు, 1970లో వెలుగు చూసిన రాతి శాసనాల్లో పేర్కొన్న విధంగా ప్రాశస్త్యానికి ఇబ్బంది లేకుండా విస్తరిస్తారు. కొన్ని నిర్మాణాలు తదనంతరం వెలిశాయి. వాటి విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.» అన్నాదాన సత్రాన్ని రెండెకరాల విస్తీర్ణంలో రెండంతస్తులుగా లక్షన్నర చ.అ. మేర రూ.35.35 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు.» ప్రస్తుత ప్రధాన ఆలయం 4 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, దాన్ని 4.6 ఎకరాల విస్తీర్ణానికి పెంచనున్నారు.» సరైన ప్రణాళిక లేకపోవటంతో గతంలో ఆలయ పునరుద్ధరణ వంకరటింకరగా జరిగింది. ఇప్పుడు దాన్ని రెండు ప్రాకారాలు, రెండు వీధులతో క్రమపద్ధతిలోకి మార్చనున్నారు. » ప్రస్తుతం ఇరుకుగా ఉన్న వీధులను రూ.47 కోట్ల వ్యయంతో 80 అడుగుల మేర విస్తరించనున్నారు.» అన్ని ప్రాంతాల్లో బతుకమ్మ పండుగను 9 రోజులు నిర్వహిస్తే, ఒక్క వేములవాడలో ఏడు రోజులు మాత్రమే జరుగుతుంది. బతుకమ్మ పుష్పం నుంచే ఆలయం ఉద్భవించిందన్న పౌరాణిక గాథ ఉంది. దాన్ని ప్రతిబింబించే తరహా గుర్తులను నిర్మాణంలో చూపనున్నారు.» పునరుద్ధరణ క్రమంలో గతంలో కొన్ని నిర్మాణాల్లో వేములవాడ చాళుక్యుల శైలి లోపించింది. ఇప్పుడు కొత్త నిర్మాణం యావత్తు ఆ శైలిలోనే ఉండనుంది. Thu, Apr 17 2025 12:57 AM

సాక్షి, హైదరాబాద్: సామాన్యుడికి సైతం అర్థమయ్యే విధంగా ఎలాంటి మతలబు, ఇబ్బంది లేకుండా తయారు చేసిందే భూ భారతి 2025 చట్టం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శిల్ప కళావేదికలో జరిగిన భూభారతి ప్రారంబోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో భూమితో పెన వేసుకున్న ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తూ గత పాలకులు ధరణి చట్టం తెచ్చారని భట్టి విమర్శించారు.ధరణి రైతుల పాలిట శాపంగా మారిందని, కొంతమంది పెత్తందారుల కాళ్ల వద్ద రైతుల హక్కులను తాకట్టు పెట్టే విధంగా ఉందని.. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఎంత మొత్తుకున్నా గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో పేదలకు పంపిణీ చేసిన 24 లక్షల ఎకరాలకు సంబంధించిన హక్కులను గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి కాలరాసిందని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యంలో ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని పాదయాత్రలో రైతులకు భరోసా ఇచ్చామని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. జన్మ ధన్యమైంది: పొంగులేటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజల భూములకు పూర్తి భద్రత, భరోసా కల్పించే భూభారతి చట్టాన్ని ప్రజలకు అందించడంతో తన జన్మ ధన్యమైందని అన్నారు. అధికారులే ప్రజల వద్దకు వచ్చి ఫిర్యాదులు స్వీకరించి 15 రోజుల్లో పరిష్కరిస్తారని వివరించారు. ఈనెల 17 నుంచి కలెక్టర్లు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఈ చట్టంపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. మే మొదటి వారంలో రాష్ట్రంలో మిగిలిన 29 జిల్లాల్లో ఒక్కో మండలాన్ని ప్రయోగాత్మకంగా ఎంపిక చేసి ఫిర్యాదులు స్వీకరించి భూభారతి చట్టాన్ని పటిష్టపరుస్తామన్నారు.జూన్ 2వ తేదీ నాటికి సమగ్ర చట్టాన్ని ఉపయోగంలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ గత చట్టంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది భూ భారతి పోర్టల్‌ను రూపొందించినట్లు చెప్పారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ మాట్లాడుతూ దేశంలోనే అత్యంత గొప్ప రెవెన్యూ చట్టంగా భూభారతిని రూపొందించినట్లు చెప్పారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు తదితరులు పాల్గొన్నారు. Tue, Apr 15 2025 1:44 AM
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఫేక్ పోస్టులపై తెలంగాణ పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఫేక్ వీడియోలు, AI ఫేక్ ఫోటోలు పెట్టిన పలువురిని గుర్తించారు. ఫేక్పోస్ట్లపై పోలీసులు నిఘా పెట్టడంతో ఆ పోస్ట్‌లను పలువురు సెలబ్రిటీలు డిలీట్ చేశారు. ఫేక్ పోస్టులు పెట్టీ వైరల్ చేసి డిలీట్ చేసిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో ఫేక్ పోస్ట్‌లు చేసినట్టు పోలీసులు గుర్తించారు. వారి సోషల్ మీడియా ఖాతా యూఆర్ఎల్తో సహా పోలీసులు వివరాలు సేకరించారు. పోస్టులు తొలగించని వ్యక్తులకు పోలీసులు నోటీసులు పంపుతున్నారు. 25 మంది సెలబ్రెటీలు పోస్ట్‌లు తొలగించినట్లు పోలీస్ శాఖ గుర్తించారు. Tue, Apr 15 2025 10:10 AM
జడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఇంటిని కుమార్తెకు రిజిస్ట్రేషన్ చేశాడన్న కోపంతో.. ఓ కొడుకు తండ్రికి తలకొరివి పెట్టేందుకు ముందుకు రాలేదు. దీంతో బంధువులు.. మృతుని చిన్నకుమా ర్తెతో కర్మకాండ జరిపించారు.నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లికి చెందిన మాణిక్యరావు (80) సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా రిటైరయ్యాక.. మహబూబ్‌నగర్ పద్మావతి కాలనీలో సొంత ఇంట్లో నివసిస్తున్నారు. మాణిక్యరావు దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరి వివాహాలు జరిపించారు.భార్య గతంలోనే మరణించడంతో.. సొంత ఊరిలోని 15 ఎకరాల వ్యవసాయ పొలం, రూ.60 లక్షలు.. కొడుకు గిరీష్‌కు ఇచ్చి.. మహబూబ్‌నగర్ పద్మావతి కాలనీలోని ఇంటిని.. ఆర్థికంగా బలహీనంగా ఉన్న పెద్ద కూతురు రాజనందిని పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. మాణిక్యరావు అనారోగ్యానికి గురై మంగళవారం అర్ధరాత్రి చనిపోయారు. హైదరాబాద్‌లో ఉన్న గిరీష్‌కు సోదరీమణులు సమాచారం అందించారు. ఇంటిని తనకు ఇవ్వని తండ్రి అంత్యక్రియలకు రానని గిరీష్ వారికి తెగేసి చెప్పాడు. దీంతో చిన్న కూతురు రఘునందిని తండ్రికి తలకొరివి పెట్టింది. Thu, Apr 17 2025 8:16 AM

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే ఖరీఫ్ సీజన్‌కైనా గోదావరి జలాలు పొలాలకు పారుతాయా లేదా అనే సందే హాలు తలెత్తుతున్నాయి. ప్రాజెక్టు ప్రధాన కాల్వకు గతంలోనే గండ్లు పడగా, ఇటీవల నిర్వహించిన ట్రయల్ రన్ సందర్భంగా.. ప్రధాన కాల్వ నిర్మాణంలో భాగమైన ఓ సూపర్ పాసేజ్ (బ్రిడ్జి) పిల్లర్ కూలిపోవడం సమస్యగా పరిణమించింది. 9 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో చేపట్టిన సీతారామ ప్రాజెక్టులో భాగంగా రూ.6,714 కోట్ల వ్యయంతో 104.4 కి.మీ. పొడవైన ప్రధాన కాలువ నిర్మించారు. దీని నీటి ప్రవాహ సామర్థ్యం 9,000 క్యూసెక్కులు. ఈ కాలువ దారిలో కిన్నెరసాని, ముర్రేడు వంటి నదులు, వాగులతో పాటు చిన్న చిన్న ఒర్రెల వంటి నీటి ప్రవాహాలు ఎదురైన చోట అక్విడెక్టులు, సూపర్ పాసేజ్‌లు నిర్మించారు. 2018లో ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తే 2022 చివరి నాటికి మూడు పంప్‌హౌస్‌లు, ప్రధాన కాలువ నిర్మాణం పూర్తయింది. గతేడాది ఆగస్టులో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పంప్‌హౌస్‌లు ప్రారంభించారు. తాజాగా 2025 మార్చి 3న ట్రయల్ రన్ నిర్వహించి గోదావరి నుంచి 405 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోతల ద్వారా నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు అందించారు. అప్పటికే గోదావరిలో నీరు అడుగంటి పోవడంతో రెండు రోజులకు మించి నీటిని ఎత్తిపోయడం సాధ్యం కాలేదు. 405 క్యూసెక్కులకే కూలిన సూపర్ పాసేజ్ గత నెలలో విడుదల చేసిన నీటి ప్రవాహానికి ములకలపల్లి మండలం వీకే రామవరం గ్రామానికి సమీపంలో ప్రధాన కాలువ వెంట 48.30 కి.మీ. దగ్గర సుమారు రూ.కోటి వ్యయంతో నిర్మించిన సూపర్ పాసేజ్‌కి సంబంధించిన పిల్లర్ కూలిపోయింది. మొత్తం నాలుగు పిల్లర్లలో ఒకటి కూలిపోగా.. కాలువ రివిట్మెంట్ కూడా దెబ్బతింది. 9 వేల క్యూసెక్కుల ప్రవాహం వెళ్లేలా డిజైన్ చేసిన ప్రధాన కాలువలో కేవలం 405 క్యూసెక్కుల ప్రవాహానికే పాసేజ్ పిల్లర్ కూలిపోవడం చర్చనీయాంశమయ్యింది. నీటి ప్రవాహం కారణంగా పిల్లర్ల కింద మట్టి కొట్టుకుపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని, నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టుర్తో 15 రోజుల్లోగా రిపేర్లు చేయిస్తామని ఇంజనీర్లు చెబుతున్నారు. తెరపైకి ఎస్కేప్ చానల్.. గతేడాది నిర్వహించిన ట్రయల్ రన్‌కు ముందు ప్రధాన కాలువను ఆసాంతం పరిశీలించగా మొదటి, రెండో పంప్‌హౌస్‌ల మధ్య రెండు, మూడు చోట్ల గండి పడిన విషయం వెలుగు చూసింది. అయితే వర్షపు నీరు నిలవడం వల్ల కాలువకు తామే గండ్లు కొట్టామంటూ ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. అయితే గత ఆగస్టు 15న పంప్‌హౌస్‌లు ప్రారంభించే సమయానికి ఆ గండ్లను పూడ్చేశారు. అయితే సెప్టెంబర్ 1న భారీ వర్షాలు కురవడంతో పాల్వంచ మండలం బండ్రుగొండ వద్ద గండి పడగా రెండురోజుల తర్వాత చండ్రుగొండ మండలంలో మరో గండి పడి పొలాలు నీట మునిగాయి. దీంతో కాలువ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాల కారణంగానే గండ్లు పడుతున్నాయనే విమర్శలు వచ్చాయి. కాగా ప్రధాన కాలువలోకి వచ్చే అదనపు నీటి ప్రవాహాలను బయటకు పంపేందుకు కొత్తగా రూ.60 కోట్ల వ్యయంతో ఎస్కేప్ చానల్ నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయడం గమనార్హం. ఖరీఫ్‌లో నీరు పారేనా ? గత ఖరీఫ్‌లో గోదావరి నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆయకట్టుకు ఇవ్వాలని భావించినా..వర్షాల కారణంగా ఆ అవసరం పడలేదు. ఈ రబీ సీజన్‌కు ఎత్తిపోతలు మొదలెట్టినా గోదావరిలో సరిపడా నీరు లేక మధ్యలోనే ఆగిపోయింది. వచ్చే ఖరీఫ్ సీజన్లో కచ్చితంగా గోదావరి జలాలు పొలాలకు పారుతాయనే అంచనాలు నెలకొనగా కీలకమైన ప్రధాన కాలువలో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో వాటిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు పూర్తి స్థాయిలో నీటిని వదిలే ముందు ప్రధాన కాలువ పటిష్టతను పరిశీలించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. Tue, Apr 15 2025 5:58 AM

సాక్షి, హైదరాబాద్: వేసవి కాలంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ముఖ్యమంత్రి కోరారు. తాగునీటి సరఫరా విషయంలో నీటి పారుదల శాఖ, తాగునీటి సరఫరా శాఖ, విద్యుత్ శాఖ సమన్వయంతో పని చేయాలని చెప్పారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీహెచ్ఆర్డీ)లో సోమవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో వేసవి తాగునీటి ప్రణాళిక, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు తదితర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.కలెక్టర్లు డ్యాష్ బోర్డు ద్వారా ప్రతి గ్రామంలో తాగునీటి వనరులు, సరఫరాను పర్యవేక్షించాలని సూచించారు. ఎక్కడైనా సమ స్య తలెత్తితే పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉండాలని చెప్పారు. పలు గ్రామాలకు తాగు నీటి సరఫరా పైపులైను వ్యవస్థ లేదని, పలు ఇళ్లకు నల్లాలు లేవని.. ఆయా ప్రాంతాల్లోనూ తాగునీటి సమస్య రాకుండా చూడాలని అన్నారు. కోయగూడేలు, చెంచు పెంటలు, ఇతర గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. భూభారతిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి గతంలో రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోకుండా రైతులను న్యాయస్థానాల మెట్లు ఎక్కించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా విస్తృత అధ్యయనం తర్వాత తీసుకువచ్చిన భూభారతి చట్టం అమల్లోకి రావడంతో రెవెన్యూ యంత్రాంగమే ఇకపై ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని స్పష్టం చేశారు. దీనిపై అప్పీల్ వ్యవస్థ ఉన్న విషయాన్ని రైతులు, ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.ఈ చట్టాన్ని క్షేత్ర స్థాయికి సమర్థంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రతి మండలంలో సదస్సు నిర్వహించాలని, ప్రతి జిల్లా కలెక్టర్ మండల స్థాయి సదస్సులకు హాజరై అక్కడ రైతులు, ప్రజలు లేవనెత్తే సందేహాలకు వారికి అర్థమ య్యే భాషలో వివరించి పరిష్కారం చూపాలని చెప్పారు. భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, ఈ రెండింటినీ క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.భూభారతి చట్టాన్ని కలెక్టర్లు సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. భూభారతి పైలెట్ ప్రాజెక్టు సదస్సులను నారాయణపేట జిల్లా మద్దూర్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాల్లో నిర్వహిస్తారని, ఆయా మండల కేంద్రాల్లో సదస్సులకు కలెక్టర్లు కచ్చితంగా హాజరుకావాలని, ఆ మండలాల్లోని ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బందితో సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. వీటికి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర మంత్రులు హాజరవుతారని తెలిపారు.ఇళ్ల మంజూరులో ఒత్తిళ్లకు తలొగ్గొద్దు గ్రామ స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఆమోదం పొందిన జాబితాను మండల స్థాయి కమిటీలు పరిశీలించాలని సీఎం సూచించారు. అనంతరం జిల్లా ఇన్చార్జి మంత్రికి పంపాలని.. ఇన్చార్జి మంత్రి ఆమోదించాకే ఇళ్ల జాబితా ఖరారవుతుందని చెప్పారు. సరైన పర్యవేక్షణకు వీలుగా ప్రతి నియో జకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. ఈప్రత్యేకాధికారి ఇందిరమ్మ కమి టీలు, మండల కమిటీలు, కలెక్టర్లు, ఇన్చార్జి మంత్రి మధ్య సమన్వయకర్తగా ఉంటారని రేవంత్ వివరించారు.గతంలో ఉమ్మడి జిల్లాకు నియమించిన సీనియర్ అధికారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించాలని, ఆయా జిల్లాల కలెక్టర్లతో కలిసి పర్యవేక్షించాలని సూచించారు. ఇళ్ల మంజూరులో ఏ దశలోనూ ఎవరూ ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గ వద్దని, ఎక్కడైనా అనర్హులకు ఇళ్లు కేటాయిస్తే మండల స్థాయి క మిటీ, ప్రత్యేకాధికారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించా రు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించినందున జనాభా ప్రాతిపదికన, ఆయా గ్రామాలకు ఇళ్ల కేటాయింపు ఉండాలని, ఈ విషయంలో హేతుబద్ధత పాటించాలని సూ చించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూ పల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, సీఎం సలహాదా రు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, షబ్బీర్ అలీ, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Tue, Apr 15 2025 1:36 AM

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లారు. ఆయన నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి జపాన్‌కు బయలుదేరి వెళ్లింది. ఈ బృందంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఉన్నారు. ఈ నెల 16 నుంచి 22 వరకు జపాన్‌లోని టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో ఆ బృందం పర్యటించనుంది.ఒసాకా వరల్డ్ ఎక్స్పో–2025లో తెలంగాణ పెవిలియన్‌ను సీఎం ప్రారంభిస్తారు. ఆ దేశానికి చెందిన ప్రముఖ కంపెనీలు, పారిశ్రామి క వేత్తలు, పలువురు ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై చర్చించనున్నారు. 16న టోక్యో చేరుకుని అక్కడి భారత రాయబారి ఇచ్చే ఆతిథ్య సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. 17న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ కార్పొరేషన్, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్ తదితర సంస్థలతో సమావేశం కానున్నారు. సాయంత్రం తోషిబా ఫ్యాక్టరీని సందర్శిస్తారు. 18న టొయోటా, తోషిబా సీఈవోలతో భేటీసీఎం రేవంత్‌రెడ్డి 18న టోక్యోలో గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. టోక్యో గవర్నర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు. అనంతరం ఇండియన్ ఎంబసీ ఆధ్వ ర్యంలో పారిశ్రామికవేత్తలతో నిర్వహించే భేటీలో సమావేశ మవు తారు. టొయోటా, తోషిబా, ఐసిన్, ఎన్టీటీ వంటి ప్రఖ్యాత కంపెనీల సీఈవోలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తా రు. జపాన్ ఓవర్సీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొ రేషన్ ఫర్ ట్రాన్స్‌ఫోర్ట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రతినిధులతో చర్చలు జరుపుతారు.అనంతరం సుమిదా రివర్ ఫ్రంట్‌ను సందర్శిస్తారు. 19న టోక్యో నుంచి బయలు దేరి మౌంట్ ఫుజి, అరకురయామా పార్క్‌ను సందర్శిస్తారు. 20న కిటాక్యూషు సిటీకి చేరుకుని అక్కడి మేయర్‌తో సమావేశమై ఎకో టౌన్ ప్రాజెక్టుకు సంబంధించి చర్చిస్తారు. మురసాకి రివర్ మ్యూజియం, ఎన్విరాన్మెంట్ మ్యూజి యం, ఎకో టౌన్ సెంటర్‌ను సందర్శిస్తారు. 21న ఒసాకా చేరుకుని యుమెషిమాలో వరల్డ్ ఎక్స్‌పోలో తెలంగాణ పెవి లియన్ను ప్రారంభించి బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొంటారు.అనంతరం ఒసాకా రివర్ ఫ్రంట్‌ను సందర్శిస్తారు. 22న ఒసాకా నుంచి హిరోషిమా చేరుకుని అక్కడి పీస్ మెమోరియల్‌ను సందర్శించి గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్‌తో సమావేశాలు జరుపుతారు. హిరోషిమా జపాన్ – ఇండియా చాప్టర్‌తో బిజినెస్ లంచ్‌లో పాల్గొంటారు. హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మజ్డా మోటార్స్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. అనంతరం ఒసాకా నుంచి బయలు దేరి 23న ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంటారు. Wed, Apr 16 2025 5:16 AM
హైదరాబాద్: భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు, తాగు నీటి సరఫరా అంశాల్లో నిర్లక్ష్యం సహించమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు(సోమవారం) కలెక్టర్లతో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘భూ భారతి చట్టంపై కలెక్టర్లకు పూర్తి అవగాహన ఉండాలి. జిల్లాలోని ప్రతీ మండలంలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులకు కలెక్టర్లు హాజరు కావాల్సిందే. చట్టంపై ప్రజలకు సరళంగా వివరించాలి.ప్రతీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ప్రతీ నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలి. జిల్లా ఇంచార్జి మంత్రి ఆమోదం తరువాతే తుది లబ్ధిదారుల జాబితా ప్రకటించాలి. తాగునీటి సరఫరా విషయంలో జిల్లాల్లో వేసవి యాక్షన్ ప్లాన్ ను అమలు చేయాలి. నీటి లభ్యత ఆధారంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించండి. ఎక్కడా తాగు నీటి సమస్య రాకూడదు. ఎప్పటికప్పుడు నీటిపారుదల శాఖతో సమన్వయం చేసుకుంటూ తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. Mon, Apr 14 2025 7:09 PM

సాక్షి, హైదరాబాద్: ఆధార్ తరహాలో భూధార్ పేరిట రాష్ట్రంలోని ప్రతి భూ కమతానికి ఓ ప్రత్యేకమైన నంబర్ కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రతి వ్యవసాయ భూమికి పక్కా కొలతలతో సరిహద్దులు నిర్ణయించి భూధార్ నంబర్ ఇవ్వడం వల్ల రైతుల భూములకు పూర్తి భరోసా లభిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులు నిర్ణయించి సొంత రాష్ట్రం సాధించుకున్న రెవెన్యూ ఉద్యోగులకు రైతుల భూములకు సరిహద్దులు నిర్ణయించి భూధార్ కార్డులు ఇవ్వడం కష్టమేమీ కాదని అన్నారు. ‘ధరణి’ స్థానంలో రూపొందించిన కొత్త ఆర్ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టం ‘భూ భారతి’ పోర్టల్‌ను సోమవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. భూ రికార్డులు ‘రెవెన్యూ’ ఘనతే..: ‘తెలంగాణ ప్రాంతంలో పోరాటాలన్నీ భూమితోనే ముడిపడి ఉన్నాయి. కొమురం భీమ్ జల్ జమీన్ జంగిల్ పోరాటం నుంచి చాకలి అయిలమ్మ, దొడ్డి కొమురయ్య వరకు సాగించిన పోరాటాలు, సాయుధ రైతాంగ పోరాటం, కమ్యూనిస్టు సోదరుల పోరాటాలన్నీ భూమి కోసమే జరిగాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు నుంచి పీవీ నరసింహారావు వరకు ఎందరో భూసంస్కరణలు తెచ్చారు. ఇందిరాగాంధీ నేతృత్వంలో దేశంలో వచ్చిన భూ సంస్కరణల ద్వారా వివిధ మార్గాల్లో ప్రజలు సొంతం చేసుకున్న భూములకు సంబంధించిన రికార్డులన్నింటినీ రెవెన్యూ శాఖనే రూపొందించింది. పటా్వరీ వ్యవస్థ పోయిన తర్వాత వీఆర్ఓ, వీఆర్ఏలే రైతుల భూముల వివరాలు సేకరించి భద్రపరిచారు. 95 శాతం భూముల వివరాలను ప్రక్షాళన చేసి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు..’ అని సీఎం తెలిపారు. ధరణి ప్రజల పాలిట భూతంగా మారింది ‘తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉన్న ఫళంగా అప్పటి ప్రభుత్వం చట్టాలను మార్చింది. గత పాలకులు రెవెన్యూ చట్టాలను మార్చి తెచ్చిన ధరణి పోర్టల్ ప్రజల పాలిట భూతంగా మారింది. ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్ పైనే పెట్రోల్ పోసి తగలబెడితే, సిరిసిల్లలో ఓ మహిళ తన భూమి కోసం తహసీల్దార్‌కు తన తాళిబొట్టును లంచంగా ఇవ్వజూపింది. ఈ విధంగా ప్రజల బాధలకు కారణమైన ధరణిని బంగాళాఖాతంలో విసిరేసి, కొత్త ఆర్ఓఆర్ చట్టం తెస్తామని ఎన్నికలకు ముందు పాదయాత్రల్లో నేను, భట్టి విక్రమార్క ప్రజలకు హామీ ఇచ్చాం. కొత్త చట్టం పేదలకు చుట్టంగా ఉండాలని ఎంతో శ్రమించి ‘భూ భారతి’ని తీసుకొచ్చాం. తెలంగాణలో వివాద రహిత భూ విధానం తేవాలన్న మా లక్ష్యానికి అనుగుణంగా ఈ చట్టం తెచ్చాం. ప్రజలకు అనుకూలమైనదిగా దీన్ని తీర్చిదిద్దాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూ భారతిని ప్రారంభిస్తున్నాం. ఈ చట్టాన్ని ఖమ్మంలో లక్ష మంది ప్రజల సమక్షంలో ప్రజలకు అంకితం చేద్దామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెబితే, నేను రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమక్షంలోనే చట్టం అమలు ప్రక్రియను ప్రారంభిద్దామని చెప్పా. ఈ ప్రభుత్వం రెవెన్యూ అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని గౌరవిస్తుంది..’ అని రేవంత్ చెప్పారు. గత ప్రభుత్వం తమ స్వార్ధం కోసం చట్టాన్ని మార్చింది.. ‘గతంలో ధరణిని తీసుకువచ్చిన పాలకులు రెవెన్యూ సిబ్బందిని దోషులుగా, దోపిడీదారులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. 70 ఏళ్లుగా ప్రజల భూములను కాపాడిన రెవెన్యూ సిబ్బంది ధరణి వచ్చిన తర్వాత మీకు దోపిడీదారులుగా కనిపించారా? చట్టాలను చుట్టాలుగా మార్చుకుని వేలాది ఎకరాలు కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా? సమాజంలోని ప్రతి వ్యవస్థలో రెవెన్యూ నుంచి రాజకీయ నాయకుల వరకు 5 నుంచి 10 శాతం వరకు చెడ్డవారు ఉంటారు. చెడ్డవాళ్లను శిక్షించుకుంటూ ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు పోవాలి. కానీ గత ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందిని దోషులుగా చూపించి తమ స్వార్థం కోసం చట్టాన్ని మార్చింది. ఆనాటి ముఖ్యమంత్రి రెవెన్యూ అధికారులపై అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడారో మీకు తెలుసు. మేం అవినీతికి పాల్పడే వ్యక్తుల విషయంలో కఠినంగా ఉంటాం.. కానీ వ్యవస్థపై కాదు. గత పాలకుల్లా..మేం చేసే తప్పులకు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే విధానానికి నేను వ్యతిరేకం..’ అని సీఎం అన్నారు. కలెక్టర్లు గ్రామ గ్రామానికి వెళ్లాలి ‘రెవెన్యూ అధికారులపై దురుద్దేశంతో కొందరు కల్పించిన అపోహలను తొలగిద్దాం. మేం తెచ్చిన చట్టాలను మీరు అమలు చేస్తారు. 69 లక్షల మంది రైతులకు ప్రభుత్వం, రెవెన్యూ విభాగం రెండు కళ్లు లాంటివి. కలెక్టర్ల నుంచి సిబ్బంది వరకు గ్రామ గ్రామానికి వెళ్లండి. దోషులుగా చిత్రీకరించిన విధానానికి వ్యతిరేకంగా ఎవరి భూమి వారికి లెక్క కొద్దీ ఇద్దాం. కలెక్టర్లు ప్రతి మండలంలో పర్యటించాలని ఈ వేదిక నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. అందరి సహకారంతో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి. భూభారతిని పైలెట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో చేపడుతున్నాం . నాలుగు మండలాల్లో వచ్చిన ఫీడ్‌బ్యాక్ తీసుకుని లోపాలు ఏమైనా ఉంటే సవరించుకున్న తర్వాత అన్ని జిల్లాల్లోని అన్ని మండలాల్లో భూ సమస్యలు పరిష్కరించుకుందాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. Tue, Apr 15 2025 12:49 AM
సాక్షి, హైదరాబాద్: ‘మన ప్రభుత్వానికి మంచి పేరు, సాఫీగా నడిచే విధంగా ఆదాయం రావడం బీఆర్ఎస్, బీజేపీలకు ఇష్టం లేదు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఆ రెండు పారీ్టలు కలిసి చేసిన కుట్రలే ఇందుకు నిదర్శనం. మనం కోర్టులో గెలిచి ఆ భూములను తీసుకువచ్చాం. మొత్తం 2,200 ఎకరాల్లో మన ప్రభుత్వం క్లెయిమ్ చేస్తోంది 400 ఎకరాలే. మిగిలిన భూముల జోలికి వెళ్లడం లేదు. ఆ 400 ఎకరాల్లో ఐటీ టవర్స్ నిర్మించే ఆలోచనలో ఉన్నాం. అలా జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది. ఉద్యోగాలు కూడా వస్తాయి. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా కిషన్‌రెడ్డికి చెప్పాడు. కిషన్‌రెడ్డి అమిత్‌షాకు చెపితే అమిత్‌షా మోదీకి చెప్పాడు. మన పథకాలు ప్రధానిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఆయన రంగంలోకి దిగారు. బుల్డోజర్లు, జేసీబీలకు తేడా తెలియదన్నట్టు మాట్లాడుతున్నారు. అందరూ కలిసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. దేశంలో గుజరాత్ మోడల్ పోయింది. తెలంగాణ మోడల్ ప్రచారంలోకి వస్తోంది. ముఖ్యంగా కులగణన గేమ్ ఛేంజర్ అయింది. రేపు జరిగే బిహార్ ఎన్నికల్లో ముఖ్యపాత్ర పోషించబోతోంది. ప్రధాని మోదీకి ఇది రాజకీయంగా మరణశాసనం కాబోతోంది..’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పి) సమావేశంలో ఆయన మాట్లాడారు. కళ్లు కుడుతున్న ప్రతిపక్షాలను కట్టడి చేయాలి ‘సన్న బియ్యం, ఎస్సీల వర్గీకరణ, కులగణన, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు లాంటి అద్భుత కార్యక్రమాలతో ముందుకెళుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దు్రష్పచారం చేస్తున్నాయి. కళ్లు కుడుతున్న ప్రతిపక్షాలను కట్టడి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మీరు మళ్లీ గెలవాలంటే ఏం కావాలో అడగండి ఎవరైనా సరే పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండాలి. నేనైనా, డిప్యూటీ సీఎం భట్టి అయినా పార్టీ చెప్పిన మేరకే పనిచేస్తాం. ప్రభుత్వంతో పాటు పార్టీ బలంగా ఉంటేనే మరోసారి గెలుస్తాం. మీరు రెండోసారి గెలవాలంటే మీ నియోజకవర్గంలో ఏం కావాలో నివేదిక తయారు చేసుకోండి. అవసరమైతే కన్సల్టెంట్‌ను పెట్టుకోండి. మే 1 నుంచి మీకు అందుబాటులో ఉంటా. మీ నివేదికలు నాకివ్వండి. నేను కూడా వెరిఫై చేసుకుని నిధులు కేటాయిస్తా. మీ నియోజకవర్గాలకు వస్తా. పాదయాత్రలా, కార్నర్ మీటింగ్‌లా, బహిరంగ సభలా.. ఏం పెడతారో మీ ఇష్టం. ఈ విషయంలో డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు కార్యాచరణ ఇస్తారు. జూన్ 2 నుంచి జనాల్లోకి వస్తా.. నేను కూడా జూన్ 2 వరకు జనాల్లోకి వస్తా. మన ప్రభుత్వం ఏం చేస్తోందో ప్రజలకు వివరిద్దాం. సన్న బియ్యం పథకంతో ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వస్తోంది. సన్నబియ్యం కాంగ్రెస్ పార్టీ పథకం. ఇది పేటెంట్, మన బ్రాండ్. సన్న బియ్యంతో పాటు ఎస్సీల వర్గీకరణ, కులగణన, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ విషయంలో ఇన్చార్జి మంత్రులు కీలక పాత్ర పోషించాలి. పార్టీ ప్రతిష్టను ఎవరూ దెబ్బతీయొద్దు..’ అని రేవంత్ అన్నారు. భారత్ సమ్మిట్‌కు రాహుల్, ప్రియాంక ‘మంత్రివర్గ విస్తరణను రిజర్వుడ్ ఫర్ జడ్జిమెంట్ తరహాలో అధిష్టానం ఫ్రీజ్ చేసింది. ఎవరేం చెప్పుకోవాలన్నా హైకమాండ్‌కు చెప్పుకోవాలి. భువనగిరి ఎంపీ కిరణ్‌రెడ్డి తను వెళ్లిన చోటల్లా ఒక మంత్రిని ప్రకటిస్తున్నాడు. అది సరైంది కాదు. అద్దంకి దయాకర్ చాలా ఓపికగా వెయిట్ చేశాడు. పార్టీ లైన్లో పనిచేశాడు. అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెలలో నిర్వహించే భారత్ సమ్మిట్‌కు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాం«దీలు వస్తున్నారు. అంతర్జాతీయ ప్రతినిధులు కూడా వస్తారు. పీసీసీ అధ్యక్షుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతను మంత్రులకివ్వాలి..’ అని సీఎం చెప్పారు. అవి వారి అస్తిత్వానికే ప్రమాదం: డిప్యూటీ సీఎం భట్టి రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. సంక్షేమం ఒక ఎత్తయితే ఎస్సీల వర్గీకరణ, బీసీల కులగణన కార్యక్రమాలను గొప్ప గొప్ప నాయకులే చేయలేకపోయినా, తెలంగాణ ప్రభుత్వం ధీరోదాత్తంగా చేసిందని అన్నారు. ఇవి బీఆర్ఎస్, బీజేపీలను కట్టి మూలన పడేస్తాయని, వారి అస్తిత్వానికే ప్రమాదంగా మారనున్నాయని వ్యాఖ్యానించారు. సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు సీఎం చెక్కులు అందజేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్‌నాయక్‌లను అభినందించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కూడా హాజరయ్యారు. బెంబేలెత్తించిన లిఫ్ట్ సీఎల్పీ సమావేశం జరిగే రెండో అంతస్తుకు వెళ్లేందుకు గాను సీఎంతో పాటు పలువురు నేతలు లిఫ్ట్ ఎక్కారు. రెండో అంతస్తుకు వెళ్లిన ఆ లిఫ్ట్ అకస్మాత్తుగా మళ్లీ వేగంగా కిందకు వచ్చింది. దీంతో గాభరాపడిన వారంతా మరో లిఫ్ట్‌లో సమావేశ హాలుకు వెళ్లారు. Wed, Apr 16 2025 3:57 AM
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో పోరాటలన్నీ భూమితోనే ముడిపడి ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు(సోమవారం) భూ భారతి పోర్టల్ ను ఆవిష్కరించారు సీఎం రేవంత్.. దీనిలోభాగంగా మాట్లాడుతూ.. ‘కొమురం భీమ్ జల్ జమీన్ జంగిల్ పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం, కమ్యూనిస్టు సోదరుల పోరాటాలన్నీ భూమి కోసమే జరిగాయి. గత పాలకులు రెవెన్యూ చట్టాలను మార్చి తెచ్చిన ధరణి ప్రజల పాలిట భూతంగా మారింది. తహసీల్దార్ పైనే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. రెవెన్యూ అధికారులను దోపిడీదారులుగా చిత్రీకరించి లబ్ది పొందాలని ఆనాటి పాలకులు ఆలోచన చేశారు. చట్టాలను చట్టాలుగా మార్చుకుని వేలాది ఎకరాలు కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా?, అందుకే పేదలకు మేలు చేసేందుకు నూతన ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొచ్చాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూ భారతిని ప్రారంభించుకున్నాం. పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో చేపడుతున్నాం. వివాద రహిత భూ విధానాలను తీసుకురావాలని మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూఅధికారులపైనే ఉంది. రెవెన్యూ అధికారులను ప్రజలకు చేరువ చేయాలనేదే మా ఉద్దేశం. గత పాలకుల్లా మిమ్మల్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ఆలోచనకు మేం వ్యతిరేకం. ఆనాటి ముఖ్యమంత్రి రెవెన్యూ అధికారులపై అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడారో మీకు తెలుసు. మేం అవినీతికి పాల్పడే వ్యక్తులపైన కఠినంగా ఉంటాం.. కానీ వ్యవస్థపై కాదు.మేం చేసే తప్పులకు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే విధానానికి నేను వ్యతిరేకం. భవిష్యత్ లో ఆధార్ లాగే భూమికి సంబంధించి భూధార్ తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో వ్యవసాయ భూములను సర్వే చేసి కొలతలు వేసి హద్దులు గుర్తిస్తాం. రెవెన్యూ అధికారులపై దురుద్దేశంతో కొందరు కల్పించిన అపోహలను తొలగిద్దాం కలెక్టర్లు ప్రతీ మండలంలో పర్యటించాలని ఈ వేదికగా స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. అందరి సహకారంతో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి’ అని సీఎం రేవంత్ విజ్క్షప్తి చేశారు. Mon, Apr 14 2025 8:59 PM
హైదరాబాద్: నోవాటెల్ హోటల్ లో సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కిన లిఫ్ట్ లో స్వల్ప అంతరాయం ఏర్పడి కాస్త కిందకు కుంగిపోయింది. ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో లిఫ్ట్ మొరాయించింది. లిఫ్ట్ మొరాయించడమే కాకుండా ఓవర్ వెయిట్ కారణంగా ఉండాల్సిన ఎత్తు కంటే కొంత లోపలికి దిగిపోయింది. దీంతో సీఎం రేవంత్ సహా అధికారులు, సిబ్బంది ఆందోళన చెందారు. కాసేపు అంతా అయోమయానికి గురయ్యారు.ఈ క్రమంలోనే హోటల్ సిబ్బంది, సీఎం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ లిఫ్ట్ ను ఓపెన్ చేసి వేరే లిఫ్ట్ లో సీఎం రేవంత్ ను పంపారు. ఈరోజు(మంగళవారం) నోవాటెల్ హోటల్ లో జరిగిన సీఎల్పీ సమావేశంలో భాగంగా రేవంత్ అక్కడకు హాజరైన క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పార్టీలోని నేతలకు సీఎం రేవంత్ వార్నింగ్సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్.. పార్టీలో నిరసన గళం వినిపిస్తున్న నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక్కడ ఎవరూ పేర్లు ప్రస్తావించకుండా రేవంత్ ఆయా నేతలను ఉద్దేశించి మాట్లాడారు. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుంది. మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కుంటారు’’ అంటూ రేవంత్ తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిస్థానం నిర్ణయమే ఫైనల్. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు.గతద్ది రోజులుగా పార్టీలో పదవులు తమకు కావాలంటే తమకు కావాలనే వార్ నడుస్తోంది. ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులు పార్టీ పదవులపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే తమకు పదవులు రావేమోననే భయం కూడా వారిలో ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా అధిష్టానానిని తమదైన శైలిలో హెచ్చరికలు పంపుతున్నారు. దీనిపై రేవంత్ తీవ్రంగా స్పందించారు. మీ మాటల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అంటూ తేల్చిచెప్పారు. ఇదీ చదవండి: అధిష్టానానికి మళ్లీ తలనొప్పిగా మారిన పదవుల పంచాయితీ! Tue, Apr 15 2025 3:30 PM

సాక్షిప్రతినిధి, ఖమ్మం: భూభారతి పోర్టల్ రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం, నారాయణ పేట జిల్లా మద్దూరు మండలం, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం, ములుగు జిల్లా వెంకటాపురం మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. భూమి రిజిస్ట్రేషన్లు, మ్యుటే షన్, నాలా మార్పులు, చేర్పులు, అప్పీల్, రివిజన్ తదితర సమస్యల పరిష్కా రానికి భూభారతి పోర్టల్ వేదిక కానుంది. పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తొలిరోజు మంగళవారం దీనిపై నేలకొండపల్లి తహసీల్‌లో అవగా హన సదస్సు నిర్వహించారు. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు నేలకొండపల్లి మండలంలోని 23 రెవెన్యూ గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో రికార్డుల సవరణతో పాటు రైతుల భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ మండలంలో 37,405 ఎకరాల సాగు భూమి ఉండగా, సాదాబైనామా కింద 3,417 దరఖాస్తులు వచ్చాయి. అలాగే ధరణిలో రిజి స్ట్రేషన్‌కు సంబంధించి 150 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.వీటిని రెవెన్యూ అధికారులు భూభారతి ద్వారా పరిష్కరించనున్నారు. పలువురు రైతులు పోర్టల్ వివరాలు తెలుసుకునేందుకు తహసీ ల్దార్ కార్యాలయానికి వచ్చారు. ఈ విషయమై నేల కొండ పల్లి తహసీల్దార్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభు త్వం భూభారతి పోర్టల్ ద్వారా భూ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయన్నారు.స్లాట్ బుకింగ్ విధానానికి వ్యతిరేకంగా..నేటినుంచి డాక్యుమెంట్ రైటర్స్ నిరసనలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచ నను విరమించుకోవాలని తెలంగాణ డాక్యుమెంట్ రైటర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానం విఫలమైందన్నారు. దీన్ని గుర్తించి స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనివల్ల వినియోగదారులు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. దస్తావేజులు రాస్తూ ఎంతో మంది ఉపాధి పొందుతున్నారని, వారంతా రోడ్డున పడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ డాక్యుమెంట్ రైటర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు రాష్ట్రంలోని యాదగిరిగుట్ట, ఘట్కేసర్, నారపల్లి, మేడ్చల్, సంగారెడ్డి, రాజేంద్రనగర్, చంపాపేట్, ఎల్బీనగర్, చిక్కడపల్లి, మల్కాజిగిరి, చౌటుప్పల్, సూర్యాపేట, జనగామ సబ్‌రిజిస్టార్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు.సర్వే మ్యాప్‌లు ఇప్పుడే కాదు!రిజిస్ట్రేషన్లతోపాటు సర్వే మ్యాప్ కోసం తర్వాత నోటిఫికేషన్అప్పటివరకు మ్యాప్‌లు లేకుండానే రిజిస్ట్రేషన్లుసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భూభారతి చట్టం ద్వారా జరిగే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు ఇప్పటికిప్పుడు సర్వే మ్యాప్‌లు అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమల వుతున్న విధంగానే అవసరమైన డాక్యుమెంట్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతా యని వెల్లడించాయి. అయితే, ప్రభుత్వం భూమి మ్యాపింగ్ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తుందని, అప్పుడు లైసెన్సుడ్ సర్వేయర్ల చేత సర్వే చేయించి, భూమి హద్దులను అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా నిర్ధారించి మ్యాప్ ఇస్తారని పేర్కొన్నాయి. అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ల సమయంలో కచ్చితంగా సర్వే మ్యాప్ అవసరమవుతుందని, అప్పటివరకు మ్యాప్‌లు లేకుండానే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని తెలిపా యి. చట్టం మార్గదర్శకాల్లోనూ ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వం నోటిఫై చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతోపాటు మ్యాప్ అవసర మవుతుందని పలు సెక్షన్లలో ప్రస్తావించారు.పోర్టల్‌లో ఏం మారింది?ధరణి పోర్టల్ స్థానంలో వచ్చిన భూభారతిలో ఏముందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. సోమ, మంగళవారాల్లో ఈ పోర్టల్‌ను దాదాపు 2.20 లక్షల మంది వీక్షించారు. భూభారతి పోర్టల్ వెబ్‌పేజీపై ఎడమ వైపు సీఎం రేవంత్‌రెడ్డి, కుడి వైపున రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫొటోలు, మధ్యలో తెలంగాణ ప్రభుత్వ చిహ్నం, తెలంగాణ తల్లి ఫొటో ఉన్నాయి. ఆకుపచ్చ రంగు ఎక్కువగా కనిపించే ఈ పోర్టల్‌ను ఓపెన్ చేయగానే సీఎం రేవంత్‌రెడ్డి సందేశం కనిపిస్తోంది. ఆ తర్వాత పొంగులేటి సందేశం, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు (లాగిన్), సమాచారం (ప్రజల కోసం), భూధార్, భూమిత్ర, భూపరిపాలన శాఖ, ప్రభుత్వ భూముల రక్షణ, దస్తావేజు రిజిస్ట్రేషన్ మార్గదర్శకాల గురించిన వివరాలు పొందుపరిచారు. భూమిత్ర పేరుతో కొత్తగా చాట్‌బాట్ ఏర్పాటు చేసినప్పటికీ, అది ఇంకా అందుబాటులోకి రాలేదు.ధరణిలాగే ప్రజలు తరచూ అడిగే ప్రశ్నలు, వాటికి సమాధానాలను ఇచ్చారు. భూముల మార్కెట్ విలువ, భూముల వివరాలు, నిషేధిత భూములు, ఈ చలాన్, దరఖాస్తుల పురోగతి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) నేతృత్వంలో ఈ పోర్టల్‌ను తెలుగుతోపాటు ఇంగ్లిషు భాషలో కూడా రూపొందించారు. Wed, Apr 16 2025 1:01 AM

సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా లక్షల మందిని బలితీసుకుంటున్న రోడ్డు ప్రమాదాలను నిరోధించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత ప్రమాదకర ట్రాఫిక్ ఉల్లంఘనలపై కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో పనిచేసే సీసీ కెమెరాలను వినియోగించేలా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను రూపొందించాలని ఆదేశించింది. తొలిదశలో ఆ నాలుగు రకాలపై... కేంద్ర రోడ్డు రవాణా ఉపరితల మంత్రిత్వ శాఖ తొలిదశలో నాలుగు రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలపై దృష్టి సారించింది. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపడం, వన్ వే, రాంగ్ రూట్లలో దూసుకురావడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ను కట్టడి చేయడానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించడానికి ఏఐతో కూడిన సీసీ కెమెరాలను వినియోగించాలని చెప్పింది. హైరిస్క్ ఏరియాలు గుర్తించి, ఏర్పాటు తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే హైరిస్క్ ప్రాంతాల్లో అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. బ్లాక్ స్పాట్స్‌గా పిలిచే ఆ ప్రాంతాల గుర్తింపు కోసం సైతం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలు, రాష్ట్ర రహదారుల్లో ఒక కిలోమీటర్ పరిధిలో మూడేళ్లలో మూడు కంటే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగితే అది హైరిస్క్ కారిడార్ కిందికు వస్తుంది. పట్టణ, నగరాల్లోని రహదారుల్లో 100 మీటర్ల పరిధిలో మూడేళ్లలో రెండు ప్రమాదాలు జరిగినా, ఇతర ప్రధాన రహదారులు, జిల్లా రోడ్లపై 500 మీటర్ల పరిధిలో మూడేళ్ల వ్యవధిలో రెండు యాక్సిడెంట్లు జరిగినా, విద్యాసంస్థలు ఉన్న ప్రాంతాల్లో 100 మీటర్ల పరిధిలో మూడేళ్లలో రెండు ప్రమాదాలు జరిగినా వాటిని హైరిస్క్ జాబితాలో చేర్చాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల్లో కచి్చతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. నామమాత్రంగా కాకుండా... హైదరాబాద్‌తోపాటు ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో సీసీ కెమెరాల వినియోగం విస్తృతమైంది. కానీ వాటిలో అత్యధికం నామమాత్రంగానే ఉంటున్నాయి. ఏదైనా ఉదంతం జరిగినప్పుడో లేదా పోలీసు కేసుల దర్యాప్తులో అవసరమైనప్పుడో మాత్రమే వాటిలోని లోపాలు బయటపడుతున్నాయి. కావాల్సిన కోణంలో వీడియోలు రికార్డు కాకపోవడమో లేదా రికార్డు అయినప్పటికీ విశ్లేషణకు అవసరమైన స్పష్టత లోపించడం పరిపాటిగా మారింది. చాలాచోట్ల కనీసం 50 శాతం సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం ఏఐ ఆధారిత సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రమాణాలు నిర్దేశించింది. ఆయా కెమెరాలు ఎల్లవేళలా వీడియోలు రికార్డు చేసేలా, ఏదైనా వాహనం గంటకు 200 కి.మీ. వేగంతో దూసుకెళ్లినా స్పష్టంగా ఆయా చిత్రాలను నమోదు చేసే సామర్థ్యం కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అంతా ఆటోమేటిక్‌గా పనిచేసేలా... ఏఐ ఆధారిత సీసీ కెమెరాలతోపాటు వాటి సర్వర్లలో మరికొన్ని హంగులు కూడా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. హైరిస్క్ ఏరియాలపై నిత్యం నిఘా ఉంచేలా సాంకేతిక పరిజ్ఞానం సీసీ కెమెరాల్లో పొందుపరచాలని సూచించింది. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులను గుర్తించి ఈ–చలాన్లు జారీ చేయడంతోపాటు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దాన్ని గుర్తించి సంబంధిత విభాగాలను అప్రమత్తం చేస్తూ సందేశం పంపాలని పేర్కొంది. ఆయా కారిడార్లలో ఉల్లంఘనల తీరుతెన్నుల్ని సాంకేతికంగా అధ్యయనం చేయాలని చెప్పింది. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసిన లేదా వాటిని సస్పెండ్ చేసిన వాహనదారుల వివరాలు కలిగి ఉండటంతోపాటు బీమా వివరాలు సర్వర్‌లో నిక్షిప్తమై ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. 2014 తర్వాత ఈ దిశగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొన్ని చర్యలు చేపట్టారు. ఐటీఎంఎస్, హెచ్–ట్రిమ్స్ తదితర పేర్లతో కొన్ని ప్రాజెక్టులు చేపట్టారు. వాటిలో సీసీ కెమెరాల ఏర్పాటు వరకు సమర్థంగా పూర్తయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం నిక్షిప్తం చేయడం మాత్రం పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో మూడు కమిషనరేట్లలోని సీసీ కెమెరాలు ఆశించిన ఫలితాలు ఇవ్వట్లేదు. చిరునామా, ఫోన్ నంబర్లు మారితే.. కేంద్ర మార్గదర్శకాల్లో మరో కీలకాంశమూ ఉంది. ఓ ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించి జారీ చేసే ఈ–చలాన్ వాహనదారుడికి చేరాల్సిన అవసరం ఉంది. ఆర్టీఏ రికార్డుల్లో ఉన్న వాహనం రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులతో అనుసంధానించిన చిరునామా, ఫోన్ నంబర్లే దీనికి ఆధారం. అయితే చాలా మంది వాహనచోదకులు ప్రస్తుతం నివసిస్తున్న చిరునామా, వినియోగిస్తున్న సెల్‌ఫోన్ నంబర్‌కు రికార్డుల్లో ఉన్న వాటికి సంబంధం ఉండట్లేదు. ఈ కారణంగానే సగానికి సగం ఈ–చలాన్లు వాహనదారులకు చేరట్లేదు. ఈ నేపథ్యంలో ఆయా వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేసుకునేలా వారికి అవకాశం ఇవ్వాలని సూచించింది. అలాగే ట్రాఫిక్ సిబ్బంది సైతం తనిఖీలప్పుడు వాహనదారుల చిరునామా, ఫోన్ నంబర్ల మార్పును పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. Tue, Apr 15 2025 5:19 AM

రాష్ట్రంలో భూ లావాదేవీలకు సంబంధించి ధరణి స్థానంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెస్తున్న భూభారతి పోర్టల్‌లో కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించనున్నారు. ఏఐ సహకారంతో ఈ పోర్టల్‌లోని ఒక విభాగాన్ని నిర్వహించనున్నారు. ధరణిలో యూజర్ల సందేహాలను నివృత్తి చేసేలా ముందుగానే రూపొందించిన ప్రశ్నలు, సమాధానాలు అందుబాటులో ఉండేవి.భూ భారతిలో యూజర్ల ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానమిచ్చేలా చాట్ బాట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. హెల్ప్ డెస్క్ కింద ఈ చాట్‌బాట్‌ను వినియోగించనున్నారని తెలుస్తోంది. యూజర్ ఏ ప్రశ్న అడిగినా సరైన సమాధానమిచ్చేలా ‘భూమిత్ర’పేరుతో హెల్ప్ డెస్క్‌ను రూపొందిస్తున్నారు. భూముల వివరాలు, లావాదేవీల నిర్వహణలో వచ్చే సందేహాలను నివృత్తి చేసేలా ఏఐని వినియోగించనున్నట్టు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. – సాక్షి, హైదరాబాద్కొత్త పోర్టల్‌లో పాత రికార్డులే..ధరణి పోర్టల్‌లో నమోదైన భూ రికార్డులను యథాతథంగా భూభారతి పోర్టల్‌లోకి బదిలీ చేస్తున్నట్లు అధికారులు తెలిపా రు. కొత్త రికార్డులేవీ రాయడం లేదని చెబుతున్నారు. ఇప్ప టికే పాత రికార్డుల్లో సరిగ్గా ఉన్న వివరాలు అలాగే ఉంటాయ ని, తప్పుగా నమోదైన వివరాలను సరిచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం ధరణిలో ఉన్న 35 మాడ్యూళ్ల స్థానంలో 6 మాడ్యూళ్లను మాత్రమే భూభారతిలో అందుబాటులోకి తేనున్నారు. ధరణిలో చాలా మాడ్యూళ్లు ఉండడంతో రైతులకు దేని ద్వారా దరఖాస్తు చేసుకోవాలో అర్థమయ్యేది కాదని, ఇప్పుడు సులభంగా దరఖాస్తు చేసుకు నేలా అన్ని సమస్యలను ఆరు మాడ్యూళ్ల ద్వారానే పరిష్కరించే ఏర్పాట్లు చేశామని రెవెన్యూ వర్గాలంటున్నాయి.ఆటంకం లేకుండా రిజిస్ట్రేషన్లుధరణి నుంచి భూభారతి పోర్టల్‌కు మారుతున్న సందర్భంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రి యకు ఎలాంటి ఆటంకం ఉండదని, యథాతథంగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతా యని రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. గతంలో ధరణి పోర్టల్ అందుబాటు లోకి తెచ్చే సమయంలో 100 రోజులకు పైగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ను నిలిపివేశారు. ఇప్పుడు ఓ వైపు క్రయవిక్రయ లావాదేవీలను కొనసాగిస్తూనే మరోవైపు పోర్టల్‌ను బలోపేతం చేసేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు వెల్లడించాయి.ఇప్పటివరకు ప్రైవసీ ఆప్షన్ కింద కొన్ని భూముల వివరాలను ప్రజలందరికీ అందుబాటులో ఉండకుండా దాచారు. అలా కాకుండా భూభారతిలో రాష్ట్రంలోని ప్రతి ఎకరా భూమికి సంబంధించిన వివరాలను నమోదు చేశారు. భూమి పట్టాదారు ఎవరు? ఎవరి నుంచి, ఎంత భూమిని, ఎవరు కొనుగోలు చేశారు? ఆ భూమిపై హక్కులు ఏ విధంగా సంక్రమించాయి? అనే పూర్తి వివరాలు ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.ప్రస్తుత పోర్టల్ తాత్కాలికమేప్రస్తుతం అమల్లోకి తెస్తున్న భూభారతి పోర్టల్ తాత్కాలికమేనని అధికారులు తెలిపారు. ధరణి ఆనవాళ్లు లేకుండా కొత్త పోర్టల్‌ను రూపొందించనున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం అవసర మైన చర్యలు తీసు కోవాలని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి సంబంధిత అధికా రులను ఆదేశించినట్టు తెలసింది. నేటి నుంచి అమల్లోకి రానున్న భూభారతి పోర్టల్ లోగో, డిజైన్‌పై ఆదివారం తన నివాసంలో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ కె. రఘువీర్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివా సులు, సీసీఎల్ఏ నవీన్ మిత్తల్, సీసీఎల్ఏ కార్యదర్శి మకరంద్, భూచట్టాల నిపుణుడు భూమి సునీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సామాన్య రైతుకు కూడా అర్థమయ్యే భాషలో భూభారతి వెబ్సైట్ ఉండాలని సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, భూ రికార్డులకు ఎలాంటి సమస్యలు రాకుండా పకడ్బందీ ఫైర్‌వాల్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొత్త పోర్టల్‌ను డిజైన్ చేసి నిర్వహించే బాధ్యతను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని అన్నారు. కనీసం వందేళ్లపాటు వినియోగంలో ఉండేలా పోర్టల్‌ను రూపొందించాలని ఆదేశించారు. కాగా, సోమవారం సాయంత్రం శిల్పారా మంలో జరిగే కార్యక్రమంలో భూభారతి పోర్టల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. అంతకుముందు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమావేశమవుతారు. Mon, Apr 14 2025 12:52 AM

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కృత్రిమ కల్లు తయారీలో అక్రమార్కులు కొత్తదారులు వెతుకుతున్నారు. మొదట్లో క్లోరోహైడ్రేట్ రసాయనంతో కృత్రిమ కల్లు తయారు చేసేవారు. ప్రభుత్వం దీన్ని నిషేధించాక డైజోఫాం ఉపయోగించారు. ప్రస్తుతం కృత్రిమ కల్లు తయారీకి ఆల్ఫ్రాజోలం రసాయనం వాడుతున్నారు. ఖర్చు ఇంకా తగ్గించుకునేందుకు యాంటీ సైకోటిక్ డ్రగ్ వాడుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ తాగిన వారంతా అపస్మారక స్థితిలోకి.. ఈ నెల 7న కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి కల్లు డిపోలో కల్లు తాగినవారంతా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. 69 మంది ప్రభావితం కాగా, ఇందులో 17 మందిపై తీవ్ర ప్రభావం చూపడంతో నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. గత ఘటనలకు భిన్నంగా లక్షణాలు కనిపించడంతో క్షుణ్ణంగా పరిశీలించిన వైద్యులు కల్లు తయారీలో కలిపిన రసాయనాల విషయమై దృష్టిసారించారు. బాధితులకు గంటల వ్యవధిలోనే నాడీవ్యవస్థ దెబ్బతినడంతోపాటు నాలుక దొడ్డుగా మారడం, డిస్టోనియా (మరమనిషి మాదిరిగా), రిజిడ్(గట్టిగా), సిరలు పడిపోవడం, నొప్పులు వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో కొత్తగా ‘యాంటీ సైకోటిక్ గ్రూపు’నకు చెందిన డ్రగ్స్‌ను కల్లులో వాడినట్టు అనుమానిస్తున్నారు. ఈ డ్రగ్‌ను ‘మేజర్ మెంటల్ డిజార్డర్’ ఉన్నవారికి ఉపయోగిస్తారని వైద్యులు చెబుతున్నారు. కల్లుపై ప్రయోగాలు.. ప్రాణాలతో చెలగాటం తెల్లగా మెరుస్తూ, కలిపితే నురగ వస్తూ, పుల్లగా, తియ్యగా ఉంటూ కల్లులా భ్రమింపచేసేందుకు అక్రమార్కులు రసాయనాలను వాడుతున్నారు. ఇందుకోసం గతంలో క్లోరోహైడ్రేట్‌ను వాడేవారు. ప్రభుత్వం నిషేధించడంతో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తెచ్చి కలుపుతున్నారు. కొంతకాలం డైజోఫాంతో కల్లు తయారుచేశారు. ప్రస్తుతం ఆ్రల్ఫాజోలం ఉపయోగించి కృత్రిమ కల్లు తయారు చేస్తున్నారు. అయితే ఈ రసాయనాల ఖర్చును మరింతగా తగ్గించుకునేందుకుగాను అక్రమార్కులు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే యాంటీ సైకోటిక్ డ్రగ్ తెరపైకి వచ్చిందనే అనుమానాలున్నాయి. రసాయనాలతో తయారుచేసిన కల్లులో కుంకుడు కాయల రసం, శాక్రీన్ సైతం కలుపుతున్నారు. కృత్రిమ కల్లు దందా ఇలా.. » కృత్రిమ కల్లు తయారీలో ఆల్ఫ్రాజోలం, డైజోఫాం, క్లోరోహైడ్రేట్, సిట్రిక్ యాసిడ్ లాంటి రసాయనాలతో పాటు పులుపు కోసం నిమ్మ ఉప్పు, తెలుపు కోసం సిల్వర్ వైట్, కప్ పౌడర్, తీపి కోసం శాక్రీన్, నురగ కోసం కుంకుడు రసం, యూరియా, సోడా యాష్, అమ్మోనియా మిశ్రమం, డ్రై ఈస్ట్ రసాయనాలను ఉపయోగిస్తున్నారు. »2,400 సీసాల తయారీకి రూ.7,800 ఖర్చవుతోంది. ఒక్కో కల్లు ప్యాకెట్ రూ.20కి అమ్ముతున్నారు. » ఒక్క నిజామాబాద్ నగరంలోనే ఒక్క తాటిచెట్టు కూడా లేకుండానే రోజుకు ఏకంగా 3 లక్షల లీటర్ల కృత్రిమ కల్లు తయారుచేస్తున్నారు. డేంజర్.. ‘యాంటీ సైకోటిక్ డ్రగ్’ మేజర్ మెంటల్ డిజార్డర్ ఉన్న రోగులకు మాత్రమే యాంటీ సైకోటిక్ గ్రూపునకు సంబంధించిన డ్రగ్ వాడాలి. ఇష్టానుసారం వాడితే తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. – డాక్టర్ కె శివప్రసాద్, నిజామాబాద్ వైద్యకళాశాల ప్రిన్సిపల్, సైకియాట్రి ప్రొఫెసర్కొత్త రసాయనం కలిపి తయారీదుర్కిలో కల్లు తాగిన వారిని వివిధ రకాలుగా పరిశీలించాం. ఆ్రల్ఫాజోలం, డైజోఫాం కాకుండా కొత్తగా మరో రసాయనం కలపడంతోనే బాధితుల్లో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. – డాక్టర్ శ్రీనివాస్,నిజామాబాద్ జీజీహెచ్ సూపరింటెండెంట్ Mon, Apr 14 2025 12:50 AM
మణికొండ: తమ వాహనాలకు లక్కీ నెంబర్లు ఉండాలని కోరుకునే వారు వాటిని దక్కించుకునేందుకు పోటీలు పడ్డారు. మణికొండలోని రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన ఈ బిడ్డింగ్‌లో లక్కీ నెంబర్ల ధరలు లక్షల రూపాయల్లో పలికాయి. మంగళవారం జరిగిన బిడ్డింగ్‌లో మొత్తం రూ.52,69,216 ఆదాయం సమకూరినట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు. అందులో టీజీ 07ఆర్ 9999 నెంబర్ ఏకంగా రూ. 12,49,999లకు కాం్రగ్యూంట్ డెవలపర్స్ వారు దక్కించుకున్నారు. టీజీ 07ఎఎ 0009 నెంబర్‌ను రుద్ర ఇన్ఫాస్ట్రక్షర్స్ రూ.8.50లకు, టీజీ 07ఎఎ 0001నెంబర్‌ను 4.77 లక్షలకు ఫ్యూజీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థలు దక్కించుకున్నాయని అధికారులు తెలిపారు. Wed, Apr 16 2025 1:35 PM

సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనుల దృష్ట్యా 10వ నంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి 7వ నంబర్ ప్లాట్‌ఫాం వరకు మూసివేశారు. అలాగే 5, 6వ నంబర్ ప్లాట్‌ఫామ్‌లను కూడా అవసరాలకు అనుగుణంగా మూసివేయనున్నారు. నిర్మాణ పనులను దృష్టిలో ఉంచుకొని ప్లాట్‌ఫామ్‌ల మూసివేత, రైళ్ల మళ్లింపు చర్యలు చేపట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సుమారు 120 రోజులపాటు రైళ్ల రాకపోకలపైన ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది. టెర్మినల్ మార్పు... నాంపల్లి నుంచి చెన్నై సెంట్రల్‌కు నడిచే చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (12603/12604), సికింద్రాబాద్–గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (12590/12589), షాలిమార్–హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ (18045/18046) రైళ్లను చర్లపల్లి టెర్మినల్‌కు మార్చారు. సికింద్రాబాద్–కర్నూల్ సిటీ (17023/17024) కాచిగూడ నుంచి రాకపోకలు సాగించనుంది. తాత్కాలికంగా మారిన స్టేషన్లు... » విజయవాడ–సికింద్రాబాద్ (12713/12714) ఎక్స్‌ప్రెస్ కాచిగూడ నుంచి విజయవాడకు రాకపోకలు సాగించనుంది. పోర్బందర్–సికింద్రాబాద్ (20968/20967) ఎక్స్‌ప్రెస్‌ను ఉందానగర్ నుంచి నడుపుతారు. » అలాగే సిద్దిపేట్ నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే ప్యాసింజర్ రైళ్లను సికింద్రాబాద్‌కు బదులు మల్కాజిగిరి నుంచి నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. సికింద్రాబాద్ నుంచి పుణేకు నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (12026/12025) నాంపల్లి నుంచి పుణేకు రాకపోకలు సాగించనుంది. చర్లపల్లి నుంచి నడిచే రైళ్లు ఇవే...» సికింద్రాబాద్–మణుగూర్ (12745/12746), సికింద్రాబాద్–రేపల్లె (17646/17645), సిలిచర్–సికింద్రాబాద్ (12513/12514), సికింద్రాబాద్–దర్భంగా (17007/17008), సికింద్రాబాద్–యశ్వంత్‌పూర్ (12735/12736), సికింద్రాబాద్–అగర్తల (07030/07029), సికింద్రాబాద్–ముజఫర్‌పూర్ (05294/05293), సికింద్రాబాద్–దానాపూర్ (07647/07648), సికింద్రాబాద్–సంత్రాగచ్చి (07221/07222), హైదరాబాద్–రక్సాల్ (07051/07052) ఎక్స్‌ప్రెస్ రైళ్లు సికింద్రాబాద్ రీడెవలప్మెంట్ పనుల దృష్ట్యా చర్లపల్లి నుంచి రాకపోకలు సాగిస్తాయి. » అలాగే సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్, గుంటూర్–సికింద్రాబాద్ రైళ్లకు చర్లపల్లి టెరి్మనల్లో అదనపు హాల్టింగ్ సదుపాయం కల్పించారు. చర్లపల్లి నుంచి మళ్లింపు... వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరి సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా నడిచే 32 రైళ్లను చర్లపల్లి మీదుగా మళ్లించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ రైళ్లు సికింద్రాబాద్‌కు రాకుండా లింగంపల్లి నుంచి సనత్‌నగర్, మౌలాలి రూట్లో చర్లపల్లికి చేరుకుంటాయి. ఆదిలాబాద్–తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి–కాకినాడ గౌతమి ఎక్స్‌ప్రెస్, కాజీపేట్–హడాప్సర్, లింగంపల్లి–విశాఖపట్టణం, సంబాల్పూర్–నాందేడ్, విశాఖపట్టణం–నాందేడ్, విశాఖపట్టణం–సాయినగర్ షిరిడీ, విశాఖపట్టణం–నాగర్సోల్, నర్సాపూర్–నాగర్సోల్, వాస్కోడిగామ –జాసిఢ్, మచిలీపట్నం–సాయినగర్ షిరిడీ, కాకినాడ–సాయినగర్ షిరిడీ, విశాఖపట్టణం–ఎల్టీటీ ముంబై, పూర్ణ–తిరుపతి, నాందేడ్–ఈరోడ్, కాకినాడ– లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ రైళ్లు చర్లపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తాయి. చర్లపల్లికి కనెక్టివిటీ కటకట... సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే సుమారు 60కి పైగా రైళ్లను చర్లపల్లి టెర్మినల్ నుంచి నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. కానీ ప్రయాణికుల రద్దీ మేరకు బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో లేవు. ప్రస్తుతం ఒకే ఒక్క ఎంఎంటీఎస్ రైలు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చొ ప్పున నడుస్తున్నాయి. చర్లపల్లి నుంచి సికింద్రాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాలకు సిటీబస్సులు కూడా పరిమితంగానే ఉన్నాయి. పైగా రాత్రిపూట బస్సులు అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సికింద్రాబాద్ నుంచి తాత్కాలికంగా ఇతర స్టేషన్లకు మళ్లించిన రైళ్లు 30 శాశ్వతంగా చర్లపల్లి టెర్మినల్‌కు మారినవి 8చర్లపల్లిలో అదనపుహాల్టింగ్ కల్పించిన రైళ్లు 6సికింద్రాబాద్‌కు బదులు చర్లపల్లి మీదుగా నడిచే దూరప్రాంత రైళ్లు 32 Wed, Apr 16 2025 1:26 AM

కళ్లుండి చూడలేని ప్రతిపక్షాలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాయి. అసెంబ్లీలో ఈ చట్టం ఆమోదం కోసం పెట్టినప్పుడు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాయి. రైతునని చెప్పుకునే నాయకుడు తెచ్చిన చట్టం ద్వారా ప్రజలు ఎంత గోస పడ్డారో ఇంకా వారికి అర్థం కావడం లేదు.ఖాజీపూర్ నుంచి సాక్షి ప్రతినిధిబీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టంతో రైతులు అనేక కష్టాలు అనుభవించారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. రైతుల కష్టాలు తీర్చేందుకే ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని అమలుచేస్తున్నట్లు తెలిపారు. భూభారతి చట్టం అమలులో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం ఖాజీపూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ‘నాడు దొరవారు చేసిన ధరణి చట్టం పేద ప్రజలను, రైతులను పాతాళానికి తొక్కింది. ఇప్పుడు మేం తెస్తున్న భూభారతి చట్టం రైతుకు, భూమికి మధ్య ఉండే బంధాన్ని బలోపేతం చేస్తుంది. గ్రామాలు, గూడేలు, తండాల్లో ఉండే పేదలకు భరోసా, వారి భూములకు భద్రత ఉండేలా ఈ చట్టం తీసుకొస్తున్నాం’అని వివరించారు. పింక్ చొక్కాల కష్టాలూ తీరుస్తాం పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులను 15 నెలల్లోనే కాంగ్రెస్ చేసిందన్న అక్కసుతోనే ప్రతి పనికి ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని మంత్రి పొంగులేటి విమర్శించారు. ‘వాళ్లు మమ్మల్ని తిట్టినా, ఆడిపోసుకున్నా సరే.. పింక్ చొక్కాలు వేసుకున్నవారి భూ సమస్యలను కూడా భూభారతి ద్వారా పరిష్కరిస్తాం. నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే నా దగ్గరకు వచ్చి ధరణి పోర్టల్ వల్ల తమ పాసు పుస్తకాల్లో తప్పులు వచ్చాయని తెలిపారు.భారతికి బదులు భరత్‌రెడ్డి అని, 9 ఎకరాలకు బదులు 9 గుంటలు అని పడిందని, వాటిని కొత్త చట్టం ద్వారా సరిచేయాలని కోరారు. దేశానికి భూభారతి చట్టం రోల్‌మోడల్ కాబోతోంది. పింక్ చొక్కాలు వేసుకున్న వారు గతంలో పేదలకు చెందిన లక్షలాది ఎకరాల భూమిని కొల్లగొట్టారు. ఆ భూములన్నింటిని తీరిగి పేదలకు పంచాలనేది మా ఉద్దేశం. అసైన్డ్ భూములపై కూడా రైతులకు హక్కులు కల్పిస్తాం. కోర్టుల్లో లేని ప్రతి భూ సమస్యకు భూభారతి ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుంది’అని తెలిపారు. మంచిని మంచి అని చెప్పకపోయినా.. చెడుగా చిత్రీకరించొద్దు.. మా ప్రభుత్వానికి మంచి మార్కులు వస్తాయనే అక్కసుతోనే మేం ఏం చేసినా అడ్డుకునే ధోరణితో ప్రతిపక్షాలు ముందుకెళుతున్నాయని పొంగులేటి విమర్శించారు. ‘కళ్లుండి చూడలేని ప్రతిపక్షాలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాయి. అసెంబ్లీలో ఈ చట్టం ఆమోదం కోసం పెట్టినప్పుడు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాయి. రైతునని చెప్పుకునే నాయకుడు తెచ్చిన చట్టం ద్వారా ప్రజలు ఎంత గోస పడ్డారో ఇంకా వారికి అర్థం కావడం లేదు. మంచిని మంచి అని చెప్పకపోయినా చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేయవద్దు.ఇప్పుడు కూడా బీఆర్ఎస్ తన విధానం మార్చుకోకపోతే పార్లమెంటు ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయి’అని హెచ్చరించారు. సదస్సులో నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్‌లు భూభారతి చట్టంలోని ముఖ్యాంశాలను రైతులకు వివరించారు. అక్కడే ఏర్పాటు చేసిన కౌంటర్లో రైతుల నుంచి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ధరణి పోర్టల్ వల్ల తాను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. తన భూమి పాసుపుస్తకంలో వాకిటికి బదులుగా వాకాటి అని వచ్చిందని, దానిని మార్చాలని అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేకపోయిందని చెప్పారు.తన నియోజకవర్గంలో ఇక నుంచి భూభారతి చట్టంలోని సెక్షన్ల గురించి రైతులకు వివరిస్తానని పేర్కొన్నారు. భూమి సునీల్ మాట్లాడుతూ.. భూభారతి చట్టం ద్వారా రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని 1.30 కోట్ల మంది రైతుల శ్రేయస్సే లక్ష్యంగా చట్టం మార్చామని చెప్పారు. సదస్సులో ఎమ్మెల్యేలు పరి్ణకారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, బాలల హక్కుల కమిషన్ చైర్మన్ సీతా దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Fri, Apr 18 2025 3:54 AM
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులది అత్యంత కీలకపాత్ర. నేరాలు జరగకుండా చూడడంతోపాటు నేరస్తులను చట్టం ముందు నిలబెట్టేలా దర్యాప్తు చేయడం వీరి ప్రధాన విధి. అయితే దేశవ్యాప్తంగా పోలీసుల సంఖ్యకు నానాటికీ పెరుగుతున్న జనాభాకు పొంతన లేకుండా పోతోంది. దేశవ్యాప్తంగా ప్రతి లక్ష మంది జనాభాకు కేవలం 155 మంది పోలీసులు మాత్రమే ఉన్నట్టు ఇటీవల విడుదలైన ఇండియా జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్)–2025 నివేదిక వెల్లడించింది. – సాక్షి, హైదరాబాద్⇒ జాతీయ స్థాయిలో సరాసరిన చూస్తే ప్రతి లక్ష మంది జనాభాకు మంజూరైన పోలీసుల సంఖ్య 197 కాగా, కేవలం 155 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ⇒ తెలంగాణ విషయానికి వస్తే ప్రతి లక్ష మంది జనాభాకు ఇక్కడ 233 మంది పోలీసులు అందుబాటులో ఉన్నారు. ⇒ ఇక రాష్ట్రాల వారీగా చూస్తే ప్రతి లక్ష మందికి బిహార్‌లో అత్యల్పంగా కేవలం 75 మంది పోలీసులు మాత్రమే అందుబాటులో ఉన్నారు.మహిళా పోలీసుల సంఖ్య అంతంతే..⇒ పోలీస్ బలగాల్లో మహిళా అధికారులు, సిబ్బంది సంఖ్య సైతం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. ⇒ జాతీయ స్థాయిలో పోలీస్ విభాగాల్లో మహిళా సిబ్బంది సంఖ్య 8 శాతంగా ఉండగా..మహిళా అధికారుల సంఖ్య 10 శాతానికి పరిమితమైంది. ⇒ తెలంగాణ పోలీస్‌శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తూ మహిళల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటోంది. అయితే ఐజేఆర్ 2025 నివేదిక ప్రకారం తెలంగాణ పోలీస్‌శాఖలో మహిళా సిబ్బంది 8.7 శాతంగా, మహిళా అధికారుల సంఖ్య 7.6 శాతంగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. ⇒ దేశవ్యాప్తంగా అత్యధికంగా తమిళనాడు పోలీస్‌శాఖలో మహిళా సిబ్బంది సంఖ్య 20.7 శాతంగా, మహిళా అధికారుల సంఖ్య 20.1 శాతంగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. Fri, Apr 18 2025 6:12 AM

మీ గురించి ఎవరికి బాగా తెలుసు అని ఎవరైనా అడిగితే ఏం చెబుతారు? అమ్మకో, నాన్నకో, జీవిత భాగస్వామికో, ఆప్త మిత్రుడికో అని చెబితే.. అది కచ్చితంగా అబద్ధమే. ఎందుకంటే.. ఇప్పుడు మీ గురించి అందరికన్నా మీరు వాడే ఫోన్‌కు లేదంటే ల్యాప్టాప్కే బాగా తెలుసు. మీరు కాదన్నా అదే నిజం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా మీకు ఇష్టమైన రంగు.. ఇష్టమైన చిరుతిళ్లు.. ఇష్టమైన బట్టలు.. ఇలా అన్నింటిని గురించి ముందే తెలుసుకుంటున్నాయి సోషల్‌మీడియా సంస్థలు. ఇది గతంలోనూ ఉన్నప్పటికీ ఏఐ వచ్చాక వాణిజ్య ప్రకటనల స్వరూపమే మారిపోతోంది. ఈ రంగంలో ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా తీసుకొచ్చిన ‘ఆండ్రోమెడా’ఇప్పుడు సరికొత్త సంచలనం.అంతా మార్చేసిన ఏఐఫేస్బుక్ ఓపెన్ చేస్తే మీకు కావాల్సిన ప్రొడక్టులే ముందుగా కనిపిస్తున్నాయా? ఇన్‌స్ట్రాగామ్‌లో స్క్రోల్ చేస్తుంటే.. మీకు నచ్చే డ్రెస్ యాడ్ టెంప్ట్ చేస్తుందా? ఇదేమీ యాదృచ్ఛికం కాదు. మీకు ఎలాంటి ప్రకటనలు చూపించాలో ముందే మెటా సంస్థ నిర్ణయిస్తోంది. మన ‘సోషల్’లైఫ్‌లో యాడ్స్ తీరును పూర్తిగా మార్చేస్తోంది. మనల్ని ఏఐ పూర్తిగా చదివేస్తోంది. దీంతో మనకు నచ్చే ఉత్పత్తులే మన ముందు ప్రత్యక్షమవుతున్నాయి.మెటా అభివృద్ధి చేసిన ఆండ్రోమెడా అనే కొత్త ఏఐ టెక్నాలజీనే ఇందుకు కారణం. ఈ సిస్టమ్ రోజుకు కోట్ల యాడ్స్‌ను విశ్లేషిస్తుంది. యూజర్‌కు ఏ ప్రకటన చూపించాలో నిర్ణయిస్తుంది. నిజానికి ఇది కొత్తదేమీ కాదు. గతంలోనూ మనం ఫోన్ ద్వారా నెట్లో ఏదైనా వెదికితే.. దానికి సంబంధించిన అంశాలు మన సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌పై వరుసగా వచ్చేవి. ఇప్పుడు ఆ విధానం మరింత కొత్తరూపు సంతరించుకుంది.ఇన్ఫ్లుయెన్సర్లతో కలిసి యాడ్స్కంపెనీలు తమ ఉత్పత్తుల్ని ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రమోట్ చేయడం చూస్తున్నాం. వీడియో మొత్తం చూశాక.. వీడియోల డిస్క్రిప్షన్లోని లింకులను ఓపెన్‌చేసి నచ్చితే ఆర్డర్ పెట్టేస్తున్నాం. ఇకపై అంత కష్టపడక్కర్లేదు. యూట్యూబర్, ఇన్స్టాగ్రామ్ స్టార్ ఓ ప్రొడక్ట్ గురించి చెప్తే.. వెంటనే దానికి సంబంధించిన యాడ్ మీకు కనిపిస్తుంది. పాపులర్ క్రియేటర్లతో కలసి బ్రాండ్లు తమ ఉత్పత్తులను కొత్తగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ఇదో చక్కని అవకాశమని కంపెనీలు చెబుతున్నాయి.ఇన్ఫ్లుయెన్సర్ వీడియోను చూస్తూనే.. కింద కనిపించే సంబంధిత పాపప్స్‌ను సెలక్ట్ చేసుకుని ఆర్డర్ పెట్టేయొచ్చన్నమాట. ఒకే ప్రకటనలో యూజర్‌కు నచ్చే మరొక ఉత్పత్తిని కూడా చూపించే అవకాశం ఇవ్వనుంది మెటా. అంటే.. ఒక కంపెనీ సమ్మర్ స్పెషల్ కలెక్షన్స్‌ను చూపిస్తూనే.. వచ్చే వర్షాకాలం సీజన్‌కు సరిపడే జాకెట్లను కూడా ప్రమోట్ చేస్తుంది. ఇలా యాడ్స్ ప్రదర్శించినప్పుడు విక్రయాల్లో 14 శాతం పెరుగుదల కనిపించిందని మెటా చెబుతోంది.మీరే మోడల్ఆన్లైన్లో డ్రెస్సులు కొనడం మామూలే. కానీ, మీరే మోడల్‌గా మారి ఆయా డ్రస్సులను ధరించి చూసుకుని కొనుగోలు చేయటం ఇప్పుడు కొత్త ట్రెండ్. ఏఐ ఆధారంగా వర్చువల్ మోడల్స్‌ను చూపించే ఫీచర్‌ను మెటా పరీక్షిస్తోంది. యూజర్ శరీరాకృతికి తగిన డ్రెస్సులను ఎలా ధరించాలో చూపించే ప్రయత్నమిది. ఈ విధానం ఇప్పటికే ఆస్ట్రేలియా, తైవాన్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలనలో ఉంది. అంతా బాగానే ఉందిగానీ.. నాకు ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేయడం ఇష్టం అంటారా? అలాంటి వారి కోసం చుట్టు పక్కల మాల్స్‌లోని షాపింగ్ అనుభవాన్ని దగ్గర చేసే ప్రయత్నం చేస్తోంది మెటా.అందుకు తగిన యాడ్స్‌ను వినియోగదారులకు పరిచయం చేస్తోంది. అవే ‘ఓమ్నీ చానల్’యాడ్స్. మీరు ఆన్లైన్లో చూసిన వస్తువు.. మీ సమీపంలోని షాపుల్లో ఉందా? ఎంత ధర? ఎక్కడ కొనాలి? ఇలా అన్నీ చూపించే విధంగా ప్రాంతీయ యాడ్స్ వస్తున్నాయి. దుకాణాల లొకేషన్, డిస్కౌంట్ కోడ్స్ వంటి వివరాలను ఆ యాడ్స్‌లో కనిపిస్తాయి. ఈ యాడ్స్ వాడిన బ్రాండ్లకు 12 శాతం విక్రయాలు పెరిగినట్లు మెటా తెలిపింది.నోటిఫికేషన్లోనూ యాడ్స్ ఇదో సరికొత్త ప్రయోగం. ఫేస్బుక్, ఇన్‌స్టాను ఓపెన్ చేయగానే నోటిఫికేషన్స్ కనిపిస్తాయి. వాటిలో ఇప్పటివరకు ఏ ఫ్రెండ్ రిక్వెస్ట్ లేదంటే కామెంట్స్, లైక్‌లు కనిపిస్తున్నాయి. ఇకపై ఆ నోటిఫికేషన్స్‌లో యాడ్స్ కూడా ఉండొచ్చు. ఆ యాడ్స్ గతంలో మీరు వెతికిన ఉత్పత్తులవే అయి ఉంటాయి. మీరు మళ్లీమళ్లీ వెతికే పని లేకుండా మీ నోటిఫికేషన్‌కు తీసుకొచ్చేస్తోంది మెటా.కొన్ని డిస్కౌంట్ యాడ్స్‌ను కొత్తగా మార్చేస్తోంది. ‘డిస్కౌంట్ పొందాలంటే మీ ఈమెయిల్ ఇవ్వండి’అని నేరుగా అడుగుతుంది. మీరు మెయిల్ అడ్రస్ ఇచ్చి డిస్కౌంట్ ఆఫర్ పొందొచ్చు. దీంతో బ్రాండ్లు తమ కస్టమర్ల లిస్టును పెంచుకోగలుగుతాయి. ఈ మార్పుల ద్వారా మెటా వాణిజ్య ప్రకటనలకు సరికొత్త నిర్వచనం ఇస్తోంది. యాడ్స్‌ను చూడడం టైమ్‌పాస్ కాదు.. టైమ్‌ను సేవ్ చేయడం అని చెబుతోంది. Mon, Apr 14 2025 1:56 AM
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయే విధంగా క్షేత్రస్థాయి పరిస్థితులున్నాయని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘తొందరపడి తెలంగాణలో ప్రభుత్వాన్ని కూలగొట్టం.సర్కార్‌కు ఇంకా మూడున్నరేళ్లకు పైగా గడువు ఉంది. ఇక్కడ ప్రభుత్వాన్ని కూలగొడితే బీజేపీకి లాభం ఎంటి? ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని అందరికీ తెలుసు’అని వ్యాఖ్యానించారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో మీడియా ప్రతి నిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ... భూముల విక్రయం, అప్పులు చేయడం, మద్యం అమ్మడం ద్వారానే ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ చేస్తోందని మండిపడ్డారు. కేసులు ఎదుర్కునేందుకూ సిద్ధంహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్ల కూల్చివేత, భూమి చదునుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు ఉల్లంఘనలకు పాల్పడిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. అర్ధరాత్రి ఫ్లడ్‌లైట్లు పెట్టి చెట్లు నరికిన పరిస్థితి గతంలో ఎక్కడా జరగలేదని, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రధాని మోదీ విమర్శిస్తారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అంశంలో ఎవరో ఏఐతో చేసిన నకిలీ ఫొటోలు సోషల్‌మీడియాలో పెట్టారని మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. హెచ్‌సీయూ అంశంపై గతంలో తాను ట్విట్టర్లో పెట్టిన పోస్ట్‌కు కట్టుబడి ఉన్నానని, ఈ విషయంలో కేసులు ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఈ భూముల విక్రయం వెనక బీజేపీ ఎంపీ ఉంటే, అతడి పేరు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు అసదుద్దీన్ బిగ్బాస్కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బిగ్‌బాస్ అని, ఆయనే ఈ రెండు పార్టీలను నియంత్రిస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఈ నెల 19న వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో భూబకాసు రులు నిరసనలు నిర్వహిస్తున్నారని ఎంఐఎం సభను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ముస్లింల ప్రార్థనా మందిరాలకు వక్ఫ్ బోర్డుకు సంబంధం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర కార్పొరేటర్లను కూడా కలిసి ఓట్లు అడుగుతామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన, టీడీపీతో కలిసి పోటీచేసే ఆలోచనే లేదని స్పష్టంచేశారు. ఒంటరిగానే పోటీచేసి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని తెలిపారు. ఇకపై కాంగ్రెస్, బీఆర్ఎస్లతో బీజేపీకి దోస్తీ ఉందని ఎవరైనా అంటే చెప్పుతో కొట్టాలని ప్రజలకు సూచించారు. Wed, Apr 16 2025 5:41 AM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ప్రతీసారి ముస్లింలు, మజ్లీస్ మాత్రమే అంటూ కాలయాపన చేయడమే తప్పా రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం చేకూర్చారా అని నిలదీశారు. కిషన్ రెడ్డి.. ఒక కిస్మత్ రెడ్డి అంటూ సెటైర్లు వేశారు మహేష్ కుమార్‌గౌడ్,హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బలం లేకపోయినా పోటీకి దిగడాన్ని తప్పుబట్టారు. బలం లేనప్పుడు పోటీకి దిగి మిగతా పార్టీలపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ‘ప్రతీ ఎన్నికల్లో ఏదో ఓక పార్టీ అండతో గెలుస్తారు. కిషన్ రెడ్డి రాజకీయ జీవితంలో తెలంగాణ కు పైసా రూపాయి లాభం అయినా జరిగిందా?, ముస్లిం, మజ్లీస్ తప్ప కిషన్ రెడ్డి నుంచి మరో మాట రాదు. బలం లేకున్నా ఏ ఉద్దేశ్యంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. ఎవరి ప్రేమ కోసం బీజేపీ ఎదురు చూస్తుంది. మాకు బలం లేదు కాబట్టే పోటీ చేయలేదని మేము ప్రకటించాం. బీజేపీ, బిఆర్ఎస్ మధ్య ప్రేమ చిగురించింది’అంటూ ధ్వజమెత్తారు.ఏరోజైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేసారా?, పూర్వ కాలంలో కిషన్ రెడ్డి, ఓవైసీ అన్నదమ్ములు అయ్యి ఉంటారు. రజాకార్ల అంటె కిషన్ రెడ్డికి ప్రేమ ఎందుకు?, ... పదే పదే రజాకార్ల ప్రస్తావన కిషన్ రెడ్డి ఎందుకు తెస్తున్నారు. రేషన్ బియ్యంలో కేంద్ర వాటా ఎంతో బండి సంజయ్ కి తెలుసా?, ఇతర రాష్ట్రాలలో సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదో సంజయ్ సమాధానం చెప్పాలి’ అని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్ Fri, Apr 18 2025 4:35 PM

హైదరాబాద్: కేటీఆర్, హరీష్ రావు, కవితలను సోషల్ బాయ్ కాట్ చేయాలని అంటున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. 14 నెలల నుంచి ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని వీరు చేయలేదని, అందుచేత ఆ ముగ్గుర్ని సోషల్ బాయ్ కాట్ చేయాలని రఘునందన్ రావు సూచించారు. ఈరోజు(గురువారం) మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన రఘునందన్ రావు.. ‘ కేటీఆర్, హరీష్ రావు, కవితలు 14 నెలల నుంచి ప్రజలకు ఉపయోగపడే ఒక్క పనీ చేయలేదు. గతంలో కేంద్రం కొండా బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ ఇస్తే తెల్లారే భూమి, యునివర్సిటీ పేరు మారింది. కేసీఆర్ గవర్నమెంట్ రాగానే ఎందుకు HCU భూములు బదలాయించలేదు.2012 నాటి జిల్లా కలెక్టర్ CCLA కు రాసిన లేఖ ఆధారంగా బదలాయించాలి. ఆనాడు వారి అవసరాలకు అనుగుణంగా దాన్ని పక్కన పెట్టిన కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎన్నో డాక్యుమెంట్స్ సేకరించి CEC సాధికారత కమిటీకి అందజేశా. సాధికారత కమిటీ చైర్మన్ సుప్రీంకోర్టు ముందు నన్ను వాదనలు వినిపిస్తారా అని అడిగారు. మేము రిఫర్ చేస్తాం వచ్చి వాదనలు వినిపించాలి అన్నారు. అవసరమైనప్పుడు పిలిస్తే వస్తా అని చెప్పా. HCU భూములు అంటూ ఆనాడు ప్రభుత్వం తెలుగులో రాసిన పంచనామా ఉంది. HCU భూములు కానప్పుడు ఆనాటి ప్రభుత్వం ఎందుకు పంచనామా చేసింది. గోపనపల్లిలో కేటాయించిన స్థలంలో వేర్వేరు సంస్థలు వచ్చాయి. ఇష్టారీతిన అమ్మాలని ప్రభుత్వం చూసింది. HCU భూములపై ఫైట్ చేసింది బీజేపీ’ అని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. Thu, Apr 17 2025 5:25 PM

హైదరాబాద్: డూప్లికేట్ గాంధీ కుటుంబానికి భారతీయ చట్టాలు వర్తించవా?, రాజ్యాంగానికి అతీతులని అనుకుంటున్నారా?, నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కాజేసేందుకు డూప్లికేట్ గాంధీ కుటుంబం చేసిన కుట్ర’ అంటూ కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. యూపీఏ హయాంలోనే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్ కాకుండా బెయిల్ తెచ్చుకున్న నిందితులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ. ఇందులో బీజేపీ, మోదీ పాత్ర ఏముంది?, కాంగ్రెస్ కార్యకర్తలారా....నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్లో మీ వాటా ఉంది. మీరు ధర్నా చేయాల్సింది.... టెన్ జన్ పథ్ సోనియా ఇంటి ముందు. తప్పు చేస్తే సోనియా సహా అందరూ జైలుకు వెళ్లక తప్పదు.రాహుల్ స్పూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ పేరుతో ఫోర్త్ సిటీకి చెందిన 50 వేల కోట్ల ఆస్తులను కాజేసే కుట్ర. సుబ్రమణ్యస్వామి కేసులతో బీజేపీకి ఏం సంబంధం?, బూతులు మాట్లాడితే చప్పట్లు కొడుతుంటే నివారించాల్సింది పోయి సమర్ధిస్తారా?, దావోస్ పెట్టుబడులు ఎటు పోయాయ్?...జపాన్ పర్యటన కూడా అంతే. కాంగ్రెస్, బీఆర్ఎస్ జాన్ జబ్బలు.... బీఆర్ఎస్ అవినీతి కేసులన్నీ నీరుగార్చడమే నిదర్శనం.విద్యుత్ కొనుగోళ్ల స్కాంపై నివేదిక ఇచ్చినా కేసీఆర్ కు కనీసం నోటీసు ఎందుకు ఇవ్వలేదు?, బెంగాల్ తరహా పరిస్థితులు తెలంగాణలో వచ్చే ప్రమాదముంది. దీనికి ముమ్మాటికీ కారణం రేవంత్ రెడ్డి కాబోతున్నరు. రేవంత్ ఆర్ధిక సహకారంతోనే వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా మజ్లిస్ ఆందోళన చేస్తోంది. దీనిని అడ్డుకోకపోతే జరగబోయే పరిణామాలకు రేవంత్ రెడ్డి సర్కారే బాధ్యత వహించక తప్పదు’ అని బండి సంజయ్ ధ్వజమెత్తారు. Fri, Apr 18 2025 6:20 PM
కామారెడ్డి జిల్లా: కాంగ్రెస్ తాటాకుచప్పుళ్లకు భయపడేది లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బాన్సువాడలో రజతోత్సవ సన్నాహక సమావేశంలో పింక్ బుక్ పేరిట ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దంటూ కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసింది. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్‌లో రాసుకుంటాం, బెదిరింపులకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదు. కేసులు పెట్టించే పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదు’’ అంటూ కవిత వ్యాఖ్యానించారు.‘‘బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఎవరైనా ఊరుకునేదే లేదు. కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదు. వాళ్ల తాతలు, ముత్తాతలు, జేజమ్మలు ఎవరు దిగొచ్చినా కూడా భయపడేవాళ్లెవరూ లేరు ఇక్కడ. మాట తప్పడమే.. మడమ తిప్పడమే కాంగ్రెస్ నైజం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టిన గ్యారెంటీ కార్టులను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి పంచి ఓట్లేయించుకున్నారు...ఇప్పుడు గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది. గతంలో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి పదేళ్ల పాటు అరిగోస పెట్టింది కాంగ్రెస్. వందలాది మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలకు కారణం కాంగ్రెస్. ఏడాదిన్నర పాలనలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి. ప్రతీ ఇంటి నుంచి ఒకరు రజతోత్సవ సభకు రావాలి’’ అంటూ కవిత పిలుపునిచ్చారు. Tue, Apr 15 2025 4:24 PM
చౌటుప్పల్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కొందరు వ్యక్తులు దుర్మార్గంగా అడ్డుపడుతున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఆదివారం నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన మాట్లాడారు. మహాభారతంలో ధర్మరాజులా ఉండాల్సిన మాజీ మంత్రి జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకుండా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఇవ్వాలని అధిష్టానానికి జానా లేఖ రాశారని పేర్కొన్నారు. 20 ఏళ్లు మంత్రి పదవులు అనుభవించిన జానాకు ఈ అంశం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు. ‘ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వొద్దని కొందరు మాట్లాడుతున్నారు. ఇద్దరికి ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సాధనకు నా సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రి పదవినే త్యాగం చేశారు.నేను సోనియాగాంధీని ఒప్పించి, తెగించి పార్లమెంట్లో పోరాడా. మా ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి? ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు 3 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు నల్లగొండలో 11 మందికి 3 మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి?’ అని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు.మాట నిలుపుకోవాల్సింది ఎవరు?గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో మంత్రు లు ఇన్‌చార్జీలుగా ఉన్న పార్లమెంట్ స్థానాలైన కరీంనగర్, మహబూబ్‌నగర్, మల్కాజ్గిరి, మెదక్, సికింద్రాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లో పార్టీ ఓడిపోయిందని రాజగోపాల్‌రెడ్డి గుర్తుచేశారు. మరి ఇప్పుడు ఆ స్థానాల బాధ్యతలు తీసుకున్న మంత్రులు ఎక్కడికి పోయారని ఆయన నిలదీశారు. తన బలం ఏమిటో తెలిసినందునే ఎంపీ స్థానాన్ని గెలిపించుకొని వస్తానన్న నమ్మకంతో ఎమ్మెల్యే అయిన తనను భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జిగా అధిష్టానం నియమించిందన్నారు. పదవుల కోసం అడుక్కోను.. పాకులాడను..తాను మంత్రి కావాలని జాలితోనో, పైరవీ చేసో అడగట్లేదని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. తనకు దమ్ము, ధైర్యం ఉందని.. మంత్రి పదవికి అర్హత, పదవిని సమర్థంగా చేపట్టగలనని నమ్మితేనే మంత్రి పదవి ఇవ్వాలన్నారు. తాను పదవుల కోసం పాకులాడనని, పదవులు కావాలని అడుక్కోనని స్పష్టం చేశారు. ఎవరి దయాదాక్షిణ్యాల కోసం ఎదురు చూడట్లేదని తేల్చిచెప్పారు. ప్రాణం పోయినా నియోజకవర్గ ప్రజలు తలదించుకొనేలా ప్రవర్తించబోనని భావోద్వేగానికి లోనయ్యారు.కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, చండూరు మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలోనూ పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. తన ఓపికను చేతగాని తనంగా చూడొద్దని.. తనకు ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 16 నెలలుగా మంత్రి పదవులను ఖాళీగా ఉంచడం సరికాదని అభిప్రాయపడ్డారు. Mon, Apr 14 2025 1:02 AM
మంచిర్యాల: మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో తనకు మంత్రి పదవి రాకపోతే సహించేదే లేదని తేల్చిచెప్పారు. పదేళ్ల పాటు పార్టీని కాపాడుకుంటే ఇదేనా తమకిచ్చే గౌరవం అంటూ అధిష్టానాన్ని ప్రశ్నించారు. వేరే పార్టీలు తిరిగొచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి, పార్టీలో ఉండి పార్టీని కాపాడుకున్న తమలాంటి వాళ్లకు పదవులు ఇవ్వకపోతే మాత్రం సహించే ప్రసక్తే లేదన్నారు. ఇంద్రవెల్లి సభతో పార్టీకి ఊపిరిపోశానని ఆయన చెప్పుకొచ్చారు.వేరే పార్టీలు తిరిగొచ్చిన వాళ్లంటే..!వేరే పార్టీలు తిరిగొచ్చిన వాళ్లకి మంత్రి పదవులు ఇస్తారా అని ప్రేమ్ సాగర్ రావు ప్రశ్నించడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించే చేసినవే అంటూ విశ్లేషఖులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఒకానిక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లి అక్కడ చుక్కెదురు కావడంతో తిరికి సొంత గూటికే చేరిన రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి ప్రేమ్ సాగర్ వ్యాఖ్యానించినట్లు విశ్లేషిస్తున్నారు. ఇది కాంగ్రెస్ లో మరింత అలజడి రేపుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో సీనియర్ నేతలు ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం ప్రతిపక్షాల పార్టీలు కౌంటర్లు వేయడానికి ఆస్కారం ఇచ్చినట్లయ్యింది. మంత్రి పదవుల పంచాయితీ మొదటికొచ్చిందా?తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై ఇప్పటికే కసరత్తు పూర్తయినప్పటికీ తమకు పదవి కావాలంటే తమకు కావాలంటూ నేతలు నిరసన గళం వినిపిస్తున్నారు. తెలంగాణ క్యాబినెట్ రేసులో సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వాకాటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్, మల్ రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ లు ఉన్నట్లు సమాచారం. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై కాస్త సస్సెన్స్ నెలకింది. కొన్ని రోజులుగా రాజగోపాల్ రెడ్డి తన స్వరాన్ని పెంచారు.తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ప్రత్యేకంగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఎందుకని జానారెడ్డి అన్నట్లు వార్తలు రావడంతో రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకే ఇంట్లో ఇద్దరికి ఎందుకు పదవులు ఉండకూడదని ప్రశ్నించారు. తమ శక్తి సామర్థ్యాలను బట్టే మంత్రి పదవులు ఇవ్వడానికి అధిష్టానం మొగ్గిచూపుతోందని, ఇక్కడ కొంతమంది తమ పలుకుబడితో ఆ పదవిని రాకుండా అడ్డుకునేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కూడా పదవి ఇవ్వకపోతే అమీతుమీ తేల్చుకుంటాననే సంకేతాలు పంపడంతో అధిష్టానానికి మళ్లీ పదవుల పంచాయితీ తలనొప్పి షురూ అయ్యింది. తెలంగాణ క్యాబినెట్ విస్తరణ పంచాయితీ మళ్లీ మొదటికి రావడంతో అధిష్టానం మరోసారి చర్చలు జరిపే అవకాశాలు కూడా లేకపోలేదు. Mon, Apr 14 2025 3:18 PM

సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలను కొనుక్కునైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని తమపై ఒత్తిడులు వస్తున్నాయంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. కూలుస్తామంటే తాము చేతులు కట్టుకుని కూర్చోమని ప్రశ్నించారు. మంగళవారం నోవాటెల్ హోటల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఐదేళ్లే కాదని.. రానున్న మరో ఐదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని చెప్పారు.భూభారతి అమల్లోకి తేవడంతో వారికి భయం పట్టుకుందని, వారి అక్రమాలు ఎక్కడ బయటకు వస్తాయోననే భయం బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు చేసిన ప్రభాకర్‌రెడ్డి కేసీఆర్ ఆత్మ అని, ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభాకర్‌రెడ్డిది ట్రాన్స్పోర్ట్ వ్యాపారం అనుకున్నానని, ఆయన ఈ మధ్య జ్యోతిషం కూడా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వమంటే బీఆర్ఎస్లోని ఆ నలుగురు నాయకులకు కళ్లమంట అని అన్నారు. అందుకే పిల్లి శాపాలు పెట్టిస్తున్నారని, ఆ శాపనార్థాలకు ప్రభుత్వం పడిపోదని అన్నారు. ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయం: పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్చోటా మోటా కాంట్రాక్టర్లు కూల్చే ప్రభుత్వం తమది కాదని, అయినా వారు ప్రభుత్వాన్ని కూలిస్తే తాము ఊరుకుంటా మా అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. తమ ప్రభుత్వానికి ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు ఉందని, ఇలాంటి చోటా బ్యాచ్‌కు తాము భయపడేది లేదన్నారు.బీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్యేలంటే కనీస గౌరవం లేదని, సంతలో వస్తువులుగా ఎమ్మెల్యేలను చూస్తున్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయన్నారు. ప్రభుత్వ పెద్దలతో చర్చించి ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభాకర్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలంటూ టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ తదితరులు బేగంబజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. Wed, Apr 16 2025 5:25 AM
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొడితే బీజేపీకి వచ్చే లాభం ఏంటని ఆయన ప్రశ్నించారు. తొందరపడి తెలంగాణలో ప్రభుత్వాన్ని కూలగొట్టమని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి ఐదేళ్లు సమయం ఉంది. ప్రభుత్వాన్ని కూల గొట్టడానికి గుజరాత్ వ్యాపారులకు పని లేదా? వ్యాపారులు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు.తాజాగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఉద్దేశ్యం మాకు లేదు. దీంతో, బీజేపీకి వచ్చే లాభమేమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. అది అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో గెలుపు బీజేపీదే. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఎటువంటి తొందర లేదు. త్వరలో కొత్త అధ్యక్షుడి నియామకం జరుగుతుంది. భూములు అమ్మకం, మద్యం అమ్మకం, అప్పులు తేవడంలో తెలంగాణను నంబర్ వన్‌గా మార్చారు.అర్థరాత్రి ఫ్లడ్ లైట్లు పెట్టీ ఇలా చెట్లు నరికిన ఘటనలు దేశంలో తెలంగాణలో తప్ప ఎక్కడ జరగలేదు. హెచ్‌సీయూలో చెట్లు కొట్టిన AI వీడియో పోస్టుపై కేసు పెడితే పెట్టుకోండి. భావితరాలకు ల్యాండ్ కాపాడాల్సిన బాధ్యత మనపైన ఉంది. భూములు అమ్మకం ద్వారానే ప్రభుత్వం నడపాలని అనుకోవద్దు. రేవంత్ ఏ బ్రాండ్ అనేది వచ్చే ఎన్నికల్లో తేలుతుంది. నేషనలిజమే నా బ్రాండ్. ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ఎస్ఎల్బీసీపై నేషనల్ డ్యాం సెక్యూరిటీ అథారిటీకి ఎలా ఫిర్యాదు చేస్తాం?. సింగరేణి కార్మికులకు ఐటీ పన్నులు మేం అధికారంలోకి వస్తే రియింబర్స్ చేస్తాం. సింగరేణి కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేస్తారు. వాళ్లది వైట్ కాలర్ జాబ్ కాదు.సన్నబియ్యంపై.. ఏ రాష్ట్రంలోనైనా ఆ రాష్ట్ర ప్రజల అవసరానికి అనుగుణంగా ఇస్తాం. కొన్ని రాష్ట్రాల్లో గోధుమలు కూడా సరఫరా చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కోటా కాకుండా ప్రతీ లబ్దిదారుడికి అదనంగా ఐదు కేజీల సన్న బియ్యం ఇచ్చి చూపించాలి. దొడ్డు బియ్యం పైసలతోనే సన్న బియ్యం ఇస్తున్నారు. దీంట్లో కొత్తగా ఏముంది? అని ప్రశ్నించారు.పార్లమెంట్ ఎన్నికలలో తమిళనాడులో నష్టపోయామని.. అక్కడ పొత్తుకు వెళ్లాం. య అధ్యక్షుడిగా నా పేరు ప్రచారంపై అటువంటి ప్రస్తావనే లేదు. దక్షిణాదికి లోక్ సభ సీట్లు తగ్గుతాయనేది గాలి ప్రచారం మాత్రమే. అన్యాయంగా వక్ఫ్ పేరుతో ఆక్రమించిన భూముల కోసమే కొంతమంది ఆందోళనలు చేస్తున్నారు. ఎంఐఎం నేతలు, అక్రమంగా లబ్ది పొందిన వారే ఆందోళనల్లో ఉన్నారు. ఏ ఒక్క సామాన్య, పేద ముస్లిం కూడా ఆందోళన చేయడం లేదు. వక్ఫ్ సవరణ చట్టం మీద భూ బకాసురులు ఉద్యమం చేస్తున్నారు. ముస్లిం ప్రార్థన మందిరాలను, వక్ఫ్‌కు సంబంధం లేదు’ అని అన్నారు. Tue, Apr 15 2025 1:00 PM
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్నికూల్చేయబోతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాటలతో ఆటగాడవద్దు. మీ గేమ్స్ చెల్లవు’ అంటూ అని తీవ్రంగా స్పందించారు. ఈ అంశంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని, బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే వారే ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తారని మండిపడ్డారు. (ఇదీ చదవండి: ‘ఆ టెస్టులు మీరే చేయించుకుంటే మీ అసలు రంగు బయటకొస్తది’)ఇదిలా ఉంచితే,. ఈరోజు(మంగళవారం) హైదరాబాద్ నగరంలో నోవాటెల్ హెటల్ లో జరిగిన సీఎల్పీ సమావేశంలో మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో సంక్షేమం ఒక ఎత్తు అయితే.. ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన పకడ్బందీగా పూర్తి చేశాం. ఈ రెండు అంశాలు గత కొన్ని దశాబ్దాలుగా గొప్ప గొప్ప నాయకులే చేయలేకపోయారు మన ప్రభుత్వం అందరికీ చెప్పి చేసింది. ఈ రెండు అంశాలు చేయాలని ఇప్పుడు దేశవ్యాప్తంగా డిమాండ్ మొదలవుతుంది. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు ఆమోదించాము. ఎస్సీ కుల వర్గీకరణ జరిగింది. దేశంలో కొద్దిమందికి ఇష్టం లేకపోయినా భూసంస్కరణలు వంటి గొప్ప నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ గతంలో చేపట్టింది. అందుకే ఈ దేశంలో సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ అధికారంలో కొనసాగింది. బీసీ కుల గణన, sc వర్గీకరణ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బి ఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీలను మూట కట్టి మూలన పడేసే విషయాలు.. ఇవి వారి అస్తిత్వానికే ప్రమాదం కాబట్టి బీఆర్ఎస్, బిజెపి చేతులు కలిపి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారు.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావించి కంచ గచ్చిబౌలిలో ఏనుగులు, పులులు తిరుగుతున్నట్టు బిజెపి, బీఆర్ఎస్ కలిసి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ని ఉపయోగించి కుట్రలు చేస్తున్నాయి. బీసీ కుల సర్వే మీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఏకంకండి, మాతో కలిసి రండి అని చెప్పి బహుజన వర్గాలను చైతన్యం చేయాలి. కులగణన ద్వారా పొందాల్సిన ఫలితాలను అందుకున్నాము. సంక్షేమ పథకాలు, బీసీ కుల సర్వే, ఎస్సీ వర్గీకరణ నిశ్శబ్ద విప్లవాలు’ అంటూ ఆయన స్పష్టం చేశారు. Tue, Apr 15 2025 7:48 PM
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి హెచ్‌సీయూ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాయని కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆత్మాభిమానం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇది పర్యావరణ ప్రేమికుల విజయం అంటూ వ్యాఖ్యలు చేశారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ..‘అధికారం తలకెక్కి, అధికార మదంతో విర్రవీగి చక్రవర్తులం అని భావిస్తే.. న్యాయ వ్యవస్థ ముందు అహంకారం తగ్గక తప్పదు. నిన్న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో సీఎం రాజీనామా చేసి పోవాలి. కానీ అక్కడ ఉంది రేవంత్ రెడ్డి. ఆయన అన్ని పట్టించుకోని వ్యక్తి. కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇది విద్యార్థుల, అధ్యాపకుల, సపోర్ట్ చేసిన అందరి విజయం’ అని చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ టాక్స్ అని , హెచ్‌సీయూలో ఏదో జరుగుతుందని ప్రధాని మోదీ మాట్లాడటం కాదు. సీబీఐ, సీవీసీ, సిట్టింగ్ జడ్జీతో ఇన్వెస్టిగేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సెంట్రల్ కమిటీతో విచారణ చేయాలి. రాహుల్ ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ఉంటా అన్నారు. కానీ, ఇక్కడ మాత్రం పత్తా లేడు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడటానికి బీజేపీ ఆరాటపడుతోంది. భారత ప్రభుత్వం డైలాగులు కొడితే సరిపోదు. గుంట నక్కలు అని డైలాగ్ కొట్టిన ముఖ్యమంత్రికి సుప్రీంకోర్ట్ వాతలు పెట్టింది. కొందరు పోలీస్ అధికారులు కేసులు పెడుతున్నారు వారు కూడా ఊచాలు లెక్కబెట్టాల్సి వస్తుంది. సుప్రీంతీర్పును స్వాగతిస్తున్నాము. రేవంత్ అధికారులను బలి పశువులను చేస్తున్నారు. అంతా మంచి జరిగితే క్రెడిట్ నాది అంటారు రేవంత్. ఏదైనా జరిగితే అధికారులది తప్పు అంటున్నారు.రెండు జాతీయ పార్టీలు ఒకటే. రేవంత్ రెడ్డి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ప్రజల మాటలు వింటే చెవుల నుండి రక్తం కారుతుంది. ప్రజలే తిరగబడి బాంగ్లాదేశ్ లాగా ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది నిజమే. రేవంత్ రెడ్డి ఈ ఐదేళ్లు సీఎంగా ఉండాలి ఆ తర్వాత వచ్చే 20ఏళ్ళు కాంగ్రెస్‌కు ఒక్కరు కూడా ఓటు వేయరు. రేవంతే ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. Thu, Apr 17 2025 11:19 AM

‘వృద్ధి రేటులో దేశంలోనే రెండో స్థానం.. మొదటి స్థానంలో తమిళనాడు! తలసరి ఆదాయంలోనూ రాష్ట్రం పైపైకి..’ ఇది తెలుగుదేశం పత్రిక ఈనాడులో పతాక శీర్షికన వచ్చిన కథనం. ఈ కథనాల ప్రకారం వృద్ధిరేటులో ఏపీ రెండో స్థానంలో ఉంటే తెలంగాణ 14వ స్థానంలో ఉంది! అంటే తెలంగాణ బాగా వెనుకబడి ఉన్నట్లే కదా? ఆ వెనుకబాటు గురించి తెలంగాణలోనూ ప్రచురించాలి కదా? వారి టీవీలలో ప్రసారం చేయాలి కదా!.కానీ, తెలంగాణ ఎడిషన్లలో ఈనాడు, తదితర ఎల్లో మీడియా పత్రికలు అసలు ఆ కథనాలే ఇవ్వలేదు. అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ అనుకోవాలా? లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే భయపడుతున్నారా? లేక ఎల్లో మీడియా వ్యాపార ప్రయోజనాలు తెలంగాణలో అధికంగా ఉన్నాయి కనుక ఆ తరహా వార్తలు ఇచ్చి ప్రభుత్వానికి అసంతృప్తి కలిగించరాదని? లేక అసలు ఈ వృద్ధి రేటు లెక్కలన్నీ కాకి లెక్కలని తెలుసు కనుకనా?. ఏపీలో తాము భజన చేస్తున్న చంద్రబాబు సర్కారుకు మేలు చేయాలనా? అన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి. ఇంకో కారణం కూడా ఉండవచ్చు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోంది. దానిని కప్పిపుచ్చి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఎల్లో మీడియా ఈ ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఏపీలో బాగా పడిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ,ఇతర వ్యాపారాలను హైప్ చేయడానికి కూడా ఇది ఒక మార్గం కావచ్చు.జగన్ టైమ్‌లో కేంద్రం ఏపీకి ఏదైనా మంచి ర్యాంకు ఇస్తే ఒక్క ముక్క రాయకపోగా, పచ్చి అబద్ధాలను ప్రచారం చేసిన ఈ ఎల్లో మీడియా ఇప్పుడు మాత్రం బ్యానర్ కథనాలు వండివార్చి ప్రజలను మోసం చేస్తోంది. వాస్తవంగా వృద్ధి రేటు ఆ స్థాయిలో ఉండి ఉంటే ఎవరూ తప్పుపట్టరు. కానీ, క్షేత్ర స్థాయిలో భిన్నమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి స్టోరీలు ఇచ్చినా జనం నమ్ముతారా? ఈ కథనాలు రావడం, వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపై కామెంట్ చేస్తూ రాష్ట్రంలో అభివృద్ది జరిగిపోతోందని సంబరపడిపోవడం చూడడానికి బాగానే అనిపించవచ్చు. నిజానికి ఈ లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసేవే. కేవలం ముందస్తు అంచనాలు. ఏ స్వతంత్ర సంస్థ వీటిని ధృవీకరించలేదు. ఈ లెక్కలను అనేక ఇతర రాష్ట్రాలు ఇంకా కేంద్రానికి పంపలేదు కూడా. నిజంగా ఎల్లో మీడియా వార్తలు చదివితే ఈ పది నెలల కాలంలో ఏపీ ఇంతగా అభివృద్ధి చెందిందా? అన్న డౌటు రావచ్చు.తలసరి ఆదాయం పెరిగిపోతే ప్రజలు తమకు స్కీములు ఏవీ ఇవ్వక పోవడంపై ఎందుకు గగ్గోలు పెడుతున్నారు?. దానికి వీరెవ్వరూ సమాధానం ఇవ్వరు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలు, సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? ఒకవేళ డబ్బులు ఉన్నా ఖజానా ఖాళీగా ఉందని అసత్యాలు చెబుతున్నారా?. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా తనకు సూపర్ సిక్స్ హామీల అమలు కష్టంగా ఉందని అంటున్నారు. ఎన్నికలకు ముందు అప్పులు చేయబోనని, సంపద సృష్టిస్తానని ఊదరగొట్టిన బాబు ఇప్పుడేమో రికార్డు స్థాయిలో అప్పులు చేశారు. ఒక ఏడాదిలో అమరావతి అప్పులతో సహా సుమారు రూ.1.5 లక్షల కోట్లు చేస్తుండడం దేశంలో మరే రాష్ట్రంలో జరిగి ఉండదు. అయినా వృద్ధిరేటు అధికంగా ఉందంటే ఎలా నమ్మాలి?.ఇక్కడ మరో కోణం చూద్దాం. మొదటి పది నెలల్లో ప్రభుత్వం ఆశించిన ఆదాయంలో 33 శాతం తగ్గుదల ఉంది. మూలధన వ్యయంలో 48 శాతం తగ్గుదల నమోదైంది. అయినా వృద్ధిరేటు మాత్రం 2023-24లో 6.19 శాతం ఉంటే, 2024-25లో 8.21 శాతంగా ఉందని గణాంకాలు తయారు చేశారు. తలసరి ఆదాయం వృద్ధిలోనూ పైపైకి వెళ్లిందని రాశారు. అయితే ఏ రకంగా, ఏ కారణం వల్ల ప్రజల ఆదాయం పెరిగిందన్న వివరణ మాత్రం వీరివ్వరు. ఆదాయం నిజంగా పెరిగి ఉంటే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. వస్తువుల కొనుగోళ్లు, ఆస్తుల లావాదేవీలపై ఖర్చు చేస్తారు. చిత్రంగా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రావాల్సిన ఆదాయం అంతకుముందు సంవత్సరంలో పోల్చితే రూ.800 కోట్లు తగ్గిందని రికార్డులు చెబుతున్నాయి. అలాగే వాణిజ్య పన్నులు కూడా ఆశించిన రీతిలో వసూలు కావడం లేదు. అయితే ఒక మద్యంలో మాత్రం ఆదాయం వస్తుండ వచ్చు. ప్రజలను తాగుబోతులుగా మార్చడం ద్వారా వృద్ధి రేటు వచ్చిందని ప్రభుత్వం చెప్పదలిస్తే మనం ఏమీ చెప్పలేం. కానీ, వృద్ధి రేటు ద్వారా పేద ప్రజల ఆర్థిక స్థితి గతులు మెరుగుపడాలి. వారి జీవన ప్రమాణాలు పెరగాలి. అందుకోసం ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ స్కీములు ఉపయోగపడతాయి.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు అన్ని సంక్షేమ హామీలు అమలు అయ్యాయి. అందువల్ల అప్పట్లో తలసరి ఆదాయం పెరగడం, పేదరికం తగ్గుముఖం పట్టడం జరిగిందని కేంద్ర ప్రభుత్వ లెక్కలు తెలిపాయి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్ మోతాదు వెయ్యి రూపాయలు పెంచడం మినహా సూపర్ సిక్స్, ఇతర హమీలేవీ అమలు చేయలేదు. అయినా తలసరి ఆదాయం పెరిగిందటున్నారు. రియల్ ఎస్టేట్ ఊపందుకుందని కథనాలు ఇస్తున్నారు. అమరావతితో సహా రాష్ట్రంలో ఏ నగరం, పట్టణంలోనూ భూముల విలువలు పెరగలేదు. కొనుగోళ్లు, అమ్మకాలు పెద్దగా జరగడం లేదని చాలామంది చెబుతున్నారు.కృష్ణా జిల్లా విజయవాడ, గన్నవరం మొదలైన పట్టణాలలో ధరలు సగానికి సగం పడిపోయాయి. పోనీ అమరావతిలో వేల కోట్లు వ్యయం చేస్తున్నందున అక్కడ ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోందా అంటే చెప్పుకోదగిన స్థాయిలో లేవని అంటున్నారు. ప్రభుత్వం అచ్చంగా అమరావతిలోనే రియల్ ఎస్టేట్ పెరగాలని భావిస్తున్నందున విశాఖతో సహా ఇతర నగరాలలో పరిస్థితి దారుణంగా తయారైందని వార్తలు సూచిస్తున్నాయి. రైతులు గిట్టుబాట ధరలు లేక అల్లాడుతున్నారు. అక్వా రైతులకు ట్రంప్ దెబ్బ తగిలింది. ఏ రంగం చూసినా ఆశాజనకంగా పరిస్థితులు కనిపించడం లేదు. జీఎస్డీపీ, వృద్ధి రేటు, తలసరి ఆదాయం వంటి వాటిపై ఇచ్చిన లెక్కలు చూసి ఏపీ ప్రజలు ఆనందపడతారా?. వాస్తవంగా వారి జీవితాలు ఎంత భారంగా గడుస్తున్నాయో వారికి తెలియదా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. Tue, Apr 15 2025 10:29 AM

సాక్షి, జగిత్యాల: తెలంగాణలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియారిటీకి తగిన గుర్తింపు పార్టీలో లేనప్పుడు తప్పకుండా అసంతృప్తి ఉంటుంది అంటూ కామెంట్స్ చేశారు. దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ నియంతృత్వ, అప్రజాస్వామిక విధానాలపై పోరాడిన ఏకైక ఎమ్మెల్సీ తానే అని జీవన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీలో వీహెచ్ తప్ప ప్రస్తుతం నాకంటే అనుభవజ్ఞుడైన నాయకుడు ఎవరున్నారు?. జానారెడ్డి కూడా నాకంటే పార్టీ పరంగా నాలుగేళ్లు జూనియరే. దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ నియంతృత్వ, అప్రజాస్వామిక విధానాలపై పోరాడిన ఏకైక ఎమ్మెల్సీని నేనే. శాసనసభ, శాసన మండలిలో.. కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ రెడ్డి ఎంత పోరాటమైతే చేశారో అంతకు మించి పోరాటం నేనూ చేశాను.సీనియారిటీకి తగ్గ గుర్తింపు పార్టీలో లేనప్పుడు తప్పకుండా నాకు అసంతృప్తి ఉంటుంది. అది కావాలని కోరుకోవడంలో తప్పేముంది?. సీనియర్ నాయకుడైన ప్రేమ్ సాగర్ రావు అయినా, రాజగోపాల్ రెడ్డి అయినా మంత్రి పదవులు కావాలని కోరుకోవడంలో తప్పేముంది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చకు దారి తీసినట్టు తెలుస్తోంది. Tue, Apr 15 2025 1:38 PM

గజ్వేల్: ‘యంగ్ ఇండియా’పాఠశాలలు తన బ్రాండ్ అని ప్రకటించుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డికి ఆ మాట వర్తించదని, మాట తప్పడమే తన బ్రాండ్‌గా ఆయన చెప్పుకోచ్చని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో, బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు.దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ కేసీఆర్ ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.20 లక్షలను ప్రభుత్వం తరఫున ఖర్చు చేసి గురుకుల పాఠశాలలు తీసుకొస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ‘యంగ్ ఇండియా’పేరిట పాఠశాలలు తీసుకొస్తూ, ఏటా రూ.1.50 లక్షల ఫీజు, బస్సు ఫీజు చెల్లించాలని సూచిస్తున్నారని విమర్శించారు. చెట్లు నరికితే సామాన్యులపై వాల్టా చట్టాన్ని ప్రయోగించి శిక్షిస్తున్న అధికారులు.. హెచ్‌సీయూ భూముల్లో చెట్లను నరికేసి, నాలుగు జింకల మరణానికి కారణమైన సీఎం రేవంత్‌రెడ్డిపై ఎన్ని కేసులు పెట్టాలో చెప్పాలన్నారు.400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పులు తెచ్చి, బ్రోకర్ ఫీజు కింద రూ.170 కోట్ల లంచం చెల్లించారని ఆరోపించారు. చట్టాన్ని ఉల్లంఘించి తప్పులు చేస్తున్న అధికారులు రాబోయే రోజుల్లో జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వరంగల్ బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలను హరీశ్ ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Mon, Apr 14 2025 1:24 AM

హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను ఈడీ తన చార్జిషీట్ లో నమోదు చేయడాన్ని టీపీసీసీ వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా నగరంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కేసులకు భయపడతారా?, దేశం కోసం త్యాగం చేసిన వారి రక్తం రాహుల్ గాంధీలో పారుతోంది. కేసులు పెడతా.. జైల్లో పెడతా అంటే స్వతంత్ర ఉద్యమంలో నెహ్రా తలొగ్గలేదు. బ్రిటీష్ వాళ్లకే గాంధీ కుటుంబం భయపడలేదు. మోదీకి రాహుల్ గాంధీ భయపడతారా?, అఫ్ట్రాల్ బీజేపీకి రాహుల్ గాంధీ భయపడరు. కుట్రలో బాగంగా రాహుల్ గాంధీపై కేసు. బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తుంది పార్టీ. ఈవీఎంలతో ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతోంది. గుజరాత్లో మోదీకి రాహుల్ గాంధీ సవాల్ చేయడంతో కేసులు బనాయిస్తున్నారు’ అని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుపై సమీక్షంతకుముందు పుప్పలగూడ పరిసరాల్లో 400 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరిశ్రమలు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. Thu, Apr 17 2025 6:23 PM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అక్కసు ఎందుకని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. పదేళ్లలో బీఆర్ఎస్ చేయనటువంటి పనులను సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని మల్లు రవి స్పష్టం చేశారు. ‘తెలంగాణలో ప్రజల తిరుగుబాటుతోనే బిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయింది. పదేళ్ల పాలనలో బంగారు తెలంగాణ కాస్తా బంగారు కేసీఆర్ కుటుంబంగా మారింది. ప్రతిపక్షాలు రాత్రింబవళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాయి. బంగ్లాదేశ్ లో ప్రజలు తిరిగిపడినట్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు.పదేళ్లలో బిఆర్ఎస్ చేయనటువంటి పనులను సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. దేశ చరిత్రలో మొదటిసారిగా పేదల కోసం సన్న బియ్యం పంపిణీని ప్రభుత్వం తీసుకొచ్చింది. సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మక నిర్ణయం. బంగ్లాదేశ్ తిరుగుబాటుతో తెలంగాణకి ఏం సంబంధం కేటీఆర్. ధరణితో బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసింది.16 లక్షలు మంది ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్నారు. రైతుల మేలు కోసం భూభారతిని సీఎం రేవంత్, మంత్రులు బృందం తీసుకొచ్చింది. ప్రగతి భవన్ లో ప్రజలు కనపడకుండా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. రేవంత్ హయంలో ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి ప్రజలు వెళ్లేందుకు వీలు కల్పించారు. కాంగ్రెస్ ఏడాదిన్నర లో 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం’ అని మల్లు రవి పేర్కొన్నారు. Fri, Apr 18 2025 4:06 PM
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో విసుగుచెందరని.. ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.అధికార దాహంతో బీఆర్ఎస్ కుట్రలు.. మంత్రి పొంగులేటికాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుంచి కూలుస్తామంటున్నారు.. అధికారదాహంతో బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారు. భూ భారతి తీసుకొచ్చామని కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆందోళన చెందుతున్నారు. భూ భారతి తీసుకొచ్చాక భూములు కొల్లగొట్టినవారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కేసీఆర్ ఆత్మ కొత్త ప్రభాకర్‌రెడ్డి. కేసీఆర్ సూచన మేరకే ఆయన మాట్లాడారు. కేసీఆర్ అధికారంలోకి ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను పశువుల్లా కొన్నారు. భూ భారతితో పేదవాడికి న్యాయం జరుగుతోంది’’ అని పొంగులేటి చెప్పుకొచ్చారు.కేసు బుక్ చేయాలి.. ఆది శ్రీనివాస్‌కొత్త ప్రభాకర్‌రెడ్డి వాఖ్యలు సీరియస్‌గా పరిగణించాలంటూ ప్రభుత్వ విప్, వేమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. దోచుకున్న డబ్బుతో ప్రభుత్వాన్ని పడగొడతామని మాట్లాడుతున్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి పై కేసు బుక్ చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తా. సంక్షేమం ప్రజలకు అందుతుందనే బీఆర్ఎస్ కుట్ర చేస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించారు. Tue, Apr 15 2025 11:51 AM
సాక్షి, హైదరాబాద్: పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం.. శంషాబాద్ నోవాటెల్ హోటల్లో నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుంది. మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కుంటారు’’ అంటూ రేవంత్ తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిస్థానం నిర్ణయమే ఫైనల్. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు.సీఎల్పీ సమావేశంలో భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ కేటగిరైజేషన్‌పై చర్చ జరిగింది. ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేల డుమ్మా కొట్టారు. వివేక్, ప్రేమ్‌సాగర్‌రావు, రాజగోపాల్‌రెడ్డి గైర్హాజరయ్యారు. సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని పిలుపునిచ్చారు.‘‘ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. సన్నబియ్యం పథకం ఒక అద్భుతం.. ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకం. భూ భారతిని రైతులకు చేరవేయాలి. దేశంలోనే ఇందిరమ్మ ఇండ్లు పథకం ఆదర్శంగా నిలిచింది. క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందాలి. దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించాం. విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చాం..ఇది మన పారదర్శక పాలనకు నిదర్శనం. జఠిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాం. అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. మనం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉంది. రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలి. నేను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికే సమయం కేటాయిస్తా. హెచ్‌సీయూ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో ఒక అబద్ధపు ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారు...బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయి. పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుంది. మనం ఎంత మంచి చేసినా.. ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదు. మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మీ నియోజకవర్గంలో ఏం కావాలో ఒక నివేదిక తయారు చేసుకోండి. ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి మనపై విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఊక్కిరి బిక్కిరి అవుతున్నాడు. వర్గీకరణ మోదీకి గుదిబండగా మారింది...కులగణన మోదీకి మరణశాసనం రాయబోతోంది. దేశంలో తెలంగాణ మోడల్ పై చర్చ జరుగుతోంది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాలనే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి. సన్న బియ్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. సన్న బియ్యం మన పథకం.. మన పేటెంట్, మన బ్రాండ్’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. Tue, Apr 15 2025 2:46 PM
సాక్షి, జగిత్యాల: కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు.. మోసం కొత్త కాదని.. తెలంగాణ ఇస్తానని చెప్పి 2004లో మోసం చేసిన కాంగ్రెస్... ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేస్తోందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. జగిత్యాలలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ, ఉచిత బస్సు అంటూ. మహిళల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ దెబ్బతీస్తోంది. ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇచ్చి బస్సుల సంఖ్య పెంచకపోవడం వల్ల సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు.కళ్యాణలక్ష్మీ పథకం కింద తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఒక బస్సు ఇచ్చి.. బంగారాన్ని తుస్సుమనిపించారు. రుణ మాఫీ, రైతు భరోసా 50 శాతం మందికి ఇంకా రానేలేదు. గ్రామగ్రామాన కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టాలి. బీజేపీ మోసపూరిత విధానాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పసుపు బోర్డును తూతూమంత్రంగా ఏర్పాటు చేశారే కానీ.. చట్టబద్ధత కల్పించలేదు. దాంతో పసుపు బోర్డుకు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. పసుపు ధరలు పడిపోతే బోర్డు నుంచి డబ్బులు ఇస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. మరి పసుపు ధరలు పడిపోతే బోర్డు నుంచి రైతులకు డబ్బులు ఇచ్చారా?’’ అంటూ కవిత ప్రశ్నించారు.రెండు కోట్ల ఉద్యోగాలు, బోర్డుకు చట్టబద్ధత, మనిషికి 15 లక్షలు ఏమయ్యాయని అడిగితే ఎంపీ అర్వింద్ పిచ్చి మాటలు మాట్లాడుతారు. అంతకు మించి ప్రజలకు పనికి వచ్చే మాటలు మాట్లాడిన దాఖలాలు లేవు. రాష్ట్రం నుంచి 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు.. అయినా కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు 8 రూపాయలు కూడా ఇవ్వలేదు. 8+8 = పెద్ద గుండు సున్నా. తెలంగాణాను కాపాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, గులాబీ జెండానే. రజతోత్సవం గుజాబీ పండుగ మాత్రమే కాదు.. ఇది తెలంగాణ పండుగ. తెలంగాణా ప్రజలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్’’ అని కవిత చెప్పుకొచ్చారు.‘‘బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఎంపీ అర్వింద్ కలిసిమెలసి ఢిల్లీతో తిరుగుతున్న వార్తను టీవీల్లో చూశాను. సంజయ్ బీజేపీలో చేరారా లేదా కాంగ్రెస్‌లో చేరారా అన్న అనుమానం వచ్చింది. సంజయ్ ఒకసారి సీఎం రేవంత్ రెడ్డితో... మరొకసారి బీజేపీ వాళ్లతో కనిపిస్తారు. ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో తెలియక ప్రజల్లో అయోమయం నెలకొంది. జగిత్యాలకు నిధులు తీసుకురావడంలో ఎమ్మెల్యే సంజయ్ విఫలం. ఎమ్మెల్యే సంజయ్‌ని గ్రామ గ్రామానా నిలదీయాలి’’ అని కవిత పేర్కొన్నారు. Wed, Apr 16 2025 3:01 PM
దుబ్బాక: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రజలు తన వద్ద అన్నమాటలే తాను చెప్పానని అన్నారు. తాను చేసిన దాంట్లో తప్పేముంది.. కావాలంటే తనపై కేసులు పెట్టుకోవాలని సవాల్ చేశారు కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రజలు చందాలు వేసుకుని బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని చూస్తున్నారని మరోసారి ఉద్ఘాటించారు.అవి నా వ్యాఖ్యలు కావు.. ప్రజలు మాటలుతాను ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు తన సొంత మాటలు కావని, రాష్ట్రంలో ఉన్న చాలామంది ప్రజలు తమ వద్దకు వచ్చి అంటున్న మాటలు అని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం మారాలి అని రైతులు.. రియల్టర్లు, పారిశ్రామిక వేత్తలు కోరుకుంటున్నారన్నారు.కేసీఆర్ లేకుంటే పొంగులేటి ఉన్నాడా?మంత్రి పొంగులేటి తనను కేసీఆర్ ఆత్మ అని అంటున్నారని, కేసీఆర్ లేకుంటే పొంగులేటి ఎక్కడ ఉండేవాడు అని కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. నేడు పొంగులేటి మంత్రి పదవిలో ఉన్నాడు అంటే.. అది కేసీఆర్ వల్లే అనే విషయం గుర్తించుకోవాలన్నారు. నార్కోటిక్ టెస్ట్ లు చేయడం తనకు కాదు అని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు నార్కోటిక్ టెస్ట్ లు చేయాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కు కౌంటర్ ఇచ్చారు.అలా చేస్తే ఈ ప్రభుత్వం పై వాళ్ల మనసులో ఏముందో తెలుస్తోందన్నారు..ఇక కాంగ్రెస్ వాళ్లకు వాళ్ళ ప్రభుత్వం పై నమ్మకం లేకనే తమ పార్టీ నుండి ఎమ్మెల్యే లను తీసుకేళ్లరని, ఇప్పుడు కాకపోయిన ఇంకొద్ది రోజులు కైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం పక్క అని కొత్త ప్రభాకర్ రెడ్డి మరోసారి వ్యాఖ్యానించారు. Tue, Apr 15 2025 5:06 PM
సాక్షి, దుబ్బాక: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో విసుగుచెంది.. ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటున్నారు అంటూ బాంబు పేల్చారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని.. ఆ ఖర్చును తాము భరిస్తామని అనుకుంటున్నట్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలంగాణలో పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఏ ఎమ్మెల్యేను కొంటారో కొనండి.. అందుకే అయ్యే ఖర్చును తామే భరిస్తామని అడుగుతున్నారు.మరోవైపు.. బిల్లులు రాకపోవడంతో సర్పంచ్‌లు లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్‌గా ఉంటే కుదరడం లేదని, దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. Tue, Apr 15 2025 9:11 AM
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్‌ను నమ్మిన పాపానికి.. రైతులకు స్మశానమే దిక్కయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి రైతులు బతికుండగానే.. ఇలా వల్లకాడుకు చేర్చిన పాపం.. కాంగ్రెస్‌ను వెంటాడటం ఖాయం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..రేవంత్ ను నమ్మిన పాపానికి..రైతులకు స్మశానమే దిక్కయిందిభూముల "అమ్మకాల్లో" బిజీగా ఉన్న సర్కారుధాన్యం "కొనుగోళ్లనే" పూర్తిగా మరిచిపోయింది15 రోజులైనా కొనుగోలు కేంద్రం తెరుచుకోకస్మశానంలో పడుకునే దుస్థితి దుర్మార్గమైనదిఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంతో..రైతుల మరణమృదంగం మోగుతోంది.చివరికి రైతులు బతికుండగానే.. ఇలా వల్లకాడుకు చేర్చిన పాపం.. కాంగ్రెస్ ను వెంటాడటం ఖాయంజై కిసాన్#CongressFailedTelangana అంటూ ఘాటు విమర్శలు చేశారు. రేవంత్ ను నమ్మిన పాపానికి..రైతులకు స్మశానమే దిక్కయిందిభూముల "అమ్మకాల్లో" బిజీగా ఉన్న సర్కారుధాన్యం "కొనుగోళ్లనే" పూర్తిగా మరిచిపోయింది15 రోజులైనా కొనుగోలు కేంద్రం తెరుచుకోకస్మశానంలో పడుకునే దుస్థితి దుర్మార్గమైనదిఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంతో..రైతుల మరణమృదంగం… pic.twitter.com/GnDtWoZOhk— KTR (@KTRBRS) April 17, 2025 Thu, Apr 17 2025 10:39 AM

హైదరాబాద్: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మళ్లీ కోపమొచ్చింది. ఈసారి తనకు పార్టీ నేతలు బర్త్ డే విషెస్ చెప్పలేదని రాజాసింగ్ కు అలకబూనారట. రాజాసింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ చెప్పగా, బీజేపీ నుంచి ముఖ్య నేతల ఎవరూ కూడా ఆయనకు విషెస్ చెప్పలేదట. దాంతో రాజాసింగ్ మళ్లీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన హరిత ప్లాజాలో జరిగిన సమావేశానికి రాజాసింగ్ డుమ్మా కొట్టారట. ఈటెల రాజేందర్‌తో సహా పలువురు ప్రముఖ నేతలు ఆ మీటింగ్ కు హాజరు కాగా, రాజాసింగ్ మాత్రం అందుకు దూరంగా ఉన్నారు. అందులోనూ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికపై సమావేశం నిర్వహించిన సమయంలో రాజాసింగ్ ఇలా దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కేవలం ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పలేదనే కారణమా?.. లేక ఇంకేమైనా ఉందా? అనే కోణంలో చర్చ నడుస్తోంది.బండి సంజయ్ రాజీ చేశారు.. కానీకొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి అలక పాన్పు ఎక్కిన రాజాసింగ్ఎం ను ఇటీవల ఎంపీ బండి సంజయ్ స్వయంగా కలిసి ఆయనకు నచ్చజెప్పి వచ్చారు. ప్రధానంగ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతంరావు అభ్యర్థిత్వాన్ని రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించిన క్రమంలో బండి సంజయ్ స్వయంగా రంగంలోకి దిగారు. గౌతంరావును ఆ స్థానంలో నిలబెట్టడానికి ప్రధాన కారణం బండి సంజయ్ కాబట్టి.. రాజాసింగ్ ను బుజ్జగించి వచ్చారు. అప్పుడు గౌతంరావుతో రాజాసింగ్ ను కరాచలనం చేయించడమే కాకుండా ఇరువురు నేతలు శాలువాలతో సత్కరించుకునే కార్యక్రమం కూడా జరిగింది. ఇంతలోనే రాజాసింగ్ మళ్లీ పార్టీ శ్రేణులపై కోపంగా ఉన్నారంటూ పెద్ద ఎత్తును ప్రచారం జరుగుతోంది ఇందుకు తన బర్త్ డేకు పార్టీలోని ప్రముఖలు విషెస్ చెప్పకపోవడంగా సమాచారం. సీఎం రేవంత్ విషెస్ చెప్పగా, తమ సొంత పార్టీలోని ముఖ్యులు ఎవరూ కూడా కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదనే కారణంతో రాజాసింగ్ కోపంగా ఉన్నారట, నేటి బీజేపీ కీలక సమావేశానికి రాజాసింగ్ దూరంగా ఉండటానికి ఇదే కారణమనే వాదన ప్రముఖంగా వినిపిస్తోంది. Fri, Apr 18 2025 3:15 PM
సాక్షి, నిజామాబాద్ జిల్లా: భీంగల్ మండల కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ విషయంలో వివాదం తలెత్తింది. తులం బంగారం ఎక్కడంటూ ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. మంత్రి జూపల్లి గో బ్యాక్ అంటూ బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు.కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చారు. మంత్రి కాన్వాయ్‌కు అడ్డు తగిలి తులం బంగారం ఎప్పుడు ఇస్తారు రాహుల్ గాంధీ' అనే క్యాప్షన్ ఉన్న ఫ్లెక్సీలను బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రదర్శించారు. దీంతో మంత్రి జూపల్లి అసహనం వ్యక్తం చేశారు. Wed, Apr 16 2025 9:46 PM
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వాములైన టీడీపీ అధినేత చంద్రబాబు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సంపూర్ణ సహకారంతోనే ప్రధాని నరేంద్రమోదీ వక్ఫ్ నల్ల చట్టాన్ని తీసుకురాగలిగారని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని దారుస్సలాంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీటీడీ బోర్డులో హిందువులను మాత్రమే సభ్యులుగా కొనసాగిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. వక్ఫ్ బోర్డులో ఇతర మతస్తులను సభ్యులుగా చేర్చే బిల్లుకు ఏ విధంగా మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు మద్దతిచ్చి.. తన కుమారుడు లోకేశ్ రాజకీయ భవితవ్యాన్ని దెబ్బతీశారని అన్నారు. భవిష్యత్‌లో ముస్లింలు చంద్రబాబు వారసులను ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. వక్ఫ్ చట్టం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే.. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25, 26, 29లలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని అసదుద్దీన్ అన్నారు. మోదీ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా ముస్లింల హక్కులన్నింటినీ లాక్కుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ సర్కారు దేశంలోని ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. వక్ఫ్‌పై బీజేపీ చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. హిందు, జైన, సిక్కు ఎండోమెంట్ బోర్డులలో ఆ మత విశ్వాసాలను అనుసరించే వారు మాత్రమే సభ్యులుగా ఉంటారని, అలాంటప్పుడు వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు సభ్యులుగా ఉండటం సబబా? అని ప్రశ్నించారు. ఈ చట్టాన్ని అడ్డు పెట్టుకొని వక్స్ భూములను ఆక్రమించిన వారికే వాటిని కట్టబెట్టే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. సవరణకు వ్యతిరేకంగా సభ వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఈ నెల 19న దారుస్సలాంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు అసదుద్దీన్ ప్రకటించారు. వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహా్మనీ అధ్యక్షత జరిగే ఈ సభకు దేశవ్యాప్తంగా మత పెద్దలు, పలువురు రాజకీయ నేతలు హాజరవుతారని చెప్పారు. వక్ఫ్ చట్ట వ్యతిరేక నిరసనలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. Mon, Apr 14 2025 5:06 AM
ఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ భూముల వివాదంపై 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్న నేపథ్యంలో ముందుగానే తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కావని తెలంగాణ సర్కార్ అంటోంది. దీనిని అనుసరించే కౌంటర్ దాఖలు చేసింది. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల అక్కడ పొదలు పెరిగాయని, అటవీ రెవెన్యూ రికార్డుల్లో వాటిని అటవీ భూములుగా పేర్కొనలేదనేది తెలంగాణ ప్రభుత్వ వాదన. ఆ భూములకు ఎలాంటి కంచలేదని, కంచె ఏర్పాటు చేసేందుకు తాము ప్రయత్నం చేశామని, ఈ భూముల్లో ఎలాంటి జంతువులు లేవని కౌంటర్ లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఎల్లుండి(బుధవారం, ఏప్రిల్ 16వ తేదీ) సుప్రీంకోర్టులో విచారణకు లోపే కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండటంతో న్యాయనిపుణులతో సుదీర్ఘ చర్చల తర్వాత ఓ క్లారిటీకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఈ భూముల అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పటికే తెలంగాణ సర్కారుకు గట్టిగానే మొట్టికాయలు వేసింది. గత విచారణ సందర్భంగా భూముల్ని తదుపరి విచారణ వరకూ కొట్టివేయొద్దని, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. చెట్లు నరికివేతపై తీవ్రంగా స్పందించింది. కంచ గచ్చిబౌలిలో చెట్లను తొలగించి అభివృద్ధి కార్యకలాపాను హడావుడి చేపట్టాల్సిన అవసరం ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ మదింపు ధృవీకరణ నివేదిక తీసుకుందా, దీనికి సంబంధించి అవసరమైన అనుమతులు పొందారా, స్థానిక చట్టాలను అమలు చేశారా అంటూ పలు ప్రశ్నలను సంధించింది. Mon, Apr 14 2025 5:53 PM
హర్యానా: కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: రైతన్నలకు శుభవార్త. ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) మంగళవారం ప్రకటించింది. వర్షపాతం 96 శాతం నుంచి 104 శాతం నమోదైతే సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. ఈసారి దేశంలో మొత్తం దీర్ఘకాల సగటు వర్షపాతం 105 శాతంగా ఉంటుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలియజేశారు.సాధారణ వర్షపాతానికి 30 శాతం, సాధారణం కంటే అధిక వర్షపాతానికి 33 శాతం, సాధారణం కంటే అత్యధిక వర్షపాతానికి 26 శాతం అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ స్పష్టంచేసింది.తమిళనాడుతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. మొత్తం సీజన్లో ఎల్‌నినో పరిస్థితులు నెలకొనే అవకాశం లేదని తెలియచెప్పింది. 1971 నుంచి 2020 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సీజన్ వర్షపాతం దీర్ఘకాల సగటు 87 సెంటీమీటర్లుగా నమోదైందని ఐఎండీ తెలియజేసింది. నైరుతి రుతుపవనాలు ప్రతిఏటా జూన్ 1వ తేదీకల్లా కేరళలో ప్రవేశిస్తుంటాయి. సెప్టెంబర్ రెండోవారం కల్లా రుతుపవనాల సీజన్ ముగుస్తుంది. Wed, Apr 16 2025 4:39 AM

సాక్షి, న్యూఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలపై ఎలా స్పందించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. గత విచారణలో భాగంగా కంచ గచ్చిబౌలిలో వెంటనే పనులు ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ ఆదేశాల విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా సీఎస్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.అలాగే ఆ భూములను సందర్శించి ఈ నెల 16లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌తోపాటు మరో 10 మంది అధికారులతో కలిసి శనివారం ఢిల్లీ చేరుకున్న సీఎస్ శాంతికుమారి ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుమారు ఐదు గంటలపాటు అధికారులతో సమాలోచనలు చేశారు.సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిన నివేదికపై సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సహా మరికొందరు న్యాయవాదులతో ఆమె ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. నివేదికలో పొందుపర్చాల్సిన అంశాలేమిటి? క్షేత్రస్థాయిలో ఏం జరిగింది? ప్రభుత్వం నివేదిక సమర్పించాక న్యాయస్థానం ఎలా స్పందిస్తుంది? వంటి విషయాలపై న్యాయవాదుల సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకొని ఆదివారం సాయంత్రం ఆమె హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు. Mon, Apr 14 2025 1:32 AM
సాక్షి, హైదరాబాద్: కోల్‌కతా నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ అంబులెన్స్‌లో వ్యాపారవేత్త మృతి చెందారు. అనారోగ్యంతో ఉన్న కమల్ కుమార్‌ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి కమల్ కుమార్‌ను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ చేరుకోకముందే వ్యాపారవేత్త కమల్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. Tue, Apr 15 2025 10:46 AM

సాక్షి, న్యూఢిల్లీ: ‘రక్తహీనత ముక్త్ భారత్’ పథకంలో అమలులో భాగంగా 2023–24లో పిల్లలు, బాలికలు, గర్భిణులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు అందించే ప్రక్రియలో 91.1శాతం కవరేజీతో దేశంలోనే తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. 82.9శాతం కవరేజీతో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2024–25 రెండో త్రైమాసికంలో 15.4 కోట్ల మంది పిల్లలు, కౌమార బాలికలకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను అందించినట్లు తెలిపింది. ప్రతి నలుగురు భారతీయ మహిళల్లో ముగ్గురికి అందుతున్న ఆహారంలో ఐరన్ తక్కువగా ఉంటోందని పేర్కొంది. పురుషుల్లోనూ 25శాతం మందిలో.. జాతీయ ఆరోగ్య సర్వే–5 (2019–21) ప్రకారం భారతదేశంలో 67.1శాతం మంది 6 నుంచి 59 నెలల మధ్య వయసున్న పిల్లలు, 59.1శాతం మంది 15 నుంచి 19 సంవత్సరాల మధ్య గల కౌమార బాలికలు, 15–49 సంవత్సరాల మధ్య ఉన్న 52.2శాతం మహిళలు, గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని పేర్కొంది. అయితే 15 నుంచి 49 సంవత్సరాల మధ్య పురుషుల్లో రక్తహీనత ప్రభావం మహిళలతో పోలిస్తే కాస్త తక్కువగానే ఉంది. ఈ వయసులోని మహిళల్లో 57శాతం రక్తహీనత ఉంటే.. పురుషుల్లో 25శాతం రక్తహీనత నమోదైంది. అదే సమయంలో తెలంగాణలోని 70శాతం మంది పిల్లల్లో, 64.7శాతం కౌమార బాలికల్లో, 53.2శాతం గర్భిణుల్లో రక్తహీనత ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 63.2శాతం పిల్లల్లో, 60.1శాతం బాలికల్లో, 53.7శాతం గర్భిణుల్లోలో రక్తహీనత సమస్య ఉందని జాతీయ ఆరోగ్య సర్వే–5 గుర్తించింది. కాగా.. రక్తహీనత ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 49 సంవత్సరాల వయసు గల 500 మిలియన్ల మహిళలను, 5 సంవత్సరాలలోపు (6–59 నెలలు) 269 మిలియన్ల పిల్లలను ప్రభావితం చేస్తోందని కేంద్రం తెలిపింది. కాగా దాదాపు 30శాతం గర్భిణులు కాని స్త్రీలు (539 మిలియన్లు), దాదాపు 37శాతం గర్భిణులు (32 మిలియన్లు) రక్తహీనతతో బాధపడుతున్నారు. Sat, Apr 19 2025 3:03 AM

వివిధ కారణాలతో ఒక దశాబ్దానికి పైగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో బోధనా సిబ్బంది నియా మకాలు చేపట్టకపోవటం వలన ఆ యా విశ్వవిద్యాలయాలు తమ పరిధిలోనే యూజీసీ మార్గదర్శ కాల మేరకు అర్హత కలిగిన వారిని కాంట్రాక్ట్, అకడమిక్ కన్సల్టెంట్, పార్ట్ టైం ప్రాతిపదికన బోధనా సిబ్బందిగా నియమించుకుంటున్నాయి. రాష్ట్రంలోని 12 రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో బడ్జెట్ ఆమోదం పొంది ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులలో దరిదాపు 900 మందికి పైగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన, 600 మందికి పైగా పార్ట్ టైం ప్రాతిపదికన పని చేస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయా లలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని వివిధ వర్గాల నుండి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో 15 నుండి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్ టైం అధ్యాపకుల ఉద్యోగ భద్రతకు ఎలాంటి హామీ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వివిధ విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయటానికి జీవో నెంబర్ 21 ద్వారా నియామకపు మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో తాత్కాలిక అధ్యాపకులు ఆందోళన చెందుతూ ఉద్యమ బాట పట్టారు.దాదాపు 15 ఏళ్లుగా కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాప కులు తక్కువ వేతనాలతో విశ్వవిద్యాలయాలలోని పని భారాన్ని మోస్తున్నారు. యూజీసీ మార్గదర్శకాల మేరకు రోస్టర్ పాయింట్ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటిస్తూ అర్హతగల వారిని కాంట్రాక్టు, పార్ట్ టైం అధ్యాప కులుగా ఎంపిక చేసి ఆ యా విశ్వవిద్యాలయాలు వారి సేవలను వినియోగించుకుంటున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలోని మూడు విభాగాలలో... ముఖ్యంగా మొదటి విభాగంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎంపిక కోసం వారి సామర్థ్యాన్ని పరిశీలించటానికి మార్గదర్శకాలు రూపొందించినట్లుగా కనపడుతుంది. కానీ విశ్వవిద్యాలయం లాంటి ఒక అత్యు న్నత విద్యాసంస్థ తరగతి గదిలో పాఠాలు బోధించటానికి అర్హత ప్రమాణాలు రూపొందించినట్లుగా కనిపించటం లేదు. అధ్యాపక నియామకాలకు కొత్తగా అర్హత ప్రమా ణాలు రూపొందించటాన్ని తప్పు పట్టలేము కానీ ఆ అర్హత ప్రమాణాలు యూజీసీ మార్గదర్శకాల మేరకు సమర్థంగా పాఠాలు బోధించే సామర్థ్యం కలవారిని, అనుభవం కలవారిని ఎంపిక చేసే విధంగా ఉండాలి. పీహెచ్డీలాంటి అత్యున్నత విద్యార్హతకు జాతీయ క్వాలిఫయింగ్ టెస్ట్ జేఆర్ఎఫ్కి సమానంగా మార్కులు కేటాయించటం ఏమిటి? అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామ కానికి ప్రధాన అర్హత పోస్టు గ్రాడ్యుయేషన్ కానీ డిగ్రీ మార్కులకు వెయిటేజ్ ఇవ్వటం ఏమిటి? పార్ట్ టైం అధ్యాపకుల సర్వీసెస్‌ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు అనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి పాఠాలు బోధించటానికి అత్యంత సమర్థత కలవారిని ఎంపిక చేయటానికి జీవో నెం. 21 మార్గదర్శకాలలో మార్పులు చేయవలసిన అవసరం కూడా ఉంది.తెలంగాణ రాష్ట్రంలోని 12 రాష్ట్ర విశ్వవిద్యాలయా లలో కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించకుండా, నియామకాలలో ప్రాధాన్యం ఇవ్వకుండా నియామకాలు చేపట్టటం అంటే దశాబ్దాలుగా విశ్వవిద్యా లయాలలో శ్రమ దోపిడీకి గురవుతూ తక్కువ వేతనాలతో పని చేస్తున్న వారికి అన్యాయం చేసినట్లుగానే భావించాలి. ‘పనికి మాత్రమే పనికొస్తామా! అవకాశాల కోసం పనికిరామా! మాకు ఉద్యోగ భద్రత కల్పించకుండా, మా సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం విశ్వవిద్యాల యాలలో నియామకాలకు సిద్ధపడటం ఎంతవరకు సమంజసం’ అనే ప్రశ్నలు అధ్యాపక వర్గాల నుండి వçస్తున్నాయి. 2022లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలలో, పాలి టెక్నిక్ కళాశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న 8,000 మందికి పైగా అధ్యాపకుల క్రమబద్ధీకరణకు వ్యతి రేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో భవి ష్యత్తులో విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకుల సేవలను క్రమబద్ధీకరించే అవ కాశాలు లేవు కాబట్టి తమకు టైం స్కేల్‌తో ఉద్యోగ భద్రత కల్పించి నియామకాలలో ప్రాధాన్యమిచ్చి, తదనంతర చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.డా. తిరుణహరి శేషు వ్యాసకర్త రాష్ట్ర పార్ట్ టైం అధ్యాపకుల సంఘం సలహాదారు Tue, Apr 15 2025 9:59 AM
సాక్షి, సిటీ బ్యూరో : వ్యాపారం, సాంకేతికత, కళలు, సామాజిక సేవతో పాటు విభిన్న రంగాల్లో స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహిళలను ట్రంప్స్ ఆఫ్ టాలెంట్ (టీఓటీ) ఆధ్వర్యంలో ‘ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్ –2025’ అవార్డులతో గౌరవించింది. హైటెక్ సిటీలోని అవసా హోటల్ వేదిక జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, వెల్నెస్ అంబాసిడర్ శిల్పారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు అవార్డులను అందించారు. ఈ వేదిక ద్వారా మహిళల ప్రయాణాన్ని స్ఫూర్తివంతమైన కథలుగా ప్రదర్శించామని ట్రంప్స్ ఆఫ్ టాలెంట్ వ్యవస్థాపకులు మహమ్మద్ ఫయాజ్ తెలిపారు. అవార్డుల జ్యూరీలో లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ ఇండియా సీఈవో శిరీష వోరుగంటి, వీహబ్ సీఈవో సీతా పల్లచోల్ల, ఐబీఎం ఎగ్జిక్యూటివ్ భాగస్వామి అనురాధ ఏ, నోవార్టిస్ కంట్రీ హెడ్ దివ్య బాల్‌రాజ్, తెలంగాణ తొలి గిరిజన మహిళా వాణిజ్య పైలట్ కెప్టెన్ బాబీ ఉన్నారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధిపతి మనీషా సాబూ, అబైరో క్యాపిటల్ సలహాదారు మహంకాళి శ్రీనివాసరావు, ఎడ్యు గ్లోబల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఫిరోజ్ సైట్ పాల్గొన్నారు. నగరంలో ప్రవాసీ ఒడియా ఫెస్టివల్ ఉత్కళ ఒడియా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ ‘పత్ ఉత్సవాలకు’ వేదికైన ఖాజాగూడ పెద్ద చెరువు రాయదుర్గం : ఒడిశా వాసులు గచ్చిబౌలి డివిజన్లోని ఖాజాగూడ పెద్ద చెరువు వద్ద సందడి చేశారు. ఉత్కళ ఒడియా యూత్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రవాసీ ఒడియా ఫెస్టివల్ ‘పత్ ఉత్సవం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో నివాసముండే ఒడిశా వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఉత్సాహాన్ని ప్రకటించారు. మొదట ఇస్కాన్ బృందం వారిచే కృష్ణ పరమాత్మ, రామలీలలపై గానామృతం నిర్వహించగా అందరినీ ఆకట్టుకుంది. అనంతరం రోడ్ రంగోలి మురుజా, ఆతోంటిక్, ఒడియా క్యూసిన్, డిస్ప్లే, ఆర్ట్, పైకా ఆర్ట్, టైగర్ నృత్యాలు వంటివి నిర్వహించి తమ సంప్రదాయాన్ని చాటుకున్నారు. అనంతరం శంఖనాథాలతో కూడిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓద్రా, దేహం జుంబా నృత్యాలతోపాటు పిల్లల గ్లోబల్ ఆర్ట్స్ డ్రాయింగ్ పోటీలను నిర్వహించగా ఒడిశా వాసులు ఆసక్తిగా తిలకించారు. ప్రత్యేక ఆహా్వనితులుగా ఐపీఎస్ అధికారి సౌమ్యామిశ్రా, సుప్రసిద్ధ గైనకాలజిస్ట్ డాక్టర్ అనురాధ పాండ్వా పాల్గొని అందరినీ మరింత ఉత్సాహపరిచారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగరంలోని ఒడిశా వాసులు పాల్గొన్నారు. తెలంగాణ రగ్బీ జాతీయ స్థాయి సభ్యత్వం ఇండియన్ ఫుట్‌బాల్ యూనియన్ నుంచి తెలంగాణ అసోసియేషన్‌కు సభ్యత్వం అధికారికంగా ప్రకటించిన ఐఆర్ఎఫ్యుతెలంగాణలో బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్ తరహాలో రగ్బీ క్రీడ కూడా అభివృద్ధి చెందనుందని తెలంగాణ రగ్బీ అసోసియేషన్ వెల్లడించింది. ఇండియన్ రగ్బీ ఫుట్‌బాల్ యూనియన్ నుంచి శాశ్వత సభ్యత్వం కోసం అధికారికంగా గుర్తింపు లభించిందని సంస్థ ప్రకటించింది. ఈ నూతన అనుబంధంతో తెలంగాణ రగ్బీ అసోసియేషన్ ‘ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్’ కింద శాశ్వత సభ్యులకు అందాల్సిన అన్ని ప్రయోజనాలనూ అందించనున్నట్లు నూతన అధ్యక్షులు, లైఫ్‌స్పాన్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు డాక్టర్ నరేంద్ర రామ్ తెలిపారు. ఈ అధికారిక గుర్తింపు రాష్ట్ర వ్యాప్తంగా రగ్బీని మెరుగుపరచడానికి, జాతీయ పాలక సంస్థతో సన్నిహితంగా సహకరించడానికి అసోసియేషన్ అనుమతిస్తుందని పేర్కొన్నారు. నూతన అధ్యక్షునిగా 2028 వరకూ మూడేళ్ల పాటు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే శక్తివంతమైన రగ్బీ సంఘాన్ని సృష్టించడానికి కలిసి పనిచేయనున్నామని తెలిపారు. ఆకట్టుకున్న మార్షల్ ఆర్ట్స్ వైశాఖీ ఉత్సవాల సందర్భంగా సాయంత్రం నగర కీర్తన్ పేరిట ఊరేగింపు నిర్వహించారు. అమీర్‌పేట గురుద్వారా నుంచి ప్రారంభమైన ఊరేగింపు గ్రీన్‌ల్యాండ్స్, క్యాంపు కార్యాలయం, పంజాగుట్ట, అమీర్‌పేట మీదుగా గురుగ్రంథాన్ని, సిక్కు సంప్రదాయ ఆయుధాలను ప్రదర్శనంగా ఊరేగింపు నిర్వహించారు. సిక్కు యువతీ, యువకులు చేసిన మార్షల్ ఆర్ట్స్ కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ వంటి విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గురుగోవింద్‌సింగ్ వంశపారంపర్యంగా వస్తున్న ఐదు అరుదైన గుర్రాలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దారి పొడవునా గురుగ్రంథానికి పూజలు చేశారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ నగర్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. Mon, Apr 14 2025 3:04 PM
జీడిమెట్ల: కడుపున పుట్టిన ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపింది ఓ తల్లి. ఆపై తను కూడా అపార్ట్మెంట్లోని 5వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాజులరామారంలోని బాలాజీ లేఅవుట్లో చోటు చేసుకుంది. బాలానగర్ డీసీపీ కె.సురేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలోని చోడవరం గ్రామానికి చెందిన గాండ్ర వెంకటేశ్వరరెడ్డి భార్య తేజస్విని(35), ఇద్దరు కుమారులు ఆశిష్ రెడ్డి(7), హర్షిత్‌రెడ్డి(5)లతో కలిసి బాలాజీ లేఅవుట్లోని సహస్ర మహేష్ హెయిట్స్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌నంబర్ 204లో ఉంటున్నారు.వెంకటేశ్వరరెడ్డి బొంతపల్లిలోని ఓ పరిశ్రమలో నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. పిల్లలిద్దరూ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 1వ తరగతి, నర్సరీ చదువుతున్నారు. గురువారం ఉదయం వెంకటేశ్వరరెడ్డి డ్యూటీకి వెళ్లగా, ఇంట్లో తేజస్విని, పిల్లలు ఉన్నారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తేజస్విని అపార్ట్మెంట్ పైనుంచి దూకడంతో పెద్ద శబ్దం వచ్చింది. ఇది విన్న అపార్ట్మెంట్ వారు వెళ్లి చూడగా, తేజస్విని అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. వెంటనే అపార్ట్మెంట్ వాసులు సెకండ్ ఫ్లోర్‌లోని తేజస్విని ఇంట్లోకి వెళ్లి చూడగా, కిచెన్‌లో ఆశిష్ రెడ్డి అప్పటికే మృతి చెంది రక్తపుమడుగులో పడి ఉండగా, హర్షిత్‌రెడ్డి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు.వెంటనే అపార్ట్మెంట్ వారు హర్షిత్‌ను షాపూర్‌నగర్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సంఘటన జరిగిన పరిసరాలను పరిశీలిస్తే...తేజస్విని తన ఇద్దరు కొడుకులను విచక్షణారహితంగా చంపినట్టు ఉందని స్థానికులు చెప్పారు. విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి వచ్చిన బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, అడిషనల్ డీసీపీ హన్మంత్‌రావు, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేశ్‌లు వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.8 పేజీల లేఖ స్వాధీనంతేజస్విని ఉంటున్న ఫ్లాట్‌లో పోలీసులకు 8 పేజీల ఓ లేఖ దొరికింది. అందులో తన ఇద్దరు పిల్లలకు కంటి సమస్య ఉందని, రెండు గంటలకు ఒకసారి కంట్లో మందు వేయకుంటే పిల్లలు నొప్పితో ఏడుస్తారని...దేవుడా నా పిల్లలకు ఎందుకు ఇంత బాధను ఇచ్చావు అని రాసి ఉంది. తనను అందరూ పిచ్చిది అంటున్నారని, ఆ మాటలు భరించలేకపోతున్నానంటూ ఆ లేఖలో పేర్కొంది. కాగా తేజస్విని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, అపార్ట్మెంట్లోనూ ఎవరితో మాట్లాడదని స్థానికులు అంటున్నారు. Fri, Apr 18 2025 5:05 AM

రంగారెడ్డి: బెట్టింగ్ యాప్ మరో విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ లో బెట్టింగ్ పాల్పడిన పవన్ అనే యువకుడు.. ఒకేసారి రూ. లక్ష పోగొట్టుకున్నాడు. దాంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అత్తాపూర్ రెడ్డిబస్తీలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తన వద్ద ఉన్న ఐఫోన్.. రాయల్ఎన్ ఫీల్డ్ బైక్ ను సైతం అమ్ముకుని బెట్టింగ్ కు పాల్పడ్డాడు. తల్లి దండ్రులు పంపిన డబ్బులను సైతం బెట్టింగ్ లో పెట్టాడు. ఇందులో మొత్తం పోగొట్టుకోవడంతో తీవ్ర మనస్తాపం చెంది ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పవన్ స్వస్థలం గద్వాల్ జిల్లా. పవన్ మరణవార్త విని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com Thu, Apr 17 2025 9:39 PM
హైదరబాద్,సాక్షి: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. గచ్చిబౌలి పరిధిలోని శరత్ సిటీ మాల్ వద్ద పోలీసులు భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరాపై సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మాదకద్రవ్యాలతో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎస్ కుమారుడు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతను ఎక్కడి నుండి డ్రగ్స్ తీసుకువచ్చాడు.ఎవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడన్న దానిపై అధికారుల ఆరా తీస్తున్నారు. Wed, Apr 16 2025 3:37 PM
హైదరాబాద్: తన స్వీయ రక్షణ కోసం పెట్టుకున్న ఆయుధమే ఆమె పాలిట యమపాశమైంది. ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని ఓ మైనర్ అతికిరాతకంగా చంపేశాడు. అంతటితో ఆగకుండా వృద్ధురాలి శవంపై నిలబడి డ్యాన్సులు చేసుకుంటూ తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. హత్య జరిగిన మూడు రోజుల తర్వాత తాను ఓ ఘనకార్యం చేశానంటూ మిత్రుడికి ఫోన్ చేసి హత్య చేసిన వీడియోను షేర్ చేశాడు. అలా వీడియో కాస్తా వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నెల 11న చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు..రాజస్తాన్‌కు చెందిన పుక్రాజ్ చౌదరి, కమలాదేవి (70) దంపతులు చాలా ఏళ్ల క్రితం నగరానికి వచ్చి మీర్పేట్–హెచ్‌బీకాలనీ డివిజన్, కృష్ణానగర్ కాలనీ రోడ్డు నెంబరు–5లో ఉంటున్నారు. వారికి సంతానం లేదు. పదేళ్ల క్రితం భర్త చనిపోవడంతో కమలాదేవి ఒంటరిగానే ఉంటుంది. మొదటి అంతస్తులో ఆమె నివాసముంటూ గ్రౌండ్‌ఫ్లోర్‌లో షాపులను తన బంధువులకు అద్దెకిచ్చింది. అద్దె షాపుల్లో ప్రకాశ్ చౌదరి అనే వ్యక్తి హార్డ్‌వేర్ షాపు నిర్వహిస్తున్నాడు. 8 నెలల క్రితం రాజస్తాన్‌కు చెందిన ఓ బాలుడిని (17) షాపులో పనికి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో కమలాదేవికి బాలుడితో పరిచమైంది. కొన్ని విషయాల్లో కమలాదేవి ఆ బాలుడిని మందలించింది. దీన్ని మనసులో పెట్టుకున్న బాలుడు ఆమెను హత్య చేయాలని నిర్ణయిచుకున్నాడు. ఈ నెల 11న రాత్రి 10:15 గంటల సమయంలో కమలాదేవి ఇంట్లోకి వెళ్లి తనకు ఆకలిగా ఉందని చెప్పాడు. ఆమె రొట్టె చేసి ఇస్తానని చెప్పి పిండి సిద్ధం చేస్తుండగా..అక్కడే ఉన్న ఓ ఇనుప రాడ్‌ను తీసుకుని వెనుకనుంచి ఆమె తలపై బలంగా మోదాడు. కమలాదేవి రక్షణ కోసం పెట్టుకున్న రాడ్‌తోనే ఆమెపై దాడి చేశాడు. అప్పటికీ చనిపోకపోవడంతో రాడ్‌తో బలంగా గొంతులో పొడిచి ఆమె చీర కొంగుతో ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశాడు. చనిపోయిన వృద్ధురాలి గొంతు, చాతిపై నిలబడి డ్యాన్సులు చేస్తూ తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. రాత్రి 12:30 గంటల సమయంలో ఇంట్లోంచి ఓ కవరుతో బయటకు వచ్చి తాను ఉంటున్న ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు, ఆ తర్వాతి రోజు కూడా ఏం తెలియనట్లు షాపునకు వచ్చాడు. హత్య చేసిన మరుసటి రోజు పైకి వెళ్లి విగతజీవిగా పడి ఉన్న కమలాదేవిని చూసి వచి్చన దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అంతటితో ఆగకుండా ఈ నెల 14న బెంగుళూరులో ఉంటున్న మిత్రుడు సురేందర్‌కు ఫోన్ చేసి తాను ఓ ఘనకార్యం చేశానంటూ గొప్పగా చెప్పాడు. కమలాదేవిని హత్య చేసిన విషయాన్ని మిత్రుడికి చెప్పాడు. సరదాగా అంటున్నాడనుకొని మొదట నమ్మలేదు. దీంతో తన సెల్ఫోన్లో చిత్రీకరించిన వీడియోను మిత్రుడికి షేర్ చేశాడు. కంగుతిన్న సురేందర్ వెంటనే కిషన్‌సింగ్ పనిచేస్తున్న షాపు యజమానికి విషయం తెలియపరిచాడు. స్థానిక పెద్దల సాయంతో విషయాన్ని పోలీసులకు తెలపడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వా«దీనం చేసుకోవడంతో పాటుగా నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. Tue, Apr 15 2025 11:17 AM
అమెరికాకు చెందిన ఆర్థిక సేవల దిగ్గజం 'సిటిజెన్స్ ఫైనాన్షియల్ గ్రూప్', టెక్ సేవల సంస్థ కాగ్నిజెంట్‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని.. ఇండియాలో తన మొట్టమొదటి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జీసీసీ)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. దీనిద్వారా 1,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు లభిస్తాయని చెబుతున్నారు.కాగ్నిజెంట్ కొత్త జీసీసీ సెంటర్.. ఎంటర్ప్రైజ్ టెక్ సామర్థ్యాలు, కస్టమర్ ఎక్స్పీరియన్స్ ప్లాట్‌ఫామ్‌లు, డేటా అనలైజ్, ఉత్పత్తి ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది. నిజానికి ఇదొక ఇన్నోవేషన్ హబ్ మాదిరిగా పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది.హైదరాబాద్‌లో దాదాపు 57,000 మంది సిబ్బందిని కలిగి ఉన్న కాగ్నిజెంట్.. దాని AI-ఆధారిత ప్లాట్‌ఫామ్‌లైన న్యూరో, ఫ్లోసోర్స్లను ఉపయోగించి సిటిజన్స్ జీసీసీకి అదనపు శక్తిని ఇవ్వనుంది. అంతే కాకుండా క్లౌడ్, డేటా, సైబర్ సెక్యూరిటీ,ఇంటెలిజెంట్ ఆటోమేషన్‌లో భవిష్యత్తు అవసరానికి కావలసిన పరిష్కారాలను అందిస్తుంది.అమెరికా కంపెనీ.. కాగ్నిజెంట్‌తో కలిసిన సందర్భంగా ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సిటిజన్స్ బ్యాంక్, కాగ్నిజెంట్ చేతులు కలపడంతో, భారతదేశ జీడీపీకి 1 ట్రిలియన్ డాలర్లు అందించే మొదటి రాష్ట్రంగా అవతరించే లక్ష్యానికి తెలంగాణ దగ్గరగా ఉందని అన్నారు. ప్రస్తుతం బలమైన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు సాగుతోందని ఆయన వెల్లడించారు. Tue, Apr 15 2025 5:15 PM

సాక్షి, అమలాపురం: అమెరికా సుంకాల కొరడాను తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నా.. నిలిచిపోయిన ఎగుమతులు మొదలైనా.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని వనామీ రొయ్యల రైతుల వెతలు వీడలేదు. సుంకాల పేరుతో రాత్రికి రాత్రి ప్రతి కౌంట్‌కు రూ.40 నుంచి రూ.60 వరకు రొయ్యల ధరలు తగ్గించిన ఎగుమతిదారులు.. ఇప్పుడు కేవలం రూ.10 నుంచి రూ.20 వరకు మాత్రమే పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే 23 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోందని అంచనా. ప్రస్తుతం సుమారు 13 వేల ఎకరాల్లో మే 15 లోపు ఇంచుమించు తొలి పంట దిగుబడి రైతులకు అందుతుంది. అమెరికా సుంకాల సంక్షోభం వీడడంతో పాత ధరలు వస్తాయని వనామీ రైతులు ఆశలు పెట్టుకున్నారు. యూరప్ మార్కెట్ నుంచి అధికంగా ఆర్డర్లు రావడంతో ఫిబ్రవరి మొదటి వారంలో వనామీకి రికార్డు స్థాయి ధరలు దక్కాయి. 30 కౌంట్ (కేజీకి 30 రొయ్యలు) ధర కేజీ రూ.470 వరకు, 40 కౌంట్ ధర రూ.415కు పెరిగింది. స్థానికంగా రొయ్యల పట్టుబడి మొదలైనప్పటి నుంచి వ్యాపారులు నెమ్మదిగా ధరలు తగ్గిస్తూ వచ్చారు. అమెరికా సుంకాలు ప్రకటించే సమయానికి 30 కౌంట్ ధర రూ.460 వరకు తగ్గించారు. సుంకాల ప్రకటన తరువాత ఒకేసారి కేజీకి రూ.60 తగ్గించి రూ.400 చేశారు. 40 కౌంట్ ధర రూ.415 నుంచి రూ.390కి తగ్గించగా, సుంకాల ప్రకటన తరువాత రూ.310కి కుదించారు. ఇలా ప్రతి కౌంట్‌కు ధరను భారీగా తగ్గించేశారు. 50 కౌంట్ ధర రూ.350 నుంచి రూ.320కి, 60 కౌంట్ ధర రూ.320 నుంచి రూ.280కి, 70 కౌంట్ ధర రూ.290 నుంచి రూ.250కి, 80 కౌంట్ ధర రూ.260 నుంచి రూ.230కి, 90 కౌంట్ ధర రూ.240 నుంచి రూ.210కి తగ్గించేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో కేజీ రూ.250 ఉన్న 100 కౌంట్ సుంకాల విధించిన తరువాత రూ.190కి తగ్గించారు.టారిఫ్ వాయిదా పడినా..అమెరికా సుంకాల విధింపును మూడు నెలల పాటు వాయిదా వేసింది. దీంతో వనామీ రొయ్యల ఎగుమతులు మొదలయ్యాయి. పరిస్థితులు సానుకూలంగా మారడంతో పాత ధరలు వస్తాయని రైతులు ఆశించారు. కానీ.. పెంపు మాత్రం స్వల్పంగా ఉంది. 30 కౌంట్‌కు ఏకంగా రూ.60 వరకు ధర తగ్గించిన ఎగుమతిదారులు.. ఇప్పుడు కేవలం రూ.25 మాత్రమే పెంచారు. 40 కౌంట్‌కు రూ.60 వరకు తగ్గించి ఇప్పుడు రూ.30 వరకు పెంచారు. 50 కౌంట్‌కు రూ.50 తగ్గించి ఇప్పుడు కేవలం రూ.20, 60 కౌంట్‌కు రూ.40 తగ్గించి ఇప్పుడు రూ.20 చొప్పున పెంచి చేతులు దులుపుకున్నారు. Wed, Apr 16 2025 4:48 AM
Mon, Apr 14 2025 9:01 AM
Mon, Apr 14 2025 9:44 AM