‘‘తప్పుడు వార్తలు పదేపదే రాసి అది నిజం చేయాలనుకోవడం సాక్షి పత్రిక నైజం. గత ఐదు సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తున్నాను.. ఇది నాలుగో వాయిదా. నిజం నా వైపు ఉంది.. ఎన్ని సార్లయినా వస్తాను. ఆలస్యమైనా నిజం గెలుస్తుంది. (Andhra Pradesh News) ఈరోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని సొంత భోజనం తిన్నాను. ప్రభుత్వం నుంచి ఒక్క వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదు. వచ్చిన వాహనం కూడా నాదే. సొంత డబ్బుతో డీజిల్ కొట్టించుకున్నా. ఎక్కడా ప్రభుత్వంపై ఆధారపడకూడదని నా తల్లి భువనేశ్వరి చిన్నప్పటి నుంచి నేర్పించారు. సీఎం చంద్రబాబు నాకు ఏ బాధ్యత ఇచ్చినా అహర్నిశలు కష్టపడతా. నావల్ల పార్టీకి ఏనాడూ చెడ్డపేరు రాకుండా చూసుకుంటా. ‘యువగళం’ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హమీని నిలబెట్టుకునేందుకు చర్యలు తీసుకుంటాం.
యువగళం పాదయాత్రకు నేటికి రెండేళ్ళు నేటికి యువగళం పాదయాత్ర మొదలు పెట్టి రెండేళ్ళు. ప్రజలకు దగ్గరగా ఉండేందుకు యువగళం పాదయాత్ర ఎంతో ఉపయోగ పడింది. ప్రజల కష్టాలు అర్ధం చేసుకునేందుకు పాదయాత్ర ఉపయోగపడింది. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నేను నెరవేర్చుతా. మంత్రి అయినా సరే, ప్రజల మధ్యే ఉంటున్నా. ప్రజల సమస్యలు నేరుగా అడిగి తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తున్నా.
హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టి బొమ్మని దగ్ధం చేశారు. ఆయన ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బండి సంజయ్ రాజీనామా చేయాలని, ఆయన్ని బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వానికి అందించిన నిధులపై చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలో తీవ్ర విభేదాలు వస్తున్నాయి. ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతను తెచ్చుకుంది.