Jagadish Reddy కేసీఆర్ హరితహారం చేస్తే.. కాంగ్రెస్ హరిత సంహారం చేస్తోందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హెచ్సీయూ వ్యవహారంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిపై ఆయన నిప్పులు చెరిగారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న జంతువులు చిత్రహింసలకు గురవుతున్నాయని.. తమ బాధ్యత కాకపోయినా విద్యార్థులు పోరాటం చేస్తున్నారన్నారు.