హైదరాబాద్: గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ నగరవాసులను వరుణుడు పలకరించాడు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలో వర్షం కురిసింది. దీంతో నగర వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హిమయత్‌నగర్, కోఠి, అమీర్‌పేట, బోరబండ, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, హయత్‌నగర్, మేడ్చల్, విద్యానగర్, కోఠి, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఖైరతాబాద్‌లోని మెర్క్యురీ హోటల్ వద్ద ఓ కారుపై చెట్టు కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటపడ్డారు.