[02:30] దేశీయంగా 28 దిగ్గజ నమోదిత స్థిరాస్తి సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి అర్ధ భాగం (ఏప్రిల్-సెప్టెంబరు)లో రూ.92,437 కోట్ల విలువైన స్థిరాస్తులను విక్రయించాయి. బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ రూ.18,143.7 కోట్ల అత్యధిక విక్రయాల బుకింగ్‌లను నమోదు చేసింది.
[02:32] మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలను విలీనం చేసి ఒకే సంస్థగా ఏర్పాటు చేయాలన్న పాత ప్రతిపాదనను ఆర్థిక శాఖ మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. ఈ మూడు సంస్థల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది.
[02:31] పరిశ్రమకు ప్రయోజనాలు అందించేందుకు రూ.25,060 కోట్ల ఎగుమతి ప్రోత్సాహక మిషన్ (ఈపీఎం) అమలు కోసం మార్గదర్శకాలు ఈ వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.
[02:28] సమీప భవిష్యత్‌లో రష్యా నుంచి మన దేశ చమురు దిగుమతులు గణనీయంగా తగ్గొచ్చని, అయితే పూర్తిగా ఆగిపోవని విశ్లేషకులు అంటున్నారు. రష్యా చమురు సంస్థలపై అమెరికా కొత్త ఆంక్షలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయని తెలిపారు.
[02:18] భారత స్టాక్ మార్కెట్లు ఈ వారమూ రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. సూచీలు రికార్డు గరిష్ఠాలకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే స్వల్ప కాలంలో బలహీనతలకూ అవకాశం ఉందంటున్నారు.
[02:16] ఆహార పదార్థాల డెలివరీ విభాగంలో అగ్రగామిగా ఉన్న జొమాటో, స్విగ్గీలకు పోటీ ఇచ్చేందుకు ర్యాపిడో, మ్యాజిక్‌పిన్ సంస్థలు భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.
[02:13] ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ప్రయాణికుల వాహనాల (పీవీ) అమ్మకాలు సుమారుగా 5 శాతం పెరిగే అవకాశం ఉందని టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) శైలేష్ చంద్ర తెలిపారు.
[02:12] కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్ (సీఎస్సీ)తో వాణిజ్య రహస్యాల ఒప్పందానికి సంబంధించిన కేసులో అమెరికా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ‘ప్రతికూల తీర్పు’ వెలువరించిందని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వెల్లడించింది.
రాష్ట్రంలో కొత్తగా 10 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి టీజీ జెన్కో ప్రణాళికలు సిద్ధంచేస్తున్నది. అయితే వీటిలో ఐదువేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లను ప్రైవేట్ కంపెనీల �
ఇండిగో పేరుతో విమాన సేవలు అందిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్..బీఎస్ఈ సెన్సెక్స్ 30 సూచీలోకి ప్రవేశించనున్నది. వచ్చే నెల 22 నుంచి ఇది అందుబాటులోకి రానున్నట్టు పేర్కొంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోనున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులతోపాటు దేశీయ ఇన్వెస్టర్లు భారీగా నిధులు కుమ్మరించడంతో వచ్చే ఏడాది చివరినాటికి సూచీ సెన్సెక్స్ కీలక మైలురాయిని అధిగమించనున్�
బీమా రంగంలోకి విదేశీ పెట్టుబడులకు ఇక లైన్‌క్లియర్ అయింది. గతంలో 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించిన నరేంద్ర మోదీ సర్కార్ ఇక నుంచి 100 శాతం ఎఫ్‌డీఐలకు పచ్చజెండా ఊపింది.
ఎడ్యుటెక్ సంస్థ బైజూస్ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బైజూస్ ఆల్ఫా, అమెరికాకు చెందిన రుణదాత గ్లాస్‌ట్రస్ట్ కంపెనీ ఎల్ఎల్సీ చేసిన పిటిషన్‌పై అమెరికా కోర్టు డిఫాల్ట్ జడ్జిమెంట్ వెలువరించింది.
యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు హోండా గుడ్‌బై పలుకబోతున్నదా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. ఎంతో ఆర్భాటంగా దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసిన జపాన్ వా