చెన్నైకు రోజూ 10 లక్షల మంది వచ్చి వెళుతుంటారనేది ఓ అంచనా. వారిలో పర్యాటకులు, వ్యాపారులు, ఉపాధికోసం వచ్చేవారు ఉంటున్నారు. వారిలో చాలామందికి కాలకృత్యాలు తీర్చుకునేందుకు ప్రజా మరుగుదొడ్లే దిక్కు.
కళ్లకురిచ్చి కల్తీ సారా కేసు సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కళ్లకురిచ్చిలో జూన్ 18న మిథనాల్ కలిసిన సారా తాగడంతో అనారోగ్యానికి గురైన 193 మంది ఆస్పత్రిలో చేరారు.
రాష్ట్ర డిమాండ్లు 16వ ఆర్థికసంఘం నివేదికలో పూర్తిగా చోటుచేసుకోవాలని, వాటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని డీఎంకే ఉన్నతస్థాయి కార్యాచరణ కమిటీ సమావేశం తీర్మానించింది.
రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. అడపాదడపా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షానికి నీరు నిల్వ ఉంటోంది.