పరిశ్రమల్లో భద్రతా లోపాలు కార్మికుల ప్రాణాలను బలిగొంటున్నాయి. కొన్ని యాజమాన్యాలు కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీనికితోడు అధికారుల పర్యవేక్షణ కొరవడింది.
జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా కొడికొండ- శిర 544ఈ జాతీయ రహదారి నాలుగు వరుసలు రూపుదిద్దుకోనుంది. దీనికోసం ప్రతిపాదనలు (డీపీఆర్) సిద్ధం చేసి పంపాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జిల్లా వైకాపా నాయకుడు డాక్టర్ బత్తల హరిప్రసాద్ నివాసంలో మంగళవారం రాత్రి సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో అనంతపురం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి నెలా రెండు, మూడు స్థ్థానంలో అనంతపురం ఉండగా ఈ నెలలో ఏకంగా మొదటి స్థానానికి ఎగబాకి రెండోసారి రికార్డు నమోదు అయింది.
జీవిత కాలంపాటు ఆరోగ్యం, ఆనందంగా ఉండాలంటే ఆటపాటల పోటీల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా రెవెన్యూ అధికారి మాలోల పిలుపునిచ్చారు. ఆటలు నిజ జీవితానికి ముడిపడి ఉన్నాయని, ఈ విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
జిల్లాలోని డి.హీరేహాళ్, బొమ్మనహాళ్ మండలాల మధ్య రూ.560 కోట్ల వ్యయంతో ‘ధనలక్ష్మి ఐరన్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్’ పరిశ్రమ స్థాపనకు మంగళవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రైతుల నిరసనల మధ్య సాగింది.
మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అవినీతి, అరాచకాలపై నా వద్ద చిట్టా ఆధారాలతోసహా ఉన్నాయి. దేనికీ భయపడను. పెద్దారెడ్డి సమాజానికి చీడ పురుగులాంటివాడు. ఆయన ఆక్రమించిన స్థలాలు కావాలా.. ఇళ్లు కావాలా? చెప్పండి.
కళ్యాణదుర్గం నకిలీ ఈ-స్టాంపు వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు, తెదేపా నేత ఉన్నం మారుతీ చౌదరి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ నేతృత్వంలో పని చేస్తున్నామని, ఎలాంటి అక్రమాలు జరగవని, ఏ రికార్డునైనా పరిశీలించుకోవచ్చని, తమ హయాంలో పారదర్శకతకు పెద్దపీట వేశామని మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ పేర్కొన్నారు.