మొంథా తుపాను తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలను అతలాకుతలం చేసింది. వరద బీభత్సానికి లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసం కాగా, పెద్దసంఖ్యలో ఇళ్లు నీటమునిగాయి. పశు సంపదకూ తీరని నష్టం వాటిల్లింది. ఎన్నో జీవాలు వరద ఉద్ధృతిలో గల్లంతయ్యాయి. గడ్డివాములు, పచ్చిక బయళ్లు జలమయం కావడంతో మేత అందక మిగిలిన పశువులు ఆకలితో అలమటిస్తున్నాయి.
అవకాశాలున్నా అందిపుచ్చుకోలేని అశక్తత అంటే ఏంటో భారతదేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐల) తీరును చూస్తే అర్థమవుతుంది. 2024-25లో దేశంలోకి స్థూల ఎఫ్డీఐల ప్రవాహం అయిదు వేల కోట్ల డాలర్లకు పైనే ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, నికర ఎఫ్డీఐలు మాత్రం 90శాతం పడిపోయాయి. గతంలో వచ్చిన విదేశీ పెట్టుబడులు మరలి పోవడమే దీనికి కారణం.
అణువణువునా సానుకూల దృక్పథం నిండిన వారి ముందు విధి కూడా ఓటమిని అంగీకరించక తప్పదేమో. ‘అవును మరి, పోరాటం వచ్చినవాణ్ని. ఎందుకు ఓడిపోతాను’ అంటాడు అలెక్స్ పర్రా. ‘నాకే ఎందుకిలా అనుకుంటే అక్కడితో నా ప్రయాణం ఆగిపోతుంది. జీవితం పగబట్టిందని ఏడుస్తూ కూర్చుంటే దాని చేతిలో నేను ఓడిపోయినట్లే.
వరసగా మూడు పరాజయాలు... అవి కూడా అంతవరకు బాగా ఆడి గెలుపు వాకిట్లోకి వచ్చి నిలబడి అక్కడ కాడి వదిలేయడంతో తప్పని ఓటములు... జట్టు ఆత్మవిశ్వాసాన్ని నిలువునా నేలకూల్చే పరాభవాలు... వాటి తాలూకూ చేదు అనుభవాల నుంచి వెనువెంటనే తేరుకుని విశ్వసమరంలో విజేతగా నిలవడమంటే, అది అందరివల్లా అయ్యే పని కాదు!