ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠన చర్యలు తప్పవని రిటైడ్ జడ్జి సాంబశివరావు అన్నారు. శుక్రవారం చేవెళ్ల కోర్టు ఆవరణలో ట్రాఫిక్ లోక్ అదాలత్ నిర్వహించారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జిల్లాలోని మండల కేంద్రాలతోపాటు గ్రామగ్రామాన అట్టహాసంగా జరుపుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పలుచోట్ల జాతీయ జెండాలను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను నిర్మించి, షాద్నగర్ నియోజక వర్గానికి సాగునీరు అందించాలని వైఎస్సార్టీపీ, ప్రజా సంఘాల నాయకులు అన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలనను అంతంమొందించేందుకు నాటి తెలంగాణ సాయుధ పోరాటం తరహాలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు.
ఉపాధి హామీ పనులు చేస్తూ మహిళా కూలీ మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం వెంకిర్యాలలో జరిగింది. గ్రామానికి చెందిన మోత్కూరు చిన్న పెంటమ్మ (50) ఏప్రిల్ నుంచి గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులకు వెళ్తుంది.
రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మండలంలోని కుదురుమళ్ల, నందారం, దౌల్తాబాద్, బిచ్చాల్, బాలంపేట్ గ్రామాల్లో శుక్రవారం రైతు వేదికలను ప్రారంభించారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు వికారాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల్లో అట్టహాసంగా జరుపుకున్నారు. పట్టణ, మండల కేంద్రాలతో పాటు గ్రామగ్రామాన ప్రభుత్వ , పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. అనంతరం అమరవీరుల స్థూపం, చిత్ర పటాల వద్ద నివాళులర్పించారు. వికారాబాద్ కలెక్టరేట్ అవరణలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్కుమార్, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
ఇబ్రహీంపట్నం రూరల్: కేంద్ర జలశక్తి అభియాన్ కేంద్ర బృందం సభ్యులు అంకిత్ మిశ్రా, డిప్యూటీ సెక్రటరీ అంకిత్ విశ్వకర్మ గురువారం కలెక్టరేట్లో కలెక్టర్...
షాద్నగర్: బడీడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించేందుకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంగ్లిష్ మీడియం విద్యాబోధనపై ప్రజల్లో...
సాక్షి, సిటీబ్యూరో: మహారాష్ట్రకు అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర నిందితులను హయత్నగర్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ...