ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు వినియోగించేలా చూసే విషయంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. హెల్మెట్ల వాడకంలో కొంత పురోగతి కనిపిస్తోందని పేర్కొంది.
ముఖ్యమంత్రి చంద్రబాబును నటుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తన సతీమణి పద్మజతో కలిసి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాష్ట్ర సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు.
రాజధాని అమరావతి పనులను పునఃప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ బుధవారం సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో 108 (అత్యవసర వైద్యం), 104 (సంచార వైద్యం), కాల్‌సెంటర్ సేవలకు సంబంధించిన టెండరును భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియానికి ప్రభుత్వం ఖరారు చేసింది.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసి తీరాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఖాళీల భర్తీ ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉంటుందని తెలిపింది.
రాష్ట్రంలో ప్రతిపాదించిన రక్షణ రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కేంద్రాన్ని కోరారు. దిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి..
‘అమరావతి చిత్రకళ వీధి’ లాంటి వేదికల ద్వారా కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కలుగుతుందని, ప్రభుత్వం కూడా దీనికి అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పీఎంజేఏవై వయో వందన’ (ఆరోగ్య బీమా) సామాజిక, ఆర్థిక పరిస్థితులతో నిమిత్తం లేకుండా 70 ఏళ్లు, ఆపైన ఉన్న వారందరికీ వర్తింపజేస్తూ..
ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌తో పాటు జేఈఈ, నీట్‌కు ఉచితంగా శిక్షణ అందించేలా కొత్త పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచే దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
విజయవాడ రైల్వేస్టేషన్లో రద్దీ తగ్గించడానికి అక్కడికి సమీపంలోని గొల్లపూడి వద్ద శాటిలైట్ రైల్వేస్టేషన్ నిర్మించాలని ఏపీ భాజపా అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు.
ప్రకాశం జిల్లా కనిగిరిలో రిలయన్స్ సీబీజీ (కంప్రెస్డ్ బయో గ్యాస్) ప్లాంట్ ఏర్పాటు బయో ఫ్యూయల్ రంగంలోనే కీలక ముందడుగుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు.
గిరిజన విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాల్లో వసతుల కల్పనకు రూ.156 కోట్లు విడుదల చేసేందుకు బుధవారం పరిపాలన అనుమతులిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
శాసనసభ్యుల కోటాలో ఎన్నికైన ముగ్గురు, పట్టభద్రుల నియోజకవర్గాలనుంచి ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు బుధవారం పదవీ ప్రమాణం చేశారు. శాసనమండలి ఛైర్మన్ మోషేన్‌రాజు వీరితో ప్రమాణం చేయించారు.
రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వం మళ్లీ ముందుకొచ్చింది. ఏపీ ప్రభుత్వ ఆహ్వానం మేరకు బుధవారం రాష్ట్రానికి వచ్చిన సింగపూర్ ప్రతినిధుల బృందం..
రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో తలపెట్టిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను తీర్చిదిద్దేందుకు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు, ప్రొఫెసర్లు, ఇతర మేధావులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.
గత నెల 24న రాజమహేంద్రవరం సమీపంలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల అంతకు ముందు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలో పెద్ద ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. బుధవారం బయటకు వచ్చిన సీసీ కెమెరాల్లోని దృశ్యాల ద్వారా ఈ విషయం వెల్లడైంది.
తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవారి పాదాల చెంత ఉన్న అలిపిరిలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని తితిదే భావిస్తోంది. అమరావతిలో బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో తితిదే ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, ఈవో జె.శ్యామలరావు,
ఇంటికి అవసరమైన వస్తువులన్నీ ఒకేచోట లభిస్తే చాలా సౌలభ్యంగా ఉంటుంది. వినియోగదారులకు నాలుగైదు చోట్లకు తిరిగే పని తప్పుతుంది. అన్ని వస్తువులూ ఒకేచోట కొని తీసుకెళ్లొచ్చు. ప్రభుత్వం అలాంటి ప్రయత్నమే చేస్తోంది.
తిరుమలకు భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా తితిదేను తీర్చిదిద్దాలని.. భక్తులకు అందించే సేవలు, సౌకర్యాల్లో 100 శాతం మార్పు కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన పీ-4కు రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లు నాంది కాబోతున్నాయి. వాటి స్థాపనతో రాష్ట్రంలో పేదరికం తొలగించే దిశగా తొలి అడుగు పడింది’ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
Akash Ambani తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి (Lord Venkateswara) వారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Akash Ambani) పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ దర్శించుకున్నారు.
పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌కు సంబంధించి మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రవీణ్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని ఫుడ్ ప్లాజా హోటల్ వద్ద ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.
శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండలం జీర్గేపల్లి గ్రామంలో స్వారక్క, గ్యారక్క, ముడుపక్క త్రిమూర్తి అమ్మవార్ల ఆలయంలో అర్ధరాత్రి మూడు ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి. ఈ దృశ్యాలు ఆలయంలో అమర్చిన సీసీ కెమెరాలో నమోదయ్యాయి.