ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. కానీ ఛార్జర్ కోసం చూడాల్సిన అవసరం లేదు. ఇలా ఒళ్లో పెట్టుకుంటే అలా ఛార్జింగ్ అయిపోతుంది. ఇదేం టెక్నాలజీ అని ఆశ్చర్యపోతున్నారా?
శారీరకశ్రమ లేకుండా... ఎక్కువ సమయం కూర్చునే వారిలో అనారోగ్య సమస్యలు వస్తాయని తెలుసు. కానీ ఇటువంటి వారిలో అకాల వృద్ధాప్యం కూడా వస్తుందని అంటోంది తాజా అధ్యయనం.
ఒక్కోసారి వెయ్యి లెక్కలు వేసి నిర్ణయం తీసుకున్నా ఫెయిల్ అవుతాం. ఇంకోసారి ఏం ఆలోచించకుండా మనసుకు ఏదనిపిస్తే అది చేస్తాం. అదేంటో విచిత్రంగా ఆ నిర్ణయం కచ్చితంగా వందశాతం ఫలితాన్నిస్తుంది.
గాలిని అమ్ముతాం కొంటారా అని ఎవరైనా అంటే ఏం చేస్తారు? ఆ మాట అన్నవారిని పిచ్చోళ్లను చూసినట్టు చూస్తారు కదా. కానీ, నిజంగానే గాలిని డబ్బాల్లో పెట్టి అమ్మేస్తున్నారు.
ఉద్యోగాలకు వెళ్లేవాళ్లు పిల్లల్ని ఉదయం డేకేర్లో దింపి.. సాయంత్రం ఇంటికి తీసుకెళుతుంటారు. అదే విధంగా, పంజాబ్లోని కక్కర్ గ్రామస్థులూ, ఆ చుట్టుపక్కల కొన్ని గ్రామాల వారూ- పొలాలకు వెళ్లే ముందు ఇంట్లోని పెద్దవాళ్లని కక్కర్లోని గురుద్వారా వద్ద దింపుతారు.
శివకార్తికేయన్తో మాట్లాడుతూ ఉంటే... అతనిలోనే కాదూ మనలోనూ ఎన్నో ఉద్వేగాలు వచ్చి పోతుంటాయి. దుఃఖం, ఆవేదన, ఆందోళన, ఆసక్తి, ఉత్కంఠ... ఇలా అన్నీ వరసకడతాయి.
గలగలా మాట్లాడే అమ్మాయి చేతివేళ్లు- ఆ మాటలకు తగ్గట్టు తాళం వేస్తుంటే... టకటకా టైప్ చేసే ఆ కోమలి వేళ్లే- కీబోర్డ్ మీద నాట్యమాడుతుంటే... చూడ్డానికి ఎంత ముచ్చటేస్తుందో కదా!
గదుల్లోని గోడలకు అమర్చే ఒకటి రెండు వాల్ పెయింటింగ్లు అందాన్ని తెస్తాయనేది తెలిసిన విషయమే. కానీ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అదే వాల్పెయింటింగ్ ఇంటికి లుక్నిస్తూనే ఈ చలికాలంలో గదుల్నీ వెచ్చగా మార్చేస్తే ఎలా ఉంటుందంటారూ.
మజ్జిగ, పెరుగు... పొట్ట ఆరోగ్యానికి మంచివని తెలిసినా- కనీసం వాటిని ముట్టుకోరు కొంతమంది... బీట్రూట్, దానిమ్మలాంటివి తీసుకుంటే రక్తం పెరుగుతుందని ఎంత చెప్పినా నోట్లోనైనా పెట్టరు మరికొందరు...
చూడ్డానికి ముద్దుగా, బొద్దుగా ఉంటాయి. ఇష్టంగా పెంచుకున్నామా... ఇల్లంతా కలియతిరుగుతూ ఇట్టే మచ్చిక అయిపోతాయి. ఎత్తుకోవాలనిపిస్తాయి. ఇదంతా... కుక్కపిల్లలకో పిల్లి పిల్లలకో సంబంధించి కాదు.
కూతురు పెళ్ళికి కట్నమేమీ లేదు కానీ కానుకలు ఘనంగా ముట్ట చెప్పారు ప్రకాశం, రమణి దంపతులు. అన్నిచోట్లా వెండి సామాను ఇచ్చారు. కాళ్ళు కడుగు పళ్లెం-చెంబు, పానకం బిందెలు, పానకం గ్లాసులు, ఎదురు సన్నాహంలో ఇచ్చే బ్రష్, టంగ్ క్లీనర్, బొట్టు పెట్టె, కుంకుమ భరిణ... ఒకటనేముంది... అన్నీ వెండివే ఇచ్చింది రమణి.
తిరుపతి నుంచి హైదరాబాద్కి ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నాడు శ్రీకర్. స్నేహితుడు చెప్పాడని ‘బ్రింగ్’ అనే ఆప్ తెరిచి అందులో తన ప్రయాణానికి సంబంధించిన వివరాల్ని ఉంచాడు.
ఎవరైనా తమ పొట్టికూటి కోసమే కష్టపడి సంపాదించుకుంటారు. అయితే వీళ్లు మాత్రం పేదల ఆకలి తీర్చడం కోసమే శ్రమిస్తున్నారు. అందులోనే ఆత్మసంతృప్తిని వెతుక్కుంటున్నారు.