కరీంనగర్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మన్కుమార్ అన్నారు. బుధవారం కరీంనగర్ పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికివ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం నిరంతరంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో పోలీస్ గ్రౌండ్లో ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
రాష్ట్రంలో అభివృద్ధి, పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన కొనసాగు తున్నదని, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేం దుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు కృషి చేస్తున్నారని రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్ అన్నారు. బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహిం చిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
జగిత్యాల క్రైం, సెప్టెంబరు17 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనలో సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని బీసీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో బుధవారం తెలంగాణ ప్రజాపాలన వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని బీసీ కమిషన్ చైర్మన్ ఎగురవేశారు.
జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకల్లో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ వేణు, అరుణశ్రీలతో కలిసి పాల్గొన్నారు. వారు విశ్వకర్మ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పూజలు చేశారు.
మహిళల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం స్వస్త్ నారీ, సాశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి ప్రారంభించారు. వంశీకృష్ణ మాట్లాడుతూ, ఇల్లు బాగుండాలంటే మహిళలు వారి ఆరోగ్యం బాగుండాలన్నారు.
చేనేద కార్మికులను ఇబ్బందులు పెడితే సహించేదిలేదని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం గంగాధర మండలం గర్షకుర్తిలో ఇటీవల విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసిన పవర్ లూమ్స్ను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు.
రామగుండం కార్పొరేషన్లో అక్టోబరు 2వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కమిషనర్ అరుణ శ్రీ పేర్కొన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్పొరేషన్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
రామగుండం నగరపాలక సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్టర్లను కొందరు బ్లాక్మెయిల్ చేస్తున్నారని, వారి చర్యలను సహించేది లేదని కాంట్రాక్టర్లు హెచ్చరించారు. బుధవారం ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో కాంట్రాక్టర్లు కృపాకర్రావు, విశ్వతేజ, కుర్మ శ్రీనివాస్, కోడూరి రవి తదితరులు మాట్లాడారు.
ఉమ్మడి జిల్లాలో మూడు ప్రధాన రహదారుల విస్తరణ, నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిధులు మంజూరు చేసింది. కొన్నేళ్లుగా ప్రతిపాదనల్లో ఉన్న ఈ మార్గాలకు మోక్షం కలిగించే విధంగా కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవ చూపించారు.
రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ మొదలైంది. ఈ క్రమంలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నమోదయ్యే కేసుల సంఖ్య మూడో వంతుకు తగ్గినప్పటికీ బియ్యం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు.
తెల్ల కాగితాలపై రాసుకున్న భూ కొనుగోలు ఒప్పంద పత్రాలు(సాదాబైనామా) దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. 2020 అక్టోబరు 12 నుంచి నవంబర్ 11 వరకు స్వీకరించిన దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది.
కార్మికులకు ఆర్థిక ప్రయోజనాలపై ఆదాయ పన్ను చెల్లింపులో సింగరేణి యాజమాన్యం మీనమేషాలు లెక్కిస్తోంది. కార్మికులకు వివిధ రూపాల్లో వచ్చే ఆర్థిక ప్రయోజనాలపై విధించే ఆదాయ పన్ను యాజమాన్యమే చెల్లించాలి.