భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో నిజాంసాగర్ జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 27 గేట్లను పైకి ఎత్తి సుమారు 2 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న మంజీరా నదిలోకి విడుదల చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. జహీరాబాద్ ఎంపీ సురేశ్షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీతో కలిసి ఆమె గురువారం జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మాచారెడ్డి మండల మీదుగా కామారెడ్డికి బయల్దేరిన ఎమ్మెల్యే కేటీఆర్ పల్వంచ వాగు ఉద్ధృతికి రాకపోకలు లేకపోవడంతో వెనుదిరిగారు. నీటి ప్రవాహానికి తెగిన వాగు పరిస్థితిని పరిశీలించారు.
ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బాన్సువాడలో గులాబీ జెండా ఎగరేస్తామని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. గురువారం బాన్సువాడలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు భారాసలో చేరారు.
నవీపేట మండలం యంచ వద్ద ఉప్పొంగిన గోదావరి నదిఈనాడు, నిజామాబాద్, ఈనాడు డిజిటల్, కామారెడ్డి : ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా వరుణుడు గర్జించాడు. ఊరూవాడా ఏకం చేశాడు.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శెట్లూర్లో ఇటీవల వరదలు అకస్మాత్తుగా రావటంతో గొర్రెల కాపరులు, మందలు చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం(ఎస్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగింది.
భారీ వర్షాలతో ఉమ్మడి జిల్లాలోని ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారితో పాటు, పలు మార్గాల్లో ప్రవాహ ఉద్ధృతి చేరింది. దీంతో బస్సు సర్వీసులను రద్దు చేశారు.
వరద నివారణ చర్యల్లో భాగంగా ఖమ్మం జిల్లాలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూం సిబ్బంది అప్రమత్తతతో కామారెడ్డి జిల్లాకు చెందిన తొమ్మిది మంది ప్రాణాలతో బయటపడ్డారు.
పాశ్చాత్య భాషా ప్రభావంతో తేనెలూరే తెలుగుకు నేటితరం దూరమవుతోంది. మారుతున్న కాలానికి తగ్గట్టు, మన మాతృభాషా పరిమళాలను నేటి విద్యార్థిలోకానికి చేరువ చేయాల్సిన బాధ్యత యువతరం రచయితలదే.
భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, ప్రయాణికులకు జిల్లా అధికారులు అండగా నిలిచారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేశ్చంద్రాలతోపాటు ప్రత్యేకాధికారి రాజీవ్గాంధీ హన్మంతు పరిస్థితిని పర్యవేక్షించారు.
వర్షాలతో సిర్నాపల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహించి రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం వినాయక ప్రతిమలు తీసుకెళ్లేందుకు నిజామాబాద్ వచ్చిన యువత.. తిరిగి వెళ్లేలోపు సిర్నాపల్లి వాగు ఉప్పొంగడంతో దాన్ని దాటే వీలు లేక గ్రామానికి చేరుకోలేకపోయారు.
భారీ వర్షానికి తోడు కౌలాస్, నిజాంసాగర్ జలాశయాల గేట్లు ఎత్తివేయడం, మహారాష్ట్రలోని లెండి ప్రాజెక్టు నుంచి వరద భారీగా రావడంతో డోంగ్లి మండలంలోని సిర్పూర్, పెద్దటాక్లీ, హసన్టాక్లీ తదితర గ్రామాల ప్రజలు ఇళ్లు వదిలి వెళ్లిపోయారు.
దోమకొండలోని ఎడ్లకట్ట వాగులో బుధవారం నీటి ఉద్ధృతికి ఇద్దరు గల్లంతు అయ్యారు. దోమకొండకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ మ్యాక చిన్న హరిశంకర్, ఆయన కుమారుడు మహేశ్ తమ కారులో తన మేనల్లుడి అంత్యక్రియల కోసం వెళ్తుండగా.. మార్గమధ్యలో ఎడ్ల కట్ట వాగు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానల కారణంగా తిమ్మారెడ్డి , అజామాబాద్ గ్రామాల వద్ద ప్రధాన రహదారి కోతకు గురైంది. తిమ్మారెడ్డి చెరువు నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో ఆ రెండు గ్రామాల మధ్య ఉన్న రోడ్డు కొట్టుకుపోయింది.
గత మూడురోజులుగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించారు. ఈ వరద కారణంగా జిల్లాలోని పలు రహదారులు ధ్వంసమయ్యాయి.