రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా మార్కెట్ కమిటీ కృషి చేయాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో చైర్మన్ మార్ని వాసు అధ్యక్షత నిర్వహించిన మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశానికి ఆయన విచ్చేసి మాట్లాడారు.
అమ్మభాషను పరిరక్షించుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. నన్నయ వర్శిటీలో శుక్రవారం తెలుగుభాష దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాలను నిర్వహించారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్, గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటాలకు వీసీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సఖినేటిపల్లి మండల పరిధిలో 13 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. పల్లిపాలెం, అంతర్వేది, అంతర్వేదికర గ్రామాల్లో తీరం కోతకు గురవుతోంది. కేవశదాసుపాలెం, అంతర్వేది, పల్లిపాలెం గ్రామాల్లోకి నీరు చొచ్చుకువస్తోంది.
భార్యతో గొడవ.. ఆపై మద్యం మత్తు.. దగ్గర దారిలో రైలును అందుకోవాలనే ఆత్రుత.. అంతే ఎనిమిదేళ్ల కుమారుడిని తీసుకొని బయలుదేరాడా వ్యక్తి. చీకట్లో పట్టాలపై నడుస్తుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే ఇరువురూ మృతిచెందారు.
ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం జగనన్న కాలనీలో ఈ నెల 21న జరిగిన పగటి పూట దొంగతనం కేసును వారం వ్యవధిలోనే సీఐ బి.సూర్య అప్పారావు, ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం సిబ్బంది ఛేదించడం అభినందనీయమని డీఎస్పీ శ్రీహరిరాజు అన్నారు.
మోరంపూడి శ్రీచైతన్య పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న గుర్రం విన్సెంట్ ప్రసాద్ అనే విద్యార్థిని ఇద్దరు సహచర విద్యార్థులు ఇస్త్రీ పెట్టెతో కాల్చిన సంగతి తెలిసిందే.