రైతు భరోసా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఈనెల 16 నుంచి 26 వరకూ గ్రామ సభలు నిర్వహించనున్నట్లు సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 75వ గణతంత్ర వేడుకల సందర్భంగా జనవరి 26న రైతు భరోసా అమలు చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు.
మేడారం సందర్శన అనగానే గుర్తొచ్చేది ఆధ్యాత్మికం.. పర్యాటకం.. మరో నాలుగు రోజుల్లో మొదలయ్యే చిన్న జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులు వన దేవతలకు మొక్కులు చెల్లించిన తర్వాత కుటుంబ సమేతంగా.. ప్రకృతిని ఆస్వాదించొచ్చు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, వసతిగృహాల్లోని విద్యార్థుల్లో జీవననైపుణ్యాలు, నైతిక విద్యను పెంపొందించేందుకు.. జిల్లా అధికారులు నడుంబిగించారు.
రవాణా శాఖలో కొందరు సిబ్బంది ఏళ్ల తరబడి తిష్ఠవేసి.. అందినకాడికి దండుకుంటున్నారు. ఒక్క హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోనే సుమారు 15 మంది ఉద్యోగులు చాలా కాలంగా బదిలీలు లేకుండా దర్జాగా విధులు నిర్వర్తిస్తున్నట్లు తోటి సిబ్బందే చెప్పడం గమనార్హం.
కాకతీయ విశ్వవిద్యాలయ వసతి గృహాల్లోని కొందరి విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపం.. మిగతా వారికి శాపంగా మారుతోంది.. లేనిపోని విషయాలకు పోయి ఘర్షణలకు దిగుతున్నారు. ఫలితంగా క్యాంపస్లో విద్యా వాతావరణం చెడిపోతోంది.
జనగామ జిల్లా రఘునాథపల్లి రైల్వేస్టేషన్ వద్ద గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 13.730 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు.
రాష్ట్ర పురపాలక చట్టం-2019, టీఎస్ బీపాస్ నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలు చేపట్టాలని, ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు నిలిపివేస్తామని గ్రేటర్ వరంగల్ కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే తేల్చి చెప్పారు.
జనగామలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 8 ఏళ్లుగా సీటీ స్కానింగ్ సేవలందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి స్థాయి నుంచి వైద్య కళాశాలకు అనుబంధంగా మారి జనరల్ ఆసుపత్రిగా డీఎంఈ పరిధిలో జనగామ జనరల్ ఆసుపత్రి వైద్య సేవలందిస్తోంది.
అక్రమాస్తుల కేసులో అరెస్టయిన ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్కు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతనిని ఖమ్మం జైలుకు తరలించారు.