[06:10] రూ.55,000కు ఆశపడిన ఓ వృద్ధురాలు మనవరాలిని ఓ మహిళకు విక్రయించింది. ఆ మహిళ, ఆమె కుమారుడి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులు ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
[05:15] భూతాపంపై పోరాటంతోపాటు దీని నుంచి మహిళలకు ఉపశమనం కలిగించేందుకు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ 50 మిలియన్ డాలర్ల(413.6 కోట్లు)ను ప్రకటించారు.
[04:34] దేశవ్యాప్తంగా 25 ప్రాంతాల నుంచి హజ్ యాత్రకు బయలుదేరొచ్చని. త్వరలో దరఖాస్తులు ఉచితంగా అందుబాటులోకి తెస్తామని అల్పసంఖ్యాక వర్గాల మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.
[04:34] పెంపుడు శునకం ఒకరిని కరవడమే కాకుండా.. దాని పట్ల అజాగ్రత్తగా ఉన్నందుకు యజమానికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది మహారాష్ట్రలోని గిర్గావ్ కోర్టు. 2010లో.. నిందితుడు హొర్ముస్జి, కేస్రీ ఇరానీ అనే ఇద్దరు వ్యక్తులు ముంబయిలోని నేపియన్సీ వద్ద నిలబడి గొడవ పడుతున్నారు.
[04:34] విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని ఆకాంక్షించే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. 2017 నుంచి 2022 వరకు ఆరేళ్ల కాలంలో 30 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇందుకోసం మన దేశాన్ని వీడి వెళ్లారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
[04:34] భారత్-చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలని, దానివల్ల ఆసియాకే కాకుండా యావత్ ప్రపంచ భద్రతకూ ఎంతో లబ్ధి కలుగుతుందని మన దేశంలో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ చెప్పారు.
కోల్‌కతా అంబులెన్స్ యాక్సిడెంట్ అంబులెన్స్ నుండి చికిత్స కోసం ఉత్తర బెంగాల్ వైద్య రోగులను తీసుకువెళుతున్న అంబులెన్స్ మార్గంలో ట్రక్కును ఢీకొట్టింది, ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు నివేదించబడింది. అందరూ మేనాగురి వాసులు. చికిత్స కోసం ఉత్తర బెంగాల్ మెడికల్ కాలేజీకి వెళ్తున్నారు.
[04:12] ఎవరైనా కుడి లేదా ఎడమ చేత్తో రాస్తారు. రెండు చేతులతోనూ ఏకకాలంలో రాసే సాధనతో ఓ మెరుపు మెరుస్తోంది కర్ణాటకలోని మంగళూరుకు చెందిన 17 ఏళ్ల బాలిక ఆదిస్వరూప.
[04:12] 65 ఏళ్ల వ్యక్తి.. 23 ఏళ్ల యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. అంతే కాకుండా పెళ్లి ఊరేగింపులో తన ఆరుగురు కుమార్తెలతో కలిసి డీజే పాటలకు హుషారుగా నృత్యం కూడా చేశాడు.
[04:12] గత ఐదేళ్లలో ఎల్పీజీ సిలిండర్ ధర 42% పెరగ్గా, ప్రభుత్వం ప్రజలకు అందించే సబ్సిడీ మొత్తం 92% తగ్గింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియంశాఖ సహాయమంత్రి రామేశ్వర్ పలు వివరాలతో సమాధానమిచ్చారు.
[04:12] రైళ్లలో ప్రయాణికులు తమకు నచ్చిన ఆహార పదార్థాలు.. నచ్చిన హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ఆర్డరిచ్చే సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకోసం వాట్సప్ నంబరును ప్రవేశపెడుతున్నారు.
[23:40] తనకు కాబోయేవాడికి మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం పోయిందని, ఇప్పటికీ అతన్ని పెళ్లాడొచ్చా? అని ఓ యువతి నెట్టింట పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థలు తమ ఉద్యోగాల్లో కోత పెడుతోన్న విషయం తెలిసిందే.
ఐఎన్ఎస్ విక్రాంత్‌పై తొలిసారిగా యుద్ధ విమానం ల్యాండైంది. దాదాపు 20 వేల కోట్లతో నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్‌ను గతేడాది సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే.
[20:08] ‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా నౌకాదళం చారిత్రక మైలురాయి దాటింది. భారత్ తొలి స్వదేశీ విమాన వాహక నౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్’పై తొలిసారి ఓ నౌకాదళ స్వదేశీ యుద్ధ విమానం ల్యాండ్ అయింది.
చీరకట్టుతో అవలీలగా నదిలోకి దూకుతున్న మహిళల వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. తమిళనాడులోని తమిరబరని నది వద్ద ఈ దృశ్యాలను రికార్డు చేశారు.
Man Shot At By Cops రద్దీ మార్కెట్లో ఓ యువకుడు కత్తిలో హల్చల్ చేశాడు. జీన్స్ ప్యాంట్, నల్లటి బనియన్ ధరించి ఉన్న అతడు కత్తితో మార్కెట్ మధ్యలోకి దూసుకొచ్చాడు. చంపేస్తానని స్థానికులను బెదిరించడం మొదలుపెట్టాడు
మహారాష్ట్రలో ఓ పోలీసు అధికారి భార్యపై లైంగిక వేధింపులు జరిగాయి. ఆమె పని చేస్తున్న స్కూల్ నుంచి సమీపంలోని తన ఇంటికి వస్తుండగా ఆ దుండగుడు వెంబడించాడు. బలవంతంగా ఆమె ఇంటిలోకి చొరబడే ప్రయత్నం చేశాడు.
ఇష్టమైన ఫుడ్ కోసం ఎవరైనా మహా అయితే ప్రతి వారం అదే ఆహారాన్ని తీసుకుంటారు..అదే వంటకంలో పలు వెరైటీలను టేస్ట్ చేస్తుంటారు. అయితే ఓ వ్యక్తి తన ఫేవరెట్ డిష్ రాజ్మా చావల్‌ను తన చేతిపై టాటూ వేయించుకున�
ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రామ్ కిషన్ శుక్లా గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని స్వయంగా రవికిషన్ సోషల్...
భూకంపం చోటుచేసుకున్న టర్కీ దేశానికి భారత్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, వైద్య బృందాలు బయల్డేరుతున్నాయి. రిలీఫ్ మెటీరియల్, ఎక్విప్మెంట్లు కూడా వెళ్లుతున్నాయి.
[15:57] టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza) జీవితం నుంచి తాను స్ఫూర్తి పొందానని అంటున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra). కెరీర్ చివర్లో ఆమెలో విజయం సాధించాలనే ఆకలి ఏ మాత్రం తగ్గలేదన్నారు.
Turkey-syria earthquake: భూకంపం కారణంగా టర్కీలో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు దక్షిణ టర్కీలోని నూర్దాగీ సమీపంలో భూ ప్రకంపనలు వచ్చాయనీ, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదయిందని జీఎఫ్ జెడ్ నివేదించింది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ.. టర్కీకి సాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.
తాను హిందూ మతానికి వ్యతిరేకం కాదని, హిందుత్వంకు వ్యతిరేకం అని కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధ రామయ్య అన్నారు. హిందుత్వం హింసను, హత్యలను, విభజనను ప్రోత్సహిస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
[14:55] RSS chief on unemployment: పని, వృత్తి పట్ల గౌరవం లేకపోవడమే నిరుద్యోగ సమస్యకు మూల కారణమని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఉద్యోగాల కోసం పరితపించొద్దంటూ యువతకు సూచించారు.
ముస్లిం ఇంటిలో పని చేసే ఓ హిందూ నిమ్న కులానికి చెందిన మహిళ మరణించింది. హిందూ మహిళకు జన్మించిన ముగ్గురు పిల్లలు అనాథలైపోయారు. దీంతో ఆ ముస్లిం దంపతులు వారి ముగ్గురు పిల్లలతోపాటు ఈ ముగ్గురినీ సొంత పిల్లాల్లాగే పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశారు. హిందూ పిల్లలను సొంత పిల్లలుగానే పెంచిన ఆ ముస్లిం మహిళ పై ఇప్పుడు సినిమా వచ్చింది.
పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ పార్టీ పంపిన షోకాజ్ నోటీసుకు ఆ పార్టీ ఎంపీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్..
ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల కోత కొనసాగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి టెక్ దిగ్గజం డెల్ వచ్చి చేరింది. ఏకంగా 6,600 మందిని తొలగించేందుకు కంపెనీ చర్యలు చేపట్టింది.
Bangalore: ఏ మహమ్మారి.. ఏ యుద్ధమూ ప్రపంచ ప్రకాశవంతమైన దేశంగా భారత్ మారడాన్ని ఆపలేవని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇండియా ఎనర్జీ వీక్ 2023ను ప్రారంభించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే, టర్కీలో సంభవించిన వినాశకరమైన భూకంపంలో మరణించిన వారికి సంతాపం ప్రకటిస్తూ.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, కార్గిల్ యుద్ధ కారకుడు పర్వేజ్ ముషారఫ్(79) ఆదివారం దుబాయ్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న ముషారఫ్..
అదానీ గ్రూప్‌పై వచ్చిన భారీ ఆరోపణలు, స్టాక్ మార్కెట్ కుంభకోణంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో స్పందించింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. అదానీతో ఉన్న లింకులను దాచలేరని వ్యాఖ్యానించింది. ‘‘మీ మహా మౌనం కుమ్మక్కు కాదా? ప్రశ్నల నుంచి మీరు తప్పించుకోలేరు
కీలకమైన సీటీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ఢిల్లీ మున్సిపల్ హౌస్ సోమవారం సమావేశమైనప్పటికీ పాత ఘటనలే సభలో పునరావృతమ్యాయి. ఆప్ తీవ్ర నిరసనలతో సభకు ..
అక్కడా.. ఇక్కడా కాదు భాయ్.. కొంటే గింటే బుర్జ్ ఖలీఫా దగ్గర దుబాయ్‌లోనే ఇల్లు కొనేద్దాం అంటున్నారు సంపన్న భారతీయులు. ధరకు వెరవకుండా.. ఖరీదైన నగరంలో ఓ ఇల్లు కొనిపడేస్తున్నారు. అలా.. ఉన్నతోద్యోగులు, వ్యాపార, పారిశ్రామికవేత్తల తాజా చిరునామాగా మారిపోయింది దుబాయ్. మరీ ముఖ్యంగా 2022లో. ఈ మేరకు విలాస నగరంలో
turkey-syria earthquake: టర్కీని భూకంపం కారణంగా ఏకంగా 365 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు దక్షిణ టర్కీలోని నూర్దాగీ సమీపంలో భూ ప్రకంపనలు వచ్చాయనీ, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదయిందని జీఎఫ్ జెడ్ నివేదించింది.
విడాకులు అడిగిందని భార్యను, కూతుర్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడో వ్యక్తి. అడ్డొచ్చిన అత్తామామల్ని చితక్కొట్టాడు. మామ మీదికి కారు తోలించి చంపాలని ప్రయత్నించాడు.
ట్విట్టర్‌ను దివాలా నుంచి రక్షించడం కోసం చాలా శ్రమించాల్సి వచ్చిందని ఆ సంస్థ సీఈవో, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. ఈ నేపథ్యంలోనే గత మూడు నెలలు చాలా కఠినంగా గడిచాయని వెల్లడించారు.
Agartala: ఈశాన్య భారత రాష్ట్రమైన త్రిపురలో సోమవారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన అక్కడ ఎన్నికల ప్రచార రోడ్ షో లో పాలుపంచుకోనున్నారు. ఖోవాయి జిల్లాలోని ఖోవాయి, దక్షిణ త్రిపుర జిల్లాలోని శాంతిర్‌బజార్‌లో నిర్వహించే రెండు ఎన్నికల ర్యాలీలలో అమిత్ షా ప్రసంగించనున్నారు.
వీకెండ్ లో ప్రియురాలితో సరదాగా గడుపుదామని వస్తే ఆమె మరో యువతితో తన అపార్ట్ మెంట్లో కనిపించింది. దీంతో ప్రియురాలితో గొడవ పడి 20 అంతస్తుల బిల్డింగ్ మీదినుంచి దూకి మరణించారు.
దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి 12వ ఎపిసోడ్లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
అమెరికాలోని కొలరాడోలో కాల్పులు జరిగాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని లాహౌల్-స్పితి జిల్లాలో హిమపాతం సంభవించడంతో ఇద్దరు కార్మికులు మరణించారు. మరో కార్మికుడు తప్పిపోయాడు. అతడిని కనుగొనేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
సాక్షి, తుమకూరు: ప్రధాని నరేంద్రమోదీ సోమవారం తుమకూరు జిల్లాలో పర్యటించనుండగా ఆయన కోసం అపురూపమైన హారం, తల పేటా సిద్ధమయ్యాయి. జిల్లా వ్యవసాయ సంస్కృతికి...
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కోయిరౌనా పోలీస్ స్టేషన్ పరిధిలోని సెమ్రాద్ ప్రాంతంలోని క్లినిక్‌లో తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడంతో శుక్రవారం ఓ మహిళ మృతి చెందింది.