ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ పాత్ర ఉన్నట్లు అనుమానాలు పుట్టించే పలు కాల్ రికార్డింగ్‌లను బ్రిటన్ ఇంటెలిజెన్స్ అధికారులు కెనడాకు చేరవేసినట్లు ఇటీవల విడుదలైన ఓ డాక్యుమెంటరీ వెల్లడించింది.
శనివారం రష్యా జరిపిన దాడుల్లో ఆరుగురు ఉక్రెయిన్ పౌరులు మరణించారు. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లోని గృహ సముదాయాలపై జరిపిన దాడుల్లో ఆరుగురు మరణించారు. ఉక్రెయిన్‌లోని నిప్రో, జఫోరిజ్జియా నగరాలపై రష్యా క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడింది.
భారత్ మాదిరిగా త్రివిధ దళాలను ఏకీకృతం చేసేందుకు పాకిస్థాన్ సిద్ధమైంది. సైన్యం, వైమానిక, నౌకా దళాల మధ్య సమన్వయం కోసం ఏకీకృత కమాండ్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోర్ట్‌ల్యాండ్ నగరానికి నేషనల్ గార్డ్ సైనికులను చట్టవిరుద్ధంగా పంపారనే వాదనలతో ఓరెగాన్ రాష్ట్రంలోని జిల్లా కోర్టు జడ్జి కరిన్ ఇమ్మర్ గట్ శుక్రవారం ఏకీభవించారు.
సరిహద్దు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య తుర్కియే రాజధాని ఇస్తాంబుల్‌లో కొద్ది రోజులుగా జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటనచేశారు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో జరగనున్న జీ-20 దేశాల అధినేతల సదస్సుకు అమెరికా నుంచి ఎవరూ హాజరు కాబోరని ఆయన స్పష్టంచేశారు.
సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రాం (ఎస్ఎన్ఏపి) పేరుతో అమెరికా ప్రభుత్వం అల్పాదాయ వర్గాల కోసం నిర్వహిస్తున్న ఆహార భద్రతా పథకానికి పూర్తి చెల్లింపులు జరపాలంటూ కిందిస్థాయి కోర్టు జారీ చేసిన ఆదేశాలను ఆ దేశ సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పిల్లలు సోషల్ మీడియా వాడకంపై ఆంక్షలు విధిస్తూ ఈయూ సభ్య దేశం డెన్మార్క్ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఓ చట్టాన్ని తీసుకొస్తున్నది.
పాకిస్థాన్ ఆహార సంక్షోభం అంచుకు చేరింది. ఆ దేశంలో గోధుమ పిండికి తీవ్ర కటకట ఏర్పడింది. జంట నగరాలైన ఇస్లామాబాద్, రావల్పిండిలలో దీని కొరత తీవ్రంగా ఉంది. పంజాబ్ ఆహార శాఖ రావల్పిండి, ఇస్లామాబాద్ల్లోని మిల�
పాకిస్థాన్ త్వరలోనే ఫీల్డ్ మార్షల్ దేశంగా అవతరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న అసిమ్ మునీర్‌కు అపరిమిత అధికారాలు కల్పించేందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు పాకిస్�
జీవం ఉనికికి కారణమైన జన్యు పదార్థం డీఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న అమెరికన్ సైంటిస్ట్, నోబెల్ గ్రహీత జేమ్స్ డీ వాట్సన్(97) శుక్రవారం తుది శ్వాస విడిచారు.
పశ్చిమ మాలిలోని కోబ్రి పట్టణంలో ఐదుగురు భారతీయులు గురువారం కిడ్నాప్‌నకు గురయ్యారు. ఓ విద్యుత్తు సంస్థలో పనిచేస్తున్న వీరిని సాయుధులైన దుండగులు తుపాకులతో బెదిరించి అపహరించినట్టు కంపెనీ యాజమాన్యం ప్రక
గాజాలో సామూహిక హత్యాకాండకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సహా ఆ దేశ పలువురు ఉన్నతాధికారులకు తుర్కియే శుక్రవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
జర్మనీకి చెందిన ఓ నర్సు 10 మంది పేషెంట్ల ప్రాణాలు తీసింది. మరో 27 మందిని చంపడానికి ప్రయత్నించి విఫలమైంది. ఆమె ఎందుకలా చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
అఫ్గాన్ సహనాన్ని పరీక్షించవద్దని ఆ దేశ గిరిజన, సరిహద్దు వ్యవహారాల శాఖ మంత్రి నూరుల్లా నూరి పాకిస్థాన్‌ను హెచ్చరించారు. పాక్ సాంకేతక సామర్థ్యంపై ఖ్వాజా అసిఫ్ మరీ ఎక్కువ ధీమాతో ఉన్నట్టు కనిపిస్తోందని, యుద్ధం అనేది వస్తే పిల్లల నుంచి పెద్దల వరకూ అఫ్గాన్ పౌరులు పోరాటానికి వెనుకాడరని హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దగ్గర ఉన్న అణుబాంబుల గురించి మాట్లాడారు. అన్ని దేశాలకంటే తమ దగ్గరే ఎక్కువ అణుబాంబులు ఉన్నాయని అన్నారు. వాటితో ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు ధ్వంసం చేయగలమని చెప్పారు.
US Shutdown అగ్రరాజ్యం అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ (US Shutdown) కొనసాగుతోంది. దేశ చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగుతున్న షట్డౌన్గా ఇది చరిత్ర సృష్టించింది.
కాల్మెగీ తుపాను వియత్నాం దేశంలో బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి దాదాపు 2600 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తుపాను గాలులకు ఇళ్ల టాపులు కొట్టుకుపోయాయి. 57 ఇళ్లు పూర్తిస్థాయిలో నేలమట్టమయ్యాయి. ఇక ఫిలిప్పీన్స్‌లో తుపానుకు చిక్కి సుమారు 200 మంది మరణించారు.
చరిత్రలో జరిగిన కొన్ని కొన్ని విషయాలు ఆలస్యంగా వెలుగు చూస్తుంటాయి. అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుత కాలమాన పరిస్థిలను బట్టి చూస్తే, అది పెద్ద తప్పిదమేనన్న భావన వస్తుంటుంది.
ఒహాయో గవర్నర్ ఎన్నికల బరిలో నిలిచిన రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామికి డొనాల్డ్ ట్రంప్ పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన అద్భుతమైన గవర్నర్‌గా రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తారని హామీ కూడా ఇచ్చారు. వివేక్‌కు మద్దతుగా ఉండాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ఆసక్తికరంగా మారింది.