పాత ప్రభుత్వాసుపత్రిలో సరైన సదుపాయాలు లేక బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో ప్రసవమై.. శిశువు జన్మించిన ఎనిమిది రోజులకు బాలింత.. బిడ్డతో కలిసొచ్చి ఆరోగ్యమిత్ర వద్ద బయోమెట్రిక్, ఫొటో తీయించుకోవాలి.
నిడమానూరు జంక్షన్-మహానాడు జంక్షన్ వరకు ఎన్హెచ్-16పై ప్రతిపాదించిన డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్పై నీలినీడలు కమ్ముకున్నాయి. విజయవాడ వెస్ట్ బైపాస్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో దీనిపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ప్రతిపాదించిన 7 కిలోమీటర్ల నాలుగు వరసల ఫ్లై ఓవర్ ప్రతిపాదన ఉపసంహరణ దిశగా ఆ ఆలోచనలు ఉన్నాయి.
జగన్పై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. అక్రమాస్తుల కేసులో జగన్ కోర్టుకు హాజరయ్యారని చెప్పే దమ్ము, ధైర్యం బ్లూ మీడియాకు లేదంటూ మండిపడ్డారు. జగన్ ఆర్థిక ఉగ్రవాది అంటూ వ్యాఖ్యలు చేశారు.
కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం అందింది.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎంపీపీ అన్నమ్మపై అవిశ్వాస తీర్మానంపై రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. ఎంపీపీ పదవి కోసం వైకాపాలో గత కొన్ని నెలలుగా వర్గపోరు నెలకొంది.
గుంటూరు జిల్లాలో ఈ నెల 27, 28 తేదీల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, పంటల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు.
రాజధాని అమరావతిలో రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి అవుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై కొందరు రైతులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై మంత్రి స్పందించారు.
ఆరుగాలం శ్రమించి పండించిన వ్యవసాయోత్పత్తుల సేకరణలో ఎదురవుతోన్న ఇబ్బందులను చాలా వరకు పరిష్కరించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతికత సాయంతో వినూత్న ప్రక్రియలను అందుబాటులోకి తెస్తోంది.
తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జి లేని లోటు గుర్తించామని, ఏ కష్టమొచ్చినా, మీ సమస్యలు తీరకపోయినా మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, గృహనిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి, ఎక్సైజ్ శాఖామంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
బాలిక అదృశ్యం మిస్టరీగా మారింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె (16) అక్టోబరు 4వ తేదీ సాయంత్రం నుంచి కనిపించడం లేదని పోలీసులు, ఎస్పీ, మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసినా..