వైకాపా పాలనలో సీఎం జగన్ పర్యటన అనగానే చెట్లు కొట్టేయడం..దారంతా పరదాలు కట్టేయడం, బారికేడ్లు పెట్టేయడం..అడుగడుగునా పోలీసుల ఆంక్షల చట్రంలో ప్రజలు అల్లాడిపోయేవారు.
పుట్టిన పిల్లలను సహజీవనం చేస్తున్న వ్యక్తితో కలిసి హింసిస్తున్న తల్లి కర్కశ ఉదంతమిది. కొంతకాలంగా సాగుతున్న ఈ అమానవీయ వ్యవహారం స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
నాగార్జుసాగర్ నుంచి పశ్చిమ కృష్ణాకు ముందస్తుగా జలాలు విడుదల చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రబీ సాగుకు వీలుగా ఒక్క ఏడాది కూడా కేటాయింపుల ప్రకారం సకాలంలో నీరు చేరలేదు.
పెనుగంచిప్రోలులో బంగారం లక్కీ డ్రా స్కీమ్, చిట్టీలు, అధిక వడ్డీల పేరుతో పలు గ్రామాల ప్రజలను మోసం చేసిన నిందితుడు చిన్నం దుర్గారావు ఆదివారం జగ్గయ్యపేటలో సీఐ వెంకటేశ్వర్లు వద్ద లొంగిపోయాడు.
విద్యార్థులకు ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు, రాజకీయల పట్ల అవగాహన కల్పించేందుకు వివిధ పోటీలను నిర్వహించేందుకు పాఠశాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
నీటిశుద్ధి, సరఫరా కేంద్రాల వద్ద నిఘానేత్రాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది..నిలువెల్లా పగుళ్లిచ్చి కూలిపోవడానికి సిద్ధమైన కొన్ని ట్యాంకులను ఆధునికీకరించేలా అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది.
చీకటిని తరిమేస్తూ వెలుగులు నింపేదే దీపావళి పండుగ. అలాంటి ఈ పండుగ వేళ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసి ఆయా సంస్థలకు చేయూత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) తెలిపారు.
అమరావతిలో 4 స్టార్ దసపల్లా హోటల్ నిర్మాణానికి ప్రోత్సాహకాలతో ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రూ.200 కోట్లతో 4 స్టార్ హోటల్ని దసపల్లా అమరావతి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించనుంది.
రాష్ట్ర ప్రజలందరికీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని అన్నారు.
పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో అమరావతి- విశాఖపట్నంలో జరుగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(ఆదివారం) ఏపీ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.