ఓపెన్ ఏఐ త్వరలో ఓ కొత్త వెబ్ బ్రౌజర్‌ను తీసుకురాబోతోంది. కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా పనిచేసే ఈ బ్రౌజర్లో చాట్ జీపీటీ (ChatGPT) వంటి ఫీచర్లు ఉంటాయి. ఇది గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ప్రయాణీకుల భద్రతపై ఫోకస్ చేసిన రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు అన్ని రైల్వే కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ చర్య ప్రయాణీకుల భద్రతను పెంచడమే కాకుండా, రైళ్లలో చోరీలు, ఇతర అక్రమ కార్యకలాపాల వంటివి తగ్గనున్నాయి.
భారత ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులకు సమయం ఆసన్నమైంది. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్ తాజాగా భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్-స్పేస్ నుంచి ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు లైసెన్స్ (IN-SPACe Starlink Approval) పొందింది.
శుభాంశూ శుక్లా ప్రయాణిస్తున్న డ్రాగన్ స్పేస్ క్యాప్సుల్ సముద్రంలో దిగింది. ఇలా ఎందుకూ? అనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా? దీని వెనక పలు ముఖ్య కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఒకప్పుడు మనుషులు నిర్వహించిన పనులను ఇప్పుడు ఏఐ వేగంగా, కచ్చితత్వంతో చేస్తుంది. దీంతో అనేక సంస్థలు పలు రకాల కార్యకలాపాల్లో ఏఐని ఉపయోగిస్తున్నాయి. ఇదే సమయంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా ఈ మార్పుల్లో భాగంగా AIని (Microsoft AI) వినియోగిస్తోంది. దీని వల్ల ఇటీవల వచ్చిన మార్పులను ఓసారి చూద్దాం.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లకు దీటుగా చాలా మంది వినియోగదారులు ట్యాబ్‌లను కొనుగోలు చేస్తున్నారు. ట్యాబ్‌ల సహాయంతో చదువు, ఉద్యోగం వంటి పనులు చక్కబెట్టకుంటున్నారు.
ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లకు వినియోగదారుల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. అందులో భాగంగానే కంపెనీలు కూడా ఈ తరహా ఫోన్లను తయారు చేసి అందివ్వడంలో పోటీ పడుతున్నాయి. అదే కోవలో వివో కూడా ఓ నూతన ఫోల్డబుల�