సూచిక 
ప్రముఖ మాధ్యమాల నుండి వార్తలు, పూర్తి వార్తల కోసం క్లిక్ చేయండి.ప్రవాసులు

అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయ టెకీలు, ఇతరులకు భారీ ఉపశమనం లభించనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అమలు చేయాలని చూస్తున్న పుట్టుకతో పౌరసత్వం (Birthright Citizenship) రద్దుకు సంబంధించిన ఆదేశాలకు మరో సారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మేరీల్యాండ్‌లోని ఒక ఫెడరల్ న్యాయమూర్తి ఆటోమేటిక్ జన్మహక్కు పౌరసత్వాన్ని నిరవధికంగా పరిమితం చేయాలనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యను అడ్డుకున్నారు. అమెరికా పౌరసత్వం జీవితం.. స్వేచ్ఛ కంటే తక్కువ విలువైన హక్కు కాదు అంటూ జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేయాలన్న ఆర్డర్‌ను నిరవధికంగా నిలిపివేశారు. ఈ ఆదేశాల అమలుపై దేశవ్యాప్తంగా నిషేధం విధించారు. ఈ ఉత్తర్వు ఫిబ్రవరి 19 నుండి అమలులోకి రానుంది.ట్రంప్ బాధ్యతలు చేపట్టి, తొలి రోజున సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయని అమెరికా జిల్లా న్యాయమూర్తి డెబోరా బోర్డ్‌మన్ బుధవారం తీర్పు ఇచ్చారు. 14వ సవరణపై ట్రంప్ పరిపాలన అందిస్తున్న వివరణను అమెరికాలోని ఏ కోర్టు కూడా ఆమోదించలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ఆదేశం దేశవ్యాప్తంగా వర్తిస్తుందనీ కేసు కొనసాగే వరకు అమలులో ఉంటుందని ఈ ఆర్డర్ స్పష్టంగా రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణించారు. అమెరికా పౌరసత్వాన్ని ఆ నేలపై పుట్టిన వారికి అందించటం అత్యంత విలువైన హక్కుగా పేర్కొన్నారు. దీంతో వలసలను అడ్డుకోవాలనే ఆలోచనలో భాగంగా 125 ఏళ్ల నుంచి అమల్లో ఉన్న చట్టాన్ని రద్దు చేయాలన్న ట్రంప్ ప్రణాళికలకు ఈ తీర్పు మరొక చట్టపరమైన దెబ్బ.కాగా బర్త్‌రేట్ సిటిజిన్ షిప్ ఆర్డర్ జారీ చేసిన నాటి నుంచి, ఎన్ఆర్ఐలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో సంకెళ్లతో తరలించడం లాంటి అనేక కఠిన నిర్ణయాలు సగటు భారతీయుడికి నిద్రలేకుండా చేస్తున్నాయి. అంతేకాదు అమెరికాలో చదువుకోవటానికి వెళ్లిన విద్యార్థులు సైతం తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్లిపోనున్నారనే భయాలు వెంటాడుతున్నాయి.Birthright Citizenship అంటే ఏంటి?అంతర్యుద్ధం తరువాత మాజీ బానిసలు, ఆఫ్రికన్ అమెరికన్లకు పౌరసత్వం కల్పించడానికి 14వ సవరణ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన ప్రతీ బిడ్డకు ఆటోమెటిక్‌గా యూఎస్ పౌరసత్వం లభిస్తుంది. విదేశీ తల్లిదండ్రులకు అమెరికాలో జన్మించిన వారు సైతం ఈ నిబంధన కింద జన్మహక్కు పౌరసత్వాన్ని పొందుతారని రాజ్యాంగ సవరణ వెల్లడిస్తుంది. అయితే దీన్ని రద్దు చేస్తే ట్రంప్ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం అమెరికా పౌరులు కాని వ్యక్తులు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు కాని తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలను ఇకపై పుట్టుకతోనే అమెరికా పౌరులుగా పరిగణించరు. ఈ నిర్ణయం ప్రధానంగా భారత్ నుంచి అమెరికా వలస వెళ్లిన కుటుంబాలపై ప్రభావం చూపుతుందని భావించారు. ముఖ్యంగా H-1B వీసా హోల్డర్లు వంటి చట్టబద్ధమైన తాత్కాలిక నివాసితులు కూడా తమ పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం కోల్పోతారనే ఆందోళనలో పడిపోయారు. ప్రస్తుతానికి దీనికి బ్రేక్‌లు పడినట్టే.ఈ ఉత్తర్వుల ద్వారా భారీ ఊరట లభించేది వీరికేH-1B (వర్క్ వీసాలు)H-4 (డిపెండెంట్ వీసాలు)L (ఇంట్రా-కంపెనీ బదిలీలు)F (స్టూడెంట్ వీసాలు) ఇదీ చదవండి: నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్ Fri, Feb 7 2025 10:41 AM

వాషింగ్టన్ : 2025-26 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసా క్యాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 7 నుంచి ప్రారంభమై మార్చి 24న ముగియనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ విభాగం అధికారికంగా ప్రకటించింది.భారత్ నుంచి ఎక్కువ డిమాండ్ ఉండే హెచ్-1బీ వీసా ఉద్యోగులకు ఆయా కంపెనీలు స్పాన్సర్ చేస్తుంటాయి. అందుకు అయ్యే ఈ-రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీ మొత్తంలో చెల్లించుకోవాల్సి ఉంది. ఉద్యోగికి ఏదైనా సంస్థ హెచ్-1బీ వీసా ఇచ్చేందుకు ఈ-రిజిస్ట్రేషన్ చేయాలంటే కంపెనీలు పది డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ కంపెనీలే ఏకంగా ఏడాదికి 125 డాలర్ల రుసుము చెల్లించాల్సి వస్తుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. The initial registration period for the fiscal year 2026 H-1B cap will run from noon ET on March 7 to noon ET on March 24. Prospective petitioners &, representatives must use a USCIS online account to register each beneficiary ... (1/3)— USCIS (@USCIS) February 5, 2025హెచ్-1బీ రిజిస్ట్రేషన్ గతేడా జోబైడెన్ ప్రభుత్వం బెనిఫిషియరీ సెంట్రిక్ సిస్టమ్‌ను ప్రారంభించింది. ఆ విధానం ఈ ఏడాది కొనసాగుతుంది. ఈ విధానంలో ప్రతి దరఖాస్తుదారుడి తరఫున ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసినా ఒక్కసారి మాత్రమే అతడి పేరు లాటరీలో నమోదవుతుంది. Thu, Feb 6 2025 9:31 PM

ఆకాశ్ బొబ్బ.. ఎవరీ కుర్రాడు? ఇప్పుడు ఇంటర్నెట్ అంతా అతని గురించే వెతికే పనిలో ఉంది. ఇలాన్ మస్క్ నేతృత్వంలో నడవబోయే యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) విభాగంలో ఈ భారత సంతతికి చెందిన కుర్రాడికి చోటు దక్కింది. అందుకే అతని గురించి ఆరా తీసే ప్రయత్నాల్లో ఉన్నారు.అకాశ్ బొబ్బ(Akash Bobba).. 22 ఏళ్ల యువ ఇంజినీర్. డోజ్ నిర్వహణ కోసం మస్క్ ఆరుగురు యువ ఇంజినీర్లను ఎంచుకోగా.. అందులో ఆకాశ్ ఒకడు. అయితే డోజ్‌కు ఇతన్ని మస్క్ ఎంచుకున్నాడని తెలియగానే.. లింక్డిన్ సహా ఎక్కడా అతని గురించి సమాచారం లేకుండా చేశారు. కానీ, ఈలోపే సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ కంపెనీలతో అతని ప్రయాణం గురించి బయటకు వచ్చేసింది.కాలిఫోర్నియా బర్కిలీ యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్, ఎంట్రాప్రెన్యూర్షిప్, టెక్నాలజీ కార్యక్రమంలో గ్రాడ్యుయేషన్ చేశాడు ఆకాశ్. ఆపై మెటాలో ఏఐ మీద, పలాన్టిర్లో డాటా అనలైటిక్స్ మీద, బ్రిడ్జ్‌వాటర్ అసోషియేట్స్లో ఫైనాన్షియల్ మోడలింగ్ మీద ఇంటర్న్ చేశాడు. అయితే అతని పేరు ఇప్పుడు ప్రపంచమంతా మారుమోగుతున్నా.. ఆ మాజీ క్లాస్మేట్ ఒకరు పంచుకున్న విషయం ఇప్పుడు నెట్లో వైరల్ అవుతోంది. కాలేజీ రోజుల్లో బృందంలోని సభ్యుడి తప్పిదంతో ప్రాజెక్టు మొత్తం డిలీట్ అయ్యిందట. సమయం పెద్దగా లేకపోవడంతో బృందం మొత్తం కంగారుపడుతోందంట. ఆ టైంలో .. ఆ రాత్రి రాత్రే సోర్స్ కోడ్‌ను ఉపయోగించకుండానే తిరిగి ఆ ప్రాజెక్టు మొత్తాన్ని .. అంతకు ముందు కంటే బెటర్‌గా రూపొందించాడు ఆకాశ్. ఆ టైంలో అతని కోడింగ్ సామర్థ్యం చర్చనీయాంశమైందని అతని స్నేహితుడు చెబుతున్నారు . Let me tell you something about Akash. During a project at Berkeley, I accidentally deleted our entire codebase 2 days before the deadline. I panicked. Akash just stared at the screen, shrugged, and rewrote everything from scratch in one night—better than before. We submitted…— Charis Zhang (@gmchariszhang) February 3, 2025ప్రభుత్వ ఖర్చులున గణనీయంగా తగ్గించేందుకు ఇలాన్ మస్క్(Elon Musk) సారథ్యంలో ఏర్పాటైందీ విభాగం. డోజ్‌లో కీలక బాధ్యతల కోసం ఆకాశ్‌తో ఆరుగురిని మస్క్ ఎంచుకున్నాడు. అయితే ఆకాశ్ తల్లిదండ్రులెవరు? భారతీయ మూలాలు ఎక్కడ ఉన్నాయి? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వాళ్లంతా 19-24 ఏళ్లలోపు కుర్రాళ్లే. అందులో ఓ విద్యార్థి సైతం ఉన్నాడు. అయితే ఈ నిర్ణయాన్ని పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశం.. అందునా కీలకమైన బాధ్యతలకు ఏమాత్రం అనుభవం లేనివాళ్లను ఎంపిక చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అనుభవజ్ఞులు ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. యూఎస్ ఎయిడ్ నుంచి కీలక సమాచారాన్ని తీసుకునే ప్రయత్నం చేశారంటూ డోజ్ సిబ్బందిపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక.. ఇలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయాలు అంతిమం కాదని, వాటికి తమ అనుమతి తప్పనిసరి అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రకటించడం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశమైంది. Tue, Feb 4 2025 4:47 PM

