ఈ ఏడాది మైచాంగ్ తుపాను కారణంగా 4వ తేదీన జరగాల్సిన వేడుక 10వ తేదీకి వాయిదా పడింది.తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఆర్కే బీచ్లో ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి.ఈ ఏడాది నేవీ డేకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు .దాదాపు 2 వేల మంది నౌకాదళ సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొంన్నారు. నేవీ యుద్ధనౌకలు, ఫైటర్ జెట్లు, జలాంతర్గాములు, హెలికాప్టర్లతో సిబ్బంది విన్యాసాలు చేసారు.ఆకాశంలో హక్కు విమానాలు బాణం వలే ప్రదర్శించారు.
రాహుల్ గాంధీ సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు కార్యాలయాల్లో దాదాపు రూ.200 కోట్లను ఐటీ సీజ్ చేసింది. ..నేను రాహుల్ గాంధీని అడగాలనుకుంటున్నాను, మీరు దీని గురించి సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేయలేదు? మీరు దీని గురించి ఎందుకు ఏమీ మాట్లాడలేదు? ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడూ అవినీతికి మద్దతు ఇస్తుంది
మంత్రి రోజా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. కార్తీక మాసం పంచరామ క్షేత్రాల దర్శనం సర్వసుభదాయకమని మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. దీనిలో భాగంగా సామర్లకోటలో గల పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోట కుమార రామ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.