ఊరవతల ఒంటరి గోడ నవ్వు ముఖాలతోనే కనిపిస్తుందెప్పుడూను గోడవెనక చీకటిలా నవ్వు వెనక కల్మషం ఎవరికీ కనబడదు .ఆ ముఖం ఎప్పుడూ ఒకటే అయ్యుండదు ఎప్పుడేముఖంతో నవ్వుతుందో…
హనుమంతుడు లంకా దహనం ఎలా చేశాడో వర్ణిస్తూ.. సుందరకాండ ఆలపిస్తున్న ఎం.ఎస్. రామారావు గొంతు రాములవారి గుడి మైక్ లోనుంచి ఊరంతా వినిపిస్తోంది. రోజూ ఆ పాటలు వినపడగానే నిద్రలేవడం ఆ ఊరి జనానికి అలవాటైపోయింది.