ఇటీవల మృతి చెందిన డీబీఎస్ కళాశాల ఛైర్మన్ దామిశెట్టి శ్రీనివాస నాయుడు కుటుంబ సభ్యులను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కావలి శాసనసభ్యులు వెంకట కృష్ణారెడ్డి సోమవారం కావలి పట్టణం 37వ వార్డులోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.
గ్యాస్ వినియోగదారులకు బండ బాదుడు తప్పడం లేదు. సిలిండర్ బుక్ చేసుకున్నాక గ్యాస్ ఏజెన్సీల సిబ్బంది సిలిండర్ను ఇంటికి తీసుకొచ్చినపుడు నిర్ణీత రుసుం కంటే అదనంగా రూ.30 నుంచి రూ.60 వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి నిర్ణీత దూరం వరకు ఉచితంగానే సరఫరా చేయాలి.
ముఖ్యమంత్రి ఆదేశాల అమలుకు క్షేత్రస్థాయిలో అధికారులు సన్నద్ధమయ్యారు. రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను 2025 అక్టోబరు 2 నాటికి పూర్తిగా తొలగించేందుకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిధులు కేటాయించారు.
జిల్లాలో ఎడగారు పంట సాగుకి సన్నాహాలు జరుగుతున్నాయి. సాగునీటి సరఫరా చేసే కాలువల సమస్యలు తొలగక కర్షకులు కలత చెందుతున్నారు. ఈనెల 17న జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో కాలువల అత్యవసర మరమ్మతులకు రూ.18 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు ప్రకటించినా అమలుకు నోచుకోలేదు.
పల్లె రోడ్ల నిర్మాణంలో రాష్ట్రస్థాయిలో జిల్లాకు గుర్తింపు లభించింది. కేవలం ఏడు నెలల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో సిమెంట్ రోడ్లు పూర్తిచేశారు. దీంతో పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ అశోక్ కుమార్ ఈనెల 24న పురస్కారం అందుకున్నారు.
గుడ్లూరు మండలంలో అటవీ కార్పొరేషన్, వనసంరక్షణ సమితి ద్వారా పెంచుతున్న జామాయిల్ తోటలు అక్రమార్కులకు వరంగా మారాయి. ఏపుగా పెరిగిన చెట్లు నరికి సొమ్ము చేసుకుంటున్నారు.
వేసవి సెలవుల్లో విద్యార్థుల ఆటవిడుపు కోసం ఉదయం, సాయంత్రం పార్కులకు వెళుతుంటారు. అక్కడ వారికి నిరాశే ఎదురవుతోంది. చాలాచోట్ల వసతులు లేవు. కొన్నిచోట్ల పనులు సా.. గుతూనే ఉన్నాయి. మున్సిపల్ అధికారులు ఉద్యానవనాల అభివృద్ధిపై దృష్టి సారించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
ఎన్టీఆర్ నుంచి నేడు చంద్రబాబు నాయుడు వరకు మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేశారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. విడవలూరు మండలంలోని ఊటుకూరు పెద్దపాలెంలో ‘మత్స్యకార సేవలో’ పథకాన్ని ఆదివారం ఆమె ప్రారంభించారు.
శివాలయంలో పూజలు చేయించుకొని ఇంటి వెళుతున్న యువకుడిని ఆగి ఉన్న లారీ రూపంలో మృత్యువు కబళించింది. కారులో ఇరుక్కున్న యువకుడి ప్రాణాలు కాపాడేందుకు ఇటు పోలీసులు, అటు స్థానికులు ఎంతో శ్రమించారు.
చోరీ చేసిన ఆయిల్ను కొని మార్కెట్లో విక్రయిస్తున్న పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వ్యాపారులపై నెల్లూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన వైకాపా మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ చీదెళ్ల కృష్ణ, అతని సోదరుడు చీదెళ్ల రవి ఆయిల్ వ్యాపారం చేస్తుంటారు.
వేసవి సెలవులు కావడంతో సరదాగా ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన ఓ బాలుడు ప్రమాదశాత్తు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని బ్రాహ్మణక్రాక గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది.
కలిగిరి మండలానికి మొదటి విడతగా జీలుగలు 20 క్వింటాలు, జనుములు 124 క్వింటాలు, పిల్లిపెసర 92 క్వింటాలు మంజూరైనట్లు కలిగిరి మండల వ్యవసాయ అధికారి ముసునూరు సురేష్ బాబు తెలిపారు.