రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు.. విశ్రాంత ఉద్యోగులు.. వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించడానికి చిత్తూరు ఆర్టీసీ బస్టాండులో నూతన ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చారు.
గ్రేటర్ తిరుపతి పరిధిలో మరో పది గ్రామ పంచాయతీలను విలీనం చేయనున్నారు. ఈ నెల 18న నగరపాలక సంస్థ అధికారులు అత్యవసర కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదనలు ఆమోదించనున్నారు.
శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయంగా పేరు ప్రతిష్ఠలు సాధిస్తోంది. వర్సిటీలో ఉన్న ఇంటర్నేషనల్ రిలేషన్స్ కార్యాలయం (ఐఆర్) ఆధ్వర్యంలో అమెరికా, సింగపూర్లో సంగీతం తరగతులు నిర్వహిస్తోంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం తోతాపురి టన్నుకు రూ.4 వేలు అందజేస్తే.. గుజ్జు పరిశ్రమలు చెల్లించాల్సిన రూ.8 వేలు నేటికీ జమ చేయలేదు.
ఒకే ఆలయంలో రెండు శివ లింగాలను చూశారా.. అయితే మీరు వాకాడుకు 40 కిలోమీటర్ల దూరంలో తీరం వెంబడి వెలసిన శ్రీకామాక్షిదేవి సమేత శ్రీపాండురంగేశ్వరస్వామి, శ్రీరామలింగేశ్వరస్వామి పురాతన ఆలయానికి వెళ్లాల్సిందే.
శ్రీకాళహస్తీశ్వరాలయ దర్శనార్థం వచ్చిన భక్తులు తీవ్ర అసంతృప్తితో క్యూలైన్లలో కేకలు వేస్తూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వారాంతం అంటే ఊహించని విధంగా రద్దీ నెలకొంటోంది.
వరుసకు తమ్ముడి వద్ద అవసరానికి డబ్బులు తీసుకొని, తిరిగి అడిగినందుకు కడతేర్చిన ఘటన కుప్పం పురపాలిక పరిధిలోని జగనన్న కాలనీలో నిర్మాణ దశలో ఉన్న ఇంట్లో ఆదివారం వెలుగు చూసింది.
‘ప్రాచీన కాలంలో ప్రతి దేవస్థానంలో పంచగవ్యను ప్రసాదంగా ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఇందుకు కారణం దేశీ ఆవులు కనుమరుగవడమే’ అని ఉడిపి పేజావర అధోక్ష మఠం జగద్గురు విశ్వప్రసన్న తీర్థస్వామి తెలిపారు.