దొంగతనం కేసులో స్వాధీనం చేసుకున్న బంగారాన్ని ఓ ఎస్సై వడ్డీ వ్యాపారి వద్ద కుదువ పెట్టిన ఉదంతమిది. ఏపీలో ఎలక్ట్రిక్ విభాగంలో తనకు ఏఈ ఉద్యోగం వచ్చిందని.. రిలీవ్ చేయాలని అభ్యర్థించిన సదరు ఎస్సైని వెపన్ డిపాజిట్ చేయాలని కోరడంతో ఈ ఘటన వెలుగు చూసింది.
హరియాణాలోని రెండు వేర్వేరు బాస్కెట్బాల్ మైదానాల్లో ఐరన్ పోల్లు ఛాతీపై పడి ఇద్దరు యువ క్రీడాకారులు ప్రాణాలు కోల్పోవడం కలకలం సృష్టిస్తోంది.ఈ రెండు సంఘటనలు దేశంలోని క్రీడా మౌలిక సదుపాయాలు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి నిదర్శనమని ఆటగాళ్లు, కోచ్లు విమర్శిస్తున్నారు.
సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని సురభి వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని సీనియర్లు వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.