కర్ణాటకలోని బెళగావి రైతులంతా మూడేళ్ల కిందట వీధుల్లో వారం రోజుల పాటు ఆందోళన చేపట్టారు. స్థానికంగా ఎంతో అనుకూలంగా ఉండే ‘జైకిసాన్’ కూరగాయల మార్కెట్కు అనుమతి తొలగించారన్నది వారి ఆందోళనకు కారణం.
నాసిరకం ఎరువులు, క్రిమినాశక ఔషధాలతో ప్రజారోగ్యం పాడవుతుందని కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. నల్లతల పురుగుతో కొబ్బరి సాగుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
కేంద్ర మాజీ మంత్రి దివంగత ఆర్.ఎల్.జాలప్ప కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడేవారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. తాను మంత్రి అయ్యేందుకు ఆయన కూడా కారణకులని గతాన్ని గుర్తు చేసుకున్నారు.
కేజీఎఫ్ పోలీసు జిల్లా ఎసీˆ్ప శివాంశు రాజపుత్పై ఆయన భార్య డాక్టర్ కీర్తి సింగ్ నోయిడా ఠాణాలో ఫిర్యాదు చేశారు. కట్నం కోసం తన భర్త వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.