సూచిక 
ప్రముఖ మాధ్యమాల నుండి వార్తలు, పూర్తి వార్తల కోసం క్లిక్ చేయండి.జీవనవిధానం

మూడేళ్ల వయసులోనే నర్తకిగా మారి, నాట్యమయూరిగా ఎదిగింది. ఎంత ఎదిగినా, ఒదిగి ఉండే మనస్తత్వం, వన్నె తగ్గని అందం, చిన్న పిల్లలాంటి చలాకితనం ఇవన్నీ ఒక్కచోటే ఉంటే, కనిపించే రూపమే నటి, ప్రముఖ నర్తకి శోభన . ఇటీవల ప్రభుత్వం ఆమెకు ‘పద్మభూషణ్’ ప్రకటించింది. ఆమె విశేషాలు మీ కోసం..⇒ శోభన సొంత ఊరు తిరువనంతపురం. ‘ట్రావెన్కోర్ సిస్టర్స్’గా నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి గాంచిన లలిత, పద్మిని, రాగిణిలకు మేనకోడలు.⇒ ‘మంగళ నాయగి’ సినిమాతో ఉత్తమ బాలనటిగా అవార్డు అందుకున్న నాలుగేళ్లకే, ‘ఏప్రిల్ 18’ అనే మలయాళ చిత్రంలో హీరోయిన్గా కనిపించింది. ⇒ ‘మణిచిత్రతారు’ అనే మలయాళ చిత్రంలో ద్విపాత్రాభినయంతో మెప్పించి, ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ‘మిత్ర్, మై ఫ్రెండ్’ అనే ఇంగ్లిష్ చిత్రంలో నటనకు మరోసారి జాతీయ పురస్కారాన్ని సాధించింది.⇒ చిన్నప్పటి నుంచి నాట్యమంటే ఎంతో ఇష్టం. 1994లో ‘కళార్పణ’ పేరిట చెన్నైలో నాట్య పాఠశాలను ఏర్పాటు చేసి, భరత నాట్యంలో శిక్షణ ఇస్తోంది. కళారంగంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా 2006లో కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని ప్రకటించింది.⇒ శోభనకు నాట్యం చేసేటప్పుడు ఎవరైనా ఫోన్లో రికార్డ్ చేస్తే చాలా కోపం. ఒకసారి ప్రదర్శన మధ్యలో ఫోన్లో రికార్డు చేస్తున్న ఒక ప్రేక్షకుడిని వారించింది.⇒ శోభనకు థాయ్, చైనీస్ వంటకాలు బాగా ఇష్టం. మలేసియాకు వెళితే, అక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా ఆస్వాదిస్తుంది. చీజ్ ఆమ్లెట్ అంటే ఆమెకు చెప్పలేనంత ఇష్టం.పెళ్లి మాత్రమే సంతోషాన్ని ఇవ్వదు, జీవితంలో చాలా విషయాలు సంతోషాన్ని ఇస్తాయి. నేను ఒంటరిగా చాలా సంతోషంగా ఉన్నా. ఎప్పటికైనా ఒక సినిమా డైరెక్ట్ చేయాలని ఉంది. నా దుస్తులను నేనే డిజైన్ చేసుకుంటాను. ఒంటికి నప్పని దుస్తులను నేనెప్పుడూ ధరించను. బహుశా, నా దుస్తులే నా అందాన్ని రెట్టింపు చేస్తున్నాయనుకుంటా. – శోభన Sun, Feb 9 2025 1:50 AM
తెలంగాణలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ప్రత్యేకమైనది నల్లగొండ జిల్లా చెరువుగట్టులోని పార్వతీ సమేత జడల రామలింగేశ్వరాలయం. పరమ పవిత్ర క్షేత్రంగా భక్తుల నీరాజనాలందుకుంటోంది. ఇక్కడి శివుడికి మొక్కితే ఎలాంటి బాధలైనా పోయి, ఆరోగ్యంప్రాప్తిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ క్షేత్రాన్ని ఆరోగ్యక్షేత్రంగా పిలుస్తారు. 3, 5, 7, 9, 11 అమావాస్య రాత్రులు ఈ క్షేత్రంలో స్వామివారి సన్నిధిలో నిద్రిస్తే చీడపీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ అమావాస్య సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి క్షేత్రం ఇటీవలే బ్రహ్మోత్సవాలను పూర్తి చేసుకుంది. ప్రతి ఏటా మాఘ శుద్ధ పంచమి నాటి నుంచి ఆరు రోజులపాటు ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో శివసత్తులు ఇక్కడకు చేరుకుంటారు. అగ్ని గుండాలు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణ. రథ సప్తమి శివ కళ్యాణానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. లోక కల్యాణార్థం పరశురాముడు 108 క్షేత్రాల్లో స్వయంగా ప్రతిష్టించిన శివలింగాలలో ఇది చివరిదిగా ప్రతీతి. పశ్చిమాభిముఖంతో శివుడు కొలువై ఉండడం ఈ క్షేత్రం ప్రత్యేకత.పూర్వం హైహయ వంశ మూల పురుషుడు, కార్తవీర్జార్జునుడు వేటకోసం దండకారణ్యానికి వెళతాడు. అవిశ్రాంతంగా వేటాడిన పిదప బడలికకు గురైన చక్రవర్తి సపరివారంగా సమీపంలోని జమదగ్ని ఆశ్రమానికి వెళతాడు. అప్పుడు జమదగ్ని మహర్షి తన దగ్గరున్న కామధేనువు సహాయంతో అందరికి భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ ధేనువు మహత్తును మహర్షి దగ్గర అడిగి తెలుసుకున్న కార్తవీర్యార్జునుడు తనకు ఆ ధేనువును ఇవ్వాలని అడుగుతాడు. అందుకు మహర్షి తిరస్కరించడంతో కోపోద్రిక్తుడైన కార్తవీర్యార్జునుడు, జమదగ్నిని సంహరించి కామధేనువును తీసుకువెళతాడు. ఆ సమయంలో బయటకు వెళ్లి వచ్చిన పరశురాముడు జరిగిన విషయం తెలుసుకొని తన తండ్రిని చంపిన కార్తవీర్యార్జునుని పరశువు (గొడ్డలి) తో సంహరిస్తాడు. అంతేకాదు రాజులపై కోపంతో భూప్రదక్షిణం చేసి క్షత్రియ సంహారం చేస్తాడు. అనంతరం పాప పరిహారార్థం దేశం నలుమూలలా 108 శివలింగాలను ప్రతిష్టించి, ఒక్కొక్క లింగం చెంత వేల సంవత్సరాలు తపస్సు చేసి, ఆ తపోఫలాన్ని ఆ క్షేత్రానికి ధారపోసి మానవ కల్యాణానికి పాటుపడతాడు. అలా చివరగా ప్రతిష్టించిన 108వ శివ లింగం వద్ద ఎంత తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో, కోపగించుకున్న పరశురాముడు తన గడ్డలితో శివలింగం ఊర్ధ్వభాగంపై ఒక దెబ్బ వేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఇంతకాలం నువ్వు తపస్సు చేసిన ప్రాంతం, ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగొందుతుందని, కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులను అనుగ్రహి స్తుంటానని చెబుతారు. అనంతరం పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతి పొంది శివైక్యం పొందారని స్థల పురాణం చెబుతోంది. మూడు గుండ్ల ఆకర్షణఆలయం పక్కనే మూడు గుండ్లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. వాటిల్లో మొదటి రెండింటినీ ఎక్కి మూడో దాన్ని చేరితే అక్కడ ఓ శివలింగం దర్శనమిస్తుంది. అయితే ఈ రాళ్లను ఎక్కేదారి క్లిష్టంగా ఉంటుంది. రాయి నుంచి రాయిని చేరే మధ్యలో ఉండే సందు చాలా ఇరుకుగా ఒక బక్కపల్చటి మనిషి అతి కష్టం మీద దాటే దారిలా కనిపిస్తుంది. ఎంత శరీరం ఉన్నవారైనా శివ నామస్మరణచేస్తూ వెళితే అందులోనుంచి అవతలికి సులభంగా చేరగలగటం శివుని మహిమకు తార్కాణంగా చెబుతారు. అయితే ప్రసుత్తం మూడు గుండ్లపైకి అందరూ వెళ్లి దర్శనం చేసుకునేందుకు ఇనప మెట్లను ఇరువైపులా ఏర్పాటు చేశారు. ఎల్లమ్మకు బోనాలుకొండపైకి కాలినడకన వెళ్లవచ్చు. మెట్లదారిలో వెళ్లే భక్తులు కాలబైరవుని దర్శనం చేసుకుంటారు. అనంతరం కోనేరుకు చేరుకొని స్నానం చేసి భక్తులు ముడుపుల గట్టు వద్దకు వెళ్లి అక్కడి చెట్టుకింద చెక్కతో చేసిన స్వామి పాదుకలను తమ శరీరం మీద ఉంచుకుని మొక్కుతారు. అనంతరం రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ఆంజనేయుడు, ఎల్లమ్మ, పరశురాములని దర్శించుకుంటారు. ఇక్కడ ఎల్లమ్మ దేవతకు బోనం తయారు చేసి నైవేద్యం సమర్పిస్తారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. శివశక్తులు నాట్యాలు చేస్తుంటారు.అనంతరం భక్తులు గట్టు కింద ఉన్న పార్వతీ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. కోరికలు నెరవేరిన వారు పల్లకి సేవ, వాహన సేవ, కోడెలు కడతారు. త్వరలో శివరాత్రికి ఇక్కడ జరగనున్న విశేష పూజలకు ముస్తాబవుతోంది ఆలయం. ఆ పేరెలా వచ్చిందంటే...రామలింగేశ్వరుని ఊర్ధ్వభాగాన పరశురాముడు గండ్ర గొడ్డలితో దెబ్బవేసిన చోట జడల వంటి రేఖలు ఉండటం వల్ల స్వామిని జడల రామలింగేశ్వరస్వామి అంటారు. చెరువు గట్టున ఉండటంతో చెరువుగట్టు జడల రామలింగేశ్వరాలయం అంటారు. కొండ దిగువన పార్వతీదేవి కొలువై ఉండటంతో పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంగా ప్రసిద్ధి కెక్కింది. కొండపై జడల రామలింగేశ్వరునికి 12వ శతాబ్దానికి చెందిన కాకతీయ గణపతిదేవ చక్రవర్తి గుహాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో తొలి ఏకాదశినాడు, కార్తీక సోమవారాల్లో, పౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాలలో కడువైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. అలాగే ప్రతి ఏటా అమావాస్యనాడు అన్నదానం చేస్తాం. – పోతలపాటి రామలింగేశ్వర శర్మ, ప్రధాన అర్చకులు – చింతకింది గణేష్, సాక్షి ప్రతినిధి, నల్లగొండ Mon, Feb 10 2025 12:19 AM

శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలాకాలం పురుషాధిక్యమే కొనసాగింది. ప్రఖ్యాత శాస్త్రవేత్తల పేర్లు చెప్పమంటే, ఎవరైనా అల్బర్ట్ ఐన్‌స్టీన్, థామస్ ఎడిసన్ వంటి పురుష శాస్త్రవేత్తల పేర్లే చెబుతారు కాని, ఎందరో మహిళా శాస్త్రవేత్తలు తమ తమ ఆవిష్కరణలో శాస్త్ర సాంకేతిక రంగాలను సుసంపన్నం చేసిన సంగతి మీకు తెలుసా? శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఘన విజయాలను సాధించిన మహిళా శాస్త్రవేత్తల ఆవిష్కరణలు ఎందరో యువతులను ఈ రంగాలవైపు ఆకట్టుకుంటున్నాయి, పెద్ద కలలు కనేలా చేస్తున్నాయి. బాలికలు, మహిళలకు విద్యలో, అభిరుచికి తగిన రంగాల్లో సరైన అవకాశాలు అందక వారి శక్తి సామర్థ్యాలు వృథాగా పోతున్నాయి. వారికి తగిన అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తే, విభిన్నమైన ఆలోచనలతో నవీన సాంకేతికతలను సృష్టించడానికి, అభివృద్ధి చేయడానికి వీలవుతుందనేది నిపుణుల మాట.ఇందుకోసం విద్యారంగంలో బాలికలకు సమాన అవకాశాలు దక్కేలా చూడాలని, శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగాల్లో వారి శక్తి సామర్థ్యాలను వెలికితీయాలనే ఉద్దేశంతో ప్రారంభమైన రోజే ఫిబ్రవరి 11 ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’.. ఈ సందర్భంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆదర్శప్రాయులుగా చెప్పుకునే మహిళా శాస్త్రవేత్తల విజయాలు, వారి గురించిన విశేషాలతో ఈ ప్రత్యేక కథనం..అలా మొదలైంది...ప్రపంచ ప్రఖ్యాత కి నివాళిగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, తగిన ప్రోత్సాహం కోసం ‘ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక విభాగం (యునెస్కో)’, ‘మహిళలకు సైన్స్ కావాలి.. సైన్సుకు మహిళలు కావాలి’ అని నినాదం ఇచ్చింది. ఫిబ్రవరి 11వ తేదీని ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’గా 2015లో ప్రకటించింది. దశాబ్దాల ఎదురుచూపు తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం లభించింది. ఇందుకోసం, ‘యునెస్కో’ ఏటా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికీ రేడియేషన్.. నోబెల్ బహుమతి అందుకున్న మొదటి మహిళ మేరీ క్యూరీ. రెండు వేర్వేరు రంగాల్లో నోబెల్ పొందిన ఏకైక శాస్త్రవేత్త ఆమె. రేడియో ధార్మిక మూలకాలైన రేడియం, పోలోనియంలను క్యూరీ గుర్తించారు. ఆమె కనుగొన్న రేడియం పేరు మీదుగానే రేడియేషన్ పదం పుట్టింది. ఈ పరిశోధనకుగాను 1903లో ‘ఫిజిక్స్ నోబెల్’ అందుకున్నారు. తర్వాత కెమిస్ట్రీలో పరిశోధనకు 1911లో ’కెమిస్ట్రీ నోబెల్’ పొందారు. తన పరిశోధనల సమయంలో క్యూరీ ఎంతగా రేడియేషన్‌కు గురయ్యారంటే, ఆమె రాసిన నోటు పుస్తకాల నుంచి ఇప్పటికీ రేడియేషన్ వెలువడుతోంది.నోబెల్ కుటుంబం ప్రపంచంలోనే అత్యధిక నోబెల్ బహుమతులు కూడా మేరీ క్యూరీ కుటుంబం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె భర్త పియరీ క్యూరీ, కుమార్తె ఐరీన్ జోలియట్ క్యూరీ, అల్లుడు ఫ్రెడరిక్ జోలియట్, మేరీ రెండుసార్లు గెలుపొందడంతో మొత్తం కుటుంబం ఐదు నోబెల్ బహుమతులను అందుకుంది.కంప్యూటరుకు భాష నేర్పిందితొలి ఎలక్ట్రానిక్–డిజిటల్ కంప్యూటర్ ‘యూనివాక్’ను రూపొందించిన బృందంలో కీలక పాత్ర పోషించిన అమెరికన్ శాస్త్రవేత్త గ్రేస్ హెూపర్. ‘బైనరీ’ భాషలోకి మార్చే తొలి కంపైలర్ ప్రోగ్రామును ఆమె రూపొందించారు. ‘కోబాల్’ ప్రోగ్రామ్ రూపకల్పనలోనూ ఆమెది కీలకపాత్ర. అణుశక్తిచైనాలో పుట్టి, అమెరికాలో స్థిరపడి అణుశక్తి తయారీకి మార్గం చూపిన శాస్త్రవేత్త చీన్ షుంగ్ వు. అణుబాంబుల తయారీ కోసం ‘మాన్ హట్టన్ ప్రాజెక్టు’లో ఆమె కీలకపాత్ర పోషించారు. రసాయనిక ప్రక్రియల ద్వారా యురేనియం ఉత్పత్తి చేసే విధానాన్ని తొలిసారి ఆమె కనుగొన్నారు.తెలివైన సీతాకోక చిలుకమరియా సిబిల్లా కీటక శాస్త్రవేత్త. గొంగళి పురుగులు రూపాంతరం చెంది సీతాకోక చిలుకలుగా మారుతాయని నిరూపించింది. అంతేకాదు, కుళ్లిన పదార్థాలు వివిధ రకమైన పురుగులు, కీటకాలను ఉత్పత్తి చేస్తాయని కనుగొన్నది కూడా తనే! ఇలా కీటకాలపై తను చేసిన పరిశోధనలు ఎన్నో విషయాలను ప్రపంచానికి నేర్పించాయి.కోపిష్టి దేవుళ్లు కాదు వాంగ్ జెనీ ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. అమ్మాయిలను సైన్స్ చదవడానికి అనుమతించని కాలంలోనే జెనీ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడింది. అప్పటి వరకు చంద్రగ్రహణాన్ని కోపిష్టి దేవుడిగా భావించడాన్ని తను నమ్మలేదు. అందుకే, తాళ్లతో ఒక భూగోళం, అద్దం, దీపాన్ని పట్టుకొని, చంద్రుడు భూమి నీడలో అదృశ్యమవుతాడని నిరూపించింది. అదే ఎంతోమంది శాస్త్రవేత్తలు, సూర్య, చంద్రగ్రహణాలపై అధ్యయనాలు చేసేలా చేసింది.వైద్యరంగానికి చికిత్స అమెరికాలో వైద్య పట్టా సంపాదించిన మొదటి మహిళ ఎలిజబెత్ బ్లాక్వెల్. డాక్టర్‌గా వైద్యరంగంలో విశేషమైన కృషి చేసింది. ఒక ప్రమాదంలో తన కంటిచూపు కోల్పోయి, సర్జన్‌ను కావాలనే తన కలను వదులుకుంది. కాని, ఆశయాన్ని కాదు. తర్వాత ఒక వైద్య కళాశాల ప్రారంభించి, ఎంతోమంది బాలికలు వైద్యులుగా మారడానికి సహాయం చేసింది.జంపింగ్ జీన్స్వారసత్వ నిర్ధారణ కోసం చేసే డీఎన్ఏ పరీక్షకు మూలమైన జన్యువులను కనుగొన్న శాస్త్రవేత్త బార్బరా మెక్‌క్లింటాక్. జన్యువుల్లో ఉత్పరివర్తనలకు, డీఎన్ఏ పరిమాణంలో మార్పులకు కారణమయ్యే ‘జంపింగ్ జీన్స్’ను కనుగొన్నందుకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. సైన్స్ టీచర్ స్కూల్సైన్స్ టీచర్‌గా సాలీ రైడ్– ఎందరో బాలికలను సైన్స్ దిశగా ప్రోత్సాహించారు. తర్వాత వ్యోమగామిగా మారి, అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆమె బోధించిన ఉపగ్రహాల సిద్ధాంతాలను తర్వాతి కాలంలో చేపట్టిన అంతరిక్ష పరిశోధనల్లో ఉపయోగించారు. సాలీ ముఖ్యంగా బాలికలు అంతరిక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి దోహదపడే కార్యక్రమాలను రూపొందించారు.డైనోసార్ మేడంశిలాజ శాస్త్రవేత్త మేరీ అన్నింగ్. ఇంగ్లాండ్ సముద్రతీరంలో కొండలను అన్వేషించి, ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి ప్లెసియోసారస్ అస్థిపంజరం ‘డగ్ ది డైనోసార్’ను కనుగొన్నారు. డైనోసార్ల గురించి మరింత తెలుసుకోవడానికి ఇది ఇతర శాస్త్రవేత్తలకు చాలా ఉపయోగపడింది.మరెందరో..సూర్యుడు సహా విశ్వంలోని నక్షత్రాలన్నీ ఎక్కువభాగం హైడ్రోజన్, హీలియంతోనే నిండి ఉన్నాయని తొలిసారిగా వెల్లడించిన అంతరిక్ష శాస్త్రవేత్త సెసిలియా పేన్ గాపోష్కిన్. అమెరికన్ అంతరిక్ష సంస్థ ‘నాసా’ కంప్యూటర్లను వినియోగించడానికి ముందు అంతరిక్ష ప్రయోగాల సమయాన్ని, కచ్చితంగా గణించి చెప్పిన ’హ్యూమన్ కంప్యూటర్’ కేథరిన్ జాన్సన్.. ఇన్సులిన్, పెన్సిలిన్, విటమిన్ బీ12 వంటి జీవరసాయనాల అణు నిర్మాణాన్ని ఎక్స్–రే క్రిస్టలోగ్రఫీ సాయంతో గుర్తించే విధానాన్ని రూపొందించిన శాస్త్రవేత్త డొరోతీ హాడ్కిన్.. ఇలా మరెందరో మహిళా శాస్త్రవేత్తలు..భారతీయుల్లోనూ..అమ్మాయిలను ఇంటి గడప కూడా దాటనివ్వని రోజుల్లోనే చాలామంది మహిళలు ఈ రంగంలో ఎన్నో విజయాలను సాధించారు. అలా ఒకసారి వెనక్కి వెళితే, పాశ్చాత్య వైద్యవిద్యను అభ్యసించిన తొలి భారతీయ మహిళ ఆనందీ బాయి, 1883లో ‘భారతదేశంలోనే వైద్యశాస్త్రంలో తొలి పట్టభద్రురాలిగా కాదంబినీ గంగూలీ చరిత్ర సృష్టించారు. రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి మహిళగా గగన్ దీప్ ఎంతోమంది యువతులకు స్ఫూర్తినిచ్చారు.అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లా, ఇటీవలి కాలంలో కోవిడ్ వైరస్ ధాటిని ముందే గుర్తించి హెచ్చరించిన భారత శాస్త్రవేత్త, డబ్ల్యూహెచ్‌వో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్, మొక్కల కణాల్లో శక్తి ఉత్పాదనకు కీలకమైన ‘సైటోక్రోమ్ సీ’ అనే ఎంజైమును గుర్తించిన కమలా సొహెూనీ, క్యాన్సర్‌ను నిరోధించే ‘వింకా ఆల్కలాయిడ్స్’, మలేరియా చికిత్స కోసం వాడే ఔషధాలపై పరిశోధన చేసిన రసాయన శాస్త్రవేత్త అసీమా ఛటర్జీ, మైక్రోవేవ్ పరికరాలపై పరిశోధన చేసి, మన దేశంలో తొలి మైక్రోవేవ్ రీసెర్చ్ ల్యాబ్ నెలకొల్పిన శాస్త్రవేత్త రాజేశ్వరీ ఛటర్జీ, పుణె వైరాలజీ ల్యాబ్‌లో కోవిడ్ వైరస్‌ను వేరు చేసి, ‘కోవాక్సిన్’ రూపకల్పనకు మార్గం వేసిన ల్యాబ్ డైరెక్టర్ ప్రియా అబ్రహాం, అగ్ని–4, 5 క్షిపణుల రూపకల్పన ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన శాస్త్రవేత్త టెస్సీ థామస్.. ఇలా ఎందరో మహిళా శాస్త్రవేత్తలు ఈ రంగంలో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.రోజువారీ ఆవిష్కరణలు..1 పేపర్ బ్యాగ్ యంత్రం మార్గరెట్ ఎలోయిస్ నైట్పర్యావరణ రక్షణలో భాగంగా ఉపయోగించే పేపర్ బ్యాగులను ఉత్పత్తి చేసే యంత్రాన్ని రూపొందించింది శాస్త్రవేత్త మార్గరెట్ ఎలోయిస్ నైట్ 1870లో ఈస్టర్న్ పేపర్ బ్యాగ్ కంపెనీని స్థాపించి, ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పించారు.2 కాఫీ ఫిల్టర్ మెలిట్టా బెండ్జ్ఉదయాన్నే లేచి కాఫీ తాగితే వచ్చే ఆనందం కంటే, చివర్లో మిగిలిన పొడితో కాఫీ తాగడం ఇబ్బందికరమే! మొదటిసారి పలుచటి కాగితంతో మెలిట్టా బెండ్జ్ కాఫీ ఫిల్టర్‌ను తయారుచేశారు. ఇది మరెన్నో కాఫీ ఫిల్టర్స్ తయారీకి ఆధారంగా నిలిచింది.3 విండ్ షీల్డ్ వైపర్స్ మేరీ ఆండర్సన్దుమ్ము, ధూళి, మంచు, నీరు, ఇతర పదార్థాలను వెంటనే తొలగించి, ప్రయాణం సాఫీగా సాగించే విండ్ షీల్డ్ వైపర్స్‌ను 1903లో, మేరీ ఆండర్సన్ రూపొందించారు.4 జీపీఎస్ గ్లాడిస్ వెస్ట్తెలియని ప్రాంతాలకు వెళ్లాలన్నా, వాటి గురించి తెలుసుకోవాలన్నా ఉపయోగపడే జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ప్రోగ్రామింగ్ రూపకల్పనలో గ్లాడిస్ వెస్ట్ కీలక పాత్ర పోషించారు.5 గ్యాస్ హీటర్ అలిస్ ఎ పార్కర్శీతకాలంలో ఇంట్లో వెచ్చదనాన్ని అందించే గ్యాస్ హీటర్‌ను అలిస్ ఏ పార్కర్ రూపొందించారు. ఈ గ్యాస్ హీటర్ మరెన్నో ఎలక్ట్రికల్ హీటర్స్కు స్ఫూర్తినిచ్చింది.6 డిష్ వాషింగ్ మెషిన్ జోసెఫిన్ కోక్రాన్వంట సామాన్లను శుభ్రం చేసే, మొదటి డిష్ వాషింగ్ మెషిన్‌ను 1839లో జోసెఫిన్ కోక్రాన్ రూపొందించారు.7 వీఐఓపీ టెక్నాలజీ (వీడియో కాల్స్) మెరియన్ క్రోక్ప్రస్తుతం వీడియో కాల్స్ మాట్లాడుకోగలుగుతున్నామంటే కారణం మెరియన్ క్రోక్ .. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కృషి చేశారు.8 ఫ్రీక్వెన్సీ హోపింగ్ హెడీ లామర్హెడీ లామర్ గొప్ప ఆమెరికన్ నటి మాత్రమే కాదు, ఫ్రీక్వెన్సీ హోపింగ్ టెక్నాలజీని 1941లో కనుగొన్నారు. ఈ టెక్నాలజీనీ వైఫై, బ్లూటూత్‌లలో ఉపయోగిస్తున్నారు.మీకు తెలుసా?(యునెస్కో గణాంకాల ప్రకారం.. )⇒ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలలో మహిళల శాతం 33.3%⇒ మహిళా శాస్త్రవేత్తలకు సమాన అవకాశాలిస్తున్న దేశాలు 30⇒ ‘స్టెమ్’ విభాగాల్లోని విద్యార్థుల్లో మహిళలు 35%⇒ ఇప్పటివరకు నోబెల్ పొందిన మహిళలు 22⇒ జాతీయ సైన్స్ అకాడమీలలో మహిళల శాతం 12%⇒ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక రంగాలలో మహిళల శాతం 22%సైన్స్‌లో లింగ వివక్ష మహిళలను అభివృద్ధినే కాకుండా, దేశ అభివృద్ధిని కూడా నిరోధిస్తుంది. మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటానికి గల కారణాలలో లింగ వివక్ష, సామాజిక ఒత్తిడి, ఆర్థిక పరిమితులు, పరిశోధనలకు నిధుల కొరత. గుర్తింపులో అసమానతలు వంటి సమస్యలను మహిళా శాస్త్రవేత్తలు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. పురుషులతో పోల్చుకుంటే మహిళా శాస్త్రవేత్తలు చేపట్టే పరిశోధనలకు నామమాత్రంగా నిధులు మంజూరవుతుంటాయి.ఇలాంటి పరిస్థితుల్లోనూ శాస్త్ర సాంకేతిక పరిశోధకుల మొత్తం సంఖ్యలో మహిళలు 33.3% ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. అయితే, శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్న వేగంగా, ఈ రంగాల్లో మహిళలకు లభించాల్సిన ప్రోత్సాహంలో వేగం కనిపించడం లేదు. అందుకే, శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళలకు, బాలికలకు సమాన అవకాశాలను కల్పించి, లింగ వివక్షను, వ్యత్యాసాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరం. Sun, Feb 9 2025 1:51 AM

అమెరికాలోని ఒక పురాతన చర్చి లోపల ఉన్న రహస్యగదిలో శతాబ్దాల నాటి బంగారు నిధిని తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. చర్చి లోపలి గోడల్లో చిన్న అల్మరాలా కనిపించే ఒక గదిలో సుమారు 500 సంవత్సరాల నాటి పోలండ్, లిథువేనియా చక్రవర్తుల కిరీటాలు బయటపడ్డాయి. ఈ గదిలో నాణేలు, గొలుసులు, కిరీటాలు, శవపేటిక ఫలకాలు, రాజదండం వంటి ఇతర అమూల్యమైన వస్తువులు కూడా ఉన్నాయి.మొత్తం 59 పురాతన వస్తువులు, కళాఖండాలు ఇందులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వీటితోపాటు, వస్తువులను చుట్టిన ఒక వార్తాపత్రిక ఉంది. ఇది జర్మనీపై బ్రిటన్ యుద్ధం ప్రకటించిన నాలుగు రోజుల తర్వాత, 1939 సెప్టెంబర్ 7వ తేదీ నాటిది. దీని ఆధారంగా ‘అప్పట్లో సైనిక దాడుల నుంచి రాజసంపదను కాపాడటానికి ఈ రహస్య గదిని నిర్మించి, ఇందులో వీటిని భద్రపరచి ఉండచ్చు’ అని పురావస్తు శాస్త్రవేత్త విద్మంతస్ బెజారస్ తెలిపారు. Sun, Feb 9 2025 1:39 AM

ఈమధ్య సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం అందరిమీదా ఉంటోంది. కానీ వ్యాయామం విషయంలో శాస్త్రీయత లేని వారి సలహాల్ని పాటిస్తే ముప్పు అంటున్నారు నిపుణులు.

చాలామంది పిల్లలకు మ్యాథ్స్ అనగానే గుబులు. ఈ భయం మొత్తంగా చదువులపైన వారి ఆలోచననే మార్చేస్తుంది. దీన్ని పోగొట్టడానికి ఉపాధ్యాయులూ, తల్లిదండ్రులూ వినూత్నంగా ఆలోచించాల్సిందే.

స్కిన్‌కేర్ రొటీన్లో లిప్బామ్దీ ప్రధాన స్థానమే. తగ్గట్టుగా మార్కెట్లో బోలెడు ప్రత్యామ్నాయాలు. మరి మన పెదాలకు అనువైనదే వాడుతున్నామా? తెలుసుకుందాం రండి.

పరీక్షల సమయంలో సహజంగానే పిల్లలు ఒత్తిడికి గురవుతుంటారు. ఆ ప్రభావం కాస్తా వారి శారీరక, మానసిక ఆరోగ్యాల మీద పడుతుంది.

ఆదివారం వచ్చిందంటే.. మనం ఏం చేస్తాం.. ‘ఏముంది! అమ్మ పెట్టిన స్నాక్స్ తినేసి, స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ గబగబా పూర్తి చేసుకుంటాం. తరవాత ఎంచక్కా గేమ్స్ ఆడుకుంటాం’.. అంతే కదా!

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?

ప్రేమికుల రోజు వస్తోందంటే చాలు... ప్రేమకు చిహ్నంగా భావించే ఎర్రగులాబీలకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. కానీ, ప్రేమకు ప్రతిరూపంగా భావించే మరికొన్ని పూల రకాలూ ఉన్నాయి.
ఇంటి భద్రత... ప్రస్తుత రోజుల్లో మరింత కష్టమైపోయింది. కాస్త ఆదమరిచామంటే చాలు... ఇంట్లో విలువైన వస్తువులు, డబ్బు, ఆభరణాలు... ఇలా అన్నింటినీ దోచేస్తారు దుండగులు.
జీరో వేస్ట్‌పై అవగాహన పెరగడంతో.. వృథాగా పడేసే వస్తువుల్నీ ఇంట్లో వివిధ పనుల కోసం వినియోగిస్తున్నారు కొందరు. కొబ్బరి చిప్పలూ ఇందుకు మినహాయింపు కాదు. వీటిని పెన్ స్టాండ్‌గా, వాల్ హ్యాంగర్స్‌గా, నైట్ ల్యాంప్స్‌గా.. తయారుచేస్తూ తమలోని సృజనాత్మకతను చాటుకుంటోంది నేటి యువతరం.


empty stomach bath benefits: తిన్న తర్వాత స్నానం చేయకూడదని మనవాళ్లు చాలా మందే చెబుతుంటారు. అయితే, ఖాళీ కడుపుతో స్నానం చేయడం వల్ల శరీరానికి ఏం జరుగుతుందో మీకు తెలుసా?

అప్పుడప్పుడే పడమటి కొండల్లోకి అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ, నిట్టూర్పుతో మరుసటి రోజు కోసం ఎదురుచూద్దాం అనుకుంటూ అటువైపుగా చూస్తూ ఉంది పెద్దావిడ అన్నపూర్ణమ్మ. ఊళ్లో వాళ్లంతా ఆమెను పెద్దమ్మ అని ప్రేమతో పిలుస్తారు. అందరికీ ప్రేమను పంచుతూ, ఒకరికి కష్టం వస్తే, అది తనకే వచ్చిందనుకుని తపనపడే దొడ్డమనసు అన్నపూర్ణమ్మ సొంతం. ఊళ్లోని సాటి ఆడవాళ్లు ‘వదినగారు’ అని, పిల్లలందరూ ‘బామ్మ’ అని ఏదో ఒక వరుస కలుపుకొని ఆమెను పిలుస్తుంటారు. ఊరి మనుషులందరి అభిమానాన్ని సంపాదించుకున్న మహానుభావురాలు అన్నపూర్ణమ్మ.ఈ రోజు ఒంటరిగా మిగిలినా, ఒకప్పుడు ఆమె కుటుంబం చాలా పెద్దది. భర్త పరంధామయ్య శ్రీరాముడంతటి మనిషి. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. వ్యవసాయంలో లాభాలు గడిస్తూ, పదిమందికీ పెట్టే గుణం గల దయార్ద్ర హృదయుడు పరంధామయ్య. పేరుకు తగ్గట్లే అడగకుండానే కడుపు నింపే చల్లనితల్లి అన్నపూర్ణమ్మ. ఆ దంపతుల కొడుకులు సరస్వతీపుత్రులు, కూతుళ్లు చదువుల తల్లులు. ఊళ్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ముందుగా గుర్తొచ్చేది అన్నపూర్ణమ్మనే! సజావుగా సాగిపోతున్న ఆమె జీవితంలో అనుకోని కష్టం కెరటంలా ముంచుకొచ్చి, పరంధామయ్యగారిని తీసుకుపోయింది. ఆయన మరణంతోనే అన్నపూర్ణమ్మ సంతోషం దూరమైంది.చదువులు పూర్తయ్యాక పిల్లలకు పెళ్లిళ్లు చేసేసి, బాధ్యతలన్నీ పూర్తిగా నెరవేర్చుకుంది అన్నపూర్ణమ్మ. ఊళ్లోని పెద్దల సమక్షంలో ఆస్తిని సమ భాగాలు చేసి, పిల్లలందరికీ సమానంగా పంచింది. పంపకాల తర్వాత ఉద్యోగాల పేరిట ఎవరి దారి వారు చూసుకున్నారు. మిగిలింది వైభవంగా బతికిన ఇల్లు, దేవాలయంలాంటి ఆ ఇంట్లో దేవతలాంటి అన్నపూర్ణమ్మ. ఆ రోజు అన్నపూర్ణమ్మ పనిమనిషి రంగిని తోడుగా తీసుకుని, రామాలయానికి వెళ్లింది. అక్కడ భజనలో కూర్చుని, రామాయణాన్ని ఆలకిస్తూ, రామాయణ సారంలో తన సంసారాన్ని గుర్తు తెచ్చుకుని, ఆ శ్రీరామునికి నమస్కరించి, రంగితో కలిసి ఇంటికి బయలుదేరింది.మర్నాడు తెల్లారింది. రంగి కళ్లాపి చల్లి, ఇంటి ముందు ముగ్గు వేస్తున్న రంగి మెదడులో ఒకటే ఆలోచన– ఎప్పుడూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచే అన్నపూర్ణమ్మ ఇంకా నిద్రలేవలేదేంటా అనుకుంటూ, మధ్య మధ్యలో ఇంటి వసారాలోకి చూస్తూ, ముగ్గు ముగించింది.‘అమ్మగారూ!.. అమ్మగారూ!’ అని పిలుస్తూ, అన్నపూర్ణమ్మను లేపడానికి వెళ్లింది. రంగి పిలుపుతో అన్నపూర్ణమ్మ నెమ్మదిగా లేచింది. ‘ఏమైందమ్మా! ఇంతసేపు ఎప్పుడూ పడుకోలేదు’.. అంటూ రంగి ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.‘ఏమీ లేదే! రాత్రంతా మగత నిద్ర. తెల్లవారుతుండగా నిద్రొచ్చి, రెప్పల మీద వాలింది’ అంటూ ‘కాఫీ తెమ్మ’ని పురమాయించింది అన్నపూర్ణమ్మ. రంగి తీసుకొచ్చిన కాఫీ తాగింది. మనసులో ఏదో ఆలోచన ఆమెను కుదురుగా ఉండనివ్వడట్లేదు.పని ముగించుకుని, రంగి ఇంటికి వెళుతుండగా, ‘రంగీ! ఒకసారి ఇలా రా!’ అని పిలిచింది. రంగి వాలుకుర్చీ పక్కనే కూర్చుని, ‘సెప్పండమ్మా!’ అంది. ‘ఏంలేదే, నీతో మాట్లాడాలి. కాసేపాగి వెళుదువుగాని’ అంది అన్నపూర్ణమ్మ. ‘అలాగే, అమ్మగారు’ అంటూ సర్దుకుని కూర్చుంది. ‘అసలు మీకేమైనాది? అంత పరాగ్గా ఉన్నారేటి అమ్మగారు? నేనే అడుగుదామను కుంటుండా. అందరికీ ఏం అక్కర ఉన్నా సాయం చేసేటోళ్లు, మనసులో బాధ కూడా సెప్పకనే తెలుసుకునేటోళ్లు– అట్టాంటిది, మీకేమైనాదమ్మా! నాతో సెప్పండమ్మా’ అని అడిగింది. ‘ఏమిటే, నీతో మాట్లాడదాం అని నిన్ను నేను పిలిస్తే, నాకు ఊరటనిస్తున్నావా?’ అంది అన్నపూర్ణమ్మ.‘సరేగాని, నీ బిడ్డడు పనిలో కుదురుకున్నాడా?’ అడిగింది.‘ఎక్కడమ్మా! ఆడికొచ్చిన అరకొర సదువుతో యాడ కుదురుకుంటాడు తల్లీ!’ నిట్టూర్చింది రంగి.‘సరేలే! అయితే, నువ్వూ నీ కొడుకు ఇద్దరే కదా, నాతో ఉంటారా?’ అడిగింది అన్నపూర్ణమ్మ.ఆ మాటకు రంగి బిగుసుకుపోయి, ‘అదేటమ్మా? మీతో మేమెలా?’ అంటూ తల గోక్కుంటూ ఇబ్బంది పడుతుంటే, ‘సామానంతా సర్దుకుని, తయారుగా ఉండండి. రేపు మొదటి బండికి మనం పట్నం బయలుదేరుతున్నాం’ అంటూ రంగి సమాధానం తెలిసినట్లుగా ఆజ్ఞాపించింది అన్నపూర్ణమ్మ. ఎందుకో, ఏమిటో అనుకుంటూ అయోమయంలో ఇంటికి బయల్దేరింది రంగి.మరుసటి రోజు పొద్దున్నే రంగి, ఆమె కొడుకు నాగ అన్నపూర్ణమ్మ ఇంటికి సామానుతో వచ్చారు. బండికి ఇంకాస్త సమయం ఉంది. ప్రయాణంలో తినడానికి కొన్ని తినుబండారాలను బ్యాగులో సర్దింది రంగి. ఈలోగా అన్నపూర్ణమ్మ తయారై, బండి తెమ్మని పురమాయించింది. ముగ్గురూ రైల్వేస్టేషన్‌కు చేరుకుని, రైలులో కూర్చున్నారు. కిటికీలో నుంచి బయటకు చూస్తున్న అన్నపూర్ణమ్మ కళ్లు ఒక్కసారిగా కన్నీళ్లతో నిండిపోయాయి. నీటి తెరల వెనుక జ్ఞాపకాల అలలు ఒక్కొక్కటిగా మెదిలాయి. ఆ రోజు అన్నపూర్ణమ్మ కూతురికి డెలివరీ టైమ్ దగ్గరపడుతుండటంతో కూతురి దగ్గరకు వెళ్లింది.అన్నీ సవ్యంగా జరిగాయి. మహాలక్ష్మి రూపంలో కవలలు పుట్టారు కాని, అతుక్కుని పుట్టారు. హాస్పటిల్‌లోనే చాలా రోజులు ఉన్నాక డిశ్చార్జ్ అయ్యారు.హారతితో ఎదురువెళ్లిన అన్నపూర్ణమ్మకు బిడ్డలు కనబడలేదు. కూతురు, అల్లుడు– అంతే! ‘ఏమైంద’ని అడిగితే, ఆధునికతను అణువణువూ నింపుకున్న వాళ్లకు బిడ్డలు బరువు అనిపించి, ఆశ్రమంలో వదిలేసి వచ్చామన్నారు, ఏ బాధ లేకుండా. అన్నపూర్ణమ్మ మనసు భారమైంది. మానవత్వం, తల్లిప్రేమ ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. మర్నాడు ఆశ్రమానికి వెళ్లింది. పిల్లలను తీసుకుని, ఆస్పత్రిలో పెద్ద డాక్టర్‌ను కలిసి, వారి ఆపరేషన్ కోసం ప్రయత్నం మొదలుపెట్టింది. ఎట్టకేలకు ఆరు నెలల తర్వాత ఆపరేషన్ మొదలైంది. వరుసగా ఐదు నుంచి ఏడుసార్లు ఆపరేషన్ చేయాలని, అంతవరకు తామే చూసుకుంటామని వారు చెప్పారు. ‘అలాగే’నని వారికి కావలసిన డబ్బును ఒకేసారి జమచేసింది అన్నపూర్ణమ్మ.ఇది జరిగి ఇప్పటికి మూడు సంవత్సరాలు. పిల్లలను తీసుకెళ్లమని డాక్టర్ ఫోన్ చేయడంతో అన్నపూర్ణమ్మ చూడటానికి వెళ్లింది. అక్కడ తన మనవరాళ్లలాగ ఉన్న చాలామంది నిస్సహాయులైన పిల్లలు కనిపించారు. ఒక నిర్ణయంతో ఆ ఊరికి బయలుదేరింది. ‘అమ్మగారు! మనం ఇక్కడేనా దిగాలి?’ అడిగింది రంగి. ఔనన్నట్లు లేచింది అన్నపూర్ణమ్మ.అందరూ బండి దిగారు. బయట వారికోసం కారు ఆగి ఉంది. అందరూ అందులో బయలుదేరారు. ఒక విశాలమైన పచ్చిక బయలులాంటి మైదానంలో చుట్టూ చెట్టు చేమలతో, పక్షుల కిలకిలరావాలతో ఆహ్లాదభరితంగా ఉన్న ప్రదేశంలో దేవాలయంలాంటి ఇంటి ముందు ఆగింది కారు.అన్నపూర్ణమ్మ రాగానే ‘బామ్మ! బామ్మ!’ అంటూ చేతికర్రల ఊతంతో ఉన్న పిల్లలు, చక్రాల బళ్లలో ఉన్న పిల్లలు ఆమె చుట్టూ చేరారు. వారిలో అన్నపూర్ణమ్మ మనవరాళ్లు కూడా ఉన్నారు. ఆపరేషన్ అయ్యాక పిల్లలు సరిగా నడవలేరు అనే నిజం తెలుసుకున్నాక, అన్నపూర్ణమ్మ అక్కడ ఉన్న పిల్లలందరికీ ఆపరేషన్ చేయించింది. వారందరికీ తానే భోజన, వసతి ఖర్చులను భరించింది. తనకు మిగిలిన ఆస్తినంతా ఆశ్రమానికి రాసేసింది. ఆ ఆశ్రమంలోనే ఉంటూ, పిల్లల బాగోగులను చూసుకుంటూ తన శేష జీవితాన్ని గడపాలని నిర్ణయం తీసుకుంది అన్నపూర్ణమ్మ. అక్కడ అడుగుపెడుతూనే, పిల్లలందరూ అన్నపూర్ణమ్మ చుట్టూ చేరడం చూసి, రంగి, ఆమె కొడుకు నాగ ఆమెను దేవతను చూసినట్లుగా తన్మయం పొందారు. అన్నపూర్ణమ్మకు చేదోడు వాదోడుగా ఆ తల్లీకొడుకులు అక్కడే ఉండిపోయారు. అన్నపూర్ణమ్మ తీసుకున్న నిర్ణయం రేపటి తరపు సూర్యోదయం కోసం ఎదురుచూసే మలిసంధ్య. Sun, Feb 9 2025 12:09 PM

మామా మందుకు డబ్బుల్లేవా.. డోంట్ వర్రీ మామా.. నేనున్నాను కదా పదా పోదాం.. ఇదిగో సిగరెట్ తీసుకో బావా.. భయమెందుకు నేనున్నా.. కదా.. బే ఫికర్ బ్రదర్.. నేను చూస్కుంటానులే.. ఈ చొక్కా నచ్చిందా తీసుకో.. నేను బిల్లు పే చేస్తాను.. ఆగాగు.. టిక్కెట్ నువ్వెందుకు తీయడం.. నీకసలే జీతం తక్కువ.. ఇంకెప్పుడూ పక్కన నేను ఉండగా నువ్వు జేబులో చేయి పెట్టొద్దు.. పెట్రోల్ నేను పోయిస్తాను తమ్ము.. నువ్వెందుకు కంగారు పడతావ్... ఇలాంటి స్నేహాలు మనం చూస్తూనే ఉన్నాం..వద్దులే లక్ష్మి ఆటోచార్జీ పది రూపాయలు నువ్వు ఇవ్వకు.. నేను ఇస్తాలే.. ఒసేయ్ మంగా మేమంతా తలో రెండొందలతో ఆరుకు వెళ్తున్నాం.. నువ్వూ రావాలి.. డబ్బులెం ఇవ్వద్దులే.. మేం చూసుకుంటాం.. జస్ట్ నువ్వు ఆటో ఎక్కు చాలు.. ఇదీ హౌస్ వైవ్స్ స్నేహం.. హలొ.. బ్రదర్ రాజేష్.. మనవాళ్ళం ముగ్గురం బిజినెస్ పెడుతున్నాం తలో టూ క్రోర్స్ ఉండాలి.. నువ్వు అంత పెట్టలేవు.. ఎంత ఉంటే అంత పెట్టు.. చాలు.. మిగతాది మేం చూస్తాం.. నువ్వేం ఫీల్ కావద్దు.. హలో రెడ్డీ.. ఈ బిజినెస్ మనదే.. పెట్టుబడి నేను పెడతాను.నువ్వు జస్ట్ డబ్బుల్లేకున్నా వర్కింగ్ పార్ట్నర్ గా ఉండు.. పని మొత్తం నువ్వే చూసుకో.. ఇదో టైప్ స్నేహం.. అసలు స్నేహం.. ఇతరులకు సహాయం చేయడం ఇది ఒక జీవన విధానం అయింది.. చిన్నప్పుడు తెచ్చుకున్న బిస్కెట్ ముక్క.. కాకెంగిలి చేసి ఇచ్చిన ఉసిరికాయ లంచ్ టైములో తన డబ్బాలోంచి తీసిచ్చిన చిన్న ఆవకాయ ముక్క.. ఇవన్నీ మనలోని ఒక ఆత్మీయ భావనకు సూచికలు ...ఒక్కడే తిన్నది తిండీ కాదు.. ఒక్కడే బతికింది బతుకూ కాదు.. మనిషి సంఘ జీవి.. తాను బతుకుతూ ఇంకొందరిని బతికించాలి.. తానూ తింటూ ఇంకొకరి ఆకలి తీర్చాలి అప్పుడు కదా జీవితానికి సార్థకత. కాకి .. పిచ్చుక.. కుక్కలు కూడా తాము తింటూనే అక్కడ అక్కడ గింజలు.. మెతుకులు ఉన్నాయ్.. మీరూ రండి అని తోటివాళ్లను పీలుస్తాయి.. అంతా కలిసి ఆకలి తీర్చుకుంటాయి.. కానీ మనిషి ఒక్కడే తాను తింటే చాలనుకుంటాడు.చిన్న పిల్లలు.. పెద్ద మనసులు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఓ స్కూల్లో పిల్లలు తమ సహచరుడి ఫీజ్ కోసం ఎంత యాతన పడ్డారు.. వారంతా ఐక్యంగా ఆ సమస్య నుంచి తమ మిత్రుడిని ఎలాగట్టెక్కించారన్నది ఒక వీడియో ట్విట్టర్లో పోస్ట్ అయింది. దీనికి వేళల్లో షేర్లు.. వందల్లో కామెంట్లు వచ్చాయి. స్కూల్లో ఫీజు చెల్లించలేదని ఒక అబ్బాయిని స్కూలు మేనేజిమెంట్ ప్రశ్నిస్తుంది.. అయితే తన తండ్రి పేదరికం కారణంగా ఆ పిల్లడు ఫీజు సకాలంలో చెల్లించలేకపోతాడు.. దీంతో అతని సహచరులు.. అంతా పదేళ్లలోపు పిల్లలే అయినా పెద్దమనసు చేసుకుంటారు.. తలా కొంత వేసుకుని స్నేహితుడి ఫీజు చెల్లిస్తారు.వారు తమలోతాము చందాలు వేసుకుంటుండగా టీచర్ వచ్చి అబ్బాయిలు.. మీ ఫ్రెండ్ ఫీజు సంగతి నేను చూసుకుంటాను.. మీరు వెళ్ళండి.. మీకెందుకురా కష్టం అని చెబుతున్నా.. మీ సాయం మాకు అవసరం లేదు.. మా వాడికి మేమున్నాం.. మేం చూసుకుంటాం అని వారంతా ఏకమై తమ మిత్రుడి ఫీజు చెల్లించిన వీడియో అందరి హృదయాలను కదిలిస్తోంది. తనకోసం వాళ్లంతా ఇలా డబ్బులు వేసుకోవడాన్ని చూసిన ఆ పిల్లడు కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తే మనకైనా మనసు కరుగుతుంది. ఇది కదా పిల్లలలో ఉండాల్సింది. ఇలాంటి లక్షణాలు కదా పిల్లల్లో మొలకెత్తాలి.. అలా పిల్లల్లో పురుడుపోసుకున్న ఆలోచనలకూ తల్లిదండ్రులు సైతం తోడ్పాటును ఇవ్వాలి-సిమ్మాదిరప్పన్న These young good hearts collected money to pay fees of his friend 🥺I hope these young angels continue their pure and innocent spirit and bless the world 🙌 pic.twitter.com/BGQ2uw9d5o— Vineeta Singh 🇮🇳 (@biharigurl) February 7, 2025 Sun, Feb 9 2025 11:41 AM

మహిళల్లో చాలామంది తమ వాస్తవమైన ఏజ్ కంటే తక్కువ వయసు వారిగా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారంటూ ఈ అంశంపై సమాజంలో జోకులూ, సెటైర్లూ ఎక్కువగానే వినిపిస్తుంటాయి. కానీ ఇలా తక్కువ వయసువారిగా కనిపించడం అన్నది ఆరోగ్యపరంగా, ఆత్మవిశ్వాసపరంగా చాలా మేలు చేస్తుందని పరిశోధనల్లో నిరూపితమైంది. మహిళలకే కాదు... ఈ విషయం పురుషులకూ వర్తిస్తుంది. నిజానికి తమ వాస్తవమైన ఏజ్ కంటే తక్కువ వయసువారిగా కనిపించేవారు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం తోపాటు ఆరోగ్యపరంగా వాళ్లకు హైబీపీ, పక్షవాతం, గుండెజబ్బుల వంటి జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువని పరిశోధనల్లో తేలింది. తామింకా చిన్నవాళ్లమేననే భావన వల్ల వారు సుదీర్ఘకాలం పాటు జీవించడమూ జరుగుతుందని వెల్లడైంది. వాళ్ల ముఖంపైన ముడుతలు రావడమూ తక్కువేనని తేలింది. ‘‘జర్నల్ ఆఫ్ జెరంటాలజీ’’ అనే వైద్య జర్నల్‌లో నమోదైన పరిశోధనల ఫలితాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. (చదవండి: తల్లి పాలతో మెదడు మెరుగ్గా!) Sun, Feb 9 2025 1:04 PM

రాచకొండ పోలీసుస్టేషన్ పరిధిలోని మీర్‌పేటలో వెలుగులోకి వచ్చిన ‘చంపేసి.. ఉడకబెట్టిన’ కేసు సంచలనం సృష్టించింది. ఇంత దారుణంగా కాకున్నా, హైదరాబాద్‌లో దాదాపు ఏడాదిన్నర క్రితం అనురాధ అనే నర్సు హత్యకు గురైంది. ఆమె శరీరాన్ని ముక్కలు చేసిన నిందితుడు చంద్రమోహన్ ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు. మూసీ నది సమీపంలో దొరికిన హతురాలి తలతో మొదలైన ఈ కేసు దర్యాప్తు కొలిక్కి రావడానికి ఓ యూపీఐ పేమెంట్ కీలక ఆధారమైంది. చైతన్యపురి ప్రాంతంలో నివసించే బి.చంద్రమోహన్ అవివాహితుడు. వడ్డీ వ్యాపారంతో పాటు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుండేవాడు. తల్లితో కలిసి సొంత ఇంటి మొదటి అంతస్తులో నివసించేవాడు. ఇతడి తండ్రికి 2007లో ఒక ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ జరిగింది. అప్పట్లో ఆస్పత్రి తరఫున సేవలు చేయడానికి హెడ్ నర్సు వై. అనురాధారెడ్డి ఇంటికి వచ్చేది. చంద్రమోహన్‌కు ఆమెతో పరిచయం ఏర్పడింది. తండ్రి 2009లో చనిపోయినప్పటికీ వీరి పరిచయం కొనసాగి, సన్నిహితంగా మారారు. చంద్రమోహన్ 2021లో అనురాధను తన ఇంటి కింద ఉన్న ఒక పోర్షన్లోకి తీసుకువచ్చాడు. అనురాధ, చంద్రమోహన్ 15 ఏళ్లు సన్నిహితంగా మెలిగారు. అతగాడు ఆమె నుంచి దాదాపు 20 తులాల బంగారం, రూ.8 లక్షల నగదు తీసుకున్నాడు. కొన్నేళ్ల క్రితమే భర్త నుంచి విడాకులు తీసుకున్న అనురాధ రెండో వివాహం చేసుకోవాలని 2023లో భావించింది. దీంతో తన వద్ద తీసుకున్న బంగారం, నగదు తిరిగి ఇవ్వాల్సిందిగా చంద్ర మోహన్‌పై ఒత్తిడి చేసింది. ఆమె వివాహ ప్రయత్నాలు తెలుసుకున్న చంద్రమోహన్, అదే జరిగితే అనురాధ తనకు దూరం అవుతుందని, అప్పటికే ఆమె వద్ద తీసుకున్న నగదు, బంగారం తిరిగి ఇవ్వాల్సి వస్తుందని భావించాడు. దీంతో అనురాధను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. 2023 మే నెలలో వేసవి సెలవుల నేపథ్యంలో చంద్రమోహన్ ఇంటి కింది భాగంలో ఉన్న మరో పోర్షన్లో ఉండే కుటుంబం ఊరికి వెళ్లింది. అక్కడే ఉన్న మరో పోర్షన్లో నివసించే అనురాధను హత్య చేయడానికి అదే సరైన సమయమని చంద్రమోహన్ భావించాడు. ఆ నెల 12న మధ్యాహ్నం ఆమె వద్దకు వెళ్లి, గొడవకు దిగాడు. ఇంట్లో ఉన్న కత్తితో దాడి చేసి చంపేశాడు. మృతదేహాన్ని అక్కడే ఉంచి, ఎలా మాయం చేయాలనే అంశంపై తన స్మార్ట్‌ఫోన్ ద్వారా యూట్యూబ్‌లో సెర్చ్ చేశాడు. మృతదేహం వాసన బయటకు రాకుండా ఏం చేయాలనేది వెతికాడు. అందులో చూపించిన వీడియోలను ఆధారంగా చేసుకుని, అప్పటికప్పుడు రెండు చిన్న సైజు స్టోన్ కట్టర్లు, నాలుగు మటన్ కత్తులు, దాదాపు 40 వరకు ఫినాయిల్, డెట్టాల్, వివిధ కెమికల్స్ బాటిళ్లు, అగరుబత్తీలు, అత్తర్లు, కర్పూరం తదితరాలు కొనుక్కుని వచ్చాడు. కట్టర్లతో మొండెం నుంచి తల, కాళ్లు, చేతులు వేరు చేస్తూ అనురాధ శరీరాన్ని ఆరు ముక్కలు చేశాడు. కాళ్లు, చేతులు, తల ఫ్రిజ్‌లో, మొండాన్ని ఓ పెట్టెలో పెట్టి మూడు రోజులు గదిలోనే ఉంచాడు. హతురాలి సెల్‌ఫోన్‌ను తన వద్దే ఉంచుకున్న చంద్రమోహన్ దాంతో ఆస్ట్రేలియాలో ఉండే ఆమె కుమార్తెతో అనురాధ మాదిరిగా చాటింగ్ చేస్తూ వచ్చాడు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తన ఇంటి నుంచి కింద ఉన్న అనురాధ పోర్షన్లోకి వస్తున్న చంద్రమోహన్ మృతదేహం ముక్కల మీద ఫినాయిల్, డెట్టాల్, కర్పూరం తదితరాలు చల్లి వెళ్లేవాడు. ఇంట్లో రక్తం వాసన తెలియకుండా అగరుబత్తీలు, అత్తర్లు వినియోగించాడు. ఇలా దాదాపు 13 రోజుల పాటు వాసన ఆ గది కూడా దాటకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ మృతదేహం విషయం పక్కింటి వాళ్లకు, పైనే ఉన్న చంద్రమోహన్ తల్లికీ తెలియలేదు. ఓ దశలో చంద్రమోహన్ దఫదఫాలుగా మృతదేహం భాగాలను బయట పారేయాలని భావించాడు. అనూరాధ తలను చెత్త కవర్లో పెట్టుకుని వెళ్లి, 2023 మే 15 రాత్రి మూసీ సమీపంలో పడేశాడు. పారిశుద్ధ్య కార్మికులు మే 17న ఉదయం దీనిని గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తల దొరికిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆ ప్రాంతానికి దాదాపు 300 మీటర్ల దూరంలో ఉన్న దానిపై ఆధారపడ్డారు. 2023 మే 16వ తేదీ ఫీడ్ పరిశీలించినా ఎలాంటి ఆధారం లభించలేదు. దీంతో 15వ తేదీకి సంబంధించింది చూస్తుండగా, ఓ వ్యక్తి ఆటోలో వచ్చి కవర్‌ను ఆ ప్రాంతంలో పారేస్తున్నట్లు కనిపించింది. అక్కడ నుంచి ఒక్కో కెమెరాలో అతడి కదలికలు గమనిస్తూ పోయారు. తల దొరికిన ప్రాంతం నుంచి దాదాపు కిలోమీటరు ప్రయాణించిన చంద్రమోహన్ అక్కడి ఓ బేకరీ వద్ద ఆగాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పారేయడంతో రిలాక్స్ అయ్యాడు. అక్కడే ఓ వాటర్ బాటిల్ కొనుక్కుని తాగాడు. వాటర్ బాటిల్‌కు తన ఫోన్లోని యూపీఐ యాప్ ద్వారా డబ్బు చెల్లించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటిని చూసిన పోలీసులు అప్రమత్తమయ్యారు. తక్షణం ఆ బేకరీ వద్దకు చేరుకుని ఆ రోజు జరిగిన యూపీఐ లావాదేవీల డేటా సేకరించారు. సీసీ కెమెరాల్లో ఉన్న టైమ్ ఆధారంగా వాటర్ బాటిల్ ఖరీదు చేసిన వ్యక్తి చెల్లించిన లావాదేవీని గుర్తించారు. ఆ యూపీఐ యాప్‌తో అనుసంధానించి ఉన్న ఫోన్ నంబర్ తెలుసుకున్న దర్యాప్తు అధికారులు దాని ఆధారంగా చంద్రమోహన్‌ను గుర్తించి 2023 మే 24న అరెస్టు చేశారు. ఆపై కేసును హత్య జరిగిన ప్రాంతం జ్యురీస్‌డిక్షన్ ఆధారంగా చైతన్యపురి ఠాణాకు బదిలీ చేశారు. Sun, Feb 9 2025 12:02 PM

కొందరికి బరువు తగ్గడం అత్యంత క్రిటికల్‌గా మారిపోతుంటుంది. ఎంతలా ప్రయత్నించిన చక్కటి ఫలితం మాత్రం దక్కదు. ఆఖరికి ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకున్నా ఎందువల్ల బరువు తగ్గలేకపోతున్నామనేది అర్థంకానీ చిక్కుప్రశ్నలా వేధిస్తుంటుది. అందుకు గల ముఖ్యమైన ఆటంకాల గురించి పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ(Anjali Mukerjee) సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. కొందరు బరువు తగ్గడానికి చాలా కష్టపడుతుంటారని, వాళ్లంతా చేసే తప్పులు ఇవే అంటూ వివరించారు. అవేంటంటే..పోషకాహారమే తీసుకుంటున్నాం(Eating Healthy) అయినా సరే బరువు తగ్గడం భారంగా మారిపోతోందన్నారు. అలాంటివాళ్లను తాను స్వయంగా చూశానన్నారు. ఇన్‌స్టాలో “ఆరోగ్యంగా తిన్నప్పటికీ బరువు తగ్గడానికి కష్టపడుతున్నారా? అనే క్యాప్షన్‌తో అందుకు గల కారణాలను వివరించారు ముఖర్జీ. కొన్నిసార్లు మీరు ఏం తింటున్నారనేది ప్రధానం కాదు, శరీరం దానికి తగిన విధంగా ప్రాసెస్ చేస్తుందా లేదా అనేది కూడా గమనించాలని అన్నారు. అసలు బరువు తగ్గాలనుకున్నవాళ్లు చేసే తప్పులు ఏంటంటే..పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం చేసే తప్పులుబరువు తగ్గించే జర్నీలో డైట్ అనేది ఎంత ముఖ్యమే సమతుల్యంగా తీసుకుంటున్నామో లేదా అన్నిది కూడా అంతే ప్రధానం అని చెబుతున్నారు అంజలి.అలాగే ఆహరం పరిమాణ, కేలరీలను గమనించండి. ఎందుకంటే బాదం, నెయ్యి ఆరోగ్యానికి మంచివే గానీ ఆ రోజు నువ్వు తీసుకునే కేలరీల ఆధారంగా తీసుకోవాలా లేదా నిర్ణయించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాలను అతిగా తినడం: అంటే మంచిది కదా అని అవకాడో, వాల్నట్లు, జీడిపప్పు, ఖర్జూరాలు, ఎండుద్రాక్ష మరియు డార్క్ చాక్లెట్లను ఎక్కువగా తినేస్తుంటారు. దీని వల్ల కూడా బరువు తగ్గడం సాధ్యం కాదని అన్నారు. హార్మోన్ ఆరోగ్యాన్ని అంచనా వేయండి: అంటే ఒక్కోసారి థైరాయిడ్ అనేది రక్తపరీక్షల్లో కూడా బయటపడకపోవచ్చు. దీనివల్ల కూడా బరువు తగ్గించే ప్రయత్నం విఫలమయ్యే అవకాశం ఉంటుందట. దీర్ఘకాలిక ఒత్తిడి: ఒత్తిడి కార్టిసాల్ స్థాయిలలో పెరుగుదలకు దారితీస్తుంది. ఇది క్రమంగా బొడ్డు కొవ్వుకు దారితీస్తుంది. అంటే ఇక్కడ ఒత్తిడిని నిర్వహించడం అనేది అత్యంత ప్రధానం. అదే బరువు తగ్గడానికి సహయపడుతుందట. పేగు ఆరోగ్యాన్ని నిర్వహించడం: పైన పేర్కొన్న అంశాలతో పాటు, పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమని అంజలి చెప్పారు. అడపాదడపా ఉపవాసం వంటి వాటిని ప్రయత్నించి సరైన విధంగా ఆహారం తీసుకుంటేనే చక్కటి ఫలితాన్ని అందుకోగలుగుతారని అన్నారు. అలాగే అనుసరించే డైట్‌కి శరీరం స్పందించే విధానాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటే మరిన్ని చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారని చెప్పారు ముఖర్జీ.(చదవండి: యంగ్ లుక్ మంచిదే!) Sun, Feb 9 2025 2:56 PM

2018 జూలై 26, ఉదయం 11 గంటలు– ‘అమ్మా! చదువుకోవడానికి రోషనీ ఇంటికి వెళుతున్నాను’ తల్లితో చెప్పింది నిర్మలా. ‘సరే, సాయంత్రంలోగా వచ్చేసేయ్’ అని చెప్పి, కూతురిని సాగనంపింది తల్లి దుర్గాదేవి.సైకిల్ మీద బయలుదేరింది నిర్మలా. నేపాల్‌లోని కాంచన్‌పూర్ గర్ల్స్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోందామె. సాయంత్రం ఆమె తండ్రి యజ్ఞరాజ్ పంత్ ఇంటికి చేరుకున్నాడు. చీకటి పడినా నిర్మలా ఇంటికి రాలేదు. ఆమె స్నేహితురాలు రోషనీ ఇంటికి వెళ్లి కనుక్కున్నాడు.‘నిర్మలా ఇక్కడకు వచ్చింది. ఇద్దరం చదువుకున్నాం. మధ్యాహ్నం మూడు గంటలకే బయలుదేరింది’ అని చెప్పింది రోషనీ.రాత్రి పదిగంటలకు యజ్ఞరాజ్, దుర్గాదేవి దంపతులు తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ‘రేప్పొద్దున్న రండి, ఫిర్యాదు తీసుకుంటాం’ అని పోలీసులు నిర్లక్ష్యంగా బదులిచ్చారు. చేయగలిగిందేమీ లేక యజ్ఞరాజ్, దుర్గాదేవి ఇంటికి వెళ్లిపోయారు.మర్నాడు ఉదయం నిర్మలా మృతదేహం ఒక చెరుకుతోటలో నగ్నంగా పడి ఉంది. ఆ చెరుకుతోట రోషనీ ఇంటికి అరకిలోమీటరు దూరంలో నిర్మలా ఇంటికి వెళ్లే తోవలో ఉంది. తోట బయట ఆమె సైకిలు పడేసినట్లుగా ఉంది. స్థానికులు సమాచారం తెలపడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఎవరో ఆమెపై అత్యాచారం చేసి, చంపేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.ఈ సంఘటనపై నేపాల్‌లో దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు జరిగాయి. కూతురు కనిపించడం లేదంటూ ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన తల్లిదండ్రులను పోలీసులు మర్నాడు రమ్మని నిర్లక్ష్యంగా చెప్పడంపై మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.స్థానిక పోలీసులు నిందితుల ఆచూకీ కనిపెట్టడంలో విఫలం కావడంతో సంఘటన జరిగిన నాలుగు రోజులకు నేపాల్ జాతీయ దర్యాప్తు సంస్థ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీఐబీ) రంగంలోకి దిగింది. అయినప్పటికీ నేపాల్‌లో ఈ సంఘటనపై ఆందోళనలు చల్లారలేదు. కాంచన్‌పూర్‌లో ఆగస్టు 24న జరిగిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒకరు మరణించగా, మరొకరు తూటా గాయానికి గురయ్యారు.పరిస్థితి నానాటికీ జటిలంగా మారుతుండటంతో సీఐబీ పోలీసులు దిలీప్‌సింగ్ బిస్తా అనే వ్యక్తిని అరెస్టు చేశారు. పంత్ కుటుంబం నివసించే వీథిలోనే బిస్తా నివాసం. నిర్మలా హత్యకు కొద్దిరోజుల ముందే అతడు హత్యకేసులో శిక్ష అనుభవించి, జైలు నుంచి విడుదలై వచ్చాడు. పలుమార్లు జరిపిన ఇంటరాగేషన్‌లో బిస్తా తానే ఈ నేరం చేసినట్లు అంగీకరించాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే, ఫోరెన్సిక్ పరీక్షల్లో జరిగిన సంఘటనలో అతడి ప్రమేయం లేదని తేలింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యాన్ని నేపాల్ జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా అభిశంసించింది. కొన్నాళ్లకు పోలీసులు పంత్ కుటుంబానికి పొరుగునే ఉండే ప్రదీప్ రావల్‌ను, అతడి స్నేహితుడు బిశాల్ చౌధరిని ఈ కేసులో అరెస్టు చేశారు. వాళ్లను సీఐబీ ఐజీ సర్బేంద్ర ఖనాల్, డీఐజీ నీరజ్ బహదూర్ షాహీ స్వయంగా విచారించారు. వారిని ఇంకా కోర్టులో ప్రవేశపెట్టక ముందే నేపాల్ రక్షణమంత్రి ఈశ్వర్ పొఖ్రేల్ ఆదరబాదరగా ప్రెస్‌మీట్ పెట్టి, నిర్మలా పంత్ కేసులో దోషులు పట్టుబడ్డారు అని ప్రకటించారు.తర్వాత రావల్, చౌధరి రక్త నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. మృతురాలి నుంచి సేకరించిన నమూనాలతో వారి నమూనాలు సరిపోలడం లేదని వైద్యులు తేల్చారు. కోర్టు వారిని విడుదల చేసింది. బయటకు వచ్చాక వారిద్దరూ పోలీసులు తమను చిత్రహింసలకు గురిచేసినట్లు మీడియాకు చెప్పారు. పోలీసులు వారిద్దరి నమూనాలతో పాటు, భీమ్‌దత్తా మునిసిపాలిటీ మేయర్ సురేందర్ బిస్తా సోదరుడి కొడుకు ఆయుష్ బిస్తా, సురేందర్ బిస్తా సోదరుడు ఎస్పీ బిస్తా, ఆయన కొడుకు కిరణ్ బిస్తాల నుంచి కూడా నమూనాలు సేకరించారు. వారి నమూనాలేవీ మృతురాలి నుంచి సేకరించిన నమూనాలతో సరిపోలేదు. ఈ కేసుపై దర్యాప్తును పోలీసులు ప్రహసనంగా మార్చడంతో కోపోద్రిక్తులైన జనాలు నేపాల్‌లో దేశవ్యాప్తంగా నెలల తరబడి ఆందోళనలు కొనసాగించారు. దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎనిమిదిమంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసినా, ఆందోళనలు సద్దుమణిగాక కొద్దినెలల్లోనే వాళ్లందరికీ తిరిగి పోస్టింగులు ఇచ్చారు. సంఘటన జరిగి ఆరున్నరేళ్లయినా, నిర్మలా పంత్ హత్యాచారానికి కారకులైన అసలు నేరస్థులు ఎవరనేది పోలీసులు కనుక్కోలేక పోయారు. నేపాల్‌ను అట్టుడికించిన ఈ సంఘటన మిస్టరీగానే మిగిలిపోయింది. Sun, Feb 9 2025 11:55 AM

ఐఐటీ జేఈఈ లాంటి కఠినతరమైన పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవడం అనేది చాలామంది విద్యార్థుల డ్రీమ్. అలాగే ఉత్తీర్ణత సాధించి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో రికార్డు స్థాయి జీతాలతో అందరినీ విస్తుపరుస్తుంటారు కూడా. అలాంటిది ఈ యువకుడు జేఈఈ మెయిన్‌లో ఎవ్వరూ బ్రేక్ చేయని విధంగా రికార్డు స్థాయిలో మార్కులు తెచ్చుకున్నాడు. మంచి కాలేజ్‌లో సీటు పొందాడు. పైగా ఇంజీనీరింగ్ విద్యను అకడమిక్ సంవత్సరం కంటే ముందే పూర్తి చేశాడు. అయినా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కి వెళ్లలేదు. మరీ లక్షల ప్యాకేజ్‌ల ఉద్యోగాన్ని వద్దనుకుని ఏం చేస్తున్నాడో తెలిస్తే..విస్తుపోతారు. అంతేగాదు అతడి స్టోరీ వింటే గెలుపంటే ఇది కదా అని అనుకుండా ఉండలేరు.ఉదయపూర్‌లోని మహారాణా భూపాల్‌కి చెందిన వ్యక్తి కల్పిత్ వీర్వాల్. లక్షలాది మంది డ్రీమ్ ఐఐటీ జేఈఈ2017లో ఉత్తీర్ణత సాధించాడు. దాన్ని కల్పిత్ అత్యంత అలవొకగా సాధించేశాడు. ఇక్కడ కల్పితేమి ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. పెద్ద బ్యాగ్రౌండ్ ఏమి లేదు కూడా. తల్లి ఓ ప్రైవేటు టీచర్ కాగా, తండ్రి కాంపౌడర్. అలాగే కల్పిత్ జేఈఈ ప్రిపరేషన్ కోసం అందరిలా ఏకంగా 16 గంటలు చదివిన వ్యక్తి కూడా కాదు. అలాగే కోచింగ్ సెంటర్లలోనే ఉండిపోయి ప్రిపేరయ్యేలా పలు సంస్థలు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ముందుక వచ్చినా.. వాటిని కూడా ఇష్టపడకుండా తన ఇంటి నుంచి ప్రిపేరయ్యేందుకే మొగ్గు చూపాడు. ఇక జేఈఈ మెయిన్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా, ఎవ్వరూ బ్రేక్ చేయని రేంజ్లో 360/360 మార్కులు సంపాదించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం దక్కించుకున్నాడు. అంతేగాదు అతనికి కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (KVPY) స్కాలర్, నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్ (NTSE) వంటి ఎన్నో ప్రోత్సాహక స్కాలర్షిప్లను సొంతం చేసుకున్నాడు. అయితే అందరిలా IIT బాంబే కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్‌లో చేరినా.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. ఐఐటీ రెండో సంవత్సరంలోనే ఒక YouTube ఛానెల్‌ను ప్రారంభించాడు. అక్కడ తన అధ్యయన వ్యూహాలను , JEE ప్రిపరేషన్ చిట్కాలను పంచుకున్నాడు. దీనికి అనతికాలంలోనే అనూహ్యస్పందన వచ్చింది. అతడిచ్చే సలహాలు ఆచరణాత్మకంగా ఉండేవి. విద్యార్థులంతా సాధారణ కోచింగ్ సెంటర్లు బోధించే దానికి భిన్నంగా ఉందంటూ ఇంప్రెస్ అయ్యేవారు. అలా అతని యూట్యూబ్ ఛానెల్‌కి లక్షకు పైగా సబ్స్క్రైబర్లు, ఫాలోయింగ్ ఉండేది. తన ఛానెల్‌కి ఉన్న డిమాండ్ దృష్ట్యా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకున్నాడు. అలా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి సహాయపడే ఆన్లైన్ విద్యా వేదిక అయిన AcadBoostను కల్పిట్ ప్రారంభించాడు. మరసుటి ఏడాదే తన తొలి ఆన్లైన్ కోర్సుని డెవలప్ చేశాడు. అది విజయవంతమైంది. అలా అతను తన ఐఐటీ క్యాంపెస్ ప్లేస్మెంట్లలో వచ్చే ప్యాకేజ్‌లకు మంచి ఆదాయాన్ని ఈ ఆన్లైన్ వేదిక AcadBoostతో ఆర్జించాడు. అలాగే తన ఐఐటీ బాంబే ప్రోగ్రామ్‌లో ఒక సెమిస్టర్ ముందుగానే ముగించాడు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో అకాడ్బూస్ట్ టెక్నాలజీస్‌లో పనిచేసేవాడు. దీంతో 2021 నాటికి, లింక్డ్ఇన్ 'టాప్ వాయిసెస్'లో కల్పిత్‌కి స్థానం ఇచ్చింది. అలా 20 మంది అత్యుత్తమ యువ నిపుణుల జాబితాలో కల్పిత్ అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అంతేగాకుండా టెడ్ఎక్స్లో తన జేఈఈ మంచిస్కోర్కి సంబంధించిన సక్సస్ జర్నీని షేర్ చేసుకున్నాడు. ఇక్కడ కల్పిత్ కేవలం విద్యా విషయాలకే కట్టుబడి ఉండలేదు. అతను సీనియర్ NCC క్యాడెట్ అయ్యాడు, కఠినమైన తుపాకీ కసరత్తులు, శిబిరాలు శిక్షణ తర్వాత ఎన్సీసీ ఏ సర్టిఫికేట్‌ని కూడా సంపాదించాడు. అలాగే JEEకి సిద్ధమవుతున్నప్పుడు కూడా, అతను క్రికెట్, టీవీ, బ్యాడ్మింటన్, సంగీతం కోసం సమయం కేటాయించేవాడు. ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, ఎడ్టెక్ దిగ్గజాలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినా..నిరాకరించాడు. తన కంటూ ఓ అచంచలమైన లక్ష్యంతో విభ్నింగా ఉండాలనుకున్నాడు, అలానే జీవించి ఎందరికో ప్రేరణగా నిలిచాడు. ఇక్కడ విజయం అంటే కేవలం మార్కులు కాదని, దృష్టి, వ్యూహాలకు సంబంధించినదని ప్రూవ్ చేశాడు. ఎన్ని గంటలు చదివామన్నది కాదు..ఎంత బాగా చదువుతున్నాం, ఎంత నాలెడ్జ్‌ని పొందుతున్నాం అన్నదే ముఖ్యం అని చాటిచెప్పాడు.(చదవండి: ఆరోగ్యకరమైన ఆహారమే అయినా బరువు తగ్గడం లేదు ఎందుకు..?) Sun, Feb 9 2025 4:51 PM

నిద్రకూ, మెదడూ అలాగే నాడీ వ్యవస్థకు ఉన్న సంబంధం చాలా సంక్లిష్టం. అయినప్పటికీ చాలా చిన్న చిన్న ఉదాహరణలతోనే ఆ సంక్లిష్ట సంబంధాన్ని నిరూపించవచ్చు. ఉదాహరణకు క్రితం రాత్రి నిద్రలేకపోతే... ఆ మర్నాడంతా దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేరు. స్వల్పకాలిక జ్ఞాపకశక్తి (షార్ట్ టర్మ్ మెమరీ) తగ్గుతుంది. అలాగే నాలుగైదు రోజులు సరిగా నిద్రలేకపోతే చిన్న చిన్న విషయాలకే చికాకు కలగవచ్చు. చిర్రెత్తుకురావచ్చు. పిచ్చికోపం వచ్చేస్తుంది. కొన్ని భ్రాంతులకూ లోనయ్యే ప్రమాదం ఉంది. ఇలా నిద్రలేమి కారణంగా మూడ్స్ మారిపోవడాన్ని బట్టి చూస్తే... నిద్రకూ, నాడీ వ్యవస్థకూ సంబంధముంటుందని తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... వాహనాలు నడిపేవారికి తగినంత నిద్రలేకపోతే డ్రైవింగ్‌పై పూర్తిగా దృష్టి నిలపలేక యాక్సిడెంట్లు అయిన ఉదంతాలు అన్నీ ఇన్నీ కావన్నది అందరికీ తెలిసిన విషయాలే.నిద్ర సమయంలో మెదడులో జరుగుతూ మానవులకు మేలు చేసే కొన్ని పరిణామాలివి... పెద్దవాళ్ల విషయంలో... అల్జిజమర్స్ వ్యాధికి గురికావడం : మెదడులో వెలువడే కొన్ని విషపూరితమైన రసాయనాలను అంటే... ఉదాహరణకు బీటా ఎమైలాయిడ్ ప్యాక్ వంటి పాచిలాంటి పదార్థాలను నిద్రపోయే సమయంలోనే బ్రెయిన్ వదిలించుకుంటుంది. ఈ పాచి వంటి రసాయనాలే అల్జిజమర్ వ్యాధికి కారణమవుతాయి. ఈ వ్యాధి ఎంతటి ప్రమాదకరమైనదంటే గతంలో తాను నివసించిన ప్రాంతాలు, తాను నివాసముంటున్న ఇల్లు, తనకు తెలిసిన అన్ని నైపుణ్యాలు (వాహనం నడపడం వంటివి) ఇలా అన్నింటినీ మరచిపోయే ప్రమాదముంటుంది. అల్జిమర్స్ సోకినవాళ్లు మింగడం ఎలాగో అనేదేకాదు... చివరికి తానెవరో అనే సంగతీ మరచిపోతారు. స్లీప్ ఆప్నియా: గొంతులోంచి ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే నాళం ముడత పడటంతో శ్వాసప్రక్రియలో అందులోంచి గాలి ప్రవహించేటప్పుడు గురక వస్తుంది. చాలామంది గురకను తేలిగ్గా తీసుకుంటారుగానీ ‘స్లీప్ ఆప్నియా’ అని పిలిచే ఇది... చాలా ప్రమాదకరమైన వ్యాధి. గొంతులోని వాయునాళానికి సంబంధించిన ఈ వ్యాధిని... నిజానికి ముక్కు, గొంతుకు సంబంధిత రుగ్మత అనుకుంటారుగానీ... ఈ వ్యాధికీ మెదడుకూ ఎంత సంబంధముంటుందంటే... గురక సమయంలో ముడుచుకుపోయిన వాయునాళం కారణంగా మెదడుకు తగినంత ఆక్సిజన్ అందనప్పుడు... బాధితుణ్ణి నిద్రలేవాల్సిందిగా మెదడు ఆదేశిస్తుంది. ఈ శ్వాసనాళం పూర్తిగా మూసుకుపోవడం అనే పరిస్థితి 10 సెకండ్లకు పైగానే కొనసాగవచ్చు. అంటే ఆ టైమ్‌లో శ్వాస అందదు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితిని తప్పించడానికి బాధితుణ్ణి నిద్రలేవమని మనను మన మెదడు ఆదేశిస్తుంది. అప్పుడు నిద్రలేచి శ్వాస తీసుకుని మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. అలా నిద్రాభంగం కాగానే ముడుతలు పడ్డ వాయునాళం కాస్తా మామూలుగా అయిపోవడంతో మళ్లీ మెదడుకు తగినంత ఆక్సిజన్ అందుతుంటుంది. ఇలా శ్వాస అందని (ఆప్నియా) స్థితి ఒక రాత్రిలోనే కొన్ని వందల సార్లు రావచ్చు. ఫలితంగా వచ్చే నిద్రలోటును ‘స్లీప్ డెఫిసిట్’ అంటారు. ఇలా గురక వస్తూ ఉంటుంది కాబట్టి మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో అలాగే నాణ్యమైన నిద్ర కరవు కావడంతో (అంటే స్లీప్ డెఫిసిట్‌తో) ఆ మర్నాడు బాధితులు మగతగా, డల్‌గా కనిపిస్తుంటారు. దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేరు. దీనివల్ల అర్థం చేసుకునే శక్తి, లాజికల్‌గా నేర్చుకునే శక్తియుక్తులు (కాగ్నెటివ్ ఎబిలిటీస్) తగ్గుతాయి. అంతేకాదు... పలు నాడీ సంబంధమైన రుగ్మతలు (న్యూరలాజికల్ కండిషన్స్)తోపాటు క్రమంగా మెదడు ఆరోగ్యమూ ప్రభావితమయ్యే అవకాశముంది. పక్షవాతం : నిద్రలేమి కారణంగా మెదడుకు కలిగే అసౌకర్యాలూ లో΄ాలతో పక్షవాతం లాంటి తీవ్రమైన వ్యాధులు సైతం వచ్చే అవకాశముంది. త్వరగా వయసు పైబడటం: నిద్రలేమి కారణంగా వయసు పెరగడం (ఏజింగ్) వల్ల కలిగే అనర్థాలు చాలా త్వరగా వచ్చేస్తాయి. కంటినిండా నిద్ర΄ోయే వారిలో ఏజింగ్ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. అంటే వాళ్లు సుదీర్ఘకాలం ΄ాటు యౌవనంగా ఉంటారు. ఆరోగ్యకరమైన నిద్ర వల్ల చర్మం త్వరగా ముడతలు పడదు. అలా ముడతలు పడకుండా ఉంచేందుకు దోహదపడే కొలాజెన్ అనే కణజాలం చాలా కాలం పటుత్వంగా ఉండటంతో చర్మంపైనా, కళ్ల కింద నల్లబడటం జరగదు (డార్క్ సర్కిల్స్ రావు). నుదుటిమీద గీతలు పడవు. మంచి నిద్రతోనే మంచి జ్ఞాపకశక్తి : నిద్రలో మెదడులో కొన్ని తరంగాలు లయబద్ధంగా కదులుతూ ఉంటాయి. వాటినే ‘షార్ట్ వేవ్ రిపుల్స్’ అంటారు. మనుషులు ఏదైనా విషయాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు అది మరింతగా గుర్తుండిపోవడానికి కారణమౌతూ జ్ఞాపకశక్తికి తోడ్పడేవి ఈ తరంగాలే. అమెరికన్, ఫ్రెంచ్ శాస్త్రజ్ఞులు 2009లో నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం ఈ జ్ఞాపకాలన్నీ మెదడులోని హి΄్పోక్యాంపస్ నుంచి మరో ప్రాంతం అయిన నియోకార్టెక్స్‌కు బదిలీ అయి... అక్కడ దీర్ఘకాలపు జ్ఞాపకాలు (లాంగ్ టర్మ్ మెమరీ)గా ఉండిపోతాయి. అంటే ఇక్కడ షార్ట్ టర్మ్ మెమరీగా ఉన్న జ్ఞాపకాలు... అక్కడ లాంగ్ టర్మ్ మెమరీస్‌గా మారి శాశ్వతమవుతాయి. అందుకు కారణమైన ‘షార్ప్ వేవ్ రిపుల్స్’ అన్నీ గాఢనిద్రలోనే సాధ్యమవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే... నిద్ర ఉంటేనే మంచి జ్ఞాపకశక్తి సాధ్యమవుతుంది.నిద్రతోనే పిల్లలు ఎత్తు పెరిగే సామర్థ్యం: పిల్లల్లో ఎత్తు పెరిగేందుకు సహాయం చేసే గ్రోత్ హార్మోన్లు నిద్రలోనే స్రవించేలా మెదడు ఆదేశాలు ఇస్తుంది. అంటే పిల్లలు కంటి నిండా నిద్రపోతేనే బాగా పెరుగుతారు. బాగా ఎత్తుగా ఎదురుతారు. ఒక వయసు దాటాక ఇదే గ్రోత్ హార్మోన్ కండరాలను పెంచుతుంది. అవి మందంగా అయ్యేలా చేస్తుంది. ఎముకలను గట్టిపరుస్తుంది. చిన్న పిల్లలు కంటి నిండా నిద్రపోతున్నారంటే... పై ప్రయోజనాలన్నీ చేకూరుతున్నాయని అర్థం. మంచి నిద్ర కోసం... ప్రతిరోజూ ఒకే వేళకు నిద్రించడం / నిద్రలేవడం నిద్రపోయే ముందర సమస్యలను చర్చించకపోవడం గోరువెచ్చటి నీళ్లతో స్నానం, శ్రావ్యమైన సంగీతం వినడం రాత్రిపూట పడుకునే ముందు కాఫీ, టీ, శీతల నీయాలు, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం నిద్రకు ముందర టీవీ చూడటం, కంప్యూటర్ పై పనిచేయడానికి దూరంగా ఉండటం పడకగదిలో మరీ ఎక్కువ కాంతిగానీ, చప్పుళ్లు గానీ లేకుండా చూసుకోవడంపడకగదిలో మరీ ఎక్కువ చల్లగా లేకుండా, వెచ్చగా లేకుండా జాగ్రత్తపడటం అన్నిటికంటే ముఖ్యంగా రోజూ దేహానికి తగినంత వ్యాయామం ఇవ్వడం. దానితోటు మెదడుకు మేతగా సుడోకూ, పజిల్స్ వంటివి సాల్వ్ చేస్తూ మెదడుకూ తగినంత వ్యాయామాన్ని కల్పించడం. ఇలాంటివి చేయడం వల్ల మంచి నిద్ర పట్టడంతోపాటు మెదడుకూ మంచి ఆరోగ్యం సమకూరుతుంది. డా. విక్రమ్ కిశోర్ రెడ్డి, సీనియర్ న్యూరో ఫిజిషియన్ (చదవండి: అందాన్ని చెడగొట్టే పులిపిరులను సులభంగా తొలగించుకోండిలా..!) Sun, Feb 9 2025 12:10 PM

నాకు ఇప్పుడు ఎనిమిదవ నెల. ముందుగానే ఉమ్మనీరు పోతే కష్టమని విన్నాను. ఉమ్మనీరు పోతే ఎలా తెలుసుకోవాలి?

ముఖం ఎంత అందంగా ఉన్నా, పులిపిరికాయలు వచ్చాయంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మొటిమలైతే రెండు మూడు రోజుల్లో నయమవుతాయి గాని, పులిపిరి వస్తే దానంతట అది తగ్గదు. పులిపిరులు ముఖంపై మాత్రమే కాకుండా, శరీరంలో చర్మపు మడతల్లో ఎక్కువగా ఏర్పడతాయి. అందాన్ని చెడగొట్టే పులిపిరుల సమస్యకు ఈ పరికరం చెక్ పెడుతుంది. ఇది ఎలాంటి నొప్పి లేకుండా, ఇతర దుష్ప్రభావాలేవీ లేకుండా పులిపిరులను సురక్షితంగా తొలగిస్తుంది. ఇది ఇంట్లో ఉన్నట్లయితే, పులిపిరులను తొలగించుకోవడానికి ఆస్పత్రికి వెళ్లనక్కర్లేదు. శస్త్రచికిత్సలు, రసాయనిక చికిత్సలతో పనిలేకుండానే ఈ పరికరం సాయంతో పులిపిరులను సులువుగా తొలగించుకోవచ్చు.ఈ 2 ఇన్ 1 మైక్రో టు లాడ్జ్ ఆటో స్కిన్ ట్యాగ్ రిమూవర్ కిట్‌లో.. 2 మిమీ – 8 మిమీ సైజుల్లోని చాలా రకాల బ్లేడ్స్ ఉంటాయి. వాటిని అవసరాన్ని బట్టి మార్చుకోవాల్సి ఉంటుంది. వాటికి అనువైన రెండు రకాల హెడ్స్ డివైస్‌తో పాటు లభిస్తాయి. వాటిని అడ్జస్ట్ చేసుకుని పులిపిరులను సులభంగా తొలగించుకోవచ్చు. పట్టుకోవడానికి, వాడుకోవడానికి ఈ పరికరం చాలా అనువుగా ఉంటుంది ఈ పరికరాన్ని ఉపయోగించి, పులిపిరులను తీసిన తర్వాత చర్మంపై మచ్చ ఉండిపోతుందేమోనన్న భయం అక్కర్లేదు. ఆ మచ్చలు కూడా చాలా వేగంగా తగ్గిపోతాయి. ఇలాంటి పరికరాలు మార్కెట్లో చాలానే అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి పరికరాలను నిపుణులను సంప్రదించి ఉపయోగించడం మంచిది. (చదవండి: ఉమ్మనీరు పోతే ఎలా తెలుసుకోవాలి?) Sun, Feb 9 2025 11:29 AM

తమ నెలల వయసులో పూర్తిగా తల్లిపాలపైనే ఆధారపడటంతోపాటు... చాలాకాలం పాటు అలా తల్లిపాలు తాగుతూ పెరిగే పిల్లలకు భాషలు నేర్చుకునే సామర్థ్యం, ప్రతిభ (లాంగ్వేజ్ స్కిల్స్) చాలా ఎక్కువని కొన్ని పరిశోధనల్లో తేలింది. అంతేకాదు... ఇలా తల్లిపాలపై దీర్ఘకాలం పెరిగే పిల్లల్లో మెదడు వికాసం బాగా జరగడం వల్ల వాళ్లకు సహజమైన తెలివితేటలూ, తార్కికంగా ఆలోచించే శక్తియుక్తులు (లాజికల్ స్కిల్స్) కూడా బాగా పెరుగుతాయంటూ హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం కోసం దాదాపు 1500 మంది తల్లులను ఎంపిక చేశారు. దాదాపు ఏడు సంవత్సరాల పాటు సాగిన ఈ అధ్యయనంలో చాలాకాలం పాటు తల్లిపాలు తాగిన పిల్లలూ, కేవలం కొద్దికాలం పాటు మాత్రమే బ్రెస్ట్ ఫీడింగ్‌పై ఉన్న పిల్లల తెలివితేటలనూ, ఐక్యూను పరీక్షించారు. ఈ అధ్యయనంతో తేలిన అంశాలను బట్టి... చాలాకాలం పాటు తల్లిపాలు తాగిన పిల్లలు వారి మంచి సామర్థ్యాలను కనబరిచారు. సుదీర్ఘకాలం పాటు తల్లిపాలను తాగిన పిల్లలు ఎక్కువ వకాబు్యలరీని కలిగి ఉండటంతోపాటు, భాషపై మంచి పట్టు సాధించినట్లు తేలింది. హార్వర్డ్ పరిశోధకుల పరిశోధన వివరాలు ‘జామా పీడియాట్రిక్స్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. (చదవండి: నిద్రపోకపోతే బాసూ... మెమరీ లాసూ! Sun, Feb 9 2025 12:52 PM

నేను ఇప్పుడు ఐదునెలల గర్భవతిని. రొమ్ముల్లో చాలా నొప్పి ఉంటోంది. ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక రొమ్ముల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఏవి నార్మల్ అనేది తెలియజేయండి?– బిందు, విజయవాడ. బ్రెస్ట్ టిష్యూలో కొవ్వు ఉంటుంది. లోబ్యూల్స్ అంటే పాలను ఉత్పత్తి చేసేవి. డక్ట్స్ అంటే పాలను క్యారీ చేసేవి ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఈ లోబ్యూల్స్, డక్ట్స్ పాలను ఉత్పత్తి చేయటానికి సిద్ధమవుతుంటాయి. అందుకే, ప్రెగ్నెన్సీలో కొన్ని మార్పులు రెండు రొమ్ముల్లోనూ ఉంటాయి. సాధారణ మార్పులు అంటే రెండు రొమ్ముల ఆకారం, పరిమాణం మారుతాయి. నిపుల్స్, ఆరియోలా డార్క్‌గా మారుతాయి. వాటి చుట్టూ ఉన్న చర్మం కూడా డార్క్ అవుతుంది. కనిపించే రొమ్ము సిరల మీద స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. రొమ్ములు సున్నితంగా అవుతాయి. బ్రెస్ట్ అవేర్నేస్ అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. త్వరగా కేన్సర్‌ని డిటెక్ట్ చేయవచ్చు. ప్రతి మూడు వందల్లో ఒకరికి ప్రెగ్నెన్సీలో కూడా కేన్సర్ రావచ్చు. అందుకే బ్రెస్ట్ మీద చర్మం ముడతలు పడటం, నిపుల్ నుంచి గ్రీన్ కలర్ డిశ్చార్జ్ వచ్చినా, గడ్డలు తగిలినా అల్ట్రాసౌండ్ టెస్ట్స్ ప్రెగ్నెన్సీలో చేస్తాం. ఏ సందేహం ఉన్నా బయాప్సీకి పంపిస్తాం. బ్రెస్ట్ ఫీడింగ్‌లో రొమ్ము కేన్సర్ ప్రమాదం చాలా తగ్గుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ డెలివరీ అయిన అరగంటలోపు చేయాలని అందుకే ఎంకరేజ్ చేస్తాం. ఎంత ఎక్కువ కాలం బ్రెస్ట్ ఫీడ్ ఇస్తే అంత మంచిది. కేన్సర్ రిస్క్ అంత తక్కువ చేస్తుంది. ఫీడింగ్ ఇచ్చే సమయంలో బ్రెస్ట్ గట్టిగా అవటం, ఫ్యూయర్ రావటం, నొప్పి ఉండటం చూస్తాం. దీనిని ఎంగేజ్మెంట్ అంటాం, పాల డక్ట్స్ బ్లాక్ అయినందున ఇలా అవుతుంది. ప్రెగ్నెంట్ బ్రెస్ట్ ఫీడింగ్, ఎక్స్ట్రా మిల్క్‌ను తొలగించటంలాంటి వాటితో ఎంగేజ్‌మెంట్‌ను ప్రివెంట్ చేయవచ్చు. బ్రెస్ట్ స్పెషలిస్ట్‌ని సంప్రదించటం మంచిది. ప్రసవం అయి, బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో కూడా రొమ్ముల్లో మార్పులు ఉంటాయి. ఈ మార్పులు చాలా వరకు ఫీడింగ్ ఆపిన తరువాత నార్మల్ బ్రెస్ట్లాగా అవుతాయి.రొటీన్ చెకప్స్ చాలా అవసరం. ప్రతి నెలా ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ స్కిన్ టెక్స్చర్ మారుతుందా, ఆర్మ్పిట్లో ఏవైనా లంబ్స్ వచ్చాయా, నిపుల్ డిశ్చార్జ్లోను అకస్మాత్తుగా ఆకార పరిమాణాల్లోను మార్పులు వచ్చినా, నిపుల్ ఇన్వెన్షన్, డిసెక్షన్స్లో మార్పులు అయినా, దురద ఉన్నా వెంటనే డాక్టర్ని కలవాలి. డాక్టర్ భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ (చదవండి: ఉమ్మనీరు పోతే ఎలా తెలుసుకోవాలి?) Sun, Feb 9 2025 5:18 PM


జంతువులు మనుషుల మధ్య ప్రేమ, విధేయత అనేది మనం కథల్లో చదువుతుంటాం..చూస్తుంటాం..కానీ నిజజీవితంలో కూడా ఇలాంటి సంఘటన అరుదుగా జరుగుతుంటాయి..అలాంటిదే ఓ ఏనుగు





















సాధారణంగా మనం గుడ్డును ఉడకబెట్టినప్పుడు పర్ఫెక్ట్గా రాదు..ఏదో ఒక లోపం ఉంటుంది..ఎక్కువ వేడితో ఉడికిస్తే తెల్లసొన బాగా ఉడికి.. పచ్చసొన పొడిగా మారుతుంద




health benefits of sesame seeds: నువ్వులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నువ్వులలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం సహా ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

















కాకరకాయ కేవలం ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాదు.. కురుల అందాన్నీ ఇనుమడిస్తుంది. కాకర రసం తరచూ కుదుళ్లు, జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుందంటున్నారు నిపుణులు.

వేలాడే అరలు/ఫ్లోటింగ్ షెల్ఫ్స్ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ భాగమైపోయాయి. ఇంటికి సరికొత్త అందాన్ని తీసుకురావడంతో పాటు స్థలాన్ని ఆదా చేయడమే వీటి ప్రత్యేకత! అయితే వీటిని అమర్చుకుంటేనే సరిపోదు.. ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే మాత్రం దుమ్ము-ధూళి చేరి వాటికున్న అందం దెబ్బతింటుంది.

కండరాల దృఢత్వానికి, కొవ్వు కరిగించుకొని చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకోవడానికి రకరకాల వ్యాయామాలు చేస్తుంటాం. అయితే వీటి ద్వారా శరీరం మొత్తానికి వ్యాయామం అందుతుందా? లేదా? అని మీరెప్పుడైనా ఆలోచించారా? ఇలాంటి ఫలితాన్ని అందించేదే క్రాలింగ్!






బుధుడు ప్రస్తుతం మకరరాశిలో ఉన్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధుడు గ్రహాలకు యువరాజు.. తెలివితేటలు.. వ్యాపారంలో లాభ నష్టాలను బుధుడే నిర్ణయిస










గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడమంటే మాటలు కాదు. దానికి ఎంతో శ్రమ, నిరంతర కృషి, పట్టుదల ఉండాలి. సాధించాలనే తపనతో పనిచేయాలి. అప్పుడే రికార్డు దక్కుతుంద


ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లో ఉండాలంటే రీల్స్, షార్ట్స్ చేస్తుంటారు చాలామంది. అయితే స్మార్ట్ఫోన్లలో తీసే వీడియోలు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో అప్లోడ

ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాల్లో ట్రెడిషనల్‌గా కనిపించేదిఈ బాలీవుడ్ నటి. ఇప్పుడు పూర్తిగా తన లుక్‌ని మార్చేసి డిఫరెంట్‌గా మారిపోయింది. లుక్‌కి తగ్గట్టే పవ


స్మార్ట్ టీవీ కోసం వైఫై బేస్డ్ ఎంటర్టైన్మెంట్ సర్వీస్‌లు తీసుకొచ్చిన స్ట్రీమ్ బాక్స్ మీడియా, ఇప్పుడు డోర్ ప్లే పేరుతో సరికొత్త యాప్ తీసుకొచ్చింద

తక్కువ బడ్జెట్‌తో ట్రావెలింగ్ ఎలా చేయాలి? అనే ప్రశ్నకు సమాధానం వరుణ్ వాగీష్ వీడియోలు చూస్తే తెలిసిపోతు

‘ది సొసైటీ ఆఫ్ ఫొటోగ్రాఫర్స్ మంత్లీ ఇమేజ్ కాంపిటీషన్’ 2024వ సంవత్సరానికి గానూ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ పోటీకి ఏడాది మొత్తంలో 6

ఫాస్ట్ ఫ్యాషన్ వల్ల కాలుష్యం ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి దాన్ని తగ్గించడం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానంగా సౌమ్య హైబిస్కస్

ఈ వారం స్పెషల్ మష్రూమ్స్.. అదేనండి పుట్టగొడుగులు. ఈ మధ్య కూరగాయలతో పాటు ఇవి కూడా మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలామంది వంటింట్లో కూడా కనిపిస

HDFC బ్యాంక్ యూపీఐ సేవలకు ఫిబ్రవరి 8,2025న అంతరాయం ఏర్పడనుంది.సిస్టమ్ మెయింటెనెన్స్ లో భాగంగా ఆ రోజు HDFC బ్యాంక్ UPI సేవలకు మూడు గంటల డౌన్‌టైమ్&


విజయపురిని వీరసేనుడు పాలించేవాడు. తను సేకరించిన విలువైన వస్తువులు భద్రపరచిన ప్రత్యేక మందిరం కోసం కాపలాదారులుగా కొత్తగా వచ్చిన రామయ్య, భీమయ్యలను నియమిం

ప్రపంచంలోని ఏ దేశంలో ఏది ప్రత్యేకమైనది? ఎత్తైన కట్టడం ఎక్కడుంది? లోతైన జలపాతం ఏది?.. ఇలాంటి విషయాలన్ని టీచర్లు స్కూల్ పిల్లలకు చెప్తుంటారు

పిల్లలకు ఏదైనా కొత్త విషయాన్ని నేర్పించాలంటే.. కొత్తగానే చెప్పాలి. లేదంటే.. ఇలా విని అలా మర్చిపోతారు. ముఖ్యంగా మూడు.. నాలుగేండ్ల పిల్లలకు పండ్లు

పిల్లలకు చదువుతోపాటు క్రియేటివిటీ చాలా ఇంపార్టెంట్. మరి క్రియేటివిటీ పెరగాలంటే ఏం చేయాలి? ఇలాంటి గాడ్జెట్స్ ఇస్తుండాలి. ఈ కిడ్స్ కెమెరాని టాయ్ ఇమా

ఒక్క పాముని చూస్తేనే గుండె ఝల్లుమంటుంది. అలాంటిది ఇక్కడ ఒకేచోట ఏకంగా.. 102 పాములను పట్టుకున్నారు స్నేక్ క్యాచర్స్. ఆస్ట్రేలియాలోని సిడ్నీ సిటీ శివార

మానవులు నియమబద్ధమైన జీవితాన్ని గడపడానికి ఎంతో కృషి అవసరం. అటువంటి జీవితాన్ని గడిపేవారు ఉన్నత లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ఆ లక్ష్యాలను చేరుకోకుండా సప్త





జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 9 వ తేది నుంచి ఫిబ్రవరి 15 వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి ఆర్థి






ఆడవాళ్లు-మగవాళ్ల అలవాట్లు వేర్వేరుగా ఉంటాయి. వారి ఇష్టాయిష్టాలు, అభిరుచుల్లోనూ ఎన్నో తేడాలు కనిపిస్తాయి. అయితే, ఆహారం విషయంలోనూ ‘ఆడ-మగ’ భేదాలు ఉన్నట్లు పలు పరిశోధనలు తేల్చాయి.


రూపాయి విలువ ఎక్కువున్న దేశానికి ఎందుకు వెళ్తాం? సంపాదించుకోవడానికి! చదువు పేరుతో వెళ్లినా అంతిమ లక్ష్యం అక్కడ కొలువు సాధించడమే! ఈ ప్రస్తావన అమెరికా డిపోర్టేషన్ గురించే! స్టూడెంట్ వీసా మీదున్న వాళ్లు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకోకపోతే కష్టం! అక్కడున్న చట్టాల ప్రకారం చదువుకునే క్యాంపస్ లోనే కొలువులు చేయాలి. అవి దొరకడం క్లిష్టం! క్యాంపస్‌కు ఆవల ఉద్యోగాలకు వెళితే డిపోర్టేషన్ ఖాయం! ఈ క్రమంలో అక్కడున్న భారతీయ కుటుంబాలు కొన్ని.. అవసరంలో ఉన్న స్టూడెంట్స్‌కి తమ ఇళ్లల్లో డొమెస్టిక్ హెల్ప్ ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. అవి చేయడం తప్పనిసరైతే భద్రత, రక్షణను దృష్టిలో పెట్టుకుని, లీగల్ హెల్ప్ తీసుకుని అడుగేయడం మంచిది!తెలంగాణకు చెందిన నేహా (పేరు మార్చాం) అమెరికాలో ఎమ్మెస్ చదువుతోంది. వాళ్లది వ్యవసాయ కుటుంబం. అందరి పిల్లల్లాగే తమ పిల్లలూ విదేశాల్లో మంచి ఉద్యోగంలో స్థిరపడాలని నేహా తల్లిదండ్రుల ఆశ. అందుకే నేహా వాళ్ల అక్కను (యూకే), ఆమెను అప్పులు చేసి మరీ విదేశాలకు పంపారు చదివించడానికి. ఖర్చుల కోసం అమ్మా, నాన్న మీద ఆధారపడకూడదని చదువుతూనే పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకుంటున్నారిద్దరూ. నేహా తన యూనివర్సిటీ దగ్గర్లోని సూపర్మార్కెట్లో సేల్స్ గర్ల్‌గా పనిచేసేది. ఆ ఏరియా పోలీసులు, ఇమిగ్రేషన్ సిబ్బంది ఆ సూపర్ మార్కెట్లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న ఫారిన్ స్టూడెంట్స్‌ని తీసేయమని, లేదంటే ఆ షాప్ లైసెన్స్ రద్దవుతుందని యజమానికి వార్నింగ్ ఇచ్చారు. మరుక్షణమే నేహా జాబ్ పోయింది. ఖర్చులెలా? అప్పుడే నేహా స్నేహితురాలు ఆమెకు సబర్బ్‌లోని ఇండియన్ కమ్యూనిటీలో ఉన్న డొమెస్టిక్ హెల్పర్ కొలువు గురించి చెప్పింది. ‘వీకెండ్స్‌కి వెళ్లి ఇల్లు క్లీన్ చేయాలి. వాళ్లకు పిల్లలుంటే ఆడించాలి. గెట్ టు గెదర్స్కి అరెంజ్మెంట్స్ చేయాలి అంతే!’ అంటూ ఆ ఉద్యోగంలో చేయాల్సిన పనులను వివరించింది. ‘పేమెంట్ ప్రామ్ట్గానే ఉంటుంది. మన ఐడెంటిటీ ఎక్కడా రివీల్ చేయర’నే అభయమూ ఇచ్చింది. మరో ఆప్షన్ లేదని మారు మాట్లాడకుండా ఓ గుజరాతీ కుటుంబంలో డొమెస్టిక్ హెల్పర్‌గా చేరింది నేహా.ఇంకో స్టేట్‌లో...ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మాలతి (పేరు మార్చాం) డిపెండెంట్ వీసా మీద అమెరికా వెళ్లింది. భర్తకు హెచ్1బీ ఉంది. ఆమె అక్కడ తమకు తెలిసిన వాళ్ల రెస్టరెంట్లో మేనేజర్‌గా పనిచేసేది. కానీ ఈ మధ్యే ఉద్యోగం మానేసింది. రెస్టరెంట్ ఓనర్ మీద ఇమిగ్రేషన్ అధికారుల ఒత్తిడి, డిపెండెంట్ వీసా మీద తాను ఉద్యోగం చేస్తున్నట్టు ఇమిగ్రేషన్ సిబ్బందికి తెలిస్తే తన భర్త హెచ్1బీ వీసా రద్దవుతుందేమోనన్న భయంతో! ఈ ఇద్దరే కాదు.. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి.. అమెరికాలో విజిటింగ్ వీసా, స్టూడెంట్ వీసాల మీద ఆఫ్ క్యాంపస్ (వాళ్లు చదువుతున్న యూనివర్సిటీకి ఆవల) ఉద్యోగాలు చేస్తున్నవారు, డిపెండెంట్ వీసా మీద గుంభనంగా జాబ్స్ చేసుకుంటున్న వాళ్లందరి పరిస్థితి అలాగే ఉంది. కారణం.. వర్క్ పర్మిట్ లేకుండా ఫుల్ టైమ్ జాబ్స్ చేస్తున్నవారిని, అనుమతి లేని ప్రదేశాల్లో పార్ట్ టైమ్‌కి కుదిరిన వారిని, చట్టవిరుద్ధంగా ఆ దేశంలోకి చొరబడిన వారిని వెనక్కి పంపే కార్యక్రమాన్ని ట్రంప్ కఠినంగా అమలు చేస్తున్నాడు. పాస్‌పోర్ట్‌లో ఒక్కసారి డిపోర్టెడ్ అని ముద్ర పడితే మళ్లీ ఆ దేశానికి విమానమెక్కే చాన్స్ ఉండదు. ఆ స్థితికి రావద్దని ప్రయత్నించని వారులేరు. అందుకే అది పాచి పనా.. ఇంకోటా అని చూడకుండా, పని చోట భద్రత ఉందా? రక్షణ ఎంత? అని ఆలోచించకుండా తాము పనిచేస్తున్నట్టు అమెరికన్ గవర్నమెంట్‌కు తెలియకపోతే చాలు అనుకుంటూ దొరికిన పనిలో చేరిపోతున్నారు! అమెరికా అంతటా ఇలాంటి పరిస్థితే లేదని, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు గెలిచిన రాష్ట్రాల్లోనే డిపోర్టేషన్ కఠినంగా ఉందని చెబుతున్నారు అక్కడుంటున్న తెలుగువాళ్లు కొందరు. ఇలా చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న వాళ్లను సొంత దేశాలకు పంపించేయడం ఇదే మోదటిసారి కాదని, ఆందోళనలు.. భయాలు కొత్తేం కాదని తేలిగ్గా తీసుకుంటున్న అమెరికా పౌరసత్వం పొందిన భారతీయులూ ఉన్నారు. అయితే ఈ డిపోర్టేషన్‌ను ఆసరాగా తీసుకుని తక్కువ జీతానికే భారతీయ విద్యార్థుల చేత ఇంటి పనులు, దుస్తుల ఇస్త్రీ, తోట పని, కార్లు తుడిపించడం, పిల్లలను ఆడించడం వంటి బండెడు చాకిరీ చేయించుకుంటున్నారని వాపోతున్నవారూ ఉన్నారు. ఏమైనా సరే.. పరాయి దేశంలో ఉంటున్నప్పుడు వాళ్ల చట్టాలను గౌరవించడం, ఆ ప్రకారం నడుచుకోవడం తప్పనిసరని చెబుతున్నారు న్యాయసలహాదారులు.ఇది తెలుసుకోండివిదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం గత 15 ఏళ్లుగా 15,000కి పైగా భారతీయులను అమెరికా ప్రభుత్వం డిపోర్ట్ చేసింది. చట్టవిరుద్ధంగా ఆ దేశంలోకి ప్రవేశించినవారెవరైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొని గౌరవంగా వెనక్కి రావచ్చు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న మన పౌరుల్లో అక్కడ చదువుకున్నవారు, పెళ్లి చేసుకుని డిపెండెంట్ వీసా మీద వెళ్లి తర్వాత కుటుంబ కారణాల రీత్యా విడాకులు తీసుకున్నవారు, గృహహింసకు గురైనవారే ఎక్కువ. వీరు స్వచ్ఛందంగా తమ వీసా స్టేటస్‌ను మార్చుకుంటే అమెరికాలోనే ఉండవచ్చు. భర్త వేధింపులకు గురైన అమ్మాయిలు చాలామంది స్టూడెంట్ వీసాకి మారి చదువుకుంటూ అక్కడే ఉండిపోతున్నారు. కొన్ని నేరాలలో విక్టిమ్స్ అయితే వీసాకు అర్హులవుతారు. ఇలా వారికి అర్హత ఉన్న వీసా తీసుకొని అక్కడే ఉండిపోవచ్చు.అక్కడే ఉండాలనుకునేవారు చేయవలసిన పనులు1. ఆ దేశ కోర్టును ఆశ్రయించి, పరిస్థితులను వివరిస్తూ, ఆ దేశంలో ΄పౌరసత్వం కోసమో లేక వీసా కోసమో చేసిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే మానవీయ కోణంలో కొంత గడువు కోరడం. 2. కొన్ని ప్రత్యేక కేసులలో.. ఏదైనా అమెరికా సంస్థ నుంచి ఉద్యోగావకాశం ఉందని చూపించగలిగితే వీసా గడువు తర్వాత కూడా మరలా వీసా వచ్చేంతవరకు ఉండొచ్చు. 3. అమెరికా ΄పౌరసత్వం లేదా శాశ్వత నివాసం (పర్మనెంట్ రెసిడెన్సీ) గల వ్యక్తి కుటుంబ సభ్యులు అంటే భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులు అయ్యుండి, సదరు ΄పౌరుడిచే లేదా అతని కుటుంబ సభ్యులచే గృహహింసకు లోనయ్యుంటే వయొలెన్స్ అగైన్స్ట్ విమెన్ యాక్ట్ (Vఅగిఅ) కింద.. గృహహింసకు గురిచేసిన వ్యక్తికి తెలియకుండానే గ్రీన్ కార్డు ΄పొందవచ్చు. 4. ప్రత్యేక పరిస్థితుల్లో ఆశ్రయం కోరవచ్చు. వీటన్నిటి కోసం ముందుగా మంచి ఇమిగ్రేషన్ అటార్నీ (లాయర్)ని కలవాలి. ఏజెంట్ల ద్వారా వెళ్తే మోసపోయే ప్రమాదం ఉంటుంది. ఇమిగ్రేషన్ చట్టం సులభంగా అర్థమయ్యేది కాదు కాబట్టి నిపుణుల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది – సరస్వతి రమ Sun, Feb 9 2025 3:48 AM

‘రాయల్ నేవీ’ అనేది కొత్త డిజైన్‌తో వచ్చిన చీర కాదు. విషయం ఏమిటంటే... సాంస్కృతిక వైవిధ్యాన్ని విస్తృతపరచడానికి శ్రీకారం చుట్టింది యూకే రాయల్ నేవీ. ఇందులో భాగంగా ‘ఫార్మల్ డ్రెస్‌కోడ్’ను అప్డేట్ చేసింది. అధికారిక కార్యక్రమాలలో మహిళా ఆఫీసర్లు చీరలు, సల్వార్ కమీజ్, లెహంగాలాంటి కల్చరల్ డ్రెస్‌లను ధరించడానికి అనుమతిస్తున్నట్లు తొలిసారిగా బ్రిటిష్ నేవీ ప్రకటించింది. అయితే వీటిపై యూనిఫాం షర్ట్, బ్లాక్ బో ధరించాల్సి ఉంటుంది. బ్రిటిష్ పాకిస్థానీ నేవీ ఆఫీసర్ దుర్దాన అన్సారి ఫొటోను జత చేస్తూ రాయల్ నేవీ(ఆర్ఎన్) డైవర్సిటీ నెట్వర్క్ చైర్ పర్సన్ జాక్ కనాని లింక్డిన్లో కొత్త పాలసీ గురించి ప్రకటించారు. ఈ ఫొటోలో అన్సారి తెల్లని చీరలో మెస్ జాకెట్ ధరించి కనిపిస్తుంది. అయితే ‘ఫార్మల్ డ్రెస్‌కోడ్’లో మార్పు తేవడం కొందరు మాజీ బ్రిటిష్ అధికారులకు బొత్తిగా నచ్చలేదు. ‘సాంస్కృతిక గుర్తింపును యూనిఫామ్‌తో కలపడం సరికాదు’ అని విమర్శించారు. అయితే వారి విమర్శల సంగతి ఎలా ఉన్నా ఫార్మల్ డ్రెస్‌కోడ్ అప్డేట్పై ఎక్కువ మంది సానుకూలంగా, సంతోషంగా స్పందించారు. Sun, Feb 9 2025 3:59 AM

లైఫ్‌స్టయిల్ అండ్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నాన్సీ వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్. యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)ప్రిపరేషన్ కోసం ఢిల్లీ చేరింది. అక్కడికి వెళ్లాక తెలిసింది తన ప్యాషన్ ఫ్యాషన్ అని. ‘కాల్ మి బే’ సిరీస్ కోసం నటి అనన్య పాండేకి అవుట్ ఫిట్స్ డిజైన్ చేసి బాలీవుడ్‌ని, కాన్స్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ వాక్ కోసం గౌన్‌ను డిజైన్ చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఫ్యాషన్ వరల్డ్‌లోని తన అనుభవాలను, లైఫ్‌స్టయిల్ థింగ్స్‌ని, ఫ్యాషన్ టిప్స్‌ను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ @nancytyagi లో షేర్ చేస్తూ సోషల్ మీడియా జర్నీనీ స్టార్ట్ చేసింది. ఆమె చెబుతున్న ఆ సంగతులు, టిప్స్‌కి దేశంలోని స్మాల్ టౌన్ అమ్మాయిలు, మహిళలు బాగా కనెక్ట్ అయ్యి తక్కువ టైమ్‌లోనే మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ పెరిగిపోయారు. అందుకే ఆమెను ఫోర్బ్స్.. 2024కు గాను ఇండియా టాప్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్గా ప్రకటించింది. Sun, Feb 9 2025 5:54 AM

ఆడవాళ్ళు ఆయన్ని ‘బాబాయిగారు’ అని పిలుస్తారు. మగవాళ్ళలో కొందరు ‘రెడ్డిగారు’ అని పిలిస్తే, మరికొందరు రావుగారు అని, ఇంకొందరు మూర్తిగారు అని పిలుస్తారు. కుర్రాళ్లు ‘అంకుల్’ అని పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా, ఆయన అందర్నీ నవ్వుతూ పలకరిస్తూ, వాళ్ళు చెప్పిన పని చేసుకుంటూ పోతాడు .ఆయన అసలు పేరు ఎవరికీ తెలియక పోయినా, ఆయన మొబైల్ నెంబరు మాత్రం ఆ అపార్టుమెంటు వాసులందరికీ సుపరిచితమే!ఆ ఒక్క అపార్టుమెంటే కాదు, అక్కడ ఉన్న నాలుగైదు అపార్టుమెంట్లలో కరెంటు రిపేర్లు, నీళ్ళ ట్యాపులు, సెప్టిక్ టాంకులు, బాత్రూమ్ కమోడ్లు, చెక్క పనులు– ఇలా ఒకటేమిటి, సమస్త రిపేర్లకు ఎవరైనా సరే పిలిచేది ఆయన్నే! ఇంత పెద్ద నగరంలో ఆయన తప్ప ఇంకొకళ్ళు లేరా అని మీకు అనుమానం రావచ్చు. రిపేర్లు ఎవరైనా చేస్తారు. కాని, అడిగిన వెంటనే రావటం, సకాలంలో పని పూర్తి చెయ్యటం, డబ్బులు డిమాండు చెయ్యకుండా ఎవరు ఎంతిచ్చినా చిరునవ్వుతో ‘పర్లేదులెండి’ అంటూ తీసుకోవటం వల్ల అందరూ వాళ్ళ ఇళ్ళలో ఏ రిపేరు పని వచ్చినా ఆయన్నే పిలుస్తారు.కొంతమంది ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకుని, అన్నీ కలిపి ఒకేసారి ఇస్తామని, పని చేయించుకుని కూడా డబ్బులిచ్చే వాళ్ళు కాదు. ఆయన కూడా, ‘అలాగేనండి, మీ దగ్గర డబ్బులెక్కడికి పోతాయి’ అంటూ నవ్వేసి వెళ్ళిపోయేవాడు .‘అదేమిటండీ వాళ్ళు అలా మీ చేత పని చేయించుకుని, డబ్బులు తరువాత ఇస్తామంటే ఊరుకుంటారు’ అని అడిగితే, ‘ఏమోలే సార్! వాళ్ళకే ఇబ్బంది వుందో! వాళ్ళకు వీలైనప్పుడు ఇస్తారు లెండి’ అనేవాడు. నాకు మాత్రం ఇతరుల కష్టం ఉంచుకోవటం ఇష్టం వుండదు. ఏ చిన్న పని చేసినా, మా ఇంట్లో ఆయన అడక్క ముందే డబ్బులిచ్చేసేవాడిని. ఆయనే , ‘ఎందుకు సార్, నేనేం పెద్ద పని చేశానని ఇంత పెద్దమొత్తం ఇచ్చారు’ అంటూ తిరిగి ఇవ్వబోయే వాడు. ఆయన మంచితనాన్ని నేనేనాడూ అలుసుగా తీసుకోలేదు. ఆయనంటే నాకు మా ఇంట్లో మనిషి అనే భావన వుండేది. మా నాన్నది ఆయనది ఒకటే వయసు. నాన్న లేకపోవటం వల్ల అప్పుడప్పుడు ఆయనతో మాట్లాడితే నాన్నతో మాట్లాడినట్లే వుండేది. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆయన హాజరు తప్పనిసరి. భోజనానికి రమ్మని, వాళ్ళ ఆవిడని కూడా తీసుకు రమ్మని మా ఆవిడ మరీ మరీ చెప్పేది. కాని ఆయన మాత్రం ఒక్కడే, సిగ్గుపడుతూ వచ్చేవాడు, ఆ రోజు మా ఇంట్లో ట్యాపు రిపేరు చేసి వెళ్తు వెళ్తూ, ‘సార్, ఓ సెకండ్ హ్యాండ్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటు చౌకగా అమ్మకానికి వచ్చింది’ అన్నాడు.‘మరింకేం బాబాయిగారు, తీసుకోక పోయారా?’ మా ఆవిడ ప్రోత్సహించింది.‘అదేనమ్మా! తీసుకుందామనే వుంది. కాకపోతే, ఓ యాభైవేలు తగ్గాయి’ నసుగుతూ నావంక చూశాడు.‘యాభై వేలే కదండి, సర్దుతాలెండి’ పెద్దాయనకు భరోసా ఇచ్చాను. ‘సంతోషం సార్! మీ బాకీ చిన్నగా తీర్చుకుంటాను, వుంటాను‘ అంటూ నిష్క్రమించాడు.‘ఆయన గుమ్మం దాటి వెళ్ళాడని నిర్ధారించుకుని, ‘ఏమిటి, నన్నడగకుండా అలా మాట ఇచ్చేయటమేనా?’ మా ఆవిడ నిలదీసింది. ‘నువ్వే కదోయ్, బాబాయిగారు! తీసుకోండి అన్నావు. నీకు ఇష్టమేనని మాట ఇచ్చాను’ చిన్నగా గొణిగాను. ‘ఎదో మాటవరసకు అంటాము. అన్నంత మాత్రాన ఉళ్ళోవాళ్ళకి ఊరికినే డబ్బులిచ్చేస్తామా, ఏమిటి?’ అంది మా ఆవిడ.‘ఆయన మనకు ఎప్పటినుండో తెలుసు. ఆయన్ని చూస్తే మా నాన్నను చూసినట్టే వుంటుంది. మా నాన్నకు సాయం చేశాను అనుకో’ అన్నాను. ఆ మాటలతో, ఆవిడ చల్లబడింది. ‘ఔను, మనల్ని ఉబ్బులడుగుతున్నాడు, ఆయనకు పిల్లలు లేరా?’ అనుమానంగా అడిగింది. ‘లేకేం, వున్నాడులే ఓ సుపుత్రుడు. హైదరాబాద్‌లో ఏదో పని చేస్తుంటాడు. వాడికే ఈయన నెలనెలా ఉబ్బులు పంపిస్తుంటాడు. ఇంక వాడేం సాయం చేస్తాడు?’ తేల్చి పారేశాను‘పెళ్ళయిందా?’‘ఆ అవ్వకేం, అయ్యింది. ఒక పిల్లాడు కూడా. వాడే సరిగ్గా వుంటే, ఆయనకు ఈ తిప్పలెందుకు చెప్పు?’ శ్రీమతికి అంతా వివరంగా చెప్పిన తరువాత ఇంక ఆవిడ మౌనంగావుండిపోయింది.‘అంతా కలిపి ఒకేసారి ఇస్తాం లెండి‘ ఎదురింటి ఆవిడ ఏమి రిపేరు చేయించుకుందో ఏమో, ఆయనతో అంటూ వుంటే, వరండాలో కూర్చున్న నా చెవిన బడింది ‘లేదమ్మా, కాస్త అవసరం పడింది. ఈమధ్యే ఓ ఇల్లు కొనుక్కున్నాను. అప్పలున్నాయి, తీర్చాలి’ ఆయన మాటలు ఆవిడకే కాదు, నాకు ఆశ్చర్యం అనిపించినా, నా అప్పు తీరబోతుందని సంతోషం వేసింది. ‘అదేమిటండీ. మేమిచ్చే పది, ఇరవైతోనే మీ అప్పులన్నీ తీరతాయా?’ నిష్ఠూరంగా అందావిడ. ‘లేదండి, పాతబాకీ, ఇప్పటిదీ అన్నీ కలిపి రెండువేల దాకా అయ్యిందండీ మీ బిల్లు’ చెప్పాడు పెద్దాయన.‘రెండువేలా? అంత ఎందుకు అవుతుందండి?’ అంటూ రుసరుస లాడింది.‘లేదమ్మా, ఇదిగో మీకు ఏమేం పనులు చేశానో, వాటికి సామాన్లు ఎంతయ్యాయో అన్నీ వివరంగా రాశాను’ అంటూ జేబులోంచి ఒక కాగితం తీసి ఆవిడకిచ్చాడు పెద్దాయన.ఓ క్షణం ఆ కాగితం వంక ఎగాదిగా చూసి, ‘ఇవన్నీ మేము చేయించుకున్నామా?’ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘అవునమ్మా! మీరు చేయించుకున్నవే! పక్కన తారీఖులు కూడా వేశాను’ అన్నాడు పెద్దాయన.ఇక తప్పదన్నట్టు, ‘సరేనండి, ఇంట్లో మావారు లేరు. సాయంత్రం రండి’ అంటూ తలుపేసుకుంది.ఇక చేసేదేమీలేక పెద్దాయన చిన్నగా నిట్టూరుస్తూ మెట్లు దిగి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడని నిర్ధారించుకుని, బయటకొచ్చి, ఒకసారి అటూ ఇటూ చూసి పక్కింటివాళ్ళ తలుపు కొట్టింది. పక్కింట్లో నుంచి బయటకొచ్చిన మరో పెద్దావిడతో ‘చూశారా పిన్నిగారు! ఆయనేదో మంచివాడు అనుకున్నామా’ అంటూ ఆగింది. ‘ఇప్పుడేమైంది’ అన్నట్టు ఆవిడ మొహం పెట్టింది.‘మనకేదో ఉచితంగా సాయం చేస్తున్నాడనుకున్నాం కాని, ఈరోజు రెండువేలు బిల్లంటూ పట్టుకొచ్చాడు’ అంది కాస్త నీరసంగా. ‘అవునమ్మ, మాకూ వేశాడు, ఎప్పుడో మా తాతలకాలం నుండి రిపేర్లు చేస్తున్నాడట! మూడువేలు అంటూ వసూలు చేసుకెళ్ళాడు’ అంది పక్కింటి పెద్దావిడ మరింత నీరసంగా.ఇద్ద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటే, అది ప్రపంచం మొత్తం పాకిపోతుంది అన్నట్టు ఆ వార్త ఆగమేఘాల్లో అపార్టుమెంటు మొత్తం పాకిపోయింది. ప్రతి ఒక్కళ్ళూ ఆయన్ని తిట్టు కోవటమే! దాదాపు ఓ యాభై ఇళ్ళవాళ్లైనా పెద్దాయనకు బాకీ వుండి వుంటారు. ఇంటికి రెండువేలు వేసుకున్నా, లక్ష అవుతుంది. అంటే నా బాకీ త్వరగా తీరబోతుంది అని ఆనందంగా వున్నా, అందరూ ఆయన్ని తిట్టుకోవటం కాస్త బాధ అనిపించింది. ఈ మనుషుల మనస్తత్వమే అంత. ఉచితంగా సేవలు చేస్తే రాముడు, దేవుడు అంటూ పొగుడుతారు. అదే చేసిన పనికి డబ్బు అడిగితే రాక్షసుడిలా చూస్తారు. ఆరోజు నుంచి అపార్టుమెంట్‌లోని వాళ్ళు తమ పనులకు ఆయన్ని పిలవటం తగ్గించారు. అసలు నన్నడిగితే తప్పు వాళ్ళది కాదు, పెద్దాయనదే! పని చేసినప్పుడు ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకునుంటే ఎవ్వరికీ ఏ బాధ వుండేది కాదు. అంతా కలిపి ఒక్కసారి కట్టమని అడిగితే, ఇప్పుడు అందరూ ఆయన్ని ఓ అప్పులోడి కింద చూస్తున్నారు. బహశా అసలు డబ్బులు అడగడులే అనుకున్నారో ఏమో!ఎవరిదో అన్నోన్ నంబరు అదే పనిగా రింగ్ అవుతుంది. ఎవరై వుంటారబ్బా అని అనుకుంటూ ఎత్తాను.‘సార్ శ్రీనివాసరావుగారేనా? ‘అవతలి నుంచి ఎవరో ఆడగొంతు.‘అవునండి!’ సమాధానం ఇచ్చాను. ‘ఉదయ్ హాస్పిటల్స్ నుంచండి, మీ బంధువు ఒకాయన రాత్రి గుండెనొప్పితో హాస్పిటల్లో చేరారు. ఎవరన్నా వున్నారా అని అడిగితే మీ నంబరు ఇచ్చారు’ చెప్పుకు పోతోంది ‘నా బంధువా? గుండెనొప్పితో హాస్పిటల్లో చేరాడా? ఎవరై వుంటారు?’ అప్పటి దాకా ప్రశాంతంగా వున్న నా మనసులో ఆందోళన మొదలైంది.వెంటనే బయలుదేరి, పది నిమిషాల్లో ఉదయ్ హాస్పటల్ రిసెప్షన్ కౌంటర్ ముందు వాలాను. వాళ్ళను అడిగితే, ‘పేషంట్ పేరేమిటండి?’ అనడిగింది రిసెప్షనిస్టు. నిజమే! పేషంట్ పేరేమిటి? గాభరాలో అడగటం మర్చిపోయాను.‘తెలియదండి, మీ దగ్గర నుంచే నాకు కాల్ వచ్చింది’ సమాధానం ఇచ్చాను. నా సమాధానానికి నా వంక విచిత్రంగా చూస్తూ, రిజిస్టరులో వెతకటం ప్రారంభించింది. ఓ రెండు నిమిషాల తరువాత, ‘ఐసీయూలో వున్నారు వెళ్ళండి’ అంది. ఆ జవాబు విన్న నేను ‘ఐసీయూలోనా!’ మనసులో మరింత ఆందోళనతో ఐíసీయూ వైపు నడిచాను. అప్పుడు కూడా పేషంట్ పేరు అడగటం మర్చిపోయాను.ఐసీయూ లోపలకు వెళ్ళి అడిగితే, వాళ్ళు కూడా పేషంట్ పేరేమిటి అని అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక, ‘రాత్రి చేరారు’ అన్నాను. ఎదురుగా వున్న బెడ్ వంక చూపించింది అక్కడ వున్న నర్సు. కర్టెన్ వేసి వుండటంతో పేషంటు కనపడట్లేదు నాకు. మెల్లిగా రెండడుగులు వేసి, కర్టెన్ పక్కకు తోసి లోపలికి అడుగుపెట్టాను. ఎదురుగా పెద్దాయన, బెడ్ మీద, ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టి వుంది, ఛాతీ నిండా ఈసీజీ వైర్లు బిగించి వున్నాయి. పక్కన ఈసీజీ మెషిన్ బీప్.. బీప్.. అంటోంది. బహుశా, నిద్రపోతున్నాడు అనుకుంటా కళ్ళు మూసి వున్నాయి. దగ్గరకు వెళ్ళి నిలబడ్డా, అలికిడికి కళ్ళు తెరిచాడు పెద్దాయన. ఏదో చెప్పాలనుకుంటున్నాడు కాని, ముఖానికి ఆక్సిజన్ మాస్క్ వుండటం వల్ల సాధ్యం కాలేదు. కాని కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్ళు మాత్రం మాట్లాడతున్నాయి.‘ఉళ్ళో అందరికీ సహాయం చేసే నాకెందుకు ఇలా అయ్యింది’ అని అడుగుతున్నట్టు వున్నాయి పెద్దాయన చూపులు. ఇంతలో ఒక పెద్దావిడ నా దగ్గరకు వచ్చి నమస్కారం చేసింది, నావంక చూస్తూ. బహుశా, ఆయన భార్య అనుకుంటా! ‘బాబుగారు! రాత్రి గుండెల్లో బాగా నొప్పిగా వుంది అంటే, వెంటనే హాస్పిటల్లో చేర్చాను. ఆ వెంటనే మీకు కబురు పెట్టమంటే పెట్టాను’ అంది గద్గద స్వరంతో ‘డాక్టర్లు ఏమన్నారు?’ అడగలేక అడిగాను.‘స్టెంట్ వెయ్యాలి, ఓ లక్షదాకా అవుతుంది అన్నారు’ సమాధానమిచ్చింది ‘మీ అబ్బాయికి కబురు పెట్టారా?’ ఓ క్షణం మౌనంగా వుండి పోయిందావిడ.‘ఏమ్మా, మీ అబ్బాయికి ..’ మాట పూర్తయ్యే లోపు ‘చెప్పాను బాబు, నే వచ్చి చేసేదేముంది అన్నాడు’ తలదించుకుని జవాబిచ్చింది.బహుశా ఇలాంటి కొడుకును ఎందుకు కన్నానా అని సిగ్గుపడుతోంది కాబోలు. ఆవిడ చెప్పిన జవాబుకి నా మనసంతా ఎవరో చెయ్యి పెట్టి కెలికినట్టు అనిపించింది.ఇంతలో పెద్దాయన మెల్లగా నా చెయ్యి మీద చెయ్యి వేసి, నా వంకే చూడటం మొదలు పెట్టాడు. ఆ చూపులలో భావం నాకు అర్థమయ్యింది.‘ఫరవాలేదమ్మా, అధైర్యపడకండి. నేను డాక్టరుతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తాను’ అన్నాను.నా మాటలకు ఇద్దరి కళ్ళల్లో మెరుపులు మెరవటం స్పష్టంగా చూశాను. ‘అంతదాకా ఇది వుంచండి’ అంటూ, నా పర్సు తీసి రెండువేలు ఆవిడకిచ్చాను. ఆవిడ వాటిని అందుకుంటూ, నాకు నమస్కారం చేసింది కృతజ్ఞతతో. ‘మరి నేను వెళ్ళి వస్తాను, భయపడకండి. సాయంత్రం మళ్లీ వస్తాను’ అంటూ అక్కడి నుంచి బయట పడ్డాను. ‘లక్ష రూపాయలా, మొన్నే కదండీ యాభైవేలు ఇచ్చారు. అవే ఇంకా తీర్చలేదు. ఆయనేమన్నా మనకు చుట్టమా పక్కమా? పోనీ ఏమన్నా దూరపు బంధువా?’ అంది కాస్త చిరాగ్గా మా ఆవిడ. నేను మాట ఇచ్చి తప్పు చేశాను అన్నట్లు నావంక చూసింది. ‘ఆయన మనకు చేస్తున్న సహాయం ముందు ఇదెంత చెప్పు?’ అన్నాను కాస్త శాంతపరుస్తూ.‘మనకొక్కళ్ళకేనా? ఊళ్ళో అందరికీ చేస్తున్నాడు. అయినా ఎప్పటికప్పుడు డబ్బులిచ్చేçస్తూనే ఉన్నాముగా’అంది లెక్క లేస్తూ. ‘ఇచ్చామనుకో, మనిషిని అలా చూస్తూ చూస్తూ వదిలెయ్య లేక’.. ఆ మాత్రం స్వేచ్ఛ లేదా అని మనసులో అనుకుంటూ గొణిగాను ‘అసలు కొడుక్కే పట్టనప్పుడు మనకెందుకండీ?’మా ఆవిడ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో అర్థంకాక మౌనంగా వుండిపోయాను. ఓ నిమిషం తరువాత, మా ఆవిడే, ‘పోనీ అపార్ట్ట్మెంట్లో వాళ్ళందరినీ తలా కొంత సాయం చెయ్యమని అడుగుదాము’ అని సలహా ఇచ్చింది. ఆ సలహా ఏదో బాగుందనిపించి, వెంటనే అపార్ట్మెంట్ సెక్రటరీకి ఫోన్ చేసి విషయం చెప్పాను. వెంటనే ఆయన అర్జంటు మీటింగ్ ఏర్పాటు చేసి, విషయం అందరి ముందు వుంచాడు.‘దీనికా మీరు అర్జంటు మీటింగ్ ఏర్పాటు చేసింది? నేను ఇంకా ఏదో అనుకున్నా’ వాళ్ళలో ఓ వ్యాపారస్థుడు వెకిలి నవ్వు నవ్వుతూ అన్నాడు.‘మేం ఇవ్వాల్సింది ఇచ్చేశాం. ఇంకేమీ బాకీలేదు’ ఎదురింటాయన కుండ బద్దలు కొట్టాడు.‘అపార్ట్మెంటు సర్వీసు చార్జీలే కట్టటం కష్టంగా వుంది. ఇంకా దానాలు, ధర్మాలు ఎక్కడ చేస్తాం’ అంటూ పక్కింటాయన లేచి వెళ్ళి పోయాడు.‘డబ్బులు లేనప్పుడు, ప్రైవేటు హాస్పిటల్లో చేరటం దేనికి, ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే సరిపోయేది కదా, ఆరోగ్యశ్రీ కుడా వస్తుంది’ ఓ ఉచిత సలహా పడేశాడు ఆఫీసర్ కేడర్‌లో పనిచేసే ఒకాయన.‘మెన్ననేగా ఇల్లు కొన్నాడు. అది తాకట్టు పెట్టుకుంటే సరి, ఇలా మనల్ని దేబిరించటం ఎందుకు’ మరో రిటైర్డ్ ఆఫీసర్.ఇలా తలా ఒక మాట విసిరి అక్కడి నుంచి అందరూ నిష్క్రమించారు. ఇంతకాలం పెద్దాయన చేత సేవలు చేయించుకున్న వీళ్ళకు ఇప్పుడు ఆయన అక్కరలేని మనిషి

అలనాడు భక్త రామదాసుకు అంతా రామమయంగా, జగమంతా రామమయంగా అగుపించింది గాని, ప్రేమికులకు మాత్రం అంతా ప్రేమమయంగా, జగమంతా ప్రేమమయంగా కనిపిస్తుంది. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే. ప్రేమికులు జరుపుకొనే రోజు కాబట్టి ఇది ప్రేమికుల దినోత్సవంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. మన దేశంలో ఆర్థిక సరళీకరణలు మొదలయ్యాక ప్రపంచీకరణ నేపథ్యంలో పలు విదేశీ వేడుకలు మన దేశానికీ పాకాయి. మూడు దశాబ్దాలకు ముందు మనవాళ్లకు వాలంటైన్స్ డే ఏమిటో తెలీదు. వాలంటైన్స్ డే అంటే ప్రేమికుల దినోత్సవం అని ఇప్పుడు అందరికీ తెలుసు. దీనికి కారకుడైన సెయింట్ వాలంటైన్ చరిత్ర గురించి కూడా జనాలకు కొంతవరకు తెలుసు. అయితే, వాలంటైన్స్ డే గురించి చాలామందికి తెలియని విశేషాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని అరుదైన విశేషాలు మీ కోసం..» వాలంటైన్స్ డే నేపథ్యం క్రీస్తుపూర్వం ఆరో శతాబ్ది నాటిది. అప్పట్లో రోమన్ ప్రజలు ‘లూపర్‌కేలియా’ పేరుతో సంతాన సాఫల్య వేడుకను ఫిబ్రవరి 13–15 తేదీలలో జరుపుకునేవారు. వారు ఈ వేడుకలో సంతాన సా«ఫల్యానికి అధిదైవమైన లూపర్కస్ను ఆరాధించేవారు. ఈ సందర్బంగా జంతుబలులు ఇచ్చేవారు. పోప్ గెలాషియస్–ఐ క్రీస్తుశకం ఐదో శతాబ్ది చివరి రోజుల్లో ‘లూపర్‌కేలియా’ వేడుకను నిషేధించి, దాని బదులుగా ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డేను ప్రవేశపెట్టాడనే కథనం ఉంది.»సెయింట్ వాలంటైన్ ఒకరు కాదు, ముగ్గురు అని కూడా చెబుతారు. విచిత్రంగా వీరిలో ఇద్దరు క్రీస్తుశకం మూడో శతాబ్ది నాటి రోమన్ పాలకుడు క్లాడియస్–ఐఐ చేతిలో ప్రాణాలు కోల్పోయినవారే! యుద్ధ సమయంలో సైనికులు పెళ్లిళ్లు చేసుకోరాదన్న క్లాడియస్– ఐఐ ఆజ్ఞలను ఉల్లంఘించి, రోమ్ నగరంలో సైనికులకు ప్రేమ వివాహాలు జరిపించినందుకు సెయింట్ వాలంటైన్ మరణశిక్ష పొందాడు.ఈ కథనం చాలామందికి తెలిసినదే! రోమ్కు చేరువలోనే తెర్ని పట్టణానికి చెందిన సెయింట్ వాలంటైన్ పేరు గల మరో వ్యక్తి కూడా క్లాడియస్–ఐఐ చేతిలో మరణశిక్షకు గురయ్యాడు. అయితే, కేథలిక్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్ సమాచారం ప్రకారం సెయింట్ వాలంటైన్ పేరుతో ముగ్గురు వ్యక్తులు ఉన్నారట!» సైనికులకు పెళ్లిళ్లు జరిపించాడనే అభియోగంపై సెయింట్ వాలంటైన్‌ను క్లాడియస్–ఐఐ నిర్బంధించాడు. చెరసాల నుంచి సెయింట్ వాలంటైన్, చెరసాల పర్యవేక్షకుడి కూతురికి ప్రేమలేఖ రాశాడు. దాంతో అప్పటి వరకు చూపులేని ఆమెకు చూపు వచ్చిందనే కథనం ప్రచారంలో ఉంది. అయితే, సెయింట్ వాలంటైన్‌కు క్రీస్తుశకం 270 ఫిబ్రవరి 14న ఉరిశిక్ష అమలు చేశారు. » వాలంటైన్స్ డే వేడుక ఖండాంతరాలకు పాకిన తర్వాత వాలంటైన్స్ డే గ్రీటింగ్ కార్డులకు గిరాకీ పెరిగింది. తొలి వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డు ఆధునిక కాలానికి చెందినదై ఉంటుందని చాలామంది భావిస్తారు. అయితే, క్రీస్తుశకం పదిహేనో శతాబ్దిలో లండన్ టవర్ జైలులో బందీగా ఉన్న ఖైదీ అక్కడి నుంచి తన భార్యకు బొమ్మలతో కూడిన ప్రేమలేఖ రాశాడు. బహుశా అదే తొలి వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డు అని చరిత్రకారులు భావిస్తారు. ఇరవయ్యో శతాబ్ది తొలిరోజుల్లో వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డులు బాగా ప్రాచర్యంలోకి వచ్చాయి. » పాశ్చాత్య ప్రపంచంలో పదిహేడో శతాబ్దం వరకు ప్రేమికులు చేతితో రూపొందించిన గ్రీటింగ్ కార్డులను ఇచ్చి పుచ్చుకునేవారు. అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన ఎస్తర్ ఏ హౌలాండ్ వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డుల చరిత్రనే మార్చేసింది. పంతొమ్మిదో శతాబ్దిలో ఆమె స్వయంగా రూపొందించిన డిజైన్లతో అందంగా ముద్రించిన వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డులను అమ్మడం ప్రారంభించింది. ఆమె వ్యాపారం అనతి కాలంలోనే అమెరికా అంతటా విస్తరించింది. దీంతో ఎస్తర్ ‘మదర్ ఆఫ్ అమెరికన్ వాలంటైన్స్’గా ప్రఖ్యాతి పొందింది.» తాజా లెక్కల ప్రకారం వాలంటైన్స్ డే రోజున వివిధ దేశాల ప్రేమికులు ఇచ్చి పుచ్చుకునే గ్రీటింగ్ కార్డుల సంఖ్య 15 కోట్లకు పైగానే ఉంటుంది. వీటికి తోడు చాక్లెట్ గిఫ్ట్ బాక్సులు, గులాబీల పుష్పగుచ్ఛాలు, బంగారు ఉంగరాలు, ఇతరేతర కానుకల సంఖ్య లెక్కలకు కూడా అందదు. ఏది ఏమైనా, వాలంటైన్స్ డే ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల పర్వదినం. Sun, Feb 9 2025 2:28 AM

‘నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను’ అనే డైలాగ్ లాగే, ప్రయోగాత్మక డిజైన్స్‌తో పాపులర్ అయి, ఫ్యాషన్ ప్రపంచంలో ఒక ట్రెండ్‌సెట్టర్

ఉద్దాలక మహర్షి కూతురు సుజాత. ఉద్దాలకుడు ఆశ్రమవాసం చేస్తూ, గురుకులం నడిపేవాడు. అతడి వద్ద ఎందరో శిష్యులు వేద శాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఉండేవారు. ఉద్దాలకుడి ఆధ్వర్యంలో ఆయన శిష్యులు వేదపఠనం చేస్తున్నప్పుడు సుజాత తరచుగా అక్కడకు వచ్చి కూర్చునేది. వారి వేదపఠనాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఉండేది. ఒకరోజు సుజాత ఎప్పటిలాగానే పండ్లు, పాలు తీసుకుని తండ్రి వద్దకు వచ్చింది. ఉద్దాలకుడు కూతురిని తల నిమిరి, పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఆమె రాకతో వేదాధ్యయనానికి కొద్ది క్షణాలు అంతరాయం కలిగింది. శిష్యుల చూపులు గురువుగారి వైపు, ఆయన గారాల కూతురి వైపు మళ్లాయి. గురువుగారి వైపు చూసే చూపులు భక్తి గౌరవాలతో నిండి ఉంటే, సుజాత వైపు చూసే చూపులు భయం భయంగా, చూసీ చూడనట్లుగా ఉండే దొంగ చూపుల్లా ఉన్నాయి. అక్కడ ఉన్న శిష్యులందరిలోనూ ఏకపాదుడి చూపుల్లో ప్రత్యేకత ఉంది. గురువుగారి వైపు అతడు చూసే చూపుల్లో భక్తి శ్రద్ధలు, సుజాత వైపు చూసే చూపుల్లో నిర్లిప్తత, నిరాసక్తత కనిపిస్తున్నాయి.శిష్యులు తిరిగి వేదాధ్యయనం ప్రారంభించారు. గురువుగారి నోటి నుంచి వచ్చే ప్రతి శబ్దాన్ని, ప్రతి స్వరాన్ని మననం చేసకుంటూ, ఒక్క పొరపాటైనా లేకుండా చెప్పగలిగేవాడు ఏకపాదుడు ఒక్కడే! గురువు ముఖతః వచ్చిన ప్రతి స్వరమూ అతడికి మరుక్షణమే కంఠస్థమయ్యేది. ఏకపాదుడు ఏకసంథాగ్రాహి.ఉద్దాలకుడు సాధుస్వభావి. శిష్యులకు ఎలాంటి ఆంక్షలు పెట్టేవాడు కాదు. అవసరమైన నియమాలను సూచనప్రాయంగా మాత్రమే చెప్పేవాడు. గురువుగారు చెప్పకపోయినా, ఏకపాదుడు స్వయంగా తనకు తానే కొన్ని నియమాలను విధించుకుని, క్రమశిక్షణతో పాటించేవాడు. గురువుగారి బోధనలను శ్రద్ధగా ఆలకిస్తూ, అధ్యయనం చేసేవాడు. ఏకపాదుడి గుణగణాలు ఉద్దాలకుడిని ఆకట్టుకున్నాయి. పసితనం నుంచే తండ్రి దగ్గర కూర్చుంటూ వేదాధ్యయనం వినడాన్ని అలవాటుగా చేసుకున్న సుజాతకు క్రమంగా ఏకపాదుడిపై ఆసక్తి పెరగసాగింది. అధ్యయనం కొనసాగుతున్నంత సేపు ఆమె ఏకపాదుడినే తదేకంగా చూడసాగేది. అతడి నిత్యకృత్యాలను గమనించడం ఆమె దినచర్యలో భాగంగా మారింది. రోజులు, నెలలు, ఏడాదులు గడిచిపోతున్నాయి. సుజాత యవ్వనంలోకి అడుగుపెట్టింది. ఏకపాదుడు యువకుడవుతున్నాడు. ఏకపాదుడిని చూడటం కోసమే సుజాత త్వరగా తన పనులు ముగించుకుని, అధ్యయనం సాగేటప్పుడు తండ్రి వద్దకు చేరేది. సుజాత రాక ఆలస్యమైతే, ఏకపాదుడి చూపులు ఆమె కోసం వెదుకులాడేవి.అధ్యయన వేళల తర్వాత మిగిలిన శిష్యులతో పాటు ఏకపాదుడు దర్భలు, అరణి, కట్టెపుల్లలు ఏరుకోవడానికి వెళ్లేవాడు. ఏకపాదుడిని సుజాత అనుసరించేది. దర్భలు, పుల్లలు ఏరుకునేటప్పుడు కూడా అతడు వేదపాఠాలను మననం చేసుకుంటూ ఉండేవాడు. తన రాకను అతడు పట్టించుకోకుంటే, సుజాతకు కోపం వచ్చేది. అయితే, అతడి ఏకాగ్రచిత్తానికి లోలోపల మెచ్చుకునేది. ఒకనాడు గురువుగారి వద్ద కూర్చున్న సుజాత వైపు నుంచి ఏకపాదుడు ఎంత ప్రయత్నించినా చూపు మరల్చుకోలేకపోయాడు. అతి ప్రయాసతో చూపులను గురువుగారి మీదకు మరల్చాడు. చిత్తాన్ని అధ్యయనంపై కేంద్రీకరించాడు. ఉద్దాలకుడు అంతా గమనిస్తూనే, ఏకపాదుడి ఏకాగ్రతకు ఎంతో ఆనందించాడు. ఉద్దాలకుడి శిష్యులలో ఏకపాదుడు మిగిలిన శిష్యులందరి కంటే మిన్నగా అధ్యయనం పూర్తి చేశాడు. అతడికి ఇక బ్రహ్మచర్యం కొనసాగించవలసిన అవసరం లేదని ఉద్దాలకుడు నిర్ణయించాడు. ఒకనాడు ఉదయాన్నే ఏకపాదుడిని పిలిచాడు. ‘నాయనా! నీ అధ్యయనం పూర్తయింది. గురుకులం విడిచి స్వతంత్రంగా నువ్వే ఇతరులకు గురుత్వం వహించే స్థాయి పొందావు. నువ్వు కోరుకున్నప్పుడు బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి, గృహస్థాశ్రమాన్ని స్వీకరించవచ్చు’ అని చెప్పాడు. ఏకపాదుడు వినయంగా గురువుకు పాదాభివందనం చేశాడు. అదే సమయంలో ఉద్దాలకుడు తన మనసులో మాట చెప్పాలనుకున్నాడు. ‘నీకు సమ్మతమయితే, మా సుజాతకు నువ్వే తగిన వరుడివని నా నమ్మకం’ అన్నాడు.గురువుగారి మాటకు ఏకపాదుడు మహదానందం చెందాడు. ఈ సంభాషణను గుమ్మం చాటు నుంచి వింటున్న సుజాత కూడా ఆనందంలో తేలిపోయింది. గురువుగారి మాటకు ఏకపాదుడు వెంటనే బదులివ్వక నేలచూపులు చూడసాగాడు.‘ఏకపాదా! నీ అభిప్రాయం..’ అడిగాడు ఉద్దాలకుడు.‘గురువర్యా! తమరి మాట నాకు శిరోధార్యం’ అంటూ ఏకపాదుడు మరోసారి పాదాభివందనం చేశాడు.ఉద్దాలకుడు సుముహూర్తాన్ని నిర్ణయించి, తన కూతురు సుజాతను ఏకపాదుడికిచ్చి వివాహం జరిపించాడు. Sun, Feb 9 2025 2:26 AM

కార్పస్ క్రిస్టీ కేథలిక్ పండుగగా చెప్పుకునే ‘బేబీ జంపింగ్ ఫెస్టివల్’ కొత్తగా వినేవారికి, చూసేవారికి వింతగా అనిపిస్తుంది. ఉత్తర స్పెయిన్ లోని కాంటాబ్రియన్ పర్వతాల దిగువన ఉన్న ‘కాస్ట్రిలో డి ముర్సియా’ అనే కుగ్రామంలో ఏటా ఈ పండుగను జరుపుకొంటారు. వేలాది మంది పర్యాటకులు ఈ వేడుకను చూడటానికి తరలి వస్తుంటారు. సుమారు రెండువందల సంవత్సరాలుగా తమకు ఈ ఆచారముందని అక్కడి వారు చెబుతారు. ‘ఎల్ కొలాచో’ (ది డెవిల్) అని పిలుచుకునే పసుపురంగు ముసుగులాంటి దుస్తులు ధరించిన కొందరు యువకులు, దయ్యాలను తలపిస్తూ ఈ పండుగలో ప్రత్యేకంగా నిలుస్తారు.పసుపు రంగు దుస్తులు వేసుకున్న ‘ఎల్ కొలాచో’లు స్థానికంగా ఈ వేడుకను చూడటానికి వచ్చిన వారిని కూడా హడలెత్తిస్తుంటారు. భయపెడుతూ, తరుముతూ పరుగులెత్తిస్తుంటారు. వారు తమ చేతిలో గంటలాంటి ఒక వస్తువుని పట్టుకుని, విచిత్రమైన శబ్దాలు చేసుకుంటూ, ఈ ఊరేగింపులో పాల్గొంటారు. పెద్ద పెద్ద డప్పులు, అరుపులు భయపెట్టేలా ఉంటాయి. నల్లటి కోట్లు, టోపీలు ధరించిన మరికొందరు వ్యక్తులు గంభీరంగా, ఈ ‘ఎల్ కొలాచో’లతో పాటు ఊరేగింపులో నడుస్తారు. ఈ వేడుకలో రోడ్డు పొడవునా పరుపులు, తలదిళ్లు పరిచి, వాటిపై ఏడాదిలోపు పసిపిల్లలను వరుసగా పడుకోబెడతారు. వారి మీద నుంచి ‘ఎల్ కొలాచో’ అనే యువకులను, పిల్లల పైనుంచి దూకిస్తారు. అలా దూకితే పిల్లలపై భూత ప్రేత పిశాచాల పీడ పడదని, దుష్టశక్తులు దరిచేరవని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అక్కడివారి నమ్మకం.అలా పిల్లల మీద నుంచి దూకిన తర్వాత మతపెద్దలు ప్రార్థనలు జరిపి, ఆ పసివాళ్లను ఆశీర్వదిస్తారు. ఈ సమయంలో చుట్టుపక్కల నుంచి, గులాబీ రేకులతో పిల్లలకు దీవెనలు అందుతాయి. ఇదంతా వేడుక రోజు ఉదయం ఆరు నుంచి ఏడు గంటలలోపే ముగుస్తుంది. అయితే, ఈ వేడుకపై పలు విమర్శలున్నాయి. చాలామంది దీన్ని మూఢనమ్మకంగా కొట్టి పారేస్తున్నా, కొందరు మాత్రం తమ పిల్లల క్షేమం కోసం ఈ వేడుకలో పాల్గొంటున్నారు. Sun, Feb 9 2025 2:30 AM

సెలబ్రిటీల కదలికలు, వ్యక్తిగత జీవిత విషయాలను సొమ్ము చేసుకునే ఎల్లో మీడియా పాపరాజీ దారిలో రాజీ పడకుండా నడుస్తుంటుంది. ఇప్పుడు స్మార్ట్ఫోన్ల పుణ్యమా అని మీడియాతో సంబంధం లేని వారు కూడా సెలబ్రిటీలు కనిపిస్తే చాలు పాపింగ్ చేస్తున్నారు. సెలబ్రిటీల పాలిట పెను భూతం పాపరాజీ. ఇల్లు దాటి బయటికి వస్తే ఎవరు ఎక్కడ కెమెరాతో క్లిక్ అనిపిస్తారో తెలియదు. బిగ్ బాస్ సీజన్ 17 ద్వారా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్న నటి ఆయేషా ఖాన్ పాపరాజీపై మండిపడింది. తన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అనవసర కామెంట్స్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీడియా పట్ల నాకు గౌరవం ఉంది. అయితే పాపరాజీ మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. నా కారు వరకు నన్ను అనుసరించడం, నన్ను ముందుకు నడవనివ్వక పోవడం...ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చేతిలో మొబైల్ ఉంటే చాలు పాపింగ్ పేరుతో వెంటబడుతున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ఆయేషా విషయానికి వస్తే అభిమానులతో పాటు, నెటిజనులు ఆమెకు సపోర్ట్ చేస్తూ పాపరాజీ తీరుపై మండిపడుతున్నారు. ‘చౌకబారు మనసున్న వ్యక్తులకు వ్యతిరేకంగా మీరు గళం విప్పినందుకు సంతోషంగా ఉంది. పాపరాజీ పేరుతో మిమ్మల్ని అసౌక్యరానికి గురి చేసే హక్కు వారికి లేదు’ అని ఒక నెటిజనుడు స్పందించాడు. Sun, Feb 9 2025 4:06 AM

బెంగళూరుకు చెందిన అనన్య ప్రసాద్ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఒంటరి ప్రయాణం చేసిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. స్పానిష్ కానరీ దీవుల్లోని లా గోమెరా నుంచి 52 రోజుల్లో కరీబియన్ దీవుల్లోని ఆంటిగ్వాకు చేరుకుంది. 52 రోజుల్లో 3,000 మైళ్ల చారిత్రాత్మక యాత్రను ముగించింది. అనన్య ప్రముఖ కన్నడ కవి జీఎస్ శివరుద్రప్ప మనవరాలు.బెంగుళూరులో పుట్టిన అనన్య పెరిగింది, చదువుకున్నదీ యూకేలో. సరదాగా మొదలైన రోయింగ్ హాబీ ఆ తరువాత అంకితభావంతో కూడిన పాషన్‌గా మారింది.‘రోయింగ్‌ను వ్యాయామంగా ఆస్వాదిస్తాను. రోయింగ్ అనేది నా దృష్టిలో సాహసం’ అంటుంది అనన్య.వరల్డ్స్ టఫెస్ట్ రో’లో అన్ని వయసులు, అన్ని దేశాల వారు పాల్గొంటారు. ఈ రేసుకు అర్హత సాధించడానికి మూడున్నరేళ్లు శిక్షణ తీసుకుంది అనన్య. శిక్షణలో మానసిక, శారీరక ఫిట్నెస్, సాంకేతిక నైపుణ్యంపై పట్టు సాధించింది.తన యాత్రలో అనూహ్యమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోవడంలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులను, సవాళ్లను ఎదుర్కొంది. ప్రతిరోజు 60 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించేది. రోజుకు 5 నుంచి 6 గంటలు మాత్రం విశ్రాంతికి కేటాయించేది. ‘ఒంటరిగా ఉన్నప్పటికీ నాకు ఎప్పుడూ ఒంటరిగా అనిపించలేదు. వాతావరణ, సాంకేతిక నిపుణులు, సోషల్ మీడియా బృందాలతో ఎప్పుడూ టచ్‌లోనే ఉన్నాను’ అని తన ప్రయాణాన్ని గుర్తు తెచ్చుకుంది అనన్య.తన సాహసానికి సామాజిక ప్రయోజనాన్ని కూడా జత చేసింది. మన దేశంలోని అనాథ పిల్లలకు ఆసరాగా నిలిచే మెంటల్ హెల్త్ ఫౌండేషన్, దీనబంధు ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థల కోసం విరాళాలు సేకరించింది. Sat, Feb 8 2025 4:15 AM


చాలామంది పిజ్జా, బర్గర్లను జంక్‌ఫుడ్ కిందజమకడుతుంటారు. బర్గర్లో కూరగాయల ముక్కలు, బ్రెడ్, కొంచెం చీజ్ మాత్రమే ఉంటాయి కదా... నిజంగా ఇది జంక్ ఫుడ్ కిందకే వస్తుందా? ఆరోగ్యానికి మంచిది కాదా?


ప్రేమికులు ఏడాదంతా ఎదురుచూసే రోజు ఫిబ్రవరి 14. ప్రియుడి కౌగిలిని ప్రియురాలు, చెలియ చిరునవ్వును చెలికాడు బహుమతిగా అందుకోవాలని ఆకాంక్షించే రోజు ఇది. ఇచ్చిపుచ్చుకునే బహుమతులు సరేసరి. ఆ రోజంతా వారితో ఆనందంగ�