జిల్లా కలెక్టర్గా రాహుల్రాజ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగానికి తొలిరోజే ఆలస్యంగా హాజరు కావడంతో.. ఆయా శాఖల అధికారులు, ఫిర్యాదుదారులకు ఎదురుచూపులు తప్పలేదు.
వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ జిల్లాకు భరోసానిచ్చే విధంగా లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిష్కరించా లని కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. సోమ వారం కలెక్టర్ చాంబర్లో ట్రైనీ కలెక్టర్ గౌతమితో కలిసి ఆర్టీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిం చారు.
ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. సోమవారం తిలక్నగర్ లో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడుతూ గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. పద్దులు బాగానే కేటాయించినప్పటికి కేవలం అంకెల గారడిగానే అగుపిస్తోంది.
(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్): ఎన్నికల ముంగిట ప్రవేశపెట్టిన భారీబడ్జెట్లో ఆసిఫాబాద్ జిల్లాకు కంటి తుడుపు కేటాయింపులే జరిగాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారీగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టవచ్చని ఆశించినా కొత్త పథకాల ఊసే లేదు. జిల్లాలో కీలకమైన గ్రామీణ రోడ్డు నెట్వర్క్ కోసం నిధుల కేటాయింపుపైన ఆర్థిక మంత్రి శీతకన్ను వేశారు.
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 6: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కారం దిశగా కృషి చేస్తామని అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అర్జీదారుల నుంచి ఆమె దరకాస్తులను స్వీకరించారు.