దుర్గగుడిలో రూ.13 కోట్లతో కనకదుర్గానగర్ రాజమార్గాన్ని సగం ఆక్రమించేలా నిర్మిస్తున్న ఎలివేటెడ్ క్యూలైన్ వల్ల ప్రయోజనం ఏంటి?, ఏడాది మొత్తం సాధారణ రోజుల్లో 30వేల మందికి మించి భక్తులు రారు.
దాతలు సమకూర్చిన రూ.కోట్ల విలువైన యంత్ర సామగ్రిని వృథాగా పక్కన పడేశారు. ఒప్పందం మేరకు తక్కువ ధరకే ఇచ్చే సరఫరాదారును కాదని.. బహుళజాతి కంపెనీ నుంచి ఎక్కువ ధరకు కొన్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక తవ్వకాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాల నిఘా.. రేవుల వద్ద డ్రోన్లతో పర్యవేక్షణ.. వాహనాలకు జీపీఎస్తో ఉచిత ఇసుక సరఫరా చేయనున్నారు.
సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు భయపడొద్దని పోలీసు అధికారులు అభయం ఇస్తున్నా.. ప్రజలు వణికిపోతున్నారు. అరెస్టు చేస్తామనగానే.. రూ.లక్షల్లో డబ్బులు చెల్లించేస్తున్నారు.
పెనుగంచిప్రోలులోని మండల ప్రాథమిక పాఠశాలలోని నీటి శుద్ధి ప్లాంటు పాడైంది. దీంతో ఇక్కడ ఉన్న 67 మంది విద్యార్థులు ఇంటి నుంచి సీసాలతో తాగునీరు తెచ్చుకుంటున్నారు.
ఆటోనగర్ ప్రాంతంలో ఆక్రమణల కారణంగా రహదారులు కుంచించుకుపోయాయి. ఒకవైపు చెత్త వ్యాపారులు యథేచ్ఛగా చెత్త మూటలు రోడ్డుపై వేసి సగానికి పైగా ఆక్రమించగా..మరోవైపు స్థానికంగా పనిచేసే కూలీల కోసం ఏకంగా రోడ్డుపైనే గుడిసెలు వేశారు.
జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో పేదల ఇళ్లు ఇప్పిస్తామంటే నమ్మేశారు. ప్రభుత్వంలో పలుకుబడి ఉంది, రూ.3 లక్షలకే ఇల్లు అనే సరికి ఆశ పడ్డారు. ఒక్కొక్కరు డబ్బులు కట్టారు.