‘ఉమ్మడి కర్నూలు జిల్లా త్యాగధనుల ఖిల్లా. ఎందరో మహనీయులు, కవులు, కళాకారులు, ప్రజా ప్రతినిధులు ఈ గడ్డకు పేరు ప్రఖ్యాతులు తెచ్చారు..’ అని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
నంద్యాల విజయ పాల డెయిరీలో త్వరలో నిర్వహించబోయే చైర్మన్, డైరెక్టర్ల ఎన్నికలను రద్దు చేయాలని బోయలకుంట్ల పాలసేకరణ కేంద్ర డైరెక్టర్ శ్రీకాంత్రెడ్డి డిమాండు చేశారు.
రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగనీయకుండా, అవాంఛ నీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా, ఆహ్లాద కరమైన వాతావరణంలో భక్తులు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు అన్నారు.
కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకే కాదు.. భక్తులకు కూడా భద్రత కరువైందని వైసీపీ ఎమ్మిగనూరు ఇన్చార్జి రాజీవ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జగన్మోహన్రెడ్డి అన్నారు.
కర్నూలు జిల్లా వెల్దుర్తి విద్యుత్ ఉపకేంద్రంలో విద్యుత్ నియంత్రికను ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని కర్నూలు రూరల్ ఏడీ సుబ్బన్న తెలిపారు.
ఆదోని పట్టణంలోని 40వ వార్డులో ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో వార్డు కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్తో కలిసి పురపాలక ఛైర్పర్సన్ లోకేశ్వరి ఆదివారం వార్డు పర్యటన నిర్వహించారు.
నల్లమల అడవుల్లో అరుదుగా లభించే శ్రీగంధం అక్రమార్కులకు వరంగా మారింది. ఒకప్పుడు వేలాది హెక్టార్లలో విస్తరించిన ఈ చెట్లు ప్రస్తుతం పదుల హెక్టార్లలోనూ కనిపించడం లేదు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్రెడ్డిని నియమించడంతో ఆ పార్టీలో ముసలం పుట్టింది.